savyasachi

'స‌వ్య‌సాచి'.. ఫ‌స్ట్ పంచ్ అదిరింది

Updated By ManamFri, 03/16/2018 - 12:42

savyasachi''రెండు చేతుల్ని స‌మ‌ర్థంగా, శ‌క్తిమంతంగా వాడే వాళ్ళ‌ని స‌వ్య‌సాచి అంటారు. మ‌హాభార‌తంలో అర్జునుడి ఐదో పేరు స‌వ్య‌సాచి. ఎందుకంటే.. అర్జునుడు రెండు చేతుల‌తో ఒకే వేగంతో విలువిద్య ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డు. అలాగే మా చిత్రంలో కూడా క‌థానాయ‌కుడు త‌న‌ రెండు చేతుల్ని స‌మ‌ర్థ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ను, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొంటాడు. అదెలాగ‌న్న‌ది తెలుసుకోవాలంటే 'స‌వ్య‌సాచి' చూడాల్సిందే'' అంటున్నారు చందు మొండేటి.

'కార్తికేయ‌', 'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంతమైన చిత్రాల త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్ర‌మిది. నాగ‌చైత‌న్య టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌లైంది. సినిమా థీమ్‌ను ఈ పోస్ట‌ర్‌లో చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపించింది. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ మూవీ జూన్ 14న తెర‌పైకి రానుంది.అమెరికా వెళ్ళ‌నున్న 'స‌వ్య‌సాచి'

Updated By ManamTue, 01/30/2018 - 20:40

savyasachi'ప్రేమ‌మ్‌'తో మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన‌ కీల‌క‌ షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. మార్చి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని.. కొన్ని వారాల పాటు కొన‌సాగే ఈ భారీ షెడ్యూల్‌తో సినిమా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. కాగా, మే నెల‌లో 'స‌వ్య‌సాచి' తెర‌పైకి రానుంది.'ధ‌ర్మాభాయ్‌'గా నాగ‌చైత‌న్య‌?

Updated By ManamFri, 12/29/2017 - 11:12

nagaయువ క‌థానాయ‌కుడు నాగచైత‌న్య ప్ర‌స్తుతం 'స‌వ్య‌సాచి'తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో 'శైల‌జా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు) చేయ‌నున్నాడు. దీంతో పాటు.. మ‌రో చిత్రానికి చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది. నాగార్జున‌తో 'ఢ‌మ‌రుకం' చిత్రాన్ని తెర‌కెక్కించిన శ్రీ‌నివాస్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచార‌మ్‌. ఆకుల శివ క‌థ‌ను అందిస్తున్న‌ ఈ సినిమాకి 'ధ‌ర్మాభాయ్' అనే పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. అన్న‌ట్టు.. సాయిధ‌ర‌మ్‌, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో రానున్న చిత్రానికి కూడా 'ధ‌ర్మాభాయ్' పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.'స‌వ్య‌సాచి'కి అక్క‌గా భూమిక‌

Updated By ManamThu, 12/28/2017 - 17:11

bhoomika'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీనియ‌ర్ క‌థానాయిక భూమిక ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపించాయి. భూమిక కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది కూడా. కాగా, ఈ సినిమాలో చైతుకి అక్క పాత్ర‌లో భూమిక న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఈ పాత్రే సినిమాలో కీల‌క మ‌లుపుల‌కి కార‌ణ‌మ‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు.'స‌వ్య‌సాచి'లో భూమిక?

Updated By ManamSat, 12/23/2017 - 18:16

bhoomikaభూమికా చావ్లా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా ఈ ముగ్గురు అగ్ర క‌థానాయ‌కుల ఏడో చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించ‌డ‌మే కాకుండా... వారంద‌రికి క‌లిసొచ్చిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది భూమిక‌. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌తోనూ మెప్పించింది. తాజాగా 'ఎం.సి.ఎ'లో నానికి వ‌దిన‌గా న‌టించిన భూమిక‌కి ఆ చిత్రం మంచి పేరే తీసుకువ‌చ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య క‌థానాయకుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'స‌వ్య‌సాచి' రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భూమిక ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ‌న‌టుడు మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. మాధ‌వ‌న్‌కి జోడీగా భూమిక క‌నిపించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌.

కాగా, భూమిక‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసింది నాగార్జున‌నే.  నాగ్ నిర్మించిన‌ 'యువ‌కుడు' చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన భూమిక‌.. ఆ చిత్రంలో సుమంత్‌కి జోడీగా న‌టించింది. ఆ త‌రువాత నాగ్‌తో 'స్నేహ‌మంటే ఇదేరా' చేసిన భూమిక‌.. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువడుతుంది.‘సవ్యసాచి’ షెడ్యూల్ పూర్తి

Updated By ManamSat, 12/16/2017 - 17:23

savyasachiఅక్కినేని నాగ చైతన్య  క‌థానాయ‌కుడిగా నటిస్తున్న‌ 15వ చిత్రం ‘సవ్యసాచి’. 'ప్రేమ‌మ్' త‌రువాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చైతన్య చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంతో నిధి అగర్వాల్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమౌతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు. తమిళ నటుడు మాధవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మాధవన్ ఒక ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా చేయడం ఇదే తొలిసారి. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ విషయాన్ని మాధవన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “స‌వ్య‌సాచి షెడ్యూల్ పూర్త‌య్యింది.. చాలా మంచి టీంతో పనిచేసాను” అని మ్యాడీ ట్వీట్ చేసారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి 8న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.'స‌వ్య‌సాచి'.. మాధ‌వ‌న్ లుక్‌

Updated By ManamSun, 12/03/2017 - 15:57

madhavan'ప్రేమ‌మ్' త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి స్వ‌ర‌క‌ర్త‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మాధ‌వ‌న్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ డిఫ‌రెంట్ స్టిల్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో మాధ‌వ‌న్‌ని నేరుగా చూపకుండా.. వెనుక‌వైపు నుంచి చూపించారు. ఉద‌యం 9.30 గంట‌ల స‌మ‌యంలో మాధ‌వ‌న్‌పై సూర్య కాంతి ప‌డుతున్న‌ట్లుగా ఈ స్టిల్ ఉంది. ఇంట్లో ఆ ప్రాప‌ర్టీస్ చూస్తే.. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప‌నితీరుకి ఎవ‌రైనా ఫిదా అయిపోతారు. సింపుల్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉంది ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన ఆ డిజైన్‌. మొత్త‌మ్మీద‌.. టైటిల్ నుంచి ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది చిత్ర‌యూనిట్. చూస్తుంటే.. 'ప్రేమ‌మ్' కాంబినేష‌న్ మ‌రో హిట్ కొట్టేలానే ఉంది.'స‌వ్య‌సాచి' మొద‌లెడుతున్నాడు

Updated By ManamWed, 11/08/2017 - 11:16

savyasachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'స‌వ్య‌సాచి' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ద్వారా నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. ప్ర‌ముఖ త‌మిళ క‌థానాయ‌కుడు మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ సినిమాకి.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి స్వ‌రాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌.. ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఎడ‌మ చేయి త‌న కంట్రోల్ లో లేక‌పోవ‌డం వ‌ల్ల‌ ఓ యువ‌కుడు ఎలాంటి ప‌రిస్థితుల‌ను చూశాడు? త‌న స‌మ‌స్య‌ను అధిగ‌మించాడా?  లేదా? అనే అంశంతో.. యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌చ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.'శైల‌జ రెడ్డి అల్లుడు'గా నాగ‌చైత‌న్య

Updated By ManamFri, 10/27/2017 - 19:50

chaitanyaప్ర‌స్తుతం 'ప్రేమ‌మ్' ద‌ర్శ‌కుడు చందు మొండేటితో 'స‌వ్య‌సాచి' అనే చిత్రాన్ని చేస్తున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతితో చేయ‌నున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ చిత్రానికి 'శైల‌జ రెడ్డి అల్లుడు' అనే పేరుని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో శైల‌జ రెడ్డి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ టైటిల్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డనుంది. ఇందులో 'లై' ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టించ‌నుందని స‌మాచార‌మ్‌.నాగ‌చైత‌న్య‌తో బాలీవుడ్ బ్యూటీ?

Updated By ManamTue, 10/03/2017 - 12:53

'ప్రేమ‌మ్' త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌ముఖ త‌మిళ నటుడు మాధ‌వ‌న్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో క‌థానాయిక‌గా బాలీవుడ్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ ఎంపికైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా న‌టించిన హిందీ చిత్రం 'మున్నా మైఖెల్‌'లో నిధి హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌న‌ప్ప‌టికీ.. నిధికి 'స‌వ్యసాచి' రూపంలో మ‌రో అవ‌కాశం దొరికింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి సంగీత‌మందించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
Related News