Narendra Modi

తొలి ‘ఇన్‌ల్యాండ్’ పోర్ట్!

Updated By ManamMon, 11/12/2018 - 22:30
 • వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోదీ

 • కోల్‌కతా-వారణాసి మధ్య తొలి సరుకు నౌక

 • దేశ చరిత్రలో మొదటిసారి అంతర్గత జలరవాణా

 • కాశీకి, భారతదేశానికి ఇది చరిత్రాత్మక రోజు

 • ఈ ప్రాజెక్టు దశాబ్దాల క్రితమే పూర్తికావాల్సింది

 • మా హయాంలో  నెరవేరింది: నరేంద్రమోదీ

 • వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

modiవారణాసి: అంతర్గత జల రవాణాలో సరికొత్త శకం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా వారణాసిలో గంగానదిపై ఇన్‌ల్యాండ్ పోర్టు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ దీనిని సోమవారం ప్రారంభించారు.  జల రవాణా వ్యవస్థను (జలవికాస్ మార్గ్) అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గంగా నది ద్వారా భారీ సరకుల కంటేనర్లను మల్లీమోడల్ పద్ధతిలో రవాణా చేయనున్నారు. అక్టోబరు 30వ తేదీన కోల్‌కతాలోని హాల్దియా నుంచి గంగా నదిపై బయలు దేరిన కంటేనర్‌ను మోదీ వార ణాసిలో ఆవిష్కరించారు. పెప్సీ కంపెనీకి చెందిన ఉత్పత్తులతో ఆ కంటేనర్ వచ్చింది. చాలా చవకైన, పర్యావరణ హితమైన రీతిలో జల మార్గం ఉపయోగపడనుంది. హల్దియా నుంచి వారణాసి వరకు ప్రపంచ బ్యాంకు సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కోసం సుమారు రూ. 5369 కోట్లు ఖర్చు చేశారు. ఎంవీ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో వచ్చిన నౌకలో మొత్తం 16 కంటేనర్లు ఉన్నాయి. ఆ కంటేనర్ సుమారు 16 ట్రక్కులతో సమానం అని అధికారులు చెప్పారు. భారీ నౌక మళ్లీ వారణాసి నుంచి ఎరువులతో తిరిగి వెళ్తుందని అధికారులు చెప్పారు. 

ఈ సందర్భంగా నాలుగు మల్లీ మోడల్ టెర్మినళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర  రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘వారణాసితోపాటు భారతదేశానికి ఈ రోజు చరిత్రాత్మకమైంది. స్వాతం త్య్రం పొందిన తర్వాత తొలిసారి అంతర్గత నీటిపారుదల వ్యవస్థలను వాణిజ్య అవసరా లకు ఉపయోగించుకుంటున్నాం. ఈ పని దశాబ్దాల క్రితమే జరగాల్సి ఉంది. చివరకు  ఆ సాకారం నెరవేరింది’’ అని అన్నారు. అంతకుముందు వారణాసి ముఖచి త్రాన్ని మార్చే రెండు అతిముఖ్యమైన రహదారులను ప్రధాని ప్రారంభించారు. రూ.1,571.95 కోట్లతో వారణాసి రింగురోడ్డు (16.55 కిలోమీటర్లు), 17.25 కిలీమీటర్ల వారణాసి-బబత్‌పుట్ ఎయిర్‌పోర్టు రోడ్డును నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్డు రోడ్డుతో జాన్‌పూర్, సుల్తాన్‌పూర్, లఖ్‌నవూలతో  అనుసంధానం ఏర్పడనుంది. ఈ రోడ్డు నిర్మాణంతో విమానంలో కాశీకి వచ్చేవారికి ప్రయాణం మరింత సులభతరం కానుంది. 'అందుకే జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నా'

Updated By ManamSat, 11/10/2018 - 18:44
 • అశోక్ గెహ్లాట్, చంద్రబాబు ఉమ్మడి మీడియా సమావేశం

Chandrababu naidu, Ashok gahlet, Narendra modi, BJPఅమరావతి: బీజేపీ వ్యతిరేక పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేస్తు్న్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌తో శనివారం అమరావతిలో చంద్రబాబు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ముందుగా తాను కొన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే మహాకూటమి అవసరమన్నారు. ప్రతీ ఒక్క పౌరుడు దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించాలని చంద్రబాబు సూచించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. బాధ్యత కలిగిన ప్రతీ రాజకీయ పార్టీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. 

దేశం కోసమే టీడీపీ-కాంగ్రెస్ తొలిసారి ఏకం..
సేవ్ నేషన్,సేవ్ డెమోక్రసీ నినాదంతో కలిసికట్టుగా ముందకెళ్తామని అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులు సహా అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినవి ఏమి జరుగలేదని విమర్శించారు. అధికార దుర్వినియోగం చేస్తూ సీబీఐ, ఐటీ, ఈడీలను ప్రయోగిస్తున్నారని అశోక్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ హయాంలో ఒత్తిడి పెరుగుతోందని విమర్శలు గుప్పించారు. అప్రకటిత ఎమర్జెన్సీ వాతావారణం కనిపిస్తోందని గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసమే టీడీపీ-కాంగ్రెస్ తొలిసారి ఏకమయ్యాయని అన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని గెహ్లాట్ పేర్కొన్నారు. మావోయిస్టులతో కాంగ్రెస్ దోస్తీ

Updated By ManamSat, 11/10/2018 - 06:28
 • రిమోట్‌తో ఆదివాసీల నియంత్రణ

 • నగరాల్లో విలాస జీవనం వారిది.. అలాంటివారికి కాంగ్రెస్ మద్దతు

 • ప్రధాని నరేంద్రమోదీ మండిపాటు.. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం

modiజగదల్‌పూర్: నిరుపేద ఆదివాసీ యువత జీవితాలను సర్వనాశనం చేసిన పట్టణ మావోయిస్టులను కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెలాఖరులో మొదటివిడత ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో ఆయన శుక్రవారం పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలను ఎద్దేవా చేస్తుందని, ఒకసారి తాను ఈశాన్య ప్రాంతంలో ర్యాలీకి వెళ్లి, అక్కడ సంప్రదాయ తలపాగా ధరిస్తే, కాంగ్రెస్ నేతలు దాన్ని ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. అది ఆదివాసీ సంస్కృతిని అవమానపరచడవేునని అన్నారు. సుసంపన్న ఛత్తీస్‌గఢ్ రావాలన్న అటల్ బిహారీ వాజ్‌పేయి కలలను నెరవేర్చేవరకు తాను విశ్రమించబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, మావోయిస్టుల బెడదను వాళ్లు సాకుగా చూపారని ప్రధాని అన్నారు. పట్టణ మావోయిస్టులు నగరాల్లో ఏసీ గదుల్లో ఉంటారని, వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుతారని, అలాంటివాళ్లే ఆదివాసీ పిల్లలను రిమోట్ కంట్రోల్‌తోనడిపిస్తారని మోదీ తీవ్రంగా ఆరోపించారు. అలాంటి పట్టణ మావోయిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతిస్తుందని ప్రశ్నించారు. అలాంటివాళ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, వీళ్లెందుకు అడ్డుపడతారన్నారు. మావోయిస్టులు దుష్ట ఆలోచనలు కలిగిన రాక్షసులని మండిపడ్డారు. పాత ప్రభుత్వాలు బస్తర్ ప్రాంత అభివృద్ధికి తగినంత కృషి చేయలేదని.. అలాంటి వాళ్లను మీరు క్షమిస్తారా అని మోదీ అడిగారు. బస్తర్ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వేరే ఎవరైనా గెలిస్తే, అది బస్తర్ కలల మీద ఒక మచ్చ అవుతుందని తెలిపారు. తాను వచ్చినన్ని సార్లు మరే ప్రధానీ బస్తర్ ప్రాంతానికి రాలేదని మోదీ అన్నారు. తాను ఖాళీ చేతులతో రాలేదని, ప్రతిసారీ ఇక్కడ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికే వచ్చానని అన్నారు. ఈ ప్రాంతం నుంచి నిరుద్యోగం, పేదరికం, ఆకలిని తరివేుసేందుకు తాము కష్టపడుతున్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 18 ఏళ్లయిందని, ఈ 18 ఏళ్ల వయసులో అనేక కలలు, ఆకాంక్షలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా దళితులు, గిరిజనుల గురించి మాట్లాడుతుంది గానీ వారిని ఓటు బ్యాంకుగా చూస్తుంది తప్ప మనుషులుగా చూడదని అన్నారు. పనిచేసే ప్రభుత్వం కావాలా.. పనులు ఆపేసే ప్రభుత్వం కావాలా అని ప్రజలను అడిగారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల్లో వివక్ష చూపలేదని, పాత ప్రభుత్వాలు మాత్రం అలా చేశాయని అన్నారు. తమ ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు.స్టాలిన్‌తో చంద్రబాబు కీలక భేటీ..

Updated By ManamFri, 11/09/2018 - 20:45

Chandrababu naidu, Stalin, DMK leder, BJP, Narendra modiచెన్నై: డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం ముగిసింది. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్‌తో చంద్రబాబు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. స్టాలిన్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని గద్దె దించేందుకు కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కూటమి ఏర్పాటు విషయంలో తమతో కలిసి రావాలని స్టాలిన్‌ను కోరినట్టు చంద్రబాబు తెలిపారు. నల్లధనమంతా అధికారికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. తమతో కలిసి వచ్చే నేతలందిరితో చర్చలు జరుపుతామని చెప్పారు. నోట్ల రద్దుతో బ్యాంకులపై నమ్మకం పోయిందని చంద్రబాబు తెలిపారు.  

రాష్ట్రాల హక్కులను మోదీ సర్కార్ కాల రాస్తోంది: స్టాలిన్ 
చంద్రబాబుతో భేటీ అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల హక్కులను ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కాల రాస్తోందని విమర్శించారు. మతవాద బీజేపీని దించేందుకు చేతులు కలిపామన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, ఏపీ సీఎం ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలవడం ఆహ్వానించే పరిణామంగా ఆయన పేర్కొన్నారు. 91వ పడిలోకి అద్వానీ

Updated By ManamThu, 11/08/2018 - 23:03
 • ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

modiన్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ గురువారం 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రాజకీయాలకు, పార్టీ పురోభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాం: చంద్రబాబు

Updated By ManamThu, 11/08/2018 - 17:17

PM Candidate, Chandrababu Naidu, BJP, Narendra modi, AP CM, Kumara Swamy, Devgowdaబెంగళూరు: బీజేపీయేతర కూటమి ఏర్పాటుతో అన్ని పార్టీలను ఒకేతాటిపై తెచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు రాష్ట్రాల పార్టీ నేతల మద్దతును కూడగడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. తాజాగా గురువారం కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపేయేతర కూటమి ఏర్పాటుపై కర్ణాటక సీఎం దేవెగౌడ, కుమారస్వామితో ఆయన చర్చించారు. 

సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలంటే దేవెగౌడ లాంటి నేత సహకారం అవసరమన్నారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు కర్ణాటకలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. డీమానిటైజేషన్ జరిగి నేటికి రెండేళ్లయిందని, ఇప్పటికీ నోట్ల కష్టాలు తీరలేదని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది తాము నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కావునా.. ఆ పార్టీతోనూ కలిసి పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అద్వానీకి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

Updated By ManamThu, 11/08/2018 - 12:19
Birthday Wish For LK Advani, PM Modi Praises His Contribution

న్యూఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు, కేంద్ర మాజీమంత్రి ఎల్‌కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం మోదీ... అద్వానీ నివాసానికి స్వయంగా వెళ్లి ... బర్త్‌డే విషెస్ చెప్పారు.

కాగా నేడు ఎల్‌కే అద్వానీ 91వ పుట్టినరోజు సందర్భంగా అంతకు ముందు ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి గడ్కరీ, పలువురు బీజేపీ నేతలు విషెస్ తెలిపారు.కేదార్‌నాథ్‌కు మోదీ ప్రత్యేక పూజలు

Updated By ManamWed, 11/07/2018 - 11:53

Narendra Modiకేదార్‌నాథ్: ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా కేదార్‌నాథ్‌కు వెళ్లిన మోదీకి అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.

అయితే ప్రధాని అయిన తరువాత ప్రతి ఏడాది మోదీ దీపావళిని సరిహద్దులో ఉన్న జవాన్లతో కలిసి జరుపుకుంటుండగా.. ఈ ఏడాది కూడా వారితో గడిపారు. కేదార్‌నాథ్‌‌కు ముందుగా భారత్‌-చైనా సరిహద్దులోని హర్సిల్‌కు వెళ్లి ఆర్మీ, ఐటీబీపీ జవాన్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కేదార్‌నాథ్ దర్శనం అనంతరం పంజాబ్ సరిహద్దుల్లోని జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు.మోదీ మార్కుతో వ్యవస్థలు అస్తవ్యస్తం 

Updated By ManamSat, 11/03/2018 - 02:31

modiకేంద్ర ప్రభుత్వం తమకున్న విచక్షణా అధికా రాన్ని ఉపయోగించి ఆదాయపన్ను శాఖను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు సమంజసం? కేవలం బీజేపీ వ్యతిరేక వ్యక్తులపై అనూహ్యదాడులు చేసి భయబ్రాంతులకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.  కేంద్రం ఇప్పటికైనా రాజ్యాంగాన్ని కాపాడుతూ వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తే ప్రజాస్వామ్యం పటి ష్టంగా నిలబెట్టిన వాళ్లవుతారు. లేదంటే శుష్క వాగ్దా నాలతో గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు. 
ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం కీర్తి ఘడించింది. అటువంటి దేశం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, పత్రికా రంగం అనే నాలుగు పాదాలపై నడుస్తుంది. ఇందులో ఏ ఒక్క వ్యవస్థ తీరు మారినా, దారి తప్పినా దాని పర్య వసానం దేశ పురోగతిపై పడుతుంది. అందుకే ఏ రంగంలోని వాళ్లు వారి పరిధులకు మించి ప్రవర్తించిన దాఖలాలు కనపడవు. కానీ నేడు దేశంలో జరుగుతున్న రాజకీయ తంతు చూస్తుంటే దేశ ఆర్ధిక పురోభివృద్ధి ఎటు పోతుందో అన్న భయం దేశ ప్రజల్లో కలుగు తుంది. ఎందుకంటే ఇంత వరకు దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యున్నత ధర్మస్థానంలో న్యాయ మూర్తుల మధ్య పరస్పర విభేదాలు తలెత్తడం, దేశం లోనే అత్యున్నత విచారణ సంస్థ సీబీఐలో ఉన్నతా ధికారుల లంచాల భాగోతం బయటపడటం, దేశ వ్యా ప్తంగా దళితులను హింసించడం, అనేక మంది పత్రికా విలేకర్లను హతమార్చడం అంతేకాకుండా డిమా నిటైజేషన్, జీఎస్టీ వంటి వాటిని అమలు పరచి భారత ఆర్ధిక విధానం కుంటుపడేలా చేయడంలో మోదీ మా ర్కు పాలనపై సర్వత్రా నిరసనలు వెల్లి వెత్తుతున్నాయి.

అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎవరికి అచ్చేదిన్, ఏ రంగానికి అచ్చేదిన్ అనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. జనవరి 12, 2018న  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పత్రికలతో మాట్లాడడం వల్ల ఏ వ్యవస్థా ప్రశ్నించడానికి, సంస్క రణకు అతీతం కాదని రుజువు అయ్యింది. న్యాయ మూర్తులు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్ 2017 నవంబర్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు ఒక లేఖ రాసి ఆయనతో తమ విభేదాలను తెలియజేశారు. ఈ నలుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తితో అనేక విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. 2014 డిసెంబర్లో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.హెచ్. లోయా వ్యవహారంలో సీబీఐ విచారణకు సంబంధించిన విభే దాలే కారణం అని నిర్ధారణ అయ్యింది. రాజకీయ ప్రా ధాన్యం ఉన్న కేసులను ప్రధాన న్యాయమూర్తి కావా లనే తనకు నచ్చిన బెంచీలకు కేటాయిస్తుండడం పట్ల ఈ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధా న న్యాయమూర్తి నిబంధనలను పాటించక పోవడం వల్ల న్యాయ వ్యవస్థలో అనుచితమైన, అవాంఛితమైన పరిణామాలకు దారి తీస్తుంది.

అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద ప్రజలకు విశ్వాసం సడలిపోవడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఒక్క సుప్రీంకోర్టు మీద విశ్వా సం సన్నగిల్లడమే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటి మీద ప్రజల విశ్వాసం చెక్కు చెదరకూడదు. న్యాయ వవస్థ, చట్టసభలు బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. అలాగే ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహకవర్గం చట్టసభకు జవాబుదారుగా ఉండాలి. కానీ ప్రస్తుత కార్యనిర్వాహక వర్గం తనకు అనువైన చట్టాలను ఆమోదింప చేయాలని ప్రయత్నిస్తోంది.

దేశానికి తలవంపుల్లా నిలుస్తున్న అవినీతిపరుల పాలిట సింహస్వప్నంగా వెలగాల్సిన సీబీఐ నేడు దేశానికే తలవంపు తెచ్చేలా వ్యవహరిస్తోంది. దేశంలో అక్రమార్కుల భరతం పట్టాల్సిన తానే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. అవినీతిపరులపై కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన సీబీఐ అధికారులకు ఇప్పుడు తమపై తామే విచారణ చేయాల్సిన పరిస్థితి ఈ మోదీ పాలనలో ఏర్పడింది. అక్రమార్కుల ఇళ్లపై దాడులు చేయాల్సిన సీబీఐ తన ప్రధాన కార్యాలయంలో తానే సోదాలు చేసుకుంది. సీబీఐలో ఉన్నతాధికారుల లం చాల భాగోతం సంచలనాలకు దారితీస్తోంది. సిబిఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాపై కేసు నమోదే తీవ్ర దుమా రం రేపగా... ఏకంగా సీబీఐ తమ డిఎస్పీ దేవేందర్ కు మార్నే అరెస్ట్ చేయడం మరిన్ని ప్రకంపనలు రేపింది. పైగా  డిఎస్పీ దేవేందర్ లంచం కేసు ఎదుర్కొంటున్న స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా కింద పనిచేస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి కావడం.. ఆయనకు సహకరించే క్రమంలోనే ఈయన కేసులో ఇరుక్కొన్నారనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం. మనీ ల్యాండరింగ్ కేసులో అత్యంత కీలకంగా మారింది హైదరాబాద్కు చెందిన వ్యాపారి సానా సతీశ్బాబు కాగా... ఈయన వాంగ్మూ లాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలతోనే సీబీఐ డిఎస్పీ దేవేందర్ కుమార్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ క్రమంలో సీబీఐ సైతం యధేచ్చగా నిబంధనలు ఉల్లం ఘిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 

మీడియా రాజ్యవ్యవస్థలో నాలుగో అంగం అం టాం. ప్రజలకు అత్యంత పారదర్శకమైన వార్తలను అందించి ‘స్వేచ్ఛగా’ ఉండాల్సిన పత్రికా రంగాన్ని రాజకీయ పరమైన విషయంలో అజ్ఞానానికి గురి చేస్తు న్నారు. దీనిని వ్యతిరేకించే గౌరి లంకేష్ వంటి విలేఖ ర్లను హతమారుస్తున్నారు. పత్రికా రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఇలా ప్రతి వ్యవస్థలను నిర్వీర్యమయ్యేలా చర్యలు తీసు కోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది. మో దీ అర్ధవంతమైన పాలనకు ఇవి చిహ్నాలుగా నిలుస్తు న్నాయి. అంతేకాకుండా రాష్ట్రాల మీద ఆధిపత్యం చలా యించేందుకు కక్ష పూరిత ధోరణిని అవలంభిస్తున్నారు. రాష్ట్రాల్లో తమ పార్టీని బలమైన ప్రత్యామ్నాయంగా చిత్రీకరించేందుకు గవర్నర్ లాంటి అత్యున్నతమైన వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందుకు ఢిల్లీ, కర్నా టకలో జరిగిన పరిణామాలను చూస్తే అవగతం అవు తుంది. కేంద్ర ప్రభుత్వం తమకున్న విచక్షణా అధికా రాన్ని ఉపయోగించి ఆదాయపన్ను శాఖను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు స మంజసం? కేవలం బీజేపీ వ్యతిరేక వ్యక్తులపై అనూ హ్య దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.  కేంద్రం ఇప్పటికైనా రాజ్యాంగాన్ని కాపాడుతూ వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తే ప్రజాస్వామ్యం పటి ష్టంగా నిలబెట్టిన వాళ్లవుతారు. లేదంటే శుష్క వాగ్దా నాలతో గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు.             
 రాయపాటి రంగబాబు టీడీపీ59 నిమిషాల్లో కోటి బ్యాంకు రుణం

Updated By ManamFri, 11/02/2018 - 23:42
 • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రధాని దీపావళి బొనాంజ

modiన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులకు శుభవార్త. ఈ సంస్థలకు గంటలోపు అంటే 59 నిమిషాల్లోనే రూ.1 కోటి వరకు రుణం మంజూరు కానుంది. ఈ మేరకు కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. జీఎస్టీ నమోదిత కంపెనీలకు ఈ రుణ సౌకర్యం కల్పించనున్నారు. ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగానికి మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ కంపెనీలకు అందించే కోటి రూపాయల రుణంపై అతి తక్కువగా 2 శాతం వడ్డీ విధిస్తారు. అలాగే..ఎగుమతులు చేసే చిన్న-మధ్య తరహా కంపెనీలకు ఎగుమతులకు ముందు, ఆ తర్వాత వర్తింపజేసే ఆర్థికసాయాన్ని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు చిన్న-మధ్య తరహా కంపెనీలకు ప్రోత్సాహం కల్పించేందుకు 12 నిర్ణయాలు తీసుకున్నామని, అవి చరిత్రాత్మకమని ఒక ప్రకటనలో ప్రధాని మోదీ వెల్లడించారు. సులభతర వాణిజ్యం(ఈవోడీబీ)లో ప్రపంచర్యాంకింగ్స్‌లో భారత్ 23 స్థానాలు ఎగబాకడం నాలుగేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని అన్నారు. ఈవోడీబీలో 2014లో భారత్ స్థానం 142 ఉండగా.. ఇప్పుడది 77వ స్థానానికి చేరుకుందని అన్నారు.

Related News