Kajal Aggarwal

స్పెషల్ సాంగ్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ భామ

Updated By ManamSun, 09/16/2018 - 15:31

Payal Rajput‘ఆర్ఎక్స్‌100’తో టాలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో పాయల్ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మన్నోరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.‘సైమా’ విజేతలు వీరే

Updated By ManamSun, 09/16/2018 - 11:15
SIIMA

ఏడో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అందదూ అక్కడ సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి.. చిత్రంగా బాహుబలి 2 ఎంపికయ్యాయి.

విజేతలు వీరే
ఉత్తమ నటుడు: ప్రభాస్(బాహుబలి 2)
ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్(నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ నటుడు(క్రిటిక్): బాలకృష్ణ(గౌతమీ పుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి(క్రిటిక్): రితికా సింగ్(గురు)
ఉత్తమ నిర్మాత: రాజీవ్ రెడ్డి(గౌతమీపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటుడు(నెగిటివ్ రోల్): రానా దగ్గుబాటి(బాహుబలి 2)
ఉత్తమ హాస్యనటుడు: రాహుల్ రామకృష్ణ
ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్(రోగ్)
ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్(హలో)
ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి)
ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి(నిన్నుకోరి)
ఉత్తమ సహాయ నటి: భూమిక(ఎమ్‌సీఏ)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి(బాహుబలి 2)
ఉత్తమ గాయకుడు: కాల భైరవ(దండాలయ్య- బాహుబలి 2)
ఉత్తమ గాయని: మధు ప్రియ(వచ్చిండే- ఫిదా)
ఉత్తమ గేయ రచయిత: సుద్దాల అశోక్ తేజ(ఫిదా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్.అఖిల్ సినిమాలో గెస్ట్‌గా టాప్ హీరోయిన్

Updated By ManamFri, 09/14/2018 - 15:24

Akhil, Kajal Aggarwal‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో కనిపించనుందట.

ఓ కీలక పాత్ర కోసం కాజల్‌ను కలవగా.. అందులో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.కొరియాకు శ‌ర్వానంద్‌?

Updated By ManamMon, 09/10/2018 - 12:28

Sharwanandసుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రెండు షేడ్స్‌లో న‌టిస్తున్నాడు. ఒక‌టి 1980-90 కాలానికి చెందిన పాత్ర కాగా.. మ‌రో పాత్ర నేటి కాలానికి చెందిన గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌. ఇందులో నేటి కాలానికి త‌గ్గ గ్యాంగ్‌స్ట‌ర్ తో ప్రేమ‌లో ప‌డే డాక్ట‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ నటించ‌బోతుంది. ఈ చిత్రంలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్ కూడా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈమె 1980-90 కాలానికి చెందిన శ‌ర్వానంద్ జోడిగా క‌న‌ప‌డుతుంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ కొరియాకు వెళుతుంది. 25 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌యిన‌ట్టేన‌ట‌. ఈ సినిమాతో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌కు క్రేజీ విలన్

Updated By ManamMon, 09/10/2018 - 11:31

Sonu Soodఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌గా పేరు తెచ్చుకున్న సోనూసూద్.. నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌లోకి రాబోతున్నాడు. ‘అరుంధతి’, ‘జులాయి’, ‘ఆగడు’, ‘సూపర్’, ‘అతడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించిన సోనూసూద్.. ఈ మధ్య తమిళ్, హిందీ చిత్రాలలో బిజీగా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ద్వారా ఈ విలన్ మళ్లీ తెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సోనూసూద్ రాజకీయ నాయకుడిగా కనపడనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన కాజల్ నటిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. కాగా 2014లో సోనూసూద్ తెలుగులో ఆగడులో సోనూసూద్ చివరిగా నటించాడు.(ఆ తరువాత 2016లో అభినేత్రితో వచ్చినప్పటికీ.. అది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు.)తమ్ముడు చూడాలనుందన్నారు.. ఇంతలోనే వదిలి వెళ్లారు

Updated By ManamWed, 08/29/2018 - 10:14

Harikrishnaసినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని చెప్పుకుంటూ పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు తమ సంతాపాన్ని ప్రకటించారు. 

‘‘ ‘చాలా రోజులు అయ్యింది తమ్ముడు నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ కొన్ని రోజుల క్రితం నాతో ఈ మాటలు మాట్లాడిన ఆయన ఇప్పుడు దూరంగా వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నా అన్నయ్య‘‘ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. హరికృష్ణ హఠాన్మరణం చాలా బాధించిందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబానికి తమ సంతాపం అంటూ పలువురు ప్రముఖులు తెలిపారు. వారిలో మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, మంచు మనోజ్, నాని, కాజల్ అగర్వాల్, రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సాయి బెల్లంకొండ, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు,  దేవీ శ్రీ ప్రసాద్, శ్రీనువైట్ల, పూజా హెగ్డే, గౌతమి, శరత్ కుమార్, దర్శకుడు మారుతి, అనసూయ, గోపిచంద్ మలినేని తదితరులు ఉన్నారు.

 బెల్లంకొండ సరసన మరో హీరోయిన్

Updated By ManamMon, 08/20/2018 - 12:55

Srinivas, Mehreenబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌‌‌‌‌గా నటిస్తుండగా.. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. కృష్ణగాడి వీరప్రేమ గాథ, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మెహ్రీన్ ఈ చిత్రంలో భాగమైంది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అందులో ఆదివారం జాయిన్ అయ్యింది మెహ్రీన్. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.కాజల్ ‘కీకీ ఛాలెంజ్’ చూశారా..?

Updated By ManamMon, 08/13/2018 - 13:34

Kajal Aggarwal, Bellamkonda Srinivasకీకీ ఛాలెంజ్.. గత కొంత కాలంగా ఇంటర్నెట్‌ను ఊపేసిన ఛాలెంజ్. కారులోంచి దిగి కీకీ అనే పాటకు స్టెప్‌లు వేసి ఆ తరువాత మళ్లీ కారులోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. దీన్ని చేస్తూ ఎంతో మంది మరణించగా.. కొంతమంది తీవ్ర గాయాలపాలు అయ్యారు. ఇక మనదేశంలోనూ ఈ ఛాలెంజ్ విస్తరించింది. నటుడు ఆదా శర్మ, రెజీనా తదితరులు ఈ ఛాలెంజ్‌ను చేశారు. అయితే ఇకపై ఈ ఛాలెంజ్‌ను చేస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించడంతో ఆ తరువాత కాస్త తగ్గుముఖం పట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఛాలెంజ్‌ను కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి వెరైటీగా ప్రయత్నించారు. వీల్ చైర్‌లోంచి దిగి ఈ పాటకు స్టెప్‌లు వేశారు. జాగ్రత్త లేకుండా కీకీ ఛాలెంజ్‌ను చేస్తే దెబ్బలు తగిలి, తమలా అవుతారని, ఇలా వీల్‌చైర్‌లోనే ఉంటారని ఆ తరువాత ఈ ఇద్దరు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ మధ్యలో ఇలా ఛాలెంజ్‌ను చేశారు కాజల్, శ్రీనివాస్.

 డాక్టర్ పాత్రలో చంద‌మామ‌

Updated By ManamFri, 08/10/2018 - 17:14

Kajal Aggarwal‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ చంద‌మామ  కాజల్ అగర్వాల్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్నా కూడా కుర్ర హీరోయిన్స్‌కు ధీటుగా పోటీనిస్తూ.. అవకాశాలను అందుకుంటంది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాల్లో నటిస్తుంది. అలాగే శర్వానంద్, సుధీర్ కాంబినేషన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ సినిమాలో కాజల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు షేడ్స్‌లో కనిపిస్తారు. అందులో 1980-90 కాలానికి చెందిన లుక్ ఒక‌టైతే.. ఇప్పటి కాలంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు శర్వా. ఈ పాత్రను ప్రేమించే డాక్టర్‌గా కాజల్ నటిస్తుందట. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రలో ‘హలో’ బ్యూటీ కల్యాణి ప్రియుదర్శన్ నటిస్తుంది. గోపీచంద్‌తో తొలిసారి

Updated By ManamSat, 07/28/2018 - 15:00

Gopichand, Kajal Aggarwalహీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత విల‌న్‌గా కొన్ని సినిమాల్లో న‌టించిన గోపీచంద్ త‌ర్వాత హీరోగానే సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా రీసెంట్‌గా 25 సినిమాల‌ను పూర్తి చేసుకున్నారు గోపీచంద్‌. ఈ ఆర‌డుగుల హీరో ఇప్పుడు రెండు సినిమాల‌ను సెట్స్‌కు తీసుకురావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో ఒక‌టి కుమారస్వామి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో కాగా.. మ‌రో చిత్రం సంప‌త్ నందితో.. ఇందులో కుమార‌స్వామి అనే ద‌ర్శ‌కుడితో యాక్ష‌న్‌, ల‌వ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా గోపీచంద్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మ‌చారం రానుంది.

Related News