team india

ఇదిగో కోహ్లీ-అనుష్క ట్రెండింగ్ ఫోటో

Updated By ManamWed, 03/14/2018 - 20:58
virat kohli

సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారు ఏం చేసినా ఆ వార్త ఇంటర్నెట్‌లో ట్రెడింగై కూర్చొంటోంది. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీని అనుష్క శర్మ ముద్దుపెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా వీరి టీ-షర్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. విరాట్ కోహ్లీ 2016లో ఓ టీర్ట్‌తో కనిపించగా..ఇప్పుడు అనుష్క శర్మ అదే టీ-షర్ట్‌తో కనిపించడం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో విరాట్ కోహ్లీ వాడిన టీ-షర్ట్‌నే అనుష్క శర్మ ఇప్పుడు వాడారా? లేదా ఇది మరో టీ-షర్టా? అనే అంశంపై నెటిజన్లు ఇంట్రెస్ట్‌గా చర్చించుకుంటున్నారు. ఇదిగో ఇంటర్నెట్‌లో ట్రెడింగ్ అవుతున్న ఆ ఫోటోను ఇక్కడ మీరు కూడా చూడండి...

virat kohli

 ఇదిగో ధోనీ షేర్ చేసిన వీడియో

Updated By ManamTue, 03/13/2018 - 17:16
dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ చాలా రోజుల తర్వాత తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. ముక్కోణపు టోర్నీ నుంచి విశ్రాంతి పొందిన ధోనీ...తన విలువైన సమయాన్ని తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో గడిపాడు. ఫ్యామిలీతో సమయం గడిపిన వీడియోను...‘ఫన్‌ టైం విత్‌ ఫ్యామిలీ’అని పేర్కొంటూ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ధోనీ పెంపుడు శునకాలు కూడా కనిపిస్తాయి. కేవలం ఆరు గంటల వ్యవధిలో ధోనీ వీడియోకు సుమారు 10 లక్షల వ్యూస్‌ వచ్చాయి. గతంలో కూడా ధోనీ తన పర్సనల్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం తెలిసిందే. ధోనీ షేర్ చేసిన లేటెస్ట్ వీడియోని ఈ దిగువున చూసి ఎంజాయ్ చేయండి...

 

A post shared by @mahi7781 on

 భారత్ విజయ లక్ష్యం: 153 పరుగులు

Updated By ManamMon, 03/12/2018 - 22:31

TRI series, Srilanka team, target 153 runs, Team India కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తడబడింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్‌ మెండీస్‌ (55) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తరంగ (22), శనక (19) గుణరత్న(17) పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది.

తొలుత మూడో ఓవర్‌లో శార్దూల్‌ ఠాకూర్ బౌలింగ్‌లో ఓపెనర్‌ గుణతిలక (17) షాట్‌ కొట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో సురేశ్‌ రైనా డైవ్‌ చేసి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన తొలి బంతికే పెరీరా(3) ఔటయ్యాడు. రివర్స్‌ స్వీప్‌ షాట్ ఆడేందుకు యత్నించి ఔట్ కావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4/27) నాలుగు వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ (21/2) రెండు వికెట్లు తీశాడు. చాహల్‌, విజయ్‌ శంకర్‌, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఇక షమీ కెరీర్ క్లోజ్!

Updated By ManamSat, 03/10/2018 - 17:33

అజ్ఞాతంలో షమీ- ఐపీఎల్‌లో ఆడేది అనుమానమే

Shami

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షమి భార్య హసిన్ జమీన్ చేసిన ఆరోపణలతో కోల్‌కతా పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. అయితే  ఆ తర్వాత  నుంచి షమీ ఆచూకీ తెలియడం లేదు.  తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది.  చివరి సారిగా ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వెళ్లినట్టు మొబైల్ లొకేషన్ ద్వారా గురించారు.  మరో వైపు షమీ కుటుంబ సభ్యుల్లో కొందరు కోల్‌కతాలోని భార్య జమీన్ బంధువులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.  ఈ వ్యవహారం సద్దుమణిగేదాకా మీడియాకు దూరంగా ఉండమని కుటుంబీకులతో షమీ చెప్పినట్టు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ఆడతాడా..!
shamiకేసులతో  ఉక్కిరిబిక్కిరవుతున్న షమీ ఐపీఎల్‌లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. భార్య ఆరోపణలతో ఇప్పటికే బీసీసీఐ కాంట్రాక్టును దక్కించుకోలేకపోయిన షమీ వ్యవహారంపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆచితూచి అడుగులేస్తోంది. షమీని ఐపీఎల్‌లో ఆడించాలా వద్దా అన్న విషయంపై సందిగ్ధంలో పడ్డ ఢిల్లీ జట్టు బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతోంది. మహ్మద్ షమీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మూడు కోట్లకు కొనుగోలు చేసింది. బీసీసీఐ సలహాకోసం ఎదురు చూస్తున్నామని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు యజమాని తెలిపారు.  ఐపీఎల్‌కు దూరమైతే షమీ కెరీర్ క్లోజయినట్టేనని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీసీఐ కూడా న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది.

తమ్ముడి  చేత...
shamiఇక షమీపై భార్య  హసీన్ జహాన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి.   తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ వత్తిడి తెచ్చేవాడని  తాజాగా జహాన్ సంచలన ఆరోపణ చేసింది.   ఓ రోజు తమ్ముడు ఉన్న గదిలోకి  తనను నెట్టి తలుపు గడియ వేశాడని,  లోపల షమి తమ్ముడు  హసీబ్ తనతో అసభ్యంగా ప్రవర్తించటంతో కేకలేశానని, దీంతో భయపడ్డ షమీ తలుపులు తెరిచాడు... కుటుంబ సభ్యులంతా తనను కొట్టేవాళ్లని తెలిపింది.  పలువురు మహిళలతో షమీ అసభ్యకరంగా మాట్లాడిన ఫోన్ సంభాషణలను కూడా  జహాన్ మీడియాకు  వినిపించింది. పలువురు మహిళలతో తనకు సంబంధం ఉందని షమీ చెప్పటం ఆ టేపుల్లో స్పష్టంగా ఉంది.ఉబెర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ

Updated By ManamFri, 03/09/2018 - 19:16

virat kohliప్రముఖ క్యాబ్ సంస్థలు ఓలా-ఉబెర్ మధ్య పోటీ కొత్త మలుపు తీసుకుంది. ఓలాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఉబెర్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారత్‌లో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తీసుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉబెర్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌ను ప్రకటించడం ఇదే తొలిసారి. కోహ్లీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు అధికారిక ప్రకటన చేసిన ఉబెర్ ఇండియా...అయితే దీనికి సంబంధించిన ఆర్థిక అంశాలను వెల్లడించలేదు.ధోనీని అవమానించిన బీసీసీఐ

Updated By ManamWed, 03/07/2018 - 19:08
team india

భారత క్రికెటర్ల వార్షిక వేతన కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 2017-సెప్టెంబరు 2018 మధ్యకాలానికి ప్రకటించిన ఈ కాంట్రాక్టులో కొత్తగా ఏ+ గ్రేడు ఆటగాళ్ల జాబితాను చేర్చారు. అనూహ్యంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. దేశీయవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజును అన్ని కేటగిరీల్లో 200 శాతం మేర పెంచింది. 

ఆటగాళ్లను మొత్తం నాలుగు గ్రేడ్లుగా విభజించి...వారికి వేర్వేరు వేతన ప్యాకేజీలను ప్రకటించారు. ఏ+ గ్రేడ్‌లోని టాప్ ఆటగాళ్లకు రూ.7 కోట్ల వేతనం నిర్ణయించగా...మిగిలిన కేటగిరీల్లోని ఆటగాళ్లకు రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.1 కోటి వార్షిక వేతనాన్ని నిర్ణయించారు. ఏ+ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ థావన్, బుమ్రాలు చోటు దక్కించుకున్నారు. మూడు ఫార్మెట్లలోనూ ఆడుతున్నందున వారిని ఏ+ కేటగిరీలో ఉంచారు. 

అనూహ్యంగా ఏ+ కేటగిరీలో ధోనీకి చోటు దక్కలేదు. గ్రూపు ఏలో ధోనీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజా, మురళి విజయ్, పుజారా, రహానె, సాహాలకు చోటు కల్పించారు. ఏ+ గ్రేడ్‌లో ధోనీకి చోటు కల్పించకపోవడం పట్ల అతని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

మహిళా క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఏ గ్రేడ్‌లోని క్రికెటర్లు రూ.50 లక్షల వేతనాన్ని పొందనున్నారు. బీ గ్రేడ్ ఆటగాళ్లు రూ.30 లక్షలు, సీ గ్రేడ్ ఆటగాళ్లు రూ.10 లక్షల వేతనం పొందుతారు. టీ20: ఇంతపనిచేశావేంటి రోహిత్! 

Updated By ManamTue, 03/06/2018 - 19:08

rohitకొలంబో: టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. చమీరా బౌలింగ్‌లో మెండిస్‌కు క్యాచ్‌గా దొరికి రోహిత్ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. కెప్టెన్ పెవిలియన్ బాట పట్టడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. రోహిత్ ఔటయిన అనంతరం సురేష్ రైనా క్రీజులోకొచ్చాడు. శిఖర్ ధావన్ ఆడుతున్నాడు.శ్రీలంకలో ఎమర్జెన్సీ.. చిక్కుకున్న టీమిండియా

Updated By ManamTue, 03/06/2018 - 15:20

Srilankaకొలంబో: శ్రీలంకలో పది రోజుల ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెంట్రల్‌ శ్రీలంకలోని క్యాండీలో గత వారం రోజులుగా హింస జరుగుతోంది. మైనారిటీ వర్గాలపై మెజారిటీ వర్గాలకు చెందిన కొందరు వరుస దాడులకు పాల్పడ్డారు. ఇవి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇదిలా ఉంటే 'నిదహాస్ ట్రోపీ' టీ-20 సిరీస్‌ను ఆడేందుకు భారత క్రికెట్ టీం ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. సిరీస్‌లో భాగంగా మంగళవారం మొదటి మ్యాచ్ మంగళవారం జరగనుంది. అయితే శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించడంతో.. టీమిండియా అక్కడ చిక్కుకుంది.టీ 20 సిరీస్ మనదే

Updated By ManamSun, 02/25/2018 - 01:56

దక్షిణాఫ్రికా ఆధిపత్యంతో టెస్టు సిరీస్‌ ఫలితం ముందే తెలిసిపోయింది. భారత్‌ దూకుడుతో  వన్డే సిరీస్‌ ఏకపక్షంగా సాగింది. ఉత్కంఠ రేపే టి20 ఫార్మాట్లో మాత్రం రెండు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సిరీస్‌ విజయం కోసం ఆఖరి మ్యాచ్‌ వరకు ఆగాయి. ఇందుకు తగ్గట్లే ఒకింత ఆసక్తిగా సాగిన మూడో టి20లో విజయం మన జట్టునే వరించింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సొంతమైంది. ఏ లక్ష్యంతో దక్షిణాఫ్రికాకు టీమిండియా వచ్చిందో దానిని సాధించి సగర్వంగా తిరుగు పయనం కానుంది.  

indian teamకేప్‌టౌన్‌: సఫారీ పర్యటనలో ఆఖరి పంచ్‌ మనదే అయింది. దక్షిణాఫ్రికా పోరాటంతో శనివారం ఇక్కడ ఒకింత ఉత్కంఠగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), సురేశ్‌ రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ డుమిని (41 బంతుల్లో 55; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధ శతకం, జాన్‌కర్‌ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాయి. దీంతో భారత్‌ 2–1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. సురేశ్‌ రైనాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం లభించింది. మూడో మ్యాచ్‌కు సఫారీ జట్టులో స్మట్స్‌ స్థానంలో క్రిస్టియన్‌ జాన్‌కర్‌ అరంగేట్రం చేయగా, ప్యాటర్సన్‌ బదులు ఫాంగిసోను తీసుకున్నారు. భారత్‌ మూడు మార్పులతో బరిలో దిగింది. వెన్ను పట్టేయడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరం కాగా... అతడి స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన చహల్, ఉనాద్కట్‌లను పక్కనపెట్టి అక్షర్‌ పటేల్, బుమ్రాలకు చోటిచ్చారు.  

రైనా మెరుపులు... ధావన్‌ నిలకడ
టాస్‌కు కోహ్లి కాకుండా రోహిత్‌ శర్మ మైదానంలోకి రావడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అయితే సారథ్య బాధ్యత indian teamకూడా రోహిత్‌ (11) ఆటలో మార్పు చూపలేదు. ఈ ఫార్మాట్‌లో అతడి పేలవ ఫామ్‌ కొనసాగింది. మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టినప్పటికీ... రెండో ఓవర్‌ మూడో బంతికే డాలాకు ఎల్బీగా చిక్కాడు. మూడు టి20ల్లోనూ డాలా బౌలింగ్‌లోనే రోహిత్‌ అవుటవడం గమనార్హం. భారత ఇన్నింగ్స్‌లో హైలైట్‌ ఆటంటే రైనాదే. వన్‌డౌన్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ బాదాడు. ఓవైపు ధావన్‌ టైమింగ్‌ కుదరక ఇబ్బంది పడుతుంటే తను మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. చకచకా సింగిల్స్, డబుల్స్‌ తీస్తూనే అలవోకగా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. ఇదే ఊపులో షమ్సీ బంతిని భారీ షాట్‌ ఆడబోయిన రైనా లాంగాన్‌లో బెహర్దీన్‌కు చిక్కాడు. మరోవైపు రెండు లైఫ్‌లు పొందిన ధావన్‌ 29వ బంతికి తొలి బౌండరీ సాధించాడు. వెంటవెంటనే ఇంకో రెండు ఫోర్లు కొట్టినా... జట్టు అవతలి ఎండ్‌లో మనీశ్‌ పాండే (10 బంతుల్లో 13; 1 సిక్స్‌) వికెట్‌ కోల్పోయింది. కొద్దిసేపటికే రెండో పరుగుకు యత్నించిన ధావన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి డాలా విసిరిన డైరెక్ట్‌ హిట్‌కు రనౌటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 21; 1 సిక్స్‌), ధోని (11 బంతుల్లో 12) బ్యాట్‌ ఝళిపించలేకపోయారు. క్రీజులో కీలక బ్యాట్స్‌మెన్‌ ఉన్నా ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో టీమిండియాకు 29 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) దూకుడుతో  స్కోరు బోర్డులో కొంత కదలిక వచ్చింది. 

డుమిని నిలిచాడు... జాన్‌కర్‌ భయపెట్టాడు 
indian team173 పరుగుల ఛేదనలో ప్రొటీస్‌కు శుభారంభం దక్కలేదు. భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, శార్దుల్‌తో పాటు హార్దిక్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆ జట్టు లక్ష్యం దిశగా పరుగులు చేయలేకపోయింది. మూడో ఓవర్లో హెన్‌డ్రిక్స్‌ (7)ను అవుట్‌ చేసి భువీ బ్రేక్‌ ఇవ్వగా, ఓపెనర్‌గా వచ్చిన మిల్లర్‌ (23 బంతుల్లో 24; 1సిక్స్, 2 ఫోర్లు)ను రైనా వెనక్కుపంపాడు. విధ్వంసక క్లాసెన్‌ (7) ఆటలు ఈసారి సాగలేదు. కానీ కెప్టెన్‌ డుమిని పోరాటం సాగించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇతడిని శార్దుల్‌ ఔట్‌ చేశాడు. వెంటనే మోరిస్‌ (4) కూడా అవుటయ్యాడు. అప్పటికి విజయ సమీకరణం 21 బంతుల్లో 59. అయితే... అరంగేట్ర ఆటగాడు జాన్‌కర్‌ తన విధ్వంసంతో భయపెట్టాడు. బెహర్దీన్‌ (15 నాటౌట్‌) తోడుగా విరుచుకుపడ్డాడు. జాన్‌కర్‌ ధాటికి 17, 18, 19 ఓవర్లలో కలిపి సఫారీ జట్టుకు ఏకంగా 45 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో 19 చేయాల్సి ఉండగా భువీ 11 పరుగులతోనే సరిపెట్టాడుఎదురులేని మొనగాళ్లు

Updated By ManamTue, 02/20/2018 - 01:33

ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తున్న మణికట్టు స్పిన్నర్లు
 

imageటీ20 ఫార్మాట్ పరిచయమైనప్పటి నుంచి ప్రపంచ క్రికెట్ బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారింది. కానీ ఈ మణికట్టు స్పిన్నర్లు ఆ నిర్వచనాన్ని మార్చేస్తారేమో అనిపిస్తోంది. ఒకప్పుడు అంటే బిషన్ సింగ్ బేడీ, రవిశాస్త్రి, శివలాల్ యాదవ్ స్పిన్ బౌలింగ్ అంటే ప్రపంచ బ్యాట్స్‌మెన్‌కు గుండెల్లో దడ పుట్టేది. కొద్ది రోజులకు ఈ మణికట్టు స్పిన్నర్లు కూడా ఆ పరిస్థితిని తెస్తారేమో అనిపిస్తోంది.


సౌతాఫ్రికాకు వెళ్లిన ప్రతిసారీ టీమిండియా ఇబ్బందులు పడేది. ఘోర పరాజయాలతో వెనుదిరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్ల కారణంగా మెన్ ఇన్ బ్లూ తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. అంతేకాదు అక్కడి ఫాస్ట్ పిచ్‌లపై నిర్ణీత ఓవర్ల ఫార్మాట్‌లో వరుస విజయాలు సాధిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20లోనూ టీమిండియా గెలిచింది. దీంతో టీమిండియా సమతుల్యతను సాధించి ఉన్నత శిఖారాలకు చేరుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఆరు వన్డేల్లో యజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ జంట 33 వికెట్లు తీసింది. దీంతో ఆ సిరీస్‌ను టీమిండియా 5-1తో కైవసం చేసుకుంది. ముగిసిన వన్డే సిరీస్‌లో గానీ, ఇప్పుడు జరుగుతున్న టీ20 సిరీస్‌లో గానీ మణికట్టు మాయాజాలం కొనసాగుతోంది. వీరిద్దరినీ ఇలాగే కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇటీవలి కాలంలో అంటే టీ20 ఫార్మాట్ పరిచయమైనప్పటి నుంచి ప్రపంచ క్రికెట్‌ను గమనిస్తే బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారింది. కానీ ఈ మణికట్టు స్పిన్నర్లు ఆ నిర్వచనాన్ని మార్చేస్తారేమో అనిపిస్తోంది. ఒకప్పుడు అంటే బిషన్ సింగ్ బేడీ, రవిశాస్త్రి, శివలాల్ యాదవ్ కాలం నాటి రోజులను ఈ మణికట్టు స్పిన్నర్లు గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో భారత స్పిన్ బౌలింగ్ అంటే ప్రపంచ బ్యాట్స్‌మెన్‌కు గుండెల్లో దడ పుట్టేది. కొద్ది రోజులకు ఈ మణికట్టు స్పిన్నర్లు కూడా ఆ పరిస్థితిని తెస్తారేమో అనిపి స్తోంది. ఇద్దరు స్పిన్ బౌలర్లను తుది జట్టులో ఆడించడం కూడా చాలా అరుదైన అంశం. ఎందుకంటే 90 దశకంలో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా ఒకరినే తుది జట్టులోకి తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఇరువైపుల నుంచి స్పిన్న ర్ల దాడి జరుగుతోంది. ఈ విధా నాన్ని చాలా జట్లు అనుసరించవు. సౌతాఫ్రికా జట్టులోనూ ఇద్దరు స్పిన్నర్లు ఉన్నప్పటికీ వన్డే సిరీస్‌లో కానీ, మొన్న జరిగిన టీ20లో కానీ ఇద్దరినీ ఆడించలేదు. జొహన్నెస్‌బర్గ్ పిచ్ బ్యాటింగ్ స్వర్గధామంగా భావించిన సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ ఒక్క స్పిన్నర్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోలేదు. బ్యాటింగ్ స్వర్గధామమైనప్పటికీ జొహన్నెస్‌బర్గ్ వన్డేలోనూ టీమిండియా ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వీరివల్లే సౌతాఫ్రికా గడ్డపై నిర్ణీత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా గెలుపు బావుటా ఎగురవేస్తోంది.

2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆగస్టులో టీమిండియా తన వ్యూహాన్ని మారుస్తూ చాహల్, యాదవ్‌ను తెరపైకి తెచ్చిందిimage. వీరిద్దరితో చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో గతంలో టీమిండియాకు ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు వన్డే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు వారిద్దరు తహతహలాడుతున్నారు. ఈ మణికట్టు స్పిన్నర్ల ప్రతిభ కారణంగా ఎంతో ఘనమైన కెరీర్ ఉన్న అశ్విన్, జడేజాలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నారు. స్లో పేస్ తరహాలో స్పిన్ బౌలింగ్ చేయడం చాహల్, కుల్‌దీప్ విజయ రహస్యం. నిజం చెప్పాలంటే చాహల్, కుల్‌దీప్ ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో ఆడలేదు. కానీ ఇక్కడి పిచ్‌లు గమనించిన తర్వాత తమ బౌలింగ్‌కు కాస్త పేస్‌ను కూడా జోడించారు. సాధారణంగా ఒక మ్యాచ్‌లో ప్రత్యర్థి జోడీని ఒత్తిడికి గురిచేయొచ్చు. అదీ పరిస్థితులను బట్టి. కానీ వీళ్లు బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై అటాక్ చేశారు. ఆ మ్యాచ్ గురించిన ప్రస్తావన పక్కన పెడితే.. చాహల్, కుల్‌దీప్ బౌలింగ్‌లో ఆడడమే కష్టమైపోతోంది. వీరి బౌలింగ్‌లోని ప్రత్యేకత గురించి చెప్పాలంటే.. బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టడమే వీరి అసలైన బలం. చాహల్ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. బంతిని కావలసినంత తిప్పేస్తున్నాడు. అది అతనికి బాగా ఉపయోగపడుతోంది. కుల్‌దీప్ గూగ్లీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వికెట్ల వద్ద స్థిరపడనీయడం లేదు. దాన్ని అర్థం చేసుకోవడమే కాష్టంగా మారింది. అంతేకాదు బంతిని బ్యాట్స్‌మెన్ నుంచి దూరంగా వేయగల సమర్థులు. బంతిని బ్యాట్స్‌మెన్‌కు దూరంగా వేయగల బౌలర్ పేసర్ కానీ, స్పిన్నర్ కానీ తప్పక వికెట్లు లభిస్తాయి. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలర్. కానీ టీమిండియాలోకి వచ్చేందుకు ఇప్పుడతను లెగ్ స్పిన్ కూడా నేర్చుకుంటున్నాడు. కానీ ఈ మణికట్టు స్పిన్నర్లు సర్వసాధారణంగానే ఇరువైపులా బంతిని వేయగలరు. ఇది వారికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా చాహల్ మున్ముందు మరింత ప్రమాదకరమైన బౌలర్‌గా మారే అవకాశముంది. ఎందుకంటే అతను ఎంతగా బంతిని తిప్పగలడో అదే సమయంలో కంట్రోల్ కూడా చేయగలడు. లైన్ అండ్ లెంగ్త్ పాటించడంలో నిక్కచ్చిగా ఉంటాడు. ఆ కారణంగానే అతని బౌలింగ్‌లో స్కోరు చేయడం కష్టతరమవుతోంది. సౌతాఫ్రికా పర్యటన వీరిద్దరికీ చాలా ఉపయోగపడింది. అంతేకాదు ఈ మణికట్టు స్పిన్నర్ల అభివృద్ధికి ఐపీఎల్ మరింత సహాయపడనుంది.

Related News