mammutty

నీ కన్నుల్లో కొలిమై రగిలే..

Updated By ManamSun, 09/02/2018 - 10:14
  • వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ‘యాత్ర’ సాంగ్ లిరిక్స్ విడుదల..

A tribute to DYSR on his death anniversary, First single from Yatra

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘యాత్ర’  చిత్రంలోని పూర్తి పాట లిరిక్స్‌ను ఆ చిత్ర యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా... ఆయనపై రూపొందుతున్న యాత్ర బయోపిక్...పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.  ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ ...వేలాదిమంది వెంటరాగా మహానేత పాదయాత్ర చేస్తున్న దృశ్యాలు ఈ పాటలో కనిపిస్తోంది. 

లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్‌ఆర్ పాత్ర పోషిస్తుండగా, మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఈ బయోపిక్‌‌ను విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ను నిర్మిస్తున్నారు.  ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.



న‌య‌న‌తార కాదు.. ర‌మ్య‌కృష్ణ‌?

Updated By ManamFri, 04/20/2018 - 23:59

ramyaస‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'యాత్ర‌'. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా.. అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్న‌ ఈ చిత్రానికి మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. వై.ఎస్‌.ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడా పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ర‌మ్య ఎంట్రీపై క్లారిటీ రానుంది.



మెగాస్టార్‌తో అనుష్క‌?

Updated By ManamMon, 04/02/2018 - 16:19

anushkaగ్లామర్ పాత్రలతో పాటు అభినయానికి అవ‌కాశ‌మున్న‌  పాత్రలను కూడా చేస్తున్న నాయిక అనుష్క. ఇటీవ‌లే ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ ముద్దుగుమ్మ‌. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న అనుష్క ఇంతవరకు తెలుగు, తమిళ భాషల్లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే.. మొదటిసారిగా మాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధపడుతున్నార‌ని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి సరసన ఓ సినిమాలో నటించేందుకు అనుష్క ఓకే చెప్పార‌ని మ‌ల‌యాళ చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాకుండా.. విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుసగా మలయాళం, తమిళం సినిమాలు చేస్తున్న స్వీటీ.. తెలుగు సినిమాకి ఎప్పుడు పచ్చ జండా ఊపుతారోనని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



లెజెండ్స్‌తో మ‌రో లెజెండ్ శ్రీ‌దేవి.. రేర్ ఫొటో

Updated By ManamSun, 02/25/2018 - 22:53

srideviఅతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అకాల మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వాటిలో అత్యంత అరుదైన ఓ ఫొటో కూడా ఉంది. అందులో శ్రీ‌దేవితో మ‌రికొంత మంది లెజెండ్స్ ఉన్నారు. వారిలో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, న‌టీమ‌ణి జ‌య‌ల‌లిత‌, ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా, మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఉన్నారు. నిజంగా ఓ అరుదైన ఫొటో ఇది. 





Related News