rajani kanth

తలైవా సందడి షురూ..

Updated By ManamSat, 09/08/2018 - 00:06

imageరజనీకాంత్ తన 165వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. త్వరలోనే లఢఖ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్ నటించిన మరో విజువల్ వండర్ ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాష్ కరణ్ నిర్మిస్తున్నారు. నాలుగు వందల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘2.0’ను ఈ ఏడాది నవంబర్ 29న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. శుక్రవారం రోజు రజనీకాంత్ 165వ సినిమాకు ‘పేట్ట’ అనే టైటిల్‌ను ఖరారు ‘2.0’ టీజ‌ర్ అప్‌డేట్‌

Updated By ManamMon, 05/21/2018 - 15:48

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర టీజర్‌ను ఐ.పి.ఎల్ ఫైనల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ నెల 27న ముంబైలో విడుద‌ల చేయ‌నున్నారు. అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.'2.0'లో ఐశ్వ‌ర్యారాయ్‌?

Updated By ManamThu, 04/05/2018 - 22:45

aishwarya raiసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఐశ్వ‌ర్యారాయ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. గ‌తంలో ర‌జ‌నీ, శంక‌ర్ జట్టుక‌ట్టిన 'రోబో'లో ఐశ్వ‌ర్య క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.  తాజా చిత్రం 'రోబో'కి సీక్వెల్ కాదంటూ శంక‌ర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో ఐశ్వ‌ర్య ఎంట్రీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.'2.0'.. వి.ఎఫ్‌.ఎక్స్ వ‌రల్డ్ ఎలా ఉంటుందంటే..

Updated By ManamMon, 03/05/2018 - 17:38

2.0'రోబో' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన‌ ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ గ్ర‌హీత‌ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే సిద్ధ‌మైన '2.0' టీజ‌ర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేయ‌క‌ముందే.. ఎవ‌రో దుండ‌గులు లీక్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. చిత్ర బృందం '2.0' వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర‌ల్డ్ నుంచి స్నీక్ పీక్ అంటూ ఓ వీడియోని విడుద‌ల చేసింది. సాంకేతికంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉండ‌బోతోందో ఈ వీడియో చూస్తే ఓ అంచ‌నాకి వ‌చ్చేయొచ్చు. మొత్త‌మ్మీద 'రోబో' మ్యాజిక్ మ‌రోసారి వెండితెర‌పై రిపీట్ కాబోతుంద‌న్న‌మాట‌.చిరుతో స్నేహాం.. ర‌జ‌నీతో శ‌త్రుత్వం..

Updated By ManamThu, 03/01/2018 - 22:44

rajani, chiruచిరంజీవితో స్నేహం చేస్తాను.. ర‌జ‌నీకాంత్‌తో శ‌త్రుత్వం కొన‌సాగిస్తాను.. అంటున్నాడు ఓ యువ క‌థానాయ‌కుడు. ఇంత‌కీ ఎవ‌రా క‌థానాయ‌కుడు అనుకుంటున్నారా? కాస్త వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఆయ‌న చిరుకి స‌హాయ‌కుడి పాత్ర‌లో న‌మ్మిన‌బంటు త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఇదే విజ‌య్ సేతుప‌తి.. ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా 'పిజ్జా' ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ రూపొందిస్తున్న చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అంటే చిరుతో స్నేహం.. ర‌జ‌నీతో శ‌త్రుత్వం పాటించ‌నున్నాడ‌న్న‌మాట విజ‌య్‌. త్వ‌ర‌లోనే ర‌జ‌నీ చిత్రంలో విజ‌య్ పాత్ర‌పై క్లారిటీ వ‌స్తుంది.ర‌జ‌నీకాంత్ చిత్రానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

Updated By ManamThu, 03/01/2018 - 16:29

anirudhసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రానికి ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం అంటే.. అది అదృష్టానికి మించిన విష‌యం కిందే లెక్క. ఇప్పుడు ఆ అదృష్టం ఓ క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ద‌క్కింది. అత‌ను మ‌రెవ‌రో కాదు.. అనిరుధ్‌. త‌మిళంలో విజ‌య్‌, అజిత్‌, సూర్య వంటి అగ్ర హీరోల చిత్రాల‌కు సంగీత‌మందించిన ఈ యువ స్వ‌ర‌క‌ర్త‌.. తొలిసారిగా ర‌జ‌నీకాంత్ సినిమాకు ప‌నిచేయ‌బోతున్నారు. వాస్త‌వానికి.. ర‌జ‌నీకి ద‌గ్గ‌ర బంధువు అయినప్ప‌టికీ.. అనిరుధ్‌కు ఆయ‌న‌తో ప‌నిచేసే అవ‌కాశం మాత్రం కాస్త ఆల‌స్యంగానే ద‌క్కింది. 'పిజ్జా' ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.'కాలా' టీజ‌ర్ అప్‌డేట్ 

Updated By ManamTue, 02/20/2018 - 21:10

kaalaa'క‌బాలి' త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ద‌ర్శ‌కుడు పా.రంజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన‌ చిత్రం 'కాలా'. ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, ఈశ్వ‌రీ రావు, అంజ‌లి పాటిల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి సంతోష్ నారాయ‌ణ్ సంగీతమందించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను మార్చి 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ర‌జ‌నీ, రంజిత్ కాంబినేష‌న్‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన 'క‌బాలి'.. ఆశించిన మేర‌కు విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. మ‌రి 'కాలా' అయినా.. అంచ‌నాల‌ను అందుకుని తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.క‌మ‌ల్‌కు జోడీగా న‌య‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:02

nayanర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, అజిత్‌, విక్ర‌మ్‌, సూర్య‌.. ఇలా త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీ క‌ట్టిన లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.. ఈ జాబితాలో మిగిలి ఉన్న మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తోనూ క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'భార‌తీయుడు' (1996) చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీలో క‌థానాయిక పాత్ర‌కు న‌య‌న‌తార పేరు ప‌రిశీలిస్తున్నార‌ని చెన్నై సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.మ‌ళ్ళీ వాయిదా ప‌డ‌నున్న '2.0'?

Updated By ManamTue, 01/30/2018 - 19:27

2.0ర‌జ‌నీకాంత్ అభిమానులే కాకుండా భార‌తీయ సినీ ప్రేమికులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం '2.0'. ద‌క్షిణాది అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రం నిర్మాణ వ్య‌వ‌హారాలు పూర్తిచేసుకున్నా.. వి.ఎఫ్‌.ఎక్స్ కార‌ణాల‌తో విడుద‌ల విష‌యంలో వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తోంది. తొలుత దీపావ‌ళికి వ‌స్తుంద‌నుకున్న సినిమా కాస్త‌.. జ‌న‌వ‌రి 26కి వాయిదా ప‌డింది. అక్క‌డితో ఆగ‌కుండా.. ఏప్రిల్‌కి పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న చెన్నై క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం మ‌రో మారు వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో 2, 3 నెల‌ల త‌రువాతే '2.0' తెర‌పైకి వ‌స్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించిన '2.0'లో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్వ‌రాలు అందించారు.ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ‘2.0’ టీజ‌ర్‌?

Updated By ManamSun, 01/28/2018 - 23:26

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌,  సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ చిత్రం ‘2.0’. ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. వేస‌వి కానుక‌గా ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల శంకర్  ట్విట్ట‌ర్‌లో ప్రకటించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ టీజ‌ర్ కార్యక్రమం జరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచార‌మ్‌. ఒకేసారి.. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన‌ టీజర్‌ల‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ న‌టుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మ‌ల‌యాళ అగ్ర‌తార‌లు మోహన్‌లాల్‌, మమ్ముట్టి కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

Related News