andrea

శ్రీరెడ్డి వివాదంపై నటి ఆండ్రియా స్పందన

Updated By ManamSat, 08/11/2018 - 12:27

Andrea, Sri Reddyసినీ ఇండస్ట్రీలో పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారిన శ్రీరెడ్డి వివాదంపై కోలీవుడ్ నటి, సింగర్ ఆండ్రియా స్పందించారు. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి చెప్పే విషయాలు నిజమైతే.. అలా చెప్పేందుకు కూడా ధైర్యం ఉండాలని ఆమె తెలిపింది. తనకు అలాంటి పరిస్థితులు ఎదురవలేదని, అలా ఎవరికి జరిగినా బయటి ప్రపంచానికి చెప్పడమే సరైన దారి అని, అలా చేసేవారిని శిక్షించాలని ఆండ్రియా తెలిపింది. కాగా గతంలో కోలీవుడ్‌లో సింగర్ సుచిత్ర సుచీ లీక్స్‌ పేరుతో హల్‌చల్ చేసింది. ఆ లీక్స్‌లో ఆండ్రియాకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.‘విశ్వరూపం 2’ రివ్యూ

Updated By ManamFri, 08/10/2018 - 13:07
Vishwaroopam 2

ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌:  రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌

ప్రెజెంట్స్: ఆస్కార్ ఫిలిమ్స్ వి. ర‌విచంద్ర‌న్‌

ఆర్టిస్ట్స్: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: గిబ్రాన్‌, 

లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, 

కెమెరా: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, 

ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, 

డైలాగ్స్: శశాంక్‌ వెన్నెలకంటి, 

ప్రొడ్యూస‌ర్స్: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, 

డైర‌క్ష‌న్‌: కమల్‌హాసన్‌. 

రిలీజ్ డేట్‌: 10.8.2018

క‌మ‌ల్‌హాస‌న్ అత్యంత ప్యాష‌న్‌తో తెర‌కెక్కించిన చిత్రం `విశ్వ‌రూపం`. ఆ సినిమా విడుద‌ల‌కు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కుందో తెలిసిందే. ఆ సినిమా క్లైమాక్స్ లోనే ఆయ‌న సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చారు. తొలి భాగం విడుద‌లైన నెల రోజుల్లోనే రెండో భాగం విడుద‌ల‌వుతుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు. ఎందుకంటే అప్ప‌టికే షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ విడుద‌ల‌కు మాత్రం ఐదు ఏళ్లు స‌మ‌యం ప‌ట్టింది. అయినా క‌మ‌ల్ అంతే ఆస‌క్తిగా ఆ సినిమాకు ప్ర‌మోష‌న్ చేశారు. ఇంత‌కీ తొలి సినిమా ఉన్నంత ఆస‌క్తిక‌రంగా రెండో సినిమా ఉంటుందా? జ‌స్ట్ హావ్ ఎ లుక్‌... 

 

క‌థ‌: 

రా ఏంజెట్ విసాద్ అహ్మ‌ద్‌(క‌మ‌ల్ హాస‌న్‌) .. అల్‌ఖైదాలో ఓమ‌ర్(రాహుల్ దేవ్‌) వేసిన ప్లాన్‌ను లండ‌న్‌లో భ‌గ్నం చేస్తాడు. అక్క‌డ నుండి ఇండియా వెళ్లే క్ర‌మంలో ఓమ‌ర్ మ‌రో ప్లాన్ వేశాడ‌నే సంగ‌తి తెలిస్తుంది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇంగ్లాండ్‌లో మునిగిపోయిన అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేస్తే... అవి పేలి.. పెద్ద సునామీ వ‌చ్చి.. లండ‌న్ న‌గ‌రం నాశ‌నం అయిపోతుంది. కాబ‌ట్టి అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేయాల‌నేది ఓమ‌ర్ ఆలోచ‌న‌. దాన్ని ప‌సిగ‌ట్టిన విసాద్ స‌ముద్రంలోకి త‌న భార్య నిరుప‌మ స‌హాయంతో ఆ ప్లాన్ స‌క్సెస్ కాకుండా అడ్డుకుంటాడు. అక్క‌డ నుండి ఇండియా చేరుకున్న విసాద్ త‌న పై అధికారుల‌ను క‌లిసే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా.. అత‌ని భార్య‌, అసిస్టెంట్ ఆశ్రిత‌, త‌ల్లిని ఓమ‌ర్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అప్పుడు విసాడ్ ఏం చేస్తాడు?  అస‌లు ఓమర్ ప్లాన్ ఏంటి? ఇండియాలో ఓమ‌ర్ వేసిన ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

- క‌మ‌ల్ హాస‌న్ స‌హా ఇత‌ర న‌టీన‌ట‌ల ప‌నితీరు

- నిర్మాణ విలువ‌లు

- కెమెరా వ‌ర్క్‌

- సీజీ వ‌ర్క్‌

 మైన‌స్ పాయింట్స్‌:

- సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువ‌గా ఉండ‌టం

- ఎడిటింగ్‌

- నేప‌థ్య సంగీతం

- క‌న్‌ఫ్యూజ‌న్ చేసేలా ఉండ‌టం

Vishwaroopam

విశ్లేష‌ణ‌:

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తూనే.. సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. విశ్వ‌రూపం పార్ట్ వ‌న్‌లో ప్రేక్ష‌కుల‌కు చాలా ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. అయితే పార్ట్ వ‌న్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక సీక్వెల్‌లో పార్ట్ వ‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌న్నింటినీ క్లియ‌ర్ చేసినా.. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. యాక్ష‌న్‌సీన్స్ లో క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి డూప్‌లేకుండా చ‌క్క‌గా న‌టించారు. అయితే యాక్ష‌న్ పార్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎక్క‌డా అనిపించ‌దు. ఫ‌స్టాఫ్‌లో లండ‌న్ స‌ముద్రంలోని స‌న్నివేశాల్లోని సీజీ వ‌ర్క్ బావుంది. కానీ అస‌లు ఇండియాలో సినిమా స్టార్ట‌వుతుంద‌ని అనుకున్న ప్రేక్ష‌కుడికి సినిమా ఎటువెళుతుందో అనే సందేహం మొద‌ల‌వుతుంది. ఇక ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. స‌న్నివేశాలు ల్యాగ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ రాజ ఏజెంట్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. పూజా కుమార్ పార్ట్ వ‌న్ కంటే దీంట్లో గ్లామ‌ర్ శాతం పెంచారు. ఆండ్రియా యాక్ష‌న్ సీన్స్‌కే ప‌రిమితం అయ్యింది. మొత్తంగా చూస్తే.. పార్ట్ వ‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో  విశ్వ‌రూపం 2 కి వ‌చ్చిన ప్రేక్ష‌కులు నిరాశ‌ను మిగిలుస్తుంది

చివ‌ర‌గా.. విశ్వ‌రూపం 2.. ఆస‌క్తి త‌గ్గింది 

రేటింగ్‌: 2.5/5కాంబ్లి దంపతులపై బాలీవుడ్ సింగర్ కేసు

Updated By ManamMon, 07/02/2018 - 10:57

vinod టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి మరోసారి వార్తల్లో నిలిచారు. వినోద్ కాంబ్లీ, భార్య ఆండ్రియా హెవిత్ బాలీవుడ్ సింగర్  అంకిత్ తివారి తండ్రిపై చేయి చేసుకున్నట్లు అతడి కుటుంబం కేసు నమోదు చేసింది. అయితే దీనిని ఖండించిన కాంబ్లి దంపతులు తివారీ కుటుంబంపై తిరిగి కేసును నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం ఓ మాల్‌లో కాంబ్లి దంపతులు షాపింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ కాంబ్లి భార్య ఆండ్రియా అంకిత్ తివారీ తండ్రి రాజ్ కుమార్‌ను తన బ్యాగ్‌తో కొట్టింది. దీని గురించి కాంబ్లీ మాట్లాడుతూ..‘‘3గంటల సమయంలో మేము మాల్‌లో ఉన్నాం. ఆ సమయంలో ఓ వ్యక్తి నా భార్యను తాకాలని చూశాడు. నా భార్య అది గమనించేలోపు అతడు ఆమెకు దూరంగా నెట్టేశాడు.

ఆ తరువాత కాసేపటికి మేమిద్దరం ఫుడ్ కోర్టులో ఉండగా ఆ వ్యక్తి కుమారులు నా భార్యపై మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నించారు’’ అంటూ తెలిపారు. కాగా దీనిపై తివారీ కుటుంబం మరో విధంగా స్పందించింది. ‘‘దాడి జరిగిన కాసేపటి వరకు తమ తండ్రికి ఏమి జరిగిందో అర్థం కాలేదని, అసలు ఆమె ఎందుకు కొట్టిందో కూడా తెలీదని, ఈ విషయం గురించి మాట్లాడేందుకు మేము వెళితే కాంబ్లి భార్య తనపై దాడి చేసేందుకు చెప్పును తీసింది’’ అంటూ అంకిత్ సోదరుడు అంకూర్ తివారీ తెలిపారు. కాగా ఈ ఘటన తరువాత ఒకరిపై మరొకరు కేసును నమోదు చేసుకున్నారు.‘విశ్వరూపం 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Updated By ManamMon, 06/11/2018 - 09:13

Vishwaroopam స్వీయ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో మంచి విజయం సొంతం చేసుకున్న ‘విశ్వరూపం’ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పలు కారణాల వలన విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే గతేడాది ఈ చిత్ర విడుదలకు ఓకే చెప్పడంతో అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్.

ఆగష్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తెలుగు, తమిళ్, హిందీలో ఈ చిత్రం విడుదల కానుండగా.. ట్రైలర్‌ సోమవారం విడుదల కానుంది. హిందీలో ఆమిర్ ఖాన్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో శృతీ హాసన్ ఈ చిత్ర ట్రైలర్‌లను విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. గిబ్రాన్ సంగీతాన్ని అందించాడు.'విశ్వ‌రూపం 2' ట్రైల‌ర్ అప్‌డేట్‌

Updated By ManamThu, 03/01/2018 - 22:03

viswaroopam 2లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించ‌డ‌మే కాకుండా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం 'విశ్వ‌రూపం'. ఐదేళ్ళ క్రితం విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొన‌సాగింపుగా మ‌రో సినిమా రాబోతోంది. అదే 'విశ్వ రూపం 2'. ఆండ్రియా, పూజా కుమార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.'గృహం' రివ్యూ 

Updated By ManamFri, 11/17/2017 - 11:43

చిత్రంః గృహం
న‌టీన‌టులుః సిద్ధార్థ్‌, ఆండ్రియా, సురేష్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అనీషా ఎంజెలీనా త‌దిత‌రులు
సంగీతంః గిరీష్ వాసుదేవ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణంః శ్రేయాస్ కృష్ణ‌
ఎడిటింగ్ః లారెన్స్ కిషోర్‌
స్క్రీన్ ప్లేః మిలింద్ రావ్‌, సిద్ధార్థ్‌
నిర్మాతః సిద్ధార్థ్‌
నిర్మాణ సంస్థ‌లుః వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఇటాకి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ద‌ర్శ‌క‌త్వంః మిలింద్ రావ్‌
విడుద‌ల తేదిః నవంబ‌ర్ 17, 2017

'ఒక అమ్మాయిని బ‌లి ఇస్తేనే, ఒక మ‌గ పిల్లాడు పుడ‌తాడు అని అనుకుంటే.. అలాంటి మ‌గ‌వాడు అక్క‌ర్లేదు..' ఇది 'గృహం' సినిమాలోని మెయిన్ పాయింట్‌. సిద్ధార్థ్‌, ఆండ్రియా జంట‌గా అవుట్ అండ్ అవుట్ హార‌ర్ మూవీగా తెర‌కెక్కిన 'గృహం' శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా త‌మిళంలో ఇప్ప‌టికే 'అవ‌ళ్' పేరుతో విడుద‌లై విజ‌యం సాధించింది. ఈ సినిమాపై 'మ‌నం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థ‌

gruham reviewఓపెన్ చేస్తే.. 1934లో బ్రిటీష్ ఆక్ర‌మిత భార‌తీయ‌ ప్రాంతం. అక్క‌డ చైనాకి చెందిన ఓ త‌ల్లి, కూతురు ఓ భ‌వంతిలో ఉంటుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంటుంది. అప్ప‌టికే ఆ చైనా మ‌హిళ క‌డుపుతో ఉంటుంది. స‌డెన్‌గా ఓ రోజు..   ఆ ఇంటి నుంచి పెద్ద అరుపు. క‌ట్ చేస్తే.. డాక్ట‌ర్ కృష్ణ‌కుమార్ (క్రిష్‌), ల‌క్ష్మీ (ఆండ్రియా)ల ప్రేమ‌క‌థ‌తో 2016లోకి క‌థ ఎంట‌ర్ అవుతుంది. పెళ్లిచేసుకున్న‌ ఈ ఇద్ద‌రూ హిమాల‌య ప‌ర్వ‌తంలో ఉన్న అదే ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిలోకి వ‌స్తారు. ఇక చైనా వాళ్లు ఉన్న ఆ ఇంటిలోకి ఓ ఫ్యామిలీ దిగుతుంది. పాల్ (అతుల్ కుల‌క‌ర్ణి), అత‌ని రెండో భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఆ ఇంటిలోకి వ‌స్తారు. ఆ ఇద్ద‌రు కూతుళ్లులో టీనేజ‌ర్ అయిన జెన్నీ (అనీషా) మొద‌టి భార్య కూతురు. చిన్న పాప సారా రెండో అమ్మాయి. క్ర‌మంగా.. రెండు కుటుంబాల మ‌ధ్య రిలేష‌న్ స్టార్ట్ అవుతుంది. క్రిష్‌ని చూసి ఇంప్రెస్ అయిన జెన్నీ.. అత‌నితో చ‌నువుగా ఉండ‌టం స్టార్ట్ చేస్తుంది. క్రిష్ మాత్రం చిన్న‌పిల్లేన‌ని ఆమెని లైట్ తీసుకుంటాడు. ఇదిలా ఉంటే.. జెన్నీ కొన్ని సంద‌ర్భాల్లో వింత‌వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటుంది.  కంజూరింగ్ చేయ‌డం వ‌ల్ల తెలిసొచ్చే విష‌య‌మేమిటంటే.. జెన్నీలో చైనాకి చెందిన లీజింగ్ అనే ఆవిడ ఆత్మ ఉంద‌ని. లీజింగ్ ఆత్మ జెన్నీకి ఎందుకు టార్గెట్ చేసుకుంది?  అలాగే ఈ క‌థ‌లో 'లూ వే' ఎవ‌రు? అత‌నికి, క్రిష్‌కి ఉన్న సంబంధమేమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేష‌ణ‌
ద‌ర్శ‌కుడు మిలింద్ రావ్.. 'గృహం'ని చాలా బాగా తీర్చిదిద్దాడు. హార‌ర్ కామెడీల పేరిట ఈ మ‌ధ్య వ‌రుస‌గా వ‌స్తున్న అర్థం ప‌ర్థం లేని సినిమాల మ‌ధ్య‌.. ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ హార‌ర్ మూవీగా తెర‌కెక్కించి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. దానికి తోడు అత‌నికి క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టులు, మంచి సాంకేతిక నిపుణులు దొర‌క‌డంతో.. హాలీవుడ్ స్థాయి క్వాలిటీ సినిమాకి వ‌చ్చింది. ముఖ్యంగా విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, ఛాయాగ్ర‌హ‌ణం, సౌండ్ ఎఫెక్ట్స్‌ సినిమాని ఓ స్థాయికి తీసుకెళ్ళాయి. హిమాల‌య ప్రాంతాన్ని నేప‌థ్యంగా తీసుకోవ‌డం, చైనీయుల నేప‌థ్యంలో ఈ హార‌ర్ సినిమాని మ‌ల‌చ‌డం బాగా క‌లిసొచ్చింది. జెన్నీని లీజింగ్ ఆత్మ ఆవ‌హించిన ఇంట్ర‌వెల్‌ సంద‌ర్భం.. ప‌తాక స‌న్నివేశాల్లో సిద్ధార్థ్ న‌ట‌న సినిమాకి ప్ల‌స్ పాయింట్స్‌గా నిలుస్తాయి.  అయితే.. ఈ సినిమాని కుటుంబ స‌మేతంగా చూడ‌డం మాత్రం క‌ష్ట‌మే. ఎందుకంటే.. సినిమాలో అడ‌ల్ట్ కంటెంట్‌ చెప్పుకోద‌గ్గ స్థాయిలోనే ఉంది. ఇక  ఒక‌ట్రెండు స‌న్నివేశాలు అయితే.. చ‌దువు వ‌చ్చిన వారి కోస‌మే అన్న‌ట్లుగా.. మాట‌లు లేకుండా.. సైకియాట్రిస్ట్ ప్ర‌సాద్ (సురేష్‌) మైండ్‌లో ఉండే మాట‌ల్ని అక్ష‌రాల రూపంలో స్క్రీన్‌పై చూపించారు. అయితే సీన్ వైజ్ అది బాగుంది.  ఏదీఏమైనా.. ద‌క్షిణాదిలో ఈ స్థాయి హార‌ర్ మూవీని చూసి ఉండం. మ‌న‌కు కూడా హాలీవుడ్ స్థాయి  సాంకేతిక నిపుణులు ఉన్నార‌న్న విష‌యాన్ని ఈ సినిమా తెలియ‌జెప్పింద‌నే చెప్పాలి. 

న‌టీన‌టులు - సాంకేతిక నిపుణుల ప‌నితీరు
ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు తెలిసిన సిద్ధార్థ్ వేరు.. ఈ సినిమాలోని సిద్ధార్థ్ వేరు. ఒక వైపు రొమాంటిక్ సీన్స్‌లో ఎంత బాగా న‌టించాడో.. పాత్ర‌కి త‌గ్గ‌ట్టు అన్ని మూడ్స్‌ని చ‌క్క‌గా ప‌లికించాడు. చాలా రోజుల త‌రువాత అత‌నిలోని మంచి న‌టుడిని ఈ సినిమా చూపించింది. ప‌తాక స‌న్నివేశాల్లో అత‌ని న‌ట‌న మెప్పించేలా ఉంది. ఆండ్రియాది న‌ట‌న‌కి స్కోప్ ఉన్న పాత్ర కాదు. అలాగ‌ని తీసిపారేసే పాత్ర కూడా కాదు. అయితే.. ఆమె గ్లామ‌ర్ ఈ సినిమాకి ప్ల‌స్‌గా నిలిచింది. జెన్నీ పాత్ర‌లో అనీషా యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టింది. కొన్ని స‌న్నివేశాల్లో భ‌య‌పెట్టింది కూడా. సైకియాట్రిస్ట్ పాత్ర‌లో సురేష్ న‌ట‌న స‌హ‌జంగా ఉంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఆయ‌న చేసిన పాత్ర‌ల్లో బ‌హుశా ఇదే బెస్ట్‌, డీసెంట్ అని చెప్పాలి. సినిమాలో కామెడీ లేక‌పోయినా.. అత‌నికి, సిద్ధార్థ్‌కి మ‌ధ్య న‌డిచే సంభాష‌ణ‌లు కాస్త రిలీఫ్ ఇస్తాయి. జెన్నీలో ఆత్మ నిజంగానే ఉంద‌ని తెలిసిన‌ప్పుడు సురేష్ న‌ట‌న బాగుంది.  అతుల్ కుల‌క‌ర్ణితో పాటు చైనా న‌టులు కూడా మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. ఏ ఒక్క పాత్ర కూడా వేస్ట్‌గా ఉందనే ఫీల్ ని క‌లిగించ‌లేద‌నే చెప్పాలి.
సాంకేతికంగా 'గృహం' ఉన్న‌తంగా ఉంది. గిరీష్ వాసుదేవ‌న్ సంగీతం సినిమాకి మేజ‌ర్ ప్ల‌స్‌. నేప‌థ్య సంగీతం వెంటాడేలా ఉంటుంది. చాలా స‌న్నివేశాల‌ను అత‌ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. శ్రేయాస్ క్రిష్ణ ఫొటోగ్ర‌ఫీ ఈ సినిమాకి మ‌రో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్‌. సినిమాని హాలీవుడ్ స్థాయిలో చూపించ‌డంలో ఆయ‌న కెమెరా ప‌నిత‌నం వ‌ర్క‌వుట్ అయ్యింది. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.  'మా అమ్మ చెబుతుండేది.. దీపం వెలిగించ‌డానికి తైలం ఉండాలి.. కానీ వెలుగు చూడాలంటే న‌మ్మ‌కం ఉండాలి', 'నాకు, ఈ ఇంటికి ఇంకో ఛాన్స్ ఇస్తావా?',  'కూర్చున్న చోట చావ‌డం కంటే బ‌య‌ట‌కివెళ్లి ఏదైనా ఫేస్ చేయ‌డం బెస్ట్‌', 'అమ్మాయిని చంపితేనే ఒక మ‌గ పిల్లాడు పుడ‌తాడంటే అలాంటి మ‌గ‌వాడు నాకు అక్క‌ర్లేదు', 'అన్ని ఆత్మ‌లు దైవానికి విరుద్ధం కాదు.. కానీ ఆ ఆత్మ అందుకు విరుద్ధంగా ఉంది' వంటి డైలాగులు బాగున్నాయి.  నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
న‌టీన‌టులు
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
హిమ‌ల‌యాలు, చైనీయుల నేప‌థ్యం
కాన్సెప్ట్‌
ఛాయాగ్ర‌హ‌ణం
సౌండ్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌
డైరెక్ష‌న్‌

మైన‌స్ పాయింట్స్‌
స్లో నెరేష‌న్‌
స‌గ‌టు ప్రేక్ష‌కుడు కోరుకునే కామెడీ లేక‌పోవ‌డం

చివ‌ర‌గా.. హాలీవుడ్ రేంజ్ 'గృహం'
రేటింగ్‌.. 3/5                                                                              -మ‌ల్లిక్ పైడిమ‌హేష్ సినిమాలో ఆండ్రియా పాట‌

Updated By ManamSun, 11/12/2017 - 13:50

andrea'శ్రీ‌మంతుడు' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. కాగా, ఈ సినిమాలో ప్ర‌ముఖ గాయ‌ని, న‌టి ఆండ్రియా ఓ పాట పాడింది. తాజాగా ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా చెప్పుకొచ్చింది. ఇదివ‌ర‌కు తెలుగులో ఆమె పాడిన పాట‌ల్లో 'రాఖీ' సినిమాలోని 'జ‌ర‌జ‌ర' పాట బాగా ఫేమ‌స్ అయ్యింది.  ఏప్రిల్ 27న 'భ‌ర‌త్ అనే నేను' విడుద‌ల కానుంది.'గృహం' మ‌రోసారి వాయిదా?

Updated By ManamWed, 11/08/2017 - 12:08

gruhamసిద్ధార్థ్, ఆండ్రియా జంట‌గా న‌టించిన హార‌ర్ చిత్రం 'గృహం'. మిలింద్ రావ్ ద‌ర్శ‌కుడు. త‌మిళంలో 'అవ‌ళ్' పేరుతో న‌వంబ‌ర్ 3న విడుద‌లైన ఈ సినిమాకి మంచి టాక్ వ‌చ్చింది. అయితే అదే రోజున తెలుగులో రావాల్సిన ఈ సినిమా.. థియేట‌ర్ల కొర‌త కార‌ణంగా నవంబ‌ర్ 10కి వాయిదా ప‌డింది. అయితే.. ఆ రోజు కూడా ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని వినిపిస్తోంది. ఈ సారి కూడా థియేట‌ర్ల స‌మ‌స్య ఉంద‌ని.. అందువ‌ల్ల న‌వంబ‌ర్ 17కి ఈ సినిమా వాయిదా ప‌డింద‌ని స‌మాచార‌మ్. న‌వంబ‌ర్ 9న విజ‌య్ త‌మిళ అనువాద చిత్రం 'అదిరింది' విడుద‌ల కానుండ‌గా.. 10న మంచు మ‌నోజ్ 'ఒక్కడు మిగిలాడు'తో పాటు విశాల్ త‌మిళ అనువాద చిత్రం 'డిటెక్టివ్' కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాల‌న్నీ కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. అందుకే 'గృహం'కి థియేట‌ర్ల స‌మ‌స్య త‌ప్ప‌లేద‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌.'గృహం' వాయిదా ప‌డింది

Updated By ManamThu, 11/02/2017 - 15:04

gruham'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'బొమ్మ‌రిల్లు' చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న క‌థానాయ‌కుడు సిద్ధార్థ్‌. గ‌త కొంత‌కాలంగా తెలుగు సినిమాల‌కు దూర‌మైన సిద్ధార్థ్.. 'గృహం'తో చాన్నాళ్ల త‌రువాత ఇక్క‌డివారిని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. తెలుగుతో పాటు త‌మిళ్, హిందీలోనూ రూపొందిన ఈ చిత్రం హ‌ర్ర‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కింది.  త‌మిళంలో 'అవ‌ళ్‌', హిందీలో 'ది హౌస్ నెక్ట్స్ డోర్' పేర్ల‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళ్‌, హిందీ భాష‌ల్లో రేపు విడుద‌ల కానున్న ఈ సినిమా.. తెలుగులో కూడా అదే రోజున ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల న‌వంబ‌ర్ 10కి వాయిదా ప‌డింది. మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆండ్రియా ప్ర‌ధాన పాత్ర పోషించింది.నవంబర్ 3న సిద్ధార్థ్‌ 'గృహం' విడుదల

Updated By ManamWed, 10/25/2017 - 19:29

gruham movieసిద్ధార్థ్‌, ఆండ్రియా జంట‌గా రూపొందిన హారర్‌ చిత్రం 'గృహం'. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. సిిద్ధార్థ్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై  నిర్మిత‌మైన‌ ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, సిద్ధార్థ్‌, తమన్‌ ఎస్‌.ఎస్‌, డైరెక్టర్‌ మిలింద్‌ రావ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను ప్రదర్శించారు. నేచురల్‌ స్టార్‌ నాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా... హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ - ''నాకు హారర్‌ జోనర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. హారర్‌ చిత్రాలకు హీరో అవసరం ఉండదు. భయమనే ఎలిమెంటే హీరో. కొత్తగా చేయాలని ఆలోచనతో ఈ సినిమాపై వర్క్‌ చేసి సినిమా చేస్తున్నాం. హారర్‌ సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. సినిమాను రెండు వందల మంది స్నేహితులకు చూపించి, ఎక్కడెక్కడ ప్రేక్షకుల భయపడతారు? ఎక్కడ భయపడరు? అనే విషయాలను చూసుకుని కరెక్ట్‌ చేసుకుని సినిమా తెరకెక్కిస్తూ వచ్చాం. నాలుగున్నరేళ్లు సినిమా స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశామంటే మేం పడ్డ కష్టం అర్థం చేసుకోవాలి. గిరీష్‌ చాలా మంచి సంగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. నాకు, మిలింద్‌గారికి రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఎంతో ఇష్టం. హారర్‌ సినిమాలకు గాడ్‌ఫాదర్‌ అయిన ఆయన డైరెక్ట్‌ చేసిన 'దెయ్యం', 'భూత్‌' సినిమాల తర్వాత ఆ రేంజ్‌ను ఏ సినిమాలు రీచ్‌ కాలేదు. మా సినిమా రీచ్‌ అవుతుందని మేం అనుకుంటున్నాం. 'బొమ్మరిల్లు' సినిమాలో 'మొత్తం మీరే చేశారు' అనే డైలాగ్‌కు ఎంత మంచి రెస్పాన్స్‌ వచ్చిందో.. రేపు ఈ సినిమాకు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది. ఒక డాక్టర్‌ తన భార్యతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళతాడు. వాళ్లుండే పక్కింట్లో మరో ఫ్యామిలీ ఉంటుంది. అందులో ఓ అమ్మాయి కారణంగా వచ్చే సమస్యలే ఈ సినిమా ప్రధానమైన కథ. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే బాగానే సినిమాను ఆస్వాదిస్తారు. భయానికి భాష అక్కర్లేదు కాబట్టి, ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీ నన్ను హీరోగా ఎంతో బాగా ఆదరించింది. తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యమై ఉండొచ్చు కానీ, మిస్‌ మాత్రం కాను'' అన్నారు.

చిత్ర దర్శకుడు మిలింద్‌ రావ్‌ మాట్లాడుతూ - ''నేను, సిద్ధార్థ్‌ మణిరత్నంగారి వద్ద ఒకేసారి అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా జాయినయ్యాం. మాది 16 ఏళ్ల స్నేహం. నాకు హారర్‌ జోనర్‌ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్‌ మూవీ కావాలని..నాలుగున్నరేళ్లు కష్టపడి స్క్రిప్ట్‌ తయారు చేశాం. ప్రతి సీన్‌ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆడియెన్స్‌ చూడనటువంటి థ్రిల్స్‌ సినిమాలో ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది కొత్త దర్శకులను ఆదరించారు. నన్ను కూడా అలాగే ఆదరిస్తారని కోరకుంటున్నాను'' అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''నేను 'ఎంసీఏ' సినిమా షూటింగ్‌ చేస్తూ వరంగల్‌లో ఉండగా, 'అవళ్‌' అనే తమిళ సినిమా ట్రైలర్‌ చూసి భయపడ్డాను. రెండు రోజుల తర్వాత సిద్ధు.. అదే సినిమా తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను నాకు పంపాడు. మిలింద్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇండియాలో ఇటువంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. నెంబర్‌ వన్‌ హారర్‌ మూవీ అవుతుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది. రామ్‌గోపాల్‌వర్మ స్టయిల్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్టుంది. 'దెయ్యం', 'కాంజురింగ్‌' సినిమాలు తర్వాత ఆ రేంజ్‌లో నాకు భయాన్ని క్రియేట్‌ చేసిన సినిమా ఇది. సినిమా హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కొడుతుంది. సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.తమన్‌ మాట్లాడుతూ - ''బాయ్స్‌ సినిమాలో నేను, సిద్ధార్థ్‌ కలిసి నటించాం. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి 16 ఏళ్లవుతుంది. సిద్ధార్థ్‌ తనను తాను ప్రూవ్‌ చేసుకుంటూ హీరోగా ఎదిగాడు. అలాగే నేను కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాను. సిద్ధార్థ్‌కి సినిమాలంటే పిచ్చి. తను ఎంబీఏ చదివి..లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నా, అవన్నీ కాదని సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయినయ్యాడు. దేశం గర్వించే నటులు అమీర్‌ ఖాన్‌ సహా ఎంతో మందితో కలిసి నటించాడు. తను నటించిన 'జబర్‌దస్త్‌' సినిమాకు నేను మ్యూజిక్‌ చేశాను. ఈ సినిమా విషయానికి వస్తే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. భయపెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాకు మ్యూజిక్‌ చేయడం సాధారణమైన విషయం కాదు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ముఖ్యంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌కు చాలా మంచి పేరొస్తుంది. సినిమా పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ మాట్లాడుతూ - ''తొలిసారి తెలుగులో నేను సంగీతం అందించిన చిత్రమిది. పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా కుదిరింది. రెహమాన్‌గారు మంచి సాహిత్యాన్ని అందించారు. తమిళం కంటే తెలుగు సాహిత్యం అద్భుతంగా ఉంది. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ హారర్‌ మూవీగా ఇది నిలిచిపోతుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా ఉంటుంది. మిలింద్‌ రావ్‌ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చి నాతో మ్యూజిక్‌ చేయించుకున్నారు'' అన్నారు.

Related News