Postponed

జగన్ ప్రజా సంకల్పయాత్ర వాయిదా!

Updated By ManamFri, 11/02/2018 - 11:13
YS Jagan padayatra postponed to November 10th

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మరోసారి వాయిదా పడనున్నట్లు సమాచారం. కత్తి దాడిలో జగన్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆ గాయం ఇంకా తగ్గని కారణంగా ...పాదయాత్ర మరో వారం పాటు వాయిదాపడే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి వైఎస్ జగన్... పాదయాత్రను పున:ప్రారంభిస్తారని ఆ పార్టీ ప్రకటన చేసినా... ఆయన ఇంకా కోలుకోనందున ...నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన గాయం ఇంకా మానలేదని, కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాకుండా ఒకవేళ జగన్ బయటకు వెళితే ...భూజానికి  ఏమీ తగలకుండా... జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు.వాయిదా పడనున్న ‘యన్‌టిఆర్’..?

Updated By ManamWed, 10/31/2018 - 10:40

NTRనటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యన్‌టిఆర్-కథానాయకుడు’, ‘యన్‌టిఆర్-మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ చరిత్రను, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

ఇక మొదటి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9, రెండో భాగాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24వ తేదిన విడుదల చేయనున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రెండో భాగం విడుదలను వాయిదా వేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మొదటి భాగం తరువాత రెండో భాగ ప్రమోషన్లలో సమయం తక్కువగా ఉన్నందున ఫిబ్రవరికి యన్‌టిఆర్-మహానాయకుడును వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.ఆ కేటగిరిని వాయిదా వేసిన ఆస్కార్

Updated By ManamFri, 09/07/2018 - 14:43

Oscar అంతర్జాతీయ అకాడమీ అవార్డ్స్‌ ఆస్కార్‌లో ఇటీవల చేర్చిన ఔట్‌స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ ఇన్ పాపులర్ ఫిలిం కేటగిరిని వాయిదా వేశారు. ఎలాంటి విమర్శలు లేకుండా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన చిత్రానికి గానూ ఈ అవార్డును ఇవ్వాలని అనుకున్నారు. రానున్న ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ కేటగిరీని పెట్టాలనుకున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేటగిరిని వాయిదా వేస్తున్నట్లు ఆస్కార్ ఫిలిం అకాడమీ అధ్యక్షుడు జాన్ బైలీ వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో మంచి కాన్సెప్ట్‌లతో వస్తున్న సినిమాలకు గుర్తింపు ఇవ్వడానికే ఈ కేటగిరీని పెట్టామని, చాలామందికి ఆ కేటగిరీకి ఉన్న విలువ అర్థం చేసుకోలేకపోయారని జాన్ ఈ సందర్భంగా తెలిపారు.చంద్రయాన్-2 మరోసారి వాయిదా

Updated By ManamMon, 08/06/2018 - 02:18

imageన్యూఢిల్లీ: చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగం జరపడమే ఉద్దేశంగా ప్రారంభించిన చంద్రయాన్-2 ప్రయోం మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ చంద్రయాన్-2ను ప్రయోగించాలని ఇస్రో భావించినా.. వివిధ సాంకేతిక కారణాలతో ఈ ఏడాది అక్టోబరుకు వాయిదా పడింది. అయితే.. ఇస్రో ప్రయోగించిన జీశాట్-6ఏ, జీశాట్-11 ఉపగ్రహాల ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్-2 ప్రయోగాన్ని వాయిదా వేయాలని, వచ్చే ఏడాది జనవరిలో ప్రయోగించాలనే భావనలో ఇస్రో ఉన్నట్లు తెలుస్తోంది.డీఎస్సీ నోటిఫికేషన్ మళ్లీ వాయిదా

Updated By ManamFri, 07/06/2018 - 11:51

Ganta Srinivasa Rao అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేదువార్త చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు గంటా తెలిపారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

‘‘డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆర్థిక శాఖ మరిన్ని వివరాలు కావాలని అడిగింది. వాటికి సమాధానం ఇచ్చాం. త్వరలో అనుమతి రావొచ్చు. బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్‌సీటీఈ విడుదల చేసిన గెజిట్‌పై కూడా చర్చిస్తున్నాం. టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం’’ అని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు.

కాగా జులై 6న 10,351 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అంతకుముందు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీఎస్సీ కోసం పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయకపోవడంతో ఈ నోటిఫికేషన్‌ వాయిదా వేయాల్సి వచ్చింది.‘ఆఫీసర్’ విడుదల వాయిదా

Updated By ManamWed, 05/16/2018 - 09:29

officer నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఆఫీసర్’. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. జూన్ 1న ఆఫీసర్ విడుదల కానుందని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు. 

సాంకేతికంగా ఆఫీసర్ చిత్రానికి మరిన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని అందుకే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. కాగా 25 సంవత్సరాల తరువాత వర్మ, నాగార్జున కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

 

 కాలా టీజర్ వాయిదా

Updated By ManamThu, 03/01/2018 - 08:51

Kaala సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'కాలా'. ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆ మధ్యన ప్రకటించింది. అయితే శ్రీదేవి, జయేంద్ర సరస్వతి ఆకస్మిక మరణాల నేపథ్యంలో టీజర్‌ విడుదలను వాయిదా వేశారు. మార్చి 2న అంటే శుక్రవారం కాలా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

మాఫియా డాన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన హ్యామా ఖురేషి నటిస్తోంది. నానా పటేకర్, అంజలి పాటిల్, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. 'కబాలి' ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు.

Related News