premam

సాయిప‌ల్ల‌వి, నాగ‌శౌర్య మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

Updated By ManamTue, 03/06/2018 - 17:40

sai pallaviహీరోహీరోయిన్ల మ‌ధ్య ఇగో స‌మ‌స్య‌లు ఉంటే.. అది సినిమా ప్ర‌చారానికి ఎంత ఇబ్బందిగా మారుతుందో చెప్పే ఘ‌ట‌న ఇది. ఆ హీరోహీరోయిన్లు మ‌రెవ‌రో కాదు.. 'ఛ‌లో'తో తాజాగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌.. 'ఫిదా', 'ఎంసీఏ' చిత్రాల ఘ‌న‌విజ‌యాల‌తో మంచి స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. 'ఛ‌లో' ప్ర‌మోష‌న్స్ నుంచి నాగ‌శౌర్య త‌న‌ కో స్టార్ సాయిప‌ల్ల‌విపై నెగెటివ్‌గా ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టాడు. అది కాస్తా పెరిగి పెద్ద‌దై.. అత‌ను ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం మానేయ్య‌డంతో.. ఈ విష‌యం కాస్త టాలీవుడ్‌లో పెద్ద దుమార‌మే రేపుతోంది ఇప్పుడు.

kanamఈ వ్య‌వ‌హారానికి సంబంధించి వివ‌రాల్లోకి వెళితే.. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్‌. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మిళంలో ‘కరు’ పేరుతో.. తెలుగులో ‘కణం’ పేరుతో ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌ధానంగా ఇది హీరోయిన్ సెంట్రిక్ స‌బ్జెక్ట్‌. 'ప్రేమ‌మ్‌'తో ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డ్డ సాయిప‌ల్ల‌విని ఏరికోరి ఈ సినిమాకి ఎంచుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. నాలుగేళ్ళ పాప‌కి త‌ల్లిగా న‌టించ‌డ‌మ‌నేది రిస్క్ అయినా.. క‌థ నచ్చి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది సాయిప‌ల్ల‌వి. త‌మిళంలో ఆమెకి ఇదే తొలి సినిమా. తెలుగులో అప్ప‌టికే 'ఫిదా' విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అదే స‌మ‌యంలో.. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం నాగ‌శౌర్య‌ని సంప్ర‌దించింది చిత్ర యూనిట్‌. అప్ప‌టికే తెలుగులో కొన్ని సినిమాలు చేసినా.. వాటిలో ఒక‌ట్రెండు హిట్‌ చిత్రాలున్నా.. నాగ‌శౌర్య‌కి పెద్ద క్రేజ్ లేదు. ఆ స‌మ‌యంలో రెండు భాష‌ల్లో సినిమా అనేస‌రికి నాగ‌శౌర్య ఈ సినిమాని వెంట‌నే అంగీక‌రించాడు. అలాగే శౌర్య‌కి ఇదే తొలి త‌మిళ చిత్రం.

sai pallavi ఈ సినిమా నిర్మాణంలో ఉండ‌గానే 'ఫిదా' విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో సినిమా క‌థ ప్ర‌కారం.. అలాగే సాయికున్న క్రేజ్ ప్ర‌కారం మొద‌ట్నుంచి ప్ర‌చారంలో హీరోయిన్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చింది చిత్ర యూనిట్‌. అయితే.. అస‌లే ఇగో ఫీలింగ్స్ ఎక్కువ‌గా ఉండే నాగ‌శౌర్య.. త‌న‌కు పెద్ద‌గా క్రేజ్ లేద‌నే ఒకే ఒక కార‌ణంతో ఈ విష‌యంలో మౌనంగా ఉండిపోయాడు.

sai pallaviఅయితే తాజాగా త‌న సొంత చిత్రం 'ఛ‌లో' ప్ర‌మోష‌న్స్‌లో మాత్రం సాయి ప‌ల్ల‌విపై నెగెటివ్‌గా ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టాడు. సాయిపల్లవి షూటింగుకు సమయానికి వచ్చేది కాదని.. దాని వ‌ల‌న తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదంటూ తన అసహనాన్ని బహిరంగంగానే వెల్ల‌బుచ్చాడు. ఇక 'ఛ‌లో' హిట్‌తో అత‌ని వైఖ‌రి పూర్తిగా మారిపోయింది. అప్ప‌టికే ఒప్పుకున్న కొన్ని సినిమాల‌ను హోల్డ్‌లో పెట్టేశాడు అని కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అదేవిధంగా 'క‌ణం' ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వ‌డం మానేశాడు. ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా ఆడ‌డం క‌ష్ట‌మ‌ని.. హిట్ అయ్యే అవ‌కాశాలు లేని సినిమా కోసం త‌ను ప్ర‌చారం చేయ‌డం వేస్ట్ అని నాగ‌శౌర్య ఈ మూవీని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

sai pallaviఇక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ముందస్తు విడుదల వేడుకకి కూడా హీరో నాగశౌర్య మినహా అందరూ హాజరయ్యారు. దీంతో.. నాగశౌర్య గైర్హాజరుకు సాయిపల్లవితో ఉన్న మనస్పర్ధలే కారణమని అందరూ అనుకుంటున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి అని ఈ ఘ‌ట‌న చెప్ప‌కనే చెప్పింది.

nagaఅయితే.. కొద్ది రోజుల క్రితం సాయి ప‌ల్ల‌వి వ‌ద్ద నాగ శౌర్య చేసిన కామెంట్స్ విష‌యం ప్ర‌స్తావించ‌గా.. త‌న వ‌ల్ల ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని కోరుకుంటాన‌ని.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న విష‌యంలో ఏనాడు ఇలాంటి కంఫ్లైట్ చేయ‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. ఇక నాగశౌర్య అసహనం అతని వ్యక్తిగతం అని.. అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానంటూ హుందాగా బ‌దులిచ్చింది. అంతేగాకుండా.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు స‌మ‌యానికి చేరుకోవాల‌ని త‌న అసిస్టెంట్ బైక్ మీద వ‌చ్చి మ‌రీ.. త‌ను ఎంత టైమ్ ఫంక్చువాలిటీని మేనేజ్ చేస్తానో చెప్ప‌క‌నే చెప్పి.. నాగ‌శౌర్య విమ‌ర్శ‌ల‌కి ప‌రోక్షంగా స‌మాధానం చెప్పింది ఈ బ్యూటీ.

మొత్తానికి నాగ‌శౌర్య‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాయి. ఇప్ప‌టికైనా నాగ‌శౌర్య ఇగో స‌మ‌స్య‌లు త‌గ్గించుకుని.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు వ‌స్తే అది అత‌ని హుందాత‌న‌మ‌వుతుంద‌ని  సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.'స‌వ్య‌సాచి' ఎప్పుడంటే..

Updated By ManamSun, 02/18/2018 - 15:48

savya sachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ద్వి శ‌తాధిక చిత్రాల స్వ‌ర‌క‌ర్త ఎం.ఎం.కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల తేది గురించి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. మార్చి నెలాఖ‌రుక‌ల్లా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోనున్న ఈ మూవీని మే 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారని తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.త్రిష చిత్రానికి ప్ర‌శంస‌లు

Updated By ManamFri, 02/02/2018 - 21:13

trishaచెన్నై చిన్న‌ది త్రిష న‌టించిన తాజా చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతోంది. ఈ సినిమాలో త్రిష చాలా అందంగా క‌నిపించ‌డ‌మే కాకుండా.. అభిన‌యంతోనూ అద‌ర‌గొట్టింద‌ని స‌మీక్ష‌కులు ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు, త‌మిళ, క‌న్న‌డ చిత్రాల్లో మాత్ర‌మే న‌టించిన త్రిష‌.. తాజాగా 'హేయ్ జ్యూడ్' అనే మ‌ల‌యాళ చిత్రం చేసింది. 'ప్రేమ‌మ్' హీరో నివిన్ పౌలీ క‌థానాయ‌కుడిగా నటించిన ఈ చిత్రానికి శ్యామ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. కాగా, ఈ రోజు (శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ ఈ సినిమాకి అన్నిచోట్లా పాజిటివ్ టాక్ రావ‌డ‌మే కాకుండా రివ్యూస్ కూడా బాగా వ‌చ్చాయి. అంతేకాకుండా నివిన్‌, త్రిష న‌ట‌న కూడా సూపర్బ్ అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. మొత్తానికి.. త్రిష తొలి మ‌ల‌యాళ చిత్రం బాగానే క్లిక్ అయ్యింద‌న్న‌మాట‌.అమెరికా వెళ్ళ‌నున్న 'స‌వ్య‌సాచి'

Updated By ManamTue, 01/30/2018 - 20:40

savyasachi'ప్రేమ‌మ్‌'తో మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన‌ కీల‌క‌ షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. మార్చి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని.. కొన్ని వారాల పాటు కొన‌సాగే ఈ భారీ షెడ్యూల్‌తో సినిమా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. కాగా, మే నెల‌లో 'స‌వ్య‌సాచి' తెర‌పైకి రానుంది.త్రిష చిత్రానికి క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్‌

Updated By ManamMon, 01/29/2018 - 22:27

hey judeతెలుగు, త‌మిళ భాష‌ల్లోనే కాకుండా క‌న్న‌డంలోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకుంది చెన్నై చిన్న‌ది త్రిష‌. కెరీర్‌ని ప్రారంభించిన చాన్నాళ్ళ త‌రువాత ఈ ముద్దుగుమ్మ మ‌ల‌యాళ చిత్ర సీమ‌లోకి అడుగుపెడుతోంది. 'ప్రేమ‌మ్' హీరో నివిన్ పౌల్‌కి జోడీగా త్రిష న‌టించిన ఆ సినిమానే 'హేయ్ జ్యూడ్‌'. ''బి యువ‌ర్ సెల్ఫ్‌. ల‌వ్ విల్ ఫైండ్ యు'' అనే కాన్సెప్ట్‌తో ప్ర‌ముఖ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు శ్యామ్ ప్ర‌సాద్ తెర‌కెక్కించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న తెర‌పైకి రానుంది. మ‌రి, తొలి మ‌ల‌యాళ చిత్రంతో త్రిష విజ‌యాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి. సూర్య‌తో సాయిప‌ల్ల‌వి?

Updated By ManamTue, 12/19/2017 - 14:28

suriya, sai pallavi'ఫిదా'తో తెలుగువారిని ఆక‌ట్టుకున్న చెన్నై చిన్న‌ది సాయి ప‌ల్ల‌వి. ఈ చిత్రం కంటే ముందు 'ప్రేమ‌మ్'(మ‌ల‌యాళం)లో మ‌ల‌ర్‌గా త‌న పెర్‌ఫార్మెన్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మ‌డు. సాయిప‌ల్ల‌వి తాజా చిత్రం 'ఎం.సి.ఎ' ఈ నెల 21న విడుద‌ల కానుండ‌గా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ద్విభాషా చిత్రం 'క‌ణం' ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మని ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత‌కీ అదేమిటంటే.. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో సూర్య ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇప్ప‌టికే ఓ క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎంపిక‌వ‌గా.. మ‌రో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి ఎంపికైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 'స‌వ్య‌సాచి'.. మాధ‌వ‌న్ లుక్‌

Updated By ManamSun, 12/03/2017 - 15:57

madhavan'ప్రేమ‌మ్' త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి స్వ‌ర‌క‌ర్త‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మాధ‌వ‌న్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ డిఫ‌రెంట్ స్టిల్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో మాధ‌వ‌న్‌ని నేరుగా చూపకుండా.. వెనుక‌వైపు నుంచి చూపించారు. ఉద‌యం 9.30 గంట‌ల స‌మ‌యంలో మాధ‌వ‌న్‌పై సూర్య కాంతి ప‌డుతున్న‌ట్లుగా ఈ స్టిల్ ఉంది. ఇంట్లో ఆ ప్రాప‌ర్టీస్ చూస్తే.. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప‌నితీరుకి ఎవ‌రైనా ఫిదా అయిపోతారు. సింపుల్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉంది ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన ఆ డిజైన్‌. మొత్త‌మ్మీద‌.. టైటిల్ నుంచి ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది చిత్ర‌యూనిట్. చూస్తుంటే.. 'ప్రేమ‌మ్' కాంబినేష‌న్ మ‌రో హిట్ కొట్టేలానే ఉంది.రేపు ‘రిచి’ ట్రైల‌ర్‌

Updated By ManamFri, 11/24/2017 - 19:31

richie‘ప్రేమమ్’ (మ‌ల‌యాళం) ఫేమ్ నివిన్ పౌలి నటిస్తున్న తమిళ చిత్రం ‘రిచి’. మ‌ల‌యాళ‌, తమిళ భాష‌ల్లో రూపొందిన ద్విభాషా చిత్రం 'నేర‌మ్' త‌రువాత నివిన్ న‌టిస్తున్న త‌మిళ చిత్ర‌మిదే కావ‌డం విశేషం. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కి గౌతమ్‌ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. 2014లో వచ్చిన ‘ఉలిదవారు కందంతే’ అనే కన్నడ సినిమాకి రీమేక్ ఇది. ఆనంద్ కుమార్, వినోద్ షోర్నూర్ నిర్మించిన ఈ ‘రిచి’లో నటరాజన్ సుబ్రహ్మణియన్, అశోక్ సెల్వన్, శ్రద్ధ శ్రీనాథ్, లక్ష్మి ప్రియా చంద్రమౌళి లీడ్ రోల్స్ పోషించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ప్ర‌ధాన‌ పాత్రలో కనిపించనున్నాడు. తొలుత‌ ఈ మూవీని తమిళ, మలయాళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ కేవలం తమిళంలో మాత్రమే రీమేక్ చేస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ స్వరాలను అందించిన ఈ ఫిలిం ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.'స‌వ్య‌సాచి' మొద‌లెడుతున్నాడు

Updated By ManamWed, 11/08/2017 - 11:16

savyasachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'స‌వ్య‌సాచి' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ద్వారా నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. ప్ర‌ముఖ త‌మిళ క‌థానాయ‌కుడు మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ సినిమాకి.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి స్వ‌రాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌.. ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఎడ‌మ చేయి త‌న కంట్రోల్ లో లేక‌పోవ‌డం వ‌ల్ల‌ ఓ యువ‌కుడు ఎలాంటి ప‌రిస్థితుల‌ను చూశాడు? త‌న స‌మ‌స్య‌ను అధిగ‌మించాడా?  లేదా? అనే అంశంతో.. యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌చ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.'శైల‌జ రెడ్డి అల్లుడు'గా నాగ‌చైత‌న్య

Updated By ManamFri, 10/27/2017 - 19:50

chaitanyaప్ర‌స్తుతం 'ప్రేమ‌మ్' ద‌ర్శ‌కుడు చందు మొండేటితో 'స‌వ్య‌సాచి' అనే చిత్రాన్ని చేస్తున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతితో చేయ‌నున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ చిత్రానికి 'శైల‌జ రెడ్డి అల్లుడు' అనే పేరుని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో శైల‌జ రెడ్డి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ టైటిల్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డనుంది. ఇందులో 'లై' ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టించ‌నుందని స‌మాచార‌మ్‌.

Related News