manam kutumbam

వరాల రొట్టె

Updated By ManamThu, 09/20/2018 - 00:21

ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్య రొట్టె తింటే చాలు.. ఇట్టే రోగం తగ్గిపోతుంది. ఉద్యోగం రాక సంవత్సరాల తరబడి ఉండే వారు అక్కడ ఉద్యోగం రొట్టె తింటే చాలు.. వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది. బిడ్డలు పుట్టడం లేదంటే అక్కడ రొట్టె ముక్క తింటే సంతానం కలుగుతుంది. అంతే కాకుండా ఇటువంటి అనేక సమస్యలు పరిష్కారం కోసం ఒక్క రొట్టె ముక్క తింటే చాలు.. సమస్యలు తీరి పోతాయి. ఇది గత కొన్ని శతాబ్దాలుగా లక్షల మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
 

image


మత సామరస్యం
మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం రొట్టెల పండగ. హిందు, ముస్లిం భేదం లేకుండా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రజలు లక్షల సంఖ్యలో రొట్టెల కోసం వస్తుంటారు. అదే నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగ వేడుక. ఏటా దర్గా వద్ద గల ‘స్వర్ణాల చెరువు’ వద్ద జరిగే రొట్టెల పండుగ ఈ నెల 21వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరుగనున్నాయి. 

ఇదీ చరిత్ర
1751లో సౌదీ అరేబియాలోని మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు మహమ్మద్(సఅ) ప్రవక్త సందేశాలను వివరిస్తూ భారతదేశానికి వచ్చారు. అప్పుడు కర్ణాటక హైదర్ అలీ పరిపాలన ఉండేది. 12 మంది వీరులు హైద ర్ అలీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలలో సందేశాలను వివరిస్తూ వచ్చారు. ఇదే సమయంలో తమిళనాడు వలాజా రాజులకు, బీజాపూర్ సుల్తాన్‌లకు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో టర్కీ కమాండర్‌తో పాటు 12 యుద్ధవీరుల తలలు నరికి వేశారు. ఈ యుద్ధ వీరుల తలలు గండవరంలో పడిపోగా, మొండేలు గుర్రాల సహాయంతో నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్దకు చేరాయి. అప్పటి నెల్లూరు ఖాజీకి 12 మంది ‘షహీద్’లు కలలో కనిపించి తమకు స్వర్ణాల చెరువు సమీపంలో సమాధులు కట్టించమని చెప్పారని, దీంతో అక్కడ 12 మంది షహీద్‌లకు సమాదులు నిర్మించారిన ప్రజలు చెబుతారు. 12 అంటే ఉర్దూలో బారా, కాబట్టి ఇక్కడ ఉన్న 12 మంది షహీద్‌ల పేరు మీద ‘బారా షహీద్ దర్గా’ ఏర్పడింది. 

5 రోజుల పండుగ
ఈ ఏడాది రొట్టెల పండుగను 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో 3 రోజుల పాటు మాత్రమే నిర్వహించే వారు. 21వ తేదీన సొందల్ మాలిక్, 22న గంధోత్సవం, 23న రొట్టెల పండుగ, 24న తహలీల్ ఫాతెహా, 25న ముగింపు ఉత్సవం. 23వ తేదీ నుంచి రొట్టెలు పట్టడం ఆనవాయితీ. కాని మూడు రోజుల ముందు నుంచే రొట్టెలు పట్టెందుకు భక్తులు వస్తుంటారు. గత ఏడాది ఈ పండుగకు 8 లక్షల మంది హాజరయ్యారని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 10 లక్షల మంది వరకు హజరవుతారని వారు అంచనా వేస్తున్నారు.

వీటికి డిమాండ్ ఎక్కువ
సంతానం, విద్య, ఉద్యోగం, గృహం, ఆరోగ్య రొట్టెలకు ఎక్కువ మంది ఎగబడుతుంటారు. గతంలో రొట్టెలు తీసుకుని తమ కోర్కెలు తీరిన వారు మరుసటి ఏడాది ఇక్కడకు వచ్చి రొట్టెలను వదులుతుంటారు. వాటిని అవి అవసరమైన వారు స్వీకరిస్తుంటారు. ఈ సందర్భంగా ఇక్కడ వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ‘రాష్ట్ర పండుగ’గా రొట్టెల పండుగగా ప్రకటించిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడకు వచ్చారు. సినీ తారలు, రాజకీయ నేతలు వచ్చి స్వర్ణాల చెరువు వద్ద రెట్టెలు పట్టుకుంటారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా పలుపర్యాయాలు వచ్చారు.
- ఎస్‌కే గౌస్ భాషా, నెల్లూరు
 నెగెటివ్‌తో పాజిటివ్

Updated By ManamTue, 09/18/2018 - 01:10

నెగెటివ్ కాలొరీ ఫుడ్స్ అనేవి నిజంగా ఉంటాయా? అంటే లేదని చెప్పక తప్పదు..కాకపోతే సులువుగా జీర్ణం కాని ఆహార పదార్థాలను నెగెటివ్ కాలొరీ ఫుడ్స్ అంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇవి తినడం వల్ల లభించే కాలొరీల కంటే జీర్ణమయ్యేందుకు ఎక్కువ కాలొరీలు అవసరమవుతాయి.. ఫైబర్ పుష్కలంగా లభించే పదార్థాలు ఈ కోవలోకి వస్తాయి.  యాపిల్స్, క్యారెట్స్, కీరా, లెట్యూస్ వంటివన్నీ ఈ కెటగెరీకి చెందినవే.  అందుకే ఇవి తిన్నప్పుడు జీర్ణక్రియ మందగించి, ఆకలి త్వరగా వేయకుండా చేస్తుంది.

image


వీటిలో ప్రథమ స్థానంలో నిలిచింది సెలరీ అంటే ఉల్లి కాడలు, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిచే ఉల్లి కాడలను సూప్‌లు, సలాడ్లతో పాటు కూరలు, పచ్చళ్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. రక రకాల బెర్రీలు, టొమాటోలు, పుచ్చకాయ, బ్రాకోలి, పుట్టగొడుగులు వంటివి విస్తృతంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్‌లో ఉండేలా చూసుకుంటే బరువు పెరుగుతారన్న భయం అవసరం లేకపోగా, మీ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.

శారీరక అందానికి, మానసిక ప్రశాంతతకు ప్రత్యక్షంగా సహకరించే నెగెటివ్ కాలొరీ ఫుడ్ చక్కగా తోడ్పడుతుంది. ఫిట్‌గా, చురుగ్గా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని బొజ్జనిండా హ్యాపీగా లాగించండి.  హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏదో ఎక్సర్‌సైజులు చేసేయడమే అనుకునేవారు తమ అభిప్రాయాలను మార్చుకుని ఈటింగ్ స్టైల్‌పై సరైన ఫోకస్ పెట్టాలి. ప్రొటీన్ సమకూర్చే ఇలాంటి ఆహారాన్ని మీ రొటీన్‌గా మార్చుకుంటే ఏజింగ్ వంటి 
సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

సెలబ్స్ ఫస్ట్ లవ్ ఇదే
ఫిట్‌నెస్ ఫ్రీక్‌లైన సెలబ్రిటీలంతా తమ ఫస్ట్ లవ్‌గా ఈ నెగెటివ్ కాలొరీ ఫుడ్‌ను పేర్కొంటారు. తాజాగా ఈ జాబితాలో చేరిన యామీ గౌతమ్ తన కొత్త లుక్ కోసం నెగటివ్ కాలొరీ ఫుడ్‌తో ప్రేమలో పడ్డట్టు ఇన్‌స్టాగ్రాంలో తరచూ పోస్ట్ చేస్తున్నారు.  ఇలాంటి సహజమైన ఆహారాన్ని తీసుకోవడంతో చర్మం నిగారింపు రెట్టింపు అవుతూనే ఫ్రెష్‌గా ఫీల్ అయ్యేందుకు అవసరమైన ఎనర్జీ వస్తుంది. అమ్మ కాళ్లకు చక్రాలు

Updated By ManamTue, 09/11/2018 - 00:18

మన అమ్మలంతా కాళ్లకు చక్రాలు కట్టుకుంటే? ఈ ఊహకు స్పష్టత లేదనుకోవద్దు.. ‘మదర్ ఆన్ వీల్ ’ పేరుతో నలుగురు అమ్మలు మొదలుపెట్టిన సాహస యాత్ర ఇప్పుడు మనదేశంలో సంచలనం సృష్టిస్తోంది.  వీరంతా రొటీన్‌లో బిజీగా ఉండే ఉద్యోగులే అయినా సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలన్న తాపత్రయంతో ఖండాతరాల్లో ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలేసుకున్నారు. కొన్ని నెలలపాటు ఇందుకు అనుగుణంగా శారీరకంగా, మానసికంగా సిద్ధమై చాలెంజ్‌కు రూపకల్పన చేసుకున్నారు. ఎప్పుడూ ఇంటి పని, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధుల్లో మునిగితేలే ఈ నలుగురు అమ్మలు దేశంలోని ఎంతో మంది అమ్మలను ఇప్పుడు ఆలోచింపచేస్తున్నారు.
 

image


22 దేశాల్లో..
సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే ఈ బృందం 22 దేశాల గుండా ప్రయాణించి చివరి మజిలీగా బ్రిటన్ చేరుకుంటుంది. 60 రోజులపాటు 20 వేల కిలోమీటర్లను ఏకబిగిన పూర్తి చేస్తూనే దారివెంబడి చిన్నారుల్లో సానుకూల దృక్పథాన్ని ఎలా అలవరచాలో వివరించనుంది. విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ జెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్రకు మంచి స్పందన మొదలవ్వడం విశేషం. మాధురి సహస్రబుధే, శీతల్ వైద్య, ఊర్మిళా జోష్, మాధవి సింగ్‌లు చేస్తున్న ఈ సాహస యాత్ర ఎలైట్ ఐ 20 కార్ ద్వారా సాగనుండడంతో వీరికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని హ్యూండాయ్ సంస్థ అందించనుంది.
 

image

 వావ్.. గ్రే హెయిర్..

Updated By ManamTue, 09/11/2018 - 00:03

imageవామ్మో తెల్ల జుట్టు వచ్చి మేము గుండెలు బాదుకుంటూంటే.. ఇదేంటీ.. వావ్ గ్రే హెయిర్ అంటారు? అని ఆశ్చర్యంగా ఉందా? ‘గ్రే ఈజ్ న్యూ బ్లాక్’ మరి అందుకే ఇదంతా.  తెల్ల రంగు వేసుకోవడం నయా స్టైల్ అయినప్పుడు మీకు సహజంగానే తెలుపు రంగు జుట్టు ఉండడం స్టైల్ కాదా? అంతెందుకు ఇందిరా గాంధీ గ్రే హెయిర్ తలకట్టును గుర్తుకు తెచ్చుకోండి.. ఆమె ఎంత డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గా కనిపించేవారో అర్థమవుతుంది.

లేటెస్ట్ ఫ్యాషన్
గ్రే హెయిర్ స్టైల్స్ పేరుతో సరికొత్త ట్రెండీ లుక్ ఇప్పుడు రాజ్యమేలడం లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది.  కమాన్.. ఇది మీ జుట్టు.. మీ ఇష్టం వచ్చినట్టు మీరుండవచ్చు.. చూసేందుకు ఇలాగే ఉండాలి.. ఇలాగే కనిపించాలనే రాజ్యాంగం ఎక్కడా లేనప్పుడు తెచ్చిపెట్టుకున్న రంగుతో, మీ మనసుకు పూర్తిగా నచ్చని పనులెందుకు చేయాలి? అందుకే మీలాంటి ఆత్మవిశ్వాసం ఉన్నవారు ప్రారంభించిన ‘గ్రే హెయిర్ చాలెంజ్’ స్వీకరిస్తే ఇక మీకు టెన్షన్ ఫ్రీ. 
 

image


సెల్ఫ్ రెస్పెక్ట్ సింబల్
‘మీ టూ చాలెంజ్’లానే సిల్వర్ హెయిర్‌ను చూపించుకునేలా హెయిర్ స్టైల్ చేసుకోవడం ఇప్పుడు కొత్త చాలెంజ్‌గా మారింది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కు సింబల్‌గా మారింది.  అందుకే జెన్నిఫర్ లోపెజ్, ఏంజిలినా జోలీ వంటి స్టార్లు ఏమాత్రం జంకకుండా తమ తెల్ల జుట్టుతో ఎంచక్కా పోజులిచ్చేస్తున్నారు. బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్‌టన్ ఇలాగే గ్రే హెయిర్‌తో ప్రౌడ్‌గా కనిపిస్తారు. ఇక చిన్న వయసులోనే తెల్లవెంట్రుకల బారిన పడ్డ మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు హెయిర్ డైలు అస్సలు వేయరాదు. వేస్తే తల్లీ-బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ప్రమాదాలు తప్పవు. 
 
హుందాకు కేరాఫ్
imageహీరో అజిత్ సహజైమైన వెంట్రుకలతోనే నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. జగపతిబాబు వంటి తెలుగు నటులు కూడా ఈ ట్రెండ్‌ను సృష్టించారు. ధోని, మిలింద్ సోమన్ వంటివారు డైకు దూరంగా ఉంటూ .. ‘వాటే స్టైల్ ’ అనిపించుకుంటున్నారు.  వయసు మీద పడినా పడకపోయినా వచ్చే తెల్ల రంగు క్రెడిబిలిటీకి సింబల్‌గా మారింది. ఇలా రంగుకు దూరంగా ఉండేవారు నిజాయితీగా ఉంటారని సైకాలజీ చెబుతోంది. ఇక గ్రే హెయిర్‌లో బోలెడు రంగులున్నాయి. న్యూ సిల్వర్ గ్రే హెయిర్ ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కాస్మెటిక్‌గా వెస్ట్‌లో మారింది. వీటిలో కూడా ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ గ్రే గ్లోరీ, గ్రాఫైట్ గ్రే, గ్రే పర్ల్ వంటి ఎన్నో వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ‘2018 మోస్ట్ పాప్యులర్ కలర్ ట్రెండ్’గా నిలిచిన గ్రే కలర్ హెయిర్ వేసుకోవాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలని హెయిర్ స్టైలిస్టులు చెబుతారు.  మధ్యవయసు వారందరికీ హుందాగా కనిపించే రంగుగా తెల్ల వెంట్రుకలనుimage భావిస్తారు. కానీ తెల్లవెంట్రుకలు కనిపిస్తే చాలు ఆంటీ, అంకుల్ అనేస్తారనే భయం మనల్ని వెంటాడుతుంది కనుక తక్షణం రంగు వేసుకోవడాన్ని ప్రారంభించడం రొటీన్‌గా మారింది. ఏజింగ్‌కు సింబల్‌గా భావిస్తే మాత్రం ఇది ఓ ఫోబియాగా మారి మిమ్మల్ని కాల్చుకు తినడం ఖాయం.  అందుకే మీ గుండె ధైర్యాన్ని ముందు పరీక్షించుకోండి.. ఆతరువాత గ్రే హెయిర్‌తో కనిపించేందుకు మానసికంగా సిద్ధమవ్వండి.. ఇక మిగతా జీవితం అంతా మీ శరీరంలో భాగమైన వె ంట్రుకల సహజత్వంతో మెరిసిపోండి.. ఎవరు ఏం కామెంట్ చేసినా పట్టించుకోకపోతే చాలు మీరు గ్రే హెయిర్ టె స్ట్‌లో పాస్ అయినట్టే. 
 
గ్రే ఈజ్ న్యూ బ్లాక్
ఈ సరికొత్త స్లోగన్ పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా ప్రభావం చూపుతుండగా మనదేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. పండు ముసలివారు సైతం తమ జుట్టుకు నల్ల రంగు వేసుకునే మనదేశంలో ప్రముఖులైన కొందరు తమ హెయిర్ స్టైల్‌ను అమాంతంగా మార్చు కుంటూ, దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ మార్చుకుంటూ తమ తెల్ల జుట్టును ప్రదర్శించడం మొదలయ్యాక అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్న వారు ‘థాంక్ గాడ్’ అని ఊపిరి తీసుకుంటున్నరు. 30వ ఒడిలో పడీ పడగానే మన క్రికెటర్ మహేంద్ర సింఘ్ ధోనీకి తలంతా నెరిసిపోవడం చూసిన అభిమానులు షాక్ తిన్నారు. అయినా ధోనీ దీన్ని కూడా సరికొత్త స్టైల్‌గా మార్చేసుకుని తెల్ల గడ్డం, తెల్ల క్రాప్‌తోనే బ్యాట్ ఝుళిపించి అందరినీ ఆలోచింపచేస్తున్నారు.

 కొత్తల్లో ఇదంతా చూసినవారు ‘‘ఏంటి.. ధోనీ తన క్రాప్‌కు హెయిర్ డై వేసుకోరాదూ?’’ అంటూ సోషల్ మీడియాలో బాహాటంగానే సలహాలివ్వడం మొదలుపెట్టినా ఇవేవీ ధోనీ పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు హెయిర్ స్టైల్ మార్చుకుంటూ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. దీంతో ‘‘గ్రే ఈజ్ న్యూ బ్లాక్’’కు మనదేశంలో విస్తృతంగా ప్రచారం వచ్చినట్టైంది. మీరు మీలా మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు ఉంటే చాలు..ఇతరులు దాన్ని అభినందిస్తారా? విమర్శిస్తారా అన్నది అప్రస్తుతం అనుకుంటే మీ లైఫ్..మీ రేంజ్‌లో సాగుతుంది.లెహంగా షర్ట్

Updated By ManamThu, 09/06/2018 - 01:55

imageలెహంగాలు ఎప్పుడో ఔట్ డేటెడ్‌గా మారిపోయాయి. మరి వేలు పోసి కొన్న లెహంగాలను ఏం చేసుకోవాలంటారా? సింపుల్ దీనిపై వెరైటీ ప్రయోగాలు చేస్తే ట్రెండీ ఎథ్నిక్, ఫ్యూజన్ రెడీ అయినట్టే. 

సింపుల్‌గా.. 
మీ లె హెంగాపై చిన్న మార్పులు చేస్తే ఓల్డ్ లెహెంగాకు న్యూ లుక్ గ్యారెంటీ.  లెహంగాపై ఉన్న ప్యాచ్ వర్క్ లేదా బోర్డర్స్‌ను తొలగించడం, హెవీ వర్క్ ఉంటే దాన్ని కూడా జాగ్రత్తగా తీసేయడం, అవసరమైతే డైయింగ్ చేయించడం, లెంత్ తగ్గించడం లేదా పెంచడం చేస్తే సరిపోతుంది.  అయితే ఈ పొడవాటి లంగా లుక్ మార్చేది షర్ట్ మాత్రమే. అందుకే క్రాప్డ్ షర్ట్, షార్ట్ కుర్తీ, కాలర్డ్ షర్ట్ వంటివి వీటికి జోడీగా ట్రై చేస్తే వావ్ అనేలా కనిపిస్తారు. ఇన్ చేయాలా వద్దా అనేది మీ చాయిస్. స్లీవ్‌లెస్, ఫుల్ హ్యాండ్స్, వన్ ఫోర్త్ షర్ట్స్ ఏవైనా లెహంగాపై నప్పుతాయి కనుక మీ ఇంట్రెస్ట్‌ను బట్టి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్నదాన్ని వేసుకున్నా, కొత్తది కొన్నా ట్రెండీ లెహెంగా షర్ట్‌తో మీరు ఇట్టే సందడి చేయచ్చు.

image


స్టైలిష్ ట్రెండ్ 
ఇప్పుడు బాలీవుడ్ సెలబ్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ స్టైల్‌లో మీరు ఈ వీకెండ్ మెరిసిపోండి. హర్యానాకు చెందిన స్త్రీలు నిత్యం ధరించేది ఈ తరహా సంప్రదాయ వస్త్రాలే కనుక వారిలాగే మీరు కూడా మీకు నచ్చిన బీడ్స్, గోల్డ్, సిల్వర్‌తో చేసిన నగలు సింపుల్‌గా లేదా భారీగా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మీరు నిలుస్తారు. ఈ స్టైల్‌లో ప్రయాణాలు కూడా హ్యాపీగా, ఈజీగా చేయవచ్చు. అత్యంత కన్వీనెంట్‌గా ఉన్న దీన్ని క్యారీ చేయడం చాలా సులభం.
 

image

 విచ్చుకునే టీ 

Updated By ManamThu, 09/06/2018 - 01:38

imageమనసంతా అదోలా ఉంది.. బయటికి వెళ్లాలని లేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఇలాంటి సందర్భాలకు విరుగుడుగా మీ మనసును ఆకట్టుకునేలా చేసే శక్తి ఒక కప్పు స్పెషల్ టీకు మాత్రమే ఉంది.  కాసిన్ని నీళ్లు బాగా మరిగించి, టీ కప్పులు పోసి, అందులోకి టీ బ్యాగ్ ముద్దను వేస్తే సరి..అది చూస్తుండగానే పువ్వులా విచ్చుకుని మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక ఈ అరోమా మీ మనసును తేలిక చేస్తుంది.  ఘుమఘుమలాడే ఈ చాయ్‌ను తాగితే ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. 
 

image


ఖరీదైన గిఫ్టు
మీకు నచ్చే పూలతో తయారయ్యే ఈ పుష్పాల తేనీరు చాలా ఖరీదైన గిఫ్టుగా మారింది.  మీకు నచ్చినవారికి దీన్ని ఇచ్చి ఆశ్చర్యపరచవచ్చు. 

imageఅమెజాన్‌తో పాటు అన్ని ప్రముఖ స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.  ఫ్లవరింగ్ టీ, టీ ఫ్లవర్స్, ఫ్లవర్ టీ బాల్, బ్లూమింగ్ టీ పేరుతో మార్కెట్‌లో సందడి చేస్తున్న తేయాకు సాచెట్లు హెర్బల్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ వంటి వివిధ రుచుల్లో ఉంటాయి.  ఆరోగ్యానికి మంచిది కనుక దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.  ఖరీదైన దీన్ని కొనేబదులు సొంతంగా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 

నవాబీ చాయ్‌గా పేరుగాంచిన పలు టీ వెరైటీలు ఎప్పటినుంచో మన సంప్రదాయంలో భాగంగా ఉండగా ఆర్గానిక్ పేరుతో ఇప్పుడివి మార్కెట్లోకి వచ్చిచేరాయి.

ఇలా చేసి చూడండి
ఒరిజినల్ వెనీలా (కెమికల్ ఎస్సెన్స్ కాదు)ను కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే దాన్ని టీలో కలిపితే వెనీలా టీ రెడీ. ఇకimage పసుపు, మసాలాలు, తులసి, నిమ్మ, అల్లం వంటి వాటితో చేసే టీలు మనం నిత్యం సేవిస్తూనే ఉంటాం. వీటికి భిన్నంగా ఉండాలంటే చేమంతి, మందారం, గులాబీ, మల్లె ఇలా మీకు నచ్చిన పూల రెక్కలను తీసుకుని టీ డికాషిన్‌లో వేసి మరిగించండి. లేదంటే సర్వ్ చేసేముందు టీ పై ఈ పూల రెక్కలు వేసి తాగితే వచ్చే రుచి కమ్మగా ఉంటుంది. మల్లె వంటి వి సీజన్‌లోనే లభిస్తాయి కనుక మంచి సువాసన ఉన్న మల్లె రెక్కలను ఎండబెట్టి, వాటిని టీ పొడితో కలిపి డిప్ బ్యాగ్‌లా ప్యాక్ చేస్తే సరిపోతుంది. వర్షాకాలం, చలికాలం ఇవి మీకు ఆయుర్వేద ఔషధాల్లా పనిచేసి సరికొత్త జోష్ నింపుతాయి.  ఆరోగ్యానికి, అందానికి దివ్యౌషధమైన పూల టీలు సేవించడం మంచి వ్యసనం.డెస్టినేషన్ వెడ్డింగ్

Updated By ManamThu, 08/23/2018 - 08:09

డెస్టినేషన్ వెడ్డింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడుకలోకి వచ్చింది. సెలబ్రిటీలంతా ‘డ్రీమీ వెడ్డింగ్’ కోసం దీన్ని ఎంచుకుంటూ ఉండటంతో సామాన్యులు కూడా ఇలాంటి వివాహంపై శ్రద్ధకనబరుస్తున్నారు.  మూడు ముళ్లకు ఇంత అవసరమా అనకండి.. మనసుతో చేసుకునే మనువు జీవితకాలంపాటు పదిలంగా దాచుకునే అనుభూతులను మిగల్చాలంటే ఇలాంటి హైలైట్ ఉంటే బావుంటుంది కదా?

ఆగ్రా
imageప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ చూసేందుకు వచ్చే ప్రేమికులు ఎంతమందో ఇక్కడే దంపతులుగా మారేందుకు ఇష్టపడేవారు అంతమంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా పెద్ద చారిత్రాత్మక నగరం. ఇక్కడున్న పలు వారసత్వ, ఆధునిక హంగుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లితంతు జరపవచ్చు. 

గోవా
ఈ పేరు వినగానే మీరు పెళ్లికి పిలవకపోయినా పొలోమని మీకు అయినవారు, కానివారు, ఇరుగు-పొరుగువారు, వేలువిడిచిన... బాదరాయణ సంబంధాలు కలిపేసుకుని మరీ వచ్చి మీ పెళ్లికి వాలిపోతారు!. గోవా అంటే ఆబాలగోపాలానికి అందరికీ సరదానే. సుందరమైన గోవా బీచుల్లో ఇసుక తెన్నెలపై వివాహం చేసుకోవడమంటే ఊహలకు రెక్కలు వచ్చినట్టు ఉంటుంది.

విదేశాలెందుకు దండగ?
డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే ఫారిన్ గుర్తుకు రావడం చాలా సహజం..కానీ మనదేశంలో అత్యద్భుత ప్రదేశాలు బోలెడుండగా విదేశాలెందుకు? పాస్‌పోర్టు, వీసాతో ఏమాత్రం పనిలేకుండా హ్యాపీగా మీకు నచ్చిన బడ్జెట్‌లో, మీరు మెచ్చిన చక్కని ప్రదేశంలో వివాహం చేసుకోండి. అది నవదంపతులకే కాదు అయినవారందరికీ మధుర జ్ఞాపకాలను ఇవ్వడం ఖాయం. ఇందుకు ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మీరు కోరుకునే వెడ్డింగ్ ఏ కేటెగెరీకి చెందినదో గుర్తించండి.. అంటే బీచ్‌లోనా లేక నదీ తీరంలోనా అదీకాకపోతే చారిత్రాత్మక ప్రదేశంలోనా ఇలా మీకు స్పష్టత వచ్చిందో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా సింపుల్ ప్రాసెస్ అవుతుంది. 

ఉదయ్‌పూర్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాయల్‌గా వెడ్డింగ్ జరుపుకునేందుకు పర్‌ఫెక్ట్ ప్లేస్. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో ఒకరిimage వివాహం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న ఎన్నో రాజసౌధాలు ముఖ్యంగా పిచోలా లేక్‌లోని తేలియాడే రాజమహల్, తాజ్ లేక్ ప్యాలెస్ అతిథులను కనివినీ ఎరుగని రీతిలో స్వాగతిస్తుంది. ఓవైపు కొండలు మరోవైపు చుట్టూ ఉన్న బోలెడన్ని సరస్సుల మధ్య ఉన్న ఉదయ్‌పూర్ సిటీలో వివాహం అంటే వావ్ అనిపించేలా ఉంటుంది.

కాశ్మీర్
‘‘భూలోకంలో స్వర్గమనేది ఉంటే అది ఇక్కడే ఉంది’’ అనే పేరు సంపాదించుకున్న ప్యారడైజ్ ఆన్ ఎర్త్.. కాశ్మీర్. కొండలు, వాగులు, వంకలు, మంచు, పూల లోయలు..ఇలా ఇక్కడ మీకు నచ్చిన చోటును ఎంపిక చేసుకుని పిక్చర్ పర్‌ఫెక్ట్ మ్యారేజ్  చేసుకోవచ్చు. ఏటా ఎంతోమంది విదేశీయులు ఇక్కడ మనువాడేందుకు వస్తున్నారు. ఇలా మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ‘జన్నత్’ కంటే మరో అద్భుతమైన వేదిక ఏముంటుంది?

జైపూర్
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అందరికీ ఠక్కుమని గుర్తుకు వచ్చేది ‘పింక్ సిటీ జైపూర్’. ఒక్కమారు ఈ చారిత్రాత్మక నగరంలో మీవారందరి సమక్షంలో మీరు పెళ్లి చేసుకుంటే.. ఎంత కమ్మని కలనో.. అనేలా ఉంటుంది. గ్రాండ్‌గా ఉన్న రాజమందిరాలు, కళ్లు చెదిరే హోటళ్లు, రీసార్టులు ఇలా మీకు నచ్చిన వేదికపై వివాహం జరుపుకునే సౌలభ్యం ఉంది. 

కేరళ
imageఇప్పుడైతే వరదల్లో మునిగింది కానీ..అసలు పెళ్లంటూ చేసుకుంటే స్వచ్ఛమైన ప్రకృతికి చిరునామా అయిన కేరళలో చేసుకోవాలి. బ్యాక్‌వాటర్, హౌస్ బోట్లు.. ఇలాంటి హంగులమధ్య ఏడడుగులు నడవడమంటే ఏదో సినిమా చూసిన ఫీలింగ్ కలుగకమానదు. కోవళం, వర్కాల, మున్నార్, కొల్లం, అలెప్పీ, కుమారకోం..అబ్బో ఇక్కడ ఎన్నో చూపుతిప్పుకోనివ్వని వేదికలున్నాయి.
 
విదేశాలెందుకు దండగ?
డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే ఫారిన్ గుర్తుకు రావడం చాలా సహజం..కానీ మనదేశంలో అత్యద్భుత ప్రదేశాలు బోలెడుండగా విదేశాలెందుకు? పాస్‌పోర్టు, వీసాతో ఏమాత్రం పనిలేకుండా హ్యాపీగా మీకు నచ్చిన బడ్జెట్‌లో, మీరు మెచ్చిన చక్కని ప్రదేశంలో వివాహం చేసుకోండి. అది నవదంపతులకే కాదు అయినవారందరికీ మధుర జ్ఞాపకాలను ఇవ్వడం ఖాయం. ఇందుకు ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మీరు కోరుకునే వెడ్డింగ్ ఏ కేటెగెరీకి చెందినదో గుర్తించండి.. అంటే బీచ్‌లోనా లేక నదీ తీరంలోనా అదీకాకపోతే చారిత్రాత్మక ప్రదేశంలోనా ఇలా మీకు స్పష్టత వచ్చిందో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా సింపుల్ ప్రాసెస్ అవుతుంది. 

లావాసా
పూనే సమీపంలోని హిల్ స్టేషన్ లావాసా అంటే జలపాతాలు, కొండలు, సరస్సులు మధ్య అలరారే ప్రకృతి ఒడిలో పెళ్లి చేసుకోవడానికి దేశవిదేశాల్లోని యువత ఆసక్తి చూపుతోంది. పైగలైనా రాత్రైనా మంత్రముగ్ధుల్ని చేసే లావాసాలో సిటీలో ఉండే హంగులన్నీ ఉంటాయి. కనుక వివాహానికి ఎటువంటి అసౌకర్యాలు ఉండవు.

సింపుల్ బడ్జెట్‌లోనూ..
వామ్మో ఇలాంటి టూరిస్టు స్పాట్‌ల్లో పెళ్లంటే మాటలా అనుకోకండి. మీకు కావాల్సిన బడ్జెట్‌లో, సంప్రదాయాల్లో పెళ్లిimage ఏర్పాట్లు చేసే వెడ్డింగ్ ప్లానర్స్ విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈకాలంలో జస్ట్ రేపు పెళ్లి అంటే ఈరోజు ఆర్డర్ బుక్ చేసినా మీకు నచ్చిన చోట, నచ్చినట్టు వివాహం జరిపించేస్తారు. ఇవన్నీ వద్దనుకుంటే మీరు సెలెక్టివ్‌గా సన్నిహితులను తీసుకుని, వెంట పంతులు, వంటవారు, పనివారిని తీసుకెళ్తే మరీ చవక గా పెళ్లి చేసేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎకానమీ రూమ్స్ బుక్ చేసుకుంటే చవకగా, ఘనం గా పెళ్లి జరిపించవచ్చు. కావాలంటే మీ ఊళ్లో రిసెప్షన్ ఇచ్చి మిగతా అందరినీ ఆహ్వానిస్తే సరి. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే లాంచీల్లో వివాహాలు ఎప్పటినుంచో నిర్వహిస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో వారు ఇతర రాష్ట్రాలు వద్దనుకుంటే ఇలాంటి ఎన్నో వేదికలు మనకు సమీపంలోనే ఉంటాయి, వాటిని గుర్తిస్తే సరి.మ్యూజిక్ వెకేషన్

Updated By ManamThu, 08/02/2018 - 02:42

దేశ విదేశీ ఆర్టిస్టుల లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు కాస్త సేదతీరి, మంచి టూరిస్ట్ స్పాట్‌లో చక్కర్లు కొట్టి రావాలంటే స్వామికార్యం స్వకార్యం రెండూ తీర్చే వేదికలు, వేడుకలు కావాలి. ఇందుకు ఫుడ్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్ట్, లిటరేచర్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, బీచ్ ఫెస్ట్, డెజర్ట్ ఫెస్ట్ వంటి సాకులు ఉంటే మీ వెకేషన్ మరింత ఆహ్లాదంగా మారడం ఖాయం. అందుకే మనవాళ్లు ఇలాంటి సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబ సమేతంగా వెళ్లేందుకైనా ఇవి మంచి డెస్టినేషన్స్‌గా ఊరిస్తున్నాయి. మనదేశంలో మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఎంజాయ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కాస్మోపాలిటన్ కల్చర్‌ను అక్కున చేర్చుకునే యువత సంఖ్య ఎక్కువగా ఉండడంతో మ్యూజిక్ ఫెస్ట్ ఇప్పుడు దేశమంతా జరుగుతున్నాయి. మనదేశంలో బెస్ట్ మ్యూజిక్ ఫెస్ట్‌లుగా పేరుగాంచిన  కొన్ని వెన్యూలు మీకోసం..  

జీరో ఫెస్ట్
imageదీన్ని బిగ్గెస్ట్ ఔట్‌డోర్ మ్యూజిక్ ఫెస్టివల్‌గా మనదేశంలో భావిస్తారు. మ్యూజిక్, ఆర్ట్, కల్చర్‌ల సంగమంగా ఇది సాగుతుంది. నిజానికి 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను ‘మ్యూజిక్ వెకే’గా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘జీరో వ్యాలీ’లో దీన్ని ఏటా సెప్టంబర్‌లో నిర్వహిస్తారు.


రోడ్ టు అల్ట్రా
ఇది గ్లోబల్ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ .. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎలెక్ట్రిక్ డైసీ కార్నివాల్ (ఈడీసీ)గా పాప్యులర్ అయిన ఈ పండుగకు సంగీత ప్రియులు పోటెత్తుతారు. ఢిల్లీ సమీపంలోని బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నవంబర్ 12వ తేదీన జరిగే ఈ షోకు బుకింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. 


ఎన్‌హెచ్7 వీకెండర్image
భలే ఇంట్రెస్టింగ్ పేరు అనిపిస్తోందా? బెంగళూరు, కోల్‌కతా, మేఘాలయా, పూనె, నోయిడాల్లో ఏటా జరిగే ఈ సంగీత పండుగలో ఈ ఏడాది అమిత్ త్రివేది, ప్రతీక్, విశాల్ భరద్వాజ్ వంటి ప్రముఖ కళాకారులు అలరించనున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జరిగే ఈవెంట్స్‌కు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.


సన్‌బర్న్ ఫెస్ట్
పార్టీ అండ్ మ్యూజిక్ లవర్స్‌కు స్వర్గధామంగా, కేరాఫ్‌గా మారిన సన్‌బర్న్‌కు మనదేశంలో మంచి ఆదరణ దక్కుతోంది. ఇది గోవా, పూనేల్లోని కొండల్లో నిర్వహిస్తున్నారు. మొదట్లో గోవా బీచ్‌లో మాత్రమే జరుగగా దీనికి విపరీతమైన ఆదరణ లభించడంతో సన్‌బర్న్ హిల్స్ ఫెస్ట్‌గా మార్చారు. ఈ ఏడాది పూనెలో డిసెంబర్ 27 నుంచి 4 రోజులపాటు సాగనుంది. ఇంటర్నేషనల్ బ్యాండ్స్ లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆహుతులను ఉర్రూతలూగించే వేదికగా మనవారికి ఇది చేరువైంది.

మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్
imageమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇండియా ఫెస్టివల్ రాజస్థాన్‌లో డిసెంబర్ 14 నుంచి మూడు రోజులు జరుగనుంది. కంటెంపరరీ మ్యూజిక్, ఆర్ట్స్‌కు పెద్ద పీట వేస్తూ చిందులేసేలా చేస్తారు. 
 

స్టార్మ్ మ్యూజిక్ ఫెస్ట్
పేరులో ఉన్నట్టే ఇది ఓ మ్యూజిక్ స్టార్మ్. మ్యూజిక్ సునామీ అంటే ప్రాణంపెట్టేవారు దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇండీ, ఫోక్, ఎలెక్ట్రానిక్, నాన్-మెయిన్‌స్ట్రీమ్ ఇలా క్లాసిక్ మ్యూజిక్ ప్రియులకు పసందైన వేదికగా ఉన్న స్టార్మ్ ఏడాది చివర్లో బెంగళూరులో జరుగుతుంది.


 సబ్జా... సూపర్ ఫుడ్!

Updated By ManamThu, 03/01/2018 - 22:56

ఔషధ గుణాలు మెండుగా ఉన్న సబ్జా గింజలపై చాలామందికి చిన్న చూపు ఉంది. వేసవిలో సబ్జా గింజలను రోజూ తీసుకోవడం అలవాటుగా పెట్టుకుంటే చాలా మంచిది 

ఎలా తినాలి?
basilమార్కెట్లో లభించే సబ్జా గింజల్లో ఇసుక, రాళ్లు లేకుండా శుభ్రం చేసుకోండి.  వీటిని కాసిన్ని నీళ్లు పోసి నానబెట్టండి. 10 నిమిషాలకంతా మీకు ఉబ్బిన సబ్జాలు కనిపిస్తాయి. ఇందులో మరింత నీరు పోసి పూర్తిగా నాననివ్వాలి.  ఆతరువాత మీకు నచ్చిన వెరైటీలను ట్రై చేసేందుకు ఓ రెండు నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు బోలెడు సబ్జా వెరైటీలు సిద్ధమవుతాయి. వేసవిలో అయితే చల్లని పాలు లేదా మజ్జిగ కలుపుకుని తాగితే చాలు. కమ్మని రుచినచ్చే సబ్జా గింజలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే.. గోరువెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు విడుదలై.. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. 

ఏముంటుంది?
సబ్జా గింజలు చూసేందుకు చాలా చిన్నగా కనిపిస్తాయి..basil నానితే కాస్త సగ్గుబియ్యంలా అగుపిస్తాయి. అయితే వీటిలో ఉన్న ఔషధ గుణాలు అన్ని వయసుల వారిపై మంచి  ప్రభావం చూపుతాయి. బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని పారద్రోలుతుంది. చల్లదనాన్ని ఇచ్చి.. మీ  ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్‌గా పనిచేసే సౌందర్య సాధనం కూడా. స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కు మంచి మందుగా సబ్జా గింజలు పనిచేస్తాయి.  జుట్టు రాలడం తగ్గి, వాటి పెరగడంలో సహకరించే సబ్జా విత్తనాలకు మీ మెనూలో సరైన ప్రయారిటీ ఇవ్వడం ఇప్పటినుంచైనా మొదలు పెట్టండి. 
 

హెల్తీ డ్రింక్...
సేమ్యా, ఐస్ క్రీం, పళ్లు, జ్యూస్, పెరుగు, మజ్జిగ, పాలు ఇలా దేంతోనైనా సులువుగా కలిసిపోయే సబ్జా గింజలు వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే బెస్ట్ బాడీ కూలెంట్స్. మిల్క్ షేక్స్, నిమ్మ రసం, షర్బత్ ఇలా వేటిలోనైనా నానబెట్టిన sbja drinkసబ్జా గింజలను కలిపి తాగవచ్చు. బాడీ డీటాక్స్ కావాలంటే షార్ట్ కట్‌గా సబ్జా నీరు తాగితే సరిపోతుంది. ఎసిడిటీ వంటి సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. విటమిన్ కే, ఐరన్ పుష్కలంగా ఉన్న సబ్జా నవయవ్వనం నింపేలా సహకరిస్తుంది. తరచూ వచ్చే సీజనల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ పై చక్కగా పనిచేసే సబ్జాను మీరు మీ కిచెన్‌లో ఎప్పుడూ స్టాక్ పెట్టుకోండి. థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, తేనె, పాలు, నీళ్లు, చక్కెరతో కూడిన పలు కాంబినేషన్లతో తయారు చేసే వెరైటీలు తప్పకుండా సేవిస్తారు.  కానీ చిన్న పిల్లలకు మాత్రం ఇవి గొంతులో చిక్కుకునే ప్రమాదం ఉంది కనుక సబ్జా గింజల వెరైటీలను చిన్నారులకు ఇవ్వకపోతే మంచిది. ఇక గర్భిణీ స్త్రీలలో కూడా సబ్జా ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గించేలా ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక వీటిని గర్భిణీలు సేవించకపోతే మంచిది.  తక్కిన వారంతా సబ్జాల వెరైటీలను ఈ వేసవిలో హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.

పొట్ట చుట్టూ  ఉండే కొవ్వు సహజంగా కరిగేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. రోజు కనీసం ఓ చిన్న గ్లాసైనా సబ్జా నీరు, లేదా సబ్జాతో చేసిన ఆహార పదార్థాలు సేవించండి, ఇది రుచికరంగానూ ఉంటుంది. ఒబేసిటీతో బాధపడేవారు తప్పనిసరిగా సబ్జా గింజలు తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉన్న ఈ గింజల్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు బాగా నిండినట్టు అనిపిస్తూ, ఏదేదో జంక్ ఫుడ్ లాగించాలనే ఆలోచనలకు కళ్లెం వేస్తుంది. కనుక ఆకలి అదుపులో ఉండేలా ఇవి పనిచేస్తాయి. ఎప్పుడూ ఆకలితో అలమటించేవారు ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ లో కూడా నానబెట్టిన సబ్జాలను ఉపయోగిస్తే ఆకలిని కొంతవరకూ జయించే చాన్స్ ఉంటుంది.

Related News