anirudh

కన్ఫర్మ్ చేసిన అనిరుధ్

Updated By ManamThu, 09/06/2018 - 09:48

Nani, Anirudhప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ‘దేవదాసు’ చిత్రంలో నటిస్తున్న నాని.. ఆ తరువాత ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తన్నూరి దర్శకత్వంలో ‘జెర్సీ’లో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ చిత్రానికి తమిళ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని అనిరుధ్ కన్ఫర్మ్ చేశాడు.

ఇండస్ట్రీకి నాని వచ్చి పది సంవత్సరాలు పూర్తికాగా ఈ విషయాన్ని తెలిపిన అనిరుథ్.. నాని జెర్సీ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా నాని, అనిరుధ్‌కు వెల్‌కమ్ అంటూ చెప్పాడు. కాగా ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 అనిరుధ్ పాట, సమంత ఆట.. అదరగొడుతున్న యూటర్న్ ప్రమోషనల్ సాంగ్

Updated By ManamMon, 09/03/2018 - 10:43

U turnసమంత ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు తనే ఆలపించగా.. సమంత డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా కన్నడలో వఘన విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.రజనీ చిత్రంలో త్రిష..!

Updated By ManamThu, 08/16/2018 - 12:46

Rajinikanth, Trishaసూపర్‌‌స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. తరువాత ఈ చిత్ర షెడ్యూల్ చెన్నైలో ప్లాన్ చేశారు. కాగా ఈ చిత్రంలో త్రిష కూడా భాగం కానున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రజనీ సరసన సిమ్రాన్ నటిస్తుండగా.. మరో కీలక పాత్ర కోసం త్రిషను ఎంచుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే త్రిష బంపర్‌ ఆఫర్ సొంతం చేసుకున్నట్లే. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ, బాబీ సింహా, సనత్, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.నాని కోసం ఫ్లాప్ సంగీత దర్శకుడు..?

Updated By ManamFri, 07/20/2018 - 14:30

Anirudh ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్న నాని, ఆ తరువాత ‘మళ్లీరావా’ ఫేం గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘జెర్సీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. 

అదేంటంటే ఈ చిత్రానికి తమిళ రాక్‌స్టార్‌ అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అనిరుధ్‌తో దర్శకుడు సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. అయితే తమిళ్‌లో నంబర్.1గా సాగుతున్న అనిరుధ్.. ‘అఙ్ఞాతవాసి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ  సినిమా ఫ్లాప్ అవ్వడం, సినిమా కోసం అతడు కంపోజ్ చేసిన పాటలు అన్ని వర్గాలను మెప్పించకపోవడంతో అనిరుధ్ ఇక్కడ హిట్ కొట్టలేకపోయాడు. అంతేకాదు ఎన్టీఆర్ చిత్రానికి కూడా మ్యూజిక్ చేసే ఛాన్స్‌ను కోల్పోయాడు. ఇలాంటి సమయంలో అనిరుధ్‌కు ఈ అవకాశం రావడం విశేషం.‘భారతీయుడు 2’లో విలన్‌గా బాలీవుడ్ హీరో

Updated By ManamFri, 07/06/2018 - 10:25

kamal, ajay ప్రస్తుతం రజీనకాంత్ నటించిన ‘2.O’ పోస్ట్ ప్రొడక్షన్‌లో మునిగిన దర్శకుడు శంకర్.. ఈ చిత్రం తరువాత కమల్ హాసన్‌తో ‘భారతీయుడు’ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజా సమచారం ప్రకారంలో ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ 2.O కోసం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌ను తీసుకున్న శంకర్.. అదే తరహాలో భారతీయుడు 2 కోసం కూడా అజయ్ దేవగన్‌ను ఎన్నుకోవాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగినట్లే. కాగా ఈ చిత్రంలో కమల్ సరసన నయనతారను తీసుకోవాలని అనుకుంటుండగా.. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఫైనల్ అయినట్లు సమాచారం.నాకూ పెళ్లి వయసొచ్చింది. నీ కోసం ఎదురుచూడనా..?

Updated By ManamFri, 05/18/2018 - 11:43

nayan, vignesh నయనతార ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొలమవు కోకిల’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల కల్యాణ వయసు అనే పాట వీడియో విడుదలైంది. సినిమాలో నయనతార కోసం కమెడియన్ యోగి బాబు పాడిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుండగా, ఈ పాటకు హీరో శివ కార్తికేయన్ సాహిత్యం అందించడం మరో విశేషం.

కాగా ఈ పాట విడుదలైన కాసేపటికి నయనతార  ప్రియుడు, విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. వారిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన విఘ్నేశ్.. ‘‘నాకు పెళ్లి వయసు వచ్చింది. నీ కోసం వెయిట్ చేయనా?’’ అంటూ కామెంట్ చేశాడు. అలాగే తన పరిస్థితికి సరిపోయే పాటను ఇచ్చిన అనిరుధ్, శివకార్తికేయన్‌కు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నాడు విఘ్నేశ్ శివన్.
 

 ర‌జ‌నీకాంత్ చిత్రానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

Updated By ManamThu, 03/01/2018 - 16:29

anirudhసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రానికి ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం అంటే.. అది అదృష్టానికి మించిన విష‌యం కిందే లెక్క. ఇప్పుడు ఆ అదృష్టం ఓ క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ద‌క్కింది. అత‌ను మ‌రెవ‌రో కాదు.. అనిరుధ్‌. త‌మిళంలో విజ‌య్‌, అజిత్‌, సూర్య వంటి అగ్ర హీరోల చిత్రాల‌కు సంగీత‌మందించిన ఈ యువ స్వ‌ర‌క‌ర్త‌.. తొలిసారిగా ర‌జ‌నీకాంత్ సినిమాకు ప‌నిచేయ‌బోతున్నారు. వాస్త‌వానికి.. ర‌జ‌నీకి ద‌గ్గ‌ర బంధువు అయినప్ప‌టికీ.. అనిరుధ్‌కు ఆయ‌న‌తో ప‌నిచేసే అవ‌కాశం మాత్రం కాస్త ఆల‌స్యంగానే ద‌క్కింది. 'పిజ్జా' ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.‘అజ్ఞాతవాసి’ సెకండ్ సింగిల్ వ‌చ్చింది

Updated By ManamTue, 12/12/2017 - 13:58

pawan 25పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది. అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి “బయటకొచ్చి చూస్తే” పాటను త్రివిక్రమ్ పుట్టినరోజున విడుదల చేసారు. ఆ పాటకి మంచి స్పందన వచ్చింది. అలాగే అందరూ అనిరుధ్‌ మ్యూజిక్ కి ఫిదా అయిపోయారు. అంతే కాదు ఈ పాట పాడింది కూడా అనిరుధ్‌ కావడం విశేషం. శ్రీమణి రాసిన ఆ పాటకి మంచి స్పందన కూడా వచ్చింది. త‌ను ప్రేమించిన‌ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాను అని చెప్పే ఓ అబ్బాయి భావాల‌తో ఆ పాట‌ను రచయిత రాసారు. 
మరి రెండో పాట “గాలి వాలుగా” ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. దానికి త‌గ్గ‌ట్టుగానే అంద‌మైన ప‌దాల‌తో పాటను మలిచారు గీత‌రచయిత.  ప్రేయసిని పొగుడుతూ, “కొర కొర కోపమేల, చుర చుర చూపులేల.. మనోహరి మాడిపోనా అంతగా ఉడికిస్తే.. అరే అని జాలి పడవే, పాపం కదే ప్రేయసి” అంటూ తన మనోవేదనని చాలా రొమాంటిక్ గా ప్రియుడు పాడుతున్న పాటని.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) విడుదల చేసారు. ఇలాంటి పాటలు ఇప్పటికే కొన్ని వందలు రాసుంటారు గేయ రచయిత. అయినా.. ఆయన కలం ఇంకా రాస్తాను అని అంటూనే ఉంటుంది. ఆ గేయ రచయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి. శాస్త్రి గారు ఈ పాటను సున్నితమైన పదాలతో చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే అనిరుధ్ మ‌రోసారి తన సంగీతంతో మాయ చేసారు. ఈ పాటను కూడా అనిరుధ్‌ పాడటం విశేషం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆడియో లాంచింగ్ కార్యక్రమాన్ని డిసెంబర్ 19న‌ హైదరాబాదులోని నోవాటెల్ లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.'గాలి వాలుగా' అంటున్న‌ 'అజ్ఞాత‌వాసి'

Updated By ManamWed, 12/06/2017 - 21:40

agnyathavaasiపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే “బయటకొచ్చి చూస్తే” పాటను విడుదల చేసారు. త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు విడుద‌లైన ఈ పాట‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. అనిరుధ్ పాడిన ఈ గీతానికి శ్రీ‌మ‌ణి సాహిత్య‌మందించారు. కాగా, రెండో సింగిల్ గా “గాలి వాలుగా” పాట‌ని విడుద‌ల చేయ‌బోతోంది చిత్ర యూనిట్‌. అయితే, ఈ పాట ఎప్పుడు విడుద‌ల‌వుతుందో గురువారం చెబుతామ‌ని చిత్ర బృందం ఊరిస్తోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.డిసెంబ‌ర్ 3న 'వేలైక్కార‌న్‌' ఆడియో

Updated By ManamFri, 11/24/2017 - 20:11

velaikkaranశివ‌కార్తీకేయ‌న్‌, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన త‌మిళ చిత్రం 'వేలైక్కార‌న్‌'. 'జ‌యం' రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, అనిరుధ్ సంగీత‌మందిస్తున్న‌ ఈ చిత్ర ఆడియోని డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 22న 'వేలైక్కార‌న్' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 24ఎఎం స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

Related News