petrol

పెళ్లి గిఫ్ట్‌గా పెట్రోల్

Updated By ManamMon, 09/17/2018 - 12:33

Friends present petrol as wedding giftచెన్నై: రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు కొత్త దంపతులకు రాకూడదనుకున్నారో ఏమో తెలీదు కానీ.. పెళ్లి కొడుకు స్నేహితులు వినూత్నంగా ఆలోచించారు. తమ స్నేహితుడి పెళ్లికి గిఫ్ట్‌గా ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో అక్కడున్న వారందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ ఘనట తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని చిదంబరంలో ఆదివారం ఓ జంటకి పెళ్లి అవ్వగా.. పెళ్లి కొడుకు స్నేహితులు 5లీటర్ల పెట్రోల్‌ను బహుకరించారు. ఈ బహుమానంపై పెళ్లికూతురు, పెళ్లికొడుకు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే పెట్రోల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సర్వాత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamMon, 09/17/2018 - 10:16

Petrol, Dieselన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.44, డీజిల్ రూ.77.58లతో ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది. ఇక రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.06, డీజిల్ రూ.73.78.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.85.88, డీజిల్ రూ.78.98.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధరలు రూ.86.82, డీజిల్ రూ.78. 28గా ఉన్నాయి. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.విమానమైన విత్తనం

Updated By ManamSat, 09/15/2018 - 01:09
 • జత్రోఫా చమురుతో ఎగురుతున్న స్పైస్‌జెట్ విమానం  

ప్రతిరోజూ సగటు భారతీయుడు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఈ ‘పెట్రోబాంబు’ దాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతుంటాడు. దేశం ఎదుర్కొంటున్న పెట్రో సమస్యలకు శాశ్వత పరి ష్కారం అంటూ ఏదీ దొర క్కపోయినా, తాత్కాలిక ఉపశమనం అయినా దొరికి తే చాలునని భావించే వారికి ‘సహజఇంధనం’ ఒక వరంలా కని పిస్తోంది. మొక్కలు, జంతు వుల నుంచి సేకరించే ఇంధనాన్ని సహజ ఇంధ నం అంటారు. సహజ ఇంధన ఉత్పత్తి పెంచే ఆలోచనలో భాగంగానే 2003లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ‘జత్రో ఫా’ సాగును ఒక ఉద్యమ స్థాయిలో ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం  వృక్షసంబంధిత సహజ ఇంధనంగా జత్రోఫాను 2009లో గుర్తించింది. సంప్రదాయ డీజిల్‌కు 20 శాతం జత్రోఫా చమురును కలపడం ద్వారా 2017 నాటికి బయోడీజిల్ ఉత్పాదనను మరింతగా పెంచాలని నేషనల్ బయోడీ జిల్ మిషన్ నిర్ణయించింది. 

image


‘జత్రోఫా కర్కాస్’ అనేది మెక్సికో, అమెరికాల్లో విరివి గా కనిపించే ఒక మొక్క. అయితే ఇది భారతదేశంలోని బంజరు భూముల్లో చక్కగా పెరుగుతుందని తెలుసుకున్న తరువాత బయో డీజిల్ తయారీకి జత్రోఫాను ఉపయోగించడం ఎక్కువైంది. బయో డీజిల్ ఉత్పాదనకు జత్రోఫా చక్కటి వనరు. అందుకే దేశవ్యాప్తంగా జత్రోఫా సాగును ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయభూముల్లో కాకుం డా బంజరు భూముల్లో అతి తక్కువ ఖర్చుతో జత్రోఫా సాగు సాధ్యమవుతుండడంతో రైతులకు ఇది కల్పవృక్షమే అయింది. జత్రో ఫా వినియోగం ఎంతటి చక్కటి ఫలితాలను ఇచ్చిందంటే పదమూ డేళ్ళ క్రితం బిలాస్‌పూర్ దగ్గర ఘట్‌పెరా అనే గ్రామంలో జత్రోఫా సాగు ప్రారంభమైంది. దేశంలో 2018 నాటికల్లా ఇంధన స్వాతం త్య్రాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఈ సాగు మొదలైంది. ఫలితంగా డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి సహజ ఇంధనంతో నడిచే మొదటి స్పైస్ జెట్ విమానాన్ని ప్రారంభించడం సాధ్యమైంది. ఘట్‌బెరా పొలాల నుంచి జత్రోఫా విత్తనాల్ని రాయ్‌పూర్‌కు పంపుతారు. అక్కడ విత్తనాల నుంచి చమురును సేకరించి, డెహ్రాడూన్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం’ సంస్థకు పంపుతారు. 

జత్రోఫా మొక్క తక్కువ నీటితో చక్కగా పెరుగుతుంది. వర్షాభావ ప్రాంతాల్లో, కరవు పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో కూడా ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ మొక్కల్ని పెంచడం ద్వారా భూమి కోతకు గురికాకుండా కాపాడుకోవచ్చు.  భారతీయ గ్రామీణులకు జత్రోఫా సాగు చక్కని ఉపాధిని కల్పిస్తోం ది. దీనికి చీడపీడల సమస్య కూడా తక్కువే. ఇన్ని లాభదాయక లక్షణాలున్న ఈ జత్రోఫా సాగు రైతుల్ని బాగా ఆకర్షిస్తోంది. తమ పొలాల్లో పండించిన విత్తనాలతో ఆకాశంలో విమానం ఎగురు తుండడాన్ని గర్వంగా భావిస్తున్నారు ఘట్‌పెరా గ్రామస్తులు. సహజ ఇంధన రంగంలో ఇలాంటి మరిన్ని శుభపరిణామాలకు స్వాగతం పలికితే, సగటు భారతీయునికి సింహస్వప్నమైన పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల బాధ తప్పుతుంది.‘ధరల’ కట్టడికి దార్లెన్నో..!

Updated By ManamThu, 09/13/2018 - 04:12

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ విధానంలోకి తీసుకువస్తే దేశమంతా ఒకేపన్ను, ఒకే మార్కెట్ విధానం అమలులోకి వచ్చి పరోక్ష పన్నుల శాతం తగ్గుతుంది. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే అత్యధిక రేటు 28 శాతం విధించినా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు 55 రూపాయలకు మించవు. ఫలితంగా ఆదాయంలో తగ్గుదలను కార్పొరేట్ పన్నుల సమీకరణ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. 

petrol‘మనసుంటే మార్గం ఉంటుం’దని అంటారు. అదే ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల్లో కేంద్రప్రభుత్వానికి వర్తిస్తుంది. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ధర పెరిగిందంటూ రోజురోజుకూ పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ తదితరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. ఇది ప్రత్యక్షంగా కనిపించే ధరలైతే పరోక్షంగా నిత్యావసరాలన్నీ అందుబాటు ధరల్లో ఉండడం లేదు. సామాన్యుడు గిలగిలలాడుతున్నాడు. ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిత్యం చెబుతోంది. ప్రజలేమో పెట్రోలు, నిత్యావసర ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికిదేమీ పట్టనట్టు ప్రేక్షకపాత్ర వహిస్తోంది. ధరల అదుపునకు తాము చర్యలు తీసుకోకపోతే పోయె కనీసం సానుభూతి చర్యలుగానీ, ఊరడింపు మాటలు కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న కేంద్రంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. వీటి ధరలు పెరగడం మంచినీళ్లు తాగినంత సులువుగా ప్రతిరోజూ అనూహ్యంగా పెరుగుతూనే ఉ న్నాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా పెట్రోలు ధర లీటరు 80 రూపాయలకు పైమాటే. అలాగే డీజిల్ రేటు 70కి పైమాటే. ఆయా రాష్ట్రాల్లో విధించే వ్యాట్‌పై ఆధారపడి ఈ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పట్టించుకోవలసిన ప్రభుత్వం తాను చేయగలిగిందేమీ లేదన్నట్లు మీనవేుషాలు లెక్కిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పరివారమేమో నిస్సహాయతతో చేతులెత్తేసింది. ఈ ధరలకు అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణమనే సాకులు చెబుతున్నారు. రాష్ట్రాలేమో కేంద్రంపై నెపం నెడుతుండగా, కేంద్రమేమో రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వల్లెవేస్తోంది. ఒకరిపై మరొకరు నెపం మోపుకోవడం చూస్తుంటే అంతా కుంటిసాకులుగా ఎవరికైనా అర్థమవుతుంది. పొరుగు దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పాతాళంలో ఉండగా ఒక్క మనదేశంలోనే ఆకాశంలో విహరిస్తున్నాయి. 2018 సెప్టెంబర్ ఒకటో తేదీ లెక్కల ప్రకారం, భారత్ (ఢిల్లీ)లో పెట్రోలు లీటరు 78.68 రూపాయులుండగా, డీజిల్ లీటరుకు 70.42 రూపాయులున్నది. అదే పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు ధర 53.55, డీజిల్ లీటరు 61.47 రూపాయులున్నది. బంగ్లాదేశ్‌లో పెట్రోలు 73.48, డీజిల్ 55.54, శ్రీలంకలో పెట్రోలు 63.96, డీజిల్ 52.05, నేపాల్‌లో పెట్రోలు 69.94, డీజిల్ 59.86 రూపాయులున్నది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ సంఘానికి చెందిన పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ విభాగం (పీపీఏసీ) లెక్కలివి. 

మరి భారత్‌లోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర దేశాలతో పోల్చితే ఎందుకింత వ్యత్యాసం? అంటే సెం ట్రల్ ఎక్సైజ్ పన్ను, రాష్ట్రాలు విధించే వ్యాట్... రెండూ కలిసి ప్రజలను కొల్లగొడుతున్నాయి. లీటరు పెట్రోలు కు కేంద్ర ప్రభుత్వం 19.48 రూపాయల ఎక్సైజ్ సుంకం వసూలుచేస్తోంది. అదే డీజిల్‌కు లీటరుకు 15.55 వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు విధించే వ్యాట్‌తో మొత్తం రేటు తడిసి మోపెడంత అవుతోంది. ఈ పన్నులు లేకపోతే అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరలు ఎంతున్నా లీటరు పెట్రోలు దాదాపు 40 రూపాయలుంటుంది. పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో పరోక్ష పన్నులు (సెంట్రల్ ఎక్సైజ్ పన్ను, రాష్ట్రాలు విధించే వ్యాట్) పెట్రోలు ధరలపై నూటికి నూరు శాతం ప్రభావం చూపుతున్నాయని అర్థమవుతోంది. డీజిల్ ధరలపై 70 శాతం ఉంటోంది. కేంద్రం విధిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ పన్ను (జీటీఆర్) యూపీఏ ప్రభుత్వ హయాంలో కంటే ప్రజల కోసం పనిచేస్తున్న (ఎన్‌డీఏ నేతలు అలా చెప్పుకుంటున్నారు) ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే అధికం. 2009-10 నుంచి 2013-14 మధ్య ఐదేళ్లకాలంలో పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన పన్నుల వల్ల లభించిన స్థూల పన్ను ఆదాయం సగటున 8.8 శాతం పెరిగింది. అదే తరు వాత ఐదేళ్ల కాలం అంటే ఎన్‌డీఏ హయాంలో 2014- 15 నుంచి 2017-18 కాలంలో 12.5 శాతం చొప్పున పెరిగింది. అదేవిధంగా కార్పొరేట్ పన్నులు యూపీఏ -1 హయాంలో 36.5 శాతం ఉండగా, యూపీఏ-2 హయాంలో 30.7 శాతం ఉన్నది. యూపీఏ -2 హ యాంలో ఆదాయపు పన్ను ఆదాయంలో వాటా 19 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది. ఇది చూస్తుంటే ఆదాయ సమీకరణ వ్యూహంలో ఎన్‌డీఏ అనుసరించిన వర్గ పక్షపాతాన్ని (ఛిజ్చూటట ఛజ్చీట) చూపిస్తోంది. పెద్దసంఖ్యలో కార్పొరేట్ సంస్థల పన్ను వాటాలో తగిన విధంగా తగ్గగా, ఇంధన వినియోగదారులు, ఆదాయపన్నుదారుల వాటా ద్విగుణీకృతంగా పెరగడం కనిపిస్తుంది. అంటే పేదలు, మధ్యతరగతి వారి మూల్యంపై బడా పారిశ్రామికవేత్తలు ప్రయోజనం పొందారు. ఇప్పటికైనా ఈ సామాజిక అసమానతను, అన్యాయ నిధుల సమీకరణ విధానాన్ని సవరించవలసిన అవసరం ఉన్నది. 

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటే ప్రతిపక్షాలు సూచిస్తున్న మార్గమే శరణ్యం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ విధానంలోకి తీసుకువస్తే దేశమంతా ఒకేపన్ను, ఒకే మార్కెట్ విధానం అమలులోకి వచ్చి పరోక్ష పన్నుల శాతం తగ్గుతుంది. కిరోసిన్, ఎల్‌పీజీలు ఇప్పటికే జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చారు. అదే విధానాన్ని పెట్రోలు, డీజిల్‌కూ అనుసరించాలి. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే అత్యధిక రేటు 28 శాతం విధించినా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు 55 రూపాయులకు మించవు. ఫలితంగా ఆదాయంలో తగ్గుదలను కార్పొరేట్ పన్నుల సమీకరణ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. 2018-19 బడ్జెట్ అంచనాల ననుసరించి కార్పొరేట్లకు పన్ను రాయితీల కారణంగా గత రెండేళ్లలో ఒక్కొక్క ఏడాదికి 85వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఆదాయ సమీకరణలో పారిశ్రామిక అనుకూల విధానాన్ని సవరించుకోవలసి ఉన్నది. 
ప్రసేన్‌జీత్ బోస్
ఆర్థికవేత్త, రాజకీయ కార్యకర్త
(‘వైర్’ సౌజన్యం)ఏపీలో పెట్రోల్‌పై రూ.2 వ్యాట్ తగ్గింపు

Updated By ManamMon, 09/10/2018 - 15:45
 • పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రజలకు స్వల్ప ఊరట

 • రూ.2 వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు ప్రకటన

Andhra pradesh cut VAT by Rs2 on petrol, diesel

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్రల్, డీజిల్ ధరలపై స్వల్ప ఊరట లభించింది. పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రూ.2 వ్యాట్ తగ్గించింది. ఈ నిర్ణయంతో ఏపీ ఖజానాపై దాదాపు రూ.1120 కోట్ల భారం పడనుంది. కాగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ప్రస్తుతం వ్యాట్ రూ.4 వసూలు చేస్తోంది.చమురు ధరల పెంపుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. తగ్గిన ధరలు రేపటి (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 

‘గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత చమురు సంస్థలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ రోజు ప్రతిపక్షాల బంద్‌కు ప్రజలనుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని వర్గాలకు భరించలేని భారంగా మారాయి. 

ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలను గత నాలుగున్నరేళ్లుగా తీసుకోకపోవడం గర్హనీయం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నాయి. ప్రజల ఆవేదనల్లో పాలు పంచుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల వ్యాట్‌ రేట్లు పెంచడం వల్ల డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించడంసాధ్యం కాదని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించారు. ఈ ప్రకటన వాస్తవానికి దూరంగాను, ప్రజల్ని మభ్యపెట్టేదిగా ఉంది. బాధ్యతా రహితమైన ఈ ప్రకటనను ఖండిస్తున్నాం.’

‘2014లో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 105.5 డాలర్లు ఉండగా నేడు కేవలం 72.23 డాలర్లుగా ఉంది. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 49.60పైసలు ఉంటే నేడు 86.71పైసలకు పెరిగింది. డీజిల్‌ ధర 2014లో రూ.60.98పైసలు ఉంటే.. నేడు రూ. 79.98లుగా ఉన్నది. గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో దోచుకుంది.

ఇప్పుడు మాత్రం ముడిచమురు ధరలు పెరిగాయన్న నెపంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారు. ఒక విధానమేమీ లేకుండా నిరంకుశంగా కేంద్రం వ్యవహరిండచాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 2014 జూన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌పై రూ. 3.50 పైసలు ఉండగా.. 2017 సెప్టెంబర్‌ నాటికి లీటర్‌పై రూ.17.33 పైసలకు పెంచారు. 

2014లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 9.48 పైసలు ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని 2018 నాటికి లీటర్‌కు రూ.19.48 పైసలు పెంచారు. ఇదే కాకుండా మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.8లు అదనపు భారాన్ని వినియోదారులనుంచి వసూలు చేస్తున్నారు.

ఒకవైపు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సెస్‌ల రూపంలో వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10లక్షల కోట్లు పైచీలుకు నిధులు ఎక్సైజ్‌డ్యూటీ ద్వారా సమకూరుతున్నప్పటికీ సామాన్య జనంపై భారం తగ్గించడానికి కేంద్రం చొరవ చూపకపోవడం దుర్మార్గం. కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోతోంది’ అని విమర్శించారు.

 దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

Updated By ManamMon, 09/10/2018 - 09:26

Bharat Bandhన్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు 21 పార్టీలు మద్దతును ప్రకటించాయి. ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునివ్వగా.. రాజమండ్రిలో వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాపపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో బస్లాండ్ల దగ్గర నిరసన చేస్తున్నారు. పలు జిల్లాల్లో బస్టాండ్లకే బస్సులు పరిమితమవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోల్‌కతాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్‌తో కోల్‌కతా ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. కాగా బంద్ నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.సెంచరీ దిశగా పెట్రో ధరలు!

Updated By ManamSun, 09/09/2018 - 10:12
 • సెంచరీకి చేరువగా పెట్రోలు ధర

 • 80ని దాదాపు తాకిన డీజిల్

 • సగం వాటా కేంద్ర.. రాష్ట్ర పన్నులే

 • డీజిల్‌పై వ్యాట్‌లో తెలంగాణ టాప్

 • పెట్రోలు మీద ముంబై అగ్రస్థానం

 • రూపాయి తగ్గుదల కూడా కారణమే

Petrol Price Touches New High Day Before Bharat Bandh

న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేందుకు పరుగులు పెడున్నాయి. ఒకవైపు రూపాయి పతనం, మరోవైపు దిగుమతులు ఖరీదు కావడంతో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధానిలో తొలిసారి లీటరు పెట్రోలు ధర రూ. 80.50 దాటింది. ఓ వైపు పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షం ఈ నెల 10న (సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఆదివారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50, డిజీల్ రూ.72.61 పైసలుగా నమోదు అయింది. కాగా ఇవాళ ఉదయం పెట్రోల్  ధర12 పైసలు, డీజిల్ 10 పైసలు పెరిగింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.89, డీజిల్ రూ.77.09గా ఉంది.

మెట్రో నగరాలన్నింటితో పోలిస్తే ఢిల్లీలో పెట్రోధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. పన్నులు తక్కువగా ఉండటం వల్లే ఇలా ఉందని తెలుస్తోంది. ముంబైలో పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న పెట్రోధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పుడు స్వదేశంలో ధర తగ్గించాలంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పలు వర్గాల నుంచి డిమాండు వస్తున్నా.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. 

ఆగస్టు రెండోవారం నుంచి చూస్తే పెట్రోల ధర రూ. 3.24, డీజిల్ రూ. 3.74 చొప్పున పెరిగాయి. అవెురికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బాగా పడిపోవడంతో దిగువుతులు ఖరీదయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధ రలలో దాదాపు సగం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ. 19.48, డీజిల్‌పై రూ. 15.33 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది. దానికితోడు రాష్ట ప్రభుత్వాలు వ్యాట్ కూడా వేస్తాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత తక్కువగా 6% వ్యాట్ మాత్రమే విధిస్తారు. పెట్రోలు మీద ముంబైలో అత్యధికంగా 39.12%, డీజిల్ మీద అత్యధికంగా తెలంగాణలో 26% వ్యాట్ ఉంది. ఢిల్లీలో పెట్రోలుపై 27%, డీజిల్‌పై 17.24% చొప్పున వ్యాట్ ఉంది. 

కేంద్ర ప్రభుత్వం 2014 నవంబరు నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లుగా పెట్రోలుపూ రూ. 11.77, డీజిల్‌పై 13.47 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. తర్వాత గత సంవత్సరం అక్టోబరులో లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించింది. 2014-15లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై ఎక్సైజ్ పన్ను రూపేణా రూ. 99,184 కోట్లు మాత్రమే రాగా, 2017-18లో అది ఏకంగా రూ. 2,29,019 కోట్లయింది. పెట్రో పరుగు

Updated By ManamSun, 09/09/2018 - 00:16
 • 90కి చేరువగా పెట్రోలు ధర..  80ని దాదాపు తాకిన డీజిల్

 •  సగం వాటా కేంద్ర.. రాష్ట్ర పన్నులే..  డీజిల్‌పై వ్యాట్‌లో తెలంగాణ టాప్

 • పెట్రోలు మీద ముంబైదే అగ్రస్థానం.. పెట్రో పరుగులు!

Petro న్యూఢిల్లీ: ఒకవైపు రూపాయి పతనం, మరోవైపు దిగుమతులు ఖరీదు కావడంతో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. దేశరాజధానిలో తొలిసారి లీటరు పెట్రోలు ధర రూ.80 దాటింది. తెలుగు రాష్ట్రాలలో మా త్రం అది ఎప్పుడో దాటేసింది. శనివారం ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 80.38గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు రూ. 85.23గా ఉంది. ఢిల్లీలో డీజిల్ ధర రూ. 72.51కి చేరుకోగా, హైదరాబాద్‌లో రూ. 78.87 అయ్యింది. విజయవాడలో ధర మరింత ఎక్కువగా ఉంది. అక్కడ పెట్రోలు లీటరు 86.35, డీజిల్ రూ. 79.65 చొప్పున ఉన్నాయి. ముంబైలో పెట్రోలు మరింత ఎక్కువగా రూ. 87.77, డీజిల్ రూ. 76.98 చొప్పున ఉన్నాయి. మెట్రో నగరాలన్నింటితో పోలిస్తే ఢిల్లీలో పెట్రోధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. పన్నులు తక్కువగా ఉండటం వల్లే ఇలా ఉందని తెలుస్తోంది. ముంబైలో పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న పెట్రోధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పుడు స్వదేశంలో ధర తగ్గించాలంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పలు వ ర్గాల నుంచి డిమాండు వస్తున్నా.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. ఆగస్టు రెండోవారం నుంచి చూస్తే పెట్రోల ధర రూ. 3.24, డీజిల్ 3.74 చొప్పున పెరిగాయి. అవెురికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బాగా పడిపోవడంతో దిగుమతులు ఖరీదయ్యాయి.మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamSat, 09/08/2018 - 10:00

Diesel, Petrolగత కొన్ని రోజులుగా పెరగడం తప్ప తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 42 పైసలు, డీజిల్‌పై 48పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.85.23, డీజిల్ రూ 78.87 ఉండగా.. విజయవాడలో పెట్రోల్ రూ.86.69, డీజిల్ రూ.79.99గా ఉంది. వీటితో పాటు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.80.38, డీజిల్ రూ.72.51..  ముంబైలో పెట్రోల్ ధర రూ.87.77, డీజిల్ రూ.76.98.. చెన్నైలో పెట్రోల్ ధర రూ.83.54, డీజిల్ రూ.76.64గా ఉంది. కాగా రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 10న కాంగ్రెస్ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తోంది.మరో 48 పైసలు పెరిగిన పెట్రోల్

Updated By ManamFri, 09/07/2018 - 22:42
 • డీజిల్‌పై 47 పైసలు పెంచిన కంపెనీలు

 • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 79.99 చేరిక

petrolన్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరుకున్న పెట్రో ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోలుపై 48 పైసలు, లీటర్ డీజిల్‌పై 47 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.99కి, లీటర్ డీజిల్ ధర రూ.72.07కు చేరుకుంది. గతంలో ఈ రేట్లు వరుసగా రూ. 79.31, రూ.71.85గా ఉన్నాయి. పెరిగిన రేట్ల ప్రకారం ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.87.39కి చేరుకుంది. ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ.76.51కి చేరుకుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు.. రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతుండటంతో  పెట్రో ధరల పెంపు అనివార్యమవుతోందని చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి.

Related News