diesel

మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamMon, 09/17/2018 - 10:16

Petrol, Dieselన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.44, డీజిల్ రూ.77.58లతో ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది. ఇక రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.06, డీజిల్ రూ.73.78.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.85.88, డీజిల్ రూ.78.98.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధరలు రూ.86.82, డీజిల్ రూ.78. 28గా ఉన్నాయి. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.ఏపీలో పెట్రోల్‌పై రూ.2 వ్యాట్ తగ్గింపు

Updated By ManamMon, 09/10/2018 - 15:45
  • పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రజలకు స్వల్ప ఊరట

  • రూ.2 వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు ప్రకటన

Andhra pradesh cut VAT  by Rs2 on petrol, diesel

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్రల్, డీజిల్ ధరలపై స్వల్ప ఊరట లభించింది. పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రూ.2 వ్యాట్ తగ్గించింది. ఈ నిర్ణయంతో ఏపీ ఖజానాపై దాదాపు రూ.1120 కోట్ల భారం పడనుంది. కాగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ప్రస్తుతం వ్యాట్ రూ.4 వసూలు చేస్తోంది.చమురు ధరల పెంపుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. తగ్గిన ధరలు రేపటి (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 

‘గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత చమురు సంస్థలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ రోజు ప్రతిపక్షాల బంద్‌కు ప్రజలనుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని వర్గాలకు భరించలేని భారంగా మారాయి. 

ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలను గత నాలుగున్నరేళ్లుగా తీసుకోకపోవడం గర్హనీయం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నాయి. ప్రజల ఆవేదనల్లో పాలు పంచుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల వ్యాట్‌ రేట్లు పెంచడం వల్ల డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించడంసాధ్యం కాదని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించారు. ఈ ప్రకటన వాస్తవానికి దూరంగాను, ప్రజల్ని మభ్యపెట్టేదిగా ఉంది. బాధ్యతా రహితమైన ఈ ప్రకటనను ఖండిస్తున్నాం.’

‘2014లో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 105.5 డాలర్లు ఉండగా నేడు కేవలం 72.23 డాలర్లుగా ఉంది. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 49.60పైసలు ఉంటే నేడు 86.71పైసలకు పెరిగింది. డీజిల్‌ ధర 2014లో రూ.60.98పైసలు ఉంటే.. నేడు రూ. 79.98లుగా ఉన్నది. గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో దోచుకుంది.

ఇప్పుడు మాత్రం ముడిచమురు ధరలు పెరిగాయన్న నెపంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారు. ఒక విధానమేమీ లేకుండా నిరంకుశంగా కేంద్రం వ్యవహరిండచాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 2014 జూన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌పై రూ. 3.50 పైసలు ఉండగా.. 2017 సెప్టెంబర్‌ నాటికి లీటర్‌పై రూ.17.33 పైసలకు పెంచారు. 

2014లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 9.48 పైసలు ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని 2018 నాటికి లీటర్‌కు రూ.19.48 పైసలు పెంచారు. ఇదే కాకుండా మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.8లు అదనపు భారాన్ని వినియోదారులనుంచి వసూలు చేస్తున్నారు.

ఒకవైపు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సెస్‌ల రూపంలో వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10లక్షల కోట్లు పైచీలుకు నిధులు ఎక్సైజ్‌డ్యూటీ ద్వారా సమకూరుతున్నప్పటికీ సామాన్య జనంపై భారం తగ్గించడానికి కేంద్రం చొరవ చూపకపోవడం దుర్మార్గం. కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోతోంది’ అని విమర్శించారు.

 దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

Updated By ManamMon, 09/10/2018 - 09:26

Bharat Bandhన్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు 21 పార్టీలు మద్దతును ప్రకటించాయి. ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునివ్వగా.. రాజమండ్రిలో వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాపపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో బస్లాండ్ల దగ్గర నిరసన చేస్తున్నారు. పలు జిల్లాల్లో బస్టాండ్లకే బస్సులు పరిమితమవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోల్‌కతాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్‌తో కోల్‌కతా ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. కాగా బంద్ నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.సెంచరీ దిశగా పెట్రో ధరలు!

Updated By ManamSun, 09/09/2018 - 10:12
  • సెంచరీకి చేరువగా పెట్రోలు ధర

  • 80ని దాదాపు తాకిన డీజిల్

  • సగం వాటా కేంద్ర.. రాష్ట్ర పన్నులే

  • డీజిల్‌పై వ్యాట్‌లో తెలంగాణ టాప్

  • పెట్రోలు మీద ముంబై అగ్రస్థానం

  • రూపాయి తగ్గుదల కూడా కారణమే

Petrol Price Touches New High Day Before Bharat Bandh

న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేందుకు పరుగులు పెడున్నాయి. ఒకవైపు రూపాయి పతనం, మరోవైపు దిగుమతులు ఖరీదు కావడంతో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధానిలో తొలిసారి లీటరు పెట్రోలు ధర రూ. 80.50 దాటింది. ఓ వైపు పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షం ఈ నెల 10న (సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఆదివారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50, డిజీల్ రూ.72.61 పైసలుగా నమోదు అయింది. కాగా ఇవాళ ఉదయం పెట్రోల్  ధర12 పైసలు, డీజిల్ 10 పైసలు పెరిగింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.89, డీజిల్ రూ.77.09గా ఉంది.

మెట్రో నగరాలన్నింటితో పోలిస్తే ఢిల్లీలో పెట్రోధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. పన్నులు తక్కువగా ఉండటం వల్లే ఇలా ఉందని తెలుస్తోంది. ముంబైలో పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న పెట్రోధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పుడు స్వదేశంలో ధర తగ్గించాలంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పలు వర్గాల నుంచి డిమాండు వస్తున్నా.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. 

ఆగస్టు రెండోవారం నుంచి చూస్తే పెట్రోల ధర రూ. 3.24, డీజిల్ రూ. 3.74 చొప్పున పెరిగాయి. అవెురికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బాగా పడిపోవడంతో దిగువుతులు ఖరీదయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధ రలలో దాదాపు సగం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ. 19.48, డీజిల్‌పై రూ. 15.33 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది. దానికితోడు రాష్ట ప్రభుత్వాలు వ్యాట్ కూడా వేస్తాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత తక్కువగా 6% వ్యాట్ మాత్రమే విధిస్తారు. పెట్రోలు మీద ముంబైలో అత్యధికంగా 39.12%, డీజిల్ మీద అత్యధికంగా తెలంగాణలో 26% వ్యాట్ ఉంది. ఢిల్లీలో పెట్రోలుపై 27%, డీజిల్‌పై 17.24% చొప్పున వ్యాట్ ఉంది. 

కేంద్ర ప్రభుత్వం 2014 నవంబరు నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లుగా పెట్రోలుపూ రూ. 11.77, డీజిల్‌పై 13.47 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. తర్వాత గత సంవత్సరం అక్టోబరులో లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించింది. 2014-15లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై ఎక్సైజ్ పన్ను రూపేణా రూ. 99,184 కోట్లు మాత్రమే రాగా, 2017-18లో అది ఏకంగా రూ. 2,29,019 కోట్లయింది. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamSat, 09/08/2018 - 10:00

Diesel, Petrolగత కొన్ని రోజులుగా పెరగడం తప్ప తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 42 పైసలు, డీజిల్‌పై 48పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.85.23, డీజిల్ రూ 78.87 ఉండగా.. విజయవాడలో పెట్రోల్ రూ.86.69, డీజిల్ రూ.79.99గా ఉంది. వీటితో పాటు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.80.38, డీజిల్ రూ.72.51..  ముంబైలో పెట్రోల్ ధర రూ.87.77, డీజిల్ రూ.76.98.. చెన్నైలో పెట్రోల్ ధర రూ.83.54, డీజిల్ రూ.76.64గా ఉంది. కాగా రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 10న కాంగ్రెస్ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తోంది.మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamMon, 09/03/2018 - 11:55

petrol, dieselహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.83.59 ఉండగా.. డీజిల్ ధర రూ.76.97గా ఉంది. మరోవైపు విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.09, డీజిల్ రూ.78.22గా ఉంది. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamMon, 08/27/2018 - 14:17
petrol, diesel

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం డీజిల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది.  లీటర్ డీజిల్ ధర 69.46కు చేరగా, పెట్రోల్ రూ.78కి చేరింది. అంతర్జాతీయగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు రూపాయి పతనం కూడా ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. డీజిల్ ధ‌ర 14 పైసలు, పెట్రోల్ 13 పైసల మేర పెరిగింది. 

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.69.46 పైసలు ఉండగా, ముంబైలో 73.74గా ఉంది. అలాగే పెట్రోల్ ఢిల్లీలో లీటర్ రూ.77.91, ముంబైలో  85.33గా ఉంది. కాగా డీజిల్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మేలో డీజిల్ ధర రూ.69.31గా నమోదైంది. కాగా  గతేడాది జూన్ 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రోజువారి సమీక్షా విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamSat, 07/14/2018 - 13:10

Petrol, Diesel, Petrol, Diesel Prices, Hiked For Third Straight Dayముంబై: ఇందన ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు లీటర్‌‌కు 19-20 పైసలు చొప్పున పెరగగా, డీజిల్ ధరలు లీటర్‌కు 18-19 పైసలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.95గా నమోదైంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.33, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.61, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.87గా నమోదయ్యాయి.

అలాగే ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.68.61, ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.72.80, కోల్‌కతాలో లీటర్ డీజిల్ ధర రూ.71.16, చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ.72.43గా నమోదయ్యాయి. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. గత ఏడాది జూన్ మధ్యలో రోజువారీ ఇందన ధరల మార్పునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటినుంచి దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. 
Petrol, Diesel Prices Hiked For Third Straight Dayనెలరోజుల తరువాత మళ్లీ మోత

Updated By ManamThu, 07/05/2018 - 13:55

న్యూఢిల్లీ: దాదాపు నెల రోజుల పాటు పెరగని డీజిల్, పెట్రోల్ ధరలు మళ్లీ మోత మోగించనున్నాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు 16 నుంచి 17పైసల చొప్పున.. డీజిల్ ధరలు 10 నుంచి 12 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.75.71, కోల్‌కతాలో రూ.78.39, ముంబైలో రూ.83.10, చెన్నైలో రూ.78.57గా ఉన్నాయి. అలాగే లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.67.50, కోల్‌కతాలో రూ.70.05, ముంబైలో రూ.71.62, చెన్నై రూ.71.24గా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..?

Updated By ManamFri, 05/18/2018 - 10:00

diesel, petrol మరో రెండు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండింటిపై లీటర్‌కు రూ.4ల వరకు  పెంచే ఆలోచనలో ఓఎంసీలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా, నిత్యమూ పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే, ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించిన కేంద్రం, దాదాపు ఇరవై రోజుల పాటు ధరలను సవరించింది. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టాల్లోకి జారిపోయాయి. దీంతో ధరలను పెంచాలని ఓఎంసీలు నిర్ణయించగా, అందుకు కేంద్రం నుంచి అంగీకారం వచ్చినట్టు సమాచారం. తమకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు లీటరు పెట్రోలుపై రూ. 3.50 నుంచి రూ. 4 వరకూ, లీటరు డీజిల్ పై రూ. 4 నుంచి రూ. 4.55 వరకూ పెంచాలని ఓఎంసీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

 

Related News