kolkata

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

Updated By ManamSun, 09/16/2018 - 12:43
fire accident

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుర్రాబజార్‌ ప్రాంతంలోని బాగ్రీ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నాయి. దాదాపు 30కి పైగా ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో ఆ భవంతిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. దానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని నగర మేయర్‌ తెలిపారు. కూలిన ఫ్లై ఓవర్, శిథిలాల కింద పలువురు?

Updated By ManamTue, 09/04/2018 - 17:22
Flyover collapses in Kolkata's Majerhat, several feared trapped

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ దక్షిణ కోల్‌కతాలోని మెజర్హాట్ ఏరియాలో ఓ ఫ్లై ఓవర్ మంగళవారం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద  కార్లు, బస్సులు, కార్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదం జరిగిన సమయంలో అనేక వాహనాలు ఫ్లై ఓవర్ పై ప్రయాణిస్తుండగా, మరోవైపు వంతెన కింద రైల్వే ట్రాక్ ఉంది. కాగా మెజర్హాట్ రైల్వే స్టేషన్ మీదుగా ఈ బ్రిడ్జి ఉంది. ఈ ప్రమాదం తర్వాత బడ్జ్ బడ్జ్-సీల్దా మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.ఈ దుర్ఘటన సాయంత్రం 4.45 గంటలకు జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే 5 గంటల వరకూ కూడా పోలీసులు అక్కడకు చేరుకోకపోవడంతో స్థానికులే... సహాయక చర్యలు చేపట్టారు. అయితే అయిదుగురు మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నా...అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాగా 2016లో కూడా బుర్రా బజార్ కేవిడ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి సుమారు 26మంది మృతి చెందారు.

 అమిత్ షాకు నల్లజెండాలతో నిరసన

Updated By ManamSat, 08/11/2018 - 14:51
  • అమిత్ షా పర్యటన సందర్భంగా కోల్‌కోతాలో  టెన్షన్ వాతావరణం

amit shah kolkata tour

కోల్‌కతా :  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కోల్‌కోతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అమిత్ షా పర్యటన సందర్భంగా... ఓవైపు బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం, మరోవైపు తృణమూల్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తాయి. శనివారం ఉదయం కోల్‌కతా విమానాశ్రయంలో అమిత్ షాకు పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వందేమాతరం, జైశ్రీరామ్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

కాగా మయో రోడ్‌లో ఏ బీజేపీ యువ మోర్చా నిర్వహిస్తున్న యువ స్వాభిమాన్ ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు.. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎంపీ పూనం మహాజన్‌లకు స్వాగతం పలుకుతూ రోడ్ల వెంబడి భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.  అయితే దానికి కౌంటర్‌గా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు అమిత్‌షా రాకను వ్యతిరేకిస్తూ ‘భాజపా గోబ్యాక్‌’ పోస్టర్లు పెట్టారు. 

అంతేకాకుండా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ దశలో అమిత్ షా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తృణమూల్ కార్యకర్తలు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో పలు ప్రాంతాల్లో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.రెండేళ్ల బాలుడిపై లైంగిక దాడి

Updated By ManamThu, 07/05/2018 - 15:03
Sexually Assaulted

కోల్‌కతా : చిన్నారులపై అత్యాచార ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ కోల్‌కోతాలోని ఓ ప్లే స్కూల్‌లో రెండేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం చిన్నారిపై లైంగిక దాడి జరగలేదని చెబుతోంది. కాగా స్కూల్ లో గత నెల 26వరకూ సీసీ టీవీ ఫుటేజీ నమోదు కానట్లు పోలీసులు గుర్తించారు. 

బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు  పోక్సో చట్టం (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా వాస్తవాలు వెలుగు చూస్తాయనే స్కూల్ యాజమాన్యం సీసీ టీవీ ఫుటేజ్‌ను మాయం చేసిందని బాలుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.మూడేళ్ల బాలికపై అత్యాచారం

Updated By ManamTue, 03/06/2018 - 20:20
  • చాక్లెట్ ఆశ చూపి బస్సు క్లీనర్ దుశ్చర్య

  • కొల్‌కతాలో ఘటన, నిందితుడి అరెస్టు

rape child- crimeకొల్‌కతా: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ కిరాతకుడి దుశ్చర్యకు బలైన బాలిక ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంది. కొల్‌కతాలో సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ఈ కేసులో నిందితుడు షేక్ మున్నా(45) బస్సు క్లీనర్‌గా పని చేస్తున్నాడు. బాధిత బాలిక తన సోదరుడు(వయస్సు ఐదేళ్లు)తో కలిసి ఆడుకుంటుండగా, చాక్లెట్ ఇస్తానని చెప్పి మున్నా బాలికను నమ్మించాడు. ఉత్తర కొల్‌కతాలోని కెనాల్ రోడ్డులో పార్కు చేసి ఉన్న ఓ బస్సులోకి బాలికను తీసుకెళ్లి తలుపేశాడు. బాలిక సోదరుడు బస్సు బయట ఉండిపోయాడు. బాలిక ఏడుపును విన్న ఆ చిన్నారి తన చెల్లిని వదిలేయమని బస్సు తలుపును పలుమార్లు చరిచాడు. ఫలితం లేకపోవడంతో పరుగెత్తుకెళ్లి తల్లిని పిలుచుకొచ్చాడు. వారి తల్లి వితంతువు, పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. స్థానికులను వెంట బెట్టుకుని సంఘటనా స్థలానికి వచ్చిన ఆమె బస్సులోకి వెళ్లి ఆ దుర్మార్గుని చెర నుంచి బాలికను విడిపించింది. స్థానికులు ఆ కిరాతకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాము ఘటనాస్థలికి వెళ్లేసరికి బాలిక బస్సులో రక్తపువుడుగులో పడి ఉందని, దుస్తులు చిరిగిపోయాయని, తీవ్ర రక్తస్రావం జరుగుతుందని పోలీసు అధికారులు చెప్పారు. నిందితుడి చేతులతో పాటు దుస్తులకు రక్తం అంటుకుని ఉందన్నారు. బాలికను ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నావుని, వైద్య నివేదిక వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.

Related News