Etala Rajendar

కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamTue, 09/11/2018 - 12:10

51మంది దుర్మరణం, మరో 30మందికి గాయాలు

 

20 killed in kondagattu road accident

కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 50మంది దుర్మరణం చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 

కాగా ప్రమాదానికి గురైన బస్సు జగిత్యాల డిపోకి చెందింది. ఘాట్ రోడ్డు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే బస్సు డ్రైవర్ కు అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.  ప్రమాదానికి గురైన బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 86మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

మరోవైపు స్థానికులు బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల్లో మహిళలతో పాటు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై మాజీమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. భారీ వర్షాలపై అధికారుల అప్రమత్తం

Updated By ManamSat, 08/18/2018 - 01:29
  • మంత్రి ఈటల రాజేందర్

eetalaకరీంనగర్: జిల్లాలో ఈ ఆగస్టు మాసంలో భారీగా కురుస్తున్న వర్షాలపై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల  రాజేందర్ అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి గెస్ట్ హౌజ్ లో మంత్రి ముందుగా జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా ఛైర్ పర్సన్ తుల ఉమ, సాంసృ్కతిక సారధి మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా అధికారులతో వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే మొదలు అయిన మధ్యలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందారని అన్నారు. ఈ ఆగస్టు మాసంలో రాష్ట్రం మొత్తంలో సమృద్దిగా వార్షాలు కురుస్తాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మంచి వర్షపాతం నమోదు అయినదని, జిల్లాలోని చెరువులు, కుంటలు,చెక్ డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరము పంటల సాగుకు, భూగర్భ జలాలకు డోకా లేదని మంత్రి తెలిపారు. గత 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కొంత పంట నష్టం జరిగిందని కరీంనగర్ పట్టణంలోని కొన్ని ఇండ్లలోకి నీరు చేరిందని తెలిపారు. ఆయినను జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, పంటనష్టం, పశువుల నష్టం జరగలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో  కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి గురువారం జరగాల్సిన శాసన సభ్యుల సమావేశాన్ని వాయిదా వేసి పార్లమెంట్ సభ్యులను శాసన సభ్యులను జిల్లాలలో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని జిల్లా కలెక్టర్‌లతో, అధికారులతో ప్రజాప్రతినిధులతో వార్షాల వల్ల నష్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, అధికారులందరూ కేంద్ర స్ధానంలో అప్రమత్తంగా ఉండాలని తగిన ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుచున్నాయని వచ్చే అక్టోబరు మాసాంతంలోగా కళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్ మానేరు లోయర్ మానేరు డ్యాంలను అనుసంధానం అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతము మేడిగడ్డ వద్ద 6 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వృధాగా పోతుందని మంత్రి తెలిపారు. ఇంతవరకు వందల టిఎంసిల నీరు వృధాగా పోయిందని మంత్రి తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 3.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఫలితం పొందేది పాత కరీంనగర్ జిల్లా అని మంత్రి తెలిపారు. ఇదే కరీంనగర్ కు చివరి నీటి కరువు సంవత్సరమని, 2018 నుండి కరువు అంటే తెలియని జిల్లాగా కరీంనగర్ జిల్లా అవతరిస్తుందని మంత్రి తెలిపారు.

కరీంనగర్ ఇదివరకే వరి ధాన్య బాంఢాగారంగా వర్థిల్లుతుందని ఇక నుండి కాళేశ్వరం, ఎల్లంపల్లి, మధ్యమానేరు, ఎల్.ఎం.డి లలో నిండా నీటితో మత్స్య సంపద పెరుగుతుందని అన్నారు. కరీంనగర్‌జిల్లా తెలంగాణ చిత్రపటంపై గొప్ప జిల్లాగా అవతరిస్తుందని మంత్రి తెలిపారు. పది రోజుల్లో ఎల్లంపల్లి నుండి ఎల్.ఎం.డి కి నీరు వస్తుందని మంత్రి తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరులో 25 టి.ఎం.సిలు ఎల్.ఎం.డి లో 24 టిఎంసిల నీరు నింపుతామని మంత్రి తెలిపారు. ఎస్.ఆర్.ఎస్.పి , ఎల్‌ఎండి కింద పంటల సాగునీరుకు ఢోకాలేదని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం జిల్లాలో వర్షాలు ఇంకా వారం రోజుల వరకు కురిసే అవకాశం ఉన్నందున ఇరిగేషన్, వ్యవసాయ, పశుసంవర్థక, విద్యుత్, రెవెన్యూ, శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెరువులు తెగిపోకుండా ఇసుక బస్తాలను సిద్దంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రతి చెరువుకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. వర్షాల వల్ల రాకపోకలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.రైతు సంక్షేమం కోసం రూ.60వేల కోట్ల ఖర్చు

Updated By ManamTue, 08/07/2018 - 01:43
  • రూ.45 వేల కోట్లతో ఇంటింటికీ నల్లా నీరు.. రూ.7వేల కోట్లతో  24 గంటల ఉచిత కరెంట్ 

  • ‘రైతు బందు’ కింద రూ.12వేల కోట్ల ఖర్చు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్

imageకరీంనగర్: రైతు సంక్షేమం కోసం ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం రూ.55 నుండ 60 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భీమా పథకం కింద బాండ్లు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఈటల రాజేందర్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వం ఆదరణ  ఉంది. కానీ దేవుడి కరుణ లేదన్నారు. వర్షాలు లేక రైతులు నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 45 వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరును అందిస్తామన్నారు. దేశంలో మొదటి సారీగా ఎల్‌ఎండి నుండి ఇంటింటికీ నల్లానీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి రూ. 7వేల కోట్లతో  రైతులకు 24 గంటల ఉచిత కరెంట్  సరఫరా చేస్తున్న ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు బందు పథకం కింద రూ.12వేల కోట్ల ఖర్చు చేసిందన్నారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు అందిస్న్నుమన్నారు.రైతు సాధారణ మరణం సంబవిస్తే ఆ కుటుంబానికి రైతు భీమా పతకం కింద రూ.5లక్షల చెక్కును అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెసి బద్రి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

‘సార్’కు ఈటల నివాళి
ప్రొపెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుణంగానే సీఎం కేసీఆర్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి కరీంనగర్‌లో జయశంకర సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారన్నారు. తెలంగాణ  రాష్టాన్ని చూడకుండానే సార్ అనంతలోకాలకు వెళ్లిపోయాడన్నారు. ఆయన లేకున్నా ఆయన ఆశ య సాధన మాత్రం కొనసాగుతుందన్నారు. సార్ బతికి ఉన్నప్పుడు ఏఏ కార్యక్రమాలు చేయాలని అనుకున్నారో..సీఎం కేసీఆర్ అవన్నీ చేసి చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.మేము టీఆర్‌ఎస్ పార్టీ సైనికులం

Updated By ManamFri, 04/27/2018 - 02:17

eetalaసీఎం కేసీఆర్‌కు ప్రభుత్వం ఎంతనో పార్టీ కూడా అంతే. తెలంగాణ ప్రజల సంక్షేమమే, వారి సమస్యల పరిష్కారమే కేసీఆర్ ఎజెండా. అందుకనుగుణంగా మేమంతా సైనికుల్లా పనిచేస్తాం. పదవుల్లో ఉన్నా ప్రతి క్షణం పార్టీ గురించి ఆలోచిస్తాం. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని ఆనాడు విమర్శించారు. కానీ 17 ఏండ్లలోకి అడుగుపెట్టినం. పరిపాలించుకునే నైపుణ్యం ఉందా అని ఎద్దేవా చేసిన వారి తలదన్నెలా దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకుని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పెంచినం. తెలంగాణ ప్రజల సామాజిక అభివృద్ధి కోసం అమలు చేసే ప్రతి పథకాన్ని తెలంగాణలోని గడప గడపకూ చేరేలా కార్యకర్తలు ప్రచారం చేయాలి. మళ్లీ తెలంగాణలో గులాబీ జెండానే ఎగురుతుంది. పార్టీ సీనియర్ నాయకులందరూ ప్లీనరీకి వచ్చేలా ఏర్పాట్లు చేసినం. చైనా కంటే వేగంగా ప్రాజెక్టులు

Updated By ManamWed, 03/28/2018 - 03:01
  • ఇప్పటికే 35వేల ఉద్యోగాల భర్తీ..

  • మరో 50వేల భర్తీకి ఏర్పాట్లు

  • ఉద్యోగుల జీతాలు పెంచినం

  • వసతి గృహాల్లో సన్నబియ్యం

  • మాది సంక్షేమ ప్రభుత్వం

  • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఈటల

etalaహైదరాబాద్: చైనా కంటే వేగంగా ప్రాజెక్టులను నిర్మించి రైతాంగానికి సాగు నీరు అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఈటల, ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాదరావు, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, జాఫ్రి, యాదిరెడ్డి, ఫారుక్ హుస్సేన్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం తరపున ఈటల రాజేందర్ సమాధానమిస్తూ.. నాలుగేండ్లుగా బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా నిధులు ఖర్చులు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 90 శాతానికిపైగా నిధులు ఖర్చు చేశామని చెప్పారు. తమ ప్రభుత్వ నిరంతర శ్రమతో ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ నిలదొక్కుకోగలిగిందన్నారు. దేశ తలసరి ఆదాయం రూ.1,12,764లకు చేరిందని, ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లభించనప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 40 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఉన్నాయని, ఈ ఏడాది మరో 50 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. 2.50 లక్షల మంది ఉద్యోగుల జీతాలను పెంచామని చెప్పారు. పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేశామని చెప్పారు. తమను వేలెత్తి చూపే అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్నామని చెప్పారు. చర్చ అనంతరం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును ఈటల ప్రవేశ పెట్టగా, సభ ఆమోదించింది.అన్ని రంగాల్లో మహిళల పురోభివృద్ధి

Updated By ManamThu, 03/08/2018 - 03:22

ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి రాజేందర్
Etala Rajendarకరీంనగర్ బ్యూరో:
సమాజంలో చాలా మార్పు వచ్చిందని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో బుధవారం జరిగిన అంతర్జాతీయ మహిళల దినోత్సవం కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ సుఖ సంతోషాలు, సంపద ఉంటాయన్నారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో  పథకాలను చేపట్టిందన్నారు. కేసీఆర్ హెల్త్ కిట్ల ద్వారా గర్భిణులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. అంగన్‌వాడీ మహిళలకు అత్యధిక జీతం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు మహిళలే  శత్రువు అని నానుడు ఉందని అది మారాలన్నారు. మహిళా సార్థకత అంటే మనల్ని మనం సంస్కరించుకొవడమన్నారు. అడపిల్లల బ్రూణ హత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆమె తెలిపారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు  అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించారన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తే దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ నేటి సమాజానికి స్ఫూర్తిగా ఉన్న మహిళలు భవిష్యత్తులో శక్తిగా మారుతారన్నారు. సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ నేడు మహిళలు ముందుండి సమాజాన్ని నడిపిస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో కరీంనగర్, తిమ్మాపూర్ జడ్పీ  చైర్ పర్సన్‌లు  తుల ఉమ, పద్మ ఏకనాథం, రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, జిల్లా సంక్షేమ అధికారి శారద, బాలల పర్యవేక్షణ అధికారి పర్విన్, కరీంనగర్ ఏసీపీ ఉషారాణి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Related News