Srinu Vaitla

‘అమర్ అక్బర్ ఆంటోని’ కథకు తగ్గ టైటిల్

Updated By ManamWed, 11/14/2018 - 00:08

imageరవితేజ హీరోగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఈ చిత్రం గురించి శ్రీనువైట్ల మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘‘నాకు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాను. మామూలు గా ఎవరైనా మిస్టేక్స్ నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం నాకూ అవసరం. లేకపోతే అక్కడే ఉంటాం. నేను ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంలో రియలైజ్ అయ్యాను. అందుకే పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో అలాగే చేశా. అంతకు మించి పనిచేశా. ఈ సినిమా మొత్తం యు.ఎస్.లో జరుగుతుంది. అందుకే నేను, రవితేజ కాంబినేషన్‌లో సినిమాను మొదలు పెడుతున్నామని చెప్పగానే నాకు ఐదుగురు నిర్మాతలు వచ్చారు. వారిలో నేను మైత్రీ మూవీస్‌కి పనిచేశాను. ఈ సినిమాకు బాగా ఖర్చయింది. స్నో ఫాలింగ్ సమయంలో, సమ్మర్‌లో రెండు బంచ్‌లకింద ఈ సినిమా చేశాం.

అయితే నిర్మాతలు వారు పెట్టిన ఖర్చుకు తగ్గ ఔట్‌పుట్ వచ్చిందని ఆనందంతో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కథకు తగ్గ టైటిల్ అమర్ అక్బర్ ఆంటోనీ. ఒకరోజు ఏదో ఆలోచిస్తూ పడుకుంటే రాత్రి 11కి ఈ టైటిల్ వచ్చింది. వెంటనే రవితేజకు ఫోన్ చేశా. తను అమితా బ్‌కి పెద్ద ఫ్యాన్. వినగానే టైటిల్ ఓకే అన్నాడు. నాక్కూ డా ఇదే పర్‌ఫెక్ట్ అనిపించింది. నేనెప్పుడూ సినిమాల పనికోసమే ఆరాటపడ్డా. నేను చేస్తున్న సినిమా చిన్నదా, పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. నా తొలి సిని మా రూ.38లక్షల్లో చేశా. ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ ఒక స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఫ్లాష్‌లా గా ఆలోచన వస్తే నేను చిన్న బడ్జెట్ చిత్రాన్ని చేయడా నికి వెనకాడను. నేనెప్పుడూ కీర్తి కోసం పాకులాడలేదు. నేను లోలో ఉన్నప్పుడు కూడా అందుకే పెద్దగా బాధ పడింది లేదు. ఇప్పటిదాకా నేనెవరినీ వెళ్లి సినిమాలు ఇవ్వమని అడగలేదు. కుదిరినప్పుడే చేశాను. రవితేజ, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. నేను లోలో ఉన్న ప్రతిసారీ తను నాకు ట్రబుల్ షూటర్ అయ్యాడు. నేను తనని హీరోగా, తను నన్ను దర్శకుడిగా ఎప్పుడూ చూడలేదు. మేమిద్దరం కలిస్తే అల్లరిగా ఉంటుంది.

ఇందులో లయగారి పాప యాక్ట్ చేశారు. పాపకు తల్లిగా ఇంకెవరినైనా చూద్దామని అనుకుంటున్న ప్పుడు మేమే లయగారిని చేయమని అడిగాం. ఆమెతో పాటు నటి అభిరామి కూడా చేశారు. జెన్నిఫర్ లోపెజ్ మేన్షన్ చాలా బావుంటుంది. దాదాపు 13 ఎకరాల్లో ఉన్న ఇల్లు అది. యు.ఎస్.లో అలాంటి మేన్షన్‌లు చాలా అరుదుగా ఉంటాయి. దాన్ని మన తెలుగు వ్యక్తి మల్లారెడ్డి కొన్నారట. నన్ను మామూలుగా తీసుకెళ్లి చూపించారు. నాకు నచ్చింది. ఇక షూటింగ్ జరిగినన్ని రోజులు మేం అక్కడే ఉన్నాం. ఇందులో సునీల్‌ది చాలా మంచి పాత్ర. ఎంత బావుంటుందంటే అప్పుడెప్పుడో పాత సినిమాల్లో సునీల్‌ని చూసినంత ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నాయిక ఇలియానా డబ్బింగ్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఈ పాత్రను రాసుకున్నప్పుడు హీరోగా రవితేజ, హీరోయిన్‌గా ఇలియానా అని అనుకునే రాసుకున్నా. అయితే ఇలియానా తెలుగు సినిమాలు చేయడం లేదని మైత్రీ మూవీస్ వారు అన్నారు. కానీ మళ్లీ అప్రోచ్ అయితే ఆమె ఒప్పుకు న్నారు. నాకు సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు. ఎప్పుడూ సినిమాలు చూస్తుంటా. బాహుబలి, దంగల్ ఇవన్నీ నచ్చాయి. నాకు హిందీలో సినిమా చేయాలని ఉంది. ఇంతకు ముందు రెండు సార్లు చేయాల్సింది. కానీ ఎందుకో కుదరలేదు. అయితే అమర్ అక్బర్ ఆంటనీ రైట్స్‌ని ఈసారి నా దగ్గరే ఉంచుకున్నా. నాలాంటి దర్శకులకు బ్రాండ్ అనేది వరమూ, శాపమూ. రెండూ. మంచి బ్రాండ్‌ని నిలబెట్టుకోవడానికి ఆ దిశగా చాలా కృషి చేయాలి. ప్రస్తుతానికి నా దగ్గర అన్నీ లైన్లలోనే ఉన్నాయి. మంచి కథ కుదిరినప్పుడు ఇంకో సినిమా గురించి అనౌన్స్ చేస్తాను’’ అన్నారు.డబ్బింగ్ చెప్పిన ఇలియానా...!!

Updated By ManamThu, 11/08/2018 - 15:36

‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఇల్లి బేబీ..

Ileana dubs in Telugu first time for Amar Akbar Anthony

మాస్ మహా రాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా గొంతు విప్పింది. ఇప్పటివరకూ అనేక తెలుగు సినిమాల్లో నటించినా ఆమె ఆ చిత్రంలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పింది. తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆమెకు ఇదే మొదటిసారి. పాత్ర డిమాండ్ మేరకు ఇల్లీ బేబీతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీనువైట్ల నిర్ణయించారు. దీంతో నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేయడం విశేషం.

రవితేజతో ఇలియానాకి ఇది నాలుగో సినిమా. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దాంతో సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల10న ఎంతో గ్రాండ్ గా జరగనుంది.. అలాగే నవంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

తారాగణం:
రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.. 

సాంకేతిక నిపుణులు :
స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల
కథ :  శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి
సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి
సీఈఓ : చెర్రీ
డీఓపీ : వెంకట్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో : వంశీ-శేఖర్‘అమర్ అక్బర్ ఆంథోని’కి రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamWed, 10/31/2018 - 10:20

Ravitejaరవితేజ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోని’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా.. తాజాగా విడుదల తేదిని ఖరారు చేసింది చిత్ర యూనిట్. నవంబర్ 16వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించగా.. సునీల్, షాయాజీ షిండే, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ముగింపు రాశాకే కథ మొదలుపెట్టాలి

Updated By ManamMon, 10/29/2018 - 16:54
  • అదరగొడుతున్న రవితేజ టీజర్

  • 16న అమర్ అక్బర్ ఆంటోనీ విడుదల

AAA


ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ర‌వితేజ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూడింటినీ టీజ‌ర్ లో హైలైట్ చేసారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. టీజ‌ర్ చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది. మ‌నం ఆపద‌లో ఉన్న‌పుడు మ‌న‌ల్ని కాపాడేది మ‌న చుట్టూ ఉన్న బ‌ల‌గం కాదు.. మ‌న‌లో ఉన్న బ‌లం.. ముగింపు రాసుకున్న త‌ర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. అమెరికాలోని అంద‌మైన లొకేష‌న్స్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు శ్రీనువైట్ల‌. 

ఈ సినిమాలో ల‌య‌, సునీల్,వెన్నెల కిషోర్,ర‌ఘు బాబు,త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో క‌థల ఎంపికపై ప్ర‌త్యేక‌త చూపిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. న‌వంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.

న‌టీన‌టులు: 
ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: శ‌్రీనువైట్ల 
నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, వై. ర‌విశంక‌ర్, మోహ‌న్ చెరుకూరి(సివిఎమ్)
క‌థ‌: శ్రీ‌నువైట్ల‌, వంశీ రాజేష్ కొండ‌వీటి
స‌హ నిర్మాత‌: ప‌్ర‌వీణ్ మ‌ర్పూరి
సీఈఓ: చెర్రీ
సినిమాటోగ్ర‌ఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: ఎంఆర్ వ‌ర్మ‌
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్29న 'అమర్ అక్బర్ ఆంటోనీ ' టీజర్!

Updated By ManamThu, 10/25/2018 - 18:53
Amar Akbar Anthony Teaser on October 29th

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ '..  వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా  టీజర్ ని అక్టోబర్ 29 న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శెరవేగంగా జరుగుతున్నాయి. గ్లామర్ డాల్ ఇలియానా కథానాయికగా నటిస్తుండగా, రవితేజ తో ఆమె నాలుగో సారి కలిసి నటిస్తుండండం విశేషం.

పూర్తిభాగం అమెరికా లో షూటింగ్ జరుపుకోగా దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన  గ్లిమ్ప్స్ అఫ్ 'అమర్ అక్బర్ ఆంటోనీ 'కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండగా రవితేజ డిఫరెంట్ గా కనిపించనున్నారు..  ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తారాగణం:
రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.. 

సాంకేతిక నిపుణులు :

స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి
సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి
సీఈఓ : చెర్రీ
డీఓపీ : వెంకట్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్పో : వంశీ శేఖర్శ్రీనువైట్ల బర్త్‌డే: ‘అమర్ అక్బర్ ఆంటోని’ కొత్త టీజర్

Updated By ManamMon, 09/24/2018 - 12:10
AAA

టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన శ్రీనువైట్ల ఇవాళ 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రవితేజ కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ నుంచి ‘పైవోట్ ఆఫ్ ఏఏఏ’ అనే పేరుతో కొత్త టీజర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ త్రిపాత్రాభినయంకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇక డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస పరాజయల్లో ఉన్న శ్రీనువైట్ల, రవితేజ ఈ చిత్రంపై చాలా అంచనాలే పెట్టుకున్నారు.

 ముగ్గురు కాదు.. ఒకరేనా..! 

Updated By ManamMon, 09/10/2018 - 15:15

AAA'వెంకీ, దుబాయ్‌ శీను చిత్రాల తర్వాత' రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలను పోషిస్తారని అందరూ అనుకున్నారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో రవితేజ మూడు గెటప్స్‌ను విడుదల చేశారు. కానీ సినిమాలో రవితేజ ఒకడేనట. మూడు షేడ్స్‌లో కనపడతారట. లెటెస్ట్‌ సమాచారం ప్రకారం రవితేజ మల్లిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపుడుతుంటారట. దాని కారణంగా తనకు తెలియకుండా అమర్‌ , అక్బర్‌, ఆంటోని క్యారెక్టర్స్‌గా మారిపోతుంటారట. దీని కారణంగా సన్నివేశాల్లో వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని సమాచారం. అక్టోబర్‌లో విడుదల కాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. రవితేజ తదుపరి చిత్రం విశేషాలు

Updated By ManamSat, 09/08/2018 - 11:29

Ravitejaప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్న మాస్ రాజా రవితేజ ఆ తరువాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించన్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులుగా రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు పలు చిత్రాలలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించినప్పటికీ తండ్రి, కుమారులుగా చేయలేదు. కిక్2లో చేసినప్పటికీ.. అది సినిమా మొత్తం ఉండదు కాబట్టి మొదటిసారి రవితేజ తండ్రీ కుమారులుగా చేయనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.‘అమర్ అక్బర్ ఆంటోని’ కాన్సెప్ట్ పోస్టర్

Updated By ManamWed, 08/15/2018 - 10:11

AAAశ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. డిఫరెంట్‌గా వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రిటర్న్ గిఫ్ట్ అంటూ వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇక ఇందులో రవితేజ సరసన ఇలియానా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ కోసం శ్రీనువైట్ల కొత్త టెక్నాలజీ

Updated By ManamSat, 06/02/2018 - 14:27

Ravi Teja, Srinu Vaitlaమాస్‌రాజా రవితేజతో శ్రీనువైట్ల తెరకెక్కించనున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక కథ రీత్యా ఈ చిత్రం ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్‌లో చేయనున్నారు. కాగా ఈ మూవీ కోసం శ్రీనువైట్ల సరికొత్త టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను 8కె క్వాలిటీతో రూపొందిస్తున్నారట. ఇక ఈ చిత్రంతో ఇలియానా మళ్లీ టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.


 

Related News