Amar Akbar Antony

నవంబర్ 16న ‘అమర్ అక్బర్ ఆంటోని’ 

Updated By ManamWed, 10/31/2018 - 00:54

imageరవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదుేతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడింటినీ టీజర్‌లో హైలైట్ చేసారు దర్శకుడు శ్రీను వైట్ల. మనం ఆపదలో ఉన్నపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. ముగింపు రాసుకున్న తర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

అమెరికాలోని అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు శ్రీనువైట్ల. ఈ సినిమాలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో కథల ఎంపికపై ప్రత్యేకత చూపిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ముగ్గురు కాదు.. ఒకరేనా..! 

Updated By ManamMon, 09/10/2018 - 15:15

AAA'వెంకీ, దుబాయ్‌ శీను చిత్రాల తర్వాత' రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలను పోషిస్తారని అందరూ అనుకున్నారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో రవితేజ మూడు గెటప్స్‌ను విడుదల చేశారు. కానీ సినిమాలో రవితేజ ఒకడేనట. మూడు షేడ్స్‌లో కనపడతారట. లెటెస్ట్‌ సమాచారం ప్రకారం రవితేజ మల్లిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపుడుతుంటారట. దాని కారణంగా తనకు తెలియకుండా అమర్‌ , అక్బర్‌, ఆంటోని క్యారెక్టర్స్‌గా మారిపోతుంటారట. దీని కారణంగా సన్నివేశాల్లో వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని సమాచారం. అక్టోబర్‌లో విడుదల కాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. రవితేజ తదుపరి చిత్రం విశేషాలు

Updated By ManamSat, 09/08/2018 - 11:29

Ravitejaప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్న మాస్ రాజా రవితేజ ఆ తరువాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించన్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులుగా రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు పలు చిత్రాలలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించినప్పటికీ తండ్రి, కుమారులుగా చేయలేదు. కిక్2లో చేసినప్పటికీ.. అది సినిమా మొత్తం ఉండదు కాబట్టి మొదటిసారి రవితేజ తండ్రీ కుమారులుగా చేయనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.పింక్ బికీనీలో ఇలియానా.. చూస్తే మతిపోతుందంతే

Updated By ManamTue, 08/14/2018 - 11:51

ileanaగోవా బ్యూటీ ఇలియానాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేయకున్నా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ బ్యూటీకి ఫాలోవర్లు కోకొల్లలు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో అబ్బాయిల మతిని పోగొడుతోంది. పింక్ బికినీ ఓ సముద్ర తీరంలో ఆమె సేదతీరుతుండగా.. ఆ ఫొటోలో చూపులతోనే కవ్విస్తోంది ఇలియానా. ఇక ఈ ఫొటోను ఇలియానా ప్రియుడు ఆండ్రూ తీయడం మరో విశేషం. ఆ విషయాన్ని ఆమే వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలియానా తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనిలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

 అఫీషియ‌ల్‌.. ర‌వితేజ చిత్రంలో ఇలియానా

Updated By ManamMon, 05/21/2018 - 21:38

ravitejaర‌వితేజ‌, శ్రీ‌ను వైట్ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తొలుత అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కాల్షీట్ల స‌మ‌స్య కార‌ణంగా.. ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. ఈ నేప‌థ్యంలో అనుకి బ‌దులుగా ఇలియానా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్రకారం.. ఇలియానా క‌థానాయిక‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని తెలిసింది. 50 రోజుల పాటు జ‌రిగే అమెరికా షెడ్యూల్‌లో జూన్ మూడో వారం నుంచి ఇలియానా షూటింగ్‌లో పాల్గొన‌నుంద‌ని స‌మాచారం. మ‌రో క‌థానాయిక‌కి కూడా ఇందులో స్థాన‌ముంది. ఆమె ఎవ‌రో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. ఇలియానా ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న మ‌రికొద్ది రోజుల్లో వ‌స్తుంది.  'ఖ‌త‌ర్నాక్‌', 'కిక్‌', 'దేవుడు చేసిన మ‌నుషులు' త‌రువాత ర‌వితేజ‌, ఇలియానా క‌లిసి న‌టించే నాలుగో చిత్ర‌మిది.రవితేజ మూవీతో ఆ హీరోయిన్ రీ ఎంట్రీ 

Updated By ManamFri, 04/06/2018 - 19:00

laya మాస్ రాజా రవితేజ ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్‌’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటించబోతున్నాడు. ఇందులో రవితేజ సరసన ఒక హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుల్ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ఈ సినిమా ద్వారా ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో అను ఇమ్మాన్యుల్ తల్లి పాత్రలో లయ కనిపించబోతుందట. అంతేకాదు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే 2010లో ‘బ్రహ్మలోకం టు యవలోకం వయా భూలోకం’ చిత్రంలో చివరి సారిగా కనిపించిన లయ.. దాదాపుగా ఎనిమిదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.రవితేజ, శ్రీనువైట్ల మూవీ ప్రారంభం

Updated By ManamThu, 03/08/2018 - 16:55

Ravi Teja రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోని'. ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వేసవిలో ప్రారంభం కానుండగా.. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరీంచనున్నారు.

కాగా ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించనుండగా.. ఆయన సరసన ఒక హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుల్ ఖరారైంది. మిగిలిన ఇద్దరినీ త్వరలో ప్రకటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. అయితే శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన 'వెంకీ', 'దుబాయ్ శీను' చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. మరోవైపు వరుస పరాజయాలతో ఢీలా పడ్డ శ్రీనువైట్ల ఈ మూవీతోనైనా ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. 

Related News