odisha

దయో తుపాన్: ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు

Updated By ManamFri, 09/21/2018 - 09:32

Daye Cycloneవిశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వీయుగుండం గురువారం రాత్రికి మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి దయో తుపాన్‌ అని పేరు పెట్టగా.. శుక్రవారం ఉదయం ఆ తుపాను కళింగపట్నం, పూరిల మధ్య తీరం దాటింది. భవానీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 130 కి.మీ దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉండగా.. తీరం దాటిన అనంతరం దయె తుపాన్‌ క్రమంగా బలహీనపడుతుంది. తీరం వెంబడి గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఒడిశాలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కూడా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. తుపాను ప్రభావంతో చెట్లు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, రోడ్లు దెబ్బతింటాయని, తీరం వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలను సముద్రపు నీరు ముంచెత్తవచ్చని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, అలలు సాధారణంకంటే మీటరు ఎత్తు వరకు ఎగసి పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ హోంగార్డు డ్యాన్స్.. వైరల్.. 

Updated By ManamTue, 09/11/2018 - 16:13

home guard personnel, coolest thing, Odisha, Pratap Chandra Khandwal, Michael Jacksonభువనేశ్వర్: ఒడిసాలో ఓ హోంగార్డు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ట్రాఫిక్ పోలీసుగా విధుల్లో చేరిన ప్రతాప్ చంద్ర ఖంద్వాల్ (33) అనే హోంగార్డు తనదైన శైలిలో రోడ్డుపై స్టేపులేస్తూ చూపురులను ఆకర్షిస్తున్నాడు. ప్రపంచ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌ అన్నా.. డ్యాన్స్ అన్నా.. ఇతగాడికి ఎంతో పిచ్చి. మైకేల్ జాక్సన్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తుంటాడు. ట్రాఫిక్ పోలీసుగా విధుల్లో ఉండగానే రోడ్డుపై వెళ్లే వాహనాలను డ్యాన్స్ వేస్తూ కంట్రోల్ చేస్తున్నాడు. ‘‘నా డ్యాన్స్ ద్వారా ప్రజలకు సందేశాన్ని తెలియజేయాలనుకున్నాను. మామూలుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించమంటే ఎవరూ వినరు.

కానీ, ఇలా డ్యాన్స్ చేస్తూ కంట్రోల్ చేస్తే అందరూ ఆకర్షితులవుతారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు.’’ అని ఖంద్వాల్ జాతీయ మీడియాకు తెలిపారు. గత ఏడాదిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రంజిత్ సింగ్ అనే ట్రాఫిక్ పోలీసు కూడా మైకేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్పులతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. రంజిత్ సింగ్‌ను గుర్తు చేసేలా ఇప్పుడు హోంగార్డు ప్రతాప్ చంద్ర కూడా అదే శైలిలో మూన్‌వాక్ చేస్తూ హుషారెత్తిస్తు్న్నాడు. ప్రతాప్ డ్యాన్స్ స్టెప్పులతో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. వీడియో: 11 ఉల్లిగడ్డలు మింగిన నాగుపాము!

Updated By ManamTue, 07/03/2018 - 17:42

Caught On Camera, Cobra Swallows, Throws Up, 11 Onions, Odishaభువనేశ్వర్: ఇప్పటివరకూ పాములు గుడ్లు మింగడమే చూశాం.. కానీ, ఉల్లిగడ్డలను కూడా మింగుతాయని తెలుసా? అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తే అవుననే అంటారు. బాగా ఆకలితో ఉన్న నాగుపాము ఒకటి ఏకంగా 11 ఉల్లిగడ్డలను మింగేసింది. ఈ ఘటన ఒడిసాలోని అంగుల్ జిల్లా, చెండిపాడ గ్రామంలో చోటుచేసుకుంది. సుశాంత్ బెహారా అనే వ్యక్తి ఇంటి ఆవరణంలో నాగుపామును గుర్తించిన వెంటనే స్థానికులు స్నేక్ హెల్ప్‌లైన్ వాలంటీర్ హిమాన్షు శేఖర్ దెహురికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకొన్న హిమాన్షు నాగుపామును రక్షించాడు. అప్పటికే పదకొండు ఉల్లిగడ్డలతో పాటు ఓ కప్పను కూడా మింగిన నాగుపాము వాటిని జీర్ణించుకోలేక బయటకు నెమ్మదిగా కక్కేసింది.

చివరిగా రెండు ఉల్లిగడ్డలను నాగుపాము బయటకు కక్కుతుండగా వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్నేక్ హెల్ప్‌లైన్ హిమాన్షు స్పందిస్తూ.. ‘‘నాగుపాము మింగిన ఉల్లిగడ్డలను కక్కడం చూశాను. ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీయమని నా స్నేహితుడికి చెప్పాను. చివరిగా నాగుపాము కక్కిన రెండు ఉల్లిగడ్డలను మాత్రమే వీడియో తీయగలిగాం’’ అని హిమాన్షు చెప్పారు. 

ప్రపంచంలో ఇదే తొలి కేసు.. 
నాగుపాము ఏకంగా 11 ఉల్లిగడ్డలను మింగేసిన కేసు నమోదు కోవడం ప్రపంచంలో ఇదే తొలిసారిగా స్నేక్ హెల్ప్‌లైన్ జనరల్ సెక్రటరీ సుభేందు మల్లిక్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలో ఓ నాగుపాము ఏకంగా ఏడు గుడ్లను మింగిన అనంతరం వాటిని జీర్ణించుకోలేక గుడ్లను బయటకు కక్కిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో 111 పాము పిల్లలు!

Updated By ManamMon, 06/25/2018 - 11:51

భువనేశ్వర్ : పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 111 పాము పిల్లలు! ఒడిశాల్లోని శ్యాంపూర్ గ్రామంలో భుయాన్ అనే వ్యవసాయ కూలీ ఇంట్లో 111 పాము పిల్లలు శనివారం వెలుగుచూశాయి.  రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

అటవీ అధికారులు, ఎన్‌జీవో ప్రతినిధులు అక్కడికి చేరుకుని 111 పాము పిల్లలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి అక్కడ 26 పగిలిన పాము గుడ్లు మాత్రమే కన్పించడంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి పాముల గురించి వెతకడం ప్రారంభించారు.snakes

పాముల సంరక్షకులు షేక్ మీర్జా మాట్లాడుతూ.. ‘శనివారం ఉదయం తనకు ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లాను. నేను వెళ్లాకా అక్కడ రెండు పాము పిల్లల్ని నెలపై ఉండటం చూశాను. ఆ తర్వాత పుట్టను త్రవ్వగా పెద్ద మొత్తంలో పాము పిల్లలు బయటికొచ్చాయి. సాయంత్రం కూడా మరో రెండు నాగుపాము పిల్లలు బయటికొచ్చాయి. కానీ తల్లి పాముల అచూకీ మాత్రం కన్పించలేదు’ అని తెలిపారు.ఈ ఘటనపై మల్లిక్ అనే జంతు ప్రేమికుడు మాట్లాడుతూ.. ‘ఒక పాము సాధారణంగా 20 నుంచి 40 గుడ్లు పెడుతుంది.

దానిని పొదగడానికి 60 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. అలా చూస్తే.. ఇక్కడ ఎన్ని పాములు ఉన్నాయి.. ఉంటే అన్ని పాములు ఒకే సారి గుడ్లు పెట్టాయా.. అన్ని ఒకే సారి పొదిగాయా.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అక్కడ 26 పాము గుడ్ల అనవాళ్లు మాత్రమే లభించాయి. మిగిలిన పాము పిల్లలు ఎలా వచ్చాయి. అటవీ శాఖ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు. 

 2019లో మోదీ పోటీ చేసేది ఇక్కడ్నుంచే..!

Updated By ManamFri, 05/25/2018 - 09:59

PM Narendra Modi to contest 2019 elections from Odisha's temple town Puri?

న్యూ ఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గెలుపుకోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు తహతహలాడుతుంటే.. ఉన్న అధికారాన్ని చేజారకుండా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నాయి. అయితే 2019లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది అంతుచిక్కట్లేదు. మరీ ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బీజేపీకి అంతగా ప్రాబల్యం లేని రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. ఇవన్నీ అటుంచితే.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆ రెండూ వద్దు.. పూరీనే!
ఏ రాష్ట్రంలో అయితే తమ పార్టీ వీక్‌గా ఉందో అక్కడ్నుంచే పోటీ చేసి చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి వారణాసి మరియు గుజరాత్‌ను వదిలేసి ఒడిషాలోనే కమలాన్ని వికసింపజేయాలని భావిస్తున్నారు. ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేసిన మోదీ వచ్చే ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే ఆ రెండింటిలో పూరి ఒకటి అనేది తాజాగా వెలువడుతున్న ఈ వార్తా కథనాల సారాంశం.

నవీన్ పట్నాయక్‌కు చెక్ పెట్టేందుకే..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో వడోదర, వారణాసి స్థానాల నుంచి గెలిచిన మోదీ స్వరాష్ట్రంలోని వడోదర స్థానాన్ని వదులుకుని వారణాసి నుంచే ఎంపీగా కొనసాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు కారణమూ లేకపోలేదు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి పట్టు పెంచుకోవడం కోసమేనని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే యూపీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే, ఈసారి ఒడిషాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసమే పూరిని ఎంచుకోబోతున్నారని ఆ వార్తా కథనాలు ఉటంకించాయి. కాగా ప్రస్తుతం ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు చెక్ పెట్టి ఎలాగైనా సరే బీజేపీ జెండా పాతాలని మోదీ, షాలు వ్యూహాలు రచిస్తున్నాయని తెలుస్తోంది.

ఒడిషాలో ఇంతకు మునుపు పరిస్థితి ఇదీ..
2014 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 10 సీట్లు మాత్రమే రాగా.. కాంగ్రెస్‌కు 16 సీట్లొచ్చాయి. బిజు జనతా దళ్‌ 147 స్థానాలకు గాను 117 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు మునుపు 2004, 2009 రెండు పర్యాయాలూ కాంగ్రెస్ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీంతో చాలా వీక్‌గా ఉన్న బీజేపీని బలోపేతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మోదీ పోటీ స్థానంపై బీజేపీ వర్గాలు ఏమని స్పందిస్తాయో.. ఒడిషాలో కమలాన్ని వికసింపజేయాలనే ప్రయత్నం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే మరి.

PM Narendra Modi to contest 2019 elections from Odisha's temple town Puri?26న ఒడిశాకు మోదీ

Updated By ManamSun, 05/20/2018 - 12:39

modhi, odisha, bjpభువనేశ్వర్‌: ప్రధాని మోదీ ఈ నెల 26న ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్రంలో బీజేపీ పభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఒడిశాకు రానున్నారని ఆ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ అరుణ్‌సింగ్ తెలిపారు.  ఈ నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సాధించిన విజయాలను మోదీ ఒడిశా రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని అరుణ్ తెలిపారు. కటక్ మహానది తీరంలో ఏర్పాటుచేసే బహిరంగసభలో మోదీ పాల్గొంటారని వెల్లడించారు.ఇతర రాష్ట్రాల కంటే ఒడిశా అంటే ప్రధాని మోదీకి ఎంతో అభిమానమని  ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేలో ఒడిశాకు కేసీఆర్

Updated By ManamWed, 04/18/2018 - 15:07

KCR హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మే నెలలో ఒడిశాకు వెళ్లనున్నారు. థర్ట్ ఫ్రంట్‌లో భాగంగా తమతో భేటీ కావాల్సిందిగా కేసీఆర్‌ను ఒడిశా సీఎం నవీన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో కేసీఆర్ భువనేశ్వర్‌కు వెళ్లనున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఇదిలా ఉంటే మరోవైపు సీపీఎం 22వ అఖిల భారత మహాసభలకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ భేటీపై ఇవాళ(బుధవారం) స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్, బీజేపీయేతర సీఎంపై కోడిగుడ్లతో మహిళ దాడి

Updated By ManamThu, 02/01/2018 - 07:37

Eggs hurled at Odisha CM Naveen Patnaikభువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌‌‌కు భారీ బహిరంగ సభలో చేదు అనుభవం ఎదురైంది. సభలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని మహిళ సభికుల్లోంచి వచ్చి సీఎంపై కోడిగుడ్లను విసిరింది. ఈ ఘటన బాలసోర్‌‌లో చోటుచేసుకుంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో గుడ్లు సీఎంకు తగల్లేదు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా సీఎంపై మహిళ ఎందుకు కోడిగుడ్లతో దాడికి పాల్పడాల్సి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరాతీయగా సుమారు గంటన్నరపాటు ఆమె నోరుమెదపకపోవడం గమనార్హం. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే సుమారు రెండు గంటల తర్వాత ఆమె.. బీజేపీ కార్యకర్త దిలీప్ కమిల భార్య అని తెలిసింది. ఆమెది బాసరోల్ జిల్లా. నేను సీఎంను కొట్లలేదు.. వేదికపై ఉన్న మరో నాయకుడిపై గుడ్లతో దాడిచేయబోయానని పోలీసులకు వివరణ ఇచ్చుకుందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై సస్సెండ్ అయిన బీజేడీ ఎంపీ బైజాయాంత్ పాండా స్పందిస్తూ గతంలో అతను ఎదుర్కొన్న దాడిని గుర్తుచేసుకున్నారు. కాగా దాడిచేసిన మహిళ ఫిర్యాదులు ఏమున్నాయో తనకు తెలియట్లేదని.. ఆమె పూర్తి భిన్నంగా నిరసన చేసింది.. భౌతిక నిరసనలు తాము అనుకూలంగా లేమని స్పష్టం చేశారు. గతంలో బీజేడీ సభ్యులందరూ గుడ్లు, రాళ్ళు, ఇటుకలతో తనపై కూడా దాడి చేశారని, అయితే నాలుగు నెలలు వరకూ ఎవ్వర్నీ పోలీసులు అరెస్టు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

 జగన్నాథుడి గర్భగుడిలోకి నో ఎంట్రీ

Updated By ManamSun, 12/17/2017 - 08:08

Puri Jagannathభువనేశ్వర్: పూరి జగన్నాథస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు కొన్ని ఆంక్షలు విధించింది ఒడిశా రాష్ట్ర సర్కారు. వీవీఐపీలు సహా ఎవ్వరినీ ఆలయ గర్భగుడిలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. ‘పరమానిక్‌ దర్శన్‌’, ‘సహన మేళా దర్శన్‌’ వేళలో భక్తులకు గర్భగుడి ప్రవేశం నిలిపివేయమని పేర్కొంది. ఆలయంలోని ‘బిటార్‌ కథ’వరకు మాత్రమే అందరినీ అనుమతించాలని తెలిపింది. అలాగే సేవకులు తప్ప మరెవరినీ గర్భగుడిలోకి ప్రవేశించనీయద్దని సూచించింది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించాలని పేర్కొంది.  రసగుల్ల బెంగాల్‌దే

Updated By ManamTue, 11/14/2017 - 17:49
  • ఆ రాష్ట్రాన్నే వరించిన జీఐ ట్యాగ్.. తమదేనన్న ఒడిసాకు చుక్కెదురు

Rosogolla representationalన్యూఢిల్లీ, నవంబరు 14: తియ్యటి రసగుల్లపై జరిగిన హాట్‌హాట్ ఫైట్‌లో బెంగాల్‌దే పైచేయి. ఈ ఫైట్‌లో ఒడిసాను ఓడించిన పశ్చిమ బెంగాల్.. రసగుల్ల తమదేనని నిరూపించుకుంది. రసగుల్లపై జీఐ (వస్తువుల రిజిస్ట్రేషన్‌కు భౌగోళిక చిహ్నం) ట్యాగ్ బెంగాల్‌ను వరించింది. తద్వారా ఆ తియ్యటి పదార్థం బెంగాల్‌దేనని అధికారికంగా ఖరారైపోయిందన్నమాట. ‘‘జీఐ చట్టం ప్రకారం రసగుల్ల అంశం తేలిపోయింది. ఆహార పదార్థం గానీ, వస్తువు గానీ ఏ ప్రాంతానిదో చెప్పే జీఐ యాక్ట్ ప్రకారం దానిని బెంగాల్‌కే కేటాయించాం’’ అని కోల్‌కతాలోని పేటెంట్స్ అండ్ డిజైన్స్ డిప్యూటీ కంట్రోలర్ సంజయ్ భట్టాచార్య తెలిపారు. ‘‘మనందరికీ తీపి కబురు. రసగుల్లపై బెంగాల్‌కే జీఐ ట్యాగ్ వచ్చింది’’ అని లండన్‌లో ఉన్న సీఎం మమత బెనర్జీ ట్వీట్ చేశారు. ఇక, ఈ తీర్పుతో సంతోషంగా, కాస్తంత ఊరటగా ఉన్నామని బెంగాల్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి అబ్దుర్ రజాక్ మొల్లా అన్నారు. అంతకుముందు చలికాలంలో బియ్యం, బెల్లంతో చేసే జోయ్‌నగరర్ మోవాపై ఇతర రాష్ట్రాలతో పోరాడి జీఐ ట్యాగ్ పొందామని, ఇప్పుడు రసగుల్లపై విజయం సాధించామని చెప్పారు. తనకు ఆ స్వీట్ అంటే చాలా ఇష్టమైనప్పటికీ మధుమేహం వల్ల తినలేనని చెప్పారు. ఈ అంశంపై ఒడిసా అనవసరంగా వివాదాన్ని లేవనెత్తిందని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ వ్యాఖ్యానించారు.

2015 సెప్టెంబరు నుంచి ఒడిసా, బెంగాల్‌ల మధ్య రసగుల్లపై ఫైట్ మొదలైంది. అంతేకాదు.. ఏటా ‘ఉల్తో రథ’ అనే పండగనాడు ‘రసగుల్ల దినాన్ని’ నిర్వహిస్తోంది ఒడిసా ప్రభుత్వం. రసగుల్ల తమేదనని వాదిస్తున్న ఒడిసా వివరించిన కారణం.. ‘‘రథ యాత్ర సందర్భంగా లక్ష్మి దేవిని జగన్నాథుడు ఒంటరిగా వదిలి వెళ్తాడు. దీంతో అలకబూనిన లక్ష్మిదేవి.. ఆ తర్వాత అతడిని తన మందిరంలోకి రానివ్వదు. ఆమె కోపాన్ని శాంతపరచి అనుగ్రహించుకునేందుకు గానూ ఓ గిన్నెలో రసగుల్లలు ఇస్తాడు’’ అని చెబుతోంది. అయితే, కానేకాదంటోంది బెంగాల్. పాడైపగిలిపోయిన పాలతో రసగుల్ల చేస్తారని, కాబట్టి అది అశుద్ధమైనదిగానే అందరూ భావిస్తుంటారని, అలాంటి అశుద్ధమైన ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా ఎవరు పెట్టరని, కాబట్టి లక్ష్మిదేవికి జగన్నాథుడు రసగుల్లను ఇచ్చాడనడంలో వాస్తవం లేనేలేదని బెంగాల్ వాదించింది. ఏ వాదనలు ఎలాగున్నా జీఐ ట్యాగ్ మాత్రం బెంగాల్‌కు అనుకూలంగానే వచ్చింది కాబట్టి.. అది బెంగాల్‌దే. మరి, దీనిపై ఒడిసా స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

Related News