telangana

మొత్తం ఆస్తుల విలువ 22.60కోట్లు

Updated By ManamThu, 11/15/2018 - 10:41
KCR

హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు గానూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని ఆయన సమర్పించారు. అందులో కేసీఆర్ ఆస్తుల విలువ రూ.22.60కోట్లుగా పేర్కొన్నారు.

అందులో తన భార్య శోభ పేరిట రూ.93వేల నగదు, 2.2కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఈ నాలుగేళ్లలో దాదాపు 17ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తనపై మొత్తం 64కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు కేసుల్లో సమన్లు అంది విచారణలో ఉన్నాయని వివరించారు. ఇక గతంతో పోలీస్తే ఇప్పుడు కేసీఆర్‌కు అప్పులు మరో కోటి పెరిగి.. రూ.8.88కోట్లకు చేరాయి. వాటిలో కుమారుడు కేటీఆర్‌కు రూ.82లక్షలు, కోడలు శైలిమకు రూ.24.65లక్షల అప్పు చెల్లించాల్సి ఉందని వివరించారు. ఇక బంజారాహిల్స్, తీగలగుట్టపల్లిలో తనకు రెండు నివాసాలు ఉన్నాయని, సొంత కారు లేదని వివరించారు. కాగా 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆస్తుల విలువను రూ.15.15కోట్లుగా చూపిన విషయం తెలిసిందే.

అఫిడవిట్‌లో కేసీఆర్ సమర్పించిన వివరాలు
నగదు:రూ.2,40,000
బ్యాంకు డిపాజిట్లు: రూ.4,25, 61, 452
కుటుంబ డిపాజిట్లు: రూ.1,38,12,494
కేసీఆర్ బంగారం: 7.5 తులాలు
శోభ(కేసీఆర్ భార్య) బంగారం: 2.2 కిలోలు, విలువైన వజ్రాలు
వ్యవసాయ భూమి: దాదపు 54.21 ఎకరాలు(విలువ: రూ.6.50కోట్లు)
వ్యవసాయేతర భూమి: 2.04 ఎకరాలు(విలువ: రూ.60లక్షలు)
పెట్టుబడులు:
తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్: రూ.55లక్షలు
తెలంగాణ పబ్లికేషన్స్: రూ.4,16,25,000
నివాస భవనాలు:
బంజారాహిల్స్ నందినగర్, తీగలగుట్టపల్లి(కరీంనగర్)
అప్పులు: రూ.8,8847,570 కోట్లు
కేసులు: 64, విచారణలో ఉన్నవి: 2.మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా

Updated By ManamWed, 11/14/2018 - 12:15

KCRసిద్ధిపేట: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నామినేషన్ వేయనున్న రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోనాయిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  ‘‘ఇక్కడ పూజలు చేసే ఉద్యమానికి బయల్దేరాను. రైతులకు అప్పులు లేని తెలంగాణే బంగారు తెలంగాణ. వచ్చే ఏడాది కాళేశ్వరం నీళ్లతో దేవుడి పాదాలు కడుగుతాం. వంద సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటాం. దేశంలో 24గంట విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా’’ అని తెలిపారు. కాగా మధ్యాహ్నం 2.30గంటలకు కేసీఆర్ గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Updated By ManamWed, 11/14/2018 - 11:40
Congress

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం 65మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. తాజాగా రెండో జాబితాను రిలీజ్ చేసింది. రెండో జాబితాలో 10మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక రెండో జాబితాలోనూ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు.

రెండో జాబితా వివరాలు
ఖానాపూర్- రమేశ్ రాథోడ్
సిరిసిల్ల- మహేందర్ రెడ్డి
పాలేరు- ఉపేందర్ రెడ్డి
మేడ్చల్- కేఎల్ఆర్
ఖైరతాబాద్- దాసోజ్ శ్రవణ్
జూబ్లీహిల్స్- విష్ణువర్ధన్ రెడ్డి
భూపాలపల్లి- గండ్ర వెంకరమణా రెడ్డి
ధర్మపురి- ఎ.లక్ష్మణ్
ఎల్లారెడ్డి- జాజుల సురేందర్.ఇవాళ నామినేషన్ వేయనున్న కేసీఆర్

Updated By ManamWed, 11/14/2018 - 08:58

KCRగజ్వేల్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఉదయం హెలికాప్టర్‌లో కోనాయిపల్లికి చేరుకోనున్న కేసీఆర్, వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలు కేసీఆర్‌తో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

కాగా 1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇవాళే నీటిపారుదల శాఖ అపద్ధర్మ మంత్రి హరీశ్ రావు కూడా సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. కాగా డిసెంబర్‌ 7వ తేదిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు రానున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Updated By ManamTue, 11/13/2018 - 11:26

Tempearatureహైదరాబాద్: కార్తీక మాసం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 14.8డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని ఆ శాఖ వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్‌లో 9డిగ్రీలు, రామగుండంలో 16డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.

మరోవైపు ఏపీలోని విశాఖ ఏజెన్సీలో చలి చంపుతోంది. జి.మాడుగుల, జీకే వీధి, లంబసింగిలో ఉష్ణోగ్రతలు ఏకంగా 7డిగ్రీలకు పడిపోయాయి. వీటితో పాటు చింతపల్లిలో 9డిగ్రీలు, మినుములూరులో 10డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలిజాబితా

Updated By ManamTue, 11/13/2018 - 06:11

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే వారి అభ్యర్థిత్వాలను ఎట్టకేలకు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాకు ఎట్టకేలకు ఎఐసీసీ ఆమోదం లభించింది.   సోమవారం అర్థరాత్రి 70 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. 

ఒక్క సీటును కూడా ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురైన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాట్లు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ జాబితా ప్రకటించలేదు. అభ్యర్థుల జాబితాను వెలువరించకపోవడంతో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు సైతం తీవ్ర అసహనానికి గురయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించడంతో పాటు పాటు ఈసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో టీపీసీసీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ డాక్టర్ రామచంద్ర కుంతియా, ఎఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రెండుసార్లు ఎఐసీసీ  అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 

సాయంత్రం పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన  కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో జరిగిన కసరత్తులో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాలు, పార్టీ విధేయత, కూటమిలోని సీపీఐ, టీడీపీ, టీజేఎస్ అభ్యర్థులకు సీట్ల పంపకాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల జాబితాకు రాహుల్ గాంధీ ఆమోదం తెలిపారు.

 

 

కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే 70 మంది అభ్యర్థులు వీరే..

1.సిర్పూర్‌ - డాక్టర్‌ పాల్వయ్‌ విహరీష్‌ బాబు 
2. చెన్నూరు - వెంకటేశ్‌ నేత బోర్లకుంట 
3. మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు 
4. ఆసిఫాబాద్‌ - ఆత్రం సక్కు  
5. ఆదిలాబాద్‌ - సుజాత గండ్రత్‌ 
6. నిర్మల్‌ - అల్లేటి మహేశ్వర్‌రెడ్డి 
7.ముథోల్‌ - రామారావు పటేల్‌ పవార్‌ 
8. ఆర్మూర్‌ - ఆకుల లలిత 
9. బోధన్‌ - సుదర్శన్‌ రెడ్డి  
10. జుక్కల్‌ - గంగారం 
11. బాన్సువాడ - బాలరాజు 
12. కామారెడ్డి - షబ్బీర్‌ అలీ 
13. జగిత్యాల - జీవన్‌రెడ్డి 
14. రామగుండం - రాజ్‌ ఠాకూర్‌ 
15. మంథని - శ్రీధర్‌ బాబు 
16. పెద్దపల్లి - విజయరమణారావు 
17. కరీంనగర్ - ‌పొన్నం ప్రభాకర్‌ 
18. చొప్పదండి - మేడిపల్లి సత్యం 
19. వేములవాడ - ఆది శ్రీనివాస్‌ 
20. మానకొండూర్‌ - ఆరేపల్లి మోహన్‌ 
21. ఆంథోల్‌  - దామోదర రాజనర్సింహా 
22.నర్సాపూర్‌ -  సునీతా లక్ష్మారెడ్డి  
23. జహీరాబాద్‌  - గీతారెడ్డి  
24.సంగారెడ్డి  - జగ్గారెడ్డి  
25.గజ్వేల్‌  - వంటేరు ప్రతాప్‌రెడ్డి  
26.కుత్భుల్లాపూర్‌  - కూన శ్రీశైలం గౌడ్‌ 
27. మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి  
28.చేవెళ్ల - కేఎస్‌ రత్నం 
29.పరిగి  - రామ్మోహన్‌రెడ్డి  
30.వికారాబాద్‌  - గడ్డం ప్రసాద్‌కుమార్‌ 
31.తాండూరు - రోహిత్‌ రెడ్డి  
32. ముషీరాబాద్‌  - అనిల్‌కుమార్‌ యాదవ్‌ 
33.నాంపల్లి  - ఫిరోజ్‌ఖాన్‌ 
34.గోషామహల్‌  - ముఖేష్‌గౌడ్‌ 
35. చార్మినార్‌  - మహ్మద్‌ గౌస్‌ 
36. చాంద్రాయణ గుట్ట  - ఇసా బినోబైడ్‌ మిస్త్రి 
37.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ - సర్వే సత్యనారాయణ
38.కొడంగల్‌  - రేవంత్‌ రెడ్డి 
39. జడ్చర్ల  - మల్లురవి  
40.వనపర్తి  - చిన్నారెడ్డి  
41.గద్వాల  - డీకే అరుణ 
42. అలంపూర్‌  - సంపత్‌కుమార్ 
43. నాగర్‌కర్నూల్‌  - నాగం జనార్దన్‌ రెడ్డి  
44.అచ్చంపేట  - వంశీకృష్ణ  
45.కల్వకుర్తి  - వంశీచంద్‌రెడ్డి  
46.నాగార్జున్‌సాగర్‌ -  జానారెడ్డి  
47.హుజూర్‌నగర్‌  - ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  
48.కోదాడ  - పద్మావతి రెడ్డి 
49. సూర్యాపేట  - దామోదర్‌ రెడ్డి  
50.నల్గొండ  - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
51. మునుగోడు  - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  
52.భువనగిరి -  అనిల్‌ కుమార్‌ రెడ్డి  
53.నకిరేకల్‌  - చిరుమర్తి లింగయ్య  
54.ఆలేరు  - భిక్షమయ్య గౌడ్‌ 
55. స్టేషన్‌ఘన్‌పూర్ - ‌ సింగపూర్‌ ఇందిర 
56. పాలకుర్తి  - రాఘవరెడ్డి 
57. డోర్నకల్‌  - రామచంద్రునాయక్‌  
58.మహబూబాబాద్‌  - బలరాం నాయక్‌  
59.నర్సంపేట  - దొంతి మాధవరెడ్డి 
60. పరకాల -  కొండా సురేఖ  
61.ములుగు -  సీతక్క  
62.పినపాక  - రేగ కాంతారావు  
63.మధిర  - భట్టివిక్రమార్క  
64.కొత్తగూడెం -  వనమా వెంకటేశ్వరరావు 
65.భద్రాచలం  - పోడెం వీరయ్యతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Updated By ManamMon, 11/12/2018 - 10:21

Telangana Assembly Electionsహైదరాబాద్: తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈసీ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నోటిఫికేషన్‌ గెజిట్‌లు జారీ అవుతున్నాయి. అందులో ఈ రోజు నుంచి ఈ నెల 19వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువును విధించగా.. 22న ఉపసంహరణకు గడువును ఇచ్చారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. 

నామినేషన్ దాఖలు చేసేందుకు 48గంటల ముందు తాము తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ రోజు బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన తరువాతే ప్రక్రియ మొదలుకానుంది. ఇక ఈ రోజు నుంచి ఈ నెల 22వరకు అన్ని ఎమ్మార్వో ఆఫీసులలో 144సెక్షన్‌ను అమలుపరచనున్నారు. కాగా డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.రోడ్ల నిర్మాణానికి ప్లాస్టిక్!

Updated By ManamSat, 11/10/2018 - 00:50

imageసువిశాలమైన హైదరాబాద్ నగరంలో మురుగునీరు, వర్షం నీరు పోవడానికి నిర్మించిన నాలాల్లో 40% వరకు ప్లాస్టిక్ చెత్తతో పూడుకుపోయాయి. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, సీసాలు.. ఇలాంటి వాటన్నింటినీ రోడ్డు పక్కనే కనపడే నాలాల్లో పారేయడం సర్వసాధారణం అయిపోయింది. అలా ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోయిన నాలాలన్నింటినీ శుభ్రం చేయించడం అంటే తలకు మించిన భారంగా మారుతోంది. పైగా, అలా తీసిన వాటిని ఏం చేయాలన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. దీనంతటికీ పరిష్కార మార్గంగా.. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వాడాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇలా ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల రోడ్ల నాణ్యత కూడా పెరిగి, వాటి జీవితకాలం మెరుగవుతుంది.

ఈరోడ్లలో 5% ప్లాస్టిక్‌ను తారులో కలుపుimageతారు. దానివల్ల తారు మరింత బలంగా మారి, కంకరతో గట్టిగా అతుక్కుంటుంది. దానివల్ల రోడ్డు మీద పెద్ద వాహనాలు వెళ్లినా, వర్షాలు పడినా కూడా తారు కొట్టుకుపోవడం అనేది ఉండదు. దానివల్ల రోడ్ల జీవిత కాలం గణనీయంగా మెరుగుపడుతుంది. దానికితోడు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏం చేయాలన్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 

ఈ తరహా ప్లాస్టిక్ రోడ్లను విదేశాలలో వేయడాన్ని గమనించిన జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు అదే పరిజ్ఞానాన్ని 
ఇక్కడ కూడా ఉపయోగించారు. 

మటన్ షాపులకూ బాక్సే
imageమటన్ దుకాణాలకు వెళ్లేవారు సాధారణంగా నల్లటి ప్లాస్టిక్ కవర్లలో తమకు కావల్సినంత తీసుకెళ్లడం సర్వసాధారణం. ఈ అలవాటును మాన్పించి, ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించడానికి జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగాలు చేసింది. ఏదైనా విషయాన్ని నలుగురికి చెప్పాలంటే, దానికంటే ముందుగా తాను అమలుచేయాలన్న విషయాన్ని కమిషనర్ జనార్దన్ రెడ్డి గట్టిగా నమ్ముతారు. అందుకే మటన్ దుకాణాలకు వెళ్లేటపుడు ఆయన ఒక స్టీలు బాక్సు తీసుకెళ్లేవారు. అక్కడకు వచ్చేవారంతా ఆయనను విచిత్రంగా చూసినా, కవర్ల వాడకాన్ని నిషేధించాలంటే అది తప్పదని ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా చికెన్/ మటన్ దుకాణదారులకు కవర్ల వాడకంపై గట్టి ఆదేశాలిచ్చారు. దాంతోపాటు.. చికెన్/ మటన్ దుకాణాలకు తరచు స్టీలు బాక్సులు తీసుకుని వచ్చే కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్ల వివరాలను కూడా నమోదు చేయాలని తెలిపారు.

 అలా స్టీలు బాక్సులతో వచ్చే వినియోగదారులకు నెలకు ఒకసారి లక్కీడ్రా నిర్వహించి, వారికి ప్రోత్సాహకimage బహుమతులు ఇవ్వాల్సిందిగా కూడా దుకాణదారులకు తెలిపారు. ఈ తరహా పర్యావరణ అనుకూల చర్యలు అవలంబించే దుకాణాలకు ‘స్వచ్ఛ చికెన్, మటన్ దుకాణం’ అనే గుర్తింపు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. దాంతోపాటు ఈ దుకాణాల వద్దకు ఖాళీ చేతులతో వచ్చే కస్టమర్లకు నేరుగా చెప్పి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించే దిశగా వారికి అవగాహన కల్పించే బాధ్యతను ఎస్‌ఎఫ్‌ఏలకు అప్పగించారు. మాంసం దుకాణాలకు వెళ్లేటపుడు స్టీలు బాక్సులు, అలాగే సూపర్ మార్కె ట్లకు వెళ్లేటపుడు క్లాత్ బ్యాగులు తీసుకెళ్లాలని వినియోగదా రులకు కూడా తెలిపారు. దీనివల్ల ప్రధానంగా మాంసం దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్ల వినియోగం గణనీయంగా తగ్గింది. 

50 మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే
కాలుష్యాన్ని దూరం చేసేందుకు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని జీహెచ్‌ఎంసీ నిషేధించింది. వ్యాపార సంస్థలు, హోటళ్లు.. ఇతర సంస్థలలో ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు వాడితే భారీ జరిమానాలు విధిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా సొంతంగా షాపర్ బ్యాగులు, జ్యూట్ బ్యాగులు తీసుకుని దుకాణాలకు వచ్చే వినియోగదారులను గుర్తించి, వారికి లక్కీడిప్ ద్వారా బహుమతుతు ఇవ్వాలని కూడా వ్యాపార సంస్థలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కోరారు. సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Updated By ManamTue, 11/06/2018 - 12:10

Accidentసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.జనవరి 1న ఏపీలో హైకోర్టు ప్రారంభం

Updated By ManamMon, 11/05/2018 - 14:15
  • హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు పలు సూచనలు

Separate High Courts for Andhra pradesh from January 1st

న్యూఢిల్లీ :  అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు విభజనపై ఉన్నత న్యాయస్థానం సోమవారం పలు సూచనలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. నిర్మాణం కొనసాగుతున్నందున అప్పటివరకూ అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.  అలాగే అప్పటివరకూ జడ్జీల నివాసం కూడా అద్దె భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

కాగా డిసెంబరు 15వ తేదీకల్లా హైకోర్టు అవసరాల నిమిత్తం తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇచ్చిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు జడ్జీలు కూడా సుముఖంగా ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది.
 

Related News