life style

ఫెస్టివ్ ఫ్యాషన్

Updated By ManamWed, 10/31/2018 - 00:37

imageఫ్యాషన్ కోషంట్ పెంచాలంటే శారీను ఎంచుకు తీరాల్సిందే. మరి చీరలు కట్టడం, వాటికి సూటబుల్‌గా ఉండే యాక్సెసరీస్‌తో కనిపించే ‘దేశీ స్టైల్’ వద్దనుకుని.. వెరైటీ స్టైల్ కావాలంటే? ఇందుకు విరుగుడే ఈ నయా ఫెస్టివ్ ఫ్యాషన్ కలెక్షన్. వివిధ టెక్స్‌టైల్ బ్రాండ్లు అత్యధిక ప్రయోగాలు ఇప్పుడు చీరలపైనే చేయడానికి కారణం కూడా ఇదే. 

జిప్‌సూట్
ఫ్యూజన్ శారీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. రెడీ టు వేర్ చీరలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. శారీ, జంప్‌సూట్ రెండూ కలిపి జిప్‌సూట్‌లా, పలాజూ శారీలా డబ్ల్యూ బ్రాండ్ లాంచ్ చేసిన కలెక్షన్ ఫ్యాషన్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. ‘‘ఫెస్టివ్ ఫ్యాషన్ విత్ ఏ వెస్ట్రన్ ట్విస్ట్’’ పేరుతో చాలా కంపెనీలు సరికొత్త చీరలను లాంచ్ చేస్తున్నాయి.
image
‘‘హూ సేస్ శారీస్ కెనాట్ బి ఏ డ్రెస్’’ అంటూ మోడ్రన్ ఔట్‌ఫిట్‌లను ఇష్టపడే అమ్మాయిలకు శారీ డ్రెస్‌లను పరిచయం చేస్తున్నారు. ట్రెండీగా, కంఫర్టబుల్‌గా ఉండే ఈ కలెక్షన్ ప్రస్తుతం హాట్‌కేక్‌లా మారింది. పండుగలు, పెళ్లిళ్లలో స్టైలిష్, ఎవర్‌గ్రీన్‌గా కనిపించేలా చేయడంలో చీరలకు తిరుగులేదు కనుక మీ వార్డ్‌రోబ్‌లోనూ ఇలాంటి చీరలుండేలా చూసుకోండి.ట్రాన్స్ క్వీన్

Updated By ManamThu, 10/11/2018 - 04:14

imageబాల్యం నరకంగా సాగింది.. పెద్ద చదువులు లేవు.. పైపెచ్చు పేద కుటుంబం.. అయినా ఏదో ఒకటి చేయాలనే తపన.. తనను వెలివేసిన సమాజమే తనను శెభాష్ అనాలన్న కసి.. వెరసి.. మొట్టమొదటి ‘ట్రాన్స్ క్వీన్ ఆఫ్ ఇండియా’గా వీణా సెండ్రే సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటికే లక్నో, బెంగళూరు ఫ్యాషన్ ప్రపంచానికి చిరపరిచితురాలైన వీణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు.  ముంబైలో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో గట్టి పోటీ ఎదురైనా అందరినీ ఓడించి విజేతగా నిలిచిన వీణ గతంలో ‘మిస్ ఛత్తీస్‌గఢ్’ పోటీల్లోనూ కిరీటం దక్కించుకున్నారు. 
 

image

ఫ్రెండ్స్ లేరు
రాయ్‌పూర్ వద్ద ఉన్న మందిర్ హసౌద్ గ్రామానికి చెందిన ఈమె బాల్యంలో అష్టక ష్టాలు ఎదుర్కొన్నట్టు చేదు జ్ఞాపకాలు మీడియాకు వివరించారు. స్కూల్‌లో ఎవరూ తనతో స్నేహం చేసేవారు కాకపోగా, ఇతరులతో భిన్నమైన తనను అందరూ తన ఏడిపించేవారంటారు.  ఈ బాధ తట్టుకోలేక 5వతరగతితోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ‘మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా’ పోటీల్లో నెగ్గడమంటే తనలాంటి లింగమార్పిడి చేసుకున్న వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.  ఇప్పుడిప్పుడే తమ పట్ల సానుకూల దృక్పథం పెరుగుతోందంటున్న వీణా మంచి బెల్లీ డ్యాన్సర్ కూడా.వావ్.. గ్రే హెయిర్..

Updated By ManamTue, 09/11/2018 - 00:03

imageవామ్మో తెల్ల జుట్టు వచ్చి మేము గుండెలు బాదుకుంటూంటే.. ఇదేంటీ.. వావ్ గ్రే హెయిర్ అంటారు? అని ఆశ్చర్యంగా ఉందా? ‘గ్రే ఈజ్ న్యూ బ్లాక్’ మరి అందుకే ఇదంతా.  తెల్ల రంగు వేసుకోవడం నయా స్టైల్ అయినప్పుడు మీకు సహజంగానే తెలుపు రంగు జుట్టు ఉండడం స్టైల్ కాదా? అంతెందుకు ఇందిరా గాంధీ గ్రే హెయిర్ తలకట్టును గుర్తుకు తెచ్చుకోండి.. ఆమె ఎంత డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గా కనిపించేవారో అర్థమవుతుంది.

లేటెస్ట్ ఫ్యాషన్
గ్రే హెయిర్ స్టైల్స్ పేరుతో సరికొత్త ట్రెండీ లుక్ ఇప్పుడు రాజ్యమేలడం లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది.  కమాన్.. ఇది మీ జుట్టు.. మీ ఇష్టం వచ్చినట్టు మీరుండవచ్చు.. చూసేందుకు ఇలాగే ఉండాలి.. ఇలాగే కనిపించాలనే రాజ్యాంగం ఎక్కడా లేనప్పుడు తెచ్చిపెట్టుకున్న రంగుతో, మీ మనసుకు పూర్తిగా నచ్చని పనులెందుకు చేయాలి? అందుకే మీలాంటి ఆత్మవిశ్వాసం ఉన్నవారు ప్రారంభించిన ‘గ్రే హెయిర్ చాలెంజ్’ స్వీకరిస్తే ఇక మీకు టెన్షన్ ఫ్రీ. 
 

image


సెల్ఫ్ రెస్పెక్ట్ సింబల్
‘మీ టూ చాలెంజ్’లానే సిల్వర్ హెయిర్‌ను చూపించుకునేలా హెయిర్ స్టైల్ చేసుకోవడం ఇప్పుడు కొత్త చాలెంజ్‌గా మారింది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కు సింబల్‌గా మారింది.  అందుకే జెన్నిఫర్ లోపెజ్, ఏంజిలినా జోలీ వంటి స్టార్లు ఏమాత్రం జంకకుండా తమ తెల్ల జుట్టుతో ఎంచక్కా పోజులిచ్చేస్తున్నారు. బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్‌టన్ ఇలాగే గ్రే హెయిర్‌తో ప్రౌడ్‌గా కనిపిస్తారు. ఇక చిన్న వయసులోనే తెల్లవెంట్రుకల బారిన పడ్డ మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు హెయిర్ డైలు అస్సలు వేయరాదు. వేస్తే తల్లీ-బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ప్రమాదాలు తప్పవు. 
 
హుందాకు కేరాఫ్
imageహీరో అజిత్ సహజైమైన వెంట్రుకలతోనే నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. జగపతిబాబు వంటి తెలుగు నటులు కూడా ఈ ట్రెండ్‌ను సృష్టించారు. ధోని, మిలింద్ సోమన్ వంటివారు డైకు దూరంగా ఉంటూ .. ‘వాటే స్టైల్ ’ అనిపించుకుంటున్నారు.  వయసు మీద పడినా పడకపోయినా వచ్చే తెల్ల రంగు క్రెడిబిలిటీకి సింబల్‌గా మారింది. ఇలా రంగుకు దూరంగా ఉండేవారు నిజాయితీగా ఉంటారని సైకాలజీ చెబుతోంది. ఇక గ్రే హెయిర్‌లో బోలెడు రంగులున్నాయి. న్యూ సిల్వర్ గ్రే హెయిర్ ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కాస్మెటిక్‌గా వెస్ట్‌లో మారింది. వీటిలో కూడా ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ గ్రే గ్లోరీ, గ్రాఫైట్ గ్రే, గ్రే పర్ల్ వంటి ఎన్నో వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ‘2018 మోస్ట్ పాప్యులర్ కలర్ ట్రెండ్’గా నిలిచిన గ్రే కలర్ హెయిర్ వేసుకోవాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలని హెయిర్ స్టైలిస్టులు చెబుతారు.  మధ్యవయసు వారందరికీ హుందాగా కనిపించే రంగుగా తెల్ల వెంట్రుకలనుimage భావిస్తారు. కానీ తెల్లవెంట్రుకలు కనిపిస్తే చాలు ఆంటీ, అంకుల్ అనేస్తారనే భయం మనల్ని వెంటాడుతుంది కనుక తక్షణం రంగు వేసుకోవడాన్ని ప్రారంభించడం రొటీన్‌గా మారింది. ఏజింగ్‌కు సింబల్‌గా భావిస్తే మాత్రం ఇది ఓ ఫోబియాగా మారి మిమ్మల్ని కాల్చుకు తినడం ఖాయం.  అందుకే మీ గుండె ధైర్యాన్ని ముందు పరీక్షించుకోండి.. ఆతరువాత గ్రే హెయిర్‌తో కనిపించేందుకు మానసికంగా సిద్ధమవ్వండి.. ఇక మిగతా జీవితం అంతా మీ శరీరంలో భాగమైన వె ంట్రుకల సహజత్వంతో మెరిసిపోండి.. ఎవరు ఏం కామెంట్ చేసినా పట్టించుకోకపోతే చాలు మీరు గ్రే హెయిర్ టె స్ట్‌లో పాస్ అయినట్టే. 
 
గ్రే ఈజ్ న్యూ బ్లాక్
ఈ సరికొత్త స్లోగన్ పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా ప్రభావం చూపుతుండగా మనదేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. పండు ముసలివారు సైతం తమ జుట్టుకు నల్ల రంగు వేసుకునే మనదేశంలో ప్రముఖులైన కొందరు తమ హెయిర్ స్టైల్‌ను అమాంతంగా మార్చు కుంటూ, దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ మార్చుకుంటూ తమ తెల్ల జుట్టును ప్రదర్శించడం మొదలయ్యాక అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్న వారు ‘థాంక్ గాడ్’ అని ఊపిరి తీసుకుంటున్నరు. 30వ ఒడిలో పడీ పడగానే మన క్రికెటర్ మహేంద్ర సింఘ్ ధోనీకి తలంతా నెరిసిపోవడం చూసిన అభిమానులు షాక్ తిన్నారు. అయినా ధోనీ దీన్ని కూడా సరికొత్త స్టైల్‌గా మార్చేసుకుని తెల్ల గడ్డం, తెల్ల క్రాప్‌తోనే బ్యాట్ ఝుళిపించి అందరినీ ఆలోచింపచేస్తున్నారు.

 కొత్తల్లో ఇదంతా చూసినవారు ‘‘ఏంటి.. ధోనీ తన క్రాప్‌కు హెయిర్ డై వేసుకోరాదూ?’’ అంటూ సోషల్ మీడియాలో బాహాటంగానే సలహాలివ్వడం మొదలుపెట్టినా ఇవేవీ ధోనీ పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు హెయిర్ స్టైల్ మార్చుకుంటూ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. దీంతో ‘‘గ్రే ఈజ్ న్యూ బ్లాక్’’కు మనదేశంలో విస్తృతంగా ప్రచారం వచ్చినట్టైంది. మీరు మీలా మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు ఉంటే చాలు..ఇతరులు దాన్ని అభినందిస్తారా? విమర్శిస్తారా అన్నది అప్రస్తుతం అనుకుంటే మీ లైఫ్..మీ రేంజ్‌లో సాగుతుంది.ఆన్ డిమాండ్

Updated By ManamWed, 09/05/2018 - 02:40

మొబైల్ ఫోన్‌లో టీవీ చూసే వారి సంఖ్య 2020 నాటికి 50 శాతం imageపెరగనుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చానళ్లు తమ ప్రసారాలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేట్టు ఉండేలా రూపొందిస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒక వీక్షకుడు తప్పకుండా సెల్‌ఫోన్‌లోనే టీవీ చూస్తుంటాడు కనుక ‘వ ర్చువల్ రియాల్టీ’ (వీఆర్) యూజర్స్ కోసం ప్రత్యేక యాప్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి వీఆర్ యూజర్స్‌ను ‘ఆన్ డిమాండ్ వ్యూయింగ్’ కింద లెక్కకడతారు. అంటే టీవీ ప్రోగ్రాములు చూసే విధానం సమూలంగా మారనుందన్నమాట.
 
ఇక ముందు ఆన్ డిమాండ్ వ్యూయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని టీవీ రియాల్టీ షోలు, సీరియళ్లు వంటివి తయారుimage చేయాలి. లేదంటే రేటింగులు హుళక్కే. ఉదాహరణకు తెలుగులో ‘బిగ్‌బాస్’ రియాల్టీ షో ఉంది. ప్రస్తుతం ఈ షోను టీవీలో, హాట్‌స్టార్‌లో చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. కానీ యాప్‌లో వీటిని ఎవరైనా చూస్తున్నారంటే.. ఎపిసోడ్ బాగుందని టాక్ వస్తేనే చూస్తున్నారు, లేదంటే అస్సలు దీని జోలికే పోరు. కాబట్టి ‘ఆన్ డిమాండ్’ను చానల్ క్రియేటివ్ హెడ్‌లు (ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ హెడ్) చాలా సీరియస్‌గా తీసుకోక తప్పదు. చూడచ క్కని, క్రి యేటివ్, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాములు కాకుండా చెత్తా చెదారాన్ని ప్రసారం చేస్తే మొబైల్ వీక్షకులు వీటివంక తలెత్తి కూడా చూడరు. ఈ మేరకు ఎరిక్‌సన్ కన్జ్యూమర్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఇప్పుడిప్పుడే తెలుగు చానళ్లు అర్థంచేసుకుని, వంటబట్టించుకునే పనిలో పడ్డాయి. 

మధ్యతర‘గతే’!
imageయువత మాత్రమే కాకుండా మధ్యవయస్కులు, పెద్దవారు సైతం ఆనందంగా తీరిక సమయంలో తమకు నచ్చిన టీవీ ప్రోగ్రాములు ఫోన్‌లో ప్లే చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మధ్యతరగతివారు వీరిలో అత్యధికంగా ఉండడంతో వీరి మైండ్‌సెట్‌ను స్టడీ చేస్తూ, మిడిల్ క్లాస్ వీక్షకులకు తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ రీడిజైన్ చేయాల్సిన పరిస్థితిని వీఆర్ సృష్టించింది. మధ్యతరగతిని ఆకట్టుకున్న చానలే ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌గా రాణిస్తుంది. దీంతో క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మంచిరోజులు రావడం ఖాయమని భావించవచ్చు. ఆన్ డిమాండ్‌ను డిక్టేట్ చేసేది సోషల్ మీడియా కనుక ఏదైనా ప్రోగ్రాంపై మంచి టాక్ వస్తేనే ఆ ప్రోగ్రాం హిట్ అయినట్టు. అప్పుడే ఆన్ డిమాండ్ వినియోగదారులు దాన్ని చూస్తారు కనుక మీకు నచ్చిన కార్యక్రమాలు భవిష్యత్‌లో మరిన్ని తయారవుతాయి. ఆన్ డిమాండ్‌లో పోటీ తట్టుకుని నిలబడేందుకు దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సీరియళ్లు, సినిమాలు, రియాల్టీ షోలు కూడా పాతవైనా, కొత్తవైనా ప్రసారం చేసేందుకు హక్కుల కోసం ఇప్పటికే చానళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీవీల ముందు గంటల తరబడి వృథా చేసుకోకుండా లీజర్ దొరికినప్పుడు వీలైనన్ని ఎపిసోడ్స్ చూసేయడం, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా కాలేజ్ నుంచి ఇంటికి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో మొబైల్‌లో టీవీ చూసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం సర్వసాధారణమైన ఈరోజుల్లో టీవీ కూడా ఫోన్‌లోనే చూడటం డైలీ రొటీన్ వ్యసనంగా మారిపోయింది. ఇక ఐప్యాడ్, నోట్ ప్యాడ్ వంటి గ్యాడ్జెట్లు అందరి చేతుల్లోకి వచ్చి చేరుతున్నప్పుడు టీవీల్లోకంటే దీంట్లో చూడటం బెటర్ అనేలా పరిస్థితి తయారయింది. అందుకే చానళ్లు రూటు మార్చే పనిలో పడ్డాయి.
భార్గవి కరణంపురుష ‘సౌందర్యం’

Updated By ManamThu, 08/30/2018 - 06:54

‘‘ఆడవాళ్ళు అలంకరణ మొదలు పెడితే, ఇక అంతే సంగతులు.., గంటల కొద్దీ అద్దానికి అతుక్కుపోతారు’’ అన్నది స్త్రీల మీద పురుషులు సాధారణంగా చేసే ఫిర్యాదు. నిజానికి అందంగా కనిపించాలన్న తాపత్రయానికి లైంగికపరమైన వ్యత్యాసాలు ఏవీ ఉండవు. సమకాలీన సమాజంలో పురుషులు కూడా తమ అందచందాలకు మెరుగులు దిద్దుకోవడంలో గంటలు గంటలు గడపడంతోపాటు, యథేచ్ఛగా జేబులు కూడా ఖాళీ చేసుకుంటున్నారు. పురుషుల్లో పెరిగిన ఈ సౌందర్య స్పృహ పల్లవీసింగ్‌కు ఆసక్తికరంగా మారింది. 

imageపల్లవీసింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఒక ఆర్టిస్టు. కొచ్చి బినాలె ఫౌండేషన్ వారికి సంబంధించిన ఒకానొక ప్రాజెక్టు కోసం ఆమె పని చేశారు. పల్లవి కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు, సుశిక్షితురాలైన ఒక ఫొటోగ్రాఫర్ కూడా! అందుకే ఆమె తన ప్రాజెక్టు కోసం తన చుట్టూ ఉన్న సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని ప్రధాన వస్తువుగా స్వీకరించాలని భావించారు. తన ప్రాజెక్టుకు ఆమె ‘ముదివెట్టు మ్యూజియం నిర్మాణతి’ (హెయిర్ కట్ మ్యూజియం- అండర్ కన్‌స్ట్రక్షన్) అని పేరు పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా పల్లవి కొచ్చిలోని కె.ఎం. శంషుద్దీన్‌కు చెందిన ఒక చిన్న మంగలి దుకాణానికి వెళ్ళారు. ఆయనతో మాట్లాడారు. ఫోటోలు తీశారు. కొచానాగడిలోని శంషుద్దీన్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు 75 ఏళ్ళ చరిత్ర ఉంది. కాలంతో పాటు తమ శోభను పోగొట్టుకున్న గోడలు, అద్దాలు, కుర్చీలతో శంషుద్దీన్ సెలూన్ చాలా అనాకర్షణీయంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ సెలూన్‌కు వచ్చే కస్టమర్లు మాత్రం శంషుద్దీన్ చేసే హెయిర్‌కట్‌ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. 

imageపల్లవీ సింగ్ 2010లో మొదటిసారిగా తన స్నేహితుల్లో మగపిల్లలు సౌందర్య సాధనాలైన సీరమ్స్, కండీషనర్స్‌ని ఉపయోగించడాన్ని గమనించారు. అంతవరకు అలాంటి పదార్థాల్ని స్త్రీలు మాత్రమే ఉపయోగించేవారు. భారతీయ పురుషుల్లో కొత్తగా కనిపించిన ఈ సౌందర్యాభిలాష పల్లవిలో ఆసక్తిని రేకెత్తించింది. ‘‘మహిళలు సౌందర్యపోషణలో కాలాన్ని వృథా చేస్తారని ఆరోపించడం నిజం కాదు. ఎందుకంటే పురుషులే సౌందర్య పోషణలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కానీ అందం గురించి ఆలోచించడం పురుష లక్షణం కాదన్న సంప్రదాయ ధోరణి వల్ల వాళ్ళు గుంభనంగానే ఈ పని చేస్తుంటారు. కాలాన్ని, డబ్బుని అందం కోసం వెచ్చించడంలో పురుషులు, మహిళలకు తీసిపోరు’’ అంటారు పల్లవి. తన ప్రాజెక్టు కోసం కొచ్చిలోని సెలూన్లను సందర్శించినపుడు పురుషులు హెయిర్‌కట్ విషయంలో కొత్తకొత్త ఫ్యాషన్ల కోసం ఎంతగా వెదుకుతుంటారో ప్రత్యక్షంగా చూశానని పల్లవి అంటారు. తమ జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవడం, స్ట్రెయిట్ అప్ కట్ చేయించుకోవడం, అవసరమైతే ఉంగరాల జుట్టుకోసం సెలూన్లను ఆశ్రయించడం వంటి ధోరణి పురుషుల్లో పెరిగిందన్నది ఆమె అభిప్రాయం. ‘హెయిర్ కట్ మ్యూజియం’ అన్నది పల్లవీసింగ్ తన కెరీర్‌లో నిర్వహించిన తొలి మిక్స్‌డ్ మీడియా ప్రాజెక్టు. దీని కోసం ఆమె కొచ్చిలోని పది మంగలి దుకాణాలు, సెలూన్లను సందర్శించారు. ఇంతకు మునుపు ఆమె నగర పురుషుల స్వభావం కేంద్రంగా ‘డిజైర్ టు బి డిజైర్డ్’, ‘డిజైర్ లస్ట్’ల పేరుతో పెయింటింగ్ ప్రదర్శనల్ని నిర్వహించారు.
 

image


తన తాజా ప్రాజెక్టు కోసం పల్లవి కొచ్చిలోని సెలూన్లను సందర్శిస్తున్నపుడు, పురుషులు ఫ్యాషన్ బ్లాగ్‌లలో తాము చూసిన హెయిర్‌కట్‌లు కావాలంటూ, పలురకాల హెయిర్‌కట్‌ల పేర్లను చెప్పడాన్ని చూశారు. ‘‘అరవై ఏళ్ళకు పైబడిన పురుషులు సాదాసీదా హెయిర్‌కట్‌లతో సరిపెట్టుకుంటుంటే, యువకులు మాత్రం ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, సినిమాహీరోలు, మోడల్స్ వంటి వారి ఫోటోలు పట్టుకొచ్చి, తమకు అలాంటి హెయిర్‌కట్ చేయాలంటూ బార్బర్లని అడగడం కనిపించింది. అయితే ఆధునిక హెయిర్‌కట్‌లు చేయడంలో ఎలాంటి శిక్షణ లేని ఈ సాదాసీదా మంగలి వాళ్ళు తమ క్లయింట్స్ చూపించిన ఫోటోల్ని చూసి, మక్కీకి మక్కీ అలాంటి హెయిర్‌కట్‌లనే చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని చెప్పారు పల్లవి. పల్లవీసింగ్ తాను నెలకొల్పిన హెయిర్‌కట్ మ్యూజియంలో సాదాసీదా మంగలి దుకాణాల్లో కనిపించే కతె్తర్లు మొదలుకుని ఆధునికమైన ట్రిమ్మర్లని, చెక్కపిడితో ఉన్న పౌడర్ బ్రష్, షేవింగ్ బ్రష్, చేతితో పనిచేసే హెడ్ మసాజర్ వంటి సాధనాల్ని కూడా ప్రదర్శనకు ఉంచారు. తాను సందర్శించిన మంగలి దుకాణాల నుంచి ఆమె వాటిని సేకరించారు. మన జీవితం నుంచి చిన్న చిన్న మంగలి దుకాణాలు, క్షురకులు క్రమంగా అదృశ్యమైపోతున్నారు. తమలా కాకుండా తమ పిల్లలు చదువుకుని ఉన్నతోద్యోగాలు చేయాలని వాళ్ళంతా కోరుకుంటున్నారని పల్లవీసింగ్ చెబుతారు. ‘మ్యూజియం ఆఫ్ హెయిర్‌కట్స్’ అనే ఆమె ఛాయాచిత్రాల ప్రదర్శన గత జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు కొచ్చిలోని పెప్పర్‌హౌజ్‌లో జరిగింది. సామాజిక పరిణామంలో భాగంగా క్రమంగా అదృశ్యమవుతున్న అనేకానేక చేతివృత్తులతో పాటు, క్షురకులు కూడా కనుమరుగు కావడం విషాదకరం. ఆ విషాదాన్ని మరోసారి గుర్తు చేసింది పల్లవీ సింగ్ ప్రదర్శన. 
- పసుపులేటి గీతకుటుంబ కథా‘చిత్రం’ నకాషీ

Updated By ManamFri, 08/03/2018 - 02:21

నవాబులు మెచ్చిన కళ. వారి కాలంలో దర్బారుల్లోనూ, మహల్స్‌లోనూ ఆ చిత్రాలే కొలువుతీరాయి. అదే నకాషీ కళ. 16వ శతాబ్ది నాటి చిత్రాలు కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మరుగైపోతుందన్న కళకు ఆ కుటుంబమంతా అంకితమై జీవిస్తున్నారు.  వీరే కాదు కొన్ని తరాలు ఆ కళనే నమ్ముకున్నాయి. వారిచేతిలో రూపుదిద్దుకోని పురాణమంటూలేదు. చివరకు ఈ కళే వారి కులంగా, పేరు చివర చేరిపోయింది. సహజైమెన రంగులు మాత్రమే వాడే ఒకే కళ ఈ నకాషీ చిత్రకళ. ఎన్నో ఏళ్ళ చరిత్రకు  ఆనవాళ్ళుగా మిగిలింది ఈ కళ.
image
ఒకప్పుడు వారు గీసిన బొమ్మలు ఊరూరా కథలుగా చెప్పేవారు. మారుతున్న కాలంతో కొన్నిమార్పులను సంతరించుకుని, పురాణాలతో పాటు ప్రాంతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఈ కళలో చేటుచేసుకుని ఇప్పటి  తరానికి చేరువౌతుంది. అంతటి ఘనకీర్తి కలిగిన ఈ కళాసంపదను మన తెలంగాణా ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ధనాలకోట వైకుంఠం నకాషీ, వనజ నకాషీలు ఈ కళను పూర్వీకులనుండీ అభ్యసిస్తే, వీరి కుమారుడు రాకేష్ వర్శ వృత్తిగా చేసుకోవడమే కాదు కొత్త ప్రయోగాలను చేస్తూ కళాభిమానులకు మరింత చేరువ చేస్తున్నాడు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులనూ సొంతం చేసుకున్నారు వీరు. ఇంతటి చరిత్ర కలిగిన నకాషీ కళను గురించి ఈ కుటుంబం మనం మిసిమితో పంచుకున్న ముచ్చట్లు... 

దేవతలకు సంబంధించిన కథలన్ని బొమ్మలుగా మలచి చెప్పే కళే నకాషీ. నకాషీ అనే ఉద్దూ పదానికి నక్ష్ అంటే అచ్చు గుద్దినట్టు చిత్రించడం అని అర్థం. నవాబుల రాజ దర్బారులో, మహల్స్ లో కళారూపాలన్నీ ఈ నకాషీ చిత్రకారుల చేతిలో రూపుదిద్దుకున్నవే. ఒక రూపాన్ని చెప్పింది చెప్పినట్లుగా విని దానికి రంగుల్లో చిత్రంగా మలచడమే నకాషీకళ. దేవతలకు సంబంధించిన కథల్ని బొమ్మలుగా గీసి చెప్పేకళ నకాషీ.. ఈకథలు ముఖ్యంగా కుల దేవుళ్ళ కథలను చెపుతాయి. మహాభారతం, రామాయణ ఘట్టాలు, శ్రీకృష్ణుని లీలలు, జాంబవంతుని కథ, కాటమరాయుని కథ, మార్కండేయ పురాణం, ఆదిశక్తి పుట్టిన నాటినుండీ, మహాభారత యుద్ధం పూర్తయ్యే వరకూ అన్ని ఘట్టాలనూ చిత్రాలుగా మలచి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సంచార జాతులు కథలుగా చెప్పేవారు. ఒకప్పుడు తోలుబొమ్మలాట ఎంత ఆదరణ కలిగి ఉండేదో అంతే ఆదరణ ఈ నకాషీ చిత్రాలతో కథలను చెప్పడంలో ఉండేది. దీనికోసమే కొన్ని కుటుంబాలు నిత్యం ఊర్లు తిరుగుతూ ఈ కళను ప్రదర్శించేవారు. 

వస్త్రంపై సహజైమెన రంగులతో బొమ్మలు వేసే పద్దతినే నకాషీ అంటారు. వీరిని నకాషీలు లేదా పట చిత్రకళాకారులుimage అంటారు. వరంగల్ జిల్లా చేర్వాలలో ఈ కళ ఉన్నది. మడేల్ పురాణం, గౌడ పురాణం జాంబ పురాణం స్క్రోల్స్ గా చిత్రి    స్తారు. ఇందుకోసం సహజైమెన రంగులనే వాడతారు. ఇలా గీసిన చిత్రాలు వందల ఏళ్ళపాటు ఉండటం, ఈ చిత్రకళ ప్రత్యేకత. నకాశీ కళలో రంగులు అన్నీ సహజ సిద్ధంగా తయారుచేసుకున్నవే వాడతారు. రంగురాళ్ళను కొనుగోలు చేసి వాటిని నూరుకుని రంగులు తయారుచేసుకుంటారు. ముఖ్యంగా ఇందుకోసం ఆరు రంగులను వాడతారు. తెలుపురంగును శంఖాలతోను, నలుపు రంగును కిరోసిన్ దీపంతో వచ్చే మసితోను తయారుచేస్తారు. ఒక ఎరుపు, పసుపు రంగులు రంగురాళ్ళను నూరి చేస్తారు. నీలం రంగును ఇండిగో ఆకులతో చేస్తారు. ఇక మాస్క్‌లు తయారీ మరింత శ్రద్ధగా చేస్తారు. ఒక మాస్క్ తయారీకి వారం రోజులు వరకూ సమయం పడుతుంది. చెక్కపొట్టు, కోడిగుడ్డు సొన, బంక కలిపి బొమ్మను తయారుచేస్తారు. రెండురోజులు ఆరిన తరువాత, పైన చింతగింజల అంబలితో వస్త్రాన్ని అతికిస్తారు. అతికించిన వస్త్రంపై రెండుసార్లు సున్నం నీటిని అద్ది రంగులు వేస్తారు. 

- శ్రీశాంతి దుగ్గిరాలమ్యూజిక్ వెకేషన్

Updated By ManamThu, 08/02/2018 - 02:42

దేశ విదేశీ ఆర్టిస్టుల లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు కాస్త సేదతీరి, మంచి టూరిస్ట్ స్పాట్‌లో చక్కర్లు కొట్టి రావాలంటే స్వామికార్యం స్వకార్యం రెండూ తీర్చే వేదికలు, వేడుకలు కావాలి. ఇందుకు ఫుడ్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్ట్, లిటరేచర్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, బీచ్ ఫెస్ట్, డెజర్ట్ ఫెస్ట్ వంటి సాకులు ఉంటే మీ వెకేషన్ మరింత ఆహ్లాదంగా మారడం ఖాయం. అందుకే మనవాళ్లు ఇలాంటి సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబ సమేతంగా వెళ్లేందుకైనా ఇవి మంచి డెస్టినేషన్స్‌గా ఊరిస్తున్నాయి. మనదేశంలో మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఎంజాయ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కాస్మోపాలిటన్ కల్చర్‌ను అక్కున చేర్చుకునే యువత సంఖ్య ఎక్కువగా ఉండడంతో మ్యూజిక్ ఫెస్ట్ ఇప్పుడు దేశమంతా జరుగుతున్నాయి. మనదేశంలో బెస్ట్ మ్యూజిక్ ఫెస్ట్‌లుగా పేరుగాంచిన  కొన్ని వెన్యూలు మీకోసం..  

జీరో ఫెస్ట్
imageదీన్ని బిగ్గెస్ట్ ఔట్‌డోర్ మ్యూజిక్ ఫెస్టివల్‌గా మనదేశంలో భావిస్తారు. మ్యూజిక్, ఆర్ట్, కల్చర్‌ల సంగమంగా ఇది సాగుతుంది. నిజానికి 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను ‘మ్యూజిక్ వెకే’గా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘జీరో వ్యాలీ’లో దీన్ని ఏటా సెప్టంబర్‌లో నిర్వహిస్తారు.


రోడ్ టు అల్ట్రా
ఇది గ్లోబల్ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ .. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎలెక్ట్రిక్ డైసీ కార్నివాల్ (ఈడీసీ)గా పాప్యులర్ అయిన ఈ పండుగకు సంగీత ప్రియులు పోటెత్తుతారు. ఢిల్లీ సమీపంలోని బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నవంబర్ 12వ తేదీన జరిగే ఈ షోకు బుకింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. 


ఎన్‌హెచ్7 వీకెండర్image
భలే ఇంట్రెస్టింగ్ పేరు అనిపిస్తోందా? బెంగళూరు, కోల్‌కతా, మేఘాలయా, పూనె, నోయిడాల్లో ఏటా జరిగే ఈ సంగీత పండుగలో ఈ ఏడాది అమిత్ త్రివేది, ప్రతీక్, విశాల్ భరద్వాజ్ వంటి ప్రముఖ కళాకారులు అలరించనున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జరిగే ఈవెంట్స్‌కు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.


సన్‌బర్న్ ఫెస్ట్
పార్టీ అండ్ మ్యూజిక్ లవర్స్‌కు స్వర్గధామంగా, కేరాఫ్‌గా మారిన సన్‌బర్న్‌కు మనదేశంలో మంచి ఆదరణ దక్కుతోంది. ఇది గోవా, పూనేల్లోని కొండల్లో నిర్వహిస్తున్నారు. మొదట్లో గోవా బీచ్‌లో మాత్రమే జరుగగా దీనికి విపరీతమైన ఆదరణ లభించడంతో సన్‌బర్న్ హిల్స్ ఫెస్ట్‌గా మార్చారు. ఈ ఏడాది పూనెలో డిసెంబర్ 27 నుంచి 4 రోజులపాటు సాగనుంది. ఇంటర్నేషనల్ బ్యాండ్స్ లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆహుతులను ఉర్రూతలూగించే వేదికగా మనవారికి ఇది చేరువైంది.

మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్
imageమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇండియా ఫెస్టివల్ రాజస్థాన్‌లో డిసెంబర్ 14 నుంచి మూడు రోజులు జరుగనుంది. కంటెంపరరీ మ్యూజిక్, ఆర్ట్స్‌కు పెద్ద పీట వేస్తూ చిందులేసేలా చేస్తారు. 
 

స్టార్మ్ మ్యూజిక్ ఫెస్ట్
పేరులో ఉన్నట్టే ఇది ఓ మ్యూజిక్ స్టార్మ్. మ్యూజిక్ సునామీ అంటే ప్రాణంపెట్టేవారు దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇండీ, ఫోక్, ఎలెక్ట్రానిక్, నాన్-మెయిన్‌స్ట్రీమ్ ఇలా క్లాసిక్ మ్యూజిక్ ప్రియులకు పసందైన వేదికగా ఉన్న స్టార్మ్ ఏడాది చివర్లో బెంగళూరులో జరుగుతుంది.


 కీకీ చాలెంజ్.. వద్దు బాస్!

Updated By ManamFri, 07/27/2018 - 23:10
  • ప్రాణాంతకం అంటున్న పోలీసులు.. వైరల్‌గా మారుతున్న సరికొత్త చాలెంజ్

  • కారులోంచి వీడియో.. బయట డాన్సు.. కెమెరావైపు చూస్తూ రోడ్డుపై ప్రమాదాలు

  • కారులో ఉన్నవాళ్లకు కూడా ప్రమాదమే

ముంబై: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం మొదలవుతుందో చెప్పలేం. ఇప్పుడు సరికొత్తగా కీకీ / ఇన్ మై ఫీలింగ్స్ / షిగ్గీ చాలెంజ్ జనాన్ని వెర్రెక్కిస్తోంది. అది ఎప్పుడు, ఎక్కడ మొదలైందనేది తెలియడం లేదు గానీ, ఇప్పుడు ప్రపంచంలో యువత మొత్తం ఆ చాలెంజ్ చూసి గంగవెర్రులెత్తుతోంది. ఎలాగైనా దాన్ని పూర్తి చేయాలని భావిస్తూ.. ప్రమాదాల బారిన పడుతున్నారు. విదేశాల సంగతి ఏమో గానీ, మన దేశంలో రోడ్డు మీద పరిస్థితులకు ఈ చాలెంజ్ ఏమాత్రం సరిపోయేలా లేదు. 

image


ఏమిటీ చాలెంజ్?
కీకీ చాలెంజ్ అనేది ప్రాథమికంగా ఒక పాటకు డాన్సు చేయడం. అయితే, అది మామూలుగా అయితే కిక్కేముంటుంది? కదులుతున్న కారులోంచి తలుపు తీసుకుని కిందకు దిగుతారు. కారు మ్యూజిక్ ప్లేయర్ లోంచి డ్రేక్ పాడిన ఆల్బం.. ‘కీకీ డూ యూ లవ్ మీ.. ఆర్ యూ ఎవాయిడింగ్’ అనే పాట మోగుతుంటుంది. దానికి కింద ఉన్నవాళ్లు డాన్సు చేస్తూ ముందుకు కదులుతుంటారు. కారు కూడా నెమ్మదిగా కదులుతుంటుంది. కారు నడిపేవాళ్లు తమ ఫోన్లో దాన్ని వీడియో తీస్తారు. సరిగ్గా ఇదే ప్రమాదకరంగా మారుతోంది.

కింద డాన్సు చేసేవాళ్లు రోడ్డుమీద ఏముందో చూసుకునే అవకాశం ఉండదు.. అలాగే కారు నడిపేవాళ్లు కూడాimage ముందు చూసుకోరు. దానివల్ల అందరికీ ప్రమాదమేనని ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రేక్ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే ఆల్బం ఇంకా అధికారికంగా విడుదల కాకుండానే అందులో ఉన్న కీకీ.. డూ యూ లవ్ మీ అనే పాట ఈ చాలెంజ్ రూపంలో వైరల్‌గా మారి ప్రపంచం అంతటినీ ఊపేస్తోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా ముంబై పోలీసులు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. కారు నెమ్మదిగా కదులుతుండగా బయటికి వచ్చి డాన్సు చేస్తున్న యువకుడు ముందున్న కరెంటు స్తంభానికి తల తగిలి కింద పడిపోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇలా చాలామంది రకరకాల ప్రమాదాలకు గురైనట్లు ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో వస్తున్నా, ఈ చాలెంజ్ విషయంలో యువత మాత్రం వెనకడుగు వేయడం లేదు.

 కొంతమంది కారుతో వేరే వాళ్లను ఢీకొట్టగా, ముందు ఆగి ఉన్న పెద్ద వాహనాలను ఢీకొన్న వైనాలు కూడా ఉన్నాయి. కొంతమంది కారు నెమ్మదిగా పోనివ్వలేక ఉన్నట్టుండి వేగం పుంజుకుని ప్రమాదాల బారిన పడ్డారు. అందుకే కీకీ చాలెంజ్ వైపు పోవద్దని ముంబై పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. చల్లని వేసవి

Updated By ManamTue, 03/13/2018 - 02:12

ఉదయం ఏడుగంటలు కూడా కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..అమ్మో మార్చ్ నెల్లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఎలారా దేవుడా అని ఆలోచిస్తున్నారా?  తప్పదు మనం అన్ని సీజన్లనూ ఆస్వాదించడం నేర్చుకునే వరకూ ఇలాంటి ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.  ఏ సీజన్‌లో ఎలా ఉండాలో, ఏం తినాలో, ఏం చేయాలో అవి మాత్రమే చేస్తూ పోయామనుకొండి అప్పుడు ఆయా సీజన్ల కష్టాలు తట్టుకోవడం ఈజీ అవుతుంది. అందుకే మీరు వడగాలుల గురించి దిగులు పడి ప్రయోజనం లేదని గుర్తించి, కాస్త జాగ్రత్తగా ఈ సమ్మర్‌ను గడిపితే సరిపోతుంది. ఇందుకు ఏం చేయాలి అంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కాసింత అవగాహనతో మెలిగితే  ఈ ఎండా కాలం కూల్‌గా గడిచిపోతుంది. 

image

దినచర్యను త్వరగా మొదలుపెట్టడం
సమ్మర్‌లో త్వరగా నిద్రలేవడం చాలా ముఖ్యమైన అంశంగా ప్రాధాన్యతనిచ్చేలా చూసుకొండి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి, చకచకా మీ పనులన్నీ చేసేసుకుంటే పొద్దు పెరిగే సమయానికల్లా నీడపట్టున హాయిగా విశ్రాంతి తీసుకోవడం, ఎండ తగ్గాక మళ్లీ imageరొటీన్ పనులు పూర్తయ్యేలా చూసుకుంటే మీరు ఎక్కువగా అలసిపోకుండా, ఎండ వడనుంచి కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా పొద్దెక్కాక లేచి.. అప్పుడు వేడి గాలులు తట్టుకోలేక నానా తిప్పలు పడి ఉసూరుమనకుండా ఉండేలా ప్లాన్ చేసుకొండి. ఇందుకు రాత్రిళ్లు కూడా త్వరగా ఇంటికి చేరుకుని ఎర్లీగా డిన్నర్ చేసి, విశ్రమిస్తే మీ శరీరం వేసవి అలసటనుంచి త్వరగా బయటపడి, సేద తీరుతుంది.


 

 

ఎండలో వెళ్తున్నారా?
ఆఫీస్,కాలేజ్ లే దా ఇతరత్రా పనులపై బయటికి వెళ్లేవారు మంచి కాళ్ల జోడు, కళ్ల జోడు ధరించడం అత్యవసరం, దీనికి తోడుimage గొడుగును తీసుకెళ్లడం ఈ రెండున్నర నెలలు మరవద్దు, ఉన్నట్టుండి క్యూములో నింబస్ మేఘాలు వర్షించడంతో తడిసిపోతే కూడా జ్వరం రావచ్చు, మధ్యహ్నం ఎండ తీవ్రతనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే సన్‌స్క్రీన్ వంటివాటికంటే మెరుగైన సాధనం గొడుగే. టూవీలర్‌లో వెళ్లేవారు హెల్మెట్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. దీంతో ట్యానింగ్‌కు కూడా తక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక మీ చర్మంలో తేమ సురక్షితంగా ఉంటుంది. వీలైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఆశ్రయిస్తే హాయిగా గమ్యస్థానం చేరుకోవచ్చు. టూ వీలర్ కంటే బస్సు లేదా రైలు ప్రయాణం చేయడం ఉత్తమం. చర్మంపై ప్రత్యక్షంగా ఎండ పడి (అల్ట్రా వైలెట్ రేస్) అతినీలలోహిత కిరణాలతో సన్ బర్న్ వంటివి రాకూడదంటే సన్ స్క్రీన్ రాసేసుకుంటే సరిపోదు.. చేతులు, మెడ, ముఖం,తలపై ఎండ పడకుండా కేర్ తీసుకోవాలి. వైద్యులు చెప్పే ఈ సూచనలు తూ.చ. తప్పకుండా పాటించారో సమ్మర్ ఇట్టే హాయిగా గడిచిపోతుంది. 

సీజనల్ పళ్లు, కూరగాయలు
imageఎండకాలం వచ్చే పుచ్చకాయలు మొదలు ఖర్బూజా, మామిడి , వంకాయ, మునక్కాయ, కొబ్బరి కాయలు, చింత చిగురు, తాటి ముంజలు వంటి సీజనల్ పళ్లు, కూరగాయలన్నీ తప్పకుండా సేవించండి. దీంతో మీకు ఇమ్యూనిటీ పెరిగి, సమ్మర్‌ను కూల్‌గా డీల్ చేసే తత్వం మీ శరీరానికి అలవడేలా చేస్తుంది. ఇక నిల్వ ఉన్న ఆహారం తినకుండా అప్పటికప్పుడు వండుకుని తినడంతో ఎండా కాలంలో వంటలు త్వరగా చెడిపోతాయన్న బెడద ఉండదు. భోజనంలో పెరుగు లేదా మజ్జిగతోపాటు మజ్జిగ పులుసు, పచ్చి పులుసు వంటివి ఉండేలా మెనూ రెడీ చేసుకోండి. ఆమ్ రస్ లేదా మామిడి పళ్లు కూడా ఎండకాలంలో తినడంతో నీరసాన్ని అధిగమించే ఛాన్స్ ఉంటుంది. 

చిన్నారులు జాగ్రత్త
చెమటను తట్టుకోలేక చిన్నారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే చిన్నారులతోపాటు ఇంటిల్లిపాది అందరూimage వదులుగా ఉన్న వస్త్రాలే ధరించండి, స్కిన్ టైట్‌తో స్కిన్ అలర్జీలు తప్పవు, పైపెచ్చు ముతక వస్త్రాలైన కాటన్ వంటివి వేసుకోవడంతో మీరు బయటికి వెళ్లినా చర్మం కమిలిపోకుండా, అతిగా శరీర దుర్గంధం రాకుండా ఉంటుంది. మీ పిల్లలకు స్విమ్మింగ్ వంటివి నేర్పేందుకు సమ్మర్‌లో టైం కేటాయించండి, దీంతో వారు బాగా సమ్మర్‌ను ఎంజాయ్ చేయడమేకాదు, శారీరకంగా కూడా ఎదిగే అవకాశాన్ని స్విమ్మింగ్ కల్పిస్తుంది. చిన్నారులను రెండు లేదా మూడు పూటలా స్నానం చేయించండి, వీరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కనుక దద్దర్లు వంటివి రాకుండా ఉండేలా ఇది తోడ్పడుతుంది. చెమటకాయలు వంటివి పారద్రోలాలంటే కూడా స్నానం మంచి ఆయుధంలా పనిచేస్తుంది. పళ్ల రసాలు, నీరు గంటకోమారు తాగిస్తూ పిల్లల్లో డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలకు ఖర్జూరం, బాదం, పిస్తా, చెర్రీస్, జీడిపప్పు, కిస్‌మిస్ వంటి డ్రైఫ్రూట్స్, నట్స్‌ను కూడా ఎక్కువగా ఇవ్వండి, ఇది శారీరక బలాన్ని పెంచుతుంది. అన్ని వయసుల వారు రొటీన్‌లో భాగంగా వేసవిలో వీటిని తినడంతో నీరసం దరిచేరకుండా ఉంటుంది. 

ఈ-కొలీతో పారాహుషార్
సమ్మర్ రాగానే ఈ-కొలి imageబ్యాక్టీరియా వీరవిహారం చేసే సీజన్ కనుక బయట ఆహార పదార్థాలు తినాల్సివస్తే వేడిగా మాత్రమే తినండి. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లపై అమ్మే పానీ పూరీ, చాట్, సోడాలు, తినుబండారాల్లో ఇది విపరీతంగా పెరుగుతుంది కనుక ఇలాంటి చోట్ల తినే సమయంలో ముందూ వెనుకా చూసి తినడం అతిముఖ్యమైన అంశం. వీలైతే ఈ వేసవిలో బయటి ఆహారానికి గుడ్‌బై చెప్పండి. ముఖ్యంగా హోటళ్లలో తినే నాన్‌వెజ్‌తో మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి, అందుకే వేసవిలో బయట నాన్‌వెజ్ తినేముందు హైజీనిటీపై ఓ కన్నేయండి. తినే ఆహారం కూడా మిగతా రోజుల్లోలా ఎక్కువగా లాగించేయకుండా మితంగానే తినండి. ఎక్కువ నీరు తాగుతూ, తక్కువ ఘన పదార్థాలు తినడంతోపాటు ఈజీగా జీర్ణమయ్యే పదార్థాలను ఎంచుకోండి. మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉన్నవాటికి ఈ రెండున్నర నెలలు కాస్త దూరంగా ఉండేలా నోటి చపలత్వానికి తాళం వేయండి. తాజా పళ్లు, కూరగాయలతోపాటు డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తింటూ, కీరా దోసకాయ వంటి నీరు అధికంగా ఉన్న కూరగాయలకే ప్రాధాన్యతనిస్తే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. 

నీరు, నీరు, నీరు
బయటినుంచి రాగానే చల్లటి నీటితో ముఖం కడగండి, లేదా స్నానం imageచేయండి. మిగతా రోజుల్లో కంటే రెండు లీటర్ల నీరు సమ్మర్‌లో రోజూ ఎక్కువ తాగండి. కుండలో నీళ్లు తాగితే దాహం తీరుతుంది, అదే ఫ్రిజ్ నీరు అయితే ఎంత తాగినా దాహం తీరకపోగా, గొంతు నొప్పికి దారితీసే ప్రమాదముంది. ఇక వేసవి పోయేవరకూ రెండు పూటలా స్నానం చేస్తే అదే మీ చర్మానికి శ్రీరామరక్షలా పనిచేస్తుంది. ఇక ఇంటినుంచి కాలు బయట పెట్టారో నీళ్ల బాటిల్ లేకుండా మాత్రం కదలకండి.  మిట్టమధ్యహ్నం బయటినుంచి ఇంట్లోకి రాగానే కాసిన్ని నీళ్లు అందులోకి ఉప్పు, చక్కెర చిటికెడు కలిపి తాగితే మీకు కళ్లు తిరగకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లు, నీళ్ల మజ్జిగ వంటివి ఇంట్లో నిలువ ఉండేలా చూసుకొండి. ఇక నిమ్మకాయ రసంలోకి కాసింత చక్కెర, ఉప్పు వేసుకుని సేవిస్తే అది దివ్యౌషధంలా ఈ వేసవిలో మీకు సహకరిస్తుంది. చెమట ఎక్కువగా వచ్చే శరీర తత్వం ఉన్నవారు రోజూ ఇలాంటి పానీయాలు సేవిస్తే అలసటనుంచి ఈజీగా బయటపడవచ్చు. 
- శ్రావణ్ కుమార్, హైదరాబాద్

Related News