hollywood

‘హనీ బాయ్’లో లుకాస్ హెడ్జెస్‌

Updated By ManamTue, 03/20/2018 - 17:19

lucas hedgesఈ ఏడాది ఆస్కార్‌లో సంద‌డి చేసిన ‘లేడీ బర్డ్’, ‘త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్ మిస్సోరి’ చిత్రాల్లో ఓ కామ‌న్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. ఆ రెండు చిత్రాల్లోనూ లుకాస్ హెడ్జెస్ కీల‌క పాత్ర‌లు పోషించాడు. అంత‌కుముందు ఏడాది లుకాస్ నటించిన ‘మాంచెస్టర్ బై ది సీ’ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయింది కూడా. ఇదిలా ఉంటే.. షియా లాబౌఫ్ బయోపిక్‌ను ‘హనీ బాయ్’ పేరుతో డైరెక్టర్ అల్మా హరెల్ తెరకెక్కిస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమే ‘హనీ బాయ్’. ఆల్కహాల్‌కు బానిసైన‌ ఓ తండ్రి.. కుటుంబాన్ని పోషించడం కోసం బాలనటుడుగా మారిన ఓ కొడుకు.. వారి మధ్య ఏర్పడిన వివాదాస్పద సంబంధాన్ని చక్కదిద్దుకోవడానికి వారు చేసిన ప్రయత్నం.. షియా లాబౌఫ్ (కొడుకు పాత్ర పేరు) జీవితంలో ఎదిగిన వైనాన్ని తెరపైన చూపించనున్నారు. ఈ చిత్రానికి షియా లాబౌఫ్.. ఓటిస్ లోర్ట్ పేరుతో కథను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో షియా లాబౌఫ్ నటిస్తుండడం విశేషం. ఇక షియా లాబౌఫ్ పాత్రలో లుకాస్ హెడ్జెస్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఆటోమేటిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి బ్రియాన్ కవనఫ్, జోన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మడోన్నా మూడో సినిమా ‘టేకింగ్ ఫ్లైట్’

Updated By ManamFri, 03/16/2018 - 14:19

madonnaసంగీతానికి ఎల్లలులేవని చాటి చెప్పిన అమెరికా గాయని మడోన్నా. పాడటంతో పాటు పాటల రచయిత్రిగా, మంచి డాన్సరుగా, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పాశ్చాత్య గాయని. “క్వీన్ ఆఫ్ పాప్”గా పేరు తెచ్చుకున్న మ‌డోన్నా.. ‘ఫిల్త్ అండ్ విజ్‌డ‌మ్’(2008)తో తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నారు. తదుపరి సినిమాగా ‘W.E.’(2011)ను తెరకెక్కించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘టేకింగ్ ఫ్లైట్’ అనే మూవీని రూపొందిస్తున్నారు. మైఖేలా రచించిన “టేకింగ్ ఫ్లైట్: ఫ్రమ్ వార్ ఆర్ఫన్ టు స్టార్ బాల‌రీనా ” పుస్తకం ఆధారంగా తెరకెక్కబోతోంది ఈ చిత్రం. ఈ సినిమా గురించి మడోన్నా మాట్లాడుతూ.. “పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్‌కు చెందిన మైఖేలా జీవితాన్ని తెరకెక్కించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఒక యుద్ధంలో అనాథగా మిగిలి.. సర్వం కోల్పోయి జీవితంలో ఎన్నో కష్టాలకు ఓర్చి ఒక స్టార్ బ్యాలే డాన్సరుగా, కార్యకర్తగా ఆమె ఎదిగిన వైనం నన్ను కదిలించింది. అనాథ‌ పిల్లలకు బాసటగా నిలిచిన ఈమె కథను తెరపై ఆవిష్కరించడం నాకు ఎంతో గర్వంగా ఉంద”ని తెలిపారు.జూలై 6న విట్నీ హౌస్టన్ డాక్యుమెంట‌రీ

Updated By ManamSun, 03/11/2018 - 16:15

whitney houstonఅమెరికాకు చెందిన ప్రఖ్యాత గాయని, నటి, నిర్మాత‌, మోడల్ విట్నీ హౌస్టన్ జీవిత కథ ఆధారంగా ‘విట్నీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందుతోంది. దీనికి ‘ఒయాసిస్’ (2017 టీవీ సిరీస్)తో పాటు ‘మార్లే’, ‘టచింగ్ ది వోయిడ్’ వంటి డాక్యుమెంటరీల రూపకర్త కెవిన్ మెక్ డొనాల్డ్ దర్శకత్వం వహించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ డాక్యుమెంటరీని జూలై 6న విడుదల చేయడానికి రోడ్ సైడ్ అట్రాక్ష‌న్స్, మిరామాక్స్ సంస్థలు సంయుక్తంగా హక్కులు పొందాయి. అలాగే.. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు కెనడా, లాటిన్ అమెరికా, చైనా, కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, బెనిలక్స్‌ల‌లో కూడా విడుదల చేయడానికి మిరామాక్స్ హక్కులను సొంతం చేసుకుంది. గతంలో రోడ్ సైడ్ అట్రాక్ష‌న్స్, మిరామాక్స్ సంస్థలు ‘మిస్టర్ హోమ్స్’(2015), ‘సౌత్ సైడ్ విత్ యు’(2016) సంయుక్తంగా నిర్మించగా.. ఇప్పుడు హ్యాట్రిక్ ఫిలింగా ‘విట్నీ’ని నిర్మిస్తున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మెక్ డొనాల్డ్ మాట్లాడుతూ “ఎంతో ప్రతిభ, అందం ఉండి.. విట్నీ హౌస్టన్ చాలా బాధాకరమైన జీవితాన్ని గడిపారు. పాట్ హౌస్టన్‌తో పాటు విట్నీ హౌస్టన్ సంస్థానం నా తపన చూసి నాకు చేసిన సహాయానికి నేనెంతో రుణ పడి ఉంటాను. నాకు ఈ డాక్యుమెంటరీ తీయడానికి పూర్తి స్వేచ్చనిచ్చారు. విట్నీ.. ఒక కుటుంబానికి సంబంధించిన కథ. ఒక మహిళకు సంబంధించి మరో కోణాన్ని.. ఆమె అభిమానులకు కూడా తెలియని ఎన్నో సంఘటనలను ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నాం” అని తెలిపారు. ఈ డాక్యుమెంట‌రీలో.. ఆమెకు సంబంధించిన ఒరిజినల్ స్టూడియో రికార్డింగ్స్‌తో పాటు ఇంతవరకు విడుదల కాని రికార్డింగ్‌ల‌ను.. అలాగే ఆమె జీవితానికి సంబంధించిన అరుదైన లైవ్ ఫుటేజ్లను కూడా దర్శకుడు చూపించబోతున్నారు. ఇంతవరకు బహిర్గతం కాని ఆమె వ్యక్తిగత, సినీరంగానికి సంబంధించిన ఫుటేజ్లతో పాటు తెరవెనుక అరుదైన సీన్స్‌ను కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకులతో పంచుకోనున్నారు.బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో 'బ్లాక్ పాంథ‌ర్' 

Updated By ManamSat, 03/10/2018 - 23:04

black pantherమార్వెల్ కామిక్స్‌లోని క్యారెక్ట‌ర్ ఆధారంగా రూపొందిన సూప‌ర్ హీరో ఫిల్మ్‌ 'బ్లాక్ పాంథ‌ర్‌'. రియాన్ కూగ్ల‌ర్ తెర‌కెక్కించిన ఈ హాలీవుడ్ మూవీలో చ‌ద్విక్ బోస్‌మేన్‌, మైఖేల్ బి.జోర్డాన్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌లైన ఈ చిత్రం.. గ్లోబ‌ల్ బాక్సాఫీస్‌లో 1 బిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌కు చేరుకుంది. బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరిన 33వ చిత్ర‌మిది. అలాగే సూప‌ర్ హీరో సినిమాల ప‌రంగా 7వ చిత్ర‌మిది. విడుద‌లైన 26 రోజుల‌కి ఈ జాబితాలో స్థానం ద‌క్కించుకుంది ఈ మూవీ.  డేటింగ్‌లో ‘హ్యారి పోటర్’ ఫేమ్ ఎమ్మా  

Updated By ManamSat, 03/10/2018 - 17:20

emma watson‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ ఫేమ్‌ ఎమ్మా వాట్సన్ (‘హ్యారి పోటర్’లో హెర్‌మియోన్‌ గ్రేంజ‌ర్‌గా న‌టించిన బాల‌న‌టి).. ‘గ్లీ’ సినిమా నటుడు, గాయకుడు కోర్డ్ ఓవర్ స్ట్రీట్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు హాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా పలు సందర్భాల్లో ఈ జంట చూపరుల కంట పడుతోంది. ఈ జంట మొదటిసారిగా ఫిబ్రవరిలో ట్రూబాడూర్‌లో జరిగిన ఓ సంగీత విభావరిలో కనిపించినట్టు ఓ ప్ర‌ముఖ హాలీవుడ్‌ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేగాకుండా.. తాజాగా జరిగిన వానిటీ ఫెయిర్ ఆస్కార్స్ పార్టీలో కూడా వీరు సందడి చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల అనంతరం జరిగిన పార్టీలో వీరు మామూలుగానే కలుసుకుని ఉండొచ్చు అని సమాచారం.

emma watson, chord overstreet''వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. అయితే, ఈ విష‌యంలో ఎమ్మా మౌనాన్ని పాటిస్తోంది. త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని ప్రైవేట్‌గా ఉంచాల‌నుకుంటోంది" అంటూ కొంతమంది స‌న్నిహితులు చెబుతుండగా.. "వాళ్ళ మధ్య ఉన్నది స్నేహమే తప్ప మరే సంబంధమూ లేద"ని మరి కొంతమంది స‌న్నిహితులు వాదిస్తున్నారు. 35 ఏళ్ళ నాటి య‌థార్థ గాథ‌తో ‘అడ్రిఫ్ట్’

Updated By ManamFri, 03/09/2018 - 21:50

Shailene Woodley2007లో విడుద‌లైన 'మూల' చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. 2011లో వచ్చిన ‘ది డిసెండెంట్స్’ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది యువ క‌థానాయిక‌ షైలీన్ వుడ్లీ. ఇక 2014లో వచ్చిన ‘డైవ‌ర్జెంట్’ ఈమె కెరీర్‌ను మలుపు తిప్ప‌గా.. ఇదే సంవత్సరంలో వచ్చిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ మూవీకిగానూ పలు అవార్డులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అదే విధంగా ‘డైవ‌ర్జెంట్’ సినిమాకి సీక్వెల్స్‌గా వ‌చ్చిన‌ ‘ది డైవ‌ర్జెంట్ సిరీస్: ఇన్ స‌ర్జెంట్’ (2015), ‘ది డైవ‌ర్జెంట్ సిరీస్: అలీజియెంట్’(2016) చిత్రాలతో నటిగా మరో మెట్టుకు ఎదిగింది. ప్రస్తుతం బల్తాసర్ కొర్మాకుర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అడ్రిఫ్ట్’ సినిమాలో సామ్ క్ల‌ఫ్లిన్‌తో కలిసి నటిస్తోంది షైలీన్.

1983లో జరిగిన యథార్థ‌ ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. త‌మి ఓల్డ‌మ్(షైలీన్ వుడ్లీ), రిచ‌ర్డ్ షార్ప్(సామ్ క్ల‌ఫ్లిన్) అనే ఇద్దరు నావికులు.. ఒక మహాసాగరాన్ని చుట్టి రావడానికి పయనమవుతారు. అంతా స‌వ్యంగా ఉంద‌నుకున్న స‌మ‌యంలో.. అనూహ్యంగా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ ప్రమాదంలో వారు ప్ర‌యాణిస్తున్న‌ నావతో పాటు.. తమి ఎంతగానో ప్రేమించిన రిచ‌ర్డ్ కూడా గాయాల పాలవుతాడు. మరి తమి అతనిని కాపాడుకోగలిగిందా? లేదా? ఆ తర్వాత ఏమైందన్నది తెరపైనే చూడాలి. త‌మి ఓల్డ‌మ్ పాత్ర‌లో షైలీన్ న‌టన సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం పేర్కొంటోంది. 

ఆర్.వి.కె.స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.లియోనార్డో డికాప్రియోతో బ్రాడ్ పిట్‌

Updated By ManamSat, 03/03/2018 - 18:19

leonardo dicaprioయదార్ధ ఘటనల ఆధారంగా హాలీవుడ్ డైరెక్టర్ క్వెన్టిన్ ట‌రెంటినో తెరకెక్కిస్తున్న మూవీ ‘వ‌న్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’. 1969లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన వరుస హత్యల నేపథ్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు. ఆస్కార్ అవార్డ్ గ్ర‌హీత లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా నటించనున్నాడు.

హాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయ పడే మాజీ టీవీ నటుడి పాత్రలో డికాప్రియో కనిపించనుండగా.. డికాప్రియో లాగే ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాట పడే మరో వ్యక్తి పాత్రలో బ్రాడ్ పిట్ నటిస్తున్నారు. ముందుగా బ్రాడ్ పిట్ పాత్ర కోసం టామ్ క్రూజ్‌ పేరుని పరిశీలించారు. కాని ఆఖరి నిమిషంలో బ్రాడ్ పిట్‌ను తీసుకోవడం జరిగింది. ఈ జూన్ నుంచి చిత్రీకరణ జరుపుకోబోయే షెడ్యూల్‌లో బ్రాడ్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. ఈ మూవీ తర్వాత డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో ‘వరల్డ్ వార్ జెడ్’ సీక్వెల్ లో నటించనున్నాడు.

లాస్ ఏంజెల్స్‌లో వరుస హత్యలు జరిగి 50 సంవత్సరాలు పూర్తవబోతున్న సందర్భంగా వచ్చే ఏడాది ఆగష్టు 9న‌ ఈ మూవీను విడుదల చేయనున్నారు.ఫైట్ చేసేంత ఆరోగ్యంగా ఉన్నాను - సిల్వెస్టర్ స్టాలోన్

Updated By ManamTue, 02/20/2018 - 17:46

sylvester stalloneహాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ భారతీయ సినీ ప్రేమికులకు కూడా సుపరిచితులే. ‘రాకీ’ సిరీస్, ‘ఫస్ట్ బ్లడ్’ సిరీస్‌ల‌తో భారతీయ ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ యాక్షన్ హీరో. ఇదిలా ఉంటే... ఈ హీరో చనిపోయాడంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వదంతులు పుట్టుకొచ్చాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసారు ఈ 71 ఏళ్ళ నటుడు. “ఇలాంటి చెత్త వార్తలను నమ్మకండి. నేను బతికే ఉన్నాను, ఫైట్ చేసేంత ఆరోగ్యంగా ఉన్నాను” అని ట్వీట్ చేశారు.

sylvester stalloneప్రస్తుతం స్టాలోన్ అమెరికన్ క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘క్రీడ్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 21న‌ విడుదల కానుంది. ఈ సినిమాలో భాగంగానే స్టాలోన్ జుత్తు లేకుండా గుండుతో నటించాల్సి వచ్చింది. ఈ గెట‌ప్‌కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకి రావడంతో... స్టాలోన్‌కు క్యాన్సర్ వచ్చిందని అందుకే జుత్తు ఊడిపోయిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తూ సోమవారం ఆయన మరణించినట్టు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు కూడా వచ్చాయి. స్టాలోన్‌కు ఈ అనుభవం తొలిసారి కాదు, 2016లో ఓ బ్రిటిష్ మీడియా వెబ్ సైట్.. స్టాలోన్ చనిపోయినట్టు రాసేసింది. తరువాత తాను బతికే ఉన్నానని చెప్పుకోవడానికి స్నేహితుడి సాయం తీసుకోవాల్సి వచ్చింది స్టాలోన్‌కు.    మే నుంచి ‘బాంగ్ బాంగ్’

Updated By ManamSun, 02/18/2018 - 20:29

bang bangహాలీవుడ్ నటులు జేమ్స్ కాన్, డానీ గ్లోవర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఆంగ్ల‌ చిత్రం ‘బాంగ్ బాంగ్’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి బ్రెండన్ వాల్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రత్యర్ధి చేతిలో ఓడిపోయిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్.. గెలవలేకపోయానన్న బాధతో ఇంటికి తిరిగి వచ్చి మరల గెలిచే  అవకాశం కోసం ఎదురుచూడడమే చిత్ర కథ. మరి అతని ఎదురుచూపులు ఫలించాయా? చివరి అవకాశం పొందాడా? అన్నది వెండితెరపైనే చూడాలి. విల్ జానోవిత్జ్ క‌థ‌ని అందిస్తున్న ఈ చిత్రాన్ని బ్రాడ్లీ రోస్, మేరీ జేన్ కల్స్కి, డామాన్ లేన్ నిర్మిస్తున్నారు. కాగా, మే నెల‌ నుంచి ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభం కానుందని హాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. స్కాట్ ఈస్ట్‌వుడ్.. ‘మనుస్క్రిప్ట్’  

Updated By ManamSat, 02/17/2018 - 19:16

scott eastwoodహాలీవుడ్ నటుడు స్కాట్ ఈస్ట్‌వుడ్ క‌థానాయ‌కుడిగా నిక్ కాసవేట్స్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మనుస్క్రిప్ట్’. లూయిస్ రోసేన్ బెర్గ్, జో రోసేన్ బామ్ అందించిన ఈ థ్రిల్లర్ కథలో సీనియర్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. కాగా, ఈ చిత్రానికి ముందుగా జాన్ మూర్‌ను డైరెక్టర్‌గా  ప్రకటించారు. అయితే,  అతని స్థానంలో ఇప్పుడు నిక్ కాసవేట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 100 మిలియన్ డాలర్ల‌ విలువ చేసే వజ్రాలను దొంగిలించిన ఒక కేసులో ఖైదు చేయబడిన ఓ మేధావి రచయిత (ఫ్రీమన్).. త‌ను ర‌చించిన ఓ ర‌హ‌స్య‌ నవలకు సంబంధించిన కొన్ని అధ్యాయాలను వర్ధమాన రచయిత (ఈస్ట్‌వుడ్)కు పంపుతాడు. ఇంత‌కీ అవి వేటికి సంబంధించిన‌వి?  చివ‌ర‌కు ఆయ‌న జీవితం ఏ మ‌లుపు తిరిగింది? అనేదే ఈ సినిమా క‌థ అని హాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ ఆఖరి వారం నుంచి న్యూ ఒర్లీన్స్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంది. 
Related News