Twitter account hack

షాహిద్ కపూర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

Updated By ManamThu, 09/06/2018 - 18:01
  • ‘పద్మావత్’ చిత్రంపై అసభ్యకర సందేశాన్ని జతచేసి పోస్టింగ్ 

  • షాహిద్ కపూర్ ట్విట్టర్‌లో టర్కీష్ భాషలో రీట్వీట్స్.. 

Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavatముంబై: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూ‌ర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. షాహిద్ భార్య మీరా రాజ్‌పూట్ గత రాత్రి రెండోబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా షాహిద్ ఇంట్లో వేడుకుల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో షాహిద్ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌‌కు గురైనట్టు గుర్తించారు. ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్.. ప్రత్యేకించి టర్కీష్ భాషలో వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ చిత్రంపై అసభ్యకరమైన సందేశాన్ని పోస్టు చేశాడు. ఈ ఏడాదిలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన పద్మావత్ చిత్రం ఎన్నో వివాదాలను దాటుకొని విజయవంతంగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో షాహిద్.. చిత్తూర్ మహార్వాల్ రతన్ సింగ్‌ పాత్రను పోషించగా.. రన్‌వీర్ సింగ్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో.. దీపకా పదుకొనె పద్మావతిగా నటించారు. ఈ చిత్రానికి ఎన్నో అవంతరాలు చుట్టుముట్టిన సంగతి విదితమే. ఈ వివాదాస్ప చిత్రంపై టర్కీష్ భాషలో హ్యాకర్ షాహిద్ ట్విట్టర్ అకౌంట్‌లో అసభ్యకర సందేశాన్ని పోస్టు చేసి.. ఆ పోస్టును ఇతర విదేశీ అకౌంట్లకు పలుసార్లు రీట్వీట్ చేశాడు. ‘ఐ లవ్ కత్రినా’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్తా థా టైగర్’ చిత్రం నుంచి ‘మషాల్హ్’ అనే పాటను కూడా షేర్ చేశాడు. కాగా, షాహిద్ కపూర్ నటించిన కొత్త చిత్రం ‘భట్టి గుల్ మీటర్ ఛాలు’ ఈ నెల 21న విడుదల కానుంది. Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavat



హ్యాక్‌ అయిన ఎయిర్ ఇండియా అధికారిక ట్విట్టర్

Updated By ManamThu, 03/15/2018 - 12:55

Air India’s official Twitter account, Twitter account hack, Turkish Cypriot Army న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థ (ఎయిర్ ఇండియా) అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ మేరకు ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. టర్కిష్‌ హ్యాకర్లకు చెందిన గ్రూపు పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఎయిర్ ఇండియా అధికారి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా అధికారిక ట్విట్టర్‌లో టర్కిష్ హ్యాకర్లు పలు ట్వీట్లు చేసి కొన్ని గంటల పాటు హ్యాకింగ్ చేసినట్టు చెప్పారు. ట్విట్టర్ ఖాతా ఒక్కసారిగా హ్యాక్‌కు గురికావడంతో @ఎయిర్‌ఇండియా కాస్త @ఎయిర్ఇండియాటీఆర్‌గా మారినట్టు గుర్తించామని తెలిపారు. హ్యాకర్లు పోస్టు చేసిన ఓ పోస్ట్‌లో ‘చివరి నిమిషపు ముఖ్యమైన ప్రకటన.. మా విమానాలు అన్ని రద్దయ్యాయి. ఇకపై మేము టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణాలు కొనసాగిస్తాం’ అని ట్వీట్ పెట్టారు.
Air India’s official Twitter account, Twitter account hack, Turkish Cypriot Army ఈ పోస్ట్‌తో పాటు ఎయిర్ ఇండియా ట్విట్టర్ కవర్ ఫొటోను కూడా మార్చి దాని స్థానంలో టర్కిష్ ఎయిర్‌లైన్ విమానం ఫొటోను పెట్టారు. హ్యాకర్ల దాడితో ఎయిర్ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతాలోని వెరిఫికేషన్ మార్క్‌ కాసేపు కనిపించకుండా పోయింది. ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించిన ఎయిర్ ఇండియా.. టర్కిష్ భాషలో రాసిన ట్వీట్లను తొలగించి.. @airndian గా  పునరుద్ధరించడంతో వెరిఫికేషన్ మార్క్ తిరిగి కనిపించింది. అయితే ట్విట్టర్ హ్యాకింగ్ దాడిపై ఇంతవరకూ ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతనెలలో టర్కిష్ గ్రూపుకు చెందిన హ్యాకర్ల చేతిలో ప్రముఖ నేతలైన పుదుచ్చేరి ఎల్‌జీ కిరణ్ బేడీ, రాజ్యసభ ఎంపీ స్వాపన్ దాస్ గుప్తా, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్‌ల ట్విట్టర్ ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురైన సంగతి విదితమే.
Air India’s official Twitter account, Twitter account hack, Turkish Cypriot Army





Related News