Hindi

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మృతి

Updated By ManamMon, 09/17/2018 - 10:02

Captain Rajuప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత తదుపరి ట్రీట్‌మెంట్ కోసం కొచ్చికి తీసుకురాగా.. చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు రాజు. 

కాగా 1950 జూన్ 27న కేరళలో జన్మించిన కెప్టెన్ రాజు 21సంవత్సరాలోనే ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా జాయిన్ అయ్యారు. అక్కడ ఐదు సంవత్సరాలు దేశానికి సేవలు చేసిన రాజు.. సినిమాల మీద ఇష్టంతో ఆర్మీ నుంచి వచ్చారు. ఆ తరువాత నటుడిగా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాలలో నటించారు. దర్శకుడిగా రెండు చిత్రాలను రాజు తెరకెక్కించారు. మరోవైపు ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడీ అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘గాంఢీవం’, ‘మొండి మొగుడు- పెంకి పెళ్లాం’ వంటి తెలుగు చిత్రాల్లో రాజు నటించిన విషయం తెలిసిందే.హిందీలో దుమ్మురేపుతున్న బన్నీ మూవీ

Updated By ManamWed, 09/12/2018 - 10:23

Na Peru Surya Na Illu Indiaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత మేర వారిని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో దుమ్మురేపుతుంది.

బన్నీకి నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్‌లో రికార్డు సృష్టించాయి. ఈ నేపథ్యంలో బన్నీ నా పేరు సూర్య చిత్రాన్ని డబ్బింగ్ చేసి గత వారం థియేటర్లలో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ విషయాన్ని అక్షయ్ రతీ అనే క్రిటిక్ తెలిపాడు. కాగా 1983 వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోపిక్‌లో ఓ పాత్ర కోసం బన్నీని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

 హిందీలో రీమేక్ కానున్న 'విక్రమ్‌ వేదా'

Updated By ManamThu, 03/15/2018 - 14:03

Raj Kumar, Nawazuddin మాధవన్, విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో తమిళంలో తెరకెక్కిన 'విక్రమ్ వేదా' కోలీవుడ్‌లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని పలు భాషాల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు కూడా జరిగాయి. అందులో భాగంగా మొదటగా హిందీలో ఈ చిత్రం రీమేక్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

రాజ్ కుమార్ రావు విక్రమ్ పాత్రలో కనిపించనుండగా, నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ వేదా పాత్రలో కనిపించనున్నాడు. మాతృకలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్, గాయత్రినే హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఇక రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లాన్ సీ స్టూడియో, వై నాట్ స్టూడియోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. మరి తమిళ్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి.

Related News