makutam

మనింటి వెండితెర!    

Updated By ManamSun, 11/18/2018 - 07:35

2మనదేశంలో సమాచార మంత్రిత్వ శాఖ వద్ద లైసెన్స్ పొందిన చానళ్ల సంఖ్య అక్షరాలా 832. ఇక లైసెన్సు లేని చానళ్లు, ఉపగ్రహ చానళ్లు కాని లోకల్ టీవీలు లెక్కలేనన్ని మనదేశంలో ప్రసారాలు అందిస్తున్నాయి. వీటిలో మళ్లీ న్యూస్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, భక్తి, ఇన్ఫోటైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్, డ్యాన్స్, వంటలు, కామెడీ, సినిమా, బిజినెస్, రియల్ ఎస్టేట్, క్రైమ్, హెల్త్, ట్రావెల్, టెలీ షాపింగ్, కిడ్స్, కార్టూన్, జువెలరీ, హిస్టరీ, ఎర్త్, ఏనిమల్, అడ్వెంచర్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని రంగాలకు సంబంధించిన ప్రత్యేక చానళ్లు.. వివిధ ప్రపంచ భాషల్లో మనల్ని అలరిస్తున్నాయి. అది కూడా విరామం లేకుండా 24 గంటలూ ఇవి నిరంతరం ప్రసారమవుతూనే స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంగతులను మనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అధికారిక చానళ్ల సంఖ్య 27,831కి పైమాటే. ఈ చానళ్లు నాలుగు రకాలుగా ప్రసారాలు సాగిస్తున్నాయి. కేబుల్, ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్, డైరెక్ట్ టు హోమ్, మల్టీ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ఆపరేటర్స్ ద్వారా ఇవి మన ఇళ్లలో ప్రసార సేవలందిస్తున్నాయి. 

నిత్య జీవితంలో టీవీ ఒక భాగం. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి ఎవరి వయసులకు తగ్గట్టుగా సుప్రభాతం, యోగా, పాటలు, సినిమాలు, వార్తలు, క్రీడలు, సీరియళ్లు.. ఒకటి తరువాత ఒకటి టీవీ ప్రోగ్రాములు ప్రతి గడపలో మారుమోగుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే శరీరంలో ఓ అవయవంగా టీవీ మారిపోయింది. ఇదివరకు రిలాక్స్ అంటే కాసేపు పడుకోవడం. ఇప్పుడు దానర్థం మారిపోయింది. టీవీ చూడ్డమే నేటి రిలాక్స్. ఇంట్లో రిలాక్స్‌గా కూర్చున్న కాసేపు చేతిలో రిమోట్ లేకపోతే మనకేమీ తోచదు. 
 
స్ట్రీమింగ్
3ఇక ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీటీహెచ్‌లతో పాటు నెట్ కనెక్షన్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి ఇబ్బడి ముబ్బడిగా వినోదాన్ని పంచుతున్నాయి. అందుకే రొటీన్‌గా శ్యాటిలైట్ చానల్ చూసే బదులు వెరైటీ కోసం లైవ్ స్ట్రీమింగ్‌ను ఆశ్రయించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లీజర్‌గా ఉన్నప్పుడు తమకు నచ్చిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్లే చేసుకోవడంలో ఉండే మజా మరెందులోనూ ఉండదని సగటు వీక్షకులు భావిస్తారు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన మధ్యతరగతివారు సైతం హ్యాపీగా ఇంట్లో సోఫాలో కూర్చుని, నచ్చిన స్నాక్స్ దగ్గర పెట్టుకుని టీవీలో ప్రోగ్రాములు ఆస్వాదించడం సాధారణ విషయమైపోయింది. లివింగ్ రూమ్‌లో ఇలాంటి సన్నివేశాలు దాదాపు అందరి ఇళ్లలోనూ మనకు దర్శనమిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో సినిమా విడుదల రోజే ఇంట్లో కూర్చొని ఆ షోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన టైమ్‌లో షో బుక్ చేసుకుని సబ్‌స్ర్కైబ్ చేసుకుంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం లేకుండానే వెండితెరలాంటి బుల్లితెరపై సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. అతిత్వరలో మన టీవీల్లో కూడా ఇలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. 

ఫ్యామిలీ మెంబర్
మన జీవితంలో టీవీకున్న స్థానం ఏమిటంటే.. ఓ ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ! ఇది అక్షరసత్యం. ఇంట్లో మనకు

1

టైమ్ పాస్ కావాలన్నా.. ఒంటరిగా ఉన్నామన్న భావన దరిచేరకుండా ఉండాలన్నా.. ఎవరైనా తోడుగా ఉన్నారన్న ఫీలింగ్ కలగాలన్నా టీవీ ఆన్‌లో ఉండి.. అలా మోగుతూ ఉంటే చాలు. అప్పుడు మనం మనుషుల మధ్య ఉన్నట్టు అనిపించడం ఖాయం. అందుకే మనం రోజూ టీవీ చూడకపోయినా ఒక్కరోజు ఇంట్లో టీవీ లేకుండా మాత్రం అస్సలు ఉండలేం.  టీవీ లేకపోతే ఏదో వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంట్లో పనంతా అయిపోయాక గృహిణులు టీవీ ముందు కూర్చుని టీవీ సీరియళ్లు ఎంజాయ్ చేస్తారు. ఇక వయసులో పెద్దవారిదీ దాదాపు ఇదే పరిస్థితి. బుల్లితెర వచ్చాక ఇరుగు పొరుగుతో కలిసి ముచ్చట్లు చెప్పుకునే రోజులు పోయాయి. అంతా టీవీ మహిమ! 

పెద్ద పరిశ్రమ
సినీ పరిశ్రమ తరువాత అతిపెద్ద పరిశ్రమగా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో బుల్లితెర కీలక పాత్ర పోషిస్తోంది. మనదేశంలోనే టీవీ ఇండస్ట్రీపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారు. నటీనటులు, యాంకర్లు, రిపోర్టర్లు, కెమరామెన్, మేకప్ ఆర్టిస్టులు, డ్రైవర్లు, టెక్నీషియన్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, డీటీహెచ్ సర్వీసుల్లో పనిచేసేవారు, కేబుల్ ఆపరేటర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రంగంలో ఉపాధి మార్గాలు బోలెడన్ని ఉన్నాయి. అచ్చం సినీ పరిశ్రమలానే బుల్లితెర కూడా ఫక్తు గ్లామర్ పరిశ్రమ కనుక సహజంగానే ఈ రంగంవైపు ఆకర్షితులయ్యేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇటీవలి కాలంలో టీవీ ఇండస్ట్రీలో పనిచేసే వారికి కూడా ఫిల్మ్ స్టార్లలా సెలబ్రిటీ హోదా దక్కుతుండడంతో టీవీపై మరింత మక్కువ పెరుగుతోంది. 

రాజకీయాలు
ఇక రాజకీయ రంగాన్ని శాసిస్తున్నది టీవీ పరిశ్రమే. అందుకే ఈ రెంటికీ అవినాభావ సంబంధాలు నెలకొన్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి, పెద్ద లీడర్లకు సొంతంగా పత్రికలతో పాటు చానళ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. తమ జెండాను పదేపదే చూపుతూ సొంత అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లే సరైన సాధనంగా విజువల్ మీడియాలో టీవీకి అగ్రతాంబూలం దక్కుతోంది. ప్రజలపై టీవీ వేసే చెరగని ముద్రను గుర్తించిన లీడర్లు పుట్టగొడుగుల్లా టీవీ చానళ్లను ప్రారంభించేస్తున్నారు.  ఎన్నికల సీజన్‌లో అయితే ప్రజలు టీవీ సెట్లకు అతుక్కుపోయి నేతల ప్రచారాలను విరగబడి చూస్తారు. ఫలానా లీడర్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఫలానా నేత దాన్ని ఇలా ఖండించారు.. అంటూ ఎప్పటికప్పుడు వేడి వేడి రాజకీయ సమాచారాన్ని వార్తా చానళ్లు వండి వార్చుతుండగా ప్రజలు వీటిని విపరీతంగా ఆదరిస్తున్నారు. తమిళనాడులో జయ టీవీ అంటే అన్నాడీఎంకేదని, కలైంగర్ చానల్ అంటే డీఎంకే దని తంబీలందరికీ బాగా తెలుసు. వారు జయ అభిమానులైతే జయ టీవీ చానెల్ మాత్రమే చూస్తారు.. అదే కరుణానిధి అనుచరగణం అయితే కలైంగర్ చానల్‌ను ఫాలో అయిపోతున్నారు. 

విదేశాల్లోనూ...
సప్త సముద్రాల అవతల విదేశాల్లో ఉన్నవారికి ‘మా ఊరి వంట’ మొదలు మన సినిమాలు, వార్తలు, సీరియళ్లు, రాజకీయాలు, చర్చోపచర్చలు అన్నీ ఎప్పటికప్పుడు లైవ్‌లో తెలుసుకునేందుకు చానళ్లు అందుబాటులో ఉండటంతో మాతృదేశంలో ఉన్నట్టే వీరు ఫీల్ అవుతున్నారు. సొంతగడ్డపై అయినవారి మధ్య ఉన్నామనే భావనతో కాసేపు సేదతీరేలా చేస్తున్న ఘనత టీవీలకే దక్కుతుంది. పండుగలు, పబ్బాల సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు తెచ్చే టీవీలకు చాలా మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. అందుకే అమెరికాలో బతుకమ్మ, సంక్రాంతి, ఆస్ట్రేలియాలో ఉగాది పండుగల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను టీవీ చానళ్లు స్వయంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి.

సమాచార విప్లవంలో అస్త్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీవీ ప్రధాన అస్త్రంగా మారింది. దృశ్య, శ్రవణ మాధ్యమాలు రెండూ ఉన్న ఈ రంగం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. అందుకే ఆబాలగోపాలం దీనికి ఆకర్షితులవుతున్నారు. ప్రజలకు మంచేది, చెడ్డేది చెప్పాలన్నా, తుపానుల వంటి సమాచారాన్ని క్షణాల్లో చేరవేయాలన్నా టీవీ చానళ్లు అతిపెద్ద ప్రసార, ప్రచార సాధనంగా రూపాంతరం చెందాయి. డిజిటల్ మీడియా వచ్చాక టీవీల ప్రాధాన్యం తగ్గుతుందనుకున్నవాళ్ల అంచనాలు తలకిందులు చేస్తూ మరింత పెరగడం విశేషం. 
 

(నవంబరు 21 వరల్డ్ టెలివిజన్ డే) 
భార్గవి కరణంతప్పులు చేశానని ఫీల్ కాను

Updated By ManamSun, 11/18/2018 - 04:47

aపుష్కరం క్రితం ‘దేవదాస్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడా తన ముద్ర వేశారు. ఈ క్రమంలో తెలుగు సినిమాకు తాత్కాలికంగా దూరమయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత టాలీవుడ్ బ్రేక్‌కు బ్రేక్ ఇస్తూ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఇంత గ్యాప్ తీసుకోవడానికి వెనకున్న కారణంతో పాటు పలు విషయాలను ముచ్చటించిన ఇలియానా అంతరంగం...

దాపు ఆరేళ్ల తర్వాత తెలుగులోకి ‘అమర్ అక్బర్ ఆంటోని’తో రీ ఎంట్రీ ఇచ్చాను. మంచి కథ, పాత్ర చిత్రీకరణ కారణంగానే ఈ సినిమా చేయుడానికి ఒప్పుకున్నాను. రవితేజ మంచి కోస్టార్. తనతో కలిసి పనిచేయుడానికి ఇష్టపడతాను.

కావాలని దూరం కాలేదు 
aఅల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘జులాయి’ సినిమా చేసేటప్పుడు నాకు బాలీవుడ్ నుండి ‘బర్ఫీ’ ఆఫర్ వచ్చింది. ఆ విషయాన్ని త్రివిక్రవ్‌ుగారికి చెప్పాను. ఆయన కథ విని ‘‘కథ చాలా బావుంది, తప్పకుండా చెయ్‌ు’’ అన్నారు. సాధారణంగా మంచి సినిమాలో భాగం కావాలని ఎవైరెనా అనుకుంటారు కదా!.. అలా భావించే ‘బర్ఫీ’ చేశాను. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మధ్యలో తెలుగులో అవకాశాలు వచ్చాయి కానీ.. అవి నాకు నచ్చలేదు. కొన్ని పాత్రలు నచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చేయులేకపోయాను. దాంతో ‘ఇలియానా తెలుగులో సినిమాలు చేయుదు’ అనే ప్రచారం చేశారు. నా పరంగా నేనెప్పుడూ తెలుగు సినిమాలకు దూరం కాలేదు. నాపై రూమర్స్ ఎందుకు వచ్చాయో తెలియదు.

పరిణతి వచ్చింది
చిన్న వయుసులోనే కెరీర్‌ను స్టార్ట్ చేశాను. ‘దేవదాస్’ సవుయంలో సినిమా అంతా ఓ ఫన్‌లాగా అనిపించేది. ఉదాహరణకు క్లాప్ కొడుతుంటే ‘ఇదేంటి?’ అని అనుకునేదాన్ని. మంచి కథ అని అనిపిస్తే చాలు సినిమా చేశాను. ఉదాహరణకు ‘పోకిరి’ సినిమా చేసేటప్పుడు అది అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. నేను ‘పోకిరి’ చేయకూడదని అనుకుంటున్న సమయంలో మంజులగారు నాతో మాట్లాడి ఒప్పించారు. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘పోకిరి’ నిలిచింది. అలా పనిచేస్తూ రావడం వల్ల నెమ్మదిగా వర్క్ పట్ల మరింత ఆసక్తి ఏర్పడింది. కథలు ఎంపిక చేసుకునే పద్ధతి మారింది. ఈ పన్నెండేళ్ల్ల ప్రయాణంలో తప్పొప్పులు జరిగి ఉండొచ్చు. అయితే తప్పులు చేశానని ఫీల్ కావడం లేదు. ఎందుకంటే నేను నా ప్రయాణాన్ని ఇష్టపడుతున్నాను. తప్పులు చేయడం వల్ల కొత్త విషయాలను తెలుసుకున్నాను.

నా గొంతు నాకే నచ్చలేదు
‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాకు తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పాను. సాధారణంగా నేను నా సినిమా అగ్రిమెంట్‌లో డబ్బింగ్ చెబుతానని ఒప్పుకోను. కానీ ఆ నియుమాన్ని దాటి డబ్బింగ్ చెప్పానంటే కారణం డైరెక్టర్ శ్రీనువైట్లగారే. సినిమా ఒప్పుకున్న తర్వాత మీరే డబ్బింగ్ చెప్పాలని అన్నారు. ముందు ఆయన జోక్ చేస్తున్నారని అనుకున్నాను. కానీ ఆయన నా డబ్బింగ్ విషయంలో సీరియుస్‌గా ఉన్నారని అనిపించింది. ఆయన నాపై అంత నమ్మకంగా ఉండటంతో నేను తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి సరేనన్నాను. డబ్బింగ్ చెప్పే సమయంలో నేను చెప్పలేనేమోనని భయపడ్డాను. కానీ డైరెక్టర్‌గారు, పప్పు నాకు సపోర్ట్‌గా నిలిచారు. మూడు రోజుల్లో నా పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసేశాను. అయితే డబ్బింగ్‌లో నా గొంతు నాకే నచ్చలేదు. భవిష్యత్‌లో కూడా ఏ దర్శకుడైనా మీరు చెబితే బావుంటుందని చెబితే నేను డబ్బింగ్ చెబుతాను.
 

a

డ్రీమ్ రోల్స్ లేవు
కెరీర్ ప్రారంభంలో ‘మగధీర’లో రాజకుమారి లాంటి పాత్రలను చేయాలనే కోరికకుండేది. కానీ ఇప్పుడు నాకు పర్టిక్యులర్‌గా ఇలాంటి డ్రీమ్ రోల్స్ చేయాలనే ఆలోచనలైతే లేవు. కేవలం గ్లామరస్ రోల్స్ చేయను. అలా అని కేవలం పెర్ఫార్మెన్స్ రోల్స్ మాత్రమే చేస్తానని అనుకోకూడదు. గ్లామరస్ రోల్స్‌లోనూ పెర్ఫార్మెన్స్‌కు చాలా మంచి స్కోప్ ఉంటుంది. 

ముందుకు రావాలి
అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. లైంగిక వేధింపులను భరించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం చాలా మంచి విషయం. లైంగిక వేధింపు అనేది ఓ భయానక అనుభవం. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందిస్తాను.

నేను సాధారణ వ్యక్తిని
నేను స్టార్ హీరోయిన్‌ని, సెలబ్రిటీని అనుకోవడం నాకు నచ్చదు. ఓ నటిగా సినిమాల్లో నటిస్తాను. సెట్ నుండి బయటకు రాగానే నేను సాధారణమైన వ్యక్తినే. నేను బయట తిరుగుతాను. ఇల్లు నీట్‌గా ఉండేలా చూసుకుంటాను. వంట వండుతా. అయితే సెట్‌లో డిఫరెంట్ రోల్స్ చేయడం వల్ల ఓ కిక్ వస్తుంది. ఇలాంటి ప్రొఫెషన్‌లో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తాను. చిన్నప్పుడే నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో కాస్త ఫన్‌గా అనిపించేది. కానీ అనుభవం వల్ల చాలా విషయాలను తెలుసుకున్నాను. ఇలాంటి రంగంలో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

రిలేషన్‌షిప్‌లో హ్యాపీ
ఆండ్రూ నిబోన్‌తో ఉన్న రిలేషన్ పరంగా ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను. సామాజిక మాధ్యమాల్లో నా గురించి చాలా వార్తలు ప్రచారం జరిగాయి. నేను గర్భవతి అని కూడా ప్రచారం చేశారు. కానీ నేను వాటి గురించి పట్టించుకోలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి. చెప్పేవన్నీ సోషల్ మీడియా ద్వారా చెబుతూనే ఉన్నాను. అంత కంటే చెప్పలేను. సోషల్ మీడియా అనేది ఇప్పుడు అందరి జీవితాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు నేను ఏదైనా ఓ విషయం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మరోలా వార్తలు బయటకు రావచ్చు. అలాంటి సమయాల్లో సోషల్ మీడియా ద్వారా మనం నేరుగా చెప్పాలనుకున్న విషయాలను చెప్పవచ్చు. నేను ఎంత సినిమాల్లో నటించినా.. నాకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాలనేం లేదు కదా! 

మానసిక సమస్యలు ఎదుర్కొన్నా 
అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణంగా ఎవరికైనా మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నా. వారం, పదిరోజుల పాటు బయటకు వచ్చేదాన్ని కాదు. ఎవరినీ కలిసేదాన్ని కాదు. మన మనుషుల్ని దూరం పెట్టేసే పరిస్థితి. అయితే నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంటూ వచ్చాను. నెమ్మదిగా బయటపడ్డాను. దీని కారణంగా మానసికంగా నేనింకా దృఢంగా తయారయ్యాను. మన దేశంలో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఎదుటి వ్యక్తితో మనసువిప్పి మాట్లాడుకోవడం వల్ల ఈ సమస్యను తీర్చుకోవచ్చు. 

- మోహన్‌కుమార్ తుమ్మలఆరోగ్యంలో మనమెక్కడ?

Updated By ManamSun, 10/28/2018 - 12:02

image‘‘బతకడం చాతకానివాళ్లు చాలా కాలం బతకకూడదు’’ అంటారు ఒక కథలో ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. నిజమే. ఆరోగ్యంగా బతకడం చాతకానివాళ్లు చాలా కాలం బతికితే వాళ్లకే కాదు, వాళ్ల చుట్టూ ఉండేవాళ్లకూ నరకంగానే ఉంటుంది. ఆరోగ్యంగా బతకడానికి జీవనశైలితో పాటు, ఆహార నియమాలతో పాటు, ఆరోగ్యంపై శ్రద్ధతో పాటు ఆరోగ్య బీమా కూడా అవసరం. మన దేశంలో ఆరోగ్య బీమా లేకపోవటాన ఏదైనా తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భాల్లో ఖరీదైన వైద్య చికిత్స పొందలేక అనేకమంది అర్ధంతరంగా మరణిస్తున్నారనేది 
విచారకరమైన వాస్తవం.

భారతదేశ ప్రస్తుతం జనాభా 134 కోట్లు. గత పాతికేళ్లలో 45 కోట్ల మంది కొత్తగా జమయ్యారు. అయితే ఈ కాలంలో పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్య సగానికి సగం పడిపోయింది. చిత్రంగా ఒక పక్క సంపద పెరుగుతుంటే ఇంకో పక్క వ్యాధుల భారం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ కాలాన్ని ‘ద్వంద్వ వ్యాధి భార కాలం’గా చెప్పుకుంటున్నారు. అంటే ఓ వైపు అంటువ్యాధులు, మరో వైపు జీవనశైలి వ్యాధులు గణనీయంగా పెరిగాయి. 2015లో చోటు చేసుకున్న మరణాల్లో సగం పైగా మరణాలు ఈ వ్యాధుల వల్లే సంభవించాయి. ఈ తరహా మరణాలు 2001-03 కంటే 2015కి ఏకంగా 42 శాతం పెరిగాయి!
 

image

ఆర్థికాభివృద్ధి, మెరుగైన ఆరోగ్య అవగాహన, వేగంగా పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న వృద్ధుల జనాభాపై ఈ వ్యాధుల భారం పడిన ఫలితంగా  దేశంలో ఆరోగ్య పరిరక్షణ పరిశ్రమ 1990 నుంచి 11 శాతం పెరిగి 2013 నాటికి 81.3 బిలియన్ డాలర్లకు (రూ. 54,086 లక్షల కోట్లకు) చేరుకుంది. ఇది ఇలానే పెరుగుతూ 2020 నాటికి 17 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

అదే జరిగితే.. మొబైల్ టెక్నాలజీ, మెరుగైన సమాచార సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. పరిమితమైనప్పటికీ, కొన్ని కంపెనీలు వినూత్న సేవల్లో పెట్టుబడి పెట్టడంతో పాటు, లాభదాయక, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ పరికరాలను సృష్టిస్తున్నాయి. వీటికి ఉదాహరణగా జీఈ హెల్త్ కేర్ సంస్థ ‘లుల్లబి బేబీ వార్మర్’ని చెప్పుకోవచ్చు. అయితే, కొన్ని పురోగతులు ఉన్నప్పటికీ, భారతదేశ ఆరోగ్య పరిరక్షణ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

62 శాతం జనం సొమ్మే
స్థూల జాతీయోత్పత్తితో పోల్చుకుంటే ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేసే ఖర్చు చాలా తక్కువ. మన తలసరి ఆరోగ్య ఖర్చు చాలా తక్కువ. అదే చైనా అయితే గరిష్ఠంగా 5.6 రెట్లు, అమెరికా అయితే 125 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. భారతీయులు తమ ఆరోగ్య పరిరక్షణకు చేసే ఖర్చులో 62 శాతం తాము పొదుపు చేసుకున్న డబ్బు నుంచే వాడుతుంటారు. అంటే ఆ ఖర్చులన్నీ తమ సొంత జేబు నుంచే పెడుతుంటారన్న మాట. ఇదే చైనాలో 54 శాతం, అమెరికాలో 13.4 శాతం, ఇంగ్లండ్‌లో 10 శాతంగా మాత్రమే ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవాలంటే (తీర్చాలంటే) భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు సరిపోవు.
 

image

దేశవ్యాప్తంగా ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యమే అధికంగా ఉంది. మన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న జనాభా (బిపిఎల్) ఎక్కువ. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రోజుకు రూ. 47, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రోజుకు రూ. 32 మాత్రమే ఖర్చు చేయగల సామర్థ్యం వుంది. అందువల్ల వారు ఆరోగ్య పరిరక్షణ అవసరాల కోసం తప్పనిసరిగా ప్రభుత్వ రంగంపై ఆధారపడుతున్నారు. నిధుల కొరత, సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ రంగం వారి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతోంది.

అంతేకాక, ఎక్కువమంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృ తమై ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడి వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల వారికంటే ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టగలరు కాబట్టి. వైద్యుల సంఖ్యాపరంగా భారతదేశం ప్రపంచ సగటును చేరుకోగలిగిందనేది నిజమే. అయితే 74 శాతం మంది వైద్యులు జనాభాలో కేవలం మూడవ వంతుకి అంటే 44.2 కోట్ల మందికి మాత్రమే సేవలందిస్తున్నారని కేపీఎంజీ సంస్థ నివేదిక వెల్లడించింది.

చైనా, అమెరికాతో పోల్చుకుంటే భారతదేశంలోని ఆసుపత్రుల్లో పడకల, నర్సుల సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ గణాంకాల ప్రకారం మన దేశంలోని గ్రామీణ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో (సీహెచ్‌సీలు) 81 శాతం వైద్య నిపుణుల కొరత ఉండగా, మొత్తం పడకల్లో 63 శాతం ప్రైవేటు హాస్పిటళ్లలోనే ఉన్నాయి. 
ప్రధాన అడ్డంకులు

జనాభా: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం మనది. 1985లో 76 కోట్ల మంది జనాభా ఉండగా, 2018కి అది 134 కోట్లకు పెరిగిందని అంచనా.

మౌలిక సదుపాయాలు: ప్రస్తుతం దేశంలో ఉన్న ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ప్రజల అవసరాలను తీర్చడానికి సరిపోదు. imageకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సార్వజనీన ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స, అత్యవసర మందులు వంటివి అందిస్తున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా, ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్ల కొరత, నిధుల కొరత కారణంగా రోగులను తప్పనిసరిగా ప్రైవేట్ వైద్యులు, హాస్పిటళ్లకు వెళ్లి చికిత్స చేయించుకునే విధంగా చేస్తున్నాయి.
ఇన్సూరెన్స్: భారతదేశం ప్రపంచంలోనే తక్కువ తలసరి ఆరోగ్య పరిరక్షణ ఖర్చు చేసే దేశాల్లో ఒకటిగా వుంది. మన దేశంలో ఆరోగ్య బీమాకి ప్రభుత్వం నుంచి అందే సహకారం సుమారు 32 శాతమే. అదే యూకేలో అయితే ప్రభుత్వ సహకారం 83.5 శాతం. శోచనీయమైన విషయమేమంటే ఆరోగ్య చికిత్సల కోసం భారతీయులు తమ జేబులు ఖాళీ చేసుకుంటూ ఉండటం. 76 శాతం మంది భారతీయులకు ఆరోగ్య బీమా అనేదే లేదు. జాతీయ ఆరోగ్య బీమా పథకం (రాష్ట్రీయ స్వాస్థ్య సురక్షా యోజన) ఉన్నప్పటికీ దాని నుంచి అందుతున్న ప్రయోజనం తక్కువేనని విశ్లేషకులు వాదిస్తున్నారు.

గ్రామీణ-పట్టణ వ్యత్యాసం: గ్రామీణ ఆరోగ్య సంరక్షణా మౌలిక సదుపాయాలు మూడు దశలుగా ఉన్నాయి. మొదట ఉపకేంద్రం, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), ఆ పైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఉన్నాయి. పీహెచ్‌సీలలో 3,000 మంది డాక్టర్ల కొరత వుంది. గడచిన పది సంవత్సరాలలో ఈ కొరత 200 శాతం పెరిగి 27,421కి చేరింది. 

అయితే, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆశావహ పరిస్థితులు ఉన్నాయి. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి చర్యలను నిర్దేశించారు. ఆరోగ్య బడ్జెట్ 27 శాతం పెరిగింది. అయితే ఈ కేటాయింపులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, కొత్త ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల విషయంలో.
 
రెండు ‘రాఫెల్’ విమానాల కంటే తక్కువే!
జాతీయ ఆరోగ్య బీమా పథకం (రాష్ట్రీయ స్వాస్థ్య సురక్ష యోజన) ఇప్పటికే అమలులో ఉన్న పథకానికి ఒక చిన్నimage మెరుగుదల మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ బీమా ద్వారా ప్రయోజనం పొందే ప్రతి కుటుంబ వార్షిక పరిమితిని రూ. 30,000 నుంచి రు.1,00,000కు పెంచారు. వయో వృద్ధులకు అదనంగా రూ.30,000 పెంచారు. దేశంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అన్ని (బీపీఎల్) కుటుంబాలను ఆరోగ్య బీమా కార్యక్రమాల కిందకు తీసుకు వస్తే రూ. 2,460 కోట్ల నుంచి రూ. 3,350 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇది రెండు ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాల వ్యయం కంటే తక్కువే!

సామాజిక రంగ పథకాలకు పెద్ద ఎత్తున ఐటీ అప్లికేషన్లను వాడుతున్న కారణంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) పెద్ద పాత్ర పోషించనుంది. ప్రభుత్వ బీమా పథకం కింద ఉన్న అన్ని ఆసుపత్రులను ఐటీ ఆధారిత ఆసుపత్రులుగా అభివృద్ధి చేసి వీటిని జిల్లాల్లోని సర్వర్లకు అనుసంధానించారు. లబ్ధిదారులు ఒక స్మార్ట్ కార్డు సహాయంతో బీమా పథకం కింద ఉన్న ఆసుపత్రులకు వెళ్లి అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను పొందవచ్చు. అదనంగా, 2016లో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా దేశంలో అనేక కొత్త కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఆధారిత ఇ-హెల్త్, ఎం-హెల్త్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వస్థ భారత్ అనే మొబైల్ అప్లికేషన్.. వ్యాధులు, వాటి లక్షణాలు, చికిత్స, ఆరోగ్య హెచ్చరికలు, చిట్కాలపై సమాచారం అందచేస్తుంది. హెల్త్ వర్కర్లకు ‘అన్‌మోల్-ఏఎన్‌ఎమ్’ అనే ఆన్‌లైన్ టాబ్లెట్ అప్లికేషన్, ‘ఇ-రక్తకోష్’ అనే ఒక బ్లడ్-బ్యాంకు నిర్వహణ సమాచార వ్యవస్థ, ‘ఇండియా ఫైట్స్ డెంగ్యూ’ అనే అప్లికేషన్ ప్రారంభమయ్యాయి. 

ఏ రాష్ట్రానికా రాష్ట్రం టెక్నాలజీ మద్దతుతో వివిధ ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశ పెడుతోంది. ఉదాహరణకు, కర్ణాటక ప్రభుత్వం ఆమధ్య ప్రకటించిన నగదు రహిత ఆరోగ్య బీమా పథకాలకు సాంకేతిక భాగస్వామిగా రెమిడీనెట్ టెక్నాలజీ (భారతదేశపు మొట్టమొదటి పూర్తి నగదు రహిత, ఎలక్ట్రానిక్ ఆరోగ్య బీమా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ నెట్ వర్క్)తో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటంతో, ప్రైవేటు పెట్టుబడులు, స్టార్టప్ సంస్థలు ఈ రంగంపై విశేష శ్రద్ధను కనబరుస్తున్నాయి. 
imageప్రభుత్వపు నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, హెల్త్ కేర్ డొమైన్ నిపుణులు, వాటాదారుల, ఇతర కీలక భాగస్వాముల మధ్య సహాయ సహకారాల కోసం తప్పనిసరిగా ఒక వేదికను అందుబాటులో ఉంచాలి. అందులో భాగంగా భారతదేశంలో ఆవిష్కరణ (ఇన్నోవేషన్) సంస్కృతిని ప్రోత్సహించాలి. ఒక నూతన భారతీయ విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. అంతే కాకుండా మరింత సరసమైన ధరలో నాణ్యమైన రోగ నిర్ధారణ, సంరక్షణ అందించే ఉత్పత్తులు, వ్యాపార నమూనాలు తయారు చేయడానికి ప్రైవేటు రంగం కూడా ‘పొదుపు ఆవిష్కరణ’లపై దృష్టి పెట్టింది.
ఇప్పుడు భారతదేశపు ఆరోగ్య పరిరక్షణ రంగ అన్ని దశలలో (నివారణ, నిర్ధారణ, చికిత్స) విశేషమైన మార్పులు జరగబోతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ రంగంలోని ఏ ఒక్క అనుబంధ సంస్థా స్వతంత్రంగా పని చేయలేదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానితమై ఉన్నాయి. 

నిర్లక్ష్యం వీడాలి
ఈ ఏడాది జూలైలో, ఆరోగ్య బీమా పాలసీలలో మినహాయింపులను పరిశీలించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియూ (ఇర్డాయ్) ఒక వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మెుదట దేశంలో ఆరోగ్య బీమా ఎలా పరిణామం చెందిందో చూడాలి. 1986లో దేశంలో ఆరోగ్య బీమా సౌకర్యం ప్రారంభమైంది. 2006 వరకు దానిలో దాదాపు ఎలాంటి వృద్ధీ లేదు. కానీ గత దశాబ్ద కాలంగా ఆరోగ్యimage బీమా గణనీయమైన స్థాయిలో పెరిగింది. కీలకమైన ఆవిష్కరణలు జరిగారుు. వినియోగదారుల ఆసక్తి ఆధారంగానే ఇది నడుస్తుంది. నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ అవసరాన్నీ, అందులో బీమా అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయూన్నీ వారు గుర్తించారు. అంటే మన జీవిత కాలాన్ని పెంచుకోవడంలో ఆరోగ్య బీమా కీలకంగా మారింది. కాబట్టి ఆరోగ్య బీమాని మరింత మెరుగుపరిస్తే మరింత మందికి ప్రయోజనం లభిస్తుంది. దీనికి కావాల్సింది స్థిర ప్రయత్నం. బీమాతో పొందే ప్రయోజనం వ్యక్తిగతమైంది కాబట్టి, దాన్ని వినియోగదారుని పరంగా చాలా సున్నితమైన అంశంగా చెప్పాలి. ఉదాసీనతకు అవకాశం ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ కెయిమ్ లాగా కాకుండా, ఆరోగ్య బీమా ప్రయోజనం అనేది వ్యక్తిగతమైంది. అందువల్ల వినియోగదారులకు ఆ బీమా ప్రయోజన అనుభవం మృదువుగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. బీమా అవసరమైన సందర్భాల్లో కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు అసహనానికీ, అసౌకర్యానికీ గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నారుు. అలాంటివి జరక్కుండా ఆయూ సంస్థలతో పాటు ప్రభుత్వమూ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బీమా విషయంలో సరైన ప్రమాణాలను నిర్దేశించి, వాటిని కచ్చితంగా అమలు చేయూలి.
ఆలోచనకు, ఆచరణకు మధ్య వున్న ఖాళీని నూతన ఆవిష్కరణలతో నింపడానికి అందరు వాటాదారుల సహాయ సహకారాలను ఈ రంగం ఆశిస్తోంది. అప్పుడే పరిణామం సాధ్యపడుతోందని నమ్ముతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న అనుసంధానమవని ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు, ఎక్కువగా వెచ్చించేటటువంటి ఇబ్బందులను అధిగమించి, తేలికగా ముందుకు వెళ్లే సత్తా భారతదేశానికి వుంది. అయితే, భారతదేశం ఈ అవకాశాన్ని ఎంతమేరకు అందిపుచ్చుకోగలదనేదే అసలు ప్రశ్న.

ఆయుష్మాన్ భారత్
హర్యానాలోని ఇంద్రి అనే చిన్న పట్నానికి చెందిన అమిత్‌కుమార్ దినసరి కూలీ. ఈ ఆగస్టులో ఆయన భార్య మౌసమికి కల్పనా చావ్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో రెండో బిడ్డ పుట్టినప్పుడు బిల్లు కటడానికి వెళ్లాడు. అక్కడ అతనికిచ్చిన బిల్లు విలువ అక్షరాలా రూ. 35 మాత్రమే. అది కూడా పుట్టిన పాపకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ కోసం. ఆ బిల్లు చూసుకొని అమిత్‌కుమార్‌కు ఆశ్చర్యం, ఆనందం.. రెండూ కలిగారుు. ఇంత తక్కువ బిల్లు ఎలా సాధ్యమైందంటే కొత్తగా వచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వల్ల. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 40 శాతం (దాదాపు 50 కోట్ల మంది) జనాభాకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీని వెనుక ఎన్ని రాజకీయ లెక్కలు ఉండనీ గాక, నిజంగా ఈ పథకం గనుక సమర్థవంతంగా అమలైతే మనదేశపు ఆరోగ్య పరిరక్షణ ముఖచిత్రమే మారిపోతుంది. ఈ పథకం కిందకు వచ్చే వాళ్లు ఎవరైనా జాబితాలోని హాస్పిటల్‌కు వెళ్లి, డబ్బుతో నిమిత్తం లేకుండా వైద్య సేవలు పొందవచ్చు. సూపర్ స్పెషలిస్ట్ జోక్యంలేని సెకండరీ చికిత్స కోసం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల మెుత్తాన్ని బీమా కింద ఈ పథకం కేటాయిస్తోంది. లబ్ధిదారులు ఈ బీమా సౌకర్యం పొందడానికి ఒక్క పైసా చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఇన్సూరెన్స్ వ్యయూన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిన చెల్లిస్తారు. అంటే లబ్ధిదారులు ఈ పథకం అమలులో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా చికిత్స పొందవచ్చన్న మాట. ప్రస్తుతం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 8,500 హాస్పిటళ్లు ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

క్లిష్ట అనారోగ్య పాలసీ
imageఆరోగ్య బీమా మరింత సమగ్రంగా ఉండాలి. కొత్త మార్గాల్లో చికిత్స అందివ్వడానికి హాస్పిటళ్లకు వెసులుబాటు కల్పించాలి. ఇది వ్యయంపై ప్రభావం చూపించవచ్చు. కానీ వినియోగదారునికి సరైన చికిత్స అందించడంలో రాజీపడని విధంగా బీమా ప్రయోజనం ఉండాల్సిందే. తమ ఆరోగ్య బీమా మరింత సమగ్రంగా ఉండేలా వినియోగదారులు కూడా ప్రయత్నించాలి. సాధారణ ఆరోగ్య పాలసీ అనేది ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ప్రయోజనాన్ని కల్పిస్తుంది. మరింత కాస్ట్-ఎఫెక్టివ్ పద్ధతిలో బీమా ప్రయోజనం పెంచుకోవాలంటే టాప్-అప్ ప్లాన్‌కు వెళ్లాలి. అదే క్లిష్ట అనారోగ్య పాలసీ తీసుకున్నవాళ్లకైతే క్లిషమైన జబ్బు సోకినట్లు నిర్ధారణ అయితే, ఎక్కువ మెుత్తంలో ప్రయోజనం పొందే వీలుంటుంది. అంటే మెరుగైన వైద్య చికిత్స అందుతుంది. క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్లు చౌకగా లభిస్తుండటం, వాటి కెయిమ్‌లు సరళంగా ఉండటం దీనికి కారణం. ఉదాహరణకు బీమా సౌకర్యం కలిగిన ఒక స్త్రీ డయేరియూ, జ్వరంతో ఆసుపత్రి పాలైనప్పుడు, ఆమె డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. క్లిష్ట అనారోగ్య పథకంలో భాగంగా ఆమెకు చికిత్స అందుతుంది. ఆసుపత్రి బిల్లును ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది.
 అదే నువ్వు.. అదే నేను!

Updated By ManamSun, 10/14/2018 - 06:27

డైరీలు గతంలోకి తొంగి చూసేందుకు వీలున్న మైక్రోస్కోపులు. చరిత్ర ఏం దాచుకుందో వర్తమానానికి చెప్తుంది డైరీ. వాళ్లకేమనిపిస్తోందో, వాళ్ల జీవితాల్లోనో, చుట్టూ ఉన్న సమాజంలోనో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు వాక్యం తర్వాత వాక్యంలా డైరీ ఒక సందర్భాన్ని రికార్డు చేస్తుంది. తేదీ తర్వాత తేదీ. ఒక్కో తేదీ ఒక్కో కథ, ఒక్కో జ్ఞాపకం. డైరీ జ్ఞాపకాల్ని భద్రపరుస్తుంది. ఏం? ఐక్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోకూడదా? ఫేస్‌బుక్‌లో దినచర్య రాసుకోకూడదా?.. అంటారేమో. ఇప్పటి ఈ యుగంలో డైరీ ఎలక్ట్రానిక్ వస్తువులో దాక్కోగలదేమో గానీ, స్వహస్తాలతో అక్షరం తర్వాత అక్షరం పేర్చుకుంటూ రాసుకునే పదాల్లో అనుభూతుల్ని దాచుకునే పూలగుచ్ఛంలా గుభాళించాలంటే మాత్రం కుదరకపోవచ్చు.
image
నువ్వంటే నాకెంతో ఇష్టం, ఎవరంటేనూ లేని ఇష్టం. ఎన్నో రకాల అన్ని ఇష్టాలకీ అతీతమైన ఇష్టం. కానీ నువ్వంటే నాకలాంటి ఇష్టం ఉంటే ఈ లోకానికేదో అవుతుందిట. అందుకని నీనుంచి పారిపోవాలని, నువ్వున్నావని ఇంట్లోంచి వెళ్లిపోయాను. నువ్వున్నావని ఊళ్లోంచి వెళ్లిపోయాను. నువ్వున్నావని హృదయంలోంచి..’’ (శిలాలోలిత) ఈ వాక్యాలు రేవతీదేవి అనే కవయిత్రి తన డైరీలో రాసుకున్న అక్షరాలు. 1979లో రాసిన అనేక కవితల్లో ఇదొకటి. ఆ తర్వాత 1981లో ఆమె ఏవో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాక ఈ కవితలన్నీ ఒక కవితా సంపుటిగా వచ్చాయి. చాలా ఫేమస్ అయిన పుస్తకంగా ఈ రోజుకీ నిలిచిపోయిన కవిత్వమది. ఇలా తొలుత మోస్ట్ పర్సనల్ మేటర్‌గా ఉండి ఆ తర్వాత అవి సంచలన సారాంశాలయ్యాయి. డైరీలంతే! ఈ ‘డైరీ’ అనే పదం మొదట లాటిన్ భాషలోని ‘డైరీరం’ అనే పదం నుండి పుట్టింది. దానికి ‘రోజువారీ భత్యం’, ‘రికార్డు’ అనే అర్థాలున్నాయి. డైరీలు రాసేవాళ్లంతా రచయతలు కాదు. అసలది రచనగా చూసుకోవాలని రాయరు. వాళ్లకి వాళ్ల దినచర్యని, వాళ్ల ఆకాంక్షల్ని, ఆలోచనల్ని అక్షరబద్ధం చేసుకోవడం కొంతమందికి అలవాటుగా ఉంటుంది. అయితే కొన్ని డైరీలు అవి రాసుకున్న వాళ్లు మరణించాక జగత్ప్రసిద్ధ రచనాలైపోయాయ్. చాలావరకూ అవి జీవిత కథలైనాయి. ఈ డైరీలు జర్నల్స్‌గా కూడా పిలువబడతాయి. అలాంటి డైరీల్లో ప్రముఖంగా చెప్పుకునే డైరీ హిట్లర్ ప్రచార శాఖా మంత్రి జోసెఫ్ గోబెల్స్ (1897-1945)ది. అతని గోబెల్స్ డైరీస్ చాలా ప్రముఖమైనవి. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ సభ్యుడైన గోబెల్స్ నాజీ పార్టీ అంతర్గత వ్యవహారాల్ని, జర్మనీలో ఆ పార్టీ పరిపాలనలో అనేక ఆసక్తికర విషయాల్ని తన డైరీల ద్వారా వెల్లడిచేశాడు.

‘ఫ్రమ్ ద కైసర్‌హాఫ్ టు ద రీచ్ చాన్సలరీ: ఎ హిస్టారికల్ డైరీ’గా ఇది చాలా పేరుపొందింది. రాయడం ఎందుకు? డైరీలు నిజాలే చెప్తాయా? అబద్ధాలు కూడా చెబుతాయా? ఆ రెండూ కాకుండా ఇంకేమన్నా చెబుతాయా? ఒక కాలిక సందర్భంలో వాటిని రాసిన వ్యక్తి ఆలోచనలని, భావాల్ని, బాధల్ని, సంతోషాల్ని అన్నింటినీ చెప్తాయి. అవి ఆdiary కాలాన్ని పునర్నిర్మిస్తాయి. గడిచిపోయిన రోజుల్నుంచి మళ్లీ కొత్త రోజుల్ని మన కళ్ల ముందుకి తీసుకొస్తాయి. ‘క్యూరియోసిటిస్’ ఆఫ్ లిటరేచర్ రచయత ఇసాక్ డి ఇస్రాయేల్ ‘‘మనం లేనప్పుడు ఉత్తరాలతో, మనతో మాత్రం డైరీలతో మాట్లాడుకుంటాం’’ అని అంటాడు. నిఖార్సైన వ్యక్తిత్వం కోసం: మన జీవితంలో కొంతమందిని కలిసినపుడు, మాట్లాడినపుడు వాళ్లతో మనం ఒక్కోసారి పూర్తిగా ఓపెన్‌గా ఉండలేం. ఎందుకుండాలేమో కూడా చెప్పలేం. కానీ అలా ఉండలేని మనల్ని డైరీ దగ్గరకి తీసుకుంటుంది. మన గురించి మనల్ని మొత్తం తనతో చెప్పమంటుంది. మనం అందులో చాలా నిజాల్ని రాసుకుంటాం. అవి మనల్ని చూపిస్తాయి. అందుకే అది మన వ్యక్తిత్వం.

నెమరువేసుకునే జ్ఞాపకం: పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంటిల్లిపాదీ కలిసి పండుగ చేసుకున్న రోజు.. ఇలా ఏదైనా సరే, ఒక మధురమైన జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవాలంటే డైరీలో రాసుకుంటారు. ఆ సంఘటన అలా భద్రంగా, నిధిలా డైరీలో నిక్షిప్తమవుతుంది. విశ్రాంత పరిష్కార మార్గం: డైరీ నిన్ను రిలాక్స్ చేస్తుంది. నీలో ఉన్న దిగుళ్లనీ, దుఃఖాల్నీ, బాధల్నీ తనతో చెప్పుకుని నిన్ను ఫ్రీ అవ్వమంటుంది. దేని గురించైనా ఒత్తిడికి గురవుతున్నట్లయితే, ఆ కారణాన్ని నువ్వు డైరీలో రాసుకోవడం వల్ల చాలా విశ్రాంతి పొందుతావు. ఆ రకంగా డైరీ నిన్ను ఒక స్నేహితుడిలా ఓదారుస్తుంది. మనం నిత్యం అనుభవించే సమస్యల వివరాల్ని కాగితం మీద పెట్టడం వలన, అలా పెట్టి మళ్లీ చదువుకోవడం వలన వాటికి కొత్త పరిష్కార మార్గాల్ని కనుక్కోవడం సులువవుతుంది. మిత్రులతో, బంధువులతో, కొలీగ్స్‌తో నీకున్న అనేకానేక సమస్యలకీ డైరీ ఒక చక్కటి పరిష్కార వేదిక. డైరీ ఎంట్రీ అంటే?: తేదీల వారీగా, అనేకానేక సంఘటనల రోజువారీ రికార్డు. ఒక క్రమపద్ధతిగా భావాల్ని, జ్ఞాపకాల్ని నమోదుచేసుకోవడమే డైరీ ఎంట్రీ.

డైరీ ఎలా ఉండాలి? ఆర్డర్‌లో, సహజంగా, అంశాలవారీగా, నిజాయితీగా, ఉండాలి. మళ్లీ చదువుతున్నపుడు మనం కనపడేట్టుండాలి. రాసుకోవడాన్ని బాగా పెంపొందించేలా ఉండాలి. అదొక మార్చుకోలేని అలవాటుగా, అంటే అభిరుచిలా ఉండాలి. అసలు ఏ అభిరుచైనా ఎందుకేర్పడుతుంది? వాటిల్ని మనమెందుకు వదులుకోలేకపోతాం? అలా డైరీ మనల్ని విడదీయలేనంతగా ఉండాలి. డైరీలో రకాలుంటాయా?: మనింట్లో పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే, ‘‘నాన్నా.. డైరీలో సంతకం పెట్టవూ’’ అని అడుగుతుంటారు. ఎందుకని? దాంట్లో మనవాడు అసలు ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి? పరీక్షలైతే టైమ్ టేబుల్, మార్కులొస్తే ఎన్ని?.. ఇలా చాలా ఈవెంట్స్ దాంట్లో రాసి టీచరు పంపుతారు. అంటే పిల్లలకి, తల్లిదండ్రులకి ఒక వారధి లాగా అన్నమాట. అలాగే డాక్టరొకటి, మన పై అధికారొకటి, ఇలా మెయిన్‌టైన్ చేస్తారు. వాటిల్లో మనకీ వాళ్లకీ మధ్య జరిగే పని, పరిష్కారం, చర్చ, నోటింగ్సూ.. అన్నీ రాయబడి ఉంటాయి.

ది డైరీ ఆఫ్ యాన్ యంగ్ గర్ల్: అన్నేఫ్రాంక్ డచ్ భాషలో రాసుకున్న ప్రసిద్ధ డైరీ ఒక గొప్ప ప్రపంచ ప్రసిద్ధ రచనగా పేరు పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలు ఆక్రమించిన నెదర్లాండ్స్‌లో తాను తన కుటుంబంతో రెండేళ్లు తలదాచుకోవడం గురించిన డైరీ అది. సుమారు అరవై ప్రపంచ భాషల్లోకి అనువదింపబడిన డైరీ అది. పదిహేనేళ్లకి చనిపోయిన అన్నే ఫ్రాంక్ మూడు స్కూల్ ఎక్సర్‌సైజ్ నోట్స్‌లో రాసుకున్న విషయాల పరంపరే ఈ పుస్తకం. దీన్ని ఆమె కిట్టీ అని సంబోధించింది. తానున్న గదిలో మిగతా మిత్రుల గురించి, తన విపత్కర పరిస్థితులు, వాళ్ల అమ్మకీ, తనకీ అస్సలు లేని సారూప్యాలు, ఎంతో ఇష్టమైన తన సోదరి గురించి ఆ డైరీలో రాసింది ఫ్రాంక్. యుద్ధానంతరం రేడియోలో ఇలాంటి డైరీల సేకరణ జరుగుతుంటుందని ప్రకటించినప్పుడు ఫ్రాంక్ ఈ డైరీని మళ్లీ తిరగ రాశారు. ఈ డైరీ నాటకంగా, సినిమాగా ప్రాచుర్యం పొందింది. ఆమె తండ్రి 1960లో ఈ డైరీ గురించి చెప్తూ, ‘‘ఇది నాకు కొత్త కనువిప్పు. ఆమె తన వయసులో ఎంత భావ సాంద్రత కలిగి ఉందీ నాకప్పుడు తెలియదు. ఆమె ఆలోచనల్లోని లోతు, గాంభీర్యం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి’’ అని అన్నాడు. ఈ డైరీ నిషేధానికి కూడా గురైన సందర్భముంది. అది యూదులకి చెప్పిన క్షమాపణగా, స్వలింగ సంపర్క ప్రేరేపకంగా ఉందని అభియోగం మోపారు. ఫ్రాంక్ తన యవ్వన దశ ప్రారంభంలో శారీరక మార్పుల గురించి రాయడం, తల్లిని దూషణ చేసిన మాటలూ ఈ బహిష్కరణకు ప్రముఖ కారణాలుగా ఉన్నాయి.

వర్జీనియా వూల్ఫ్: ఇరవయ్యో శతాబ్దంలో బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రభావవంతమైన రచనలు చేసిన వూల్ఫ్ డైరీలు కూడా చాలా పేరు పొందినవి. ఆమె భర్త లియొనార్డ్ వూల్ఫ్ అంటే తనకెంతో ఇష్టం. చైతన్య స్రవంతి రచనా ప్రక్రియకి ఆమె ఎంతో పేరుగాంచారు. ఆమె రచనలన్నీ మానసిక ఉద్వేగాల్ని కలిగి ఉంటాయి. తన డైరీలో ఒక పేజీలో ‘‘నాకెంతో ప్రియమైన, (బహుశా ఈ సంబోధన భర్తకి అయి ఉంటుంది) నాకంతకంతకూ పిచ్చి ముదురుతున్నట్లుగా ఉంది. ఈసారి కోలుకోవటం కష్టమేనేమో. నాకు ఏకాగ్రత నిలవడం లేదు. నా జీవితంలో అత్యంత గొప్ప ఆనందాన్ని నాకిచ్చావు. నాతో చాలా ఓర్పుగా ఉన్నావు. నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. నావల్ల నీ సంతోషం కూడా పాడైపోతోంది.’’ అని ముగించి మరునాడు ఆత్మహత్య చేసుకుంది. చాలా పేరుగాంచిన రచయిత్రి డైరీల్లో ఇది విలక్షణమైన స్థానాన్ని పొందింది. ప్రముఖ డైరీలూ - డైరిస్టులు 1908లో హెమింగ్వే ఒలివర్ వెండెల్ హోమ్స్ ఎలిమెంటరీ స్కూల్‌కు హాజరైనప్పుడు డైరీలో ‘‘నేను 1899 జూలై 21న జన్మించాను. నా అభిమాన రచయితలు కిప్లింగ్, ఓ. హెన్రీ, స్టీవర్ట్ ఎడ్వర్డ్‌వైట్. నా ఇష్టమైన పూలు లేడీ స్లిప్పర్, టైగర్ లిల్లీ. నా ఇష్టమైన క్రీడలు ట్రౌట్ ఫిషింగ్, హైకింగ్, షూటింగ్, ఫుట్‌బాల్, బాక్సింగ్. నా అభిమాన అధ్యయనాలు ఇంగ్లీష్, జువాలజీ, కెమిస్ట్రీ. నాకు ప్రయాణాలు చేయడమన్నా, రాయడమన్నా చాలా ఇష్టం’’ అని తన తొమ్మిదేళ్ల వయసులో రాశాడు. అతను చనిపోయేంత వరకూ ఈ హాబీలను మానుకోలేకపోయాడు. ప్రస్తుత చెక్ రిపబ్లిక్‌కి చెందిన ఫ్రాంజ్ కాఫ్కా తన 1910-1923 డైరీల్లో ఎన్నో ఉద్వేగపూరిత తత్వ ఆలోచనలూ, ప్రకటనలు చేశాడు. మనుషులతో కలిసి ఉండలేనితనం, మాట్లాడలేకపోవడం, తన భయాలు, హాస్య ప్రియత్వం, సృజనాత్మకత, అన్నీ తన గురించి తాను ఎవ్వరికీ చెప్పనివన్నీ ఇందులో నిబద్ధతతో రాసుకున్నాడు. ఆయనో పేరుపొందిన ఆధునికవాద రచయత.

7/22/45 డైరీలో ‘‘ఆయన (స్టాలిన్) 7/21/45న విందు వద్ద రహస్యంగా నాతో మాట్లాడారు. అన్నీ సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. కొన్ని అంగీకారాలు, మరికొన్ని కాదు. అయితే నేను ఇప్పటికే ఏమి ఆశిస్తున్నానో క్లియర్‌గా ఉన్నాను. నేను కొన్ని రోజుల్లో అన్నీ తేలిపోతాయని ఆశిస్తున్నాను’’ అని రాసుకున్నాడు. ఇది ఒక అణు బాంబు జపాన్‌లో వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ట్రూమాన్ రాసుకున్న డైరీ. విస్మరిస్తున్నామెందుకు? ప్రసార మాధ్యమాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు రాయడాన్ని తగ్గించివేశాయి. అలానే డైరీ రాయడం మీద కూడా. అంత తీరిగ్గా ఓపిగ్గా రాయడానికి ఎవ్వరూ సమయం కేటాయించడం లేదు. బహుశా ఫేస్‌బుక్, వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక అన్నీ అక్కడే నిక్షిప్తం అయిపోతున్నాయి. నువ్వెక్కడికి వెళ్తున్నావ్, ఎం తింటున్నావ్, ఏ సినిమా చూస్తున్నావ్.. అన్నీ ఫేస్‌బుక్కే. ఇలా అదొక విలుప్తమైన కళగా మిగిలిపోయింది. అయితే ఎన్ని ఎలక్ట్రానిక్ సాధనాలు వచ్చినా గానీ డైరీ పరిమళం డైరీదే. సెల్: 9963482597

నా డైరీలో సంగతులు
chidambara-diaryనాకు చిన్నప్పటి నుంచి రచయిత కావాలని కోరిక ఉండేది. అయితే అనారోగ్య కారణంగా బయటికి వెళ్లలేక ఎవర్ని కలవాలో ఏ రకమైన రచనలు చేయాల్నో తెలియక అలా అలా అక్షరాలు పేర్చేవాడిని. అవి ‘భారతి’ మాసపత్రికలో కొన్ని వచ్చాయి కూడా. అటువంటి స్థితిలో నేను డైరీలో రాసుకున్న విషయాలు... 1983 ఫిబ్రవరి 10: ‘‘ఉపాధ్యాయుడెట్టివాడైతే విద్యార్థులట్టి వారయితారన్న పెద్దల వాక్కు ఈ రోజు గుర్తుకొచ్చింది. ఎందుకంటే 4వ తరగతి ప్రసన్న నాలా రచయిత కావాలని ‘రాము అండ్ హిజ్ గ్రాండ్‌ఫాదర్’ అన్న చిన్న కథ వ్రాసి ప్రచురణకు పంపవలసిందిగా ఇచ్చాడు. చదివి చాలా సంతోషమైంది. కొన్ని మార్పులు చేసి పత్రికకు పంపాలనుకొన్నాను. ఎన్నాళ్లనుంచో మరిచిపోయిన మిత్రుడు బాలరాజు నా రచనల గురించి చదివి పుస్తకం పంపమన్నాడు (అంతకు ముందు సంవత్సరం ప్రచురించిన ‘భావనాపల్లవం’ కవిత్వం). మాధవనాయుడు కూడా 25 పుస్తకాలు చిన్మయ విద్యాలయానికి పంపమని చెప్పి పంపినాడు. బీయీడీ రిజల్టు కనుక్కుందామని ఓబయ్య దగ్గరకు సేవామందిర్‌కు వెళ్లాను. లాభము లేదు. మిల్లు దగ్గర లక్ష్మణరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం 6.40 నిమిషాలకు కిరికెట టెంటులో ‘ఆకలి రాజ్యం’కు వచ్చాను. గేటు దగ్గర ఆస్తమాతో బాధపడుతున్న అబ్బాయిని చూడలేక చాలా మధనపడ్డాను. ఆ అబ్బాయిని అందరూ చీదరించుకుంటున్నారు. పాపం నా జేబులో మాత్రలు కూడా లేవు.’’ (నేను నా ఏడెనిమిదేళ్ల వయస్సు నుంచి ఊపిరితిత్తుల జబ్బుతో పడిన ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. గత నెల ఆవిష్కరణ జరిగిన ‘బతుకు వెతుకులాట’ (నా బయోగ్రఫీ)లో దాని తీవ్రతను చెప్పాను.) ఫిబ్రవరి 11: ‘‘ఆంధ్రప్రభ నుంచి వాపసు వచ్చిన కవితలు చూసి బాధ కలిగింది. కొంచెము మార్చి ‘ఉగాది రూపం’, ‘హృదయ ఘోష!’ అన్న రెండు మినీ కవితలు జ్యోతికి ఉగాదికే పంపాను. ఈ రోజు శివరాత్రి. అందరూ జాగారం చేస్తున్నారు. నాకు నైతిక విలువలు మించి అలాంటి విషయాలపై ప్రేమ తక్కువ! కథను గూర్చిన భావన మనస్సులో మెదలుతూ ఉంది. అయినా అక్షరరూపం దాల్చడం లేదు. గొప్ప రచయితగాను, కార్టూనిష్టుగాను, కవిగాను, మంచి ఉపాధ్యాయుడిగాను పేరు పొందాలనే తపన రోజు రోజుకూ హెచ్చవుతూ ఉంది.’’ (నా జబ్బుకు నేను తినే మాత్రల వల్ల చేయి సరిగా కంట్రోలుకు రాక ఒకటి రెండు కార్టూన్లు మాత్రమే వేసి మానుకొన్నాను. మిగిలిన ప్రక్రియల్లో నా ప్రత్యేకతను చాటుకొన్నానని ధైర్యంగా చెప్పగలను.) సడ్లపల్లె చిదంబరరెడ్డి (‘బతుకు వెతుకులాట’ రచయిత) సెల్: 9440073636

‘అంత ఫూలిష్‌గా రాసానా!’
రావిశాస్త్రి (1922-1993) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన కథలు, నాటికలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ‘అల్పజీవి’, ‘రత్తాలు రాంబాబు’, ‘ఆరు సారా కథలు’, ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’ వంటి ప్రఖ్యాత రచనలు ఆయన చేసినవే. రావిశాస్త్రికి కూడా డైరీ రాసే అలవాటుంది. ఆయన డైరీలను ‘దినచర్య’ పేరుతో ప్రచురించారు. 1935 సెప్టెంబర్ నుంచి 1941 జూలై 9 వరకు ఆయన రాసుకున్న డైరీలు ఇందులో ఉన్నాయి. 1937 ఆగస్టు 5వ తేదీ నోటింగ్‌లో ‘‘నిన్న రాత్రి యూత్ లీగ్‌లో చాలా పెద్ద దెబ్బలాటయిపోయిందట. ఈ హార్బరుని మూడొంతులు నావెల్ బేస్‌గా చేస్తారు. ఇవ్వాళో రేపో కమాండర్ ఇన్ చీఫ్ వస్తాడు. నేను యూత్ లీగ్ మెంబర్‌గా చేరాను’’ అని రాసుకున్నారు. 1938 జూన్ 13న ‘‘కంఠాభరణం (పానుగంటి లక్ష్మీనరసింహారావు) చదివేను. బాగానే రాసాడు. చాదస్తాలని, కోమటివాళ్లని ఏకాడు’’ అని రాశారు. అదే ఏడాది అక్టోబర్ 9న ‘‘కిందటేడాది డైరీ తిరగవేస్తుంటే 6 మార్చిలో నేను ఇలా రాసినది కనపడ్డాది - ‘కాంగ్రెసు వాళ్లల్లో అప్పుడే దెబ్బలాటలు పుట్టేయిట. లంజకొడుకులు. ఈసారి ఇండిపెండెంట్‌కి వర్క్ చేస్తాను.’ - అది ఎలాగ ఎందుకు రాసేనో నాకిప్పుడు బోధపడకుండా ఉంది. అంత ఫూలిష్‌గా నేను రాసానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. సాయంత్రం మసాబుగా ఉంది’’ అని రాసుకున్నారు. ఆ నిజాయితీ, నిష్కపట ప్రకటన ఒక్క డైరీల్లోనే మరింతగా సాధ్యపడుతుందనడంలో ఈ డైరీ ఒక నిదర్శనం.పెళ్లైన తర్వాత..

Updated By ManamSun, 09/30/2018 - 06:28

imageసహజీవన కాలమిది. పెళ్లి అనే తంతుపై చర్చ జరుగుతున్న కాలమిది. ఓవైపు గృహహింస వేధింపుల కేసులు, మరోవైపు విడాకుల కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న కాలమిది. అస్తిత్వ సమస్య ఉధృతమవుతున్న కాలమిది. అదిగో.. అలాంటి కాలంలో పెళ్లయిన తర్వాత ఇద్దరు స్త్రీ పురుషుల సామాజిక జీవితం ఎలాంటి మార్పుకు గురవుతున్నదనే విషయం చర్చించడం ఎందుకు? ఎందుకంటే ఆ చర్చ ఇప్పుడే అవసరం గనుక. కుటుంబం చుట్టూ పెనవేసుకుపోయిన వ్యక్తి జీవితం రోజురోజుకూ మారుతున్న విలువలతో అతలాకుతలం అవుతున్నది గనుక. పాత బంధాలు తగ్గి, కొత్త బంధాలు పెరిగే సమయం గనుక. ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకోవాలి.

పెళ్లయి దాదాపు ఆరేళ్లయింది. పెళ్లయిత తర్వాత నా సోషల్ లైఫ్ పూర్తిగా మారింది. పెళ్లికాక ముందు ఫ్రెండ్స్‌తో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్లేవాడ్ని. ఫోన్ చేసి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలిసేవాడ్ని. మేం కాసేపు కూర్చొని, టీ తాగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. సినిమాలకు వెళ్లేవాళ్లం, హోటల్‌కు వెళ్లి భోంచేసి వచ్చేవాళ్లం. పెళ్లయ్యూక ప్రతిదీ కష్టంగా మారింది. ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే, ఏదో సాకు చేసి తప్పించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే, అలా వెళ్తానంటే నా భార్య అలుగుతోంది. ఏదో ఒక పనిచెప్పి, నేను ఫ్రెండ్ దగ్గరకు వెళ్లడాన్ని అడ్డుకుంటోంది. పెళ్లి తర్వాత నా సోషల్ లైఫ్ ఇబ్బందికరంగా తయారయింది. ఈ పరిస్థితిని జీర్ణం చేసుకోవడానికి నాకు కొంత సమయుం పట్టింది. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లో కొత్తవాళ్లు వచ్చి చేరారు. వారిలో ఎక్కువ మంది నా భార్య తరపు బంధువులే. నేను ఎదురు చూస్తున్న కొత్త సినిమా వస్తుంది. కానీ నా భార్యకు అది చూడ్డం ఇష్టం ఉండదు. దాంతో నేను నా క్లోజ్ ఫ్రెండ్‌తో వెళ్లి ఆ సినిమా చూస్తాను. నా భార్య ఏమనుకున్నా నేను పట్టించుకోవట్లేదు.’’.. ఇవి చంద్రశేఖర్ అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడి మాటలు. చాలా మంది ఇదే తరహాలోనో, దీనికి దగ్గరగానో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
 

image


మార్పు సహజం
పెళ్లయిన తర్వాత మన జీవితం అకస్మాత్తుగా మారిపోతుందనేది నిజం. ఒక జంటకు పెళ్లయినప్పుడు, అప్పటి దాకా వాళ్ల జీవితంలో కేంద్రంగా, కీలకంగా ఉన్న వ్యక్తులు స్థానభ్రంశం చెందుతారు. భార్యతో జీవితం మెుదలయ్యూక ఆమెతో అనుబంధం మెుదటి స్థానం ఆక్రమించి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులతో అనుబంధాలు సెకండరీ అవుతారు. మన ఒక్కరి జీవితమే కాదు, మన తల్లిదండ్రుల జీవితాలైనా, మన తాతల, అమ్మమ్మల జీవితాలైనా అంతే.

భిన్న వాతావరణాలు, అలవాట్లు, ఆచారాల మధ్య పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరిట జంటగా కలిసి జీవించాల్సి వచ్చినప్పుడు, వాళ్లు తమ మధ్య బ్యాలెన్స్‌ను సాధించడానికీ, పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికీ ప్రయుత్నిస్తారు. అదివరకెన్నడూ లేని రీతిలో సర్దుబాట్లు చేసుకుంటారు, రాజీ పడతారు. ఈ క్రమంలో, తమ సొంత అస్తిత్వాన్ని పునర్మించుకోడానికి ప్రయత్నిస్తారు, మనుషులుగా వికాసం చెందుతారు. ఇలాంటి నేపథ్యంలో, మనుషులు మారడం ఆశ్చర్యం కలిగించదు.

పెళ్లయిన తర్వాత నుంచీ, మీ సన్నిహిత స్నేహితులు సైతం మిమ్మల్ని దూరంగా పెట్టేస్తున్నారని అనిపిస్తుండవచ్చు. వాళ్ల సమావేశాలకు మిమ్మల్ని అరుదుగా పిలుస్తుండి ఉంటారు. స్నేహితుల నుంచి చాలా అరుదుగా మాత్రమే మీకు ఫోన్లు వస్తుండి ఉంటారు. మీ స్నేహితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చాలా చాలా ఆలస్యంగా మీకు తెలుస్తుండి ఉంటారు. ఇలాంటిది నిజంగానే మీ విషయంలో జరుగుతున్నట్లయితే, ఎందుకిలా పరిస్థితులు మారిపోయాయనే విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కసారి దీని గురించి సావకాశంగా ఆలోచిస్తే, విషయం మీకే బోధపడుతుంది. మారింది మీ స్నేహితులు కాదు, పెళ్లయ్యూక మీరే మారిపోయారనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీ ప్రాధాన్యాలు మారాయనీ, మీ ఫోకస్ అంతా మీ భార్య మీదకూ, కొత్తగా ఏర్పడిన కుటుంబం మీదకూ, కొత్త అనుబంధాల వైపూ మళ్లిందనీ, ఇదెంతో క్లిష్టమైనదే కాక, సున్నితమైన విషయమనీ మీకు అర్థమవుతుంది.
ఇది మీ భార్య మీకు ప్రధాన స్నేహితురాలు కావడమే కాకుండా, ఎక్కువ సమయం ఆమెతోనే గడపడం వల్ల కలిగిన మార్పు. ఆమె లేకపోతే, మీరు ఒంటరి అవుతారు. ఐనప్పటికీ, మీ చిన్ననాటి స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్లను చూడాలనీ, కలుసుకోవాలనీ మీకు అనిపిస్తుంటుంది. కానీ ఎక్కువ సమయం ‘ఫ్రెండ్’ పాత్రనూ, అదే సమయంలో ‘భార్య’ ప్రాతనూ ఆమె భర్తీ చేస్తుంటుంది.

స్నేహితుల సర్కిల్ మారుతుంది
imageపెళ్లికి ముందు మీ స్నేహితులతో మంచి అనుబంధాన్ని మీరు కొనసాగిస్తూ వస్తారు. ఎందుకంటే ప్రతి రోజూ వాళ్లను కలుసుకుంటారు, వాళ్లతో మాట్లాడుతుంటారు, ముఖ్యమైన విషయాల్ని వాళ్లతో పంచుకుని, చర్చిస్తుంటారు. అయిుతే పెళ్లి ఒక వ్యక్తి సామాజిక స్థాయిని మార్చేస్తుంది. బహుశా వాళ్లు సింగిల్ ఫ్రెండ్‌తో కాకుండా, ఇతర పెళ్లయిన  జంటలతో స్నేహాన్ని కలుపుకోవడం వల్ల కావచ్చు. జీవిత భాగస్వాములకు వాళ్ల వాళ్ల భిన్నమైన స్నేహ బృందాలు ఉంటారు. ఒకరి ఫ్రెండ్‌తో మరొకరు కలివిడిగా ఉండలేరు. పెళ్లయ్యాక సామాజిక బంధాలు మారడానికి ఇదే ప్రధాన కారణం.

సింగిల్‌గా ఉండేవాళ్లు కుటుంబానికంటే స్నేహితులతోటే ఎక్కువ కాలం గడుపుతుంటారని అధ్యయునాలు తెలుపుతున్నారు. ఒకసారి పెళ్లయితే, సీన్ రివర్సవుతుంది. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, స్నేహితులతో తక్కువ టైమ్ గడిపి, ఇంట్లోవాళ్లతో ఎక్కువసేపు గడుపుతాం. వివాహమనే కంచె ఏర్పాటైన తర్వాత నుంచీ, మనం స్థానికంగా ఉన్నా, ఇంకెక్కిడికైనా వెళ్లినా స్నేహ బంధాల్ని మునుపటిలా కొనసాగించడం కష్టమవుతుంది.
పెళ్లరుున కొద్ది సంవత్సరాల వరకూ చాలా మంది దంపతులకు ఇలాంటి స్థితే ఎదురవుతుంది. ఒకర్ని మనం పెళ్లాడామంటే, మన జీవిత భాగస్వామితోటే ఎక్కువ సమయుం గడపాలని కోరుకుంటాం. హనీమూన్ కాలం గడిచి, దాంపత్యంలోని కొత్తదనం పోయి, వాస్తవ లోకంలోకి వచ్చినాక, పెళ్లికి ముందు మనం ఎవరితో మంచి అనుబంధాలు నెలకొల్పుకొని ఉన్నామో, ఆ వ్యక్తులతో అనుబంధం కొనసాగించడం ఎంత ముఖ్యమో తెలిసి వస్తుంది. వైవాహిక బంధం కఠినంగా అనిపించినప్పుడు మాత్రమే చాలా మంది ఇతరుల సహాయుం కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి పెళ్లికి ముందు మనకి స్నేహితులు ఎంత ముఖ్యమో, తర్వాత కూడా వాళ్లు అంతే ముఖ్యమని మనం గుర్తించాలి. యువతీ యువకులు పెళ్లి చేసుకున్నాక, కొన్ని నెలల వరకు ఒకరిపై ఒకరు ఎక్కువ ఫోకస్ పెట్టడం సాధారణమే. అలాగే మునుపటి స్నేహితులతో గడపడం బాగా తగ్గిపోతుంది. ఇది మనం ఉద్దేశపూర్వకంగా చేయుకపోయినప్పటికీ, ఒక గీత ఏదో మనల్ని స్నేహితుల నుంచి దూరం చేస్తుంది.

ఘర్షణ వద్దు
ఒక చిన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెళ్లయ్యూక మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మారతారు.image అవే కాదు, మనం కూడా మారతాం. జీవితంలో అనేక అంశాలు మారిపోయూక, పరిస్థితులు ఇదివరకు మాదిరిగానే ఉండాలని ఆశిస్తే, అది సాధ్యం కాదు. తమ అనుబంధం వెలుపల స్నేహం విషయూనికి వచ్చేసరికి దంపతులు తరచూ ఒత్తిడికి గురవుతుంటారు. సోషల్‌గా ఉండాలనే ఉద్దేశంతో దంపతుల్లో ఒకరు ఇతరులతో కలవాలనీ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలనీ భావిస్తే, మరొకరు అలాంటివాటికి దూరంగా ఉండి, తమతో సమయూన్ని గడపాలని ఆశిస్తారు. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తుతుంది. అందుకని పరస్పరం తమలోని వైరుధ్యాల్ని అర్ధం చేసుకుంటూ, తమ అనుబంధంలోని స్నేహాన్ని మెరుగుపర్చుకుంటూ, ఇతరులతో స్నేహాల్ని వృద్ధి చేసుకోవాలి.

మీ సమయాన్నంతా జీవిత భాగస్వామికే కేటాయిస్తూ, మీరు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా మీ భాగస్వామి కేంద్రంగానే మాట్లాడుతుంటే, మీరు మీ సొంత అస్తిత్వాన్ని కోల్పోతున్నారని అర్థం. మిమ్మల్ని ప్రేమించే స్నేహితుల్ని పెళ్లయ్యూక విస్మరించడం సరైన పని కాదు. అలాగే వాళ్లతో ఉన్నప్పుడు మీ భాగస్వామి గురించే ముగింపులేకుండా మాట్లాడుతూ వాళ్లను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు.

రెండు దశాబ్దాల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న ఓ జంట, ఈ ఏడాదే వేసవిలో పెళ్లిపేరుతో ఒక్కటైన ఇంకో జంట.. రెండు భిన్న తరాల ప్రతినిధులు.. పెళ్లయ్యాక తమ జీవితంలో కలిగిన మార్పుల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం...


పాత స్నేహితులు కలుస్తున్నారు
imageమా పెళ్లయి దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచాయి. పెళ్లవగానే స్వతంత్రం కోల్పోతామని అంటుంటారు చాలామంది. కానీ పెళ్లికి మునుపు పుట్టింటిలో చాలా క్రమశిక్షణ అమలుకావడంతో, వివాహం తరువాతే నాకు రెక్కలొచ్చాయి. పెళ్లి తరువాత రెండు పీజీలు, బీఈడీ చేసి చదువుకోవాలనే కోరిక తీర్చుకున్నాను. స్నేహితులతో హాయిగా కలిసేదాన్ని. ఆ తరువాత అందరు పిల్లల పెంపకం, జీవితంలో కుదురుకోవడంలో తలమునకలవడంతో కలవడం తగ్గింది. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి, అంతర్జాలం పుణ్యమా అని అందరితో సమయం గడపడానికి, మాట్లాడుకోవడానికి తీరిక చిక్కింది. ఇక అత్తగారింట్లో ఉమ్మడికుటుంబం కావడంతో అందరితో బాగా కలిసిపోయి తిరిగి మెప్పించడం కత్తి మీద సామే. నేను ఎవరు ఏమన్నా మౌనంగానే ఉంటూ అందరినీ నా నడవడికతో మెప్పించాను. వారి కుటుంబ సభ్యులతో బావుంటే, భర్తకు కూడా ఆనందమే కదా. అలా మావారి మనసు గెలుచుకున్నాను. ఇప్పుడు మాత్రం మావారి వైపు వారందరూ ఏ సమస్య వచ్చినా నా దగ్గరకే సహాయం కోసం పరుగెత్తుకుని వస్తారు. అలాగని పుట్టింటి వారినీ అశ్రద్ధ చెయ్యకుండా, వారికి కూడా అండదండగా నిలిచాను. మావారు కూడా నా వైపు వారిని తన వారిలాగే అభిమానించడం, వారి బాధ్యతలను ఆయన కూడా స్వీకరించడం వల్ల మా సంసారపునౌక ప్రశాంతంగా సాగింది. వివాహం తరువాత మరో ఇంట్లో అడుగు మోపినపుడు అక్కడ పరిచయం లేని వారి అలవాట్లకి, అభిరుచులకి, మన ఇష్టాలకి తప్పకుండా తేడా ఉండకుండా పోదు. అలాంటప్పుడు వారికి నచ్చనివి కొన్ని వదులుకుంటూ, మన ఇష్టాయిష్టాలను కొన్ని నెమ్మదిగా వివరిస్తే వారు కూడా మనకు అనుకూలంగా మారిపోతారు. ఇప్పుడు పిల్లలు పెద్దయిపోయి చదువులలో ఉద్యోగాలలో వారు బిజీ అయిపోయాక, ఇప్పుడు మళ్లీ పాత స్నేహితులను కలవడానికి తీరిక దొరికింది. ఎవరు ఊర్లోకి వచ్చినా అందరం కలిసి కాసేపు కష్టసుఖాలు కలబోసుకుంటూ ఆనందంగా గడుపుతాం. ఈ వయసులో ఇప్పుడు మానసిక పరిపక్వత వచ్చింది కాబట్టి, పిల్లలకు మా జీవితానుభవాలను వివరిస్తూ, వారి చదువుల విషయంలోనే కాక  మిగిలిన అన్ని విషయాలలో చిన్ననాటి స్నేహితుల సలహాలు, సూచనలు తీసుకుని ధైర్యంగా ముందుకు వెడుతున్నాం.

- ఆర్. పద్మావతి

ఒకరిళ్లకు ఒకరం వెళ్తుంటాం
imageపద్మావతి మా ఇంట్లోకి వచ్చాక కొంచం అవస్థలు పడినా, అన్నీ సహనంతో భరించింది. నా వాళ్లని తన వారిలాగే ఆదరించేది. మా పెద్దన్నయ్య పోవడంతో, ఆ పిల్లలకు కూడా తనే అమ్మగా మారి, వారి బాధ్యతలను తన నెత్తిన వేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లింది. వారి చదువులు, పెళ్లిళ్లు కూడా తన చేతుల మీదే సాగాయి. ఏ పని చేసిన ఇద్దరమూ చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాం. స్నేహితులలో ముందు నాకే పెళ్లి కావడంతో, కొత్తల్లో వాళ్లతో తిరిగి ఆలస్యంగా ఇంటికి వచ్చినా తను ఏమి అనేది కాదు. ఆ తరువాత ఇక అన్నిటికి స్వస్తి చెప్పి, బాధ్యతతో నేను ముందుకు సాగాను. తను ఎవరిని పల్లెత్తు మాట అనేది కాదు. ఎవరైనా ఏమైనా అన్నా మౌనంగా ఊరుకునేది. ఆ తరువాత తనను ఇంట్లో అందరు ఇష్టపడుతూ వచ్చారనే కన్నా తన ప్రవర్తనతో వారిని ఆకట్టుకుందని చెప్పొచ్చు. అన్నయ్య పిల్లలే కాక, అమ్మానాన్నలు కూడా తన మాటకు విలువ ఇచ్చేవారు. ఒకరకంగా మగవాళ్లకు వివాహం తరువాత తమ అలవాట్లను మార్చుకోవలసిన పని ఉండదు. ఎందుకంటే తమ ఇంట్లో తాము ఉంటారు కాబట్టి. కాని అమ్మాయిలు కొత్త ప్రదేశంలో కొత్త మనుషులతో సర్దుకుపోతూ, వారికి తగ్గట్టు తాము మారడం కాస్త కష్టంతో కూడుకున్న విషయమే. ఇక ఉమ్మడి కుటుంబం అయితే మరీ శ్రమ అయిపోతుంది. తనే ముందుకు వచ్చి అన్నీ సమర్థవంతంగా నిర్వహించేది. ఎవరయినా ఒక మాట అన్నా తను తిరిగి జవాబు చెప్పేది కాదు. అలాగని నాకు కూడా ఫిర్యాదు చేసేది కాదు. అందుకే సుమారు ఇరవై ఏళ్ల మా ప్రయాణం ఏ పొరపొచ్చాలు లేకుండా హాయిగా సాగిపోయింది. అలాగే నా భార్య వైపు కుటుంబాన్ని కూడా నా బాధ్యతే అనుకుని, నేనే వారికి కొడుకులా మెలిగాను. పెళ్లంటే రెండు కుటుంబాల కలయికే కదా.
ఇక ఇప్పుడు ఈ వయసులో పిల్లలు పెద్దవాళ్లయిపోయాక కాస్త ఊపిరిపీల్చుకునే తీరిక చిక్కి, చిన్ననాటి నేస్తాలతో కబుర్లు కలబోసుకుంటూ, వినోదాలలో, వేడుకలలో కాసేపు సేద తీరుతుంటే జీవితాన్ని ఈదిన అలసట తీరుతుంటుంది. స్నేహితుల కుటుంబాలన్నీ కలిసి ఈ మధ్యనే తిరుపతి వెళ్లి నాలుగు రోజులు గడిపి దర్శనం చేసుకుని వచ్చాం. ఖాళీ దొరికితే చాలు ఒకరింటికి ఒకరు వెడుతుంటాం. లేకపోతే ఫోన్‌లోనైనా తప్పక రోజూ పలకరించుకుంటాం. 
- ఆర్. ప్రసాద్

నేనే మహారాణిని
imageఈ మేలోనే మా పెళ్లయింది. పెళ్లికి ముందు స్నేహితుల్ని ఫ్రీక్వెంట్‌గా కలుసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లేదాన్ని. చదువు తర్వాత వాళ్లకూ పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో కలవడం తగ్గిపోయింది. అందువల్ల ఫ్రెండ్స్‌ని కలవలేకపోతున్నాననే కంప్లయింట్స్ లేవు నాకు. ఇప్పుడు పెళ్లయ్యాక హైదరాబాద్ నుంచి వారు సింగ్రావ్‌లీ జిల్లా, మధ్యప్రదేశ్ కు రావాల్సి వచ్చింది. అక్కడ్నుంచి సగం రోజు ప్రయూణం. ఇక్కడి రిలయన్స్ పవర్ ప్లాంట్‌లో మావారు ఆపరేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తెలియని ప్రదేశం, తెలియని మనుషులు. అంతా కొత్త. పైగా ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్. ఇక్కడింకా నాకెవరూ ఫ్రెండ్స్ కాలేదు. చుట్టుపక్కల తెలుగువాళ్లు ఉన్నా, ఇంకా సరిగా పరిచయం కాలేదు. హైదరాబాద్‌లో అయితే ఒక్కదాన్నే స్కూటర్ మీద ఎక్కడికైనా వెళ్లిపోయేదాన్ని. కిశోర్ డ్యూటీకి వెళ్తే ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నా. ఇంటి పనులు చూసుకుంటూ, పీహెచ్‌డీకి సంబంధించిన వర్క్ ప్లాన్ చేసుకుంటున్నా. ఎంఫార్మసీ చేశాను కాబట్టి, ఆ సబ్జెక్టులోనే పీహెచ్‌డీకి ప్రయత్నిస్తున్నా. తను కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మానాన్నలు చాలా దూరంగా ఉండటం తలచుకుంటుంటే బాధగా అనిపిస్తోంది. కానీ ఉండక తప్పదు. బాధను అణచుకుంటున్నా. కాపురానికి వచ్చేటప్పుడు అమ్మావాళ్లు ఏడవలేదు కానీ నేను మాత్రం తెగ ఏడ్చేశాను. అమ్మానాన్నలకు, తమ్ముడికి దూరమైపోతున్నాననే ఫీలింగ్ వచ్చేసింది. 
ఇప్పుడు ప్రయూరిటీలు పూర్తిగా మారిపోయాయి. పెళ్లయ్యాక అమ్మానాన్నల కంటే అత్తామామలకే మెుదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నిజానికి మా అత్తయ్యవాళ్లు నన్ను కూతురిలా చూసుకుంటున్నారు. చాలా విలువ ఇస్తున్నారు. వాళ్లింట్లోనూ మా ఇంట్లో ఉన్నంత ఫ్రీగానే ఉండగలిగాను. కిశోర్ నన్ను కష్టపెట్టకూడదన్నట్లుగా మసలుకుంటుంటారు. మా వాళ్లందర్నీ వదిలి చాలా దూరం తన వద్దకు వచ్చానని బాగా చూసుకుంటారు. నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. మా అమ్మానాన్నల్ని బాగా గౌరవిస్తారు. కిశోర్ సోషల్ యూక్టివిటీస్ కూడా చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లరుున అమ్మారుులు అత్తవారింటికి వెళ్లాక, అమ్మకు ఫోన్ చేసి అత్తవాళ్ల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. దీనివల్ల రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుండటం చాలానే గమనిస్తున్నా. వాటి నుంచి నేను నేర్చుకున్నది.. అక్కడి విషయాలు ఇక్కడా, ఇక్కడి విషయాలు అక్కడా చెప్పకూడదని. అయితే మా అత్తయ్యవాళ్లింట్లో ఇప్పటివరకూ నాకెలాంటి నెగటివ్ విషయాలు కనిపించలేదు. ఇక్కడ మంంచి పని ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్లెరూ లేరు. ఇక్కడ నేనే మహారాణిని అన్నట్లుగా ఉంది.
- నాగరేవతి

త్వరగా కలిసిపోయింది
imageమెుదట్నించీ నాకు ఒంటరితనం అలవాటు. స్కూలు రోజుల నుంచీ నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. పాలిటెక్నిక్, బీటెక్, ఎంబీఏ చదివి రిలయున్స్ పవర్ ప్లాంట్‌లో ఆపరేషనల్ మేనేజర్‌గా చేస్తున్నా. మరోవైపు డిస్టెన్స్‌లో ఎంటెక్ చేస్తున్నా. ఇస్కాన్ ఫాలోయుర్‌ని. చదువుకు నాన్న నుంచి ఆర్థిక సాయుం తీసుకున్నానే కానీ, ఇండివిడ్యువల్‌గానే ఎదుగుతూ వచ్చా. ఎక్కువ కాలం అమ్మానాన్నలకు దూరంగా ఉండటం వల్ల వాళ్లతో అటాచ్‌మెంట్ తక్కువనే చెప్పాలి. ఫ్రెండ్స్ అరుుతే ఎక్కువే ఉన్నారు. వాళ్లలో ఎక్కువమంది చత్తీస్‌గఢ్ ఏరియాకు చెందినవాళ్లు. అయితే మెుదట్నించీ బయుటకు వెళ్లి తిరగడం తక్కువే నాకు.
బిలాస్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ఇస్కాన్‌కు తీసుకెళ్లాడు. ఆ భావాలు, ఆ వాతావరణం నాకు నచ్చాయి. తర్వాత కోల్‌కతాలోని మాయూపూర్‌లో ఉన్న ఇస్కాన్ ఆశ్రమంలో కొద్ది రోజులు గడిపొచ్చాను. అందువల్ల పెళ్లయితే వచ్చినవాళ్లు నన్నెలా అర్థం చేసుకుంటారోననే చిన్న ఆందోళన ఉండేది. రేవతి నా జీవితంలోకి వచ్చాక అది అర్థం లేనిదనిపించింది. నేను ఊహించిన దానికన్నా నన్ను బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు నాకూ ఒక ఫ్యామిలీ ఉందనే ధైర్యం వచ్చింది. ఇద్దరం కలిసి యోగా, మెడిటేషన్ చేస్తున్నాం. నేను నా జపం గురించి చెబుతుంటే, తన మెడిటేషన్ టెక్నిక్స్ నాకు నేర్పిస్తుంటుంది. నా ఫ్రెండ్స్‌ను తను గౌరవించడం నాకు నచ్చింది. అమెరికాలో ఉంటున్న తన ఫ్రెండ్స్ ఎవరైనా అర్ధరాత్రుళ్లు ఫోన్ చేస్తుంటారు. తను మళ్లీ మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తుంది, నాకు డిస్టర్బెన్స్‌గా ఉండకూడదని. నేను ఫర్వాలేదు, మాట్లాడమన్నా.. ఇప్పుడు కాదులే, పొద్దున్నే మాట్లాడతానని నవ్వేస్తుంది. 
తను మా అమ్మానాన్నలను బాగా గౌరవిస్తుంది. వాళ్లకు తనమీద మంచి నమ్మకం ఏర్పడింది. మంచి కోడలు వచ్చిందని హ్యాపీగా ఉన్నారు. మాది గుంటూరు జిల్లా దాచేపల్లి అయినా మా నాన్న ఉద్యోగరీత్యా నేను పుట్టినప్పట్నించీ ఆంధ్రాలో కాకుండా చత్తీస్‌గఢ్‌లోనే పెరిగాను, చదివాను. అందువల్ల మనవాళ్ల ఆచార వ్యవహారాలు అంతగా తెలీదు. రేవతి ఎలా సర్దుకుపోతుందో అనుకున్నా కానీ, తను చాలా త్వరగా కలిసిపోయింది. తన వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా.
- కిశోర్ తేజస్వితెర వెనుక కూడా!

Updated By ManamSun, 09/30/2018 - 06:10

టీవీ యాక్టర్లు, యాంకర్లు సెలబ్రిటీలుగా చలామణీ అవుతున్న నేటి కాలంలో వారి వ్యక్తిగత జీవితంలోని అంశాలు సంచలన వార్తలుగా తెగ ఆకట్టుకుంటున్నాయి. మీడియాలో వాళ్లకు ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తోంది. దాంతో ప్రారంభోత్సవాలకు హాజరు కావడం మొదలు.. బ్రాండ్ అంబాసిడర్లుగా సందడి చేస్తున్నారు. 

కవర్ స్టోరీలు
రవి-శ్రీముఖి, రేష్మి-సుడిగాలి సుధీర్.. ఈ నాలుగు పేర్లు చాలు - ఇంటర్నెట్‌లో తెలుగు టీవీ యాక్టర్లు, యాంకర్లపై ఏ రేంజ్‌లో ప్రచారం సాగుతోందీ, వాటిని సామాన్యులు ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారో చెప్పేందుకు! ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉండే అన్ని హంగులనూ అద్దుకున్న టీవీ పరిశ్రమ.. రూమర్లను కూడా అందిపుచ్చుకుంది. ఫలానా టీవీ నటుడి విడాకులు, మరో నటితో సహజీవనం, పెళ్లి వంటి విషయాలపై ఇప్పుడు సామాన్యులు క్రేజీగా వ్యవహరిస్తున్నారు. అందుకే వీటిపై టెలీబజ్, టెలీ చక్కర్, టీవీ టైమ్స్, టెలివిజన్ న్యూస్ వంటి ఎన్నో పేర్లతో టీవీ యాక్టర్లపై పోర్టల్స్, బ్లాగ్స్ పుట్టుకొచ్చాయి.

image


అంతేనా! వీరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రైవేటు ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవడం నేటి ట్రెండ్. వీరు వెళ్లే లంచ్, డిన్నర్ డేట్ల వీడియోలు, ఫొటోలు గంటల వ్యవధిలో లక్షల్లో షేర్ అవుతున్నాయి. టీవీ గాసిప్స్ అంటే యువత విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తుండడంతో ఆయా నటులు సెన్సేషనల్ టీవీ స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇటీవలే హీరోయిన్‌గా మారిన బుల్లితెర నటి మౌనీ రాయ్ అన్న పేరును గూగుల్‌లో సర్చ్ చేస్తే.. ఆమెపై పుంఖాను పుంఖాలుగా వచ్చే సమాచారం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అందులో వదంతులే అత్యధికం. ముఖ్యంగా హిందీ టీవీ పరిశ్రమ బాలీవుడ్‌కు సమాంతరంగా అన్ని విషయాల్లోనూ చాలెంజ్ విసురుతోంది. టీవీ స్టార్లు తెరపైన, వెనుక కూడా గ్లామర్ పండిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాను తమవైపుకు తిప్పుకుంటున్నారు.

ఫాలోయర్లు
టీవీ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లకు మిలియన్లలో ఫాలోయర్లు ఉంటున్నారు. సోషల్ మీడియా పేజీలలో వాళ్ల ఫారిన్ టూర్లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్లు, స్టేటస్‌లు నెటిజన్లలో ఆసక్తి పెంచుతున్నాయి. వాళ్లు చేసే ప్రోగ్రాములు ఫాలో అయినా కాకపోయినా వాళ్ల పోస్టులకు అనూహ్యమైన స్పందన లభిస్తుండడం సినీ నటులకు సవాలు విసురుతోంది. తమ లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు రెండూ ఫాలోయర్లతో పంచుకుంటూ, ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటున్నారు. అలాగే ఫొటోషూట్లు, బికినీ క్లాడ్‌లు అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. 

చెలరేగుతున్నారు
ఇక రియాల్టీ షోల్లో వీరి హంగామా అంతా ఇంతా కాదు. ఉదాహరణకు ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో’తో పాపులర్ అయిన భారతి సింగ్ ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం ఖాయం. దానిలో దక్కనున్న పారితోషికం నుంచి, చివరికి డెంగ్యూతో బాధపడుతూ భారతీ సింగ్, హార్ష్ లింబాచియా దంపతులు ఆసుపత్రిపాలు కావడం వరకు అన్నీ క్షణాల్లో వైరల్ అయ్యాయి. తెలుగులోనూ ఇదే తతంగం సాగుతోంది. డ్యాన్స్, మ్యూజిక్, సాహసాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో అతిథులుగా, కంటెస్టెంట్లుగా వీరు దుమ్మురేపుతున్నారు. దీంతో వీరికి చేతినిండా సంపాదన దక్కుతూనే, వ్యక్తిగత పరపతి అంతకంతకూ పెరుగుతోంది. పలు భాషల్లో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్’ షోల్లోనూ టీవీ నటులదే సింహభాగంగా ఉంటోంది. ఇక రియాల్టీ షోల్లో టీవీ నటులు చెలరేగిపోతూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. టీవీ సీరియల్ నటుడు కౌశల్ బిగ్‌బాస్ హౌస్‌లో హల్‌చల్ చేయడం సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.
జూ భార్గవి కరణంప్రపంచాన్ని చుట్టేద్దాం!

Updated By ManamSun, 09/23/2018 - 07:46

పది సంవత్సరాల క్రితం డెన్నిస్ టిటో అనే యు.ఎస్. బహుళ మిలియనీర్ ప్రపంచ మొట్టమొదటి స్పేస్ పర్యాటకాన్ని ఆవిష్కరించాడు. ఉత్సుకతతో అంతరిక్షంలో ఎనిమిది రోజుల యాత్ర చేసి పర్యాటకాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధికి నోచుకొనేట్టుగా చేశాడు. తిరిగి భూమికి రావడం అద్భుత విజయంగా భావించి, ఆయన ‘‘నేను స్వర్గం నుంచి తిరిగివచ్చాను!’’ అనడం ప్రపంచ యాత్రికుల్లో మరింత జిజ్ఞాసను రేపింది. ఇటీవల ప్రముఖ అంతరిక్ష స్పేస్ ఎక్స్ అనే సంస్థ చందమామ చుట్టూ పర్యాటకులను తిప్పేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. జపాన్‌కు చెందిన బిలియనీర్ యుసాకు మేజావాకు చంద్రునిమీద యాత్ర చేసేందుకు అద్భుత అవకాశమివ్వడం ప్రపంచ పర్యాటకంలో మరో మలుపుగా పేర్కొనాలి.

image


యాత్ర, పర్యటన, దేశ సంచారం అనేవి పర్యాయ పదాలు. మనిషి జిజ్ఞాస మేరకు పర్యటన చేసినా విజ్ఞానం, 
లోక జ్ఞానం కోసమేననేదే పరమార్థంగా చెప్పాలి. యాత్రలో వివిధ దేశాల దర్శనం, పవిత్ర తీర్థాల, పుణ్య క్షేత్రాల దర్శనంతో పాటు చారిత్రిక వారసత్వ కట్టడాల దర్శనం మనిషికి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. భూయానం, సముద్రయానం, ఆకాశయానం పర్యటనలో ప్రధానమైన మార్గాలు.

పర్యటన వల్ల ప్రపంచ భాషలు, జాతీయంగా వివిధ రాష్ట్రాల భాషలు, సంస్కృతులు, చరిత్రలు తెలిసి వస్తాయి. మానవీయ బంధాలు పెంపొందించుకోడానికీ, విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందడానికీ చక్కని అవకాశాలు కలుగుతాయి. బౌద్ధ సన్యాసి ఫాహియాన్.. రెండో చంద్రగుప్తుని కాలంలో (క్రీ.పూ. 339) చీనా నుండి కాలినడకన భారత దేశం వచ్చినట్టుగా చరిత్ర చెప్తోంది. సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలే కాకుండా, విజ్ఞానం, కళలు, వ్యక్తిగత లేదా వ్యాపార పరమైన ప్రయోజనాల కోసం సాధారణ పర్యావరణం దాటి దేశ విదేశాలలోని దర్శనీయ స్థలాలకు ప్రజలు  యాత్రగా వెళ్లడంగానే దీన్ని నిర్వచించాలి. ఐతే, పర్యాటకం యావత్తూ పర్యావరణంపై ఆధారపడుతుందనే విషయం గుర్తించుకోవాలి.  

image


చారిత్రక నేపథ్యం
పర్యాటక రంగం మూలాలు మూడు శతాబ్దాల క్రితం కెనడాలో కనిపిస్తున్నాయి. పర్యాటక చరిత్రలో, ఇది ‘పరిచయ దశ’ను సూచిస్తుంది. 1778లో, కెప్టెన్ జేమ్స్ కుక్ వాంకోవర్ ద్వీపంలో మునిగిపోయాడు. తర్వాత 1842లో జేమ్స్ డగ్లస్, హడ్సన్‌కు చెందిన బే కంపెనీకి కొత్త ప్రధాన కార్యాలయాన్ని వెతకటానికి పంపిన ఒక బ్రిటీష్ ఏజెంట్, చివరకు విక్టోరియాను ఎంచుకున్నాడు. 1892 నాటికి కెనడియన్ అయిన బ్రూస్టర్స్ వంటి ఔత్సాహికులు మొట్టమొదటి టూర్ నిర్వాహకులుగా మారడంతో పర్యాటక సంస్కృతి మొదలయింది. బాన్స్ నేషనల్ పార్క్ వంటి ప్రాంతాల్లో ప్రముఖులకు ఆతిథ్యమివ్వడం ద్వారా రవాణా అభివృద్ధి జరిగి కెనడా అంతటా ఉన్న కమ్యూనిటీలు తమ సొంత మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేశాయి. ఉదాహరణకు, క్యుబెక్‌లో ఉన్న మైసన్నేవ్ పట్టణాన్ని 1907 నుంచి 1915 వరకు ‘లీ పిట్స్‌బర్గ్ డ్యువా కెనడా’ అని పిలిచే ఒక ప్రచారం ప్రారంభమైంది. పర్యాటక రంగం ప్రారంభంలో మిన్నెసోట టెన్ థౌజండ్ లేక్స్ అసోసియేషన్ పాత్రను విస్మరించరాదు. మిన్నెసోటా ప్రజలు 1900 ప్రాంతంలో అక్కడి సరస్సు ప్రాంతాన్ని పర్యాటక వనరుగా గుర్తించడం ప్రారంభించారు. 1920వ దశకంలో ప్రభుత్వ ఏజెన్సీలు మిన్నెసోటాకు పర్యాటకులను తీసుకురావడం ప్రారంభించాయి. ఇల్లినాయిస్ నుంచి పర్యాటకుల రవాణాకు 1927లోనే విదేశీ కార్ల అవసరం ఏర్పడింది. గవర్నర్  క్రిస్టెన్సన్, టెన్ థౌజండ్ లేక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోనా రాబర్ట్స్ మే తొలి వారాన్ని పది వేల లేక్స్ వీక్‌గా ప్రకటించాడు. మిన్నెసోటాలో ఉన్న కమ్యూనిటీలు ఆ ప్రాంతాన్ని ప్రపంచ ప్రజలను ఆకర్షించే విధంగా అభివృద్ధి పరిచారు.  

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్‌డబ్ల్యుటీవో) ఆధ్వర్యంలో 1920లో ది హాగ్ (నెదర్లాండ్స్)లో అధికారిక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ‘యానల్స్ ఆఫ్ టూరిజం రీసెర్చ్’ జర్నల్ ప్రారంభ సంచికల నుంచి వచ్చిన కొన్ని కథనాల ప్రభావంతో ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్‌డబ్ల్యుటీవో) అధికారిక పర్యాటక ప్రచార సంస్థల ఇంటర్నేషనల్ యూనియన్ (ఐయూఓటీపీఓ) నుంచి ఉద్భవించింది. ఇప్పటి వరకు జరిగింది పర్యాటక ప్రారంభ దశగానే పేర్కొనాలి. 


1935 నాటికి క్యుబెక్ రాష్ట్రం.. ఒంటారియో, న్యూ బ్రూన్స్‌విక్, నోవా స్కోటియా ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, ప్రాంతీయ పర్యాటక బ్యూరోలు అస్థిత్వంలోకి వచ్చాయి. 1937లో, పర్యాటక రంగాన్ని పెంచే లక్ష్యంతో ప్రత్యేక చట్టం ద్వారా ప్రాంతీయ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిస్ట్ డెవలప్ మెంట్ (బీఐటీడీ) ఏర్పడింది. 1938 నాటికి ఈ సంస్థ తన పేరును బ్రిటిష్ కొలంబియా గవర్నమెంట్ ట్రావెల్ బ్యూరో (బీసీజీటీబీ)గా మార్చింది. నూతన ఇంటర్ గవర్నమెంట్ టూరిజం సంస్థ స్థాపన ఆధారంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 1970లో ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ అఫిషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ (ఐయూఓటీఏ) జనరల్ అసెంబ్లీ ప్రపంచ పర్యాటక సంస్థ (డబ్ల్యుటీవో) ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఆ శాసనాల ఆధారంగా సూచించిన ప్రకారం 51 రాష్ట్రాలు ఆమోదించడంతో అది (డబ్ల్యుటీవో) 1974 నవంబరు 1న అమలులోకి వచ్చింది.  

ప్రపంచ వ్యాప్తం 
పదకొండు వందల సంవత్సరాల క్రితమే పర్యాటక రంగం ప్రారంభమై అనతికాలంలోనే 51 దేశాలలో విస్తరించి, ఆ దేశాలను అభివృద్ధి దశలోకి నెట్టింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో వెలసిన ప్రపంచ పర్యాటక సంస్థ 1970లో పర్యాటక రంగాన్ని గుర్తించినప్పటికీ, 1980వ సంవత్సరం సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవాన్ని జరిపింది. అప్పటి నుంచి అన్ని దేశాలు ఈ పర్యాటక దినాన్ని అధికారికంగా జరుపుకుంటూనే వస్తున్నాయి. ఈ విధంగా జరుపుకోవడం వల్ల ప్రపంచ ప్రజలు చైతన్యవంతులై అభివృద్ధి పథంలో నడుస్తారని అది ఆశించింది. సంస్థ ముఖ్య కార్యదర్శి జురబ్ పోలోలికాష్‌విలి నేతృత్వంలో ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పర్యాటకాన్ని ప్రపంచంలో, అందులో భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నారు.

ఇరవయ్యో శతాబ్దం అర్ధ భాగంలో కొన్ని దేశాల సహకారంతో అమెరికా ప్రపంచ పర్యాటకంలో నూతన విప్లవాన్ని తెచ్చింది. భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, వెనిజులా, టర్కీ, సిరియా దేశాలతో కలిసి, ప్రపంచ పర్యాటక కేంద్రాన్ని రాజధాని నగరం న్యూయార్క్‌లో నెలకొల్పింది. దానికి ఆంటోని గట్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. స్వల్ప కాలంలోనే కాలిఫోర్నియా, శాన్ ప్రాన్సిస్కో పట్టణాల్లో 1945 జూలై 24న ప్రపంచ పర్యాటక దినాన్ని జరిపి ప్రపంచ దేశాలను ఆకర్షించింది.  

భారతదేశంలో పర్యాటకం
భారతదేశంలో సింధులోయ ప్రాచీన నాగరికతకు చిహ్నంగా నిలుస్తోంది. భారతదేశం పర్యాటకానికి అది పురాతన సంప్రదాయంగా మిగిలింది. గంగ, యమున, సరస్వతి లాంటి పుణ్యనదులు ప్రవహించే ఈ భూమిలో దేశ విదేశాల యాత్రికులను ఆకర్షించే అపురూప దర్శనీయ స్థలాలు, చారిత్రక ప్రదేశాలు, దివ్య క్షేత్రాలు అనేకం ఉన్నాయి. 
ఆధునిక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న భారతదేశాన్ని సందర్శించే విదేశీయుల ద్వారా పర్యాటకం పరిఢవిల్లుతోంది. బంగ్లాదేశ్ నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువ. లండన్, కెనడా, ఆమెరికా నుంచి ఐదు లక్షల మంది యాత్రికులు ఏటా భారత దేశాన్ని సందర్శించి వెళ్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, మొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ఇక్కడి చారిత్రక కట్టడాలైన గోల్కొండ కోటను, ఫలకనామాను దర్శించి వెళ్లారు.  

image


ప్రపంచంలో అత్యంత అధిక జనసాంద్రత కలిగిన భారతదేశంలో వైవిధ్యమైన సంస్కృతి కలిగిన 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతుల సమ్మేళనంతో అలరారే భారత ఉపఖండం అనేక వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర చేత ప్రభావితమైంది. భారతీయ సంస్కృతి ధార్మిక మతాల వల్ల బాగా ప్రభావం పొంది పరిపూర్ణమైంది. దానితో ఇక్కడ భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, వాస్తుశిల్పం, సంగీతం, కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. భారతదేశం భౌగోళికంగాను, సాంస్కృతికంగాను నమ్మశక్యం కాని వైవిధ్యంతో కూడుకొని ఉన్న దేశం. కశ్మీర్‌లో మంచుతో కప్పబడిన హిల్ ఘాట్లు మొదలుకొని కన్యాకుమారి సముద్ర తీరాల వరకు ఈ భూమిలో పర్యాటకం ఒక పరిశ్రమగా విస్తరించింది. జీవ నదులు, గుహలు, సరస్సులు దేశానికి అలంకారాలుగా అలరారుతూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి.  

శిల్ప కళాఖండాలు
శిల్పకళా శోభితమైన మొహంజొదారో, హరప్పా శిల్పాలు, ఎల్లోరా గుహలు, దేవాలయాలు, దివ్యమందిరాలు భారతదేశ కళా నైపుణ్యతలకు నిదర్శనాలు. అవి మన ప్రాచీన శిల్పకళా కౌశలాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. బౌద్ధంనాటి ఎల్లోరా శిల్పకళను గమనిస్తే ఆనాటి శిల్పకళపై గాంధార శిల్పకళ ప్రభావం కనిపిస్తున్నది. సాంచీ, నాసిక్, ఉదయగిరిలలో బౌద్ధ శిలాప్రతిమలను మలచారు. గయను చీనా యాత్రికులు, ఇండోనేషియా, శ్రీలంక దేశాల బౌద్ధ భిక్షువులు సందర్శించి నూతనోత్సవాన్ని పొందుతారు. దక్షిణ భారతదేశంలో శాతవాహనులు, ఇక్ష్వాకులు కూడా అమరావతిలోని నాగార్జున కొండమీద, పాణిగిరిలో మహా చైత్యాలను నిర్మించారు. 

image


చందేలా రాజుల కాలంలో ఖజురహో శిల్పాలయం వెలసింది. లైంగిక శాస్త్రాలను శిల్పాలుగా చెక్కి, ఓ అపురూప కళా ఖండంగా మెరుగులు దిద్దుకుంది ఖజురహో.  పామరులకు గుప్త జ్ఞానం సంప్రాప్తించేట్టుగా సృజనకారులైన శిల్పులు చెక్కడం అద్భుతమనిపిస్తుంది. వేల సంవత్సరాలైనా అవి చెక్కు చెదరక పోవడం ఆశ్చర్యమేస్తుంది. పల్లవ రాజుల కాలంలో మహాబలిపురంలో చెక్కించిన పాండవుల రథాలలో, చాళుక్యుల కాలంలో కన్నడ దేశంలో నిర్మించిన హోసలేశ్వర దేవాలయంలో హిందూ శిల్పకళ ఉట్టి పడుతుంది. ఆరవ శతాబ్దంలో తెలంగాణలోని ఆలంపురంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామంలో ఇతిహాసపూరిత శిల్పాలు వెలిశాయి. కాకతీయుల శిల్పకళ, పానుగల్లునేలిన కాండూరి చోళుల శిల్పకళలు తెలంగాణకే అందాల్ని తెచ్చిపెట్టాయి. 15వ శతాబ్ది నాటికి విజయనగర రాజులు నిర్మించిన హంపి, లేపాక్షి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచల ఆలయాలను చూస్తే శిల్పకళ ఆనాటికి అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. కన్ను గ్రహించినట్టుగా, స్పర్శ అనుభవించినట్టుగా అవి రూపొందాయి. కాకతీయ కళా వైభవానికి ప్రతీక తెలంగాణలోని వేయి స్తంభాల ఈశ్వరాలయం. రుద్రదేవుని కాలంలో వెలసిన ఈ శిల్ప కళాఖండంలో చాళుక్య వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది. దీని ప్రభావంతో జనగాం సమీపంలోని నిడిగొండలో అర్ధ వేయి స్తంభాల ఈశ్వరాలయం వెలయడం కాకతీయ కళా విశిష్టతను చాటేదే.

చిత్రకళలు
అలంకారికులు పేర్కొన్న లలితకళల్లో సృజనాత్మకమైన కళ చిత్రకళ. ప్రపంచంలో ఉన్న గుహల్లో ప్రాచీన ఇతిహాస కథలను చిత్రించి తన నైపుణ్యాలను చాటుకొన్నారు చిత్ర కళాకారులు. అల్టామీరా గుహల్లో చిత్రించిన తరహాలోనే భారతదేశ చిత్రకళావిర్భావం జరిగింది. అది జాతి ప్రజల సాంస్కృతిక విలువలను అభివ్యక్తం చేసే చిత్రకళగా రూపాంతరం చెందింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారులు పికాసో, రవివర్మ చిత్రకళ అందాలు ఆస్వాదించని యాత్రికులు తక్కువే. కళా చరిత్రకే అవి గుర్తింపు తెచ్చాయి. ప్రపంచంలోనే మహోన్నతమైన శిల్పకళకు ఆలవాలం అజంతా గుహలోని చిత్రకళ ఆలయం.  

పూర్వం రాజ ప్రాసాదాల్లో, వేశ్యావాటికల్లో, సామంతుల, జమీందార్ల, సంపన్నుల గృహాల్లో చిత్ర శాలలుండేవి. దేశంలోని అనేక రాజాశ్రయాలలో చిత్రకారులుండే వారంటే ఆ కళా వైభవాలెట్లా ఉండేవో ఊహించుకోవచ్చు. అంతేగాదు.. ఇక్కడ గుహ, కుడ్య చిత్రాలు క్రీ.పూ. 200 సంవత్సరాలలో ఆవిర్భవించినవని చెప్పాలి. బౌద్ధం ప్రభావంతో వచ్చింది చిత్రకళ అయితే, జైన ప్రభావంతో వచ్చింది ఘుర్జరి కళ. రాజస్థాన్ కళలో రాగము-రాగిణి రాజపుత్రుల జీవితాలకు అద్దం పట్టాయి. అక్బర్ కాలంలో స్థానికత కలిగిన పర్షియన్-ఖలం చిత్రకళ వెలసింది. మొగల్ కాలంలో పోర్ట్రెయిట్ పెయింటింగ్ అభివృద్ధి చెందింది. అలాగే ఔరంగజేబు కాలంలో వచ్చిన లిపి-కళ, మొగల్ చిత్రకళ, పర్షియన్ హిందూ రీతుల సమ్మేళనంతో,  యూరోపియన్ ప్రభావంతో మినియేచర్ చిత్రాలు పుట్టుకొచ్చాయి. ఓరుగల్ మార్చలాదేవి చిత్రాలయం, పిల్లలమఱ్ఱి చిత్రకళా క్షేత్రం, లేపాక్షి కుడ్య చిత్రాలు, కేరళ తిరువనంతపురం, కలిమానూర్ జమీందారీ కళాలయాలు ప్రసిద్ధి పొందాయి.   

ప్రపంచ జలపాతాలు
దర్శనీయమైన వాటిలో ప్రపంచంలోని ఆయా జలపాతాలు యాత్రికులకు  కనువిందు చేయడమే కాదు, మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. అవి ప్రకృతి సిద్ధంగా రూపొంది యాత్రికులను, కవులను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి.    ప్రపంచంలోనే ప్రఖ్యాతిగన్న నయాగరా, ఇగ్లూయూజ్, యోస్‌మైట్, బ్రైడల్ వీల్ వంటి జలపాతాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాయి. జాంబియాలోని విక్టోరియా, ఐస్‌ల్యాండ్‌లోని గుల్ఫోస్, స్వార్తిఫోస్ జలపాతాలు, గయానాలోని కైతియుర్ ఫాల్స్, న్యూజిలాండ్‌లోని సుథర్‌ల్యాండ్ ఫాల్స్, వియత్నాంలో బాంజియోక్-డెటియన్ జలపాతం, కెనడాలోని హార్స్ షూ జలపాతం, స్విట్జర్లాండ్‌లోని రైనో ఫాల్స్, నార్వేలోని మార్‌డాల్స్‌ఫోసెన్ ఫాల్స్, ఆస్ట్రేలియాలోని వల్లామన్ జలపాతాలకు ఘనమైన చరిత్ర ఉంది. 

మన పర్యాటక ప్రదేశాలు
ఆధునిక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న భారతదేశాన్ని సందర్శించే విదేశీయుల ద్వారా పర్యాటకం పరిఢవిల్లుతోంది. బంగ్లాదేశ్ నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువ. లండన్, కెనడా, ఆమెరికా నుంచి ఐదు లక్షల మంది యాత్రికులు ఏటా భారత దేశాన్ని సందర్శించి వెళ్తున్నారు.

భారతదేశంలో దేశ విదేశీయులని జోరుగా ఆకర్షిస్తున్న వివిధ రాష్ట్రాల పర్యాటక ప్రదేశాలను తప్పక పేర్కొనాలి. తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయాన్ని   చోళరాజుల కాలంలో నిర్మించారు. అలాగే మహాబలిపురం, తంజావూర్‌లోని బృహదీశ్వరాలయం లాంటివి వెలశాయి. అంతేగాదు, అక్కడి ప్రదేశం ఊటీ యాత్రికులకు నయనానందాన్ని చేకూర్చుతోంది. ప్రపంచంలోని ఎనిమిది వింతల్లో అపూర్వమైన, మహత్తరమైన వింత కట్టడాల్లో  తాజ్‌మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇది వారసత్వ కట్టడంగా నిర్మితమైంది. ఇదేగాక బౌద్ధ యాత్రికులకు దర్శనీయ స్థలమైన గయ ఉంది ఈ రాష్ట్రంలోనే.   

image

          
కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం, హిందూ దేవాలయాలు చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. విశేషంగా విదేశీ యాత్రికులను ఆకర్షించే రాష్ట్రం బిహార్. అక్కడి మహాబోధి, నలంద విశ్వ విద్యాలయం ప్రసిద్ధ దర్శనీయ స్థలాలు. కర్ణాటకలోని జాతీయ ప్రాజెక్టులు, అనేక రాజకోటలు, హోసల వాస్తు శిల్పిత ఆలయాలు, వారసత్వ కట్టడాలు, హంపి, బాదామి దేశ విదేశీయులకు కనువిందు చేస్తున్నాయి.
గోవాలోని బీచ్‌లు, బాసిలికా ఆఫ్ బామ్, హిందూ దేవాలయాలు, చర్చిలు విదేశీ  యాత్రికులను అమితంగా ఆకర్షిస్తాయి.   

విదేశీ యాత్రలు
భారతదేశం నుంచి అమెరికాను సందర్శించిన గొప్ప తత్త్వవేత్త వివేకానందస్వామి. ఆయన చికాగో యాత్ర భారతదేశానికి గుర్తింపు తెచ్చింది. గాంధీ, అంబేద్కర్   బ్రిటిష్ చదువులు వాళ్లకే కాకుండా దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే  సుభాష్ చంద్రబోస్, నెహ్రూ లాంటి వాళ్ల విదేశీయాత్రలు గొప్ప ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ రాజ్యం. దాని రాజధానిగా ఉన్న లండన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం. అప్పుడూ ఇప్పుడూ దేశ దేశాలవారికి యాత్రా స్థలంగా అలరారుతోంది. తెలుగు కవులలో సి. నారాయణరెడ్డి, చరిత్ర పరిశోధకులు శివనాగిరెడ్డి, ననుమాస స్వామి లాంటి వారెందరో లండన్‌ను సందర్శించి జ్ఞాపకాలను పదిలపరచుకొన్నారు. 

image


ముగింపు
ప్రాచీన కాలంలోనే విదేశీ యాత్రికులు భారత దేశాన్ని సందర్శించడం, ఆధునిక  కాలంలో పర్యాటకం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందడం అన్నింటికంటే ముఖ్యమైన విషయంగా చెప్పాలి. పర్యాటకం వల్ల మానసిక వికాసం, జ్ఞానంతో పాటు చరిత్ర సంస్కృతులు ప్రభావితమౌతాయి. ఇంత ప్రాధాన్యమున్నందువల్లే వందల దేశాల్లో సెప్టెంబర్ 27న ప్రపంచ ప్రజలు అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకొంటున్నారు.

ప్రొఫెసర్ ననుమాస స్వామిశ్రమైక వర్ణ సౌందర్యం

Updated By ManamSun, 09/23/2018 - 07:41

image‘కళ కళ కోసం కాదు.., సమాజం కోసం’ అని నమ్ముతారు సమకాలీన పాకిస్థాన్ చిత్రకారుడు సల్మాన్ తూర్. తాను నమ్మిన సిద్ధాంతాన్నే తన కాన్వాసులపై ఆవిష్కరిస్తాడాయన. పాకిస్థాన్ సమాజంలోని నిమ్నోన్నతాలకు తూర్ పెయింటింగ్‌లు అద్దం పడతాయి. మానవ సమాజం బడుగు, మధ్య, ఉన్నత తరగతులుగా విడిపోయిన వైనం మనకు ఆయన కాన్వాసుల్లో సజీవంగా కనిపిస్తుంది. ఇంతటి హెచ్చుతగ్గులతో కూడిన మెట్ల సమాజంలో కూడా మనుషుల మధ్య మానవసంబంధాలు సజీవంగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ సంబంధాలు సయోధ్యతోను, మరికొన్ని సందర్భాల్లో సంఘర్షణతోను ముడిపడి ఉంటాయి. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులకు తమ డ్రైవర్లతోను, పిల్లల్ని సాకే దాదులతోను, ఇంటి పని చేసే సేవకులతోను, వంటమనుషులతోను సామాజిక సంబంధాలుంటాయి. కానీ ఇలాంటి సంబంధాల్లో మనకు దగ్గరితనం కంటే ఎన్నటికీ ఒకటి కాలేని దూరాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సంబంధాల్లో అంతర్గతంగా దాగిన ‘సన్నిహితత్వాని’కి తూర్ తన పెయింటింగ్‌ల్లో చిత్రిక పట్టారు. పేదరికానికి - ధనస్వామ్యానికి, సంతోషానికి - దుఃఖానికి మధ్య ఉన్న అతి సన్నని రేఖను ఆయన చెరిపే ప్రయత్నం చేశారు. 

లాహోర్‌లోని ఒక ధనిక కుటుంబంలో 1983లో జన్మించిన సల్మాన్ తూర్ న్యూయార్క్, పాకిస్థాన్‌లలో తన చిత్రాల్నిimage ప్రదర్శిస్తుంటారు. న్యూయార్క్‌లోని ప్రాట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన 2009లో ఆర్ట్‌లో ఎంఎఫ్‌ఎ పూర్తి చేశారు. తన జీవితంలో ‘సేవకుల’తో పెనవేసుకు పోయిన సంబంధాన్ని ఆయన ఎంతో ఆర్ద్రంగా కాన్వాసుల మీద చిత్రీకరిస్తారు. ధనికులు, పేదల మధ్య వర్గవైషమ్యం మాత్రమే సాధారణంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండు వర్గాల మధ్య సంబంధాల్లో ఇంతవరకు ఎవ్వరూ చూడని ఒక కొత్తకోణాన్ని తూర్ తన పెయింటింగ్‌ల్లో ఆవిష్కరిస్తున్నారు. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత గైడి మొపాసా, పాకిస్థాన్ ఆధునిక రచయిత దనియాల్ మొయినుద్దీన్ వంటి వారి రచనల్లోని కథా సంవిధానం తూర్‌కు ప్రేరణగా నిలిచింది. అలాగే వెనీషియన్ ఆర్టిస్టులు పావ్లోవెరొనీస్ వంటి చిత్రకారుల వర్ణవిన్యాసం కూడా తూర్‌కు స్ఫూర్తిదాయకమైంది. ఒక ఫొటోగ్రాఫ్ చేయలేని పనిని పెయింటింగ్ చేసినప్పుడే ఆ పెయింటింగ్ పూర్తిస్థాయి సార్థకతను సాధిస్తుందని ఆయన నమ్ముతారు.  

imageవ్యంగ్యం, సౌందర్యం, పేదరికం కలిసి ఉండడమే తూర్ చిత్రాల్లోని ప్రత్యేకత. సాధారణంగా సమకాలీన చిత్రశైలిలో ముఖ్యంగా ఫిగరేటివ్ శైలిలో వ్యక్తుల ముఖాల్లో భావోద్వేగాల్ని ప్రతిఫలింపజేయడమన్నది అప్రధానమైన విషయం. ఉదాహరణకు ఆయన చిత్రించిన ‘మెయిడ్ విత్ ఫ్లవర్స్’ అనే చిత్రంలో ఒక సేవకురాలు చిన్నచిన్న పూలకుండీల మధ్య కాఫీ కప్పుల్ని తీసుకువస్తున్నట్టుగా ఉంటుంది. అయితే ఆ సేవకురాలి వెనుక చిత్రించిన నేపథ్య దృశ్యం కార్టూన్‌శైలిలోని ల్యాండ్‌స్కేప్‌లా ఉంటుంది. ఈ ల్యాండ్‌స్కేప్ సమాజంలోని ఎగువ మధ్య తరగతి వర్గానికి చెందిన స్వాప్నిక జగత్తుకు సంబంధించింది. ఈ స్వాప్నిక జగత్తు గాలిబుడగలాంటింది. అందుకే దీన్ని కార్టూన్ శైలిలో చిత్రించారు తూర్. 
తన పెయింటింగ్‌లలో ఆయిల్ కలర్స్, చార్‌కోల్ వంటి మాధ్యమాల్ని ఆయన ఉపయోగిస్తుంటారు. డ్రాయింగ్ ఆయనకు అభిమాన విషయం. నేటి సమకాలీన ఆర్ట్ ప్రపంచంలో ఫొటోగ్రఫీ మీద ఆధారపడి చిత్రించే ‘హైపర్ రియలిజం’ అనే శైలికి ఆదరణ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, సమాజాన్ని తనదైన సొంత భాషలో వ్యాఖ్యానించే తూర్ శైలి విమర్శకుల ప్రశంసలకు పాత్రమైంది. 

‘‘పేద, ధనిక తారతమ్యాలతో నిండిన పాకిస్థాన్ బూర్జువా వ్యవస్థలో పనివాళ్ళు విరివిగా కనిపిస్తూనే ఉంటారు. మనుషుల్ని యధాతథంగా చిత్రీకరించాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఎవరైనా నన్ను అడిగితే, లాహోరు నగర వీధుల్లోకి వెళ్ళమంటాను, అక్కడి పాతబస్తీలోని ఫుడ్‌స్ట్రీట్‌ను చూడమంటాను, వీధుల్లో అసంఖ్యాకంగా తిరిగే మోటారు సైకిళ్ళను చూడమంటాను. ఇలాంటి వీధుల్లో సామాన్యులు తిరుగాడుతుంటారు. వారి హావభావాలు, శరీర సౌష్టవం రోమన్ శిల్పాల్ని తలపిస్తుంది. వాళ్ళు తమ దేహాల మీద ఎలాంటి శ్రద్ధ లేకుండా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తుల్లో మనకు ఈ మానవ సహజ లక్షణం కనిపించదు. వీధుల్లో జీవితం కన్నా ఒక ఆర్టిస్టుకు మంచి గురువు లేడని నేను నమ్ముతాను’’ అని తూర్ చెబుతున్నారు. తూర్ చిత్రాలు కేవలం ఒక దృశ్యానికి ప్రతిబింబం కాదు, అది ఒక సామాజిక సన్నివేశానికి మొహమాటం లేని సూటి వ్యాఖ్యానం. ఇలాంటి సూటిదనమే మనం సమకాలీన చిత్రకారుల నుంచి ఆశించదగిన అమూల్యమైన కానుక. 
- పసుపులేటి గీత పుత్తూరు కట్టు జనాలను ఆకట్టు

Updated By ManamSun, 09/23/2018 - 07:37

imageచిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకాలోని రాచపాళెం మా అమ్మమ్మ ఊరు. విరిగిన కాళ్లు, చేతులకు కట్లుకట్టే ప్రకృతి వైద్యానికి పెట్టింది పేరు. కట్లు కట్టే కుటుంబానికి చెందిన మా అమ్మమ్మ నామధేయం సూరపరాజు నరసమ్మ అయితే మేమంతా బామ్మా అని పిలిచేవాళ్లం. భారీ శరీరమైనా, మోకాళ్ల నొప్పులున్నా వెదురు కర్ర సాయంతో అటూ ఇటూ తిరుగులాడేది. కోపమొస్తే కూతుళ్లు నారాయణమ్మ, రామక్కవ్వ, సుబ్బలక్ష్మమ్మలపై ఎగిరిపడేది. 

ఊర్లో అమ్మే సరోజక్క మసాలా వడలు, తుంబూరామె ఇడ్లీ సాంబారు, తిరపతామె నీళ్ల చట్నీ, రాఘవన్న పల్లీలు భలే వుండేవి. నేను, శ్రీనివాసులన్న ఇద్దరమూ బామ్మకి తిరపతామె ఇడ్లీలు తెచ్చి ఇచ్చేవాళ్లం. ఇడ్లీలు తెచ్చి ఇచ్చిందానికి తిరిపంగా  (కానుకగా) మాకు ఒక్కొక్క ఇడ్లీ ఇచ్చేది. ఆ ఒక్క ఇడ్లీకే కొట్టుకొనే వాళ్లం. అక్క పద్మ, భారతి, కస్తూరిలు బామ్మని రేగు చెట్టుకాడికి మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ తీసుకెళ్లే వాళ్లు. వాకింగ్‌కి తీసుకెళ్లడానికి పోటీలు పడేవాళ్లు. బామ్మకి తోడుగా వెళితే తాయిలాలు వుంటాయి కదా మరి. 

కట్లు కట్టే ఆసుపత్రిని అప్పట్లో ‘కుంటోళ్ల కొట్టం’ అని పిలిచేవాళ్లు. అక్కడికి ఒకసారి వైద్యం కోసం సినీనటి హలంimage వచ్చింది. మేమంతా వెళ్లి చూశాం. హలం వచ్చింది చెప్పలేదని వేణన్న కొడుకు బాలాజీగాడు అలిగి నాలుగు నెలలు నాతో మాట్లాడలా. కొట్టంలోని వైద్యానికి నాటు కోడి గుడ్లు వాడేవాళ్లు. గుడ్లలోని తెల్లసొన వైద్యానికి వాడి, పసుపు సొన మిగిల్చేవాళ్లు. ఊర్లో చాలామందిమి వాటిని ఆమ్లెట్లు, పొరుటు చేసుకొని తినేవాళ్లం. తెల్లారి లేచింది ఆలస్యం ఎవరెవరి కండ్లల్లో ఎంతెంత రక్తం పెరిగిందో ఒకరి కళ్లు ఒకరు చూసుకొనేవాళ్లం.
 
మా బామ్మకి బుడబుక్కలోళ్ల దగ్గర జరగబోయేది చెప్పించుకోవాలంటే భలే ఇష్టం.  వచ్చినోడు ఎవడైనా జోస్యం చెబుతానంటే వాడికి దండిగా పైసలిచ్చేది. అమ్మమ్మని బురిడీ కొట్టించాలని బాలన్న, జయన్న ప్లాను వేసినారు. కోటు వేసి, నామం పెట్టి, పంచెకట్టి, గొడుగు చేతబట్టి పూసల మాలలు వేసి తలపాగా చుట్టి బామ్మకి సోది చెప్తా వున్నారు. చిన్నక్క, కనకక్క, లక్షుమమ్మలు నవ్వుతా నిలబడినారు. సగంలో విషయం తెలుసుకొన్న బామ్మ వాళ్లని తరిమింది చూడండీ.. వాళ్లు ఊరికి దక్షిణాన వుండే రైలు పట్టాలకాడ పోయి తేలినారు!
 
ఊరి చుట్టుపక్కల కలరా, మలేరియా, టైఫాయిడ్‌లు రాకుండా భజనలు చేసేవాళ్లం.  బ్రాహ్మణపట్టు గోపాలస్వామి హరేరామలు పాడతావుంటే మేమంతా వంతపాడుతూ దీపం ఎత్తుకొని వీధులు తిరిగేవాళ్లం. దీపం ఎత్తుకోడానికి నేను, నాన్ను, చంద్రు, మధు, ఆకేటి గోపి పోటీలు పడేవాళ్లం. దీపం ఎత్తిన వాళ్లకి ప్రసాదం దండిగా పెడ్తారు కదా. మట్టిలో తలపెట్టి తలకిందులుగా గంటల కొద్దీ వుండిపోయే అరవమాయన (తమిళమాయన), చేతితోనే తాటిచెట్టు పడగొట్టే సర్కారాయన ఊర్లోకి వచ్చేవారు.  వాళ్లు వస్తే బీకామ్ బాలన్న, సాలక్క కొడుకు మురళి, కాశెమ్మ కొడుకు సీ.సీ., బీయస్సీ బాల, రెడ్డోళ్ల సత్యంలకు పండుగ వచ్చినట్లే. మురుకులు తింటూ సినిమా షూటింగులు చూసినట్లు చూసేవాళ్లం. 

కొట్టం ఎదురుగా కేరళ అయ్యోరు గోవిందరావు హోటల్ నడిపేవాడు. తెల్లారి చేసి మిగిలిన ఉప్మా ఇడ్లీ పొంగలి సాయంత్రం స్కూలు పిలకాయలకి పంచేవాడు. బండి రమణ, బీ.సీ. రమణ, బస్సు రమణ, సాలవోడులతో కలసి ఎగురుతూ ఎగురుతూ తినేవాళ్లం. ఎండాకాలం వానలు కురవాలని కప్పల పెండ్లిండ్లు చేసేవాళ్లం. రోకలికి కప్పలు కట్టి పసుపు కుంకుమలు పూసి నీళ్లు పోసుకొంటూ గడపగడపా తిరిగేవాళ్లం. రోకలి మోయడానికి అయ్యోరోళ్ల సుధ, గోవర్ధన, భాస్కరుడు, భూపతి తన్నుకొనేవాళ్లం. మా మేనమామ నరసింహరాజు చివర్లో అందరికీ చక్కెర, కలకండ పెట్టేవాడు.  భుస్కడు కాశిరాళ్లతో దిగుడు బావి కడ్తుంటే మేమంతా వింతగా చుట్టూరా చేరి తొంగితొంగి చూసేవాళ్లం.
ఊర్లో పిలకాయలు కొందరు అక్కినేని గ్రూపు అయితే మరి కొందరు నందమూరి గ్రూపు. వాళ్లు వీళ్ల వాల్ పోస్టర్‌పై పేడ కొడితే వీళ్లు వాళ్ల వాల్‌పోస్టర్‌పై పేడ కొట్టేవాళ్లు. నిద్ర లేచిందే మధ్యస్తాలు గరంగరంగా జరిగేవి. పోలీస్ మావ సమ్మెట నరసింహరాజు యూనిఫారంలో కనిపిస్తే మేమంతా భయం భయంగా పక్కకి వెళ్లిపోయేవాళ్లం.
గంగ జాతర చాటింపుకి ముందు పంచాయితీ ఆఫీసు కాడ కూటం జరిగేది.  ఊరిపెద్దలు జయరామన్న, రామన్న, చెంగల్రాజు, పెరుమాళ్రాజు, కోర్టు కిష్టన్న  మాట్లాడుతుంటే రాత్రంతా మేల్కొని శెనక్కాయలు తింటూ అసెంబ్లీ హాలులో వున్నట్లు తెగ సంబర పడేవాళ్లం. గంగ జాతరకి వేషాలు, అంకమ్మకి పొంగళ్లు, పుత్తూరు తిరునాళ్లలో పాయసం తాగడం, గుట్టపైన గోవింద పాదం సంతర్పణలో చింతపండన్నం ఆవురావురమని తినడం మధురమైన అనుభూతులు.  ఎన్ని జన్మల నోముల పుణ్యఫలమో ఈ అనుభవాలు.

ఇప్పుడెప్పుడయినా రాచపాళెం వెళితే పోగొట్టుకొన్న ప్రాణవాయువు పొందినట్లవుతుంది. దారిపోయిన శక్తి దొరికినట్లవుతుంది. అప్పుడూ, ఇప్పుడూ అమ్మమ్మ ఊరు అనందనిలయం, స్వర్గధామం. 

- ఆర్.సి. కృష్ణస్వామి రాజు
సెల్: 9393662821 కౌశల్ ఆర్మీ.. ఒక స్ట్రాటజీ!

Updated By ManamSun, 09/23/2018 - 07:20

image‘బిగ్ బాస్’ నిర్వాహకులకే షాక్.. ఎలా స్పందించాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి. షోలో ఎవరు గెలవాలి అన్నది నిర్ణయించే స్థాయికి ఫ్యాన్స్ చేరుకోవడం టీవీ రియాల్టీ షోల్లోనే మొదటిసారి! అంతేకాదు రియాల్టీ షోలన్నాక ఎలిమినేషన్ తప్పనిసరి. ఈ ప్రక్రియలో ప్రతివారం ఫలానా వారిని ఎలిమినేట్ చేయాలని ఎజెండా సైతం సెట్ చేసే స్థాయికి అభిమానులు చేరుకున్నారంటే వింతే మరి. నేటి సమాజం ఎటువైపు పయనిస్తున్నదనే దానికి ఇది నిదర్శనం కూడా.

ఏకపక్షమేనా?
ఇండియా ట్రెండింగ్‌లో టాప్ 3కి ‘కౌశల్ ఆర్మీ’ అనే పదం వెళ్లిందంటే ఇది ఎంత ప్రభావవంతంగా మారిందో అర్థమవుతుంది. నెటిజెన్స్‌కు ఇప్పుడు ఇది హాట్ టాపిక్. నిజానికి టీవీ షోలు, లేదా హైలైట్స్ చూస్తే ఆ ఎపిసోడ్ అంతా అర్థమవుతుంది. కానీ వెరైటీగా ‘బిగ్ బాస్ 2’ చూడాలంటే ట్రాలింగ్ చూస్తే చాలు మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. రోజూ గంటన్నర టీవీ ముందు కూర్చునే బదులు మీమ్స్, ట్రాల్స్, సెటైర్లు చూస్తే క్షణాల్లో మ్యాటర్ అర్థమయ్యేలా కౌశల్ ఆర్మీ నెట్‌లో సందడి చేస్తోంది. బిగ్ బాస్ కంటెస్టంట్ అయిన నటుడు కౌశల్‌కు మద్దతుగా ఏర్పడిన అభిమాన బృందం తాజాగా చేపట్టిన టూ కే వాక్ పెద్ద హిట్ అయిందంటే కౌశల్ ఇమేజ్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు షో మొత్తం ఏకపక్షంగా సాగుతోంది.  బిగ్ బాస్ ఇంట్లో అంతా కౌశల్ వర్సెస్ మిగతా కంటెస్టంట్లుగా పోటీ సాగుతోంది.

ఆయనతో పెట్టుకుంటే ‘ఫసక్’
imageముక్కుసూటి మనస్తత్వం ఉన్న కౌశల్ చాలా క్లియర్‌గా, టైటిల్ గెలవాలన్న సింగిల్ పాయింట్‌తో గేమ్ ఆడుతున్నారు. కానీ హౌస్‌లో ఆయనతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వారి కథ ‘ఫసక్’ అనేలా సెంటిమెంట్ పుట్టి, ప్రతి వారం నిజమవుతుండడం ఇక్కడ హైలైట్. నామినేషన్‌లో ఉన్నవారు కౌశల్‌ను విమర్శించినా, పొరపాటున ఆయనతో విభేదించి గొడవపడ్డారో వారి ఖేల్ ఖతం. కిరీటి, భానుశ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందినిల ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం వారు గేమ్ ఆడిన విధానం కాదు. వీరంతా చేసిన ఏకైక తప్పు కౌశల్‌తో గొడవ పడటం అంతే! దెబ్బకు వీరంతా షో నుంచి ఔట్ అయ్యారు. తమిళ్ ‘బిగ్ బాస్’లోనూ ఓవియా అనే ఒక మహిళా కంటెస్టంట్ ఇలాగే ఓ ఆర్మీని నిర్వహించినట్టు తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తన ఫ్యాన్స్ ఆర్మీ అతి కారణంగా ఆమె విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైంది. ఇక కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని, కౌశల్ స్వయంగా క్రియేట్ చేసిన ఈ గ్రూప్ మేలో రిజిస్టరైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

సోషల్ మీడియా వార్
కౌశల్ ఆర్మీ కేరళ వరద బాధితులకు సాయం చేసి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్ పూర్తయ్యాక కూడాimage వీరు ఇలాగే సామాజిక కార్యక్రమాలను కొనసాగించేలా కనిపిస్తోంది. మరోవైపు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించకపోతే ఊరుకునేది లేదంటూ గట్టి హెచ్చరికలు చేస్తూ, మరోవైపు షో హోస్ట్ నానిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఆర్మీని బిగ్ బాస్ యాజమాన్యం ఎలా మేనేజ్ చేయబోతోందన్న విషయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కౌశల్ విన్నర్ అయితే మాత్రం రియాల్టీ షోలన్నీ ఇలాంటి ఆర్మీలు, అభిమానులనే రిమోట్ కంట్రోలర్‌తోనే భవిష్యత్‌లో ఆపరేట్ అవ్వడం ఖాయం. అంటే కంటెస్టంట్స్ అందరూ ఇలాంటి సర్వీసులను ఏర్పాటు చేసుకుని, ఓట్ల వర్షం కురిపించేసుకుంటే వార్ వన్ సైడ్ అయిపోతుందనే స్ట్రాటెజీలు కామన్ అయిపోతాయి. అప్పుడు పార్టిసిపెంట్ల మధ్య కాకుండా షో బయట ఆయా వ్యక్తులకున్న ఇంటర్నెట్ ఫాలోయర్ల మధ్యనే అసలు పోటీ నడుస్తోంది. అంటే ఇదంతా సోషల్ మీడియా వార్‌గా మారిపోయే ప్రమాదముంది. ఇక ఇలాంటి సర్వీసులు అందించే కన్సల్టెన్సీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయన్నమాట. లైకుల బిజినెస్‌లా ఓట్ల బిజినెస్ అనే కుంభకోణం భవిష్యత్‌లో బుల్లితెరను ఏలబోతోందా?
 - భార్గవి కరణం

Related News