supreme court

దేన్ని చూసి మేం షాకవ్వం

Updated By ManamMon, 11/19/2018 - 23:29
 • అత్యవసర విచారణకు అంగీకరించం

 • సుప్రీంకోర్టు సీజేఐ గొగోయ్ స్పష్టీకరణ

 • సీబీఐ అధికారికి కోర్టులో చుక్కెదురు

 • కేంద్రమంత్రికి కోట్లలో లంచం: సిన్హా

supremన్యూఢిల్లీ: తాము దేన్ని చూసీ షాకవ్వబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. కేసును అత్యవసరంగా విచారించబోమని.. అది లిస్టింగ్ అయ్యేవరకు వేచి ఉండాలని సీబీఐలో డీఐజీ ర్యాంకు అధికారి మనీష్ కుమార్ సిన్హాకు స్పష్టం చేశారు. గత నెలలో అర్ధరాత్రి సీబీఐ చీఫ్ అలోక్‌వర్మను తొలగించడంతో పాటు పలువురు అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అలా తనను బదిలీ చేయడాన్ని డీఐజీ మనీష్ కుమార్ సిన్హా కోర్టులో సవాలు చేశారు. తన క్లయింటు కొన్ని షాకింగ్ వాస్తవాలను కోర్టు ముందుకు తేవాలనుకుంటున్నారని, అందువల్ల కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని సిన్హా తరఫు న్యాయవాది కోరారు. అయితే, తమను ఏదీ షాక్‌కు గురిచేయలేద న్న సీజేఐ... అత్యవసర విచారణకు తిరస్కరించారు. 

మంత్రికి కోట్లలో లంచం!
ఒక కేంద్ర మంత్రికి కోట్ల రూపాయలలో లంచం అందిందని మనీష్‌కుమార్ సిన్హా కోర్టుకు తెలిపారు. సీబీఐ కన్ను పడిన ఒక వ్యాపారి తరఫు నుంచి ఆ మొత్తం అందిందన్నారు. రాకేశ్ ఆస్థానాకు మేలు చేయ డానికి, కేసు దర్యాప్తు గతినిమార్చడానికే తనను బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. అయినా సీజేఐ మాత్రం స్పందించలేదు. కాకినాడకు చెందిన సానా సతీష్‌కు సాయం చేయడానికి రాకేశ్ ఆస్థానా లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై మనీష్‌కుమార్ సిన్హా దర్యాప్తు చేశారు. 

సమాధానం ఇచ్చిన వర్మ
తనపై సీవీసీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సీబీఐ మాజీ చీఫ్ అలోక్‌కుమార్ వర్మ తన సమాధానాన్ని సుప్రీం కోర్టుకు సీల్డ్‌కవర్‌లో అందించారు. వర్మ తన సమాధానాన్ని వీలైనంత త్వరగా.. ఈరోజే అందించాల్సి ఉంటుందని, మంగళవారం నాటి విచారణను వాయిదా వేసే ప్రసక్తి లేదని అంతకుముందు స్పష్టం చేసింది. వర్మ తరఫు న్యాయవాది సమాధానానికి మరింత సమయం కావాలని అడిగినప్పుడు కోర్టు ఇలా తెలిపింది. తాము తొలుత కొంత సమయం అడిగినా, మధ్యాహ్నం 1 గంటకే సీల్డ్ కవర్‌లో సమాధానాన్ని కోర్టు సెక్రటరీ జనరల్‌కు అందించామని వర్మ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం తెలిపారు. వర్మ సోమవారం మధ్యాహ్నం 1గంట లోపు సమాధానం అందించాలని కోర్టు ఈనెల 16నే ఆదేశించింది. అలోక్ వర్మ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి సీవీసీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక కాపీని ఆయనకు అందించింది. జనవరి 22న శబరిమల తీర్పుపై పున:సమీక్ష

Updated By ManamTue, 11/13/2018 - 17:24
 • వచ్చే ఏడాది శబరిమల రివ్యూ పిటిషన్లపై విచారణ

Supreme court to hear all Sabarimala review petitions in open court on January 22

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ తామిచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై జనవరి 22న విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ రివ్యూ పిటిషన్లపై ఓపెన్ కోర్టులు చేపడుతామని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 28న వెలువరించిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మొత్తం 49 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాతో కూడిన ధర్మాసనం అంతర్గతంగా (ఇన్ చాంబర్)గా సమాలోచనలు జరిపింది. అనంతరం ఆదేశాలు జారీ చేసింది. రివ్యూ పిటిషన్లకు సంబంధించి జనవరి 22న సంబంధిత ధర్మాసనం విచారణ జరుపుతుందని ఆ ఆదేశాల్లో కోర్టు వెల్లడించింది. 

అయితే.. సెప్టెంబరు 28న తాము వెలువరించిన తీర్పుపై స్టే విధించేందుకు కోర్టు మరోసారి తిరస్కరించింది.  పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లొచ్చంటూ గత సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తీర్పు తర్వాత రెండుసార్లు గుడి తలుపులు తెరిచినా.. ఒక్క మహిళ కూడా ఆలయంలోకి అడుగుపెట్ట లేకపోయింది. కొందరు మహిళల పోలీసుల రక్షణతో గుడి దగ్గరి వరకు వెళ్లినా.. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో వెనుదిరిగిన విషయం తెలిసిందే. అద్భుతం..మాజీమంత్రి కనపడలేదా?

Updated By ManamMon, 11/12/2018 - 17:23
 • మాజీమంత్రి కనపడలేదా?

 • నెల రోజులుగా కనిపెట్టలేకపోయారా

 • అద్భుతం.. అది ఎలా సాధ్యం

 • అంటూ సుప్రీంకోర్టు దిగ్ర్భాంతి

​  ​Fantastic... Manju Verma Not Traceable: Supreme Court

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కుంభకోణంలో బిహార్ మాజీమంత్రి మంజువర్మ ఎక్కడున్నారో ఆ రాష్ట్ర పోలీసులు నెల రోజుల నుంచి కనిపెట్టలేకపోయినందుకు సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీబీఐ దాడి చేసినపుడు ఆమె ఇంట్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం అయిన కేసులో ఆమె చాలా కాలంగా పరారీలో ఉన్నారు.

ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసుకు సంబంధించి ఆమె ఇంటిపై సీబీఐ అధికారులు దాడి చేశారు. షెల్టర్ హోం యజమాని తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అక్కడి బాలికలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మంజు వర్మ ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయామని పోలీసులు చెప్పినపుడు.. ‘అద్భుతం! కేబినెట్ మంత్రి (మంజు వర్మ) పరారీలో ఉన్నారా.. అద్భుతం!’ అని జస్టిస్ మదన్ బి. లోకూర్ వ్యాఖ్యానించారు. కేబినెట్ మంత్రి పరారీలో ఉండి, ఆమె ఎక్కడున్నారో కనిపెట్టలేకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విషయం ఎంత తీవ్రైవెునదో గుర్తించాలని.. ఒక కేబినెట్ మంత్రిని కనిపెట్టలేకపోవడం చాలా దారుణమని ఆయన అన్నారు. తదుపరి విచారణ సమయానికి బిహార్ డీజీపీ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

Fantastic, says Supreme Court after Bihar Police fail to trace Manju Verma

‘కేబినెట్ మాజీమంత్రిని పోలీసులు నెల రోజుల నుంచి కనిపెట్టలేకపోయారంటే మేం చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఇంత ముఖ్యైమెన వ్యక్తిని ఎలా గుర్తించలేకపోయారో మాకు పోలీసులు చెప్పాలి. అందుకే డీజీపీ మా ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తున్నాం’ అని ఆయన అన్నారు. కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. రాష్ట్రంలో షెల్టర్‌హోంలలో అరాచకాల గురించి వివరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆరోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

రాష్ట్రంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షెల్టర్‌హోంలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ పత్రికలు, ఇతర మీడియాలో వచ్చిన కథనాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 16 షెల్టర్ హోంలలో లైంగిక వేధింపులు, ఇతర అక్రమాలు చోటుచేసుకున్నట్లు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) గుర్తించిందని అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపారు.

మరోవైపు.. తాను పరారీలో ఉన్నట్లుగా ప్రకటించకూడదంటూ మంజువర్మ గత వారం బిహార్‌లో ఓ కోర్టును ఆశ్రయించారు. ఆమె ఇంట్లో భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి లభ్యం కావడంతో ఆయుధాల కేసులో ఆమెను అరెస్టుచేసే అవకాశం స్పష్టంగా ఉంది. ముజఫర్‌పూర్ షెల్టర్‌హోం స్కాంలో మంజువర్మ భర్త చంద్రశేఖర వర్మకు, ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలడంతో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత ఆగస్టు నెలలో నాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజువర్మతో రాజీనామా చేయించారు. సుప్రీంలో ‘రాఫెల్ ఒప్పందం’ అఫిడవిట్‌

Updated By ManamMon, 11/12/2018 - 15:39
 • ధర వివరాలతో సీల్డ్ కవర్‌లో అందజేసిన కేంద్రం

 • రాఫెల్ జెట్ విమానాల కొనుగోలుపై విపక్షాల ఆరోపణలు

 • వివరణ ఇవ్వాలంటూ సుప్రీం ఆదేశాలు.. అఫిడవిట్‌‌ను సమర్పించిన ప్రభుత్వం

 • వచ్చే బుధవారం తదుపరి విచారణ 

Rafale case, Centre, affidavit, Supreme Court, price details, sealed coverన్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందం కేసుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఫ్రెంచ్ యుద్ధ జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించి సంక్షిప్త సమాచారంతో కూడిన అఫిడవిట్‌ను సీల్డ్ కవర్‌లో కేంద్రం కోర్టుకు అందజేసింది. సుప్రీంకు అందజేసిన 9 పేజీల అఫిడివిట్‌లో కీలకమైన 36 రాఫెల్ విమానాల కొనుగొలు ధర వివరాలను కూడా కేంద్రం జతచేసింది. రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మోదీ సర్కార్‌పై ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో రాఫెల్ ఒప్పందం కేసుపై వేసిన పిటిషన్‌తో సుప్రీం కేంద్రాన్ని వివరణ ఇవ్వాల్సందిగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో కేంద్రం రాఫెల్ ఒప్పందానికి సంబంధించి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సుప్రీంలో సమర్పించింది. ‘‘రాఫెల్ ఒప్పందంలో అవసరమైన మేరకే జెట్ విమానాుల కొనుగోలు చేశారు. 

36 రాఫెల్ జెట్ విమానాలను రక్షణ సేకరణ ప్రక్రియ ప్రకారమే కొనుగొలు చేయడం జరిగింది’’ అని అఫిడివిట్‌లో కేంద్రం పేర్కొంది. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసిజర్-2013 ప్రకారమే 36 రాఫెల్ విమానాలను సేకరించినట్టు స్పష్టం చేసింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపినట్టు కేంద్రం ఈ సందర్భంగా గుర్తుచేసింది. రాఫెల్ ఒప్పందం వివాదానికి సంబంధించి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం తదుపరి విచారణ జరుగనుంది. గతంలో రాఫెల్ ఒప్పందంపై ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు డిమాండ్ చేసినా.. 36 రాఫెల్ జెట్ విమానాల ధర వివరాలను బహిర్గతం చేసేందుకు మోదీ సర్కార్ అంగీకరించలేదు. దాంతో అప్పటినుంచి రాఫెల్ వివాదంపై విపక్షాలు మండిపడుతున్నాయి.  శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత

Updated By ManamTue, 11/06/2018 - 10:17

Sabarimalaతిరువనంతపురం: శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీ చితిర అట్ట తిరునాళ్ పూజ నిమిత్తం మంగళవారం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు పోటెత్తుతుండగా.. సుప్రీం ఇచ్చిన తీర్పుతో కొందరు మహిళలు కూడా అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులతో పాటు పలు హిందూ సంస్థల ప్రతినిధులు శబరిమలకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఇద్దరు మధ్య వయస్కులైన మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ మహిళల ధ్రువపత్రాలు పరిశీలించాకే దర్శనానికి అనుమతించారు.ఆంక్షలతో అదురు

Updated By ManamTue, 11/06/2018 - 07:09
 • ఎవరి నేర చరిత్రను వారే చెప్పుకోవాలన్న నిబంధనతో వణుకు 

 • ఒక్కసారి కాదు.. మూడు సార్లు 

 • పత్రికల్లోనూ ప్రకటించుకోవాలి

 • సుప్రీం ఆదేశంతో ఈసీ చర్యలు

 • న్యాయనిపుణులతో రాజకీయ పార్టీల సంప్రదింపులు

 • కేసులు పోటీకి ఆటంకం  కాదంటున్న నిపుణులు

supremeహైదరాబాద్: అభ్యర్థుల నేర చరిత్రను పత్రికల్లో విధిగా మూడు సార్లు ప్రకటించాలనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం పట్ల రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఉన్న కూటమి పక్షాలతో పాటుగా ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ నాయకత్వం న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. నేర చరిత్ర, క్రిమినల్ కేసుల వివరాల వెల్లడి తప్పనిసరి అని అనడంతో రాజకీయ పక్షాల్లో చర్చకు తెరలేచింది. క్రిమినల్ కేసుల్లో ఉన్న వారు కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నందున కొన్ని జాగ్రత్తలు అనివార్యం అంటున్నారు. రాజకీయాల్లో ఉన్న వారిలో అత్యధికులపై ఏదో ఒక పోలీసు కేసు ఉండటం సహజమని అంటున్నారు. పోలీసు కేసు అనగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడానికి అవకాశం ఉందంటున్నారు. తీవ్రమైన, ప్రజాస్వామ్య ప్రకియకు విఘాతం కలిగించే నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించడం పట్ల అభ్యంతరం లేకపోయినప్పటికీ చిన్నా చితకా కేసుల వివరాలు కూడా పొందు పర్చాలని, పత్రికల్లో ప్రకటన చేయాలనే విషయంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి. నేర చరితులను ప్రజాస్వామిక ప్రక్రియకు దూరంగా ఉంచాలనే పిటీషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్డు ఎన్నికల బరిలో ఉండే అభ్యర్దుల నేర చరితను ప్రజలు తెలుసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడంతో నామినేషన పత్రంతో పాటు సీ1, సీ2 ప్రమాణ పత్రం సమర్పించవలసి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.  అభ్యర్దులపై  ఉన్న కేసులు ఎన్నికల బరిలో దిగడానికి ఆటంకం కానప్పటికీ ఎదుటి పక్షానికి ప్రచారాస్త్రంగా మారుతుందనే ఆందోళన రాజకీయ పక్షాల్లో వ్యక్తమవుతుంది. అమాత్యులపై కూడా ప్రజా ఉద్యమాల సందర్భంలో కేసులు ఉన్నాయని, వారంతా ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అధికార పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రజా ఉద్యమాల్లో భాగంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటిస్తూ సాగిన ఉద్యమాల సందర్భంగా  కాంగ్రెస్, సీసీఐ, టీజెఎస్ పక్షాల్లోని అత్యధికులపై కేసులు నమోదయ్యాయని ప్రతిపక్షాలు తెలియచేశాయి.  

    ఈ విషయంపై స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాలనే ఆలోచనలో టీఆర్‌ఎస్ నాయకత్వం ఉందంటున్నారు. విపక్షాలు మాత్రం సీ1, సీ2 పత్రాల విషయంలో  మరింత స్పష్టత రావలసి ఉందంటున్నాయి. నామినేషన్ సమయంలోనే అభ్యర్ధులు ఈ వివరాలను సమర్పించాలని. రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో పేర్కొనవలసి ఉంటుందని, పత్రికల్లో మూడు సార్లు ప్రకటనల రూపంలో వివరాలను ప్రజలకు తెలియచేయవలసి ఉంటుందనే ఆంక్షలు అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఎలాంటి కేసులు పొందుపర్చాలి అనే అంశంలో స్పష్టత రావలసి ఉందంటున్నారు. ఎన్నికల అధికారులు ఇప్పటికే కేసుల వివరాలను నామినేషన్ సమయంలో పొందుపర్చాలని కోరినప్పటికీ ఒకటి రెండు రోజుల్లో మరింత స్పష్టతను ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నామినేషన్ సమయంలోనే సీ1, సీ2 అనే రెందు ఫారాలను అభ్యర్దులు నింపవలసి ఉంటుంది. అందులో నేర చరిత్ర, క్రిమినల్ కేసుల వివరాలు పొందపర్చాలని సూచించబడింది. నేర చరిత్ర, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్దుల వివరాలను అన్ని రాజకీయ పార్టీలు సేకరిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ కేసులు ఆటంకం కానప్పటికీ ప్రచారంలో ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జనవరి 1న ఏపీలో హైకోర్టు ప్రారంభం

Updated By ManamMon, 11/05/2018 - 14:15
 • హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు పలు సూచనలు

Separate High Courts for Andhra pradesh from January 1st

న్యూఢిల్లీ :  అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు విభజనపై ఉన్నత న్యాయస్థానం సోమవారం పలు సూచనలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. నిర్మాణం కొనసాగుతున్నందున అప్పటివరకూ అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.  అలాగే అప్పటివరకూ జడ్జీల నివాసం కూడా అద్దె భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

కాగా డిసెంబరు 15వ తేదీకల్లా హైకోర్టు అవసరాల నిమిత్తం తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇచ్చిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు జడ్జీలు కూడా సుముఖంగా ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది.
 ఆలోక్ వర్మ తొలగింపుపై సుప్రీంకు ఖర్గే   

Updated By ManamSat, 11/03/2018 - 15:03

Mallikarjun Kharge, Supreme Court, CBI chief Alok Vermaన్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ తొలగింపుపై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై విచారణకు ఆదేశాలివ్వాలని సుప్రీంను కోరారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ తొలగింపు ‘పూర్తిగా చట్టవిరుద్ధం, ఏకపక్షం, శిక్షాత్మకమైన చర్య’గా పిటిషన్‌లో ఖార్గే పేర్కొన్నారు. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించడంతో సీబీఐ 55ఏళ్ల చరిత్రను ఒక్కసారిగా షేక్ చేసింది. ఆలోక్ వర్మను తొలగించడంతో ఆయన స్థానంలో నాగేశ్వర్ రావు తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

మరోవైపు రఫెల్ ఒప్పందంలో అవినీతిని కప్పిపుచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీనిపై విచారణ చేపట్టబోయిన అలోక్ వర్మను అర్థాంతరంగా తప్పించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ‘నోటు’ కదిలింది..ఫిబ్రవరిలోనే విచారణ

Updated By ManamSat, 11/03/2018 - 12:38
 •     లిస్టింగ్ చేయాలన్న సుప్రీంకోర్టు

 •     ఎన్నికలున్నా ఏమీ చేసేది లేదు

 •     ఫిబ్రవరిలోనే విచారణ: ధర్మాసనం

 •     ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హర్షం

 •     తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభం

 •     నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బుల కట్టలు

 •     రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి

 •     ఆడియోటేపులో గొంతు చంద్రబాబుదే!

 •     చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక

Supreme Court to hear Chandrababu Naidu cash-for-vote case in February

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసుపై వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయించి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. 

రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదించారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన తర్వాత.. ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సమయంలో.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని సిద్దార్థ లూత్రా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ మదన్ బి.లోకూర్.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు పెద్దమొత్తంలో (రూ. 50 లక్షలు?) డబ్బులు అందజేస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేశారు. 2015 మే 31వ తేదీన వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారని, ‘మనోళ్లు.. దే బ్రీఫ్‌డ్ మీ’ అంటూ చెప్పారని ఆరోపణలు వచ్చాయి. 

అప్పుడు ఆడియో, వీడియో టేపులలో వినిపించిన గొంతు చంద్రబాబు నాయుడిదా.. కాదా అనే విషయాన్ని తేల్చ ఆ గొంతు చంద్రబాబుదేనని నివేదిక ఇచ్చింది. దాంతో ఈ కేసు మీద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పటినుంచి పలు కోర్టులలో పోరాడుతూ ఉన్నారు. చివరకు సుప్రీంకోర్టులో సైతం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఇపుడు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 

స్వాగతిస్తున్నాం: ఆళ్ల
ఓటుకు కోట్లు కేసులో సత్వర విచారణ కోసం తాను చేసిన వ్ఞిప్తిని సుప్రీంకోర్టు అంగీకరించిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నాయని, విచారణను వాయిదా వేయాలన్న చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందని తెలిపారు.బోఫోర్స్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట

Updated By ManamFri, 11/02/2018 - 12:16

న్యూఢిల్లీ: బోఫోర్స్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. సీబీఐ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. కాగా బోఫోర్స్‌ ముడుపుల కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చుతూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Related News