Lokesh Babu

ఆ ఇద్దరికి ఓటిస్తే.. బీజేపీకి ఓటేసినట్టే: లోకేశ్

Updated By ManamSat, 09/29/2018 - 19:53

Lokesh babu, Ys jagan mohan reddy, Pawan Kalyan, Nara Lokesh, Vote to BJPతాడేపల్లిగూడెం: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఓటేస్తే.. ఆ ఓటు బీజేపీకి వేసినట్టే అవుతుందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మోదీ దత్త పుత్రుడు పవన్‌ కల్యాణ్‌, అవినీతి పుత్రుడు జగన్‌ ఒక్క మాట కూడా అనరని ఆయన విమర్శించారు.

జగన్‌, పవన్‌లకు ఓటేస్తే.. ఆ ఓటు కమలానికే చేరుతుందని అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన టీడీపీ ధర్మపోరాట సభలో లోకేశ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉందని, అయినప్పటికీ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించినట్టు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజనచట్టంలోని 18 హామీలు నెరవేరుస్తారనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, నాలుగేళ్లు ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదాకు మించిన ఆర్థికసాయం చేస్తామని నమ్మించి.. మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ ఏపీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుది ధర్మపోరాటమైతే.. మోదీది అధర్మ పోరాటమన్నారు. న్యాయం చేయమని అడిగితే బాబ్లీ కేసును తెరపైకి తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జోడెద్దుల బండి అని, ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని లోకేశ్ చెప్పారు. పోలవరం ఓ చరిత్ర: లోకేశ్

Updated By ManamWed, 09/12/2018 - 16:02

Polavaram Project, Lokesh Babu, Project prices, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్రని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీని, కానీ, పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తెచ్చామన్నారు. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతున్నామని లోకేశ్ తెలిపారు. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయని లోకేశ్ చెప్పారు. 'అలా చేస్తేనే అన్ని సీట్లు గెలవగలం' 

Updated By ManamThu, 07/12/2018 - 20:29

All seats win, booth level committees, Lokesh babuఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బూత్ లెవల్ కమిటీలు పటిష్టంగా ఉంటేనే అన్ని స్థానాలనూ గెలుచుకోవడం సులభంగా మారుతుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి బూత్‌ స్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 1500 రోజుల సందర్భంగా గురువారం అమరావతిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతిబూత్‌ పరిధిలో అదనంగా 10 ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనన్నారు. ఐదు వేల ఓట్లతో గెలిచే అసెంబ్లీ సెగ్మెంట్లే ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. పార్టీ తరఫున ప్రతి వంద మందికి ఒకరు చొప్పున సేవా మిత్రను మంత్రి లోకేశ్ నియమిస్తామని చెప్పారు.  పవన్‌ ఆరోపణలకు లోకేశ్ కౌంటర్

Updated By ManamSat, 06/09/2018 - 18:39

Lokesh babu, Pawan kalyan allegations, Real estate company, Fortune 500, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. స్థానికులకు కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకు టీడీపీ ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్న పవన్ ఆరోపణలను లోకేశ్ ఖండించారు. ‘‘ఫార్చ్యూన్- 500 కంపెనీల్లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఒకటి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు. ఏపీలో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉద్యోగాలు ఇవ్వబోతోంది. విశాఖలో టెక్ కంపెనీని ప్రారంభించేందుకు బీటీడబ్ల్యూ పల్సెస్ కంపెనీ కోసం భూమిని కేటాయించారు. ఆ కంపెనీకి సీఈవో శ్రీనుబాబు.. శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కల్పించడానికి ముందుకొచ్చే ప్రతిఒక్కరికి రెడ్ కార్పేట్‌తో స్వాగతం పలుకుతాం. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు వారికి కల్పించి వ్యాపార లక్ష్యాలను సాధించుకునేలా సహకరిస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కాలేదు’’ అని లోకేష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.తిరుమల వెంకన్నకు కాపలా కాసింది చంద్రబాబే: లోకేశ్

Updated By ManamTue, 05/22/2018 - 19:29

AP CM, chandrababu naidu, Tirumala temple, Lokesh babu విశాఖపట్నం: తిరుమలలోని వెంకన్నస్వామివారికి అహర్నిషలూ కాపలా కాసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏడుకొండల జోలికి వస్తే మాడి మసైపోతారని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించింది చంద్రబాబేనని ఆయన గుర్తుచేశారు. టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో లోకేశ్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. ‘‘విభజన హామీలు, ప్రత్యేక హోదా పోరాటం నుంచి అందరి దృష్టిని మరల్చడానికే బీజేపీ నేతలు వెంకన్నను దించారు. టీటీడీలో అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మనలో ఐక్యతను కూలగొట్టడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అసలు వెంకన్నకు అహర్నిషలు కాపలా కాసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారే. 68 ఏళ్ల వయసులో ఇంతగా కష్టపడుతున్న ఆయనకు.. హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బీజేపీ రాజకీయాలు చేస్తోంది. 2019లో చంద్రబాబు పిలుపు మేరకు జనమంతా బీజేపీకి సినిమా చూపిస్తారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.జైట్లీ వ్యాఖ్యలు బాధాకరం: లోకేశ్‌

Updated By ManamTue, 04/17/2018 - 18:36

Lokesh babu, Arun Jaitley, AP CM Chandrababu naidu, Cash shortage issueఅమరావతి: ‘దేశంలో నగదుకు కొరత లేదని, తాత్కాలిక నగదు కొరత ప్రస్తుతం ఉంది’ అని కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని జైట్లీ మాట్లాడటం బాధాకరమని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో నగదు కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పరంగా పెన్షన్లు, ఉపాధిహామీ వేతనాల చెల్లింపులో కూడా తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన ఆయన.. నగదు సరఫరా చేయాలని స్వయంగా సీఎం లేఖ చేశారని, అనేక సార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నగదును అందుబాటులోకి తేవాలని లోకేశ్‌ ట్విట్టర్‌లో జైట్లీని కోరారు.‘లోకేశ్‌నూ చంద్రబాబు నమ్మలేని పరిస్థితి'

Updated By ManamMon, 03/19/2018 - 14:34

AP CM, Chandrababu naidu, Lokesh Babu, MP vijayasa reddy, AP special status న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన పార్లమెంట్‌ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రంగులు మారుస్తున్నారని విమర్శించారు. తన నీడను తానే నమ్మలేరని, లోకేశ్‌ను కూడా చంద్రబాబు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని, అటువంటి వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని, అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం ఆయన నైజమని ఆరోపించారు.

రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్‌ పెట్టి అరుణ్‌ జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తుచేశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీనే అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం విషయంలో చంద్రబాబు ఎలా మాట మార్చారో అందరికీ తెలుసునని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.

Related News