telangana

ఒడిశా ప్రాంతంలో వాయుగుండం

Updated By ManamFri, 09/07/2018 - 08:55

Rainవిశాఖపట్నం: పశ్చిమ బెంగాల్‌, ఉ‍త్తర ఒడిశా పరిసరాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. జంషెడ్‌పూర్‌కు ఆగ్నేయంగా 140 కి.మీల దూరంలో, కియోనఝఘర్‌కు 130 కి.మీల దూరంలో తూర్పు ఈశాన్య దిశగా వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో ఈ వాయు గుండం పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేణా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.

దీంతో ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెల్లొద్దని సూచించింది.ఫైస్లా హోగయా 

Updated By ManamThu, 09/06/2018 - 03:31

kcrహైదరాబాద్: అసెంబ్లీ రద్దు ఊహాగానాలకు గురువారం పొద్దున తెరపడింది. నాలుగు ఏండ్ల ఐదు నెలల తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిం చుకున్నారు. ఈ మేరకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. గురువారం మధ్యహ్నాం ఒంటి గంటలకు ప్రత్యేక మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏక వాక్యంలో అసెంబ్లీ రద్దుకు తెలంగాణ మంత్రిమండలి  నిర్ణయం అనే తీర్మానం చేయబోతున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే గవర్నర్ నరసింహన్‌ను రాజ్ భవన్‌లో మధ్యాహ్నాం 1.30 గంటలకు కలుసుకొని మంత్రివర్గ నిర్ణయాన్ని తెలియచే స్తారు. ఇదే తీర్మానం ప్రతిని శాసనసభ కార్యదర్శికి పంపిస్తారు. స్పీకర్ మధుసూదనాచారి సంతకంతో కూడిన అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని గవర్నర్‌కు అందచేయడం జరుగుతుంది. దీంతో రద్దు ప్రక్రయ పూర్తవుతుంది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరతారు.  శాసనసభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు పోవడానికి గల కారణాలను తెలియచేయచేసేందుకు పార్టీ ముఖ్యులతో మధ్యహ్నం  తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.  అసెంబ్లీ రద్దుకు సంబంధించి ఇప్పటికే  పార్టీ అధిష్టానం నుండి  పలువురు ఎమ్మెల్యేలకు  సంకేతాలు అందాయి. అధికారిక కార్యక్రమాల్లో ఉన్న మంత్రులంతా  బుధవారం రాత్రికే  నగరానికి చేరుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం పంపింది. 6న అసెంబ్లీ రద్దు, 7న హుస్నాబాద్‌లో బహిరంగ సభ అనే సందేశాలు కరీంనగర్ జిల్లా  పార్టీ ప్రజా ప్రతినిధులకు చేరాయి. రెండు రోజుల పాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. కె. జోషి, శాసనసభ కార్యదర్శి నర్సింహ్మచార్యులు, సాధారణ పరిపానల శాఖ    ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం గవర్నర్‌తో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా ఎస్.కె. జోషీ ముఖ్యమంత్రికి వివరించారు. 

kcr

శాసనసభ రద్దుకు సంబంధించి తయారు చేసిన ఏక వాఖ్య తీర్మానం, దానికి మంత్రివర్గ ఆమోదం, గవర్నర్‌కు అందచేయడం తదితర అంశాలపైన చర్చించినట్టు తెలిసింది. శాసనసభను రద్దు చేయడంలో ఉత్పన్నం కానున్న రాజ్యాంగపరమైన అంశాలు, శాసనపరమైన సమస్యలు చర్చకు వచ్చినట్టు  తెలిసింది. దీంతో కేబినెట్ భేటీ, తీసుకోనున్న నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.  ముఖ్యమంత్రితో భేటీకి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కె. జోషి సచివాలయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు, పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులతో చర్చించారు. ఆపధర్మ ప్రభుత్వంలో తీసుకోవలసిన చర్యలు, అనుసరించవలసిన విధానాలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. గురువారం నుండి తెలంగాణలో అపధర్మ ప్రభుత్వం అమలులోకి రాబోతున్నందున మంత్రి వర్గం ఆమోదం పొందాల్సిన కీలకమైన ఫైళ్ల పై  చర్చ జరిగినట్లు తెలిసింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో అధికారులు, అనధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమై  వివిధ అంశాలపైన  మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకున్నారు.  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిపించడానికి ఈ నెల 10 తర్వాత నోటిఫికేషన్ వెలువడే  అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో ఎన్నికలు జరిపించడానికి వీలుగా గురువారం అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్  ముందస్తు  రాజకీయ వ్మూహంతో పావులు కదిపారు. అసెంబ్లీ రద్దు, ఎన్నికల ప్రచారం పై పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం మంత్రివర్గాన్ని సమావేశపరిచి అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకున్న వెంటనే గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకొని తీర్మానాన్ని అందచేయడం, తీర్మానం ప్రతిని శాసనసభ కార్యదర్శికి పంపించడం,  ఆ వెంటనే తెలంగాణ భవన్‌లో ముఖ్యులతో సమావేశం కావడం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం  ఢిల్లీ పరిణామాలపై కూడా  అధికారు లు, అనధికారులతో సమాలోచనలు జరిపారు. ముందస్తు ఖాయంగా తెలడంతో కేసీఆర్‌కు కలిసొచ్చిన కోట కరీంనగర్  నుంచే ముందస్తు  సభలు నిర్వహించేందుకు నిర్ణయించారని కరీంనగర్‌కు జిల్లా ఎమ్మెల్యే  ఒకరు తెలియచేశారు. శుక్రవారం నాటికి మీరంతా మాజీలవుతారు అని ఐటి మంత్రి కేటీర్ తనను కలుసుకున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన  వాఖ్యలు అసెంబ్లీ రద్దుకు సంకేతాలని పేర్కొన్నారు. గురువారం ఉదయం అసెంబ్లీని రద్దు చేసే ఆవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు.దూకుడు పెంచిన టీఆర్‌ఎస్

Updated By ManamThu, 09/06/2018 - 00:13
 • ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్

 • 50 రోజుల్లో 100 బహిరంగ సభలు! 

 • 7న హుస్నాబాద్ సభతో తొలి అడుగు

 • తమ 4 ఏళ్ళ ప్రగతితో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్

imageహైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తన దూకుడును పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఎన్నికలు సమిపిస్తున్నాయంటూ చెబుతున్న అన్ని పార్టీల నేతల వాదనకు బలం చేకురినట్లయ్యింది. ఎన్నిక లు ఎప్పుడూ వచ్చిన తామంతా అందుకు సిద్దంగానే ఉన్నామని ఎవరికి వారు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఏ ఇద్దరూ ఎక్కడ కలిసినా అందరి నోట ఎన్నికల మాటే వినపడ్తుండటం చూస్తుంటే...ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయనడంలో సందేహం కలుగక మానదు. ఇక, ఇదంతా ఒక ఎత్తయితే, ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ జరిపిన ప్రగతి నివేదన సభలో గులాబి బాస్ ముందస్తు..ఎన్నికలకు సంకేతాలు ఇస్తారన్న అనుమానాలను పటాపంచెలు చేయడంతో.. ప్రతి పక్షాలన్ని టీఆర్‌ఎస్‌పై మండిపడుతూనే...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుకు సిద్దమేనని అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు.

అధికార పార్టీ తన నాలుగేళ్ల అభివృద్ధితో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంద నే ఊహగానాలే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆ వార్తాలను నిజం చేసే విధంగా నేడో..రేపో గులాబి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమే ఎక్కువగా ఉందన్న వార్తలు సైతం అన్ని పార్టీల్లో చర్చకు తెరతీస్తున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్‌ఎస్ తన ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేసింది. ఈనెల 7న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో అధికారుల భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత పది రోజుల్లోనే తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ రెండు సార్లు భేటి అయ్యారు. ఇదిలా ఉండగానే సీఎం కలిసిన రెండు, మూడు రోజుల తర్వాత ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సమావేశమయ్యారు.

ఈ భేటీకి ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అటు సీఎస్‌తో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతకు ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్‌వేర్ ఈఆర్‌వో నెట్ 2 వెర్షన్ అన్ని జిల్లాల ఎన్నికల విభాగం అధికారులకు శిక్షణ ఇచ్చి, వారిని ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తొంది. అయితే, ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తుందని రజత్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. వరుసగా గవర్నర్ నరసింహ్మన్‌తో ఉన్నతాధికారుల భేటీలు, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.అవన్నీ ఊహాగానాలే: రజత్ కుమార్

Updated By ManamWed, 09/05/2018 - 16:02
Telangana Election Commission CEO Rajat Kumar Meet

హైదరాబాద్ : డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. అనంతరం రజత్ కుమర్ మాట్లాడుతూ..ఇవాళ్టి తమ భేటీలో ముందస్తు ఎన్నికలపై ఎలాంటి చర్చ జరపలేదన్నారు.ఈవీఎంల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. 

ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఊహాగానాలు మాత్రమేనని, అలా అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గైడ్‌లైన్స్ ఇస్తుందన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు తాము ఇప్పటి నుంచి సన్నద్ధం అవుతున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ఇక ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.'కేసీఆర్ మళ్లీ సీఎం'

Updated By ManamTue, 09/04/2018 - 21:20
 • రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు

KCR, CM, Telangana, Ramdas Athawaleహైదరాబాద్: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథవాలే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మహిళల సంక్షేమం, పేదలకు, రైతులకు, దళితుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ చెబుతున్న తరుణంలో అథవాలే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.   ‘తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది’

Updated By ManamTue, 09/04/2018 - 17:44
Nara lokesh

విశాఖ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఇక పొత్తులపై పొలిటిబ్యూరో నిర్ణయం తీసుకుంటుందని నారా లోకేశ్ తెలిపారు.

‘ఫింటెక్ ఫెస్టివల్’ కు విశాఖ సరైన ప్రదేశం
రాష్ట్ర విభజన తర్వాత 99 శాతం ఐటీసంస్థలు అన్నీ హైదరాబాద్‌కే పరిమితం అయ్యాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం సాంకేతికంగా ముందంజలో ఉందన్నారు. ‘ఫింటెక్ ఫెస్టివల్’ కు విశాఖ సరైన ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ఇదో బృహత్తర వేదిక అని, వినూత్న ఆవిష్కరణలకు ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. అక్టోబర్ 22 నుంచి 26 వరకూ ఈ ఫింటెక్ ఫెస్టివల్ జరగనుందన్నారు.

సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందంజలో ఉందని, సాంకేతికత సాయంతోనే అనేక ప్రభుత్వ శాఖల్లో పని సులభతరమైందని, ఫింటెక్ టెక్నాలజీ వినియోగంలో అంతా ప్రథమ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఐటీని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయట్లేదని, మూడు ప్రాంతాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని లోకేశ్ అని అన్నారు.మమ్మల్నే కోరుకుంటున్నారు

Updated By ManamSun, 09/02/2018 - 23:55
 • త్వరలోనే ప్రజల ముందుకు ఎన్నికల మేనిఫెస్టో

 • ప్రభుత్వం ఉన్నంత కాలం ‘సంక్షేమం’ అమలు

 • కేసీఆర్‌ను గద్దె దించడం కూడా ఒక లక్ష్యమా

 • ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

kcrహైదరాబాద్: ‘తెలంగాణ ప్రజలు మరోసారి మమ్మల్నే కోరుకుంటున్నారు. తెరాసనే గెలిపిస్తామంటున్నారు. రాష్ట్రంలో ఏ ఊళ్లో అయినా ఇదే మాట వినబడుతుంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఏలాంటి నిర్ణయాలైన తెరాస ప్రభుత్వం తీసుకుంటుందనే నమ్మకం ఏర్పడింది. అందుకే మా గెలుపును ఆకాంక్షిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆదివారం కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. ఒకరి చేతిలో మనం బానిసలు కావొద్దు, నిర్ణయాధికారం మనమే ఉంచుకోవాలని ప్రజలకు చెబుతూ, చంచాగిరి చేసే గులాములం కారాదని ప్రజలు కూడా కోరుతున్నా రని ఆయన తెలిపారు. తెలంగాణ గులాబీలుగా ఆత్మ గౌరవంతో స్వపరిపాలన సాగాలని కోరుకుం టున్నారు, త్వరలోనే ప్రజల ముందుకు ఎన్నికల మేనిఫెస్టో రాబోతుంది. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసి తీరుతాము అని సీఎం తెలిపారు. అధికా రం మన దగ్గర ఉంటేనే ఆత్మగౌరవంతో బతుకుతాం...

మీ కళ్లముందుంది... చేసిన వాగ్ధానాలు, ఇచ్చిన హామీలు అమలు జరిపిన తర్వాతనే మరో సారి ప్రజా మద్దతు కోరుతాను...  ఢిల్లీకి గులాంగా ఉందామనే పార్టీలను నమ్మకండి,  పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో  పాలించుకునే ఆలోచన చేయండి... ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయి,  వాటికి మోసపోకండని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. అధికారం మన దగ్గర ఉంటేనే అత్మగౌరవంతో బతుకుతామని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల ప్రగతిని అవిష్కరించారు. కోటి ఎకరాలకు సాగునీరందించి ఆకుపచ్చ తెలంగాణను చూడాలనేదే తన ఆకాంక్ష అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లించిన తర్వాతనే ఓట్లడుగుతామనే వాగ్ధానానికి కట్టుబడి ఉన్నామని తెలియచేశారు. ఇప్పటికే 22 వేల గ్రామాలకు నల్లా నీళ్లు అందాయని మరో 1300ల గ్రామాలకు ఏడెనిమిది రోజుల్లో అందించడం జరుగుతుందన్నారు. ఇంటింటికి నల్లా కార్యక్రమం 46 శాతం పూర్తయిందన్నారు.  ఓట్లు అడగడానికి ముందే, దీపావళిలోపే ఇంటింటికి కృష్ణా, గోదావరి నీళ్లు వస్తాయన్నారు. రెండవ విడత రైతు బంధు చెక్కులను నవంబనర్‌లో అందచేస్తామన్నారు.  అన్ని వర్గాల సంక్షేమ, అన్ని రంగాల్లో ఆశించిన ప్రగతి సాధించేంత వరకు నిరంతర శ్రమ కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 465 రకాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. 

kcrప్రభుత్వం సాధించిన ప్రగతి కళ్లముందు కనిపిస్తుందన్నారు.  తాను తెలంగాణ పిచ్చోడిని కాబట్టే ఇన్ని పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.  తెరాస ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు బంధు పథకం అమలవుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి సరైన సమయంలో  రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తిరిగి కేసీఆర్ రావాలి, తెరాస రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అద్బుతమైన తెలంగాణ కావాలి, సంక్షేమం పెరగాలి, పెరిగిన ఆదాయం పేదలకు పంచుకుందాం, పింఛన్లు పెంచుకుందాం, నిరుద్యోగులను ఆదుకుందాం అని అన్నారు. భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి  తెరాస ప్రధాన కార్యదర్శి   కేశవరావు అధ్యక్షతన మ్యానిఫెస్టో  కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదని, ప్రజలు ఆశీర్వదిస్తే అశించిన ప్రగతిని సాధించి తీరుతామన్నారు. తెలంగాణలో ఆశించిన అభివవృద్దిని సాధించడానికి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజానీకం తనను ఆశీర్వదించాలని విన్నవించుకున్నారు. జోనల్ వ్యవస్ధను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద పట్టుబట్టి సాధించుకున్నామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకపోతే ఇది సాధించుకోవడం సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలపై మీడియా కథనాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా  ప్రస్తావించారు. ఎన్నికలకు మరో ఆరు మాసాల సమయం ఉందని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయన్నారు.  
ముఖ్యమంత్రి హోదాలో కొత్త పథకాలు ప్రకటించడం అనైతికం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఇప్పటికే అనేక పథకాలు అమలు జరుపుతున్నామన్నారు. సాగునీటి విషయంలో ఎంతో పురోగతిని సాధించామన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించామన్నారు. కోటి ఎరకాల్లో ఆకుపచ్చ తెలంగాణను  చూపిస్తానన్నారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి వల్ల తెలంగాణ ఎంతగా నష్టపోయిందో ప్రజలకు తెలియంది కాదన్నారు. రాజకీయ అవితీని నిర్మూలించి అన్ని రంగాల్లో అశించిన ఫలితాలను రాబడుతున్నామన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడం ఒక లక్ష్యమా అని విపక్షాలను ప్రశ్నించారు. అలవికాని విపక్షాల మాటలు విని మోసపోవద్దని ప్రజలను కోరారు. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులం కారాదని, ఆత్మగౌరవంతో తెలంగాణలో పాలన సాగవలసి ఉందన్నారు. స్వతంత్ర జీవనం గడపడానికి గులాబీలుగా వికసించవలసి ఉందన్నారు. పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఆకుపచ్చ తెలంగాణ సాధించడంతో పాటుగా ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు లభించే విధంగా జోనల్ వ్యవస్ధను సాధించుకున్నామని వివరించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ప్రజలు ఆలోచించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం అని తెలియచేశారు.  రాష్ట్ర ఆర్థిక ప్రగతి 17.17 శాతానికి పెరిగిందన్నారు. ఆర్థిక పురోగతిని రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడుతామన్నారు.  పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుకపై  రూ. 9.60కోట్లు రాగా తెరాస నాలుగున్నరేళ్ల పాలనలో రూ. 1980 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం గురించి ఈ సందర్భంగ వివరించారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆత్మగౌరవంతో స్వీయపాలనతోనే అది సాధ్యమన్నారు. అందుకే మరో సారి పరిపాలనకు అవకాశం ఇవ్వండని కోరుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

విశేషాలు...
600 ఎకరాల్లో సభా ప్రాంగణం
వేదిక ముందు 16 గ్యాలరీలు
50 భారీ ఎల్‌ఈడీ తెరలు
15వేల ఎల్‌ఈడీ లైట్లు
24 ట్యాంకర్లు, 8 ట్రిప్పుల్లో నీటి సరఫరా
25 లక్షల మంచినీళ్ల బాటిళ్లు,  25లక్షల ప్యాకెట్లు
30 అంబులెన్స్‌లు, 8 మెడికల్ క్యాంపులు
1400 ఎకరాల్లో 9 పార్కింగ్ స్థలాలు
15 పార్కింగ్ లాట్లు
400 మంది వలంటీర్ల సేవలు
20 వేల మంది పోలీసుల మోహరింపు
డీజేపీ నేతృత్వంలో కంట్రోల్ కమాండ్
డ్రోన్ కెమెరాలతో పరిశీలన
300 సీసీ కెమెరాలతో నిఘా
ఆయుధాలతో ఆక్టోపస్ పహారా
సెల్ఫీలతో సందడి చేసిన కవిత

సభ సాగిందిలా.. సాయంత్రం
4.15: రెండు హెలికాప్టర్లలో ప్రగతి నివేదన సభాస్థలికి మంత్రలు చేరుకున్నారు.
5.45: బేగంపేట విమానశ్రయం నుంచి సీఎం కేసీఆర్ సభకు బయల్దేరారు. 
6.10: ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కొంగరకలాన్ చేరుకున్నారు. 
6.15: హెలీకాప్టర్ నుంచి సభా ప్రాంగణాన్ని కేసీఆర్ పరిశీలించారు.
6.25 : సీఎం కేసీఆర్ సభ వేదికపైకి వచ్చారు. సీఎంతో టీఎస్ ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.
6.26: తెలంగాణ అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు.
6.27: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహ్మద్ అలీ.. సీఎం కేసీఆర్‌కు దట్టీ కట్టారు.
6.30: రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావు, మంత్రులు కడియం శ్రీహరి, మహ్మద్ అలీ ప్రసంగించారు.
6.40: జై భారత్ అని ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
7.27: ముగిసిన సీఎం కేసీఆర్ ప్రసంగం
7.28: సభా వేదిక నుంచి వెనుదిరిగిన గులాబీ బాస్
7.30: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధన్యవాద ప్రసంగం చేశారు.
ప్రజలకు అభివాదం చేస్తూ బస్సులో ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం

కళాకారుల ధూంధాం..
ప్రగతి నివేదన సభా ప్రాంగణం కళాకారుల ఆటపాటలతో మార్మోగింది. వేదిక మీద టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతత్వంలోని సాంస్కృతిక సారథి బృందం పాటల రూపంలో వివరించింది. ఇప్పటి వరకు ప్రభు త్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు విడ మరిచి చెప్పారు. గాయని మంగ్లీ తన ఆటపాటలతో అలరించింది.రేపో మాపో శాసనసభ రద్దు!

Updated By ManamSun, 09/02/2018 - 04:01
 • డిసెంబర్‌లోపే ఎన్నికలు..?

 • నేడు మంత్రివర్గ కీలక భేటీ.. పెండింగ్ ఫైళ్లకు ఆమోద ముద్ర

 • అన్ని వర్గాలపై వరాల జల్లు.. ఉద్యోగులు, నిరుద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్: శాసనసభ రద్దుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. డిసెంబర్‌లోపే శాసనసభకు ఎన్నికలు జరిపించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నందున శానసనభ రద్దు ప్రక్రియలో వేగం పెరిగింది. ప్రగతి నివేదన సభ జరగడానికి రెండు గంటల ముందే మంత్రివర్గం భేటీ కాబోతుంది. కేబినెట్ ఆమోదం పొందాల్సిన అనేక ముఖ్యమైన ఫైళ్లు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చేరాయి. వీటిలో సుమారు వందకు పైగా ఫైళ్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లకు ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. లేని పక్షంలో మరో ఆరు మాసాల పాటు వివిధ శాఖల పరిధిలో పనులు నిలిచిపోయే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

image


ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే విధంగా కొత్త నిర్ణయాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. ఉద్యోగులకు కరవు భత్యం, మధ్యంతర భృతి, వృద్ధాప్య, వికలాంగ, వితంతువుల పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, గుర్తించబడిన 31 కులాలకు సామాజిక భవనాలు కట్టించడానికి భూముల కేటాయింపు తదితర అంశాల్లో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అన్నిరంగాల్లో ముందున్నం.. అందుకే ముందస్తుకు.. ‘రాష్ట్ర ఆదాయం 17.5 శాతం పెరిగింది. ఈ రాబడిని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం, అప్పులు చేసి ఆస్తులను కూడగడుతున్నాం, విద్యుత్ కోతలకు చరమగీతం పలికాం, సాగునీటి రంగానికి పెద్ద పీట వేశాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్ధను మెరుగుపరిచాం, వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చాం, రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం, ప్రైవేటు రంగంలో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగాం. పారిశ్రామిక పెట్టుబడులు రూ.1,23,000 కోట్లకు పెంచగలిగాం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతను ఇచ్చాం, అన్ని రంగాల్లో మెరుగైన ప్రగతిని చూపించగలిగాం, పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచాం, అందుకే ముందస్తు ఎన్నికలతో ప్రజల మద్దతు కోరుతున్నాం’ అని అధికార పార్టీ సీనియర్ నాయకులు తెలియజేశారు.

ఆదివారం సాయంత్రం నగర శివారులోని కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేశారు. సుమారు 25 లక్షల మందిని సభకు సమీకరిస్తున్నారు. ఈ సభావేదిక నుంచే కేసీఆర్, మంత్రివర్గ నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది. శాసనసభను సమావేశపర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని తెలిసింది. ఆదివారం సాయంత్రం సభ ముగిసిన వెంటనే రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలుసుకొని శాసనసభ రద్దు నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. శాసనసభలో తెరాసకు 90 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 13, మజ్లీస్‌కు 7, భాజపాకు 5, టీడీపీకి 3, సీపీఎంకు ఒక స్థానం ఉంది. గత ఎన్నికల్లో తెరాసకు 66,20, 326 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 56,68,061 ఓట్లు వచ్చాయి. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తెరాస ఓట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు మాసాలుగా అంతర్గతంగా రాజకీయ కసరత్తు చేశారు. ఢీల్లీ స్థాయిలో జరగాల్సిన పనులను చక్కదిద్దుకున్నారు. జోనల్  వ్యవస్ధకు రాష్ట్రపతి ఆమోదం పొందడంలో విజయం సాధించారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు తీపి కబురు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. పార్టీ సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ వ్యూహాన్ని వెల్లడించడంతో పాటుగా యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్దం చేశారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరిపించాలనే పట్టుదలతో కార్యక్రమాల్లో వేగం పెంచారు.మహిళా ఉద్యోగులకు శుభవార్త..!

Updated By ManamSat, 09/01/2018 - 18:27

Telangana, Woman govt Employees, maternity leavesహైదరాబాద్: మహిళా ఉద్యోగులకు శుభవార్త. మహిళా ఉద్యోగులకు ఇకపై ఏడాదికి 5 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇటీవలే ప్రభుత్వం.. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల సదుపాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. గర్భం ధాల్చిన సమయంలో మహిళలు 180 రోజులు సెలవులు తీసుకోవచ్చు. అలాగే పర్మినెంట్‌ మహిళా ఉద్యోగులకు జీతంతో పాటు సెలవులను ఇస్తారు.

ప్రసూతి సమయాన్ని డ్యూటీగానే పరిగణించి వారి సర్వీస్‌ను కొనసాగిస్తారు. గర్భిణి 8వ నెల నుంచి ఎప్పుడైనా 180 రోజులు ఉపయోగించుకోవచ్చు. మొదటి, రెండో కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులు వినియోగించుకోవచ్చు. ఒకటి, రెండు కాన్పుల్లో పిల్లలు చనిపోతే మూడో కాన్పులో సెలవులకు అవకాశం కల్పిస్తారు. కాన్పునకు ముందు లేదా తరువాత ఉద్యోగికి ఉండే సాధారణ సెలవులుగా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు

Updated By ManamSat, 09/01/2018 - 16:23
 • విద్యుత్ డిస్కంలకు ప్రమోషన్లు.. సీఎం కేసీఆర్ ప్రకటన 

Telangana, Power employees, promotions, CM Kcr, TRS govt హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణ విద్యుత్ డిస్కంలలో ప్రమోషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న రఘురామిరెడ్డి పదవిని 2019 మే వరకు పొడిగించారు. ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు రాములు, పర్వతం, మదన్ మోహన్ రావు, స్వామిరెడ్డి, ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్లుగా మోహన్ రెడ్డి, సంధ్యారాణి, గణపతి, నర్సింగరావు, యూనస్‌లకు ప్రమోషన్ ఇచ్చారు. జెన్‌కో డైరెక్టర్లుగా లక్ష్మయ్య, అజయ్, టీఎస్ఆర్ ఈడీసీవో వీసీ ఎండీ జానయ్య ప్రమోషన్ కల్పించారు.  

35 శాతం పీఆర్సీ.. హెల్త్ స్కీమ్ అమలు..

శనివారం ప్రగతి భవన్‌లో విద్యుత్‌ ఉద్యోగుల సంఘాలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. మాట్లాడుతూ.. విద్యుత్‌ ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ అమలు చేస్తామని ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ ప్రకటించారు. తెలంగాణ తొలి విజయం విద్యుత్ శాఖలోనే సాధించామని ఆయన అన్నారు. వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ఆగ్రస్థానంలో నిలిచిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినట్టు చెప్పారు. కేసులు పరిష్కారం కాగానే మిగతా ఉద్యోగులనూ క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Related News