hunger strike

దీక్ష విరమించిన హార్దీక్ పటేల్.. 

Updated By ManamWed, 09/12/2018 - 16:48

Patidar Leader, Hardik Patel, Hunger Strike, Patidar reservationsగుజరాత్: పాటిదార్ల రిజర్వేషన్ల కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమ నేత హార్దిక్ పటేల్ దీక్ష విరమించారు. బుధవారం ఆయన దీక్షను విరమించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పటేళ్ల రిజర్వేషన్ల కోసం 19 రోజులుగా హార్దిక్ దీక్ష చేస్తున్నారు. అయితే హార్దీక్ ఆరోగ్యం క్షీణించడంతో తన అనుచరులు, మద్దతుదార్ల అభ్యర్థన మేరకు నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

పటేళ్ల రిజర్వేషన్లు, విద్య, రైతుల రుణమాఫీ కోసం హార్దిక్ తన నివాసం వద్ద ఆగస్టు 25న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ మంగళవారం హార్దీక్‌ను నిరాహార దీక్షను విరమించాల్సిందిగా కోరారు. ఇటీవల రావత్ అసోం కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రావత్‌.. హార్దీక్ దీక్ష చేసే ప్రాంగణానికి వెళ్లి మద్దతు తెలిపారు. సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష!

Updated By ManamWed, 06/13/2018 - 15:04

ramesh న్యూఢిల్లీ  : కడప స్టీల్ ఫ్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సమావేశం పెట్టినా అంత ఆశాజనకంగా లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగామని, ఇందుకు సంబంధించి అన్ని అంశాలు ప్రస్తావిస్తామన్నారు. అప్పటికీ  స్పందించకపోతే కడపలో అన్ని వర్గాలవారిని కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రజలు బాధపడుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అంటూ వైసీపీ రాజీనామాల డ్రామా  కొనసాగుతోంది, కనీసం రాజీనామాలు ఆమోదింపజేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వారి రాజీనామాలు  ఆమోదం పొందినా ఎన్నికలు రావని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తే 24 గంటల్లో ఆమోదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్  పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని, పోలవరం ఆంధ్ర, రాయలసీమకు ఒక వరం అని అన్నారు.
 ద్రోహం.. వంచన

Updated By ManamSat, 04/21/2018 - 05:03
 • కేసులు పెడతామని బెదిరిస్తున్నారు..  కేంద్రానికి దాసోహమయ్యే పనే లేదు 

 • హోదా వచ్చేవరకు పోరాటం ఆగదు 

 • ప్రజలంతా నాకు మద్దతు పలకండి

 • వైసీపీతో కేంద్రం లాలూచీ పడింది 

 • 25 ఎంపీ సీట్లు నాకు ఇచ్చి పంపండి

 • ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దాం 

 • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

 • ధర్మ పోరాట దీక్ష విజయవంతం


babu strikeఅమరావతి (మనం ప్రతినిధి): రాష్ట్రం మీద కేంద్రం కక్ష గట్టిందని, నమ్మకద్రోహం, నయవంచనకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో శుక్రవారం ఒక రోజు ధర్మపోరాట దీక్షను ముగించిన తరువాత నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చుకునే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందనీ, ప్రజలంతా తనకు మద్దతు పలకాలన్నారు. ‘నాకు హై కమాండ్ లేదు..ప్రజలే నా హై కమాండ్’ అని వ్యాఖ్యానించారు. తనపై నమ్మకంతో రైతులు 34 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారన్నారు. రాజధాని డ్రీమ్ సిటీగా ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో పటేల్ విగ్రహానికి రెండు వేల కోట్లు ఎలా ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రానికి రాజధాని అవసరమా, లేదా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం రిక్తహస్తం చూపించిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పురోగతి కోసం తాను నాలుగేళ్లుగా మౌనంగా ఉన్నానన్నారు. అపుడే ఎన్డీయే నుంచి బయటకు వస్తే రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేవి కావన్నారు. రాష్ట్రంలో నెలకొల్పే జాతీయ విద్యాసంస్థలకు కూడా నిధులివ్వటం లేదని, చివరకు విసిగి వేసారి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తుంటే కేసులు పెడతామని, కర్ణాటక ఎన్నికల తర్వాత సంగతి చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. బెదిరిస్తే బెదిరిపోయే నాయకుడిని తాను కాదని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీతో వారు లాలూచీ పడ్డారని.. కళంకిత పార్టీతో స్నేహం చేస్తూ ఎన్నో కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ‘నేను మీ చిట్టా విప్పితే అసలు విషయాలు బయటపడతాయి’ అని చంద్రబాబు కేంద్రాన్ని హెచ్చరించారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా కేంద్రానికి దాసోహం అనే పనే లేదన్నారు. తన నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎవరికీ భయపడింది లేదన్నారు. వాజ్ పేయి హయాంలో ఒక్క పదవి కూడా తీసుకోకుండా మద్దతిచ్చిన సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడి అని, కానీ ఆ ప్రాజెక్టు రావటం కొందరికి ఇష్టం లేదన్నారు. విశాఖ రైల్వే జోన్ పై నాలుగేళ్లుగా కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని ఇంటిముందు ధర్నా చేసిన ఏకైక పార్టీ టీడీపీయేునని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాలను బలహీనపర్చాలని చూస్తున్నారన్నారు. వైసీపీ తో లాలూచీపడి తనను  ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా రని, కానీ లాలూచీ రాజకీయాలు తన జీవితంలో లేవని అన్నారు. కలిసి రాని వాళ్ళను ఏం చేయాలో ప్రజలే తేల్చాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన వెంటే ఉన్నారని, రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలను ఎన్నికలకే పరిమితం చేసి తనతో పోరాటానికి కలిసి రావాలన్నారు. బంద్‌లు, విధ్వంసాలతో రాష్ట్రప్రగతిని అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు.

25 సీట్లలో గెలిపించండి babu meet
వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. అపుడు ప్రధానమంత్రిగా ఎవరుండాలో తామే నిర్ణయిస్తామనీ, విభజన హామీలన్నిటినీ నెరవేర్చుకుంటామని అన్నారు. నరేంద్రమోడీకి పరిపూర్ణ మెజారిటీ రావటం వల్లనే ఏపీని నిర్లక్ష్యం చేశారన్నారు. కేంద్రం ఏపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తే సంఘటిత పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. పోరాటంలో ఇది తొలి అంకమేననీ, అన్ని జిల్లాల్లో మేధావులతో సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరి వ్యక్తిత్వాన్నీ దెబ్బతీసే కుట్రలకు పాల్పడనని ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు సమాధానమిచ్చారు. ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడడటం, మాట్లాడించడం తన చరిత్రలో లేదన్నారు. అలాంటి రాజకీయాలకు తాను మొదటినుంచి దూరంగా ఉంటానన్నారు.

దీక్ష విరమించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షను విరమించారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లోని పురపాలక మైదానంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన రాత్రి 7 గంటలకు దీక్ష విరమించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చి న ఇద్దరు చిన్నారులు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. తనతో పాటు దీక్షలో పాల్గొన్న 96 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి కృష్ణయ్యకు చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. వైసీపీ ఎంపీల ఆరోగ్యం సర్లేదు: అనంత

Updated By ManamTue, 04/10/2018 - 14:44

YSRCP Sr Leader Anantha Venkatarami Reddy Over MPS Hunger Strike

అనంతపురం: ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. "కేంద్రం తన వైఖరి చెప్పడం లేదు. వెంకయ్యనాయుడు ఆనాడు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. సభలో ఇచ్చిన హామీ అమలుపై వెంకయ్య జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదాపై టీడీపీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి హోదా అంశం వాడుతున్నారు. తక్షణమే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలి" అని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలిస్తే ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. మంచి ఆశయం కోసం వైసీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.హోదా కోసం వైసీపీ సంచలన నిర్ణయం

Updated By ManamSat, 03/31/2018 - 19:25

YSRCP MPs Will Sit for Indefinite Hunger Strike Says YS Jagan

గుంటూరు: పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క వ‌ర్గం పేరేచెర్ల‌ ‘ప్రజా సంకల్పయాత్ర’లో భాగంగా బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. రాజీనామా అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఎంపీలు ఆమరణ దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు. వైసీపీ ఎంపీలంతా స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పిస్తారన్నారు. ఎంపీల దీక్షకు మద్దతుగా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షకు దిగుతాయని జగన్ తేల్చిచెప్పారు. కాలేజీల్లో విద్యార్థులు కూడా రిలే దీక్షలు చేపట్టి సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా వైసీపీ అధిపతి పిలుపునిచ్చారు. మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి మద్దతివ్వాలన్నారు. 

హోదా మనకు ఊపిరి కాబట్టి.. టీడీపీ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినా చేయకపోయినా పార్లమెంట్ చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ స్పష్టం చేశారు. కాగా ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా పార్టీ ఎంపీలతో సమావేశమైనప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులోనే భాగంగా ఇప్పటికే వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలపై సంతకాలు కూడా పెట్టిన సంగతి విదితమే. మొత్తానికి చూస్తే హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ తాజా నిర్ణయం మరింత వేడెక్కించారని చెప్పుకోవచ్చు. ఓ వైపు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్న తరుణంలో.. జగన్ కూడా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అన్నా నిరశన

Updated By ManamWed, 03/28/2018 - 01:37

సామాజిక కార్యకర్త కిసాన్ బాబూరావ్ హాజరే అలియాస్ అన్నా హజారే ఏడేళ్ల తర్వాత అదే రామ్‌లీలా మైదానంలో మళ్లీ నిరవధిక నిరశన దీక్షకు సిద్ధమయ్యారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి దీక్షకు ఉపక్రమించగా, మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధి గ్రామస్తులు అనూహ్య రీతిలో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి తమ మద్దతు తెలి పారు. 2011లో ఇదే రాంలీలా మైదానంలో లోక్‌పాల్ లేదా జాతీయ స్థాయి అంబుడ్స్‌మన్ (తీర్పరి వ్యవస్థ)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో యూపీ ఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అన్నా దీక్షకు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. అయితే ఆనాడు పరోక్షంగా మద్దతు ఇచ్చిన బీజేపీ సారథ్యంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం హజారే డిమాండ్ల పరిష్కార సాధన కోసం కృషిచేయకపోగా దీక్షను అన్నివిధాల అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రామ్‌లీలా మైదానానికి తరలివస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి రైళ్ళను రద్దుచేయడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను అడ్డు కొని హజారే దీక్షకు పెద్దగా ప్రజా మద్దతు లేదనే వాతావరణాన్ని సృష్టిం చేందుకు మోదీ ప్రయత్నం శతథా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అవినీతి కేసులు పెచ్చు పెరిగిపోతున్నప్పటికీ లోక్‌పాల్ నియమించకుండా మోదీ ప్రభుత్వం జాప్యం చేస్తుండడమేకాక, రాష్ట్రాల్లో లోకా యుక్తలను ఏర్పాటు చేసే ప్రక్రియను నిర్వీర్యం చేస్తోంది. అదేవిధంగా 2014 ముందు స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ దాని ఊసే ఎత్తకపోవడంతో వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రతరమై రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వ్యవసాయ సంక్షో భాన్ని పరిష్కరించే డిమాండ్లతో మహారాష్ట్ర రైతాంగం ఇటీవల నిర్వహించిన లాంగ్ మార్చ్ నిరసన ప్రదర్శన సహా దేశవ్యాప్తంగా అనేకచోట్ల అన్నదాతలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిటీ సిఫా రసులను అమలుచేయాలని హజారే తలపెట్టిన నిరశన దీక్ష అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. 

గత ఆగస్టులోనే అన్నా హజారే తన డిమాండ్లు ప్రభుత్వానికి విన్నవిస్తూ లేఖలు రాశారు. 2013లో యూపీఏ ప్రభుత్వం లోక్‌పాల్-లోకాయుక్త చట్టం చేయడం, ఇప్పటివరకూ వాటి నియామకాలు జరగకపోవడంతో గతంలో మాదిరిగానే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని సృష్టించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి హజారే దీక్ష ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇదివరకటిలా సుప్రీంకోర్టు చొరవ చూపి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించే విషయం ప్రభుత్వం పరిధిలో ఉన్నవే అయినప్పటికీ అవి భస్మాసుర హస్తాల్లాగా తమను దహించి వేస్తాయని యూపీ ఏ, ఎన్డీఏ పాలకులు భయపడటం మూలాన అవి మూలన పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో అవినీతి పరులైన ప్రజాప్రతినిథులను తిరస్క రించే, వెనక్కు పిలిపించే హక్కును కల్పిస్తూ ఎన్నికల సంస్కరణలు రూపొం దించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, కమిషన్ ఫర్ అగ్రి కల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ)కి రాజ్యాంగ హోదాను, ప్రత్యేక ప్రతి పత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ అత్యంత సముచితమైనది. వ్యవసాయ సంక్షోభం కారణంగా దేశ రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఆత్మహత్యల బాట నుంచి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించే దిశగా పరిణామం చెందుతున్నా యి. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్ల మాట ఎలా ఉన్నా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్న డిమాండ్‌పై అన్నా హజారే నిరవధిక నిరశన దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే ఉద్యమించేందుకు సన్నద్ధమవు తున్న రైతులు ప్రేక్షకులుగా మారే ప్రమాదం ఉంది.

గతంలో బ్రిటిష్ సామ్రా జ్యవాద వ్యతిరేక ప్రజాపోరాటం తీవ్రతరమైన ప్రతి సందర్భంలోనూ గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం దేశం దృష్టిని తనవైపు మరల్చడంతో ప్రజా గ్రహాన్ని సద్దుమణిగిన చారిత్రక అనుభవమే హజారే ఉద్యమంలో పునరా వృత్తమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే పునరావృత్తమయ్యే ప్రతి చారిత్రక సందర్భం తొలిసారి విషాదాంతంగాను, మలిసారి ప్రహసనంగా మారుతుం దనేది చారిత్రక నియమం. హజారే ఉద్యమంలో నిజాయితీ లేదని కాదు, అవి ఉద్యమించవలసిన అవసరం లేని డిమాండ్లనీ కాదు. అయినప్పటికీ ఒక మిలి టెంట్ రైతాంగ ఉద్యమం పురుడుపోసుకుంటున్న సమయంలో హజారే తల పెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఉద్యమాన్ని మోదీ ప్రభుత్వం ఒక చారిత్రక ప్రహసనంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. హజారే దీక్ష ఏ మేరకు కేంద్రంలో కదలిక తీసుకురాగలదన్నది సమస్య కాదు, దానికి మద్దతుగా, సమాంతరంగా దేశవ్యాప్త కర్షక, కార్మిక, ప్రజాస్వామిక ఉద్యమాలు ఉనికిలోకి వస్తే మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పదు.అన్నా నిరవధిక దీక్ష ప్రారంభం

Updated By ManamSat, 03/24/2018 - 04:35
 • కేంద్రంలో లోక్‌పాల్ నియమించాల్సిందే

 • రాష్ట్రాలలో లోకాయుక్త నియామక డిమాండ్

 • రాంలీలా వైుదాన్ వేదికగానే మళ్లీ నిరశన

న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్‌ను నియమించాలన్న ప్రధాన డిమాండుతో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే దేశ రాజధానిలోని రాంలీలా వైుదాన్‌లో నిరవధిక నిరహార దీక్ష ప్రారంభించారు. ఇదే డిమాండుతో దాదాపు anna hazare protestఏడేళ్ల క్రితం కూడా అన్నా నిరవధిక దీక్ష ప్రారంభం ఆయన దీక్ష చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 2011 నాటి దీక్షా వేదిక వద్దే ఇప్పుడు కూడా ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
   కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాలలో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటుచేయాలంటూ హజారే ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కోరుతున్నారు. అన్నా దీక్ష కారణంగా రాంలీలా వైుదాన్ వైపు లక్షలాది మంది ప్రజ లు వచ్చే అవకాశం ఉన్నందున అటు వైపు వెళ్లద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు. ముఖ్యంగా అరుణా అసఫ్ అలీ రోడ్డు, ఢిల్లీ గేటు, దర్యాగంజ్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, అజ్మీరీగేట్, పహర్‌గంజ్, ఐటీఓ, రాజ్‌ఘాట్, మింటో రోడ్, వివేకానంద మార్గ్, జేఎల్‌ఎన్ మార్గ్ వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు.

Related News