died

17 మందిని చంపిన వీడియోగేమ్

Updated By ManamFri, 08/10/2018 - 16:23

grand theft auto

గ్రాండ్ థెఫ్ట్ ఆటో.. ఇది వీడియో గేమ్ పేరు. ఈ ఆట‌ను బాగా ఇష్ట‌ప‌డే రౌడీ ముఠా ఒక‌టి, అందులో మాదిరిగానే మ‌ర్డ‌ర్లు, దోపిడీలు చేయాల‌ని ప‌థ‌కం వేసింది. ఇందులో భాగంగా రాజ‌ధాని మాస్కో శివారులోని ప్ర‌ధాన ర‌హ‌దారిపై కాపు కాస్తారు. ముందుగా రోడ్డుపై మేకులు దిగ్గొట్టిన ఐర‌న్ ప్లేట్‌ను రోడ్టుపై ప‌డేసి ప‌క్క‌నే మాటు వేసి ఉండేవారు. ఆ ప్లేట్ మీదుగా వెళ్లిన వాహ‌నం టైరు పంక్చ‌ర్ కాగానే ముఠా స‌భ్యులు న‌లుగురు త‌మ తుపాకుల‌తో ఆవాహ‌నంలోని వారిపై విచ్చ‌ల‌విడిగా కాల్పులు జ‌రిపేవారు. అనంత‌రం వారి వ‌ద్ద ఉన్న‌సొత్తును దోచుకుని ప‌రార‌య్యేవారు. ఇలా.. వారు రెండేళ్ల‌లో 17 మంది ప్రాణాలు తీసేశారు.  వారి బారిన ప‌డి మృతి చెందిన‌ వారిలో ఒక పోలీసు అధికారి, సీనియ‌ర్ బ్యాంక‌ర్‌, ప్ర‌ముఖ డ్యాన్స‌ర్ ఉన్నారు. మాస్కోలోని కోర్టు నిందితుల‌కు జీవిత కాల జైలు శిక్ష విధించింది. ఈ ముఠా స‌భ్యులు త‌మ ల‌క్ష్యం కోసం ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేస్తున్నార‌ని కూడా పోలీసులు తెలిపారు. ఇలాంటి మ‌రో గ్యాంగ్‌ను గ‌త ఏడాది పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే, పోలీసుల‌పై దాడి చేసి ఆయుధాలు గుంజుకుని ప‌రార‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారిని కాల్చి చంపేశారు.ఆ పాము మృతితో వెక్కి వెక్కి ఏడ్చారు

Updated By ManamThu, 08/02/2018 - 17:06

snake పిఠాపురం: గత 26రోజులుగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని ప్రజలు దేవుడిగా కొలుస్తూ పూజలు చేస్తున్న పాము గురువారం మృతి చెందింది. బుధవారం కుబుసం విడిచిన పాము అనుకోకుండా మృతి చెందడంతో ఆ గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు.

అయితే 26రోజుల క్రితం దుర్గాడ గ్రామంలోని ఓ రైతు పొలంలో ఈ పాము కనిపించింది. దాని దగ్గరికి వెళ్లినా అది ఎవరినీ కాటు వేయకపోవడంతో సుబ్రమణ్య స్వామి స్వరూపం అంటూ గ్రామస్థులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఆ పాము విషపూరితమైందని, దాన్ని అక్కడి నుంచి తరలించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఏమీ చేయలేక అటవీ అధికారులు వెనక్కి తిరిగారు. ఇక ఆ పాముకు గుడి కట్టాలని అనుకుంటుండగా.. అంతలోపే పాము మరణించింది. దీంతో గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాము మృతి చెందిన స్థలంలోనే గుడి కట్టాలని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. కాగా మరోవైపు ఈ పాము మరణించడానికి గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ కారణమంటూ దుర్గాడ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆ ఎస్సైను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.పెద్దపల్లిలో ఘోర ప్రమాదం.. 200 లారీల ధ్వంసం!

Updated By ManamSun, 04/22/2018 - 22:52

lorry accident

పెద్దపల్లి: జిల్లాలోని రామగిరి మండలం లద్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇసుక లారీ ఢీకొని ఆదివారపేట ఉపసర్పంచ్ రాజయ్య మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఒక్కసారిగా ఇసుకలారీలపై దాడిచేశారు. ఈ ఘటనలో 200 ఇసుక లారీల అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం రాజయ్య మృతదేహంతో న్యాయం చేయాలని కేసముద్రం పీఎస్‌ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు లారీ ఓనర్లు సైతం తీవ్ర ఆగ్రహానికి లోనై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సమాచారం అందుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఘటనపై ఉన్నతాధికారులతో చర్చించారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.సాయుధ పోరాట యోధురాలు కమలమ్మ కన్నుమూత

Updated By ManamMon, 03/12/2018 - 00:36
  • సాయుధ పోరాట యోధురాలు కమలమ్మ కన్నుమూత

  • పురుషులకు దీటుగా పోరాడిన వీరనారి

హైదరాబాద్: నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కామ్రెడ్ చెన్నబోయిన కమలమ్మ(87) అనారోగ్యంతోkamalamma died ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమలమ్మ.. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందారు. ‘సై..సై.. గోపాల్‌రెడ్డి-నిలిచావూ ప్రాణాలొడ్డి’ అంటూ ఎన్నో జనం గుండెల్లో నిలిచిపోయే జానపదాలన్నెంటినో కమలమ్మ పాడారు. ఇక్కడి సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆమె భౌతికదేహానికి సీపీఐ నేతలు సహా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు నివాళులర్పించారు. అనంతరం వరంగల్ జిల్లాకు ఆమె పార్థీవ దేహాన్ని తరలించి అక్కడి పోచమ్మ మైదానంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కమలమ్మ ఆమె పోరాటాన్ని, ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016లో ఆమెను మహిళా అవార్డుతో సత్కరించింది.  తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన వీరనారి కమలమ్మ వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రంగాపురానికి చెందిన ముకుందాన్ని వివాహమాడారు. కమలమ్మ ఖ్యాతి  ఇతరదేశాలకు కూడా వ్యాపించింది. ఉద్యమ జీవితంలో చూపిన గుండె ధైర్యానికి రష్యా, జర్మనీ దేశాలు కమలమ్మ చరిత్రను పుస్తకాలలో పొందుపరిచాయి. కమలమ్మ చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేసింది. కమలమ్మ తన గానంతో, గొల్లసుద్దులతో రజాకార్ల దురాఘతాలను కళ్లకుకట్టినట్లు చెప్పి కోయప్రజలను ఉత్తేజపరిచారు.
 కంచిమఠంలో జయేంద్రసరస్వతి పార్థీవదేహం

Updated By ManamWed, 02/28/2018 - 11:54

 Kanchi Kamakoti Peetam చెన్నై: కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి శివైక్యం చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన పరమపదించారు. ఆస్పత్రి నుంచి ఆయన పార్థివ దేహాన్ని కంచిమఠానికి ప్రత్యేక అంబులెన్సులో తరలించారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని కంచిమఠంలో ఉంది. ఆయన తుదిశ్వాస విడిచారని తెలుసుకున్న భక్తకోటి, శిష్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రతి వెంకయ్య, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాతోపాటు పలువురు ప్రముఖులు ఆయన సంతాపం ప్రకటించారు. ఆయన మఠాధిపతిగా ఉన్న కాలంలో ఎన్నోసేవలు చేశారని ప్రముఖులు కొనియాడారు. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగళ్ తర్వాత ఆయన బాధ్యతలను చేపట్టారు. జయేంద్ర సరస్వతి మరణ వార్తతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆయన శివైక్యంతో హైదరాబాద్‌‌లోని మఠం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా.. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యార్. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఇరునీకల్ గ్రామంలో ఆయన జన్మించారు. 1954 మార్చి 22న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. 2018 ఫిబ్రవరి-28 ఉదయం జయేంద్ర సరస్వతి పరమపదించారు.పెళ్లికుమార్తె పెట్రోలు దాడి.. వరుడు మృతి

Updated By ManamSat, 02/24/2018 - 08:31

bridegroom deadజనగామ: కాబోయే పెళ్లి కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. జనగామ జిల్లా కంచనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి గొంగళ్ల యాకయ్య అనే యువకుడిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పెళ్లికొడుకు శనివారం అర్ధరాత్రి కన్నుమూశాడు. ఆరు రోజుల క్రితం జనగామలో యాకయ్య అరుణ పెట్రోలు పోసింది.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. ప్రియుడితో కలిసి కాబోయే భర్త, అతని తల్లిపై అరుణ పెట్రోలు దాడి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి కీలకాధారాలను రాబట్టినట్లు తెలిసింది.రోడ్డు ప్రమాదంలో అన్నాదమ్ముల మృతి

Updated By ManamThu, 02/15/2018 - 11:08

Two Brothers Died In Accidentసిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం దమ్మక్కపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని అన్నాదమ్ముళ్లు మృతి చెందారు. మృతులు కడారి రాంబాబు (39), కడారి చందు (33) అని తెలిసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ సాయంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మృతి

Updated By ManamWed, 02/14/2018 - 09:59

TDP Senior, Ex Central Minister Bolla Ramaiah Died

పశ్చిమ గోదావరి: కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రా షుగర్స్ ఎండీ, టీడీపీ నేత బోళ్ల బుల్లిరామయ్య(91 ) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. తణుకులోని ఆయన స్వగృహంలో రామయ్య తుదిశ్వాస విడిచారు. నాలుగుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేశారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో ఆయన జన్మించిన ఆయన 1984, 1991, 1996, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు.

1996-98 మధ్య కాలంలో ఆయన కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావ్, కామినేని సంతాపం తెలిపారు. పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రామయ్య మృతి టీడీపీకి తీరని లోటు అని నేతలు కొనియాడారు. కాగా రేపు మధ్యాహ్నం రామయ్య అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.చుక్క సత్తయ్య ఇక‌లేరు..

Updated By ManamThu, 11/09/2017 - 12:54

chukka sathaiah, no more,  artistజనగాం: ప‌్ర‌ఖ్యాత ఒగ్గు క‌ళాకారుడు చుక్క స‌త్త‌య్య ఇవాళ(82) క‌న్నుముశారు. ఒగ్గు క‌థ చెప్ప‌డంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారయ‌న‌. చిన్న‌ప్ప‌టి నుంచే ఒగ్గు క‌థ‌పై ఉన్న మ‌క్కువ‌తో ఒగ్గుక‌థ‌నే శ్వాస‌త‌గా మార్చుకొని దేశ వ్యాప్తంగా ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు స‌త్త‌య్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను గుర్తించి స్వ‌యంగ‌గా ఇందిర‌గా రా గాంధీ త‌న చేతుల‌తో స‌న్మానించారు.    

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత వైఎస్‌రాజశేఖరడ్డిచే ‘రాజీవ్‌గాంధీ’ అవార్డు రాష్ట్ర సాంస్కృతిక శాఖచే హంస అవార్డు, మద్రాస్ వారిచే కళాసాగర్ అవార్డు తదితర సత్కారాలు అందుకున్నారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఒగ్గు కళకు ఆయన అందించిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం సత్తయ్యకు ప్రతి నెల రూ.10వేల పింఛను అందిస్తోంది. 

 

 పులిపిల్లలకు ఆహారమయ్యాడు

Updated By ManamSun, 10/08/2017 - 16:48
  • ఆహార వ్యర్థాలను తీసేందుకు బోనులోకెళ్లి బలి.. బెంగళూరు జూలో గేట్ కీపర్‌పై పులిపిల్లల దాడి

  • మెడ పట్టుకు సఫారీలోకి లాక్కెళ్లిపోయిన వైనం.. అవయవాలను పీక్కు తిన్న పులి పిల్లలు

  • ఆర్తనాదాలు చేయడంతో మరింత రెచ్చిపోయి దాడి.. వారం క్రితమే చేరిన గేట్ కీపర్

బెంగళూరు, అక్టోబరు 8: సెక్యూరిటీగార్డుగా ఉద్యోగం మానేసిన ఆంజేనయ అలియాస్ అంజిని (40).. బెంగళూరులోని జూలో గేట్ కీపర్‌గా ఇటీవలే డ్యూటీలో చేరాడు! కానీ, ఉద్యోగంలో చేరి వారం తిరగకుండానే అతడు పులులకు ఆహారమైపోయాడు! బోనును శుభ్రం చేసేందుకు లోపలికి వెళ్లిన అతడిపైకి పులి పిల్లలు దాడి చేసి.. సఫారీ పార్కులోకి లాక్కెళ్లి తిన్నాయి! ఈ విషాద ఘటన బెంగళూరులోని బన్నెరఘట్ట బయలాజికల్ పార్కులో శనివారం సాయంత్రం జరిగింది. పులుల ఎన్‌క్లోజర్ బాధ్యతలను చూసే సిబ్బంది ఒకరు సెలవులో ఉండడంతో అంజిని ఆ బాధ్యతలు చూసుకున్నాడు. అదే క్రమంలో శనివారం సాయంత్రం కూడా ఏడాదిన్నర పులిపిల్లలుండే బోనును శుభ్రం చేసేందుకు లోపలికి వెళ్లాడు. పులులు తినగా మిగిలిన వ్యర్థాలను తీసేయడానికి.. పులిపిల్లలు ఉన్నది లేనిది గమనించకుండా వెళ్లిపోవడంతో అతడిపై అవి దాడి చేశాయి. తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ‘‘సాయంత్రం 5 గంటల తర్వాత పులుల సఫారీ అయిపోయాక ఆహారం ఇస్తుంటాం. అయితే, అనంతరం అంజిని పులి బోనులో మిగిలిన వ్యర్థాలు (మాంసపు ఎముకలు) తీసేందుకు లోపలికి వెళ్లాడు. అప్పటికే ఎమ్మెల్యే అశోక్ ఖెన్నీ దత్తత తీసుకున్న సూర్య అనే పులితో పాటు దాని రెండు పిల్లలు వన్య, ఝాన్సీరాణి బోనులోనే ఉన్నాయి. అయితే, కొత్త వ్యక్తి లోపలికి రావడంతో ఓ పులి పిల్ల అతడిపైకి దూకి మెడ కొరికేసింది. మరో పులి పిల్ల కూడా దానికి జత కలిసి అంజినిపై దాడి చేసింది. కాపాడంటంటూ అతడు ఆర్తనాదాలు చేయడంతో సఫారీ లోపలికి అతడిని పులి పిల్లలు లాక్కెళ్లిపోయాయి’’ అని జూ అధికారి వెల్లడించారు. ఘటన అనంతరం జూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చారు. పులులను చెదరగొట్టి అంజిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంజిని శరీర అవయవాలను అవి పీక్కుతిన్నాయని చెబుతున్నా.. అధికారులు మాత్రం దానిని ధ్రువీకరించలేదు. హక్కిపిక్కి కాలనీకి చెందిన ఆంజనేయకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరోవైపు పులి బోను గేట్లను సరిగ్గా వేయలేదని, దాని వల్లే పులులు దాడి చేసి చంపేశాయని జూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. అనుభవం లేని వ్యక్తిని పులి బోనులోకి ఎందుకు పంపించారని ప్రశ్నించగా.. అతడితో పాటు మరో జూ సిబ్బంది కూడా ఉన్నారని, పులులు అతడిని కూడా తరమినా తప్పించుకోగలిగాడని ఆయన చెప్పారు. కాగా, జూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. ఇంతకుముందు జూ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా సఫారీలోని రాయల్ బెంగాల్ టైగర్స్, వైట్ టైగర్స్ పడిన ఘర్షణను గుర్తు చేస్తున్నారు. జూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Related News