engagement

మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగిందంటే

Updated By ManamTue, 09/11/2018 - 10:06

Priyanka Chopra, Nick Jonasగత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకొని తమ బంధాన్ని బలపరుచుకున్నారు. అయితే అసలు వారు ఎలా పరిచయం అయ్యారు..? వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు కలిగింది,  అనే విషయాలు పెద్దగా ఎవరికీ తెలీవు. వీటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నిక్ జోనస్.

ప్రియాంక, తను కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యామని.. ఫస్ట్‌ మెసేజ్‌లతో సాగిన తమ బంధం ఆ తరువాత ఫోన్ కాల్స్‌తో ప్రేమ వరకు వచ్చిందని తెలిపాడు. ఇక తాము పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, ఫస్ట్‌ టైమ్ తామిద్దరం మెట్ గాలా ఈవెంట్‌లో కలిశామని పేర్కొన్నాడు. మొదట్లో మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండేవారిమని, కానీ తమ మధ్య ఏదో ఉందని తమ స్నేహితులు అనుకుండేవారని చెప్పుకొచ్చాడు. అయితే ఐదు నెలల క్రితమే తమ రిలేషన్‌షిప్ పట్ల తాము సీరియస్‌గా ఉన్నామని ఫీల్ అయ్యామని, ఆ తరువాత వెంటనే ఎంగేజ్ అయిపోయామని నిక్ చెప్పాడు. ఇక ఇద్దరికీ కలిపి ప్రిక్ అని పెట్టిన పేరు తనకు నచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో వీరిద్దరు వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు పడచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.శ్వేతాబసు‌కు నిశ్చితార్థం.. 

Updated By ManamSun, 06/03/2018 - 14:01

Shweta Basu Prasad, engagement, filmmaker Rohit Mittalముంబై: ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ‘ఎ...క్కడా...’ అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అందాల తార శ్వేతాబసు ప్రసాద్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. సినీ కెరీర్‌లో శ్వేతాబసు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. కొంతకాలం తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇటీవల శ్వేతాబసుకు నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆమె కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్టు తాజాగా మీడియాకు వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పారు. ‘‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావనే తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి.

ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలకు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో నా ప్రేమను వ్యక్తం చేశాను. పుణెలో నా ప్రేమకు రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంట్లో వారూ మా పెళ్లికి అంగీకరించడంతో ఇటీవల మా ఇద్దరి నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమే. పెళ్లి వెంటనే చేసుకోవాలనే తొందర లేదు. మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటకి చెప్పుకోవడం ఇష్టం లేదు’’ అని చెప్పారు. ‘కొత్త బంగారు లోకం’ చిత్రం తరువాత ‘కళావర్‌ కింగ్’, ‘రైడ్‌’, ‘కాస్కో’ తదితర తెలుగు చిత్రాల్లో శ్వేతాబసు నటించారు. ప్రస్తుతం రానున్న వెబ్ సిరీస్ ‘గ్యాంగ్‌స్టర్స్’లో శ్వేత నటిస్తున్నారు.  
 ఘనంగా అంబానీ తనయుడి నిశ్చితార్థం

Updated By ManamSun, 03/25/2018 - 12:59

akash ambani పనాజీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మొదటి కుమారుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. రోజీ బ్లూ డైమండ్స్ సంస్థ అధినేత రసెల్ శ్లోకా మెహతా కుమార్తె శ్లోక మెహతాతో ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం జరిగింది. మార్చి 24న గోవాలో ఈ వేడుక జరగగా.. ఇరు కుటుంబాలకు చెందిన స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు.

ఇక ఈ వేడుకలో అంబానీ తనకు కాబోయే కోడలికి స్వీట్‌ తినిపిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అనంత్‌-శ్లోకా వివాహం డిసెంబర్‌లో స్విట్జర్లాండ్‌లో ఘనంగా జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News