amith shah

కుటుంబ పార్టీకి వణుకు

Updated By ManamSun, 09/16/2018 - 23:09
 • అమిత్‌షా సభ విజయవంతం.. బీజేపీ రాష్ట్రాధ్యక్షులు లక్ష్మణ్  

imageహైదరాబాద్: కుటుంబ పార్టీ(టీఆర్‌ఎస్)కి వణుకు పుట్టించే విధంగా బీజేపీ సభ నిర్వహించినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమిత్ షా సభ విజయవంతమవడంతో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. అమిత్ షా సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. డబ్బులు ఇచ్చి సభలకు జనాలను అధికార పార్టీ తీసుకువచ్చిన ఎక్కడా స్పందన లేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి అధికారం ఇవ్వాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. అమిత్ షా మీటింగ్‌తో తమకు ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. అసద్ ఇంట్లో కూర్చొని అర్థం లేని ట్విట్ చేశారన్నారు. అక్టోబర్ లోపు 50 బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. హుజుర్‌నగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.'అక్కడ మోదీ సర్కారు.. ఇక్కడ బీజేపీ సర్కార్..'

Updated By ManamSat, 09/15/2018 - 17:05
 • బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరిన షా

 • తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామగ్రామం వెళ్తాం

 • బీజేపీ సర్కార్ లేకున్నా ఫెడరల్ స్ఫూర్తికి గౌరవం ఇచ్చాం 

 • మీడియా సమావేశంలో అమిత్ షా స్పష్టీకరణ

Amith Shah, BJP, BJP govt, Narendra Modi govt, Telangana State  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గ్రామం గ్రామం వెళ్తామని, పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ లేకపోయినా ఫెడరల్ స్ఫూర్తికి గౌరవం ఇచ్చామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ మద్దుతు ఇవ్వమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని, కేంద్రంలో మోదీ సర్కారు.. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణకు మోదీ సర్కారు అనేకం చేసిందని, ఓబీసీ కమిషన్‌కి రాజ్యాంగ హోదా ఇచ్చిందని తెలిపారు. ఓబీసీలను కాంగ్రెస్ మోసం చేస్తే మోదీ న్యాయం చేశారని షా గుర్తు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎందుకు ఓబీసీ బిల్ ఆపిందో చెప్పాలని ప్రశ్నించారు. 

ఎయిమ్స్‌కు 1200 కోట్లు, ట్రైబల్ , వేతర్నిటీ, జయశంకర్ యూనివర్సిటీ, ముద్రలోన్స్ 14వేల కోట్లు ఇచ్చామని మిగతా వాటితో అన్ని కలిపి 2 లక్షల 70వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తెలంగాణలో కాళేశ్వర ప్రాజెక్టకు అన్ని విధాల సహకరించామని, బీజేపీ ఇచ్చిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీల పొత్తును ప్రజలు హర్షించారని తెలిపారు.

2018లో అయినా దళిత సీఎంను చేస్తారా?
2014 ఎన్నికల్లో దళిత సీఎంను చేస్తారని చెప్పిన కేసీఆర్..2018లో అయినా దళిత సీఎంను చేస్తారా? అని ప్రశ్నించారు. రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఏమైందని, కనీసం ప్రధాని ఆవాసా యోజన చేసినా ఇల్లు పూర్తయ్యేవిని అన్నారు. కేంద్ర కేబినెట్ రైతులకు ఒకటిన్నర రేట్ల మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపిందని అమిత్ షా స్పష్టం చేశారు. సార్వత్రిక తంత్రం

Updated By ManamWed, 09/12/2018 - 00:55

image‘2019లో మేం గెలిచినట్లయితే, 50 ఏళ్ళ దాకా మేమే అధికారంలో ఉంటాం. మమ్మల్నెవ్వరూ తొలగించలేరు’ అని ఆదివారం నాడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్‌షా మాటలు దేశంలో నడుస్తున్న పాలనా స్వభావాన్ని, అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్న వైనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా షా ప్రజాస్వామిక ఆదర్శాలను మాట వరసకు కూడా ప్రస్తావించలేదు సరిగదా ఓటర్లను టక్కరితనంతో (జుమ్లాలతో) ఆకట్టుకోవడం ఉత్తమోత్తమమైనదిగా ఆయన మాటలు వెల్ల డిస్తున్నాయి. రాజకీయాలంటే అధికారంలోకి రావడం, అధికారాన్ని సుసి ్థరం చేసుకోవడం మినహా, ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ నాయ కులు కృషి చేయాలన్న భావనకు ఆయన ఆమడ దూరంలో ఉన్నారని ఆ ప్రసంగం తెలియజేస్తోంది. దివంగత ప్రధాని వాజ్‌పేయి సూచించిన మా ర్గంలో ప్రతికార్యకర్తా నడవాలని, ‘అజేయ్‌భారత్.. అటల్ బీజేపీ’ నినాదం తో ముందుకు పోనున్నామని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఎదిరించే రాజ కీయ పక్షమే లేదని, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ-షా ద్వయం మాటల్లో ఆత్మ విశ్వాసం కంటే అహంకారమే ప్రధానంగా ధ్వనిస్తోంది. 2019లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల వ్యూహం కోసం జరిగిన బీజేపీ జాతీయ బైఠక్ ఆద్యంతం మోదీ- షా ద్వయం చుట్టూతానే పరిభ్రమించింది. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు లేకుండానే నిర్వీర్యంగా ఉన్న ప్రతిపక్షాల కూటమితో తలపడుతున్నామనే అతి విశ్వాసం ఆ సమావేశంలో ప్రతిబింబించింది. నరేంద్ర మోదీ కేంద్రం గా అధ్యక్ష తరహా ఎన్నికల ప్రచార పర్వానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. అసంఘటితంగా, భిన్న భావజాలాలతో పొంతనలేని ఐక్యతతో కూడిన ప్రతిపక్షానికి, మోదీ ప్రజాదరణకు మధ్య ప్రధాన పోటీ నడుస్తున్నట్లు ఆ పార్టీ భావిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ పాలనా విశేషాలను వివరిస్తూ, అజేయమైన భారత నిర్మాణానికి, దృఢమైన బీజేపీని ఎంచుకోవాలన్న నినాదంతో ఓటర్ల ముందుకు వెళ్లాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. 

2014లో ‘వికాస్’ వేదికపై అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం ద్వారా దేశ సమాఖ్య నిర్మాణంపై తన పట్టును మరింత బిగించింది. 20 రాష్ట్రాల అసెంబ్లీలో, పార్లమెంట్‌లోనూ ఎన్డీఏ మెజారిటీలో ఉండడంతో రా బోయే ఎన్నికల్లో మోదీ అభివృద్ధి మంత్రం మళ్లీ పనిచేస్తుందన్న ఆశాభా వం ఆ సమావేశంలో బలంగా వ్యక్తమైంది. మోదీ పాలనలో అడుగంటిన అభివృద్ధి, హక్కుల హననం, విద్వేషకాండతో సమాజంలో నెలకొన్న అభ ద్రత కారణంగా ప్రజాదరణ రోజురోజుకు పడిపోతున్న వాస్తవాన్ని కప్పి పెట్టి ఆయనను తిరుగులేని నేతగా ప్రజల ముందుంచడానికి బీజేపీ ప్రయ త్నాలు మొదలుపెట్టింది. ఆయిల్ ధరలు భరించలేనంతగా పెరగడం, ఎన్న డూ లేనంతగా రూపాయి విలువ క్షీణించడం (డాలర్‌తో రూపాయి మార కం విలువ 72.23కు చేరుకోవడం), వ్యవసాయ సంక్షోభం తీవ్రతరం కావ డం (ఆరెస్సెస్ అనుబంధ సంఘం ‘భారతీయ కిసాన్ సంఘ్’ సైతం మోదీ ని విమర్శించింది), ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, పెద్దనోట్ల రద్దు, జీఎ స్టీ, ద్రవ్యరేట్ల సవరణలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, నేపాల్ సహా దౌత్య సంబంధాలు సంక్షోభంలో కూరుకుపోవడం, యూనివర్సిటీలు, వి ద్యా సంస్థల కాషాయీకరణపై నిరసనోద్యమాలు, అర్బన్ నక్సల్స్, దేశద్రో హులు పేరుతో మేధావులను, హక్కుల కార్యకర్తలపై దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో పారదర్శకత లోపించి, అనిల్ అంబానీ కంపెనీ ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొన్నట్లు విమర్శలు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరుల రూ.13వేల కోట్ల బ్యాంక్ స్కాం, అంతకుముందు విజయ్ మాల్యా, లలిత్ మోదీ తదితర ఆ ర్థిక నేరస్తులను దేశానికి రప్పించి న్యాయ విచారణ చేపట్టడంలో పక్షపాత ధోరణి, నల్ల కుబేరుల భరతం పడతామని ఎన్నికల జుమ్లాలు, సుప్రీం కో ర్టు తదితర న్యాయ వ్యవస్థలను తమకు అనుగుణంగా తీర్పులు ఇచ్చే వి ధంగా తెరవెనుక చర్యలు వెలుగులోకి రావడం, సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు ‘ప్రజాస్వామ్యం ప్రమాదం’లో పడిందని మీడియా కాన్ఫరెన్స్‌లో వి మర్శించడం తదితర లొసుగులను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందించడంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం విఫలమైంది.
 
నరేంద్ర మోదీ నాలుగున్నరేళ్ళ పాలనా కాలంలో ప్రజల ఆశలూ ఆవిర య్యాయి. ఏ ఒక్క రంగంలోనూ ఆశించిన మార్పు కనిపించడంలేదు. పారి శ్రామిక ఉత్పత్తి స్తంభించింది. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరు కుపోయింది. లక్షలాది అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి మార్గాలు అడు గంటాయి. సేవా రంగంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం మాంద్యంలో కూరుకుపోయింది. వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేసి మోదీ 50 పైగా విదేశీ పర్యటనలు చేసినా, అంతర్జాతీయ సంబంధాల్లో ఎలాంటి గణ నీయమైన ప్రగతిని సాధించలేదు. భౌగోళిక రాజకీయాల్లో చైనాతో పోటీ పడేందుకు అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయిల్‌తో ఆర్థిక, రక్షణ రంగా ల్లో బలమైన బంధాలను ఏర్పరచుకోవడంతో భారత్‌కు అదనంగా లాభిం చలేదు సరిగదా, దశాబ్దాలుగా పాటిస్తున్న ‘అలీన విధానానికి’ దూరం కావ డంతో అంతర్జాతీయంగా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. మోదీ విదేశాంగ విధానం చైనాకు లాభించింది. పర్యవసానంగా అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాదానికి భారత్ టార్గెట్ అవడంతో దేశ అంతరంగిక భద్రతకు ప్రమా దం ఏర్పడింది. ‘వ్యాపం’ నుంచి ‘రాఫెల్’ దాకా కుంభకోణాల్లో కాంగ్రెస్ ను బీజేపీ అధిగమించింది. అమిత్‌షా నుంచి గాలి జనార్ధన్‌రెడ్డి, సుష్మా స్వరాజ్ నుంచి పంకజ్ ముండే వరకు బీజేపీలో అవినీతి మకిలి అంటని నేతలున్నారా? బిర్లా సహారా డైరీలో సాక్షాత్తు ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే ప్రజలను మరోసారి ఎన్నికల జుమ్లాతో మ భ్యపెట్టేందుకు అటల్‌జీ పేరును బీజేపీ ముందుకు తీసుకొస్తోంది. మోది- షా ద్వయం అటల్‌జీ పట్ల ఇన్నాళ్లూ వ్యవహరించిన తీరు ప్రజలకు తెలియ దన్నట్లు వ్యవహరిస్తోంది. మోది ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, నిరంకుశ, ఆశ్రిత పక్షపాత విధానాల వల్ల ఏర్పడిన ప్రజావ్యతిరేకతను సంఘటితం చేసి అధికారంలోకి వచ్చే శక్తి సామర్థ్యాలు ప్రతిపక్షాలకు లేకపోవచ్చు. రోజు రోజుకూ దిగనాసిల్లుతున్న ప్రజల జీవన ప్రమాణాల పునాదిగా మోదీ ప్ర భుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ని ఏ మేరకు అజేయంగా నిలుపుతుందో సందేహమే!అజేయ భారత్.. అటల్ బీజేపీ

Updated By ManamSun, 09/09/2018 - 22:38
 • వచ్చే ఎన్నికల్లో కమలం నినాదం.. కార్యవర్గ సమావేశంలో మోదీ పిలుపు

 • దివంగత వాజ్‌పేయికి అత్యున్నత గౌరవం.. ఆయన పాటించిన విలువలకు కట్టుబడ్డాం

 • కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య.. వచ్చే 50 ఏళ్లు అధికారం బీజేపీదే: అమిత్‌షా

modiన్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘అజేయ భారత్..అటల్ బీజేపీ’ నినాదంతో ప్రజల్లోకి కమలదళం వెళ్లనుంది. ఢిల్లీలో  ఆదివారం రెండోరోజు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి సూచించిన మార్గంలో ప్రతి కార్యకర్తా నడవాలని సూచించారు. పార్టీ విలువలకు, దేశ పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, బీజేపీ పాలనలో దేశం పురోభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు అటల్ బిహారి వాజ్‌పేయికి అత్యున్నత గౌరవం కల్పిస్తూ వచ్చే ఎన్నికల్లో ‘అజేయ భారత్.. అటల్ బీజేపీ’ నినాదంలో ముందుకు పోనున్నామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదిరించే పార్టీయే లేదని, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు  వెళ్తున్నామని పేర్కొన్నారు. పరోక్షంగా రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల్లోని ఏ చిన్న పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేవని ఎద్దేవా చేశారు. విపక్షాలు ఏకతాటిపై నిలబడలేవని, ఇందుకు అనేక అంశాల్లో బీజేపీ సాధించిన విజయాలే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని, దేశంలోని 125 కోట్ల మంది మద్దతు బీజేపీకే ఉందన్నారు. 

వచ్చే 50 ఏళ్లు అధికారం బీజేపీదే: అమిత్‌షా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, అంతేగాక వచ్చే 50 ఏళ్లు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో రెండోరోజు ఆదివారం పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఉద్ఘాటించారు.

నవభారతం నిర్మిస్తాం
తమ కాషాయ పార్టీని ఓడించాలన్న ప్రతిపక్షం కలలు కల్లలుగానే మిగిలిపోతాయని బీజేపీ కుండ బద్దలుకొట్టింది. 2022 నాటికల్లా నవభారతాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి పార్టీ కట్టుబడి ఉండాలని తీర్మానం చేసింది. ప్రతిపక్షానికి ఒక నాయకుడూ లేడు.. ఒక విధానమూ లేదని, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుడని చెప్పింది. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో రాజకీయ తీర్మానాన్ని సీనియర్ నాయకుడు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. సమావేశానంతరం వివరాలను కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాకు వెల్లడించారు. గత నాలుగేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేశామని, 2022నాటికి నవభారతాన్ని నిర్మిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ఒక దూరదృష్టి ఉందని, ప్రభుత్వం ఏం చేసిందో కనపడుతోందని తెలిపారు. 2022 నాటికి దేశంలో ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం ఉండవని, ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండరని ఆయన చెప్పారు. ప్రతిపక్షానికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదని, కేవలం ప్రధాని మోదీని ఆపడమే వారి లక్ష్యమని విమర్శించారు. 2019లో మరింత మెజారిటీతో బీజేపీ నెగ్గుతుందన్నారు. వాజ్‌పేయికి తుది వీడ్కోలు..

Updated By ManamFri, 08/17/2018 - 15:27
 • బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర.. ముగిసిన అంత్యక్రియలు

 • రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో తుదివీడ్కోలు

 • పాల్గొన్న విదేశీ ప్రముఖులు, బీజేపీ అగ్రనేతలు

Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పుంటించారు. వాజ్‌పేయి అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. 
Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)వాజ్‌పేయి పట్ల అమితమైన గౌరవభావం కలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఎల్‌కే అద్వానీ, మధ్య ప్రదేశ్ సీఎం, మహారాష్ట్ర సీఎం సహా బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి పార్థివదేహం వెంట నడుస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు వాజ్‌పేయి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్‌కు  పాక్ బృందం వస్తుండగా.. విదేశీ ప్రముఖులు భూటన్ రాజు జిగ్మే ఖేసర్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు సైతం ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. 

Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)

విజయ్ ఘాట్ వద్ద మెమోరియల్ ఏర్పాటు.. 
విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్ ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి అంతిమ యాత్రలో ఆయన్ను కడసారి చూసేందుకు భారీసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వాజ్‌పేయి మృతికి సంతాపంగా 15 రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించగా.. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఏపీలోనూ 7 రోజుల పాటు సంతాప దినాలు జరుపుకోనున్నారు. అంతకుముందు వాజ్‌పేయి నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి చేరుకున్న నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, అమిత్‌ షా, బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి అంతిమ యాత్ర ఫొటోలుమరింత క్షీణించిన వాజ్‌పేయి ఆరోగ్యం

Updated By ManamThu, 08/16/2018 - 09:47

Vajpayeeన్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ డాక్టర్లు తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం చాలా క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మూత్రపిండాలు, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో వాజ్‌పేయి బాధపడుతున్నారని, 24గంటల్లో ఆరోగ్యం చాలా క్షీణించిందని పేర్కొన్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ, బుధవారం ఆసుపత్రికి వెల్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు.మమతను పడగొడతాం

Updated By ManamSat, 08/11/2018 - 22:30
 • ఆమె పతనాన్ని శాసిస్తాం.. అందుకే ఇక్కడికి వచ్చా..

 • కోల్‌కతా సభలో అమిత్‌షా.. మాకు దేశమే ప్రథమ ప్రాధాన్యం

 • టీఎంసీకి ఓటుబ్యాంకే ముఖ్యం

 • ఎన్‌ఆర్‌సీపై అనవసర రాద్ధాంతం.. దీదీ, రాహుల్‌పై తీవ్ర ధ్వజం

imageకోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీని కూకటివేళ్లతో పెకిలించివేస్తామని, ఆమె పతనాన్ని శాసిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. అందుకే తాను కోల్‌కతా కు వచ్చానని నిప్పులు చెరిగారు. కోల్‌కతాలో శనివారం జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాం ధీపై అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ వలసదారులు మమతకు పెద్ద ఓటు బ్యాంకు అని, అందుకే జాతీయ పౌరసత్వ జాబి తా(ఎన్‌ఆర్‌సీ)పై ఆమె రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ.. తమకు దేశమే ప్రధాన్యమని, ఓటు బ్యాంకు కాదని తేల్చిచెప్పారు. ఎన్‌ఆర్‌సీ నుంచి 40 లక్షల మంది బంగ్లాదేశ్ వలసదారులను తొలగించడంపై మమతా ఆరోపణలు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలివచ్చిన వలసదారులను వెనక్కి తరమడమే తమ లక్ష్యమని సుస్పష్టం చేశారు.image మమత, రాహుల్ ఎంతగా ప్రయత్నించినా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ ఆగబోదని అన్నారు. ఎన్‌ఆర్‌సీతో హింస చెలరేగుతుందని, పౌర యుద్ధానికి దారితీయొచ్చని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పౌరసత్వంపై కోర్టు తీర్పును ఎలాగైనా అమలు పరుస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమలు చేసి తీరుతామని అమిత్‌షా స్పష్టం చేశారు. బంగ్లాదేశీ అక్రమ వలసదారులు దేశంలో ఉండాలని మమత ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత ముఖ్యమో, ఓటు బ్యాంకు ముఖ్యమో మమతా బెనర్జీ, రాహుల్‌గాంధీ తేల్చిచెప్పాలని అన్నారు. తమ పార్టీకి మాత్రం దేశమే ముఖ్యమని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో దాదాపు 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి రెండు స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎలాగైన అత్యధికంగా సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమిత్‌షా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తొలుత మమత సర్కారు తొలుత అనుమతివ్వకపోయినా చివరకు మంజూరు చేసింది

నల్లజెండాలతో కాంగ్రెస్ నిరసన
అమిత్‌షా పర్యటన సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ ఘటన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న అమిత్‌షాకు కొందరు నల్ల జెండాలు చూపి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోటార్‌సైకిళ్లపై వచ్చిన కార్యకర్తలు అమిత్‌షా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.ఆశలన్నీ ఆయనపైనే

Updated By ManamFri, 07/13/2018 - 06:46
 • నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా

 • బీజేపీ ఆఫీసులో వ్యూహరచన.. పర్యటనపై రాజకీయల్లో ఆసక్తి

 • వివిధ వర్గాలతో వేర్వేరు సమావేశాలు.. తెలంగాణలో గెలుపు కోసమే : లక్ష్మణ్

imageహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఈయన రాకపై రాజకీ య వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాజకీయ వ్యూహాలు చేయడంలో దిట్ట అయిన కమల దళపతి రాష్ట్రంలో ఎలాంటి చక్రం తిప్పనున్నారో అని అందరూ వేచిచూస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి. అయితే అమిత్ షా గత నెలలోనే రావాల్సి ఉండగా, పలు కారణాలతో రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. 

రోజంతా పార్టీ కార్యాలయంలోనే.. 
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా.. రాష్ట్రంలోని వివిధ వర్గాలతో వేర్వేరుగా ప్రత్యే కంగా సమావేశం కానున్నారు. బీజేపీ సీనియర్ నేతలు, విస్తారక్‌లు, హోల్‌టైమర్లు, తదితరులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, ఎమ్మెల్యే టిక్కె ట్ ఆశావహులు, జన చైతన్యయాత్ర విశేషాలు, చేరిక లు తదితర విషయాలపై చర్చించనున్నారు. ఆయా విషయాలపై రోజంతా పార్టీ కార్యాయంలోనే ఉండి ప్రత్యేకంగా మాట్లాడతారు. కాగా రాష్ట్ర పరిస్థితులపై అమిత్ షా అన్ని వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో ఎప్పటికప్పుడు స్వయంగా అమిత్ షా ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 

మళ్లీ రాజకీయ వేడి పుట్టిస్తారా..?
ఏడాడి క్రితం అమిత్ షా రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. అక్కడ బూత్ స్థా యి నుంచి పార్టీ బలోపేతంపై కార్యకర్తలతో సమా వేశమయ్యారు. దళితులతో సహపంక్తి భోజనం చేశా రు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దీంతో రాష్ట్రంలో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. స్వయంగా సీఎం కేసీఆరే విలేకరుల సమావేశం నిర్వహించారు. అమిత్ షా కాదు బ్రమిత్ షా అని మండిపడ్డారు. లెక్కలతో సహా వివరించారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధమే నడిచింది.  అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌పై బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటిస్తుండటంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఏర్పాట్లు పూర్తి.. 
అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమిత్ షా పాట్నా నుంచి ఉదయం 10.30గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఆయనకు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పరిశీలించారు. 

టార్గెట్ తెలంగాణ: లక్ష్మణ్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా రాష్ట్ర పర్యటన చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళిక రచించనున్నట్లు వివరించారు. త్రిపుర, అస్సోంలలో మాదిరే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. టార్గెట్ 60 ప్లస్ అసెంబ్లీ స్థానాలు, రెండంకెల పార్లమెంట్ స్థానాలు సాధించడమే ధ్యేయమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా పర్యటన తర్వాత రాష్ట్రంలో మరింత ఉధృతంగా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు అవకాశావాద, విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నియంతృత్వ, కుటుంబపాలన, అవినీతి పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, ఆచారి, సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వచ్చే నెలలో రాష్ట్రానికి అమిత్ షా

Updated By ManamTue, 05/08/2018 - 05:55
 • 2019లో తెలంగాణలో అధికారం మాదే.. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో గెలుస్తాం

 • కాంగ్రెస్ కంటే 3 రెట్లు ఎక్కువ నిధులిచ్చాం.. ‘తెలుగు’ సీఎంలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

 • టీడీపీ నేతల తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ 

amith shaహైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అ మిత్ షా జూన్‌లో తెలంగాణలో పర్యటిస్తారని  ఆ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ప్రముఖులు అమిత్ షాతో సమావేశమవుతారని, తెలంగాణలో అధికారంలోకి రావడానికి చేపట్టాల్సిన వ్యూహాలు చేస్తామని వివరించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షా పర్యటనను పురస్కరించుకు ఈ నెల 17, 18 తేదీల్లో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి సతీష్‌జీ పార్టీ నేతలతో సమావేశమవుతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ెతెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని తెలుగు రాష్ట్రాల సీఎంలు  పదేపదే విమర్శలు చేస్తున్నారని, నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. గత కాంగ్రెస్ ఇచ్చిన నిధుల కంటే  మూడు రెట్లు అధికంగా ఇచ్చామని, అయినా సొంత ప్రయోజనాల కోసం కేంద్రంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లకు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేసిన విషయం గుర్తుంచుకుకోవాలన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మనోవేదనకు గురై సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే సగం భారం తగ్గుతుందని, ఇందుకు రాష్ట్రాలు సహకరించ డం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కర్ణాటకలో కాపీ కొట్టిందని ఆరోపిస్తున్నారని, కల్యాణలక్ష్మి లాంటి పథకం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారని చెప్పారు. దేవాదాయ శాఖలో నిధులు పక్కదారి పడుతున్నాయని, ఆ నిధులను దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక బృందాలను కర్ణాటకకు పంపించి మరింత దిగజారిపోయిందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.15వేల కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివిధ రహదారుల పనులకు శంకుస్థాపనలు చేశారని, అదనంగా రూ. రూ. 10వేల కోట్ల మంజూరుకు ప్రకటన చేశారని చెప్పారు. జల రవాణాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో  కృష్ణసాగర్, ఎన్వీ సుభాష్, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.'ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ నడుస్తోంది'

Updated By ManamThu, 04/26/2018 - 16:20

Varla Ramaiah, Central govt, Amith shah, YSRCP, Modi govtవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ నేతలను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. జగన్‌కు ఫోన్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక అమిత్ షా ఉన్నది నిజం కాదా? అనే ప్రశ్నను సూటిగా సంధించారు.

వైఎస్ జగన్ చెప్పినట్టు కాకుండా అమిత్ షా చెప్పినట్టు వైఎస్సార్ సీపీ నడుస్తోందని ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని.. కేంద్ర ప్రభుత్వమని అన్నారు. జగన్ కేసులపై ఏం తెలుసని కేంద్రమంత్రి రాందాస్ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామంటూ వ్యాఖ్యానించారని వర్ల రామయ్య విమర్శించారు.

Related News