amith shah

మరింత క్షీణించిన వాజ్‌పేయి ఆరోగ్యం

Updated By ManamThu, 08/16/2018 - 09:47

Vajpayeeన్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ డాక్టర్లు తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం చాలా క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మూత్రపిండాలు, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో వాజ్‌పేయి బాధపడుతున్నారని, 24గంటల్లో ఆరోగ్యం చాలా క్షీణించిందని పేర్కొన్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ, బుధవారం ఆసుపత్రికి వెల్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు.మమతను పడగొడతాం

Updated By ManamSat, 08/11/2018 - 22:30
 • ఆమె పతనాన్ని శాసిస్తాం.. అందుకే ఇక్కడికి వచ్చా..

 • కోల్‌కతా సభలో అమిత్‌షా.. మాకు దేశమే ప్రథమ ప్రాధాన్యం

 • టీఎంసీకి ఓటుబ్యాంకే ముఖ్యం

 • ఎన్‌ఆర్‌సీపై అనవసర రాద్ధాంతం.. దీదీ, రాహుల్‌పై తీవ్ర ధ్వజం

imageకోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీని కూకటివేళ్లతో పెకిలించివేస్తామని, ఆమె పతనాన్ని శాసిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. అందుకే తాను కోల్‌కతా కు వచ్చానని నిప్పులు చెరిగారు. కోల్‌కతాలో శనివారం జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాం ధీపై అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ వలసదారులు మమతకు పెద్ద ఓటు బ్యాంకు అని, అందుకే జాతీయ పౌరసత్వ జాబి తా(ఎన్‌ఆర్‌సీ)పై ఆమె రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ.. తమకు దేశమే ప్రధాన్యమని, ఓటు బ్యాంకు కాదని తేల్చిచెప్పారు. ఎన్‌ఆర్‌సీ నుంచి 40 లక్షల మంది బంగ్లాదేశ్ వలసదారులను తొలగించడంపై మమతా ఆరోపణలు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలివచ్చిన వలసదారులను వెనక్కి తరమడమే తమ లక్ష్యమని సుస్పష్టం చేశారు.image మమత, రాహుల్ ఎంతగా ప్రయత్నించినా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ ఆగబోదని అన్నారు. ఎన్‌ఆర్‌సీతో హింస చెలరేగుతుందని, పౌర యుద్ధానికి దారితీయొచ్చని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పౌరసత్వంపై కోర్టు తీర్పును ఎలాగైనా అమలు పరుస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమలు చేసి తీరుతామని అమిత్‌షా స్పష్టం చేశారు. బంగ్లాదేశీ అక్రమ వలసదారులు దేశంలో ఉండాలని మమత ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత ముఖ్యమో, ఓటు బ్యాంకు ముఖ్యమో మమతా బెనర్జీ, రాహుల్‌గాంధీ తేల్చిచెప్పాలని అన్నారు. తమ పార్టీకి మాత్రం దేశమే ముఖ్యమని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో దాదాపు 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి రెండు స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎలాగైన అత్యధికంగా సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమిత్‌షా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తొలుత మమత సర్కారు తొలుత అనుమతివ్వకపోయినా చివరకు మంజూరు చేసింది

నల్లజెండాలతో కాంగ్రెస్ నిరసన
అమిత్‌షా పర్యటన సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ ఘటన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న అమిత్‌షాకు కొందరు నల్ల జెండాలు చూపి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోటార్‌సైకిళ్లపై వచ్చిన కార్యకర్తలు అమిత్‌షా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.ఆశలన్నీ ఆయనపైనే

Updated By ManamFri, 07/13/2018 - 06:46
 • నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా

 • బీజేపీ ఆఫీసులో వ్యూహరచన.. పర్యటనపై రాజకీయల్లో ఆసక్తి

 • వివిధ వర్గాలతో వేర్వేరు సమావేశాలు.. తెలంగాణలో గెలుపు కోసమే : లక్ష్మణ్

imageహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఈయన రాకపై రాజకీ య వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాజకీయ వ్యూహాలు చేయడంలో దిట్ట అయిన కమల దళపతి రాష్ట్రంలో ఎలాంటి చక్రం తిప్పనున్నారో అని అందరూ వేచిచూస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి. అయితే అమిత్ షా గత నెలలోనే రావాల్సి ఉండగా, పలు కారణాలతో రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. 

రోజంతా పార్టీ కార్యాలయంలోనే.. 
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా.. రాష్ట్రంలోని వివిధ వర్గాలతో వేర్వేరుగా ప్రత్యే కంగా సమావేశం కానున్నారు. బీజేపీ సీనియర్ నేతలు, విస్తారక్‌లు, హోల్‌టైమర్లు, తదితరులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, ఎమ్మెల్యే టిక్కె ట్ ఆశావహులు, జన చైతన్యయాత్ర విశేషాలు, చేరిక లు తదితర విషయాలపై చర్చించనున్నారు. ఆయా విషయాలపై రోజంతా పార్టీ కార్యాయంలోనే ఉండి ప్రత్యేకంగా మాట్లాడతారు. కాగా రాష్ట్ర పరిస్థితులపై అమిత్ షా అన్ని వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో ఎప్పటికప్పుడు స్వయంగా అమిత్ షా ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 

మళ్లీ రాజకీయ వేడి పుట్టిస్తారా..?
ఏడాడి క్రితం అమిత్ షా రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. అక్కడ బూత్ స్థా యి నుంచి పార్టీ బలోపేతంపై కార్యకర్తలతో సమా వేశమయ్యారు. దళితులతో సహపంక్తి భోజనం చేశా రు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దీంతో రాష్ట్రంలో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. స్వయంగా సీఎం కేసీఆరే విలేకరుల సమావేశం నిర్వహించారు. అమిత్ షా కాదు బ్రమిత్ షా అని మండిపడ్డారు. లెక్కలతో సహా వివరించారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధమే నడిచింది.  అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌పై బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటిస్తుండటంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఏర్పాట్లు పూర్తి.. 
అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమిత్ షా పాట్నా నుంచి ఉదయం 10.30గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఆయనకు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పరిశీలించారు. 

టార్గెట్ తెలంగాణ: లక్ష్మణ్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా రాష్ట్ర పర్యటన చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళిక రచించనున్నట్లు వివరించారు. త్రిపుర, అస్సోంలలో మాదిరే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. టార్గెట్ 60 ప్లస్ అసెంబ్లీ స్థానాలు, రెండంకెల పార్లమెంట్ స్థానాలు సాధించడమే ధ్యేయమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా పర్యటన తర్వాత రాష్ట్రంలో మరింత ఉధృతంగా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు అవకాశావాద, విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నియంతృత్వ, కుటుంబపాలన, అవినీతి పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, ఆచారి, సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వచ్చే నెలలో రాష్ట్రానికి అమిత్ షా

Updated By ManamTue, 05/08/2018 - 05:55
 • 2019లో తెలంగాణలో అధికారం మాదే.. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో గెలుస్తాం

 • కాంగ్రెస్ కంటే 3 రెట్లు ఎక్కువ నిధులిచ్చాం.. ‘తెలుగు’ సీఎంలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

 • టీడీపీ నేతల తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ 

amith shaహైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అ మిత్ షా జూన్‌లో తెలంగాణలో పర్యటిస్తారని  ఆ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ప్రముఖులు అమిత్ షాతో సమావేశమవుతారని, తెలంగాణలో అధికారంలోకి రావడానికి చేపట్టాల్సిన వ్యూహాలు చేస్తామని వివరించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షా పర్యటనను పురస్కరించుకు ఈ నెల 17, 18 తేదీల్లో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి సతీష్‌జీ పార్టీ నేతలతో సమావేశమవుతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ెతెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని తెలుగు రాష్ట్రాల సీఎంలు  పదేపదే విమర్శలు చేస్తున్నారని, నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. గత కాంగ్రెస్ ఇచ్చిన నిధుల కంటే  మూడు రెట్లు అధికంగా ఇచ్చామని, అయినా సొంత ప్రయోజనాల కోసం కేంద్రంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లకు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేసిన విషయం గుర్తుంచుకుకోవాలన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మనోవేదనకు గురై సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే సగం భారం తగ్గుతుందని, ఇందుకు రాష్ట్రాలు సహకరించ డం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కర్ణాటకలో కాపీ కొట్టిందని ఆరోపిస్తున్నారని, కల్యాణలక్ష్మి లాంటి పథకం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారని చెప్పారు. దేవాదాయ శాఖలో నిధులు పక్కదారి పడుతున్నాయని, ఆ నిధులను దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక బృందాలను కర్ణాటకకు పంపించి మరింత దిగజారిపోయిందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.15వేల కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివిధ రహదారుల పనులకు శంకుస్థాపనలు చేశారని, అదనంగా రూ. రూ. 10వేల కోట్ల మంజూరుకు ప్రకటన చేశారని చెప్పారు. జల రవాణాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో  కృష్ణసాగర్, ఎన్వీ సుభాష్, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.'ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ నడుస్తోంది'

Updated By ManamThu, 04/26/2018 - 16:20

Varla Ramaiah, Central govt, Amith shah, YSRCP, Modi govtవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ నేతలను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. జగన్‌కు ఫోన్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక అమిత్ షా ఉన్నది నిజం కాదా? అనే ప్రశ్నను సూటిగా సంధించారు.

వైఎస్ జగన్ చెప్పినట్టు కాకుండా అమిత్ షా చెప్పినట్టు వైఎస్సార్ సీపీ నడుస్తోందని ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని.. కేంద్ర ప్రభుత్వమని అన్నారు. జగన్ కేసులపై ఏం తెలుసని కేంద్రమంత్రి రాందాస్ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామంటూ వ్యాఖ్యానించారని వర్ల రామయ్య విమర్శించారు.'అమిత్ షా వ్యాఖ్యలు చాలా బాధాకరం'

Updated By ManamSat, 04/07/2018 - 15:42

TDP MP, Amith shah, Rediclus statements, TDP MPs, Ys Jagan mohan reddy న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఎంపీలను జంతువులతో పోలుస్తూ అమిత్ షా కించపరచడం చాలా బాధాకరమని చెప్పారు. శనివారం ఢిల్లీలో వారు మీడియాతో మట్లాడుతూ.. అమిత్ షా వ్యాఖ్యలు తమకు చాలా బాధ కలిగించినట్టు తెలిపారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ నెలరోజులుగా తాము ఆందోళన చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం ఇస్తే ఎందుకు చర్చించలేకపోయారని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ప్రశ్నించినట్టు టీడీపీ ఎంపీలు చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడుతున్నారని, బీజేపీతో లాలూచీ పడి వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదంటూ టీడీపీ ఎంపీలు విమర్శించారు.అమిత్‌షాకు నారా లోకేశ్‌ కౌంటర్‌

Updated By ManamFri, 04/06/2018 - 21:06

Nara lokesh babu counter to Amith shah అమరావతి: విపక్షాలను జంతువులతో పోలుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఐదుకోట్ల మంది ప్రయోజనాల కోసం, హక్కులకై పోరాడుతుంటే కుక్కలతో పోలుస్తారా? అంటూ లోకేశ్ మండిపడ్డారు. ‘మా హక్కులు కోసం ఉద్యమిస్తుంటే పిల్లులు.. పాములు.. ముంగిసలని’ అంటారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ నాలుగేళ్లపాటు అంధకారంలో పెట్టిందని.. తలపొగరుతో జంతువులతో పోలస్తోందన్నారు. బీజేపీ వినాశకాలం దాపురించిందని విమర్శించారు. అందుకే ఇలా విపరీత బుద్ది ప్రదర్శిస్తోందని లోకేశ్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. చివరిగా బైకాట్ బీజేపీ అనే హ్యాష్ ట్యాగ్‌లైన్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు. 

కాగా, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములు జంతువులతో పోలుస్తూ వాడివేడి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభంజనం నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవన్నీ ఒక్కటవుతున్నాయని షా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.నోరుజారిన అమిత్ షా...

Updated By ManamTue, 03/27/2018 - 17:40

amith shahబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోరుజారారు. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పతించారు.  కర్ణాటకలో అవినీతి ప్రభుత్వం ఎవరిదో పోటీపెడితే యడ్యూరప్ప సర్కారు మొదట నిలుస్తుందని ఆయన పొరబాటున వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప పక్కనుండగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పొరబాటున చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక బీజేపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారాయి.  పక్కనున్న బీజేపీ నాయకుడు అమిత్ షాకు జరిగిన తప్పును ఎత్తిచూపడంతో...దాన్ని సరిచేసుకున్న బీజేపీ అధ్యక్షుడు అవినీతిలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఫస్ట్ వస్తుందని విమర్శించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంది వచ్చిన అవకాశాన్ని తామెందుకు వదులుకుంటామంటూ...అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ప్రసారం చేస్తున్నాయి. 

చివరకు మీరు నిజమే మాట్లాడారంటూ సిద్ధరామయ్య...అమిత్ షా కామెంట్స్‌పై స్పందించారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...అమిత్ షా వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్, సంజయ్ ఝా, దివ్య స్పందన తదితరులు అమిత్ షా పొరబాటున చేసిన కామెంట్స్ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.అమిత్‌ షాకు అవగాహన లేదు: నారా లోకేశ్

Updated By ManamSat, 03/24/2018 - 12:33

Lokesh, AMith Shah అమరావతి: రాష్ట్ర సమస్యలపై అమిత్‌షాకు పూర్తి అవగాహన లేదని.. ఆయన రాసిన లేఖలోనే ఆ విషయం స్పష్టంగా అర్థమౌతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబుకు అమిత్‌షా రాసిన లేఖపై స్పందించిన లోకేశ్.. ఇంతవరకు జరిగిన పనులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించామని చెప్పారు.

అయితే యుటిలైజేషన్ సర్టిఫికెట్‌కి ప్రత్యేకహోదాకు సంబంధం ఏంటని.. ప్రత్యేక హోదా సహా మిగిలిన 18 హామీలు నెరవేర్చడానికి యుటిలైజేషన్ ఏం అవసరమంటూ ప్రశ్నించారు. ఎన్టీఏ నుంచి బయటకు రావాలని ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారని అమిత్‌షా అంటున్నారని, అయితే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎన్నో సార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని.. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను త్వరలో అమిత్‌షాకు లేఖలో రాస్తామని వివరించారు.దూకుడు పెంచండి 

Updated By ManamSun, 03/18/2018 - 02:41
 • టీడీపీపై విమర్శల ఘాటు పెరగాలి

 • వారం పదిరోజుల్లో కీలక పరిణామాలు

 • త్వరలో రాయలసీమలో బహిరంగ సభ

 • పార్టీ ముఖ్యనేతలకు అమిత్ షా సూచన

 • హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి చాన్స్!

 • కాపులకు బీజేపీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు?

 • తెరమీదకు నలుగురు ముఖ్య నాయకులు

 • కన్నా, వీర్రాజు, ఆకుల, మాణిక్యాలరావు

 • అమిత్ షాను కలిసిన ప్రశాంత్ కిషోర్

amith shahఅమరావతి:  టీడీపీపై దూకుడుగా వ్యవహరించడానికి వెనకడుగు వేయద్దని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. వారం పది రోజుల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో ఆయన శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుందని... దీన్ని తిప్పికొట్టాలంటే జాతీయ నాయకత్వం రాయులసీమ లాంటి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ పెడితేనే బాగుంటుందని అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఈ సభలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. గత కొంతకాలంగా ఏపీ వ్యవహారాలపై పార్టీ జాతీయ నాయకత్వం నుంచి మార్గనిర్దేశకత్వం లేకపోవటం ప్రధాన లోపంగా మారిందని కొందరు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. అందుకే పార్టీ నేతలు కూడా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారని.. రాష్ట్రంలో ఒకరిద్దరు బీజేపీ నేతలే టీడీపీకి లక్ష్యంగా మారారని ఓ ముఖ్యనాయుకుడు అమిత్ షాతో చెప్పినట్టు సమాచారం. బీజేపీని విలన్‌గా చూపించడానికి స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారని, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా దాడి ప్రారంభించారని, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం. 

భారీ మార్పులు
పార్టీ రాష్ట్ర నాయకత్వంలో భారీగా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా బీజేపీ వ్యూహం ప్రకారం బ్రాహ్మణ, కాపు, రెడ్డి, సామాజికవర్గాల నుంచి ముఖ్య నేతలను ఎంపికచేసి వారి ద్వారా రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదగాలనే నిశ్చయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రాం మాధవ్‌ను ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించేందుకు బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చింది. మరో ఇరువురు ముఖ్య నేతలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు నాయకుడిని నియమించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ హరిబాబు కొనసాగుతున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన పదవీకాలం పూర్తవగా ఆ తర్వాత ఎవరినీ నియమించలేదు. ఇటీవల ఆయనను తిరిగి అధ్యక్షునిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హరిబాబును మారుస్తారని ప్రచారం జరిగినా, కొన్ని ఒత్తిళ్లతో మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించారు. తాజా పరిణామాలలో భాగంగా.. హరిబాబు స్థానంలో కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలన్న అభిప్రాయానికి అధిష్ఠానం వచ్చింది. ఫైర్ బ్రాండ్ నేత సోము వీర్రాజుతో పాటు ఆకుల సత్యనారాయణ, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు తెరమీదకు వచ్చాయి. 

హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి? 
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి హరిబాబును తప్పిస్తే ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే విషయాన్ని కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరిబాబుకు మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇపుడు రెండు బెర్తులు ఖాళీ అయ్యాయి. వాటిలో ఒకటి హరిబాబుకు ఇవ్వచ్చని అంటున్నారు. 

పవన్ సభపైనా చర్చ?
పవన్ బహిరంగ సభ అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై కూడా అమిత్ షా భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. టీడీపీతో పాటు బీజేపీని కూడా ఆయన నిలదీశారని.. అయితే రాష్ట్రప్రభుత్వ అవినీతిపై ప్రత్యక్ష ఆరోపణలకు దిగటంతో కేంద్రంపై చేసిన విమర్శలు పెద్దగా చర్చకు రాలేదని ఒక నాయకుడు చెప్పారు. ఈ సమావేశంలో రాం మాధవ్, పురందేశ్వరి, హరిబాబు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

అమిత్‌షాతో ప్రశాంత్ కిషోర్ భేటీ..? 
రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్నికల వ్యూహ కర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్... ఢిల్లీలో అమిత్ షాతో శనివారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయినప్పుడే ప్రశాంత కిషోర్ కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యూహకర్తగా వ్యవ హరిస్తున్నారు. దీంతో ఈ భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని చెబుతుండగా, ఏపీ నేతలకు దిశానిర్దేశం చేసే భేటీలో కూడా ఆయన పాల్గొని సూచనలు చేసినట్టు ప్రచారం ఊపం దుకుంది. ఆయన రాకతో.. బీజేపీ-వైసీపీ పొత్తుపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. 

Related News