arun jaitley

పెద్ద నోట్ల రద్దు.. ‘ఆర్థిక’గాయం

Updated By ManamThu, 11/08/2018 - 16:20
 • ఆ నిర్ణయం పెద్ద తప్పు: మన్మోహన్‌సింగ్

 • కాలంతోపాటు వెలుగులోకి వస్తాయి

 • పెద్ద  నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తి

Two years after demonetisation respond on manmohan singh

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పెద్ద తప్పిదమని, అది చేసిన గాయాలు కాలంతోపాటే కనిపిస్తాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. నోట్ల రద్దుకు గురువారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పెద్ద నోట్ల రద్దు చేసిన గాయాలు ఇప్పుడు కనిపించకపోవచ్చు. కాలంతోపాటు అవి కనిపిస్తాయి. నోట్ల రద్దు నిర్ణయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా గాడి తప్పిందో తెలుసుకోవడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనాలోచితం. అసంబద్ధం. ఈ విషయం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి బోధపడుతోంది’ అని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. 

నోట్ల రద్దు ప్రభావం ఏ ఒక్క వర్గంపైనే పడలేదని.. మతం, కులం, చిన్న, పెద్ద, వృత్తులు, వ్యాపారాలు ఇలా అన్నివర్గాలపైనా తీవ్ర దుష్ప్రభావం పడిందని అన్నారు. ఏ సమస్యకైనా కాలమే సమాధానం చెబుతుందని అంటారని, పెద్ద నోట్ల రద్దు చేసిన గాయాలు కూడా కాలంతోపాటుగానే వెలుగులోకి వస్తాయని చెప్పారు.

బ్లాక్ మనీ వెలుగులోకి తెచ్చేందుకే...

Arun Jaitley Says Confiscating Cash Wasnot Aim

పెద్ద నోట్లు రద్దు అయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  స్పందించారు. అక్రమంగా దాచుకున్న డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకునే నోట్ల రద్దును చేపట్టామని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. నల్ల ధనాన్ని బయటకు తీయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామన్న జైట్లీ విదేశాల్లో ఖాతాలు కలిగిన వారిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. 
 

నోట్ల రద్దు జరిగి రెండేళ్ళు గడిచింది. కానీ ఇప్పటికీ దాని ప్రభావం భారతీయ పౌరుల మీద, ఆర్థిక వ్యవస్థ మీదా అలానే ఉంది. ఇది దేశానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. 
   - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసి నేటితో రెండేళ్లు గడిచిపోయింది. దాని వల్ల సాధించేందెమిటో ఇప్పటికీ తెలియదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. నోట్ల రద్ధు సామన్యులను ఇబ్బందులకు గురి చేసింది. దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నోట్ల రద్దు కష్టాలు ఎన్నో నెలల పాటు వెంటాడాయని ఆయన అన్నారు.
                     -మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
నోట్ల రద్దు అనే డార్క్ డేకు రెండేళ్లు గడిచాయి. ఈ చర్య విజయం కాదని నేను అప్పుదే చెప్పారు. అది నిజమేనని సామన్యులతో పాటు ఆర్థిక వేత్తలు కూడా ఎప్పుడు ఒప్పుకున్నారు.
               - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఆర్థిక కుంభకోణాల్లో మోదీ జాబితా చిన్నదే అయినప్పటికీ. దేశాన్ని మొత్తం ఆర్థిక విపత్తులోకి ఎందుకు పంపారో రెండేళ్ల తర్వాత కూడా ఒక రహస్యంగా ఉండిపోయింది.
        -ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్
నోట్ల  రద్దు ఒక అర్థిక నేరం. అదోక అసమర్థ నిర్ణయం. ఇది అమాయకంగా ఉన్న నేరపూరితమైన నిర్ణయం. నోట్ల రద్దుకు ముందు చెప్పిన ఏ ఒక్క సంస్కరణలు కూడా సాధించలేకపోయారు. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది.
                    -కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 
ఇక సామాన్యులు సైతం తమదైన శైలిలో నోట్ల రద్దుపై స్పందించారు. పాత రూ. 1,000 రూ. 500 ఫోటోలకు దండలు వేసి ఎల్లపుడు గుర్తుంచుంటామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక కొందరు దేశ చరిత్రలో ఎవరు తీసుకోలేని సహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని కొనియాడారు. అయితే రాజకీయ పరంగా నోట్ల రద్దుపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సామన్యుల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.  
                             -సామాన్యుల కామెంట్లక్ష కోట్లు

Updated By ManamFri, 11/02/2018 - 07:36
 • అక్టోబరు నెలలో జీఎస్టీ వసూళ్ల రికార్డు

 • తక్కువ రేటువల్లే విజయవంతం: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 

imageన్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ఒకే పన్ను అంటూ ప్రవేశపెట్టిన జీఎస్టీ రికార్డులు బద్దలుకొడుతోంది. అక్టోబరు నెలలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల పన్ను వసూలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. తక్కువ రేట్లు, ఎగవేతలకు తక్కువ అవకాశం, అధిక సమ్మతి, ఒకే పన్ను ఉండటం, పన్ను అధికారుల జోక్యం దాదాపు లేకపోవడం వల్లే ఇది బాగా విజయవంతం అయ్యిందని అరుణ్ జైట్లీ ఓ ట్వీట్‌లో తెలిపారు. గత సంవత్సరం జూన్ ఒకటో తేదీన జీఎస్టీని అమలుచేశారు. అంతకుముందున్న బహుళ పరోక్ష పన్నుల స్థానంలో ఒకే సమగ్ర పన్ను విధించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. పెట్రోలు, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఇటీవల చెప్పారు. అలా చేస్తే వాటి ధరలు కనీసం రూ. 20-30 చొప్పున తగ్గుతాయని, దానివల్ల దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బోలెడంత ఊరట లభిస్తుందని అథవాలే అన్నారు.
 ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా?

Updated By ManamWed, 10/31/2018 - 14:01
RBI Governor Urjit Patel May Consider Resigning as Arun Jaitley Remarks

న్యూఢిల్లీ : విచక్షణారహితంగా రుణాలిస్తున్న ధోరణిని అరికట్టడంలో ఆర్‌బీఐ విఫలమైందంటూ అరుణ్ జైట్లీ విమర్శలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కేంద్రం, ఆర్‌బీఐ మధ్య అభిప్రాయ బేధాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ఆర్‌బీఐకానీ, ఆర్థిక మంత్రిత్వ కార్యాలయం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నఱ్ విరళ్ ఆచార్య కూడా ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మంచిది కాదని అన్నారు.  కేంద్ర బ్యాంక్ స్వాతంత్య్రాన్ని బలహీనపరచడం ‘వినాశన కారకంగా’ పరిణమించవచ్చని  శుక్రవారం ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అయితే ఉర్జిత్ పటేల్ సూచనలతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ద్రవ్య విధాన నిర్ణేతలకు స్వయం ప్రతిపత్తిపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ఆర్‌బీఐకి మధ్య పెరుగుతున్న ఘర్షణ పెరుగుతున్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 7 కిందట తన అధికారాలను ఉపయోగిస్తూ వివిధ కీలక అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం కొన్ని లేఖలు రాసింది. ఈ సెక్షన్ 7 కింద స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు గతంలోని ఏ ప్రభుత్వం కూడా తన అధికారాలను ఉపయోగించలేదు.బడ్జెట్‌లో ఏంకావాలో చెప్పండి

Updated By ManamMon, 10/29/2018 - 05:28
 • అన్ని మంత్రిత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచన

 • ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన యంత్రాంగం

 • వరుసగా ఆరో సారి జైట్లీ బడ్జెట్ ప్రసంగం

 • సాధారణ ఎన్నికల వేళలో భారీ అంచనాలు

Arun-Jaitleyముంబై: రాబోయే (2019-20) వార్షిక బడ్జెట్‌లో విత్త మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం కోసం ఇన్‌పుట్‌లను పంపవలసిందిగా పలు శాఖలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, 2019 సాధారణ ఎన్నికలక ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రవేశ పెట్టే వార్షిక బడ్డెట్ కావడం గమనార్హం. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్డెట్‌ను రూపొందించే పనిలో బీజేపీ యంత్రాంగం నిమగ్నమైంది. ఇందుకోసం ఈ నెల ప్రారంభం నుంచే ఉక్కు, విద్యుత్, గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర సమీక్ష, రాబోయే బడ్జెట్ అంచనాలకు సంబంధించి చర్చలు జరిపింది. ఈ సమావేశాలు ఇంకా నవంబర్ 16 వరకు కొనసాగనున్నాయి. కాగా, అంతకు ముందే అన్ని మంత్రిత్వ శాఖలు బడ్జెట్‌కు సంబంధించిన నివేదికలను నవంబర్ 15లోగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సారి భారీ బడ్జెట్‌తో వస్తుందనే అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వరుసగా ఆరో సారి లోక్‌సభలో ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  కాగా, ఇంతకు ముందు సాధరణ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం 2014 ఫిబ్రవరిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అదే ఏడాది అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ  ఆధ్వర్యంలో ఆరుణ్ జైట్లీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.సీబీఐ ప్రతిష్టను కాపాడుతున్నాం: జైట్లీ

Updated By ManamWed, 10/24/2018 - 12:37
Should restore credibility of CBI: Arun Jaitley

న్యూఢిల్లీ :కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సిఫారసు మేరకే సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలను సెలవుపై పంపామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐ విశ్వసనీయతను, సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, అందుకే తాము ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. 

బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐలో ఏర్పడిన సంక్షోభంపై స్పందించారు. అలోక్‌వర్మ, రాకేశ్ ఆస్థానాలు పరస్పరం చేసుకున్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారిస్తుందని, ఆ ఇద్దరు అధికారులను ఒకే చోట కూర్చోబెట్టి విచారణ జరుపుతారన్నారు. ప్రస్తుతం తీసుకున్న చర్యలన్నీ తాత్కాలికమేనని స్పష్టం చేశారు. అవినీతి కేసుల విచారణ, దర్యాప్తు బృందం ఏర్పాటు బాధ్యత సీవీసీదేనని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇద్దరు అధికారులపై వచ్చిన ఆరోపణలపై సీవీసీకి సమగ్ర నివేదిక అందిందని, ఆ నివేదిక ఆధారంగా నిందితులు తమను తాము విచారించుకునే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించిందని, ఇందులో భాగంగానే ఇద్దరు అధికారులపై సీవీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్రలేదని స్పష్టం చేశారు. సీబీఐలో ఏర్పడిన వివాదం దురదృష్టకరమని, అవాంఛనీయమని జైట్లీ పేర్కొన్నారు. 

ఇద్దరిలో ఎవరు మంచి, ఎవరు చెడు అంశంపై తాను వ్యాఖ్యానించదల్చుకోలేదని అన్నారు. రఫేల్ కుంభకోణానికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నందునే అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారని కాంగ్రెస్‌తోపాటు ఇతర విపక్షాలు చేస్తున్న ఆరోపణలను జైట్లీ కొట్టిపారేశారు. విపక్ష నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీబీఐలో విచారణ ప్రక్రియ పారదర్శకంగా జరగట్లేదని ప్రచారం చేసేందుకే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సంస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీవీసీ సిఫారసులను అమలు చేసేందుకే ప్రభుత్వం ఇద్దరు అధికారులను బదిలీ చేసిందని అన్నారు.

‘‘వారిద్దరూ పెద్ద అధికారులు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరి వారిపై విచారణ జరిపేది ఎవరు? ఇది పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ పరిధిలోనిది కాదు. విచారణ జరిపే అధికారంప్రభుత్వానికి లేదు. చేయబోదు కూడా’’ అని జైట్లీ చెప్పారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పౌరులతోపాటు విపక్షాలకు కూడా ఉందన్నారు. సీబీఐ అంశం దేశం పారదర్శకతకు సంబంధించిన అంశమని అన్నారు. 

నేరస్థులు, విదేశాల్లో తలదాచుకున్నవారు సీబీఐని వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని జైట్లీ చెప్పారు. ఆ ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరి దర్యాప్తును పర్యవేక్షణ చేసుకోవడం ప్రపంచంలోనే ఇంత పెద్ద అసమంజసం ఉండదని అన్నారు. కొందరు అధికారుల చర్యలతో సీబీఐని హేళన చేసే పరిస్థితి రాకూడదన్నారు. రాకేశ్ ఆస్థానాపై ప్రధాని మోదీకి ప్రత్యేక  అభిమానం ఉందని, అందకే ఆయన్ను ఏరికోరి సీబీఐలో నియమించారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా జైట్లీ కొట్టిపారేశారు.

సీబీఐలో పని వాతావరణానికి విఘాతం: కేంద్రం
సీబీఐలో నెలకొన్న వివాదంతో ఆ సంస్థలో పని పరిస్థితులకు తీవ్ర విఘాతం కలిగిందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సీవీసీకి ఏమాత్రం సహకరించడంలేదని వెల్లడించింది. ఇద్దరు అధికారులను సెలవుపై వెళ్లాలని ఆదేశించడం సబబేనని, సీబీఐలో అతితీవ్ర అవాంఛనీయ పరిణామాలు నెలకొన్నాయని పేర్కొంది. సీబీఐలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది, అది సంస్థ విశ్వసనీయత-సమగ్రతకు భంగం కలిగించే స్థాయికి చేరుకుందని వెల్లడించింది.

 

కాగా సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ మధ్య వివాదం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వీరిద్దరి ఛాంబర్లు కూడా సీజ్ చేశారు. మరోవైపు అలోక్, ఆస్థానా సన్నిహిత అధికారులను బాధ్యతల తప్పించగా, మరికొంతమంది సెలవుల్లో వెళ్లాలని ఆదేశాలు వెలువడ్డటంతో గందరగోళం నెలకొంది.
 మీకు ప్రజలే బుద్ధి చెబుతారు

Updated By ManamSun, 10/07/2018 - 13:35

Yanamala Ramakrishnuduఅమరావతి: 2019 ఎన్నికలు సుస్థిర, అరాచక కూటముల మధ్య పోటీ అని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అనడం హాస్యాస్పదం అని ఏపీ మంత్రి యనమల రామక‌ృష్ణుడు అన్నారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల రామకృష్ణుడు.. సుస్థిరత పేరుతో ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ కాలరాసిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ రాజ్యాంగ విలువలను భ్రష్టుపట్టించిందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

స్వతంత్రంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చిందని.. సీబీఐ, ఈసీ, ఐటీ అన్నింటినీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని యనమల అన్నారు. ఉదయం 12గంకు ఈసీ ప్రెస్ మీట్ అని చెప్పి ప్రధాని మోది అజ్ మీర్ సభ ఉందని 3గంకు మార్చడమే తాజా రుజువని గుర్తు చేశారు. 

సుస్థిర ప్రభుత్వం అంటే వ్యవస్థలను ఎలాపడితే అలా వాడుకోమని కాదని, ఏదిపడితే అది చేయడం కాదని తెలిపిన యనమల.. సుస్థిర ప్రభుత్వం పేరుతో ప్రజల హక్కులను కాలరాయడం, వ్యవస్థలను పతనం చేయడం కాదని తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపాడలేని సుస్థిర ప్రభుత్వాలు ఎందుకు..? ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే సుస్థిర ప్రభుత్వాలు అవసరమా..? అంటూ యనమల ప్రశ్నించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? డిఫెన్స్ స్కామ్ ల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? అంటూ ఈ సందర్భంగా యనమల అనుమానాలు వ్యక్తం చేశారు. రాఫెల్, కోల్ స్కామ్, బ్యాంకుల దివాలా, ఆర్ధిక నేరస్తుల పరారీ, వేటిపైనా మోదీ ఎందుకు నోరు తెరవరు..? అంటూ ఆయన ప్రశ్నించారు. భాగస్వామ్య పక్షాలను మోసం చేసే బీజేపీ ఇతర పార్టీల కూటమిపై ఎలా మాట్లాడుతుందని అన్నారు.

గత 4ఏళ్లుగా కేంద్రంలో నానా రకాల విఫల ప్రయోగాలు చేస్తున్నారని, అరాచక పాలన చేస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరించి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో బడుగు బలహీన వర్గాలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయని.. పెట్రోధరలు, ఎరువులు, గ్యాస్, నిత్యావసర ధరలు చుక్కలనంటాయని.. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని.. ఏ రంగంలో చూసినా ఘోర వైఫల్యాలే కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇప్పుడు సుస్థిరత, అరాచక కూటమి అనే పదాలు వల్లె వేస్తున్నారని యనమల విమర్శించారు. 

ప్రజలు దేనినైనా సహిస్తారు గాని మోసాన్ని, ద్రోహాన్ని సహించరని.. ఏది అరాచక కూటమి, ఏది సుస్థిర కూటమి అనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా డ్రామా అధికారికంగా ధ్రువీకరించబడిందని.. ఈసీ ప్రకటనే ఆ నాటకాన్ని బయటపెట్టిందని, బీజేపీ, వైసీపీ లాలూచికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఏం కావాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాటకాన్ని టీడీపీ ముందే ఎండగట్టిందని చెప్పుకొచ్చారు.? ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, లాలూచి పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని యనమల తెలిపారు.ఆధార్ వాడకానికి చట్టం అవసరం

Updated By ManamSat, 10/06/2018 - 22:30

Arun-Jaitleyన్యూఢిల్లీ: బయో మెట్రిక్ ఐడెంటిటి ఆధార్‌ను మొబైల్ ఫోన్లకు, బ్యాంక్ ఖాతాలకు తప్పనిసరిగా అనుసంధానపరచ డాన్ని పార్లమెంట్ ఆమోదించిన చట్టం పునరుద్ధరించడానికి అవకాశముందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం దీని కోసం కొత్త చట్టం తీసుకు వస్తుందని ఆయనేమీ వెల్లడిం చలేదు. బయోమెట్రిక్ ఆధా రిత 12 సంఖ్యల అనన్య గుర్తింపు సంఖ్య ఆధార్ రాజ్యాంగ బద్ధతను సుప్రీం కోర్టు గత నెలలో ధ్రువీక రించింది. కా నీ, మొబైల్ ఫోన్ వాడకం దారు గుర్తింపు ను సరిపోల్చు కోవడం కోసం టెలికాం ఆపరేటర్ల వంటి ప్రైవేటు సంస్థలు వాటిని ఉపయోగించుకోవడాన్ని నిషేధించింది. తీర్పును ఆయన ‘‘సిసలైనదిగా, సాధారణంగా అందరూ ఇష్టపడేదిగా’’ అభివర్ణించా రు. ఆధార్ విషయంలో ప్రభుత్వ ఆశయం న్యాయబద్ధమైనదేనని కోర్టు అంగీకరించిందని జైట్లీ అన్నారు. ‘‘ఆధార్ పౌరసత్వ కార్డు కాదు’’ అని ఆయన ఇక్కడ హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సులో అన్నారు. ‘‘ఎందుకంటే, మన దగ్గర ప్రభుత్వానికి చెందిన భారీ మొత్తంలో నగదును అన్ని వర్గాల వ్యక్తులకు వివిధ రూపాలలో సహాయంగా, సబ్సిడీలుగా అందించే వ్యవస్థ ఉంది. ఆధార్ ముఖ్య ఉద్దేశం అదే’’ అని ఆయన అన్నారు. ఆధార్ వల్ల చేయదగిన చాలా పనులను సుప్రీం కోర్టు అంగీకరించిందని ఆయన అన్నారు. ‘‘కోర్టు సమ్మతించ నిది రెండు కేటగిరీలలోకి వస్తుంది. 

Arun-Jaitley

ఈ కేసులలో ఆధార్ ఎంతవరకు సహా యపడగలదే సమానతా సూత్రం. రెండు. సముచితమైన చట్టంతో ఆ పనిని నిర్వహించడం. ప్రైవేటు కంపెనీలు దానిని ఉప యోగించకూడదనే వాదనకు సెక్షన్ 57లో జవాబు లభిస్తోంది. చట్టం ద్వారా కాంట్రాక్టు ద్వారా ఇతరులను అధీకృతం చేయవచ్చు. కాంట్రాక్టు ద్వారా ఆ పని చేయకూడదన్నదాన్ని మాత్రమే కోర్టు కొట్టేసింది’’ అని ఆయన అన్నారు. చట్టం ద్వారా ఒక న్యాయ నిబంధన తీసుకొచ్చి,  మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానాన్ని పునరుద్ధరించే పని చేయవచ్చని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ‘‘చట్టం ద్వారా ఆ పని ఇప్పటికీ చేయ వచ్చు. కాకపోతే తగిన న్యాయ నిబంధన కింద ఆ పని చేయాలి. ఈ రంగంలో అది అవసరం అనే ప్రాతిపదికన ఆ పని చేయవచ్చు’’ అని జైట్లీ అన్నారు. అయితే, దీని నిమిత్తం ప్రభు త్వం పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేస్తుందా అనే సంగతిని ఆయన వెల్లడించలేదు. ‘‘అనురూపత సూత్రాన్ని’’ ఆధారం చేసుకుని ఆదాయ పన్ను వంటి వివిధ విభాగాల్లో ఆధార్‌ను అనుసంధానపరచడానికి సుప్రీం కోర్టు అనుమతించిందని జైట్లీ చెప్పారు. ‘‘మొబైల్ టెలిఫోనీలో ఆధార్ అనుసంధానం వల్ల ప్రయోజనం చేకూరుతుందనే డాటాను చూపించగలగాలి. అప్పుడది సాధ్య పడుతుంది. మొబైల్, బ్యాంక్ ఖాతాలు రెండు కీలకమైన విభాగాలు’’ అని ఆయన అన్నారు. ప్రతి పౌరునికి ఒక బయోమెట్రిక్ ఐడెంటిటీని ఇవ్వాలన్న ప్రభుత్వ అనుపమాన ప్రయత్నం రాజ్యాంగబద్ధమైనదేనని  సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే, బయోమెట్రిక్ ప్రమాణీకరణ రెండు రకాల వాడకం మధ్య అది స్పష్టమైన విభజన రేఖను గీసింది. సబ్సిడీల చెల్లింపుల వంటి ప్రభుత్వం సమ కూర్చే సహాయాలకు వాడుకోవడం. పన్నుల రికార్డుల కు వాడుకోవడం. ఈ రెండూ ఆమోదయోగ్యమైన వేనని చెప్పింది. టెలికాం కంపెనీలు, బ్యాంకులు వంటి ప్రైవేటు రంగ సంస్థలు ప్రమాణీకరణకు వాటిని ఉపయోగించుకోవడాన్ని నిషేధించింది.నాలుగు రాష్ట్రాల్లో రూ.5 తగ్గింపు!

Updated By ManamThu, 10/04/2018 - 20:25
 • కేంద్రం నిర్ణయానికి అదనంగా రూ.2.50 తగ్గింపు

 • మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్ నిర్ణయం

Petrol, diesel prices down by Rs 5 in all BJP-ruled states

న్యూఢిల్లీ: వాహనదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.50 తగ్గించిన నేపథ్యంలో.. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రంతో సమానంగా తాము కూడా రూ.2.50 తగ్గించనున్నామని మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్ ప్రకటించాయి. దాంతో ఆ రాష్ట్రాల్లోని వినియోగదారులపై రూ.5 మేరకు భారం తగ్గనుంది.  

లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూపాయిని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో, వెంటనే రాష్ట్రాలు సెతం పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని సూచించారు. ఈనేపథ్యంలో మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వెంటనే ధరలను తగ్గించాయి. తమ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 తగ్గించాలని నిర్ణయించిందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రకటించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, తమ వ్యాట్ తగ్గింపుతో మొత్తంగా తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఐదు రూపాయల మేర తగ్గనున్నట్టు పేర్కొన్నారు. 

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు.‘పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 ధర తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు. ఇది సామాన్య ప్రజానీకానికి అతిపెద్ద ఊరట. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజానీకానికి లీటరు పెట్రోల్‌కు అదనంగా మరో రూ.2.50 ఊరట ఇవ్వాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా మా రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.5 తగ్గుతుంది’’ అని రుపానీ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వెల్లడించారు. రూ.5 తగ్గించాలనుకున్నాం.. కానీ: జైట్లీ

Updated By ManamThu, 10/04/2018 - 15:54
 • పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 తగ్గించిన కేంద్రం

 • పెట్రో ఉత్పత్తులపై కేంద్రం లీటర్‌కు రూ.1.50 మేర ఎక్సైజ్ సుంకం తగ్గింపు

 • ఆయిల్ కంపెనీలు రూ.1 తగ్గింపు

 • రాష్ట్రాలు కూడా రూ.2.5 తగ్గించాలని జైట్లీ సూచన

Arun Jaitley

న్యూఢిల్లీ : వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. మండుతున్న చమురు ధరలపై కేంద్రం ఎట్టకేలకు సామాన్య మానవుడికి కొద్దిపాటి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.1.50 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అలాగే మరో రూపాయిని ఆయిల్ కంపెనీలు భరించనున్నట్లు  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దీంతో మొత్తంగా లీటర్‌కు రూ.2.50 మేర ధర తగ్గనుంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర నిర్ణయంతో రూ.10,500 కోట్ల భారం పడనున్నట్లు జైట్లీ తెలిపారు.

ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. ఎక్సైజ్ సుంకాన్ని రూ.5 తగ్గించాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. చమురు ఉత్పత్తులపై రాష్ట్రాలు కూడా సుంకాలు తగ్గించుకోవాలని సూచించారు.  కేంద్రం రూ.2.50 తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ...లేఖలు రాయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ‘సవాళ్లే అవకాశాలవుతాయి’

Updated By ManamSat, 09/29/2018 - 01:16

imageన్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య యుద్ధం మొదట్లో అనిశ్చితిని సృష్టిస్తే సృష్టించి ఉండవచ్చుకానీ, పెద్ద వాణిజ్య, వస్తూత్పత్తి కేంద్రంగా ఇండియాకు అది క్రమంగా ద్వారాలు తెరవడం ప్రారంభించవచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నైతిక విధానాలను అనుసరించవలసిందిగా ఆయన వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. నమ్మదగని సంస్థలకు ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ తలుపులు మూసేస్తుంది కనుక, సంస్థలు వాటి వంతు పన్నులను చెల్లించి తీరాలని జైట్లీ కోరారు. పి.హెచ్.డి చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో జైట్లీ ప్రసంగించారు. కొన్ని ప్రపంచ ధోరణులు ఇండియాపై ప్రతికూల ప్రభావం చూపే మాట నిజమేనని. కానీ, మున్ముందు అవి దేశం వేగంగా వృద్ధి చెందేందుకు బాటలు పరుస్తాయని మంత్రి అన్నారు. ‘‘సవాల్ కాస్త ఎప్పుడు అవకాశంగా మారుతుందో కనిపెట్టేందుకు మనం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలి’’ అని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో అన్నారు. 

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం వల్ల యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, వాహనాలు, ట్రాన్స్‌పోర్ట్ పార్టులు, రసాయనాలు, ప్లాస్టిక్స్, రబ్బరు వస్తువులు వంటి భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లలో మరింత పోటీదాయకమైనవిగా తయారవు తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, పెరుగుతున్న చమురు ధరలు కూడా ఆర్థిక వ్యవస్థకు ఒక సవాల్‌గా పరిణమించాయని జైట్లీ అన్నారు. భారత్ చమురు అవసరాలలో 81 శాతం భాగానికి దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముడి చమురు దిగుమతిలో ఇండియా మూడవ పెద్ద దేశంగా ఉంది. పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరలు, దేశంలో పటిష్టమైన డిమాండ్ వాతావరణం దృష్య్యా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలను పెంచేస్తున్నాయి. ప్రపంచ చమురులో సగ భాగానికి గీటురాయిగా నిలిచే బ్రెంట్ ధర గత ఐదు వారాల్లో పీపాకు 71 డాలర్ల నుంచి 80 డాలర్లకు పెరిగిపోయింది.
 
ఈ రకమైన సవాళ్ళు ఉన్నప్పటికీ, రానున్న రోజులు, సంవత్సరాలలో వృద్ధి చెందేంగుకు ఇండియాకు గొప్ప అవకాశాలు వస్తాయని నిశ్చితంగా చెప్పగలనని మంత్రి అన్నా రు. నైతిక విధానాలు పాటింటే వ్యాపార సంస్థలు కొన సాగేందుకు ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉందని జైట్లీ చెప్పా రు. పన్నులు చెల్లించేవారు చెల్లిస్తూనే ఉన్నారని,  చెల్లించ నివారి భారాన్ని తెచ్చి చెల్లించేవారిపై మోపకూడదని ఆయన అన్నారు. కనుక, పన్నులు ఎగవేసేవారిని పన్ను పరిధిలోకి తీసుకురావడం అత్యంత నైతిక విధానాల్లో ఒకటవుతుందని అన్నారు. భారతీయ వ్యాపార సంస్థలపై ఐ.బి.సి నూతన నైతిక సూత్రాలను విధించిందని అన్నారు. రుణ దాతల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు వడ్డీ చెల్లించి తీరాలి. రుణాలిచ్చిన తర్వాత రుణ దాతలు నిద్ర లేని రాత్రులు గడిపే పరిస్థితి ఉండకూడదని జైట్లీ వ్యాఖ్యానించారు. నైతికంగా వ్యవహరించడం వల్లనే సత్ఫలితాలు వస్తాయనే సంస్కృతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారతీయ వ్యాపార సంస్థలు దీన్ని ప్రోత్సహించాలన్నారు.

Related News