arun jaitley

మళ్లీ ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు

Updated By ManamFri, 08/03/2018 - 11:52

Arun Jaitleyన్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల రీత్యా గత మూడు నెలలుగా అధికారిక విధులకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ త్వరలోనే తిరిగి ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆగష్టు రెండో వారం తర్వాత జైట్లీ విధుల్లోకి రానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

మరోవైపు అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్‌జైట్లీ.. ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. మే నుంచి ఆయన విధులకు స్వల్ప విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే.ఇందిరా గాంధీపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

Updated By ManamTue, 06/26/2018 - 13:20

న్యూఢిల్లీ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపైనా ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ముంబయి విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మంగళవారం మాట్లాడారు. అధికార కాంక్షతో ఇందిరాగాంధీ కుటుంబం దేశం మొత్తాన్ని జైలులా మార్చేస్తుందని ఎవరూ ఎప్పుడూ అనుకోలేదన్నారు.

Narendra modi

అయితే కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ నియంతా వ్యవహరించారని మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమె రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. బీజేపీకి రాజ్యాంగం దైవంతో సమానమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్‌, జన్‌సంఘ్‌ నుంచి దళితులు, ముస్లింలు తమను తాము కాపాడుకోవాలని దుష్ప్రచారం చేశారంటూ ప్రధాని మండిపడ్డారు.

హట్లర్‌లా ఇందిరా గాంధీ..!
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జ్జెన్సీని గుర్తుచేస్తూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ఆమెను ఒకప్పటి జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్, ఇందిరా గాంధీ ఇద్దరూ రాజ్యంగాన్ని గౌరవించలేదని జైట్లీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చేందుకు ఇద్దరూ రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ సందర్భంగా జైట్లీ నిన్న (సోమవారం) సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేశారు.

ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయించి హిట్లర్ తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ హిట్లర్‌లా కాకుండా భారత్‌ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా మార్చారని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వేధించిందని, ప్రాథమిక హక్కులను కాలరాసిందని తెలిపారు. మీడియాపైనా ఆంక్షలు విధించిందని, పలువురు ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టించిందని జైట్లీ గుర్తుచేశారు. వివిధ పార్టీల కార్యకర్తలను, ప్రతిపక్ష నేతలను, ఆరెస్సెస్ కార్యకర్తలను జైలుకు పంపించారని జైట్లీ వెల్లడించారు.
 ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌ రాజీనామా

Updated By ManamWed, 06/20/2018 - 16:12

న్యూఢిల్లీ :   ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి అరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వార్తను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. కాగా కుటుంబ కారణాల వల్ల తాను రాజీనామా అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారని, తిరిగి ఆయన యూఎస్ వెళ్లిపోవాలనుకుంటున్నట్లు తనతో చెప్పారని జైట్లీ పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలు అయినా.. అది సుబ్రమణియన్‌కు చాలా ముఖ్యమని, దీంతో ఆయన నిర్ణయాన్ని కాదనలేకపోయినట్లు తెలిపారు.

Arvind Subramanian

సుబ్రమణియన్ 2014 అక్టోబర్‌లో దేశీయ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమింపబడ్డారు. మూడేళ్ల కాలానికి గాను ఆయన, ఈ బాధ్యతలు చేపట్టారు.  అయితే అరవింద్‌ సుబ్రమణియన్ పదవీ కాలం గత ఏడాదే ముగిసినా, ఆ ఏడాది అక్టోబర్‌ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

స్థూల ఆర్థిక అంశాలు, ప్రధాన బాధ్యతలు వంటి వాటికి ఆర్థికమంత్రికి సుబ్రమణియన్ సలహాదారుగా వ్యవహరించారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నియమించబడటంతో, సుబ్రమణియన్ ఆయన స్థానంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.‘భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు’

Updated By ManamMon, 06/18/2018 - 22:46
  • వృద్ధి రేటుతో నిరాశావాదుల మాటలు వట్టివేనని తేలిపోయిందన్న జైట్లీ

jaitleyన్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో నమోదైన 7.7 శాతం వృద్ధి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియాను ‘‘దృఢంగా’’ సువ్యవస్థితం చేసిందని, భవిష్యత్తు గతంకన్నా మరింత ప్రకాశమానంగా కనిపిస్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నిరాశావాదుల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 25 చొప్పున పన్ను తగ్గించాలని మాజి ఆర్థిక మంత్రి పి. చిదంబరం చేసిన సూచనను కూడా జైట్లీ తోసిపుచ్చారు. ‘‘వలలో చిక్కేందుకు చేసిన సూచన’’ గా ఆయన దాన్ని అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు, వస్తువులు, సేవల పన్ను, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్‌ను అమలులోకి తేవడం వంటి వ్యవస్థాగత సంస్కరణల వల్ల భారత్‌కు రెండు త్రైమాసికాలు సవాళ్ళతో గడిచాయని ఆయన అన్నారు. ‘‘జి.డి.పి వృద్ధి 2 శాతం తగ్గుతుందని చెప్పిన వారి జోస్యంలో నిజం లేదని నిర్ద్వంద్వంగా తేలిపోయింది’’ అని జైట్లీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘వ్యవస్థాగత సంస్కరణలు, వివేకంతో కూడిన వ్యయం పట్ల ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు సరైన రీతిలో స్పందించాయి’’ అని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ‘‘చిరస్మరణీయ అసమర్థ నిర్వహణ’’గా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2016 నవంబర్‌లో వ్యాఖ్యానించారు. దానివల్ల జి.డి.పి వృద్ధిలో సుమారు 2 శాతం తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందన్నారు. ‘‘జి.డి.పి డాటాకు సంబంధించి నాల్గవ త్రైమాసిక ఫలితాలు అద్భుతమైన రీతిలో 7.7 శాతం వృద్ధి రేటును కనబరచాయి. భారతదేశాన్ని వేగంగా వృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక శక్తిగా నిశ్చయంగా నిరూపించాయి. నిపుణుల ప్రకారం ఈ ధోరణి వచ్చే కొద్ది ఏళ్ళపాటు కొనసాగుతుంది’’ అని జైట్లీ అన్నారు. నిర్మాణ రంగంలో రెండంకెల వృద్ధి, రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వస్తూత్పత్తి రంగ విస్తరణ, ఆర్థిక సమ్మిళిత పథకాలు ఉద్యోగాలను, స్వయం ఉపాధివారికి అవకాశాలను సృష్టించాయని ఆయన చెప్పారు. ‘‘నాకు ముందు (ఆర్థిక మంత్రి పదవి నిర్వహించిన) విశిష్ట వ్యక్తి తాను భవిష్యత్తును పేదరికంలో గడపవలసి వస్తుందేమోనని భయపడ్డారు. మేం ప్రతి భారతీయుడిని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగం అయ్యేట్లు చూశాం. భవిష్యత్తు గతంకన్నా చాలా ప్రకాశమానంగా కనిపిస్తోంది. ఈ ధోరణి మరి కొన్నేళ్ళపాటు కొనసాగే అవకాశం ఉంది’’ అని జైట్లీ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రి అస్తవ్యస్తం చేశారు’’ అంటూ మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా గత ఏడాది విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, నూతన సర్వత్ర పన్ను వ్యవస్థ జి.ఎస్.టి వంటి ప్రభుత్వ నిర్ణయాలను యశ్వంత్ దుయ్యబట్టారు. ‘‘పేదరికాన్ని తాను దగ్గర నుంచి చూసిన వ్యక్తినని ప్రధాన మంత్రి చెప్పుకుంటున్నారు. ఆయన ఆర్థిక మంత్రేమో (జైట్లీ) భారతీయులందరూ కూడా దాన్ని అంతే దగ్గర నుంచి చూసేందుకు పగలనక రాత్రనక పనిచేస్తున్నారు’’ అని యశ్వంత్ ఎద్దేవా చేశారు.

మే 14న కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకోక ముందు జైట్లీ ఆర్థిక శాఖను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మంత్రిత్వ శాఖ లేని క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఈలోగా, రైల్వే, బొగ్గు శాఖలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. బి.జె.పి ప్రభుత్వం ప్రజలను పేదరికంలోకి నెట్టిందని, దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న వారి సంఖ్య ఐక్య ప్రగతిశీల కూటమి పాలనలో కన్నా పెరిగిందని చిదంబరం కూడా విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి, డిజిటలీకరణ, ఆధార్, గుప్త ధన నిరోధక చర్యలు భారతీయ ఆర్థిక వ్యవస్థ క్రమంగా నియతం కావడానికి దారి తీస్తున్నాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. వచ్చే కొద్ది ఏళ్ళలో కూడా పన్ను వసూళ్ళ ధోరణి ఇదేమాదిరి కొనసాగితే ‘‘మనం మెరుగైన భవిష్యత్తును దర్శిస్తాం’’ అని జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. చిదంబరం పేరు నేరుగా ప్రస్తావించకుండా జైట్లీ తనకు ‘‘పూర్వపు విశిష్ట వ్యక్తి’’ పెట్రోల్, డీజిల్‌పై పన్నులు లీటరుకు రూ. 25 తగ్గించేందుకు ‘‘ఎన్నడూ ప్రయత్నించలేదు’’ అని జైట్లీ గుర్తు చేశారు. ‘‘ఇది వలలో చిక్కేందుకు చేసిన సూచన. ఇది ఇండియాను నిర్వహించలేనంత రుణంలోకి నెట్టేస్తుంది. యు.పి.ఏ ప్రభుత్వం వారసత్వంగా వదిలి వెళ్ళింది ఇంచుమించుగా అలాంటిదే’’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఆదాయ, వ్యయాల మధ్య సమతూకం, స్థూల ఆర్థికాంశాలలో బాధ్యతాయతంగా నడచుకోవడంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం చాలా మంచిపేరు తెచ్చుకుందని అన్నారు. యు.పి.ఏలోని ‘విధానపరమైన పక్షవాతం’ నుంచి ఎన్.డి.ఏ హయాంలో ‘వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడం’ ఆ విషయాన్ని తిరుగులేని విధంగా నిరూపించిందని జైట్లీ చెప్పారు. 
 కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి.. ఇంటికి తిరిగొచ్చిన జైట్లీ

Updated By ManamMon, 06/04/2018 - 17:59

Arun Jaitley, Returns Home, Kidney Transplant న్యూఢిల్లీ: కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి అయిన వెంటనే కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ (65) సోమవారం తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అందరికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 3 వారాల పాటు తనను క్షేమంగా చూసుకున్న ఎయిమ్స్‌ వైద్యులు, నర్సులకు జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇంటికి తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మూడు వారాల పాటు నన్ను క్షేమంగా చూసుకున్న వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహోద్యోగులకు నా హృదయపూర్వక అభినందనలు’’ అని జైట్లీ ట్వీట్‌ చేశారు. జైట్లీ ఆసుపత్రిలో చేరడంతో ఆయన స్థానంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆర్థిక శాఖను అదనపు బాధ్యతల కింద అప్పగించారు. కాగా, గత కొంతకాలంగా జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో చికిత్స నిమిత్తం మే 12న ఆయన ఎయిమ్స్‌లో చేరారు. మే 14న జైట్లీకి శస్త్రచికిత్స చేశారు.జైట్లీ వ్యాఖ్యలు బాధాకరం: లోకేశ్‌

Updated By ManamTue, 04/17/2018 - 18:36

Lokesh babu, Arun Jaitley, AP CM Chandrababu naidu, Cash shortage issueఅమరావతి: ‘దేశంలో నగదుకు కొరత లేదని, తాత్కాలిక నగదు కొరత ప్రస్తుతం ఉంది’ అని కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని జైట్లీ మాట్లాడటం బాధాకరమని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో నగదు కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పరంగా పెన్షన్లు, ఉపాధిహామీ వేతనాల చెల్లింపులో కూడా తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన ఆయన.. నగదు సరఫరా చేయాలని స్వయంగా సీఎం లేఖ చేశారని, అనేక సార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నగదును అందుబాటులోకి తేవాలని లోకేశ్‌ ట్విట్టర్‌లో జైట్లీని కోరారు.రాజ్యసభ సభ్యుడిగా జైట్లీ ప్రమాణ స్వీకారం

Updated By ManamSun, 04/15/2018 - 12:41

Arun Jaitley, oath as Rajya Sabha member, special ceremony by Vice-President, ajya Sabha Chairman Venkaiah Naiduన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్ ఛాంబర్‌లో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు జైట్లీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జైట్లీ తిరిగి ఎన్నికైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ ముగింపు సమావేశాల సమయంలో అనారోగ్యం కారణంగా జైట్లీ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఎగువ సభకు తిరిగి ఎన్నికైన జైట్లీ.. రాజ్యసభ నేతగా నియమితులయ్యారు. కాగా, గతకొద్దికాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న జైట్లీ.. ఇటీవలే ఎయిమ్స్‌‌లో చికిత్స తీసుకొని గతవారమే డిశ్చార్చి అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కూడా పాల్గొన్నారు.'అందుకే జైట్లీని కలిశామనడం తప్పుడు ప్రచారమే'

Updated By ManamFri, 03/23/2018 - 17:31

that is not truth, Arun Jaitley, TDP MP Sujana chowdary న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై మాట్లాడేందుకు  కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లారని అనడం తప్పుడు ప్రచారమేనని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కొట్టిపారేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆరోపించడం, కథలు అల్లడం తప్ప మరో పని లేదని విమర్శించారు. మైండ్ గేమ్ ఆడాలనకుంటే మాత్రం తామేమీ సున్నితమైనవాళ్లం కాదని సుజనా హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం ఏమి చేయాలో తమకు బాగా తెలుసునని చెప్పారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి నమస్కారం, ప్రతి నమస్కారం తప్పితే ఇంకేమీ చేయడంలేదని అన్నారు. తమ పార్టీ నిర్ణయం లేనిదే తాము ఏమీ చేయమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం తేలేవరకు ఎలాంటి చర్చకు కూడా అవకాశం ఇవ్వట్లేదని తేల్చి చెప్పారు.యూపీ నుంచి రాజ్యసభకు జైట్లీ నామినేషన్

Updated By ManamMon, 03/12/2018 - 16:24

Arun Jaitley, Nomination Papers, Rajya Sabha Polls, From Uttar Pradesh లఖ్‌నవూ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ స్థానానికి నామినేషన్‌‌ను దాఖలు చేశారు. యూపీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లోని టండన్ హాల్‌లో సోమవారం జైట్లీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. యూపీ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, యూపీ కేబినెట్ మంత్రులు శ్రీకాంత్ శర్మ, అనుపమ జైశ్వాల్, పార్టీ నేత హీరో బాజ్‌పాల్ సమక్షంలో అరుణ్ జైట్లీ నామినేషన్ దాఖలు చేశారు. అరుణ్ జైట్లీతో పాటు, ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. వారిలో అశోక్ బాజ్‌పాల్, విజయ్ పాల్ సింగ్ తోమార్, శకల్ దీప్ రాజ్‌భర్, కంటా కర్దమ్, అనిల్ జైన్, హర్‌నాథ్ సింగ్ యాదవ్, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు.ఏపీపై సవతి ప్రేమెందుకు..?

Updated By ManamThu, 03/08/2018 - 12:41

Mohan Babu, Arun Jaitley ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ నేతలు తమ ఆందోళనను పెంచుతున్న సమయంలో సినీ రంగం నుంచి కూడా వారికి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీని మనిషిగా మారుద్దాం అంటూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కామెంట్ చేయగా.. తాజాగా మోహన్ బాబు కూడా కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు.

"ఆంధ్రప్రదేశ్‌పై సవతి ప్రేమెందుకు? ఏపీ ఏం తప్పు చేసింది? ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతోంది? ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటూ తెలంగాణ కూడా మద్దతు తెలుపుతుంటే ఒక రాష్ట్ర సెంటిమెంట్‌గా ఎందుకు భావిస్తున్నారు" అంటూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు మోహన్ బాబు.

Related News