america

మహేశ్ ‘మహర్షి’ అమెరికా షెడ్యూల్‌కు బ్రేక్

Updated By ManamSun, 09/16/2018 - 17:16

Mahesh Babuమహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. షూటింగ్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ త్వరలో అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన అది రద్దైంది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 25రోజుల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అమెరికాపై హరికేన్ పంజా

Updated By ManamSun, 09/16/2018 - 00:09
 • కరోలినాపై విరుచుకుపడిన ‘ఫ్లారెన్స్’

 • వివిధ ప్రమాదాల్లో నలుగురి మృతి

 • ఫిలిప్పీన్స్‌లోనూ తుపాన్ బీభత్సం

americaవెల్మింగ్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన భీకర హరికేన్ ఫ్లోరెన్స్ అమెరికా తీరాన్ని తాకింది.  తాకుతూనే ఉత్తర, దక్షిణ కరోలినాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలకు తోడు భీకరమైన గాలులు వీస్తుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉభయ కరోలినాల్లోని నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర కరోలినాలో  ఓ ఇంటిపై చెట్టుకూలి  ఓ మహిళ, ఆమె కూతురు దుర్మరణం పాలయ్యారు. మరో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. న్యూబెర్న్‌లో రహదారులపై మూడు మీటర్ల ఎత్తువరకు నీరు నిలవడంతో అనేక మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఇలా చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. న్యూబెర్న్ ప్రాంతంలోనే ట్రెంట్, న్యూసే నదులు కలుస్తుండటంతో వరద తీవ్ర ఎక్కువగా ఉంది. కాగా, శుక్రవారం రాత్రి 11 గంటలకు ఫ్లారెన్స్ హరికేన్ తీవ్రత కొద్దిగా తగ్గినా.. ప్రమాదస్థాయి  ఏమాత్రం తగ్గలేదని జాతీయ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. కాగా, ఫిలిప్పీన్స్‌పైనా టైపూన్ మంగ్‌కూట్ పంజా విసిరింది. భీకరమైన గాలులు, వర్షాలతో బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారని, ఆరుగురు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. కగాయన, లుజాన్ దీవులపై హరికేన్ ప్రభావం అధికంగా ఉందని అన్నారు. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఐదుగురి మృతి

Updated By ManamThu, 09/13/2018 - 12:26

Americaకాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తనని తాను కాల్చుకొని అతడు అక్కడికక్కడే మరణించాడు. బేకర్స్‌ఫీల్డ్‌లోని ఓ ట్రెక్కింగ్‌ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్‌ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే వారం వ్యవధిలో అమెరికాలో కాల్పుల జరగడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉన్న విషయం తెలిసిందే.నేడు భారత్-అమెరికా 2+2 సమావేశాలు 

Updated By ManamThu, 09/06/2018 - 00:06
 • పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు

 • రష్యా మిసైల్ సిస్టమ్, ఇరాన్ చమురుపై ప్రధాన చర్చ?

indiaవాషింగ్టన్/ న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అత్యంత కీలకమైన 2+2 సమావేశం గురువారం ఢిల్లీలో జరగనున్నాయి. దీనికి అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మెక్ పాంపియో, రక్షణ శాఖ మంత్రి జిమ్ మట్టీస్, భారత్ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. వాస్తవానికి ఈ చర్చలు గతంలోనే అమెరికాలోనే జరగాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేసి వేదికను ఢిల్లీకి మార్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా వ్యూహాత్మక భద్రత, రక్షణ, సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరపున్నారు.  భారత్-పసిఫిక్ ప్రాంతంలోనూ, దానికి ఆవల ఎదురవుతున్న సవాళ్లపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా భారత్..రష్యా నుంచి కొనుగోలు చేయనున్న ఎస్-400 మిసైల్ సిస్టమ్, ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై చర్చించే అవకాశాలు ఉన్నారు. రష్యా నుంచి 4.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఐదు ఎస్-500 మిసైల్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. అయితే దీనికి అమెరికా అభ్యంతరాలు చెబుతోంది. ఇరాన్‌పై ఆంక్షలు విధించినందున ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని కూడా భారత్‌ను అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలతోపాటు మరో 12 ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించనున్నారు.ఆయుధాల ఎగుమతుల్లో ‘అగ్ర’రాజ్యమే!

Updated By ManamTue, 08/28/2018 - 00:08
 • సౌదీ అరేబియా, యూఏఈలకే ఎక్కువగా

 • మరోసారి తన పెత్తనాన్ని నిలుపుకున్న అమెరికా

 • వాషింగ్టన్‌కు సవాలు విసురుతున్న చైనా

 • 38 శాతం వృద్ధి రేటుతో డ్రాగన్ జోరు

 • రేసులో వెనుకంజలో రష్యా, జర్మనీ..

imageఅమెరికా జాతీయ పరిశ్రమ అంటే.. ‘యుద్ధమే’ అనే నానుడి ఉంది. రక్షణ రంగం లో, ఆయుధాల ఎగుమతుల్లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తన ‘జాతీయ పరిశ్రమ’కు మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటోంది. 2018 తొలి అర్ధభాగంలో వివిధ దేశాల ఆయుధాల ఎగుమతుల గణాంకాలు  ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.

46.9 బిలియన్ డాలర్ల అమ్మకాలు
అమెరికా ఈ ఏడాది తొలి అర్ధభాగం.. అంటే జనవరి నుంచి జూలై మధ్యలో ఏకంగా 46.9 బిలియన్ డాలర్ల విలువైనimage ఆయుధాలను తన మిత్ర రాజ్యాలకు ఎగుమతి చేసింది. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 5 బిలియన్ డాలర్లు ఎక్కువ.

ఎగుమతుల్లో చైనా జోరు
అమ్మకాల విలువ ప రంగా అమెరికా ఆధిప త్యమే కొనసాగుతున్నా..  చైనా కూడా ఆయుధాల ఎగుమతుల రేసులో ముందం జలో ఉంది. అమెరికా ఆయుధ వ్యాపారం వృద్ధిరేటు 25 శాతం ఉండగా.. డ్రాగన్ వృద్ధి రేటు 38 శాతంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు అమెరికాతో ఢీ అంటే ఢీ అన్న రష్యా మాత్రం ఎగుమతుల్లో ప్రతికూలతలను చవి చూస్తోంది. ఆ దేశ ఎగుమతుల వృద్ధి రేటు -7.1 శాతం నమోదయింది. జర్మనీ ఎగుమతుల రేటు కూడా -14 శాతంలో ఉంది. ఫ్రాన్స్ వృద్ధి రేటు 27 శాతంగా ఉండటం గమనార్హం.

మార్కెట్ వాటాలోనే అమెరికానే
ప్రపంచవ్యాప్తంగా ఆయుధ మార్కెట్‌లోనూ అమెరికా వాటానే అధికంగా ఉంది. వాషింగ్టన్ వాటా 34 శాతం ఉండగా.. 22 శాతం వాటాతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. 6.7 శాతం వాటాతో ఫ్రాన్స్ మూడో స్థానంలో,5.8 శాతం వాటాతో జర్మనీ నాలుగో స్థానంలో, 5.7 శాతం వాటాతో చైనా ఐదో స్థానంలో, 4.8 శాతం వాటాతో ఆరో స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. అటుతర్వాతి స్థానంలో.. ఇజ్రాయెల్, స్పెయిన్ (2.9 శాతం), ఇటలీ (2.5 శాతం),నెదర్లాండ్స్ (2.1శాతం) నిలిచాయి.

సౌదీ అరేబియా, యూఏఈలకే ఎక్కువ
imageఅమెరికా తన ఆయుధ ఎగుమతుల్లో ఎక్కువగా సౌదీ అరేబియా, యూఏఈలకే చేయడం గమనార్హం.  అమెరికా ఆయుధాల కొనుగోళ్లలో 18 శాతం వాటాతో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉండగా.. 7.4 శాతం వాటాతో యూఏఈ నిలిచింది.  మూడో స్థానంలో 6.7 శాతం వాటాతో ఆస్ట్రేలియా నిలిచింది. ఇరాన్‌తో దోస్తీ పదిలం

Updated By ManamWed, 08/22/2018 - 22:14
 • అమెరికా ఆంక్షలు విధించినా ఇరాన్ నుంచి ముడి చమురు సరఫరాలు కొనసాగుతాయి

iran-oilన్యూఢిల్లీ: ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలలో వ్యవస్థాపరమైన నష్టం వాటిల్లకుండా చూసేందుకు ఇండియా కృషి చేస్తోంది. ఆ గల్ఫ్ దేశంపై అమెరికా ఏకపక్షంగా విధించిన ఆంక్షలతో వ్యవహరించే మార్గాన్ని కనుగొనాలని కూడా న్యూఢిల్లీ భావిస్తోంది. ‘‘ఎటువంటి ఒత్తిడికి లోనైనా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలకు తెరదించగల స్థితిలో భారత్ లేదు. ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు మేం యూరోపియన్ యూనియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నాం. అమెరికా ఏకమొత్తంగా ఆంక్షలు విధించడం భారతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పర్యవసానాలు కలుగజేస్తుందని అమెరికాకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం’’ అని ఈ పరిణామాలతో ప్రమేయమున్న అధికారి ఒకరు చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మైకేల్ ఆర్. పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ సెప్టెంబర్‌లో భారతదేశానికి అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు వారి భారతీయ సహచరులైన సుష్మా స్వరాజ్, నిర్మలా సీతీరామన్‌లను కలుసుకోనున్నారు. ఆ సందర్భంగా, భారత్ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని మరో అధికారి చెప్పారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జె.సి.పి.ఓ.ఏ) నుంచి ఉపసంహరించుకోనున్నట్లు అమెరికా మే 8న ప్రకటించింది. ఆ ప్రణాళిక ‘ఇరాన్ అణు ఒప్పందం’గా  విస్తృతంగా ప్రాచుర్యంలో ఉంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌తో ముడిపడిన, పెట్రోలియం సంబంధిత లావాదేవీలతో సహా, ఎటువంటి వర్తకంపైన అయినాసరే తిరిగి ఆంక్షలు విధిస్తామని అమెరికా వెల్లడించింది. 

ఇరాన్ అణు శక్తి అంశాన్ని చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ చెబుతూ వస్తోంది. భారతీయ చమురు శుద్ధి సంస్థలు సాంకేతిక, వాణిజ్య అంశాల ప్రాతిపదికన ఇరాన్‌తో సహా అనేక దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ‘‘ఇరాన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, దేశ (ఇండియాకు) ముడి సరఫరాలకు వచ్చే ఇబ్బందేమీ లేదు. తక్షణ, కాలిక కాంట్రాక్టుల ద్వారా ఇంధన బాస్కెట్ వైవిధ్యభరితమైనదిగా ఉంది’’ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ.ఓ.సి.ఎల్) చైర్మన్  సంజీవ్ సింగ్ అన్నారు. ఐ.ఓ.సి.ఎల్ ప్రధాన సరఫరాదారుల్లో ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్‌లు  ఉన్నాయి. ధరలు తీవ్ర హెచ్చు, తగ్గులకు లోనయ్యే ముడి చమురు మార్కెట్‌లో ఇరాన్ కల్పిస్తున్న లైన్ ఆఫ్ క్రెడిట్  కారణంగా దాని ముడి చమురు భారతీయ చమురు శుద్ధి సంస్థలకు అత్యంత ఆకర్షణీయమైనదిగా మారింది. గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వాణిజ్య చర్చలకు సంబంధించిన నియమాలను అమెరికా తుంగలో తొక్కుతోంది. డబ్ల్యు.టి.ఓను పక్కన పెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. ఒక రకంగా బలవంతుడిదే రాజ్యం అనే స్థితి నెలకొంది. ఈ స్థితిలో ప్రపంచంలోని గొప్ప ప్రవర్థమాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన ఇండియా దాన్ని సంకేతంగా తీసుకుని, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విషయంలో స్వీయ ప్రయోజనాలను అనుసరించి నడచుకోవాలని పరిశీలకులు భావిస్తున్నారు. బ్రెక్జిట్ నుంచి వైదొలగిన బ్రిటన్ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రపంచంలో ఏ దేశంతోనైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందని వారు అంటున్నా రు. భారతీయ నౌకాశ్రయాలలో సుంకాలకు సంబంధించిన సమస్యలు, సంబంధిత జాప్యాలు, అవినీతిని పరిష్క రించడంలో వాణిజ్య ఒప్పందాలు సహాయపడతాయి. ఇరాక్, కతర్, లిబియా, నైజీరియా, మొజాంబిక్, వెనిజులా వంటి దేశాలలోని ఎగుమతి సంస్థలు కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రవర్థమాన మార్కెట్ల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. భౌగోళిక, రాజకీయ రిస్కులు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో, ఇండియన్ క్రెడిట్ లైన్లకు విలువ రానురాను పెరుగుతోంది. సరఫరాదారు కస్టమర్‌కు వర్తింపజేసే గరిష్ఠ రుణ మొత్తాన్ని లైన్ ఆఫ్ క్రెడిట్‌గా పిలుస్తారు.అమెరికాలో ఏపీ ఇంజనీర్ అనుమానస్పద మృతి

Updated By ManamSun, 08/19/2018 - 17:33

A.P. engineer found dead in U.S

అమరావతి: అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వారికి జాతి అహకారంతో కొందరు తెల్లోళ్లు పొట్టన పెట్టుకుంటుంటే మరికొందరు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. తాజాగా ఏపీకి చెందిన ఓ యువ ఇంజనీర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. అమెరికా మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోళ్ల వీర వెంకట సత్య సురేష్ గత కొద్దిరోజులుగా గత రెండోళ్లుగా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే ఆదివారం సాయంత్రం సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో తోటి మిత్రులు పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటికి పొక్కింది. అమెరికాకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడనకున్న బిడ్డ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. సురేశ్ మృతదేహాన్ని ఇండియాకు చేర్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కుటుంబీకులు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమెరికా అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

suresh అయితే సురేశ్‌ను ఎవరైనా చంపేసి కారులో పడేశారా..? లేక తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడా..? అసలేం జరిగిందో తెలియని పరిస్థితి. సురేశ్ మిత్రుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అగ్రరాజ్యంలో చనిపోతుండటంతో అమెరికాకు వెళ్లాలంటే తెలుగు ప్రజలు భయంతో వణికిపోతున్నారు.గ‌వ‌ర్న‌ర్ గిరీ రేసులో 14 బాలుడు

Updated By ManamTue, 08/14/2018 - 17:42
 Ethan Sonneborn

న్యూయార్క్: అమెరికాలోని వెర్మాంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి పోటీలో ఉన్న న‌లుగురు డెమోక్ర‌ట్ల‌లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. ఓటుహ‌క్కు, క‌నీసం సొంతంగా త‌న వాహ‌నాన్ని డ్ర‌యివింగ్ చేసే హ‌క్కు కూడా లేని ఇత‌డు రాష్ట్ర అత్యున్న‌త ప‌ద‌వికి ఎలా పోటీప‌డుతున్నాడు? అంటే, ఈ ప‌ద‌వికి పోటీ చేసే వారు క‌నీసం నాలుగేళ్లు రాష్ట్రంలో నివాసం ఉంటే చాలున‌ట‌. మ‌రే అర్హ‌త‌లూ అక్క‌ర్లేదు. క‌నీసం వ‌యో ప‌రిమితి కూడా లేదు. దీంతో  బ్రిస్ట‌ల్‌కు చెందిన ఈథ‌న్ సొన్‌బోర్న్‌(14) బ‌రిలోకి వ‌చ్చాడు. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసే వారికి అంగ‌, అర్ధ బ‌లం ఉండాలి. 

ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌చారం అంటూ ర‌క‌ర‌కాల ఖ‌ర్చులు ఉంటాయి. ఇవేమీ లేని ఇత‌డు మాత్రం.. సుప‌రిపాల‌న‌కు సంబంధించి నావ‌ద్ద మంచి ఐడియాలు ఉన్నాయి. వెర్మాంట్ ప్ర‌జ‌లు న‌న్ను సీరియ‌స్‌గానే తీసుకుంటార‌ని అనుకుంటున్నా. వ‌య‌స్సు ఒక్క‌టే త‌క్కుక త‌ప్ప‌, మిగ‌తా వారి కంటే ఎందులోనూ తీసిపోను..అని ఆత్మ‌విశ్వాసంతో చెబుతున్నాడు.

త‌న‌తోపాటు బ‌రిలో ఉన్న మిగ‌తా వారంతా సంప్ర‌దాయ రాజ‌కీయ నేత‌లు.. రాష్ట్ర‌, జాతీయ రాజ‌కీయాల‌ను చూసి త‌న‌కు వెగ‌టు పుట్టింది. ఏడాది క్రితం చార్లొట్స్‌విల్లేలో జ‌రిగిన గొడ‌వ‌ల‌ను చూసిన‌ప్పుడే రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనిపించింది.. అని చెప్పాడు. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌డు సేక‌రించిన మొత్తం కేవ‌లం 1700 డాల‌ర్లు.

225 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం అవ‌త‌రించిన స‌మ‌యంలో ఇలాంటి సంద‌ర్భం కూడా వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌ర‌ని కొంద‌రు చ‌మ‌త్క‌రిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి పోటీ చేసే వారు రిజిస్ట‌ర్డు ఓట‌రై ఉండాలంటూ రాష్ట్ర స‌భ్యులు కొంద‌రు గ‌త ఏడాది ఒక బిల్లు ప్ర‌వేశ‌పెట్టినా అది వీగిపోయింది.మోదీ కోసం పెళ్లిళ్ల పేరయ్య అవుతా: ట్రంప్

Updated By ManamTue, 08/14/2018 - 09:55

Narendra Modi, Trumpమోదీ ఒప్పుకుంటే ఆయన కోసం తాను పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గతేడాది భారత్- అమెరికా అధ్యక్షుల సమావేశం సందర్భంగా మోదీపై ట్రంప్ ఇలా జోక్ చేశాడని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.

విదేశీ నేతలతో సమావేశం సందర్భంగా ట్రంప్ టెంపరితంగా ప్రవర్తించిన సన్నివేశాలు, టెలిఫోన్ మర్యాదలు మర్చిపోయిన సందర్భాలు, ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్చరించిన సందర్భాలపై ఆ పత్రిక ఓ కథనం వెలువరించింది. అందులో ట్రంప్‌కు దక్షిణాసియా దేశాల గురించి ఎలాంటి వివరాలు తెలియవని పేర్కొంది. భారత్ సమావేశం సందర్భంగా దక్షిణాసియా మ్యాప్‌ను ట్రంప్ తొలిసారిగా పరిశీలించారని.. ఆ సమయంలో నేపాల్, భూటాన్ పేర్లను నిపుల్, బుట్టోన్‌గా పలికారని పేర్కొంది. అంతేకాకుండా ఈ దేశాలన్నింటిని ఇండియాలో భాగమేనని ట్రంప్ అనుకున్నారని పేర్కొంది.

ఇక మోదీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రస్తుతం మోదీ తన భార్యతో కలిసి ఉండటం లేదు. అందుకే ఈ సమావేశానికి ఒంటరిగా వస్తున్నారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారట. అప్పుడు ట్రంప్.. అలా అయితే మోదీ కోసం నేను సంబంధం చూస్తా అంటూ జోక్ చేశారట.ట్రంప్‌కు భయపడను.. ఢీ కొంటా..!!

Updated By ManamMon, 08/13/2018 - 19:53

Liz Peek: Is Trump-hater Michael Avenatti ready to run for president?

వాషింగ్టన్: వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొంటామ‌ని లాయ‌ర్ మైకేల్ అవెనాట్టి ప్ర‌క‌టించారు. అధ్య‌క్షుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు, గుణ‌గ‌ణాలు, తెలివితేట‌లు ట్రంప్‌లో లేవ‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. అధ్య‌క్షుడు కాక‌ముందు ట్రంప్ త‌న‌తో సంబంధం నెరిపారంటూ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసిన పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియ‌ల్ త‌ర‌ఫు లాయ‌రే అవెనాట్టి.  ఈ సంబంధం బ‌య‌ట‌పెట్ట‌కుండా ట్రంప్ త‌ర‌ఫు లాయ‌ర్ త‌న‌కు భారీగా సొమ్ము ముట్ట‌జెప్పార‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆ కేసు కోర్టులో న‌డుస్తోంది. త‌న‌తోపాటు ఎంద‌రో ఆయ‌న్ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అవెనాట్టి అన్నారు.

ఆయ‌న ఎంత‌గా దిగ‌జారితే.. అంత గ‌ట్టిగా కొడ‌తాం అని కాలిఫోర్నియాకు చెందిన ఈ లాయ‌ర్ అన్నారు. ఆయ‌న వివిధ అంశాల‌పై మాట్లాడారు. ఉత్త‌ర‌కొరియాతోపాటు ఇరాన్‌నుంచి దేశానికి ముప్పు ఉంద‌ని అన్నారు. ఉత్త‌ర‌కొరియా నేత కిమ్‌తో సింగ‌పూర్‌లో ట్రంప్ జ‌రిపిన భేటీలో ఎలాంటి ఫ‌లిత‌మూ లేద‌న్నారు. అది కేవ‌లం ఫొటోలు, రెడ్ కార్పెట్ త‌ప్ప ఏమీ లేద‌న్నారు. అంత‌గా ఎవరికీ తెలియ‌ని మీ లాంటి లాయ‌ర్‌కు ఓట్లెవ‌రు వేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా.. గ‌త 18 ఏళ్లుగా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నానని.. పెద్ద విజ‌యాలు సాధించాన‌ని చెప్పుకొచ్చారు. అవెనాట్టి న్యాయ సంస్థ వేల కోట్ల రూపాయ‌ల మేర దివాలా తీయ‌డంతో దాదాపు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు త‌న‌కు ఇవ్వాలంటూ ఓ ఉద్యోగి వేసిన దావా ఇంకా న‌డుస్తోంది.

Related News