u turn

కొండెక్కి.. యూటర్న్

Updated By ManamSat, 10/20/2018 - 00:15
  • శబరిమల వరకు వెళ్లి తిరిగి వెనక్కి.. ఇద్దరు మహిళలకు చేదు అనుభవం

  • ఒకరు హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు.. మరొకరు కేరళ ముస్లిం ఉద్యమకారిణి

  • వస్తే ఆలయ తలుపులు మూసేస్తామన్న .. ఆలయ ప్రధాన పూజారి స్పష్టీకరణ

  • మహిళలకు నచ్చజెప్పిన పోలీసు ఐజీ

శబరిమల: సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అండతో శబరిమల కొండ పై వరకు వె ళ్లగలిగినా, అక్కడి నుంచి అయ్యప్ప ప్రధానాలయం దర్శనం చేసుకోకుండానే ఇద్దరు మహిళలు వెనుదిరగాల్సి వచ్చింది. దారిలో తీవ్రస్థాయిలో నిరసనలు ఎదురైనా లెక్కచేయకుండా ఆ మహిళలిద్దరూ శుక్రవారం ఉదయం కొండ వరకు వెళ్లారు. వారికి  చుట్టూ పోలీసులు రక్షణ కవచంలా నిలిచారు. ప్రధానాలయానికి కేవలం 500 మీటర్ల దూరం వరకు కూడా వాళ్లు వెళ్లిపోయారు. ఆ కొద్ది దూరం దాటితే 18 మెట్లు కూడా ఎక్కేసేవారే. అయితే, ప్రధానాలయం దగ్గర క్షేత్రస్థాయి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, అక్కడి భక్తులను నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని ఆ ఇద్దరు మహిళలకు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్. శ్రీజిత్ తెలిపారు. దాంతో.. ఆ ఇద్దరూ తిరిగి బేస్ క్యాంపు వద్దకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఒకవేళ మహిళలను ఆలయ దర్శనానికి అనుమతిస్తే ఆలయాన్ని పూసేస్తామని ప్రధాన పూజారి  రాజీవరు కందరారు కూడా పోలీసులకు స్పష్టం చేశారు. ఇది ఆచారాన్ని మంటగలపడమేనని, అందులో తాను భాగం కాలేమని ఆయన అన్నారు. తాము మహిళలను ఆలయం సమీపం వరకు తీసుకెళ్లగలమే గానీ.. దర్శనం మాత్రం ప్రధాన పూజారి అనుమతితో మాత్రమే జరుగుతుందని ఐజీ తెలిపారు. తాము ఇద్దరు మహిళలను ఆలయం వరకు తీసుకెళ్లినా, ప్రధాన పూజారి, ఇతర పూజారులు మాత్రం వారు మరింత ముందుకొస్తే ఆలయాన్ని మూసేస్తామని హెచ్చరించారని ఐజీ తెలిపారు.

image


ఒకవేళ మహిళలు వస్తుంటే ఆలయాన్ని మూసేయాలని ప్రధాన పూజారికి పాండలం రాజకుటుంబ సభ్యులే సూచించినట్లు తెలిసింది. ఆ ఇద్దరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీ మహిళా జర్నలిస్టు కవిత కాగా, మరొకరు కొచ్చి ప్రాంతానికి చెందిన మహిళ ఫాతిమా రెహనా. వారిద్దరూ నిరసన ప్రదర్శనలను అధిగమించి కొండ పైవరకు వెళ్లారు. చుట్టూ పోలీసు బందోబస్తు నడుమ మహిళలు హెల్మెట్లతో పాటు పోలీసులు ధరించే రక్షణ దుస్తులన్నింటినీ ధరించి మరీ పైకి వెళ్లారు. తాను ఆలయం సమీపం నుంచి రిపోర్టింగ్ చేస్తానని, అందుకే తనను పైకి తీసుళ్లడానికి తగిన భద్రత కావాలని కవిత కోరారు. తాను అక్కడకు భక్తురాలిగా వెళ్లడం లేదు కాబట్టి 18 మెట్లు ఎక్కనని అన్నారు. దానికితోడు ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఆచరించాల్సిన కర్మలను కూడా ఆమె పూర్తిచేయలేదు. మరోవైపు కొచ్చి నుంచి వచ్చిన రెహనా ఫాతిమా అనే ముస్లిం ఉద్యమకారిణి మాత్రం.. అవకాశం ఉంటే 18 మెట్లు ఎక్కేందుకు సిద్ధపడే వచ్చారు. ఆమె సంప్రదాయ నల్ల దుస్తులలో ఆలయం వరకు వచ్చారు. కాగా, రెహనా శబరిమలకు బయల్దేరుతున్న విషయం తెలిసి.. కొచ్చిలోని ఆమె ఇంటిమీద కొందరు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. 

అంతకుముందు న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్.. తన విదేశీ సహోద్యోగితో కలిసి పంబా నదిని ఎలాగోలా దాటారు. అయితే, సరిగ్గా కొండ ఎక్కడానికి ముందు కొంతమంది భక్తులు మానవ కవచంలా మారి ఆమెను అడ్డుకున్నారు. తాను ఆలయానికి రావడం లేదని, పని చేసుకోడానికి వస్తున్నానని ఆమె చెప్పినా.. భక్తులు మాత్రం ఊరుకోలేదు. తాను సగం దారి వరకు వెళ్లానని, కానీ అక్కడ నిరసనలు బాగా ఎక్కువవ్వడంతో ఇక తిరిగి వచ్చేయాల్సి వచ్చిందని సుహాసినీరాజ్ అన్నారు. భక్తులు దారికి అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారని, దాంతో ఆమె వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఆమెను బలవంతంగా పంపలేదని, ఆమే వెళ్లిపోయారని తిరువనంతపురం ఐజీ మనోజ్ అబ్రహం తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం బలప్రయోగం చేసి.. భక్తుల మనోభావాలను దెబ్బతీయదని చెప్పారు. శుక్రవారం ఆలయానికి వెళ్లిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఉద్యమకారిణి అని తర్వాత తెలిసిందని, బలప్రదర్శనకు.. ఉద్యమాలు చేయ డానికి శబరిమల సరైన ప్రాంతం కాదని ఆయన అన్నారు.తెలుగులో ఇప్పటికి కుదిరింది

Updated By ManamSat, 09/15/2018 - 23:11

imageసమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు.  ఈ సినిమా  సెప్టెంబర్ 13న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ ‘‘సినిమాలో చూపించిన ఫ్లైఓవర్ బెంగుళూరులో ఉంది. నాలుగైదు సంవత్సరాలు ఆ ఫ్లై ఓవర్ మీద తిరిగాను. అప్పుడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. దాని ఆధారంగా నేను ఈ స్టోరీని డెవలప్ చేశాను. తెలుగు సినిమా విషయానికి వస్తే మేం చేసింది రీమేక్ కాదు. అడాప్టేషన్ మాత్రమే.

చివరి 30 నిమిషాలు తెలుగులో డిఫరెంట్‌గా చేశాం. కన్నడలో తక్కువ బడ్జెట్, ఎక్స్ పెరిమెంటల్ అప్రోచ్‌తో చేశాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది చాలా పెద్దదైంది. లార్జర్ దేన్ లైఫ్‌గా చేశాం. తెలుగులో చేసిన చివరి 30 నిమిషాలను తక్కువ బడ్జెట్‌లో కన్నడలో చేయలేకపోయాం. మామూలుగా మనం సిగ్నల్స్ జంప్ చేస్తాం. దానికి సిగ్గుపడం. పోలీసులు ఫైన్ వేసినా సిగ్గుపడం. కానీ అక్కడ జరిగేది తప్పు అయినప్పుడు సిగ్గుపడాలి, పశ్చాత్తాప పడాలి. అందుకే నేను ఈ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశాను. ఏదో ఒక భయం ఉంటే తప్ప మనం సరిగా ప్రవర్తించం. ఇందులో సమంత చాలా అద్భుతంగా చేశారు. కన్నడ వెర్షన్ ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె చూశారు.

మమ్మల్ని స్క్రిప్ట్ పంపమని అడిగారు. నేను ఎలా పంపడం అని ఆలోచిస్తుండగా, ఆమె మరలా ఫాలో అప్ చేశారు. దాంతో డేర్ చేసి పంపించాను. చదివి హ్యాపీగా ఫీలయ్యారు. మధ్యలో ఒకసారి నాగచైతన్య మమ్మల్ని బెంగుళూరులో కలిశారు. ఆ తర్వాత మా కన్నడ వెర్షన్ విడుదలకు పది రోజుల ముందు నాగచైతన్య, సమంత బెంగుళూరు వచ్చి మమ్మల్ని కలిసి సినిమా చూశారు. మా సినిమా ప్రమోషన్‌లోనూ పాల్గొన్నారు. అప్పుడే సమంత ఈ సినిమాను చేస్తానన్నారు. కానీ ఆమెకు ఉన్న ప్రాజెక్టుల కారణంగా ఆమె ఈ సినిమాను చేయలేదు. ఇన్నాళ్లకు కుదిరింది’’ అన్నారు. అలాంటి పాత్ర‌ల‌ను ఇంకా క్రియేట్ చేయాలి

Updated By ManamMon, 09/10/2018 - 14:27

Bhoomikaహీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న న‌టి భూమిక విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స‌మంత, ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `యు ట‌ర్న్‌` చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు భూమిక‌. ఈ సినిమా గురించి భూమిక మాట్లాడుతూ ``స‌మంత న‌టించిన `ఈగ‌` సినిమా చూశాను. త‌న‌లో మంచి ఎనర్జీ ఉంది. `యు ట‌ర్న్‌` మాతృక‌ను చూశాను. దాని డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమారే తెలుగు, త‌మిళంలో డైరెక్ట్ చేశారు. ఆయ‌న చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయాను. ఇలాంటి పాత్ర‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌నేలేదు. న‌టిగా ఇలాంటి పాత్ర‌ల‌ను చేయాల్సి ఉంది. పాత్ర నిడివి కంటే పాత్ర ప్రాముఖ్య‌త ఎలా ఉందో చూసుకుంటాను. నేను గ‌తంలో మ‌హిళా ప్రాధాన్య‌త చిత్రాల్లో న‌టించాను. అలాంటి చిత్రాలు మ‌రిన్ని రావాలి. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ను క్రియేట్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది`` అన్నారు. సమంత ఖాతాలో ఏడు మిలియన్లు

Updated By ManamWed, 09/05/2018 - 13:22

Samanthaవివాహం తరువాత కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత సోషల్ మీడియాలో కూడా సత్తాను చాటుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ ఖాతాలో ఏడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో శృతీహాసన్ తరువాత 7మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. కాగా సమంత నటించిన తాజా చిత్రాలు ‘సీమరాజా’, ‘యూటర్న్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.అనిరుధ్ పాట, సమంత ఆట.. అదరగొడుతున్న యూటర్న్ ప్రమోషనల్ సాంగ్

Updated By ManamMon, 09/03/2018 - 10:43

U turnసమంత ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు తనే ఆలపించగా.. సమంత డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా కన్నడలో వఘన విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.డైరెక్ట‌ర్‌ను ప‌క్క‌న పెట్టిన స‌మంత‌...

Updated By ManamWed, 08/22/2018 - 16:09

samantha వ‌రుస విజ‌యాల మీదున్న స‌మంత సెప్టెంబ‌ర్ 17న `యు ట‌ర్న్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఈ సినిమా త‌ర్వాత నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుంది. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా సినిమా తెర‌కెక్క‌నుంది. అయితే అంత కంటే ముందుగానే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా వ‌ద్ద ప‌నిచేసిన గిరి స‌య్యా ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత సినిమా చేస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి.ఇందులో విల‌న్‌గా న‌టించ‌మ‌ని అర్జున్, అర‌వింద స్వామి వంటి సీనియ‌ర్ హీరోల‌ను ద‌ర్శ‌కుడు సంప్ర‌దించాడు. వారేం తేల్చేలేదు. అలాగే నిర్మాణ సంస్థ సినిమాను హోల్డ్‌లో పెట్టింది. ఇవ‌న్నీ చూసిన సామ్ .. గిరి సయ్యాను ప‌క్క‌న పెట్టి నందినీ రెడ్డితో ముందుకెళ్ల‌డానికి సిద్ధ‌మైంది. నేనేం చెయ్యలేదు సర్

Updated By ManamFri, 08/17/2018 - 15:07

U Turnసమంత అక్కినేని ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. కన్నడలో విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఇందులో రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీనివాస చిత్తురీ, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘యూ టర్న్‌’ నుంచి ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 08/03/2018 - 15:04

Aadhi సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. కన్నడలో విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా ఆదిపినిశెట్టి ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమిక, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి, రాంబాబు బండారు సయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.యూటర్న్‌కు అసలైన అర్థమిదీ..!

Updated By ManamSat, 07/21/2018 - 18:27

GVL Narasimha Rao Tells Correct Meaning To "U TURN"

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు మొదలుకుని ఢిల్లీ వరకు ఇప్పుడు ఏ రాజకీయ నేత నోట చూసినా వినిపిస్తున్న మాట యూటర్న్.. యూటర్న్. ఇంకొందరైతే ఏకంగా యూటర్న్ అంకుల్ అంటూ సంబోంధించిన సందర్భాలున్నాయి. అయితే అసలు ఈ యూటర్న్ అనేదానికి పాలిటిక్స్‌ పరంగా నిజమైన అర్థమేంటో బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు చెప్పేశారు.

రోజుకో మాట.. పూటకో మాట మాట్లాడేవారిని యూటర్న్ అంటారని జీవీఎల్ స్పష్టం చేశారు. టీడీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసం సందర్భంగా ఇతర పార్టీలు ఏపీ అంశాలాను లేవనెత్తలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఏపీ గురించి మాట్లాడలేదన్నారు. కొన్నిపార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య టీడీపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందని జీవీఎల్ తీవ్రంగా మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర విభజన చేసినప్పుడు చట్టంలో పొందుపరచలేదు.. ఈ విషయాన్ని తెలుగు ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పేశారు. ఒకర్నిమించి ఒకరు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని తద్వారా వచ్చే ఫలితం శూన్యమని జీవీఎల్ నర్సింహారావు స్పష్టంచేశారు.శివ‌రాజ్ కుమార్ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌

Updated By ManamTue, 03/27/2018 - 22:10

shraddhaకన్నడంలో నటించిన తొలి సినిమా ‘యు టర్న్’ తోనే ఫిలింఫేర్‌ను సొంతం చేసుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్. అన‌తికాలంలోనే త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌కి తాజాగా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. మొద‌టిసారిగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌కు జోడీగా ‘రుస్తుం’ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంద‌ని తెలిసింది. ఈ చిత్రంతో స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌ రవివర్మ ద‌ర్శ‌కుడిగా మార‌నున్నారు. రవివర్మ చెప్పిన క‌థ‌ నచ్చడంతో.. ఈ ప్రాజెక్టుకు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ వెంట‌నే ఓకే చెప్పిందని ఓ ఆంగ్ల పత్రిక వివరించింది. ఈ సినిమాకి అనూప్ శీలిన్ సంగీతం అందిస్తున్నారు.

2017లో వ‌చ్చిన ‘ఆపరేషన్ అలమేలమ్మ’ త‌ర్వాత శ్రద్ధా న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు  త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారు. ఇదిలా ఉంటే.. అలీ ఫజాల్‌కు జోడిగా తిగాంషు దూలియా తెరకెక్కిస్తున్న హిందీ చిత్రం ‘మిలన్ టాకీస్’ లోనూ శ్ర‌ద్ధా నటిస్తోంది. ఈ మూవీతో బాలీవుడ్‌లో కూడా త‌న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది శ్రద్ధా.

Related News