murugadoss

విజయ్ మూవీలో గెస్ట్ రోల్‌లో టాప్ డైరెక్టర్

Updated By ManamWed, 09/12/2018 - 13:30

NOTA 1విజయ్ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో చిత్రంపై మరింత అంచనాలను పెంచేశాడు దర్శకుడు. అదేంటంటే ఇందులో టాప్ డైరక్టర్ మురగదాస్ అతిథిపాత్రలో కనిపించనున్నాడు. ఒక కీలక పాత్రలో ఆయన నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు కన్ఫర్మ్ చేశాడు.

‘‘నా గురువును ఈ రోజు నేను డైరెక్ట్ చేస్తున్నా. ఎంత అద్భుతమైన క్షణం’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా మురగదాస్ దగ్గర ఆనంద్ శంకర్ అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 విజయ్ `స‌ర్కార్` షూటింగ్ పూర్తి

Updated By ManamTue, 09/04/2018 - 15:27

Sarkar‘తుపాకీ’, ‘క‌త్తి’ సినిమాల త‌ర్వాత విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా `స‌ర్కార్‌`. ఈ సినిమా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను ప్యాచ్ వ‌ర్క్ స‌హా పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ మ‌రో ప‌క్క జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 7న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అలాగే.. అక్టోబ‌ర్ 2న ఆడియో విడుద‌ల కానుంది. కాగా ఈ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. విజ‌య్ ఇందులో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో కూడా క‌నిపిస్తారు. ఇప్పుడే విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు గ‌ట్టిగా కోరుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ఇలాంటి సినిమా విజ‌య్‌కు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. విజయ్ ‘సర్కార్‌’కు తప్పని లీకుల గోల

Updated By ManamTue, 08/14/2018 - 12:57

Sarkarలీకు రాయుళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో సినిమాలను లీక్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వగా.. తాజాగా కోలీవుడ్‌లో విజయ్ సినిమా పాట లీక్ అయ్యింది. విజయ్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సర్కార్‌లో నటిస్తుండగా.. అందులో హీరో ఎంట్రీ సాంగ్‌కు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

ఈ సాంగ్ షూటింగ్ లాస్ వేగాస్‌లో జరుగుతోంది. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. భారీ బడ్జెట్‌తో సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ పాటకు సంబంధించిన క్లిప్ లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయనుంది. ఇక సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.మురగదాస్ నేను గుర్తున్నానా..?: శ్రీరెడ్డి

Updated By ManamWed, 07/11/2018 - 12:29
sri reddy

ఇన్ని రోజులు టాలీవుడ్ సెలబ్రిటీలనే టార్గెట్ చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌ టాప్ డైరక్టర్‌పై కామెంట్లు చేసింది. తమిళ టాప్ డైరక్టర్ మురగదాస్ పేరును ప్రస్తావించిన శ్రీరెడ్డి.. ‘‘హాయ్ మురగదాస్ గారు. ఎలా ఉన్నారు. మీకు గ్రీన్ పార్క్ హోటల్ గుర్తుందా..? వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనమిద్దరం కలిశాం. నాకు ఓ పాత్ర ఇస్తానని నువ్వు మాటిచ్చావు. కానీ ఇంతవరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మీకు చాలా గ్రేట్ సర్’’ అంటూ కామెంట్ పెట్టింది. మరి ఈ వ్యాఖ్యలపై మురగదాస్ స్పందిస్తారో లేదో చూడాలి.

 

Hi Tamil director murugadas ji..h r U??U remember green park hotel??we met through veligonda Srinivas..U promised me a...

Posted by Sri Reddy on Tuesday, July 10, 2018

 విజయ్ ఫస్ట్‌లుక్‌పై విమర్శలు 

Updated By ManamFri, 06/22/2018 - 14:15

Vijay విజయ్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కార్’. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అయితే ఈ లుక్‌ను చూసి విజయ్ అభిమానులు సూపర్ అంటుండగా.. మరోవైపు దానిపై విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్‌లుక్‌లలో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించడంపై తమిళనాడు ఎంపీ అంబుమణి రామదాస్ సోషల్ మీడియాలో విమర్శించారు.

‘‘ఈ పోస్టర్ ద్వారా సిగరెట్‌ను ప్రమోట్ చేస్తున్నావా, ఇలా చేయడం సిగ్గు చేటు, చేతిలో సిగరెట్ లేకుండా ఉంటే మీరు ఇంకా స్టైలిష్‌గా ఉండేవారు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి తోడు గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ ‘‘ఇకపై తన సినిమాల్లో పొగ తాగను’’ అని చెప్పిన క్లిప్పింగ్‌ను షేర్ చేశారు. అయితే ఈ ట్వీట్లపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదని, విజయ్ చాలా సినిమాలలో సిగరెట్ తాగినప్పటికీ, అప్పుడు ఎవరు అడగలేదు ఇప్పుడెందుకంటూ ఫైర్ అవుతున్నారు. అయితే విజయ్ సినిమాలకు వివాదాలు కొత్తేం కాదు. ఆయన నటించిన గత చిత్రం మెర్సల్‌పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ హైకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.‘సర్కార్‌’గా వస్తున్న విజయ్

Updated By ManamFri, 06/22/2018 - 08:48
Sarkar

ఇలయదళపతి విజయ్ హీరోగా మురగదాస్ మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సారి విజయ్ సర్కార్‌గా రాబోతుండగా.. ఫస్ట్‌లుక్‌లో బిజినెస్‌మ్యాన్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.

ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. సన్‌పిక్చర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా విజయ్, మురగదాస్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘తుపాకి’, ‘కత్తి’ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ‘సర్కార్‌’‌పై చాలా అంచనాలే ఉన్నాయి.విజయ్ ఫస్ట్‌లుక్‌కు ముహూర్తం ఫిక్స్

Updated By ManamTue, 06/19/2018 - 09:52

Vijay గతేడాది ‘మెర్సల్‌’తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. టైటిల్, ఫస్ట్‌లుక్‌కు ముహూర్తంను ఖరారు చేసింది చిత్ర యూనిట్. జూన్ 21న సాయంత్రం 6గంటలకు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ రెండో సారి జత కడుతుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.కీర్తిపై విజయ్ అభిమానుల మండిపాటు

Updated By ManamWed, 06/13/2018 - 12:05

keerthy ‘మహానటి’తో ఇటీవల పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న కీర్తి సురేశ్ ప్రస్తుతం విజయ్ 62వ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇటీవల బయటకు రాగా.. అందులో కీర్తి సురేశ్ తీరుపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.

ఆ ఫొటోలలో విజయ్ నేల మీద కూర్చోగా, కీర్తి సోఫాలో ఉంది. సెలబ్రిటీ స్టైలిష్ట్ సమంత జగన్ కీర్తికి ఫైనల్ టచ్‌ అప్ ఇస్తోంది. అయితే ఆ ఫొటోలలో కీర్తి కాలు, విజయ్‌ కాలిపై ఉండగా, దానిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఒక సీనియర్ నటుడు దగ్గర నడుచుకునే తీరు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా విజయ్, మురగదాస్ కాంబినేషన్లో మూడో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
 

vijay

 బర్త్‌డేన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్

Updated By ManamTue, 03/06/2018 - 12:30

varalaxmi తండ్రికి తగ్గ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. తెలుగు మినహా మిగిలిన అన్నీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్‌లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. అయితే ఈ యేడాది ఈ అమ్మడి పుట్టినరోజున(మార్చి 5న) ఒక బంపర్ ఆఫర్‌ను సంపాదించుకుంది. దాని గురించి సోషల్ మీడియాలో చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది. 

అయితే వరలక్ష్మి తగిలిన ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే.. విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో వరలక్ష్మి నటించనుంది. దీంతో ఆనందంలో మునిగిపోతున్న ఈ భామ.. ఇంతవరకు నా పుట్టినరోజు గిఫ్ట్‌లలో ఇది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో పాటు శక్తి, కన్నిరాశి, పంభన్, నీయ2, ఇచారిక్కై, మిస్టర్ చంద్రమౌళి, సందయ్ కోళి2 అనే చిత్రాలలో నటిస్తోంది వరలక్ష్మి.హ్యాట్రిక్ కోసం సేమ్ టు సేమ్‌

Updated By ManamFri, 11/17/2017 - 18:57

muruga‘మెర్సల్’ (తెలుగులో అదిరింది) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఈ సినిమా అందించిన ఘ‌న‌విజ‌యం అత‌నిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న 62వ సినిమాపై దృష్టిపెట్టాడు. త‌న‌కి ‘తుపాకి’, ‘కత్తి’ వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్‌ని అందించిన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు విజ‌య్ . ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంది. దీని కోసం బెంగుళూరులో మురుగదాస్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. మరోసారి సోషల్ డ్రామా బేస్డ్ స్టొరీనే విజయ్ కోసం మురుగదాస్ సిద్దం చేస్తున్నాడ‌ని తెలిసింది. వీరి కాంబినేష‌న్‌లో వచ్చిన గత రెండు చిత్రాలు ‘తుపాకి’, ‘కత్తి’ కూడా సోషల్ డ్రామా బేస్డ్ స్టోరీస్ కావడం విశేషం.

కాగా, ఈ సినిమాలో విజయ్ 35 సంవత్సరాల నడి వయస్కుడిగా కనిపించబోతున్నాడ‌ని తెలిసింది. అలాగే ప్రతినాయకుడి పాత్రను కూడా త‌నే పోషించనున్నట్లు తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? లేకపోతే ఒకే పాత్రలో రెండు షేడ్స్ ని దర్శకుడు చూపించబోతున్నాడా? అనే విషయాన్ని గోప్యంగా ఉంచబోతున్నారని సమాచారం. మొత్తానికి.. ఈ కాంబో హాట్రిక్ కొట్టడానికి సిద్ధమౌతోందన్న మాట. జ‌న‌వ‌రిలో ప్రారంభం కానున్న ఈ సినిమా దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related News