bjp

టీడీపీ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతాం

Updated By ManamSat, 05/26/2018 - 09:58

ram madhav  గుంటూరు: ఏపీలో బీజేపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రాం మాధవ్ అన్నారు. కన్నా నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడిని సృష్టిస్తామని రాం మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో మహానాడు ఫ్లెక్సీలన్నీ వారసత్వంతో నిండిపోయాయని చెప్పిన ఆయన, ఏపీలో టీడీపీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామని అన్నారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అలాంటి కాంగ్రెస్‌తో ఇప్పుడు చంద్రబాబు దోస్తి కడుతున్నారని, ఆ దోస్తితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని విమర్శలు కురిపించారు.2019లో మోదీ పోటీ చేసేది ఇక్కడ్నుంచే..!

Updated By ManamFri, 05/25/2018 - 09:59

PM Narendra Modi to contest 2019 elections from Odisha's temple town Puri?

న్యూ ఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గెలుపుకోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు తహతహలాడుతుంటే.. ఉన్న అధికారాన్ని చేజారకుండా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నాయి. అయితే 2019లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది అంతుచిక్కట్లేదు. మరీ ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బీజేపీకి అంతగా ప్రాబల్యం లేని రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. ఇవన్నీ అటుంచితే.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆ రెండూ వద్దు.. పూరీనే!
ఏ రాష్ట్రంలో అయితే తమ పార్టీ వీక్‌గా ఉందో అక్కడ్నుంచే పోటీ చేసి చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి వారణాసి మరియు గుజరాత్‌ను వదిలేసి ఒడిషాలోనే కమలాన్ని వికసింపజేయాలని భావిస్తున్నారు. ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేసిన మోదీ వచ్చే ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే ఆ రెండింటిలో పూరి ఒకటి అనేది తాజాగా వెలువడుతున్న ఈ వార్తా కథనాల సారాంశం.

నవీన్ పట్నాయక్‌కు చెక్ పెట్టేందుకే..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో వడోదర, వారణాసి స్థానాల నుంచి గెలిచిన మోదీ స్వరాష్ట్రంలోని వడోదర స్థానాన్ని వదులుకుని వారణాసి నుంచే ఎంపీగా కొనసాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు కారణమూ లేకపోలేదు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి పట్టు పెంచుకోవడం కోసమేనని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే యూపీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే, ఈసారి ఒడిషాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసమే పూరిని ఎంచుకోబోతున్నారని ఆ వార్తా కథనాలు ఉటంకించాయి. కాగా ప్రస్తుతం ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు చెక్ పెట్టి ఎలాగైనా సరే బీజేపీ జెండా పాతాలని మోదీ, షాలు వ్యూహాలు రచిస్తున్నాయని తెలుస్తోంది.

ఒడిషాలో ఇంతకు మునుపు పరిస్థితి ఇదీ..
2014 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 10 సీట్లు మాత్రమే రాగా.. కాంగ్రెస్‌కు 16 సీట్లొచ్చాయి. బిజు జనతా దళ్‌ 147 స్థానాలకు గాను 117 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు మునుపు 2004, 2009 రెండు పర్యాయాలూ కాంగ్రెస్ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీంతో చాలా వీక్‌గా ఉన్న బీజేపీని బలోపేతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మోదీ పోటీ స్థానంపై బీజేపీ వర్గాలు ఏమని స్పందిస్తాయో.. ఒడిషాలో కమలాన్ని వికసింపజేయాలనే ప్రయత్నం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే మరి.

PM Narendra Modi to contest 2019 elections from Odisha's temple town Puri?బండారు దత్తాత్రేయ ఇంట విషాదం, ఏకైక తనయుడి మృతి

Updated By ManamWed, 05/23/2018 - 07:50

bandaru హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట విషాదం నెలకొంది. దత్తాత్రేయ ఏకైక తనయుడు వైష్ణవ్ గుండెపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి 10.45గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా, ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12.30గంటలకు వైష్ణవ్ కన్నుమూశాడు. వైష్ణవ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. దీంతో దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పలువురు నేతలు దత్తాత్రేయను పరామర్శిస్తున్నారు. కాగా వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మిత్రపక్షాలు

Updated By ManamMon, 05/21/2018 - 22:41
  • రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ

  • కేసీఆర్, చంద్రబాబు, అఖిలేశ్ ఒకే గూటి పక్షులు

  • కాంగ్రెస్ పార్టీ నేతలవి దివాళాకోరు రాజకీయాలు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్.. పార్టీలో చేరిన కళాకారుడు జంగ్ ప్రహ్లాద్

bjpహైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన అనేక ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ సోమవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు సహజ మిత్రులని, గతంలో కలిసి పని చేశాయని, భవిష్యత్తులో మళ్లీ కలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేఖ శక్తుల పునరేకీకరణ జరిగే అవకాశముందని అన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వస్తే టీఆర్‌ఎస్ పార్టీ వారికి రాచ మర్యాదలు చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేకినని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ వారికి ఎందుకు సహకరించిదని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సు యాత్రలు. టీఆర్‌ఎస్ వ్యతిరేఖ పోరాటాలు ఉత్తివేనని తేలిందన్నారు. త్వరలో ఈ రెండు పార్టీలు ఒక్కటవుతాయని, తెలంగాణ ప్రజలను మోసం చెయ్యలేరని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్, చంద్రబాబు, మమత, అఖిలేశ్ యాదవ్ అందరూ ఒకే గూటి పక్షులని, వీరంతా కాంగ్రెస్‌తో కలవడం ఖాయమన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు దేశంలోని చిన్నాచితక పార్టీలన్నీ ఎకం కావాలని ప్రయత్నిస్తున్నాయని, వారి ఆశలు నెరవేరవని లక్ష్మణ్ చెప్పారు. కర్ణాటకలో బీజేపీ అత్యధికంగా 104 స్థానాల్లో గెలిచిందని, అక్కడి ప్రజలు బీజేపీ వెంట ఉన్నారని అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకోవడం ఏమిటని, స్థానాలు తగ్గితే గెలిచినట్లేనా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీవి దివాళాకోరు రాజకీయలని, దేశంలో వారిని ఎక్కడా నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని చెప్పారు. కుమార స్వామి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తోంటే టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే ఆ పార్టీల నేతలు ప్రజలకు ఎం సమాధానం చెబుతారన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకత ఒక బూటకంమని ప్రజలు గమనిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గతంలో దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేవని, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయని, అయినా మోదీ అభివృద్ధి-సంక్షేమ పథకాల ముందు వీరి ఎత్తులేవీ పనిచేయవని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూకట్ పల్లిలో జరుగుతాయని చెప్పారు. కాగా జంగ్ ప్రహ్లాద్ వెంట పలువురు కళాకారులతో పాటు, ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి భావనా రెడ్డి  సోమవారం బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎస్. మల్లా రెడ్డి, రాష్ట్ర మీడియా కమిటీ కన్వీనర్ వి.సుధాకర్ శర్మ, ఢిల్లీలో బీజేపీ కోఆర్డినేటర్ నూనె బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు..!?

Updated By ManamMon, 05/21/2018 - 19:54

Karnataka Election: Mandate Was Against Congress, Says BJP President Amit Shah

న్యూ ఢిల్లీ: కన్నడ నాట బలపరీక్షలో మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప నెగ్గలేకపోయిన సంగతి తెలిసిందే. తమకు ఎమ్మెల్యేలల బలగం లేదని బలపరీక్షకు కొన్ని నిమిషాల ముందే రాజీనామా చేసేసి సభలో జాతీయ గీతం వస్తున్నా పట్టించుకోకుండా బీజేపీ ఎమ్మెల్యేలతో సహా యడ్యూరప్ప కూడా బయటికెళ్లిపోయిన విషయం విదితమే. అక్కడితో బీజేపీ ఎపిసోడ్ అయిపోగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఎపిసోడ్ ప్రారంభమైంది. బుధవారం మే-23న సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ తరుణంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియా ముందుకొచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదని... ఈ నేపథ్యంలో మరోసారి కన్నడనాట ఎన్నికలను నిర్వహించాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కన్నడ ప్రజలు ఒక్కసారిగా అవాక్కయినంత పనైంది.! జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల కలయికపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని ఆయన తెలిపారు. కులం, మతం కార్డులతో ఓటర్లను ఆ పార్టీ ప్రలోభపెట్టిందని... అయినా సరే కర్ణాటకలో బీజేపీ ఓట్ గ్రాఫ్ పెరిగిందని అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో తమ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని.. అందుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు 122 సీట్లున్న కాంగ్రెస్‌ పార్టీ సీట్లు 78కి పడిపోయాయని.. సీట్లు పడిపోయినందుకు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోందా? అని ఆయన సూటి ప్రశ్న సంధించారు. జేడీఎస్‌కి కూడా కేవలం 37 సీట్లే వచ్చాయని, తక్కువ సీట్లు వచ్చినందుకే ఆయా పార్టీలు వేడుకలు చేసుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు, జేడీఎస్‌కు వ్యతిరేకంగా వచ్చిందని, ఏకైక పెద్ద పార్టీగా బీజేపీని ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని అమిత్‌షా అన్నారు. 

కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఏముంది?.. ఆ పార్టీ ప్రభుత్వంలోని సగానికి పైగా మంత్రులు చిత్తుగా ఓడిపోయారని.. ముఖ్యమంత్రే స్వయంగా ఓ సీటు ఓడిపోయారన్న విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తుచేశారు. ఇదే జేడీఎస్‌కు కూడా వర్తిస్తుంది. జేడీఎస్ సంబరపడడానికి ఏం సాధించిందని? 37 సీట్లు సాధించినందుకే సంబరాలా?' అని అమిత్‌షా చెప్పుకొచ్చారు. బలనిరూపణ అనంతరం ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడిన అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా విమర్శనాస్త్రాలపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Karnataka Election26న ఒడిశాకు మోదీ

Updated By ManamSun, 05/20/2018 - 12:39

modhi, odisha, bjpభువనేశ్వర్‌: ప్రధాని మోదీ ఈ నెల 26న ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్రంలో బీజేపీ పభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఒడిశాకు రానున్నారని ఆ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ అరుణ్‌సింగ్ తెలిపారు.  ఈ నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సాధించిన విజయాలను మోదీ ఒడిశా రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని అరుణ్ తెలిపారు. కటక్ మహానది తీరంలో ఏర్పాటుచేసే బహిరంగసభలో మోదీ పాల్గొంటారని వెల్లడించారు.ఇతర రాష్ట్రాల కంటే ఒడిశా అంటే ప్రధాని మోదీకి ఎంతో అభిమానమని  ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేతల అత్యవసర సమావేశం

Updated By ManamSat, 05/19/2018 - 15:02

BJP, BJP leaders Emergency meeting, Trust vote, Congress, JDS బెంగళూరు: కర్ణాటక రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని బీజేపీకి బలపరీక్ష సమయం దగ్గరపడతున్న కొద్దీ గంటగంటకూ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు యడ్యూరప్ప బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ వదంతులు చక్కర్లు కొడుతుంటే.. మరోవైపు పదిమంది విపక్ష ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కొందరు అగ్రనేతలు అత్యవసర సమావేశమైనట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ బలపరీక్షలో యడ్యూరప్ప అధిక మెజార్టీతో తన బలాన్ని నిరూపించుకోలేని పక్షంలో ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలనే దానిపై బీజేపీ అగ్రనేతలంతా అత్యవసర సమావేశమైనట్టు సమాచారం.

ప్రస్తుతం బీజేపీ 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ (78), జేడీఎస్‌కు (36) మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీ బలపరీక్షలో నెగ్గాలంటే కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యుల మద్దతు ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరువురి పార్టీల అగ్రనేతలతో చర్చలు జరిపి బలపరీక్షలో యడ్యూరప్పకు మద్దతిచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలం 104 ఉంది. కానీ సాధారణ మెజారిటీకి కావాల్సిన బలం 111 మాత్రమే. అంటే ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. బీజేపీ గాళానికి ఆ ఏడుగురు చిక్కుతారా? ఇంతకి బలపరీక్షలో ఏం జరగబోతోంది? వేచి చూడాల్సిందే మరి.కర్ణాటకలో బీజేపీ కుయుక్తులు పన్నుతోంది

Updated By ManamSat, 05/19/2018 - 14:35

babu  అమరావతి: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కర్ణాటకలో ఆ పార్టీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని.. గతంలో తమిళనాడులో కుట్రలు చేస్తున్నట్లు, ఇప్పుడు కర్ణాటకలో చేస్తున్నారని ఆరోపించారు. సీనియర్లను పక్కన పెట్టి మరో వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమిస్తారని బాబు ప్రశ్నించారు.

అప్రజాస్వామ్య విధానాలు అనుసరిస్తూ... దేశానికేం సంకేతాలిస్తారని,  దేశాన్ని ఉద్దరిస్తామంటూ మాటలు చెప్పిన నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నాటక, తమిళనాడులో గవర్నర్ వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యేకహోదాపై ఎన్నికల ముందు మాట్లాడిన అమిత్ షా, మోదీ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.

 విజయం ఎవరికి..? ఇవాళే బలపరీక్ష

Updated By ManamSat, 05/19/2018 - 09:50

karnataka  బెంగళూరు: గత నాలుగురోజులుగా క్షణానికోవిధంగా మారుతున్న కర్ణాటక రాజకీయాలు శనివారం క్లైమాక్స్‌కు వచ్చేశాయి. సుప్రీం కోర్టు తీర్పుతో బలపరీక్షకు సిద్ధమయ్యాయి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు. ఇందులో భాగంగా సాయంత్రం 4గంటలకు బలపరీక్షను జరపనున్నారు. 6గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య ఎన్నికపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై 10.30గంటలకు సుప్రీంలో విచారణ జరపనున్నారు. దీంతో సుప్రీం నిర్ణయంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే షాంగ్రిల్లా హోటల్‌ వద్ద బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై యడ్యూరప్ప, జవదేకర్, అనంతకుమార్, సదానందగౌడ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు విశ్వాసపరీక్షలో నెగ్గుతామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బలపరీక్షలో తప్పక నెగ్గుతా: యడ్యూరప్ప

Updated By ManamFri, 05/18/2018 - 13:57
  • సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి తొలి స్పందన

Karnataka assembly elections, BJP, Yeddyurappa, Supreme court judgementబెంగళూరు: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బలపరీక్షకు సిద్ధమవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వం బల పరీక్ష నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీం తాజా తీర్పుపై బీజేపీ నేత, సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం కచ్చితంగా బల పరీక్షలో నెగ్గుతుంది. బల పరీక్షకు మేం సిద్ధమే. మా ప్రభుత్వాన్ని బలపరచేందుకు తగిన ఎమ్మెల్యేల బలం మాకు ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటిస్తాం. మా ప్రభుత్వానికి ఆధిక్యత ఉన్నట్లు రుజువు చేసుకుంటాం. అసెంబ్లీలో పూర్తి మెజార్టీ సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బలపరీక్షలో తప్పక విజయం సాధిస్తామని జవదేకర్ చెప్పారు.
Related News