bjp

కేంద్ర మంత్రి అనంతకుమార్ ఇక లేరు

Updated By ManamMon, 11/12/2018 - 08:35

Ananth Kumarబెంగళూరు: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్‌కుమార్‌(59) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో అనంతకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. 

కాగా 1959 జూలై 22న జన్మించిన అనంత్‌కుమార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఏబీవీపీలో కీలక పాత్ర పోషించారు. 1996లో తొలిసారి దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయిన ఆయన.. అదే స్థానం నుంచి ఆరుసార్లు లోక్‌సభకు వెళ్లారు. వాజ్‌పేయి కేబినెట్‌లో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటు ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి బీజేపీ శ్రేణుల్లో విషాదం నింపింది. మరోవైపు అనంతకుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతోపాటు పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం

Updated By ManamMon, 11/12/2018 - 01:08
 • చంద్రబాబువి ప్రజావ్యతిరేక విధానాలు

 • గవర్నర్‌కు బీజేపీ నాయకుల ఫిర్యాదు

BJPవిజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగ పోరాటాలు చేస్తూ, రాజకీయ వ్యాపారాలకు ప్రజాధనాన్ని ఉపయోగి స్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ.. బీజేపీ నేతలతో కలసి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు జీవీఎల్ ఫిర్యాదు చేశారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తమ పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాల వ్యాపారం చేసి చాలా సంపాదించారని, ఆ డబ్బుతో వ్యాపారం చేస్తే మాకు అభ్యంతరం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన చంద్రబాబు నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని, ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. అప్పు తెచ్చిన డబ్బును చంద్రబాబు రాజకీయ వ్యాపారం కోసం వాడుతున్నారని విమర్శించారు. ఓడిపోయే పార్టీల నాయకులంద రినీ చంద్రబాబు కలుస్తున్నారని ఎద్దేవా చేశారు. మోసాలకు మారు పేరు కేసీఆర్

Updated By ManamSun, 11/11/2018 - 07:35
 • కుటుంబ పాలనకు తెర లేపారు

 • ఉద్యమ కారులకు అన్యాయం.. ఉద్యోగాల భర్తీ చేయనేలేదు

 • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్.. ప్రచార లీడ్ వ్యాన్ల ప్రారంభం

BJPహైదరాబాద్: బంగారు తెలంగాణనే లక్ష్యమంటూ పదవిని చేపట్టిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డా.లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గెలిస్తే దళితుడుని సీఎం చేస్తామని అడగకుండానే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చి కుటుంబ పాలనకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఓయూ, కేయూ విద్యార్దులతో పాటు, ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి పోరా డారని, కేసీఆర్ దీక్ష పేరుతో దొంగ నాటకాలు చేసి లాభం పొందారని మండిపడ్డారు. మంత్రి వర్గంలో ద్రోహులకు పెద్దపీటవేశారని, నిజమైన ఉద్యమకారులకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన వడ్డీ కూడా చెల్లించ లేదని, నాలుగున్నరేండ్లలో 4500మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలకు భరోసా ఇస్తామని గొప్పలు  చెప్పి నోటిఫికేషన్ వేయడం,వెంటనే దానిపై కోర్టులో పిటిషన్ వేసి కొర్రీలు పెట్టిస్తూ... నేటివరకు ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయలేదన్నారు. మహిళలకు తీవ్రం అన్యాయం చేశారని,కేబినేట్‌లో ఒక మహిళలకు కూడ మంత్రి ఇవ్వలేదని, బతుకమ్మ చీరల పేరుతో రూ.250 కోట్లు నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. నెరేళ్ల దళిత యువతను జైలుపాలు చేశారనన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వరు, ఉద్యమాలను అణిచి వేశారని, తీవ్రస్దాయిలో ఆరోపించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటన చేసి, ఏనాడూ పట్టించుకోలేదని,అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమైతుందని ఎద్దేవా చేశారు.

ఎన్నికల లీడ్ వ్యాన్లు ప్రారంభం...
ఎన్నికల ప్రచారం కోసం ఆయన లీడ్ వ్యాన్లను ఎంపీ దత్తాత్రేయ, కిషన్‌రెడ్డితో కలిసి జెండా  ఊపి ప్రారంభించారు. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రధాని మోదీప్రవేశపెట్టిన పథకాలు వివరించాలని సూచించారు. బరి లో నిలిచే అభ్యర్దులు నియోజకవర్గాల్లో ప్రతి పల్లెకు వెళ్లి విస్తృతంగా ప్ర చారం చేసి విజయ దిశగా ముందుకు దూసుకు పోవాలని సూచించారు.'అందుకే జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నా'

Updated By ManamSat, 11/10/2018 - 18:44
 • అశోక్ గెహ్లాట్, చంద్రబాబు ఉమ్మడి మీడియా సమావేశం

Chandrababu naidu, Ashok gahlet, Narendra modi, BJPఅమరావతి: బీజేపీ వ్యతిరేక పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేస్తు్న్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌తో శనివారం అమరావతిలో చంద్రబాబు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ముందుగా తాను కొన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే మహాకూటమి అవసరమన్నారు. ప్రతీ ఒక్క పౌరుడు దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించాలని చంద్రబాబు సూచించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. బాధ్యత కలిగిన ప్రతీ రాజకీయ పార్టీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. 

దేశం కోసమే టీడీపీ-కాంగ్రెస్ తొలిసారి ఏకం..
సేవ్ నేషన్,సేవ్ డెమోక్రసీ నినాదంతో కలిసికట్టుగా ముందకెళ్తామని అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులు సహా అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినవి ఏమి జరుగలేదని విమర్శించారు. అధికార దుర్వినియోగం చేస్తూ సీబీఐ, ఐటీ, ఈడీలను ప్రయోగిస్తున్నారని అశోక్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ హయాంలో ఒత్తిడి పెరుగుతోందని విమర్శలు గుప్పించారు. అప్రకటిత ఎమర్జెన్సీ వాతావారణం కనిపిస్తోందని గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసమే టీడీపీ-కాంగ్రెస్ తొలిసారి ఏకమయ్యాయని అన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని గెహ్లాట్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ బీజేపీదే!

Updated By ManamSat, 11/10/2018 - 06:28
 • మళ్లీ కమలానికే అధికారం

 • వరుసగా నాలుగోసారి..!

 • సీఎన్‌ఎక్స్ సర్వేలో వెల్లడి

 • 122 స్థానాలు బీజేపీ సొంతం

 • 95తో సరిపెట్టుకోనున్న కాంగ్రెస్

BJPన్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కూడా బీజేపీ విజయఢంకా మోగించే సూచనలు కనిపిస్తున్నాయి. 230 మంది సభ్యులుండే అక్కడి అసెంబ్లీలో 122 స్థానాలను గెలుచు కుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం బీజేపీకే ఉందని సీఎన్‌ఎక్స్-టైమ్స్ నౌ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 95 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందంటున్నారు. 2013 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి 2 శాతం ఓట్లు పెరుగుతాయని, అదే సమయంలో పాలక బీజేపీ మూడు శాతం ఓట్లు కోల్పోతుందని అంచనా వేశారు. కానీ, అప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటే మూడు శాతం ఓట్ల ఆధిక్యంతో ఉంటుందని చెబుతున్నారు. బీఎస్పీకి మూడు సీట్లే వస్తాయని, ఇతరులు మరో 10 గెలుచుకుంటారని భావిస్తున్నారు. అక్టోబరు 25 నుంచి నవంబరు మూడో తేదీ మధ్యలో ఈ సర్వే చేశారు. ఇంతకుముంద ఒక నెల క్రితం చేసిన సర్వేలో బీజేపీకి 128, కాంగ్రెస్‌కు 85 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఈలోపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు కొద్దిగా మారాయని, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించేందుకు సరిపడ ఆధిక్యం సంపాదించే అవకాశం లేదని సర్వే సంస్థ నిపుణులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా మధ్యప్రదేశ్ వచ్చి ప్రచారం చేయనున్న నేపథ్యంలో తమకు మరింత సానుకూలత లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుంటారంటే , ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు 40% మంది మద్దతు పలికారు. కాంగ్రెస్ నాయకులు కమల్‌నాథ్‌కు 20.3%, జ్యోతిరాదిత్య సింథియాకు 19.7% చొప్పున మద్దతు లభించింది.కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లీస్‌లు ఒకే తాను ముక్కలు

Updated By ManamSat, 11/10/2018 - 06:28
 • టీడీపీకి బాబు వారసుడు కాలేడు

 • బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదరిక నిర్మూలన

 • కార్యకర్తల సమావేశంలో దత్తాత్రేయ

Dattatreyaచందానగర్: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆనాడు ఎన్‌టీఆర్ టీడీిపీ ని స్ధాపిస్తే, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్ద తాకట్టు పెట్టిన బాబు టీడీపీకి వారసుడు కాలేడని మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మియాపూర్ లోని  కృష్ణ గ్రాండ్ హోటల్ లో బీజేిపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే  నావలాంటిదని, అలాంటి నావకు బాబు ఊపిరి పోస్తున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ హమీలు హమీలుగానే మిగిలిపోయాయని, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడంతో నేడు ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదన్నారు. లక్ష డబుల్ బెడ్‌రూం లు కట్టిస్తామని చెప్పి, అందులో 30 వేలు కూడా కట్టలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే శేరిలిం గంపల్లిలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, పేదరిక నిర్మూలనకు పక్కా ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. బీజేపీ లో కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారని, కానీ ఇటీవల జరిగిన ఘటన తనను బాధిం చిందన్నారు. అసంతృప్తి ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కానీ, భహిరంగంగా రచ్చకెక్క కూడదన్నారు. బంగారు తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగార మైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయూష్మాన్ భవ పథకాన్ని దేశ వ్యాప్తంగా 50 వేల మంది ఉపయోగించుకుంటుంటే ఒక్క కేసీఆర్ మాత్రం దాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం 50 శాతం ఇచ్చే పంటల భీమాపథకాన్ని సైతం అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మజ్లీస్ కూటమి చాలా ప్రమాదకరమైందని, ఓవైసి డైరెక్షన్ లో టీఆర్‌ఆస్ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లీస్ లు ఒకే తాను ముక్కలని వాటికి ఓట్లు వేయకూడదని సూచించారు. ప్రజలు ఆలోచించి విజ్ఞతతో  బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. శేరిలింగంపల్లి అభ్యర్థి యోగానంద్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, జ్ణానేంద్ర ప్రసాద్, బుచ్చిరెడ్డి, గోవర్దన్ గౌడ్, ప్రభాకర్ యాద వ్, మీన్‌లాల్, నరేందర్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, బాల్దా అశోక్, మైపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.పట్టణాలే బీజేపీ కోటలు!

Updated By ManamFri, 11/09/2018 - 23:39
 • మధ్యప్రదేశ్‌లో పట్టుకు కమలం ఎత్తులు

 • నగరాల నియోజకవర్గాల్లో బీజేపీకే అనుకూలం

 • ప్రస్తుతం 70 శాతం సీట్లు ‘అధికార’ ఖాతాలోనే

 • కాంగ్రెస్ బలం అంతంతే.. 27 శాతమే హస్తం చేతిలో

semi finalభోపాల్: మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావాలంటే నగర, పట్ణణాల్లోని నియోజకవర్గాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే  పట్టణాలు బీజేపీకి పెట్టని కోటలుగా ఉన్నాయి. ఈ పట్టును కోల్పోకుండా ఉండేందుకు కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వాస్తవానికి మధ్యప్రదేశ్ అనేగాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పట్టణాలు, నగరాల్లోనే బీజేపీవైపు మొగ్గు ఉంది. ఇది అనేక సందర్భాల్లోనూ నిరూపితమైంది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 70 శాతం అంటే 30 స్థానాల్లో బీజేపీ సిట్టింగ్‌లు ఉన్నారు. మిగతా పది స్థానాల్లో ఆరింటిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. పట్టణ ఓటర్లపై ఉన్న పట్టును ఏమాత్రం చెక్కుచెదరనీయకుండా చూస్తోంది. ఇందులో భాగగా గల్లీస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. పట్టణాల అభివృద్ధికి, ఆ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నామో వివరిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది గుజరాత్ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణాలు, నగరాల్లోనే బీజేపీ మంచి ఆదరణ లభించింది. ఒక విధంగా గుజరాత్‌లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టేందుకు పట్టణాలు, నగరాల ఓటర్లే దోహదపడ్డారు. ఇదే వ్యూహాన్ని మధ్యప్రదేశ్‌లనూ అనుసరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోందన్న విషయాన్ని గమనించే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిని నగరాల్లో పట్టు ఏమాత్రం సడలకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.  ఈ నగరాల్లోనే 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, వాటిలో గెలిస్తే పార్టీ గెలుపు సునాయాసమవుతుందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.స్టాలిన్‌తో చంద్రబాబు కీలక భేటీ..

Updated By ManamFri, 11/09/2018 - 20:45

Chandrababu naidu, Stalin, DMK leder, BJP, Narendra modiచెన్నై: డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం ముగిసింది. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్‌తో చంద్రబాబు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. స్టాలిన్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని గద్దె దించేందుకు కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కూటమి ఏర్పాటు విషయంలో తమతో కలిసి రావాలని స్టాలిన్‌ను కోరినట్టు చంద్రబాబు తెలిపారు. నల్లధనమంతా అధికారికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. తమతో కలిసి వచ్చే నేతలందిరితో చర్చలు జరుపుతామని చెప్పారు. నోట్ల రద్దుతో బ్యాంకులపై నమ్మకం పోయిందని చంద్రబాబు తెలిపారు.  

రాష్ట్రాల హక్కులను మోదీ సర్కార్ కాల రాస్తోంది: స్టాలిన్ 
చంద్రబాబుతో భేటీ అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల హక్కులను ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కాల రాస్తోందని విమర్శించారు. మతవాద బీజేపీని దించేందుకు చేతులు కలిపామన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, ఏపీ సీఎం ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలవడం ఆహ్వానించే పరిణామంగా ఆయన పేర్కొన్నారు. లోకేశ్‌తో ఛాలెంజ్ అని...మళ్లీ పత్తాలేరు

Updated By ManamFri, 11/09/2018 - 16:59
GVL Narasimharao lashes out at chandrababu naidu

విజయవాడ : తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహరావు మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు చర్చల పేరుతో రచ్చ చేస్తున్నారని, చర్చలకు పిలిచి పోలీసుల చాటున పారిపోవడం సిగ్గుచేటు అని అన్నారు. సవాళ్లు విసిరి, సమాధానాలు చెప్పలేక పిరికిపందల్లా పారిపోతున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ...‘మాజీమంత్రి మాణిక్యాలరావు ఛాలెంజ్‌కి టీడీపీ వాళ్లు ఎందుకు భయపడ్డారో చెప్పాలి. నారా లోకేశ్‌తో ఛాలెంజ్ అన్నారు. మళ్లీ పత్తాలేరు. లోకేశ్ స్థాయి ఏంటి?. ముఖ్యమంత్రి కొడుకు అని తప్ప ఆయనకు విషయం లేదు. బీజేపీ నేతలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. 

మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళితే వారధి వద్ద అడ్డుకోవడం అప్రజాస్వామికం. జాతీయ మీడియా ముందు టీడీపీ ప్రభుత్వ అరాచకాలన్నీ బయటపెడతాం. ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో విలాస ప్రయాణాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం బెంగళూరు, ఢిల్లీ పర్యటలనకు వెళ్లినప్పుడు పార్టీ ఫండ్ ఖర్చు పెట్టుకోవాలే తప్ప ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు. రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వానికి చెల్లిస్తే అధికారులను కోర్టుకు ఈడ్చుతాం. విశాఖలో భూ కుంభకోణంపై సిట్ నివేదిక ఇస్తే తూతూ మంత్రంగా క్యాబినెట్ ఆమోదించడం సిగ్గుచేటు. చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదు.

సిట్ అంటే సిన్సియర్‌గా టీడీపీ అని అర్థం. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు వస్తే వారిని తప్పించే విధంగా కుట్రలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో నిర్వహించే భూ దందాలపై ఉద్యమాలు చేపడతాం. స్టీల్ ఫ్లాంట్‌తో పాటు విశాఖ రైల్వేజోన్ కూడా ఏర్పాటు చేయగల సమర్ధుడు చంద్రబాబు...పునాది రాళ్లు వేసి వదిలివేయడం ఆయనకు అలావాటేగా. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లోని 11 విద్యాసంస్థలను కేంద్రం చొరవతో రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి.

పదేళ్ల కాలపరిమితి ఉన్నా నాలుగేళ్లలో కేంద్రం చేసి చూపించింది. టీడీపీ, కాంగ్రెస్ రాయలసీమపై వివక్ష చూపాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేశాం. ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఈ నెల 18న తిరుపతిలో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ పెట్టి రాయలసీమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.’ అని అన్నారు.హైదరాబాద్ పేరు మార్చేస్తాం..

Updated By ManamFri, 11/09/2018 - 16:35
 • బీజేపీ అధికారంలోకి వస్తే..హైదరాబాద్ ..భాగ్యనగర్‌గా మార్పు

If bjp win Will Rename Hyderabad As Bhagyanagar, says raja singh

హైదరాబాద్ : ప్రస్తుతం ‘పేర్ల మార్పిడి’ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఊర్ల పేర్లు మార్పు జరగగా... ఆ ట్రెండ్‌ను గుజరాత్‌లో కూడా కంటిన్యూ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ సిద్ధం అయ్యారు. తాజాగా తెలంగాణలో కూడా ఆ జాబితాలో చేరబోతుందట. అది కూడా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చేస్తామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. అంతేకాదండోయ్ హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, కరీంనగర్ పేర్లను కూడా మర్చనున్నట్లు ఆయన సెలవిచ్చారు. 

గత ఎన్నికల్లో గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్‌ను మొదట్లో భాగ్యనగర్‌ అని పిలిచేవారని,  అయితే కులీ కుతుబ్ షాహీల పాలన మొదలయ్యాక భాగ్యనగర్‌ను హైదరాబాద్‌గా మార్చినట్లు తెలిపారు. దేశం కోసం పనిచేసిన త్యాగధనుల పేర్లతో మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పేరు మార్పు డిమాండ్ చాలాకాలం నుంచి ఉందని, అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు...ముస్లింల ఓట్ల కోసం వ్యతిరేకిస్తున్నాయని రాజాసింగ్ ఆరోపించారు.

కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా.. ఫజియాబాద్‌ను ఆయోధ్యగా, మొగల్‌సరాయ్ రైల్వే స్టేషన్‌ను పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చిన విషయం తెలిసిందే. యోగీ చర్యను ఈ సందర్భంగా రాజాసింగ్ సమర్థించారు. మరోవైపు గుజరాత్ సీఎం కూడా అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

Related News