thirumala

బ్రహ్మోత్సవం

Updated By ManamThu, 09/20/2018 - 00:21

గరుడ సేవ 
తిరుమలలో శ్రీవారి గరుడ సేవలకు ప్రత్యేకత ఉంది. అ రోజున గరుడ పక్షి కూడా తిరుమలలో విహరిస్తుంది.  దీని కోసం స్థానికులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. గరుడ వాహన సేవ కు 2 లక్షల మందికి పైగా భక్తులు రాగా వీరిలో తమిళనాడు నుంచి వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం నడిచి వచ్చారు. ఇందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి అలంకరించుకున్న మాలలు,  చెన్నై నుంచి అలంకృతమైన గొడుగులు కూడా స్వామి వారి కోసం ప్రత్యేకంగా వస్తాయి. ఆ తరువాతి రోజుమలయప్పస్వామి శ్రీరాముడి భక్తుడైన హనుమంత వాహనంలో, అదే రోజు సాయంత్రం స్వర్ణరథంపై.. రాత్రి గజ వాహనంపై ఊరేగారు. మరుసటి రోజు సూర్య ప్రభ, చంద్ర ప్రభ వాహనాలపై స్వామి ఊరేగారు. 
 

image


ఆధ్యాత్మిక ఆకర్షణలు
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా 4 గజ రాజులు, 4 అశ్వాలు, 4 వృషభాలను వాహన సేవలకు వినియోగించారు. వాహన సేవల్లో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేలా దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టులతో పాటు అళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాలలు కనుల విందుగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. భరతనాట్యం, గాత్ర, సంగీత కచేరీలు, ధార్మిక ఉపన్యాసాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మికత నింపారు.  అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు తిరుమల గిరులు మరోమారు బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోనున్నాయి.
 బ్రహ్మోత్సవాలకు వాహనాలు సిద్ధం

Updated By ManamSat, 09/08/2018 - 23:18
 • వాహనాల్లో బ్రహ్మాండనాయకుని ఊరేగింపు

 • మెరుగుపట్టి తళతళ మెరిపించిన కార్మికులు

 • గరుడవాహన సేవకు రానున్న గొడుగులు 

imageతిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వాహనాలన్నీ సిద్ధమయ్యాయి. ఈనెల 13వ తేదీ నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలలో అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని ఊరేగించడానికి అన్ని వాహనాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కార్మికులు కష్టపడి.. అన్ని వాహనాలకు మెరుగుపెట్టి తళతళలాడేలా చేశారు. వాహనాలు తిరువీధుల్లో తిరిగే సమయంలో, అక్కడి దీపాల కాంతిలో మరింతగా మెరుస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాయి. ఈ వాహనాల్లో  గరుడ వాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున... అంటే ఈనెల 17వ తేదీన రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవ ప్రారంభమవుతుంది. శ్రీవారు మలయప్పస్వామి రూపంలో తిరువీధుల్లో తిరుగుతారు. పౌరాణిక నేపథ్యం ప్రకారం 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ ప్రాముఖ్యత సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తానుimage దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని స్వామివారి భక్తకోటికి తెలియజేసే వాహనసేవ అని అంటారు. అదేవిధంగా శ్రీహరికి అత్యంత సన్నిహతుడైన ఆదిశేషుని కూడా తన వాహనంగా చేసుకుని పెద్దశేష వాహనంపై ఊరేగుతారు. ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణుడిగాను, కృష్ణావతారంలో బలరాముడిగా స్వామికి సన్నిహితులుగా ఉండేవారట. చిన్న శేషవాహనాన్ని వాసుకిగా భావిస్తారు. భక్తులకు కోరుకున్న ఫలాలను అందజేసే కల్పవృక్ష వాహనాలలో 15వ తేదీన ఉదయం స్వామివారు విహరించనున్నారు. అదేవిధంగాశ్రీవారు సకల దిక్పాలకులకు రారాజని తెలియజేసేలా సర్వభూపాల ఊహనంపై 16వ తేదీన రాత్రి 8 గంటలకు ఊరేగుతారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు కావడంతో గురుశిష్యతత్వాన్ని బోధించేందుకు హనుమంత వాహనంపై ఈనెల 18వతేదీన ఉదయం ఊరేగనున్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శించుకున్నవారికి ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలను imageసూర్యదేవుని అనుగ్రహం ద్వారా అందుతాయి. అదే విధంగా చంద్రప్రభ వాహనంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. శ్రీవారి రథోత్సవాన్ని తిలకించే భక్తులకు స్థూలశరీరం వేరు.. సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. స్వామివారు అశ్వ వాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని అశ్వవాహనం తెలియజేస్తుంది. శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. ఇవికాకుండా చిన్న శేష వాహనం, హంసవాహనం, సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, మోహినీ అవతారం, స్వర్ణరథం సేవలు ఉంటాయి. ఒక్కో వాహనాన్ని దర్శించుకునే భక్తులు తదనుగుణంగా పుణ్య ఫలాలను పొందుతారు.

ఈ వాహనాలన్నింటినీ గత కొన్ని రోజులుగా సిద్ధం చేస్తూ వచ్చారు. శనివారం నాటికి అన్ని వాహనాలు శ్రీవారి సేవలకు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దారు. గరుడ వాహనం రోజున స్వామివారికి కొత్త గొడుగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తాయి. గతంలో చెన్నై నుంచి ఒక ఛారిటీ సంస్థ గొడుగులను తీసుకుని వస్తుండగా, గత కొన్నేళ్లుగా పలు సంస్థలు గొడుగులను పంపుతున్నాయి. దర్శనం ఓకే!

Updated By ManamTue, 07/24/2018 - 23:13
 • మహాసంప్రోక్షణలో పరిమితంగా అనుమతి

 • సిఫార్సులేఖలు, దివ్యదర్శనం టోకెన్ల నిలిపివేత

 • భక్తులకు రూ. 300 ప్రత్యేక దర్శనాలు రద్దు

 • వైకుంఠం క్యూకాంప్లెక్సులో ఉన్నవారికే దర్శనం

 • టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు 

imageతిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇంతకుముందు పూర్తిగా భక్తుల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించడంతో అన్ని వర్గాల్లో తీవ్రంగా వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న బోర్డు.. కొన్ని గంటల పాటు ఆ రోజుల్లో కూడా దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ విలేకరులతో మాట్లాడుతూ గత పాలక మండలి సమావేశంలో తీసుకున్న దర్శనాల రద్దు నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. అయితే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తెలిపారు. 11వ తేదీన తొమ్మిది గంటలు, 12వ తేదీన నాలుగు గంటలు, 13వ తేదీన నాలుగు గంటలు, 14వ తేదీన ఆరు గంటలు,  15వ తేదీన ఐదు గంటలు, 16వ తేదీన నాలుగు గంటలు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు.

ఆ రోజుల్లో కేవలం సర్వదర్శనం భక్తులకే అనుమతి  ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలు,  బ్రేక్ దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు, సమయ నిర్దేశిత దర్శనం, దివ్య దర్శనాలను రద్దుచేస్తున్నట్లు తెలిపారు. కేవలం  వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని స్పష్టంచేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ బ్రేక్ దర్శనాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం ఏడు గంటల నుంచి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు. దీనికి 250 రూపాయల టికెట్టుగా నిర్ణయించారు. ఈ దర్శనంలో వచ్చే భక్తులకు హారతి, తీర్థం, శఠారి సేవలు ఉంటాయని అన్నారు. టీటీడీలో పదవీ విరమణ పొందిన పూర్వపు మిరాశీ ప్రధానార్చకులకు 30 లక్షలు, మిరాశీ అర్చకులకు 20 ల క్షలు ఇచ్చే విధంగా నిర్ణయించారు. రూ. 23 కోట్లతో భక్తుల సౌకర్యార్థం  తిరుమలలోని సర్వదర్శనం క్యూంకాంప్లెక్స్ నుంచి ఆళ్వార్‌ట్యాంక్ విశ్రాంతి  గృహం గేటు వరకు క్యూలైన్, విద్యుత్తు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. 

తిరుమలలోని 76 ఎఫ్ టైపు నివాసగృహాలను సూట్‌లుగా మార్చి యాత్రికులకు కేటాయించడానికి రూ. 7 కోట్లతో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జేఈఓలు శ్రీనివాసరాజు, పోల భాస్కర్, బోర్డు సభ్యులు జీఎస్‌ఎస్ శివాజీ, బోండా ఉమా మహేశ్వరరావు, రాయపాటి సాంబశివరావు, పొట్లూరి రమేశ్ బాబు, సండ్ర వెంకట వీరయ్య, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి,  డొక్కా జగన్నాథం, సప్నా ముంగంటివార్, బీకే పార్థసారథి, దేవాదాయ శాఖ కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ వైవి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
 యూటర్న్

Updated By ManamWed, 07/18/2018 - 02:57
 • దర్శనాల రద్దుపై వెనక్కి తగ్గిన టీటీడీ 

 • నిర్దేశిత సమయాల్లో భక్తులకు దర్శన అవకాశం?

 • సీఎం సూచన మేరకు పునఃసమీక్షించాలని నిర్ణయం 

 • విలేకరుల సమావేశంలో తెలియజేసిన టీటీడీ ఈఓ 

 • బోర్డు సభ్యులతో టీటీడీ ఈవో.. చైర్మన్ భేటీ

imageతిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి దర్శనాలను రద్దు చేసే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెనక్కి తగ్గింది. మహాసంప్రోక్షణం సందర్భంగా ఆగస్టు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భక్తులు, రాజకీయ నాయకులు పలు అనుమానాలను వ్యక్తం చేయడంతో పాటు ఈ నిర్ణయం పలు విమర్శలకు దారితీసింది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ.. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దీంతో టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్,  ట్రస్టు బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అందుబాటులో ఉన్న బోర్డు సభ్యులతో మంగళవారం సమావేశమయ్యారు. తరువాత ఈఓ విలేకరులతో  మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ఈనెల 23వ తేదీ వరకు భక్తుల నుంచి ఈ విషయంపై అభిప్రాయ సేకరణ జరుగుతుందని అన్నారు. 24వ తేదీన జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తులకు ఎలా దర్శనం కల్పించగలమో అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

వచ్చేనెల11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అంటే ఆరు రోజులలో (144 గంటలు) కేవలం 30 గంటల పాటు మాత్రమే దర్శనం కల్పించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రోజుకు 15 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే వారి దర్శనాలకు ఇబ్బంది కలుగుతుందనే  దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేయడంతో భక్తులకు ఆందోళన కలిగించందని తెలిపారు. 

దర్శనాల వేళలు ఇలా ఉండే అవకాశం
ఆగస్టు తొమ్మిదో తేదీ నుంచి పదో తేదీ వరకు దర్శనాల వేళలు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. పదో తేదీ సాయంత్రానికి దర్శనాలను నిలిపివేయచ్చు. 11వ తేదీన  తొమ్మిది గంటలు, 12వ తేదీన నాలుగు గంటలు, 13వ తేదీన నాలుగు గంటలు, 14వ తేదీన ఐదు గంట లు, 16వ తేదీన నాలుగు గంటల పాటు భక్తులను తిరుమల దర్శనానికి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిసిం ది. అది ఏ సమయాలలో అనే విషయాన్ని 24వ తేదీన నిర్ణయిస్తారు. వైసీపీకి చెందిన నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆలయం ముందు సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ దర్శనం రద్దు నిర్ణయం మార్చుకోకపోతే భక్తులతో కలసి ఆందోళనకు దిగుతామని ప్రకటించారు.శ్రీవారి దర్శనానికి 50 గంటలు

Updated By ManamMon, 05/21/2018 - 10:02

thirumala,50hours, thirupathi visitతిరుమల: తిరుమలకు భక్తులు పోటెత్తారు. గంట గంటకు రద్దీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 50 గంటల సమయం పడుతుండగా కంపార్ట్‌మెంట్‌లు నిండి క్యూలైన్లు బయటకు వచ్చాయి. ఓ వైపు భానుడు తన భగభగలతో విరుచుకుపడుతున్నా.. ఆ ఎండ మంటలను సైతం భక్తులు లెక్కచేయడం లేదు. దీంతో క్యూలైన్లు రెండు..మూడు కిలోమీటర్ల మేర నిండిపోయాయి. ఏడు కొండలవాడి దర్శనం కోసం ఉక్కపోతలోనూ భక్తులు పడిగాపులు కాస్తున్నారు. తిరుమల అంతా భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ సర్వదర్శనానికి చాలా సమయం పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.శ్రీవారి అత్తింటివారికి అవకాశం! 

Updated By ManamWed, 04/25/2018 - 01:13

imageతిరుమల తిరుపతి దేవ స్థానాల (టీటీడీ) పాలక వర్గం నియామకంలో పొర పాటు జరిగిపోయింది. మనదేశంలో వేల ఏళ్లుగా ఆధ్యాత్మికంగా, సామాజి కంగా పాతుకుపోయిన వ్యవస్థలో ఇటువంటి పాలకవర్గాల నియామకంలో ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంది. అందులోనూ ప్రపంచంలోని ప్రతి హిందువు కులాలతో సంబంధం లేకుండా ఒక్కసారైనా దర్శించుకోవాలను కునేంతటి ప్రాచుర్యం పొందిన దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. అంత ర్జాతీయ స్థాయిలో అంతటి విశిష్టత కలిగిన దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు మతపరంగా, ఆధ్యా త్మికంగా, నడవడిక పరంగా అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తులై ఉండాలని హిందువులు ఆశిస్తారు. అటువంటి కమిటీ నియా మకంలో తప్పుగానీ, పొరపాటు గాని జరిగితే  అది సమాజపరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఆ కమిటీ చైర్మన్ పదవి ఓ యాదవుడికి ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం చెప్పరు. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు. అందువల్ల యాదవులకు ఆ రకమైన గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ పుట్టా సుధా కర్ యాదవ్‌ను ఆ పదవికి ఎంపిక చేయడం పట్లే అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆ పదవికి ఆయన పేరు ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరిగిన సమయంలోనే, ఆయన క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గొంటా రని విమర్శలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఆయన ఆ సభలలో పాల్గొనడం తప్పేమీకాదు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా. సామాజికపరంగా అది మంచిపనే. కానీ ఇక్కడ విశ్వాసాలు వేరు. ఏ మత మైనా మతపరమైన వ్యక్తుల మనోభావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో వాటిని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించక తప్పదు. ఇది సున్నితమైన అంశమైనప్పటికీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పుట్టా సుధాకర్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే ప్రభుత్వంలో మరో ఉన్నతమైన పదవి ఇచ్చి, టీటీడీ చైర్మన్‌గా ఇటువంటి వివాదాలకు అవకాశంలేని వారిని నియమిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయ పడు తున్నారు. గతంలో భూమన కరుణాకరరెడ్డిని కమిటీ చైర్మన్‌గా నియమించినప్పుడు కూడా అయన నాస్తికు డని, ఆయనను దైవ సంబంధమైన కమిటీలో ఎలా నియమిస్తారని విమర్శలు వచ్చాయి. కమిటీ సభ్యు లుగా ఓ దళిత వ్యక్తిని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగినది. వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరితో సమానంగా గుర్తించి తగిన స్థానం ఇవ్వవలసిన బాధ్యత అందరిపై ఉంది. వారిని ఆ విధంగా గౌరవించిన నాడు తమను తక్కువగా చూస్తున్నారన్న భావన వారిలో తొలగిపోయే అవకాశం ఉంది. ఇటువంటి నియామకాల విషయంలో మత పరంగా వారు ఆచరించే విధానాలు, ఆలోచనలు, సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. కమిటీ సభ్యురాలిగా పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నియామకం కూడా విమర్శలకు దారితీసింది. గతంలో స్వయంగా ఆమే తనకారులో, తన బ్యాగ్‌లో  తప్పనిసరిగా బైబిల్ ఉంటుందని చెప్పారు. ఆమె అటు క్రీస్తుని, ఇటు వెంకటేశ్వరుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు, ప్రార్ధించవచ్చు. ఒక రకంగా అది మంచిదే. కానీ మత విశ్వాసాలు ఇటు వంటి వాటిని అనుమతించవు. ఏ మత పెద్దలైనా ఇటు వంటివాటిని అంగీకరించరు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, దానిని అరికట్టాలని,  ఉద్యో గులలో కొందరు క్రైస్తవులున్నారని, వారిని బదిలీ చేయాలని హిందువులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో అనిత నియామకం వివాదాలకు దారి తీసింది. పరిస్థితిని అర్ధం చేసుకొని తన నియామకా న్ని రద్దు చేయమని ఆమె కోరడం అభినందనీయం.  ఇలాంటి నియామకాలు ప్రభుత్వాలకు కత్తి మీద సాములాంటివి. మతపరమైన అంశాలతోపాటు అనేక సామాజిక వర్గాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పదవిని అత్యంత గౌరవంగా భావించే అన్ని రంగాలలో ఉన్నతవర్గాల వారు  పోటీపడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు లబ్ధిపొందాలని చూస్తుంటాయి. ప్రభుత్వం అంటే గిట్టని వారు కూడా ఇటువంటి సంద ర్భాలను తమకు అనుకూలంగా వాడు కుంటుంటారు. అందువల్ల మత, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా నష్టం జరుగకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. 

ఇదిలా ఉంటే శ్రీవారికి అత్తింటివారమైన తమ కులస్తులకు కమిటీలో స్థానం కల్పించలేదని పద్మశా లీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి జీవిత భాగస్వామి పద్మావతిదేవి పద్మశాలీయుల ఆడపడుచు. తిరుమల బ్రహ్మోత్సవాలలో వారికి ఆ గౌరవం దక్కుతోంది. అయితే కమిటీలో సభ్యత్వం లేదని వారు బాధపడుతున్నారు. పద్మావతీ దేవి తమ ఆడపడుచు అయినందున ప్రతిసారి కమిటీలో తమ వారికి స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నా రు. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో కమిటీలో మా ర్పులు చేయవలసి రావడంతో పద్మశాలి కుల స్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే రాష్ట్రంలో వ్యవసాయ రం గం తరువాత అత్యధిక మంది ఆధార పడే చేనేత రం గానికి సంబంధించిన కులాలను సంతృప్తిపరచినట్లు అవుతుందన్న భావన కూడా ఉంది. అనిత తప్పు కోవ డంతో హరి అత్తింటి వారికి కమిటీలో స్థానం దక్కే అవకాశం ఉంది. 

శిరందాసు నాగార్జున,
సీనియర్ జర్నలిస్ట్వెంకన్న వార్షిక బడ్జెట్ 2894 కోట్లు

Updated By ManamFri, 04/06/2018 - 22:49

imageతిరుమల: తిరుమల వెంకన్న ఆదాయ వ్యయాల పద్దుకు రూ.2894 కోట్లతో ఆమోదం తెలిపినట్లు టీడీపీ ఈవో అనీల్ కుమర్ సింఘాల్ వెల్లడించారు. 2018-19కి సంబంధించిన టీటీడీ బడ్జెట్‌పై ఆయన శుక్రవారం మీడియాకు విరించారు. 2018-19లో స్వామివారికి కానుకలు, ఇతరుల పెట్టుబడుల ద్వారా రూ.1156 కోట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 246 కోట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా 180 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా 125 కోట్లు రావచ్చనని బడ్జెట్‌లో అంచనా వేశారు. టీటీడీ ఉద్యోగుల జీతభత్యాలకు రూ.600 కోట్లు, కార్పస్ ఫండ్‌కు రూ.200.48 కోట్లు, మార్కెటింగ్, కొనుగోళ్లకు 549.75 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు 280 కోట్లు, ధర్మప్రచారానికి 260.65 కోట్లు, అవుట్ సోర్సింగ్ పనులకు 214.25 కోట్లును కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ఆర్థిక ముఖ్య గణాంకాధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాదానికి రూ.కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద పథకానికి పెన్నా సిమెంట్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి రూ.కోటి విరాళంగా అందించారు. శుక్రవారం నాడు శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు ఈ విరాళాన్ని అందచేశారు.సొమ్ములేవి తిరుమలేశా?

Updated By ManamSat, 03/31/2018 - 06:55
 • ఇంతవరకు ఖరారు కాని టీటీడీ బడ్జెట్

 • చదలవాడ పదవీకాలం పూర్తయ్యి ఏడాది

 • కొలిక్కిరాని పాలకమండలి నియామకం

 • ఇప్పటికీ కానరాని స్పెసిైఫెడ్ అథారిటీ 

 • రెండు నెలల ఖర్చు వరకు వెసులుబాటు

 • 1/6 నిధులు ఉపయోగించుకునే చాన్స్

 • ఆ తర్వాత.. వెంకన్న ఖర్చులకూ కష్టమే

thirumalaఆధ్యాత్మిక నిలయాలకు, రాజకీయాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడిగా ప్రసిద్ధికెక్కిన కలియుగ వైకుంఠ వాసుడు కొలువుదీరిన తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు ఏడాది నుంచి పాలకమండలి లేదు. మండలి ఏర్పాటుకు రాజకీయాలతో ముడిపడటంతో టీడీడీ 2018-19 బడ్జెట్ ఇంతవరకు ఖరారు కాలేదు. సాధారణంగా ప్రతి జనవరిలో టీటీడీ బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలను మార్చి 31లోగా ఆమోదించి పంపటం ఆనవాయితీ.  కానీ.. మార్చి 30 సాయంత్రం వరకు కూడా బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందలేదు. గత సంవత్సరం ఏప్రిల్‌లో చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం పూర్తయ్యాక కొత్త పాలకమండలి నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. పాలకమండలి లేనప్పుడు 1987 హిందూ దేవాలయాల చట్టం ప్రకారం ముగ్గురు సభ్యులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీలో టీటీడీ ఈఓ, ఎండోమెంట్ కమిషనర్, రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. కానీ ఈసారి మాత్రం.. అటు మండలి లేక, ఇటు అథారిటీ నియామకం జరగక మొట్టమొదటిసారి టీటీడీలో అయో మయ పరిస్థితి నెలకొంది. టీటీడీ చట్టం ప్రకారం ఈ ప్రతిపాదిత బడ్జెట్‌లో  1/6వ వంతు నిధులను రెండు నెలలపాటు బడ్జెట్ ఆమో దం పొందకపోయినా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. అప్పటికీ ప్రత్యామ్నాయం ఏర్పాటు కాకపోతే మాత్రం టీటీడీ నిబంధనల ప్రకా రం న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని మూడు దశాబ్దాల క్రితం ప్రయత్నించింది. అయితే అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించి టీటీడీ వ్యవహారాలను రాష్ట్ర  పరిధిలోకి తీసుకొచ్చి ప్రత్యేక ఆడిట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

మైదుకూరుతో ముడి..
రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను టీటీడీ పాలకమండలి అధ్యక్షునిగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు కొన్నాళ్ల క్రితమే ప్రచారం జరిగింది. అయితే మైదుకూరు రాజకీయ ప్రముఖుడు, మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకుని.. మైదుకూరు టికెట్ ఇవ్వాలని తలపోసిన టీడీపీ అగ్రనా యకత్వం.. ఈ అంశంపై ఇరువర్గాలను సమన్వయ పరచటంలో ఎప్ప టికప్పుడు జాప్యం చేస్తోంది. నెల క్రితం పుట్టా సుధాకర్ యాదవ్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా పిలిపించి మాట్లాడారు కూడా. ఈ సందర్భంలో టీటీడీ పదవితోపాటు మైదుకూరు టికెట్ కూడా తనకే కావాలని పుట్టా సుధాకర్ పట్టుబట్టడంతో నియామక ప్రక్రియ అప్పటికి నిలిపివేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత టీటీడీ పాలక మండలిని నియమించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 

దర్శకేంద్రుడికి ఏం పదవి?
శుక్రవారం ఉండవల్లి సీఎం నివాసంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలిశారు. దర్శకేంద్రుడు కె. రాఘ వేంద్రరావు, సి. అశ్వనీదత్ తదితరులు వీళ్లలో ఉన్నారు. ఈ సందర్భం లో టీటీడీ పాలకమండలి ప్రస్తావన వచ్చినట్లు, అసెంబ్లీ సమావేశాలు కాగానే టీటీడీ పాలకమండలి నియమిస్తున్నట్లు రాఘవేంద్రరావుతో సీఎం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎంను కలిశాక టీటీడీ చైర్మన్‌గా రాఘవేంద్రరావు అంటూ పలు వెబ్‌సైట్లు, సామాజిక మాధ్య మాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ‘మనం’కు అందిన తాజా సమాచారం ప్రకారం టీటీడీ పాలకమండలిలో సభ్యునిగా కె.రాఘవేంద్రరావు పేరును ఖరారు చేశారు.

Related News