Tongue Slip

మళ్లీ తడబడిన బికామ్‌లో ఫిజిక్స్ ఎమ్మెల్యే..!

Updated By ManamFri, 08/31/2018 - 15:00
  • జగన్‌ను విమర్శించబోయి తప్పులో కాలేసిన జలీల్ ఖాన్..

  • నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో వ్యాఖ్యలు..

TDP MLA, Jaleel Khan, tongue slip, Nara Hamara TDP hamara, Gunturవిజయవాడ: బికామ్‌లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే అనగానే టక్కున గుర్తుచ్చే పేరు జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన మాట్లాడే విధానంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. జలీల్ ఖాన్ ఎప్పుడు మీటింగ్‌ల్లో పాల్గొన్న ఆయన మాటల్లో తడబాటుతో తప్పులో కాలేసి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన ‘టీడీపీ హమారా.. నారా హమారా..’ కార్యక్రమంలో మైనార్టీల సమస్యలపై జలీల్ ఖాన్ మాట్లాడుతూ మరోసారి తప్పులో కాలేశారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలు పెట్టిన జలీల్ ఖాన్.. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ముస్లింలకు చేసింది ఏమి లేదని విమర్శించిన ఆయన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించబోయి తడబడ్డారు. ‘రాయలసీమలో ముస్లింలను ఎదగకుండా చూసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి వాళ్ల నాన్న.. జగన్ మోహన్ రెడ్డిది..’ అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. బికామ్‌లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే.. వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న అంటూ మరోసారి హ్యాస్యాన్ని పండించారు.

తుని తరహాలో గొడవకు వైసీపీ పథకం..
అదేవిధంగా శనివారం అమరావతిలో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పథకం రచిస్తోందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల్లో అల్లర్లు చేయడం జగన్‌కే కాదు.. ఆయన తాత, తండ్రీకి అలవాటేనని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని జలీల్ ఖాన్ విరుచకపడ్డారు. కాగా, 2004లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో రాత్రికి రాత్రే టీడీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌‌లో మైనార్టీ శాఖ ఖాళీగా ఉండటంపై కన్నేసిన జలీల్ ఖాన్.. రాజీనామా చేయకుండా టీడీపీలోకి జంప్ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతున్నారు. లుచ్చాగాళ్లు.. అంటూ నోరు జారిన కేటీఆర్!!

Updated By ManamWed, 08/15/2018 - 18:38

Minister KTR Tongue Slip Over Congress Leaders Criticizing

కరీంగనర్: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఓ రేంజ్‌లో వారిరివురు కౌంటర్లు పేలుస్తున్నారు. మొదటి రోజున రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై అదే రోజు ప్రెస్‌మీట్ పెట్టి మరీ కేసీఆర్ కౌంటర్లు పేల్చారు. ఇప్పటి వరకూ ట్విట్టర్ వేదికగా రాహుల్‌పై విమర్శలు చేసిన కేటీఆర్ ఈ సారి ఏకంగా బహిరంగ సభలో మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లు’ అంటూ మంత్రి నోరు జారారు.!!

కేటీఆర్ మాటల్లోనే..
"
నాలుగేళ్లుగా ప్రజలకు ముఖం చూపించని నాయకులు.. ఇప్పుడు కొత్తగా జనాల్లోకి వచ్చి హామీల వర్షం కురిపిస్తున్నారు. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు వస్తున్నారు. గంగిరెద్దులోళ్లు నన్ను తిట్టేరు.. నేను మిమ్మల్ని వారితో పోల్చడం లేదు.. మీరంతా చాలా మంచోళ్లు. కాంగ్రెస్‌వాళ్లు లుచ్చాగాళ్లు. ఎన్నికలు దగ్గరపడే సరికి రాహుల్ గాంధీ.. ఇంకొకరు ఢిల్లీనుంచి ఇక్కడొచ్చి వాలుతున్నారు. ఈ నాలుగేళ్లు కనీసం ముఖం కూడా చూపించని తెలివిలేనోళ్లు.. ఇవాళ వచ్చి తిమ్మిని బమ్మిని చేసే మాటలు మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

కాగా.. అధికార- ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు చేసుకోవడం షరామామూలే.. కానీ లుచ్చగాళ్లు అదీ ఇదీ అని మాట్లాడటం సబబు కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టి. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్‌పై కౌంటర్లు పేలుస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్న మీరు వాడే పదజాలం ఇదేనా..? మీకిది సబబేనా..? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.సముద్రానికే గండి కొడతాం..: చినరాజప్ప

Updated By ManamSat, 07/14/2018 - 22:37

Home Minister Nimmakayala Chinarajappa Tongue Slip

అమరావతి: ఏపీ కెబినెట్‌లోని కొందరు మంత్రులు, తెలుగు తమ్ముళ్లు ఈ మధ్య నోరు జారుడు ఎక్కువైంది.!. అసలు తామేం మాట్లాడుతున్నామో వారికే అర్థం కాని పరిస్థితి.! మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ పలు బహిరంగ సభల్లో నోరు జారిన సందర్భాలు కోకొల్లలు. ఒక్క నారా లోకేశే కాదు.. దురుసుగా మాట్లాడటం.. నిండు సభల్లో సభికుల ముందు మాట్లాడకూడని మాటలు మాట్లాడి పలువురు నేతలు అభాసుపాలయ్యారు.! ఇందుకు ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పనక్కర్లేదు. తాజాగా.. హోం మంత్రి చినరాజప్ప కూడా ‘నోరు జారిన నేతలు’ జాబితాలోకి చేరిపోయారు.! 

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ నూతన భవనం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి..."వరద ముంపును తగ్గించడానికి అవసరమైతే సముద్రానికి గండి కొట్టేందుకు సిద్ధం" అంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన.. సముద్రానికి గండి కొట్టేందుకు తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రాంతాలు గుర్తించామని చినరాజప్ప చెప్పడం గమనార్హం. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ వ్యాఖ్యలు విని ఆశ్చర్యపోయారు. ఇంకొందరమైతే.. " సముద్రానికే గండి కొట్టే ప్లాన్ సార్ దగ్గరుందంటే.." ఇది మామూలు విషయం కాదంటూ నవ్వేసి ఊరుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ విచిత్ర మాటలు మాట్లాడిన చినరాజప్ప వీడియోపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. నిమ్మకాయలతో నిమ్మకాయలగారికి సన్మానం చేయాలంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే.. వర్షాకాలం ముంచుకొస్తున్న సమయంలో ముంపు ప్రాంతాలను వరద నుంచి తప్పించేందుకు సముద్రానికి గండికొట్టే ప్రయత్నాలు చేపడుతున్న చినరాజప్ప సార్ ఎంత మేరకు సక్సెస్ అవుతారో.. ఆయన దగ్గర ఏం మాస్టర్ ప్లాన్ ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. తీరా ప్లాన్ వర్కవుట్ కాకపోతే సారు.. తిన్నగా సారీ చెప్పి ఊరుకుంటారేమో..!?. కాగా టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కూడా హిందువుల ఆరాధ్యుడైన తిరుమల వెంకన్నను " వెంకన్న చౌదరి" అని నాలుక్కరుచుకొని తీరా తప్పుతెలుసుకుని బహిరంగా క్షమాపణలు కోరిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.మరోసారి తప్పులో కాలేసిన చంద్రబాబు

Updated By ManamSat, 03/31/2018 - 13:36

chandrababu కడప: నోరు జారడంలో తన తనయుడు నారా లోకేశ్‌ను మించిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం కడపలోని ఒంటిమిట్టలో జరిగిన కోదండరామస్వామి కల్యాణానికి సతీసమేతంగా వెళ్లిన చంద్రబాబు అక్కడ పప్పులో కాలేశారు. ఈ స్థానంలో బమ్మెర పోతన రామాయణం రాసి, దేవుడికి అంకితం ఇచ్చారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

నిజానికి బమ్మెర పోతన రాసింది భాగవతం, రామాయణం రాసింది వాల్మీకి కాగా.. చంద్రబాబు మాత్రం పోతనగారు.. రాసింది రామాయణం అంటూ మాట్లాడారు. దీంతో బాబుపై నెట్టింట్లో పెద్దఎత్తున కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. కాగా.. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పలుమార్లు టంగ్‌స్లిప్ అయ్యారు. ఒలింపిక్‌లో గెలిస్తే నోబెల్ బహుమతి ఇస్తాం, అవినీతి, అభివృద్ధిలో దేశంలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దేశాన్ని అవినీతి భారతదేశంగా మారుస్తా ఇలా పలుమార్లు ఆయన నోరు జారారు.

Related News