andhrapradesh

కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Updated By ManamWed, 10/17/2018 - 09:22

Road Accident In Kurnoolకర్నూల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం, పెద్ద హోతురు సమీపంలో ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. పిల్లలకు వెంట్రుకలు తీయించడానికి ఎల్లార్తి దర్గాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కర్నూల్ నగరంలోని ఓల్డ్ టౌన్‌కు చెందిన వారీగా గుర్తించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్న చంద్రబాబు.. గాయాలపాలైన వారికి తక్షణం వైద్య సాయం అందించాల్సిందిగా ఆదేశించారు.తిత్లీ బాధితులకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సాయం

Updated By ManamMon, 10/15/2018 - 11:36

NTR, Kalyan Ramతిత్లీ తుఫాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది. ఈ తుఫాను వలన భారీ ప్రాణ నష్టంతో పాటు వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంచనా వేశారు. ఈ క్రమంలో తిత్లీ బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయ్ దేవరకొండ, సంపూర్ణేశ్ బాబు, దర్శకులు అనిల్ రావిపూడి తమ సాయాన్ని ఏపీ సీఎం రిలీఫ్‌కు ప్రకటించగా.. తాజాగా నందమూరి అన్నదమ్ములు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తమ సాయాన్ని ప్రకటించారు.

తిత్లీ బాధితుల కోసం ఎన్టీఆర్ రూ.15లక్షల సాయం, కల్యాణ్ రామ్ ర.5లక్షల సాయం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. కాగా ఇదే ఏడాది కేరళలో వచ్చిన భారీ వరదలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయగా.. అప్పుడు కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు భారీ సాయాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

 వెంటనే పనులు ప్రారంభించండి: నారా లోకేశ్

Updated By ManamSat, 10/13/2018 - 09:58

Nara Lokeshశ్రీకాకుళం: తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాలపై మంత్రి నారా లోకేశ్ సమీక్షా నిర్వహించారు. అందులో పంచాయితీ రాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. 10గంటలకు అన్ని గ్రామాల్లో తాగునీటి పథకాలు వినియోగంలోకి రావాలని అన్నారు. నీటి సరఫరా కోసం అందుబాటులో ఉన్న అగ్నిమాపక వాహనాలు సైతం వినియోగించాలని తెలిపారు.

తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 116కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేయాలని, సాయంత్రం 4గంటల లోపు అన్ని గ్రామాల్లో రోడ్ల పునరుద్దరణ చెయ్యాలని సూచించారు. అలాగే గ్రామాల్లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చెత్త కుంపల తొలగింపు, మురుగు కాలువల పూడికతీత, పొదల తొలగింపు, రహదారులు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. బ్లీచింగ్, దోమల నివారణకు ఫాగింగ్ అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టాలని పేర్కొన్నారు.కొలిక్కి వచ్చిన నగరి పంచాయతీ

Updated By ManamThu, 10/11/2018 - 09:54

Chandrababu naiduచిత్తూరు: సీఎం చంద్రబాబునాయుడు చొరవతో ఎట్టకేలకు నగరి పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు సొంత నియోజకవర్గంమైన నగరి సీటును మరోసారి ఆయన కుటుంబానికే ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ముద్దుకృష్ణమ పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ను నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా వచ్చే టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే అని ముద్దుకృష్ణమ కుటుంబసభ్యులు చెప్పారు. అభిప్రాయ సేకరణ ప్రకారమే గాలి భానుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా టీడీపీ ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు మరణంతో ఖాళీ అయిన ఆ టికెట్‌ను వారి కుమారుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే ఈ విషయంలో వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ సీటును ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి ఇచ్చింది టీడీపీ. అయితే వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని తొందరగా ఖరారు చేయాలని ఆలోచించిన చంద్రబాబు.. అన్నదమ్ములతో మాట్లాడి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. తిత్లీ తుపాన్: శ్రీకాకుళంలో రెడ్ అలర్ట్

Updated By ManamThu, 10/11/2018 - 08:57
  •  శ్రీకాకుళం జిల్లాలో ‘తిత్లీ’ తుఫాను తీరం దాటింది

  •  తిత్లీ ఎఫెక్ట్‌ : శ్రీకాకుళంలో రెడ్‌ అలర్ట్‌

  • సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు:ఆర్టీజీఎస్‌

Titliశ్రీకాకుళం:  వణికిస్తున్న ‘తిత్లీ’ పెను తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుపాను మరింత ముందుకు కదిలి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దిశ మార్చుకుంటోందని వాతావరణశాఖ తెలియచేసింది. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది.

కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సైక్లోన్ ఐ గా పిలిచే తుపాను కేంద్రకం దాదాపు 52 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ కేంద్రం తెలిపింది.

తుపానులో అంతర్గతంగా గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తున్న ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పెను తుపాను తీరం దాటిన సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాలోని గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ పూరి, జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 10వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోస్తా తీరంలో కొన్నిచోట్ల అలలు 3 మీటర్ల మేర ఎగసిపడతున్నట్టు ఇన్‌కాయిస్‌ హెచ్చరికలు జారీ చేసింది.
సిక్కోలులో అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌.కు చెందిన ఒక బృందం శ్రీకాకుళం జిల్లాకు చేరింది. రెండో బృందం కూడా టెక్కలి ప్రాంతానికి వెళ్లనుంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

ముందుకు వచ్చిన సముద్రం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి మరువాడ ప్రాంతంలో సముంద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్ తర్వాత ఈ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం బుధవారం 150 అడుగుల ముందుకు వచ్చింది. భీకర శబ్ధంతో అలలు తీరంపై విరుచుకుపడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొండ్రాజుపాలెంలో మత్స్యకారుల పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాలైన పాలకాయితిప్ప, బసవన్నపాలెం, ఊటగుండ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. 

పరిస్థితులపై సీఎం ఆరా
టిట్లీ తుపాన్‌ తీరం తాకిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన‍్ఫరెన్స్‌ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని చెప్పారు. తుపాను పూర్తిగా బలహీన పడేవరకూ ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారుమరో 24 గంటల్లో భారీ వర్షాలు

Updated By ManamTue, 10/09/2018 - 09:23

Rainsతూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయుగుండం కళింగ పట్నానికి 500కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండగా.. గంటలకు 10కిలోమీటర్ల వేగంతో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీరప్రాంతాలను ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తం చేయగా.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.

మరోవైపు తమిళనాడు, కేరళలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తీర ప్రాంతంలోని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.ర్యాలీలో పాల్గొనండి: బాబుకు మమత లేఖ

Updated By ManamMon, 10/08/2018 - 08:49

Mamata Benarjee, Chandrababu Naiduఅమరావతి: ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 19న కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ర్యాలీకి రావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా చూపించాల్సిన అవసరం ఉందని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నాం. ఇక్కడి నుంచే కేంద్ర వైఫల్యాలపై మన స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’ అంటూ మమతా లేఖలో పేర్కొన్నారు.వచ్చే 24గంటల్లో ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు

Updated By ManamSun, 10/07/2018 - 09:25

Rainsఅమరావతి: రానున్న 24గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో వచ్చిన ఆవర్తనంతో సోమవారం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆవర్తనం మూడు రోజుల్లో బయపడి వాయుగుండంగా మారి ఉత్తరకోస్తా, ఒడిశా దిశగా పయనిస్తుందని తెలిపారు. మరోవైపు నైరుతి ఉపసంహరణతో మచిలీపట్నం, కర్నూలు నుంచి రుతు పవనాలు నిష్ర్రమించినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఇవి దక్షిణాది నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయని, ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు.ఐటీ సోదాలు.. పలువురికి నోటీసులు

Updated By ManamSat, 10/06/2018 - 11:24

IT Raidsఅమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఐటీ సోదాలు కొన్నిచోట్ల ముగిశాయి. ఈ సోదాల్లో పలు కంపెనీల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో వీఎస్ లాజిస్టిక్స్, శుభగృహ ఇండియా ప్రైవేట్ లిమిడెట్, వీఎస్ ఎకోబిక్స్, ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 8,9 తేదీల్లో వీరు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాచవరంలోని శుభగృహ ప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. అందులో నిధులు, ఐటీ దాడులపై మంత్రులు, నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.ఏపీలో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

Updated By ManamSat, 10/06/2018 - 09:39

IT Raidsఅమరావతి: ఏపీలో ఐటీ సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. పలువురు నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుభగృహ, దాని అనుబంధంగా ఉన్న సంస్థలే టార్గెట్‌గా రైడ్స్ జరుతున్నాయి.

అయితే ఏపీలో ఐటీ దాడులు జరగబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్న ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తమ పనిని మొదలుపెట్టారు. సుమారు 24బృందాలతో పలు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అందులో సదరన్ లాజిస్టిక్స్, వీఎస్ లాజిస్టిక్స్, శుభగృహ కంపెనీలు ఉన్నాయి. సదరన్ డెవలపర్స్ కార్యాలయంలో ఒక మంత్రికి చెందిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే నెల్లూరుకు చెందిన టీడీపీ నేత మస్తాన్ రావ్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

Related News