Aadhi Pinisetty

‘నీవెవ‌రో’ మూవీ రివ్యూ

Updated By ManamFri, 08/24/2018 - 14:32
Neevevaro

నిర్మాణ సంస్థ‌:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా
న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు
సంగీతం: అచ్చు రాజామ‌ణి, ప్ర‌స‌న్
ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
నిర్మాత‌:  ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
ద‌ర్శ‌క‌త్వం:  హ‌రినాథ్‌
కెమెరా: సాయిశ్రీరామ్‌
క‌ళ‌: చిన్నా
కూర్పు: ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్‌
పోరాటాలు: వెంక‌ట్‌
విడుద‌ల తేదీ: 24.08.18

కొత్త క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, వాటి కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి మంచి ప్రాడెక్ట్ ని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న కాంక్ష మంచిదే. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌కుండా, ప్యాష‌న్‌తో సినిమాలు చేయ‌డ‌మూ మంచిదే. అలా మంచి పని చేస్తున్నారు ఆది పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయి పుష్క‌రం అవుతున్న సంద‌ర్భంగా మ‌ర‌లా హీరోగా ఆయ‌న న‌టించిన తెలుగు సినిమా `నీవెవ‌రో`. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది అనేది తెలుసుకోవాలంటే చ‌దివేయండి.

క‌థ‌:
అంద‌రిలాగే ఆరోగ్యంతో పుట్టిన కల్యాణ్ ( ఆది పినిశెట్టి) త‌న 15వ ఏట క‌ళ్లు పోగొట్టుకుంటాడు ఓ ప్ర‌మాదంలో. పోయింది క‌ళ్లే గానీ, సెల్ప్ కాన్ఫిడెన్స్ కాద‌న్న‌ది అత‌ని అభిప్రాయం. ఎవ‌రైనా అత‌ని ప‌ట్ల సానుభూతి చూపిస్తే అత‌నికి న‌చ్చ‌దు. అలాంటిది వెన్నెల (తాప్సీ) అత‌నికి అనుకోకుండా ద‌గ్గ‌ర‌వుతుంది. అను (రితికా) ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అందులోనూ ఏదో ఒక సానుభూతి అత‌నికి క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌నికి చూపు తిరిగి వ‌స్తుంది. వెన్నెల తండ్రి తిల‌క్ వ‌చ్చి క‌ల్యాణ్ క‌లుస్తాడు. ఓ సంద‌ర్భంలో తిల‌క్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌న్ని గుర్తుప‌ట్టిన క‌ల్యాణ్ అది హ‌త్య అని తెలుసుకుంటాడు. ఆ హ‌త్య తాలూకు కూపీ లాగుతుంటే అత‌నికి వెన్నెల నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇంత‌కీ వెన్నెల ఎవ‌రు? క‌ల్యాణ్ తెలుసుకున్న కొత్త నిజం ఏంటి?  వెన్నెల మెడ‌లో మూడు ముళ్లు వేశాడా?   లేకుంటే అనును పెళ్లి చేసుకున్నాడా అనేది ఆస‌క్తిక‌రం. 

ప్ల‌స్ పాయింట్స్
- న‌టీన‌టుల న‌ట‌న‌
- సంగీతం
- కెమెరా
- ఆర్ట్

మైన‌స్ పాయింట్లు
- క‌థ‌, క‌థ‌నం
- నెమ్మ‌దిగా సాగిన స్క్రీన్‌ప్లే
- సాగ‌దీత స‌న్నివేశాలు

Neevevaro

స‌మీక్ష‌
రీమేక్‌లు అన్నీ పండ‌వు. అన్నీ మెప్పించ‌వు. కానీ కొన్ని మాత్రం బావుంటాయి. అలా బావుంటుంద‌నుకుని కోన వెంక‌ట్ తెర‌కెక్కించిన సినిమా `నీవెవ‌రో`. త‌మిళంలో స‌క్సెస్ అయిన `అదే క‌న్‌గ‌ళ్‌` చిత్రానికి రీమేక్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ టేస్ట్ కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశారు. ఆది పినిశెట్టి చూపు లేకుండా, చూపు క‌లిగిన కుర్రాడిగా బాగా న‌టించాడు. తాప్సీ స‌హజంగా న‌టించింది. త‌న పాత్ర ప‌రిధిలో రితిక‌, స‌త్య కృష్ణ‌, తుల‌సి, శ్రీకాంత్ అయ్యంగార్‌, శివాజీరాజా, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి.. అంద‌రూ మెప్పించారు. చాన్నాళ్ల త‌ర్వాత స‌ప్త‌గిరికి మంచి పాత్ర ప‌డ్డ‌ట్ట‌నిపించింది. న‌టీన‌టుల ప‌రంగా సినిమా ప‌క్కాగా బావుంది. కాక‌పోతే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విష‌యంలోనే ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలా ఉన్న‌ట్ట‌నిపించాయి. ఎడిట‌ర్ కొన్ని వేల గంట‌లు రూమ్‌లో కూర్చుని సినిమాను ఈ షేప్‌కు తెచ్చార‌ని అంతా తెగ‌పొగిడారు. మ‌రికొన్ని గంట‌లు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. ఆర్ట్, కాస్ట్యూమ్స్, కెమెరా వ‌ర్క్ బావుంది. ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాస్త అటూ, ఇటూ త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ అక్క‌డ‌క్క‌డా అస‌లు అత‌క‌లేదు. ఎమోష‌న్స్ కొన్ని చోట్ల స‌రిగా పండ‌లేదు. అక్క‌డ‌క్క‌డా లాజిక్ కూడా మిస్ అయిన‌ట్టు అనిపించింది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ కి మాత్రం క‌నెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్: 2/5
బాట‌మ్ లైన్‌:  న‌త్త న‌డ‌క‌న‌.. `నీవెవ‌రో`.



‘నీవెవరో’కు సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 08/21/2018 - 15:19

Neevevaroఆది హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ఆగష్టు 24న ప్రేక్ష్కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ శ్యామ్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.



నేనేం చెయ్యలేదు సర్

Updated By ManamFri, 08/17/2018 - 15:07

U Turnసమంత అక్కినేని ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. కన్నడలో విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఇందులో రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీనివాస చిత్తురీ, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



లిప్‌లాక్‌లకు సిద్ధ‌మా తాప్సీ

Updated By ManamTue, 08/14/2018 - 11:26

Taapseeద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఇమేజ్‌ను సంపాదించుకున్న కొద్ది మంది హీరోయిన్స్‌లో తాప్సీ ఒక‌రు. ఈ అమ్మ‌డు ఇప్పుడు ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌బోతుంది. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. తెలుగు విజ‌య‌వంత‌మైన `ఆర్‌.ఎక్స్ 100`. ల‌వ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా..క‌ల్ట్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్, ఘాటైన లిప్‌లాక్‌లు కూడా ఉన్నాయి. పెర్ఫామెన్స్ ప‌రంగా తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌దు. ఆ విష‌యం తెలిసిందే. మ‌రి బోల్డ్ సీన్స్‌, లిప్‌లాక్స్‌లో తాప్సీ ఎలా న‌టిస్తుంద‌నేదే ఇప్పుడు విష‌యం. ఈ చిత్రంలో హీరోగా ఆది పిని శెట్టి న‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ నుండి సినిమా సెట్స్‌కి వెళుతుంది. ఆది, తాప్సీ క‌లిసి న‌టించ‌బోయే మూడో చిత్ర‌మిది. 



‘యూ టర్న్‌’ నుంచి ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 08/03/2018 - 15:04

Aadhi సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. కన్నడలో విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా ఆదిపినిశెట్టి ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమిక, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి, రాంబాబు బండారు సయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.



‘నీవెవరో’కు విడుదల తేది ఖరారు

Updated By ManamWed, 08/01/2018 - 13:23

Neevevaroఆది పినిశెట్టి హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేదీని ఖరారు చేశారు. ఆగష్టు 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

కన్నడ చిత్రం ‘కంగల్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోనవెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసేన్ సంగీతం అందిస్తున్నాడు. 



ఆ బాధనంతా 'రంగస్థలం' షూటింగ్‌లో తీర్చుకున్నారట

Updated By ManamWed, 04/04/2018 - 11:49

Aadhi, rohiniరామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఆసక్తికర వార్తను బయటపెట్టాడు ఆది. సినిమాలో సీనియర్ నటి రోహిణి ఆది, చెర్రీలకు తల్లిగా నటించగా.. తాను చనిపోయిన తరువాత వచ్చే ఎమోషనల్ పాటలో ఆమె నిజంగానే ఏడ్చేశారట. ఏడ్చి ఏడ్చి ఆమె గొంతు కూడా పోయిందట.

అయితే అలా నిజంగా ఎందుకు ఏడ్చారంటూ ఆది, రోహిణిని అడగగా.. ఆమె అసలు విషయాన్ని చెప్పిందట. తన జీవితంలో ఎంతో ఇష్టమైన వ్యక్తి(ఆమె భర్త, ప్రముఖ నటుడు రఘువరన్) తనను వదిలేసి వెళ్లారని.. అప్పటి నుంచి ఆ బాధను దిగమింగుకుంటూనే ఉన్నానని, ఈ సాంగ్ షూటింగ్‌లో అతడు గుర్తొచ్చి అప్పటి నుంచి ఉన్న బాధను తట్టుకోలేక ఒక్కసారిగా అలా ఏడ్చేశానని రోహిణి అన్నారట. అయితే 1996లో పెళ్లి చేసుకున్న రఘువరన్‌, రోహిణి ఆ తరువాత 2004లో విడిపోయారు. రోహిణితో విడిపోయిన నాలుగు సంవత్సరాలకే రఘువరన్ మరణించారు.





Related News