chiranjeevi

‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రారంభం

Updated By ManamSun, 11/11/2018 - 11:45
RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమైంది. క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, సురేశ్ బాబు, వివి వినాయక్, రానా, శోభు యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కూడా పూజకు హాజరయ్యారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.‘మెగా’ దీపావళి

Updated By ManamThu, 11/08/2018 - 10:58
Mega Family

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ గురించి ఎవ్వరు ఏమనుకున్నా.. తామంతా ఒకే కుటుంబం అని వారు పలు సందర్భాలలో నిరూపిస్తూ వస్తున్నారు. కలిసి పండుగలు చేసుకోవడం, ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోషన్లు చేయడం ఇలా ప్రతి విషయంలోనూ మెగా అనుబంధం బయటపడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ కుటుంబం అంతా కలిసి దీపావళిని పండుగను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక మెగా కుటుంబమే కాకుండా.. అల్లువారి కుటంబం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను చూసిన మెగాభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Mega FamilyMega Family

 చిరు గొప్ప లక్షణాలన్నీ నీలో ఉన్నాయి

Updated By ManamMon, 11/05/2018 - 12:16

Ram Charan, Vivek Oberoiమెగాస్టార్ చిరంజీవి గొప్ప లక్షణాలన్నీ రామ్ చరణ్‌లో ఉన్నాయని బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ చెర్రీపై ప్రశంసలు కురిపించాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపాడు వివేక్.

‘‘కెమెరా ముందు శత్రువులం. కెమెరా వెనుక అన్నదమ్ముం. నా షూటింగ్‌కు చివరి రోజు. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను. రామ్ చరణ్ నీతో పనిచేయడం చాలా సంతోషం. నీ ప్రేమ, గౌరవానికి ధన్యవాదాలు. నీ గొప్ప తండ్రి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ త్వరలో విడుదల కానుండగా.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 చిరు తరువాత దేవరకొండతో..?

Updated By ManamTue, 10/30/2018 - 12:59

Koratala Siva, Vijay Devarakondaవరుసగా నాలుగు విజయాలతో టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకడిగా పేరు లిఖించుకున్న కొరటాల శివ, తదుపరి ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా తాజా సమచారం ప్రకారం ఈ చిత్రం తరువాత కొరటాల, విజయ్ దేవరకొండతో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన కొరటాల.. పెళ్లిచూపులు తరువాత విజయ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నానని.. అయితే అతడికి సెట్ అయ్యే కథను రాసి ఆ తరువాత విజయ్‌ను కలవాలనుకున్నానని తెలిపారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. కొరటాల, చిరంజీవి చిత్రం రావడానికి కూడా మరో ఏడాదిన్నర సమయం పట్టేలా ఉంది. ఈ తరువాత ఈ ఇద్దరి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.మరో మెగా మేనల్లుడి ఎంట్రీకి రంగం సిద్ధం

Updated By ManamSun, 10/28/2018 - 12:24

Vaishnav Tejమెగా కుటుంబం నుంచి టాలీవుడ్‌లోకి మరో వారసుడు రాకకు రంగం సిద్ధమైంది. మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి. మరి క్రేజీ కాంబినేషన్‌లో హీరోగా ఎంట్రీగా వైష్ణవ్ తేజ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘అందరివాడు’ చిత్రాల్లో వైష్ణవ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విషయం తెలిసిందే.జగన్‌కు రోశయ్య, చిరు పరామర్శ

Updated By ManamSat, 10/27/2018 - 16:34
Rosaiah, chiranjeevi phone call to YS jagan

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా గురువారం విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయం కాగా, తొమ్మిది కుట్లు పడ్డాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైఎస్ జగన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన ప్రజాసంకల్పయాత్రకు వారం పాటు విరామం ఇచ్చారు.
 ప్రముఖ నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి కన్నుమూత

Updated By ManamSat, 10/27/2018 - 09:22

Siva Prasad Reddyప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత శివ ప్రసాద్ రెడ్డి ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం చెన్నైలో మృతిచెందారు. 1987లో కామాక్షి మూవీస్‌ను ప్రారంభించిన ఆయన శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, నాగచైతన్యలతో సినిమాలను నిర్మించారు. వారిలో ఎక్కువగా నాగార్జునతో 11 సినిమాలకు నిర్మించారు. అలాగే పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ పనిచేశారు. చివరగా నాగార్జునతో గ్రీకు వీరుడును తెరకెక్కించారు శివ ప్రసాద్ రెడ్డి. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇది ‘మెగా’ హాలోవెన్ పార్టీ

Updated By ManamSat, 10/27/2018 - 08:54
Mega Family

హాలోవెన్ ఫెస్టివల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అక్టోబర్ చివర్లో వచ్చే ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. దెయ్యాల్లాగా తమను అలంకరించుకొని ఈ పండుగను చేసుకుంటుంటారు. అయితే ఈ సంప్రదాయం ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చేసింది. సినీ ఇండస్ట్రీలోని పలువురు ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటుంటారు. కాగా తాజాగా ఈ పండుగను జరుపుకుంది మెగా కుటుంబం.

మెగాస్టార్ చిరంజీవితో సహా రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన, సుష్మిత, శ్రీజ, స్నేహ, నిహారిక మిగిలిన కుటుంబసభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో దెయ్యాల గెటప్‌లతో మెగా కుటుంబం అదిరిపోయింది. కాగా రామ్ చరణ్ ఒక్కటే ఏ వేషం వేసుకోకుండా కేవలం నల్ల దుస్తులను మాత్రమే వేసుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ఫాదర్‌గా, సుష్మిత నన్‌గా ఉన్న మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం మెగా కుటంబంలోని అందరు హీరోలు సినిమాలతో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాను ఒప్పుకోలేదు.

Mega FamilyMega FamilyMega Family

 కాంగ్రెస్‌కు మెగా‘స్టార్’ క్యాంపెయిన్!

Updated By ManamFri, 10/26/2018 - 02:54
  • ప్రచారానికి చిరంజీవిని దింపుతున్నాం

chiranjiviహైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పకడ్బందీగా ప్రచార వ్యూహాన్ని రూపొందించుకుంటున్నా మని ఎఐసీసీ మీడియా కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నజీర్ అహ్మద్ చెప్పారు. రాజ్యసభ  మాజీ సభ్యుడు, సినీనటుడు చిరంజీవిని తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చెయ్యాలని కోరతామన్నారు. గురువారం గాంధీభవన్ లో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రావణ్ దాసోజుతో, ఎఐసీసీ మీడియా ఇంచార్జీ యత్నీష్, ప్రశాంత్ తో కలిసి విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎఐసీసీ నుంచి మీడియా కోఆర్డినేటర్లు ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇక్కడే ఉండి ప్రచారాన్ని టీపీసీసీతో సమన్వయం చేసుకుంటారని చెప్పారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, మహబూబ్ నగర్ లో మీడియా సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గానికి ఒక ప్రతినిధి ప్రచారాన్ని సమన్వయం చేస్తారని, ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, బహిరంగ సభలకు సంబంధించి అభ్యర్థులకు సహకరిస్తారని చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్,మజ్లిస్ మూడు ఒక్కటేనని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. అవినీతి,అక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ పడుతున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న రాజస్తాన్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని చెప్పారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో కూడా కలిసి వచ్చే పార్టీలతో పొత్తులకు వెళ్లనున్నామని, గట్టి పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాఫెల్ కుంభకోణం, మద్యప్రదేశ్ లో వ్యాపం, గుజరాత్ లో పెట్రోలియం ఇతర రాష్ట్రాల్లో ఎన్నో కుంభకోణాలతో బీజీపీ ఇరుక్కున్నదని, వాటిని ప్రజలకు చాటుతామన్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు: శ్రావణ్ దాసోజు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు ఓటమి తప్పదని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రావణ్ దాసోజు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రజలు మెచ్చే విధంగా మేనిఫెస్టో ఉంటుందని అన్నారు.జార్జియా షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న 'సైరా' 

Updated By ManamWed, 10/24/2018 - 17:37
sye-raa-narasimha-reddy-georgia-schedule-completed

చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ఇటీవల జార్జియాలో ప్రారంభమైన షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరించారు. షెడ్యూల్‌ పూర్తయినట్లు సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమాను భారీ తారాగణం.. భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, కిచ్చాసుదీప్‌ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. 
 

Related News