Birth Anniversary

అచ్చు ‘అక్కినేని’లాగే.. ఆకట్టుకుంటున్న సుమంత్

Updated By ManamThu, 09/20/2018 - 09:58

Sumanthఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్‌గా ప్రధానపాత్రలో నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో సుమంత్ పాల్గొనగా.. ఇవాళ అక్కినేని జయంతి సందర్భంగా మొదటి లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

అందులో అక్కినేని నాగేశ్వరరావు లుక్‌లో నిజంగానే ఆయనేనా అన్నట్లుగా అచ్చు దిగిపోయాడు సుమంత్. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తుండగా.. రానా, ప్రకాశ్ రాజ్, నరేశ్, కైకాల సత్యనారాయణ, కీర్తి సురేశ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై అటు అభిమానుల్లో పాటు ఇటు విమర్శకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.



శ్రీదేవి జయంతి.. భావోద్వేగానికి గురైన బోని

Updated By ManamMon, 08/13/2018 - 10:23

Sridevi, Boney Kapoorఅతిలోక సుందరి శ్రీదేవి మొదటి జయంతి నేడు. ఈ సందర్బంగా ఆమెను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోని కపూర్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోని కపూర్.. ‘‘మనకు హీరోలు, లెజండ్‌లు ఇద్దరు ఉన్నారు. హీరోలు ఎప్పటికీ గుర్తుంటారు. కానీ లెజండ్‌లకు మరణం ఉండదు. ప్రతిరోజు ఆమె మాతోనే ఉంది. ఒక్క క్షణం కూడా ఆమెను మేము మర్చిపోలేదు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

కాగా శ్రీదేవి తొలి జయంతిని పురస్కరించుకొని బాంద్రాలోని చాపెల్‌ రోడ్డులో ఉన్న బిల్డింగ్‌లో 18అడుగుల శ్రీదేవి పెయింటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ ఆర్టిస్ట్‌లు రంజిత్ దహియా, కునాల్ దహియా, బిదిషా విశ్వాస్, అరుషు, రిచా తదితరులు ఉన్నారు. గురుదేవ్ సినిమాలో శ్రీదేవి లుక్‌ను తీసుకొని వారు ఈ పెయింటింగ్‌ను రూపొందిస్తున్నారు. మరోవైపు శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లిదండ్రులతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసుకుంది.

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

 



జాగృతి ఆధ్వర్యంలో ‘సార్’ జయంతి వేడుకలు

Updated By ManamMon, 08/06/2018 - 18:22
  • తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జ‌య‌శంక‌ర్ సార్ జ‌న్మ‌దిన వేడుక‌లు

  • తెలంగాణలోని 31 జిల్లాల్లో తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు

 Prof JayaShankar sir Birth anniversary

హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త‌, ఉద్య‌మ స్ఫూర్తి ప్ర‌ధాత ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను తెలంగాణ జాగృతి ఘ‌నంగా నిర్వ‌హించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు జ‌య‌శంక‌ర్ స‌ర్ విగ్ర‌హాల‌కు, చిత్ర ప‌టాల‌కు  పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మ సమ‌యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ ఆలోచ‌న‌, కార్యాచ‌ర‌ణ‌కు తెలంగాణ‌వాదుల‌ను ఎలా సిద్ధం చేసిందీ మ‌న‌నం చేసుకున్నారు. ఆయ‌ప జీవితం భ‌విష్య‌త్ త‌రాల‌కు స్ఫూర్తినిస్తుంద‌ని అన్నారు. 

 హైద‌రాబాద్‌లో అశోక్‌న‌గ‌ర్‌లోని తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ చిత్ర ప‌టానికి జాగృతి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంగు న‌వీన్ ఆచారి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మేడ్చెల్ జిల్లా చ‌ర్ల‌ప‌ల్లి పారిశ్రామిక వాడ‌లో మేడ్చల్ జిల్లా క‌న్వీన‌ర్ ఈగ సంతోష్  నిర్వ‌హించిన జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో న‌వీన్ ఆచారి పాల్గొన్నారు. 

నిజామాబాద్‌లో క‌లెక్ట‌రేట్ నుండి కంఠేశ్వ‌ర్‌లోని జ‌య‌శంక‌ర్ స‌ర్ విగ్ర‌హం వ‌ర‌కు జాగృతి కార్య‌క‌ర్త‌లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం కంఠేశ్వ‌ర్ చౌర‌స్తాలోని జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి నిజామాబాద్ జిల్లా క‌న్వీన‌ర్ అవంతి శ్రీనివాస్ పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లాలో అనంత‌రాములు ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుకులు జ‌రిగాయి. 

అలాగే క‌రీంన‌గ‌ర్‌లో జ‌య‌శంక‌ర్ స‌ర్ స‌ర్కిల్‌లో తెలంగాణ జాగృతి క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌న్వీన‌ర్ జాడి శ్రీనివాస్‌, ప‌సుల చ‌రణ్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర‌మానికి క‌రీంన‌గ‌ర్‌లో ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్ రావు అతిథిగా హాజ‌ర‌య్యారు.  పెద్ద‌ప‌ల్లిలోనూ ఆ జిల్లా క‌న్వీన‌ర్ సంగ్రామ్ సింగ్ ఠాకూర్ ఆద్వ‌ర్యంలో  ర్యాలీ నిర్వ‌హించారు. పెద్ద‌ప‌ల్లిలో ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి పాల్గొని జ‌య‌శంక‌ర్ స‌ర్‌కు నివాళులు అర్పించారు. జ‌గిత్యాల క‌లెక్ట‌రేట్ ముందున్న జ‌య‌శంక‌ర్ స‌ర్ విగ్ర‌హం వ‌ద్ద జ‌గిత్యాల జిల్లా క‌న్వీన‌ర్ అమ‌ర్ దీప్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నివాళులు అర్పించారు.

వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లాలో తెలంగాణ జాగృతి నిర్వ‌హించిన జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల స‌తీశ్ కుమార్ పాల్గొన్నారు. అర్బ‌న్ జిల్లా క‌న్వీన‌ర్ బండారి సుమ‌న్ , రాము గౌడ్ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం జ‌రిగింది.వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలోని న‌ర్సంపేట లో బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో జ‌యంతి వేడుక‌లు జ‌రిగాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో జిల్లా క‌న్వీన‌ర్ మారిప‌ల్లి మాధ‌వి ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ పాల్గొన్నారు. 

జ‌న‌గామ జిల్లాలో  ఆ జిల్లా క‌న్వీన‌ర్ మ‌ర‌ళి ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ చిత్ర ప‌టానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో క‌న్వీన‌ర్ వాంకుడోతు జ్యోతి ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిగాయి. 

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో జిల్లా క‌న్వీన‌ర్ సుంద‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో  సాగ‌ర్ భండారి, మ‌ల్లేశం ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం జ‌రిగింది. న‌ల్గొండ‌లో బోన‌గిరి దేవెంద‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు.

సూర్యాపేట జిల్లాలో ఆ జిల్లా క‌న్వీన‌ర్ రంగినేని ఉపేంద‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిగాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో డాక్ట‌ర్ వెంకట్రాం మూర్తి ఆధ్వ‌ర్యంలో నివాళులు అర్పించారు. వ‌న‌ప‌ర్తిలో చీర్ల స‌త్యం, గ‌ద్వాల‌లో వెంగ‌ళ్ రెడ్డి , నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో మిరియాల పావ‌ని ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ కు నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి జిల్లా క‌న్వీన‌ర్ అర్చ‌నా సేనాప‌తి ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. 

మెద‌క్ జిల్లాలో క‌న్వీన‌ర్ మ‌ల్లిక‌, సంగారెడ్డిలో జిల్లా క‌న్వీన‌ర్ ఉద‌య్ భాస్క‌ర్‌, సిద్దిపేట జిల్లాలో కో క‌న్వీన‌ర్ కొండూరి ప‌వ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతి వేడుక‌లు జ‌రిగాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఆ జిల్లా క‌న్వీన‌ర్ రంగినేని శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో  ఆరు చోట్ల జ‌య‌శంక‌ర్ స‌ర్ చిత్ర ప‌టాల‌కు పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఆ జిల్లా క‌న్వీన‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో, నిర్మ‌ల్ జిల్లాలో ఆ జిల్లా కన్వీన‌ర్ చారి ఆధ్వ‌ర్యంలో రెండు చోట్ల జ‌య‌శంక‌ర్ స‌ర్ కు ఘ‌నంగా నివాళులు అర్పించారు.

జాగృతి ఆవిర్భావ వేడుక‌లు
తెలంగాణ జాగృతి ప్ర‌తి రెండేళ్ల‌కోసారి ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతిని నాడు ఆవిర్భావ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాగృతి 31 జిల్లాల యూనిట్‌లు తెలంగాణ జాగృతి జెండాల‌ను ఎగుర‌వేసి, కేక్ క‌ట్ చేశారు. జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతి, తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్స‌వం రెండూ ఒకే రోజు జ‌ర‌గ‌డంతో తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు పండుగ వాతావ‌ర‌ణంలో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.



జ‌య‌శంక‌ర్ సార్ జీవితం స్ఫూర్తిదాయ‌కం: ఎంపీ కవిత

Updated By ManamMon, 08/06/2018 - 15:44
  • జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి వేడుక‌ల్లో ఎంపి క‌విత‌

Paid tributes to Telangana ideologue Prof. Jayashankarన్యూఢిల్లీ : తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త  ప్రొఫెస‌ర్ కొత్తప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్ జీవితం మ‌నంద‌రికీ స్పూర్తిదాయ‌కమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం  జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపిలు జ‌య‌శంక‌ర్ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఎంపి క‌విత మాట్లాడుతూ జ‌య‌శంక‌ర్ స‌ర్‌ను స్మ‌రించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ర‌క ర‌కాల ప‌రిస్థితులను ఉద్య‌మ స‌మ‌యొంలో ఎదుర్కోన్నామ‌ని, వాటిని అధిగ‌మించేందుకు జ‌య‌శంక‌ర్ స‌ర్ వ‌ద్ద అర‌గంట కూర్చుని  డిస్క‌స్ చేసేదాన్న‌ని ఆనాటి సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ధిలో, మ‌నం వేస్తున్నప్ర‌తి ముందడుగులో వారు లేక పోవ‌డం బాధాక‌రమ‌న్నారు క‌విత‌. తెలంగాణ రాక ముందు ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, జ‌య‌శంక‌ర్ స‌ర్ తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుకున్నారని, దానిక‌నుగుణంగా రూపొందించుకున్న బ్లూ ప్రింట్ ప్ర‌కారం సిఎం కేసిఆర్ ప్ర‌జ‌ల స‌హ‌కారంతో  కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.


సౌ ప‌డో..ఏక్ లిఖో..ఉర్దూ సామెత ప్ర‌కారం..తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాన్ని జ‌య‌శంక‌ర్ స‌ర్ రాసి పెట్టుకున్నార‌ని తెలిపారు. ఆనాడు క‌మ్యూనికేష‌న్ త‌క్కువ‌గా ఉన్న‌స‌మ‌యంలో  1952 నుండి తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను రాసి పెట్టుకున్న విష‌యాలు ఉద్య‌మానికి పెట్రోల్ లా ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని క‌విత చెప్పారు.

నిబ‌ద్ధ‌త, సిన్సియారిటీ ఉంటే ఏద‌యినా సాధించ‌వ‌చ్చ‌ని జ‌య‌శంక‌ర్ స‌ర్ జీవితం మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌ని అన్నారు. వారి మాట‌ల‌ను ముందు త‌రాల‌కు తెలియ‌జేస్తూ వారికి మార్గం చూపే బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపిలు బోయిన‌ప‌ల్లి వినోద్  కుమార్, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, డిల్లీలో ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి స‌ముద్రాల వేణుగోపాలాచారి,  క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ ఛైర్మ‌న్ తుల ఉమ పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో....
ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్ జ‌యంతి వేడుక‌ల‌ను తెలంగాణ జాగృతి ఘ‌నంగా నిర్వ‌హించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు జ‌య‌శంక‌ర్ స‌ర్ విగ్ర‌హాల‌కు పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని జాగృతి కార్య‌క‌ర్త‌లు కేక్ క‌ట్ చేశారు. 



‘భారత సినీ పితామహుడు’కి గూగుల్ నివాళి

Updated By ManamMon, 04/30/2018 - 09:53
Dada Saheb Phalke

‘భారత సినిమా పితామహుడు’ దాదా సాహెబ్ ఫాల్కే 148వ జయంతి సందర్భంగా ఆయనకు గూగుల్ నివాళులు అర్పించింది. గూగుల్ డూడుల్‌ను ఆయన ఫొటోలతో నింపి ఆయనకు ఘనంగా నివాళులు ఇచ్చింది. 

అయితే ఇప్పటి మహారాష్ట్రలోని త్రింబక్‌లో పుట్టిపెరిగిన ఫాల్కే చిన్నప్పటి నుంచే సినిమాకు సంబంధించిన వివిధ కళలపై మక్కువను చూపి వాటిపై పట్టు సాధించారు. ఈ క్రమంలో 1910లో అలీస్ గై దర్శకత్వంలో వచ్చిన మూకీ చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ క్రిస్ట్‌’ చిత్రానికి పనిచేసిన ఫాల్కే ఆ సమయంలోనే సినిమాలను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ తరువాత లండన్‌ వెళ్లి ఫిల్మ్‌ మేకింగ్ నేర్చుకొని వచ్చిన ఆయన 1931 సంవత్సరంలో భారత సినిమా తెరపై మొదటిసారిగా ‘రాజా హరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి సినిమాలలో ఆయన భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. అలాగు 19 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 130 చిత్రాలు తీశారు. ఇక ఫాల్కే చివరి చిత్రం ‘గంగావతారన్’ 1932లో విడుదల కాగా.. 1944 ఫిబ్రవరి 16న ఆయన మరణించారు. ఆ తరువాత 1969లో భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా ఆయన పేరుపై అవార్డును ప్రకటించింది. సినిమా రంగంలో అత్యుత్తమ సేవలు చేసే వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందిస్తుంటారు. భారత సినిమాకు సంబంధించిన అత్యుత్తమ అవార్డులలో ఇది ఒకటి కావడం విశేషం.



టీడీపీ వచ్చాకే దళితులకు గౌరవం: చంద్రబాబు 

Updated By ManamThu, 04/05/2018 - 14:02

Babu Jagjivan Ram Birth Anniversary | CM Chandrababu Attends at Vijayawada

విజయవాడ: టీడీపీ వచ్చాకే దళితులకు గౌరవం పెరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మాట్లాడిన ఆయన.. దళితులు, పేదవాళ్ల కోసం పోరాడిన వ్యక్తి జగ్జీవన్‌‌‌రామ్ అని కొనియాడారు. ఆయన సేవలు సమాజంలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. అదే విధంగా దళితులకు ఎనలేని సేవలు అందించిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

"చట్టాల్లో మార్పులు దూష ఫలితాలు ఇవ్వకూడదు. ఎవరు ఏమి తినాలో ప్రభుత్వాలు చెప్పకూడదు. వ్యక్తుల అలవాట్లు, ఆచారాలు అందరూ గౌరవించాలి. ఇప్పటికే సమాజంలో వివిధ ఘటనలతో అసహనం పెరుగుతోంది. ఎస్సీ సబ్ ప్లాన్‌ విధులతో నాడు పులివెందు రోడ్డు వేసుకున్నారు" అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.





Related News