bjp party

సార్వత్రిక తంత్రం

Updated By ManamWed, 09/12/2018 - 00:55

image‘2019లో మేం గెలిచినట్లయితే, 50 ఏళ్ళ దాకా మేమే అధికారంలో ఉంటాం. మమ్మల్నెవ్వరూ తొలగించలేరు’ అని ఆదివారం నాడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్‌షా మాటలు దేశంలో నడుస్తున్న పాలనా స్వభావాన్ని, అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్న వైనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా షా ప్రజాస్వామిక ఆదర్శాలను మాట వరసకు కూడా ప్రస్తావించలేదు సరిగదా ఓటర్లను టక్కరితనంతో (జుమ్లాలతో) ఆకట్టుకోవడం ఉత్తమోత్తమమైనదిగా ఆయన మాటలు వెల్ల డిస్తున్నాయి. రాజకీయాలంటే అధికారంలోకి రావడం, అధికారాన్ని సుసి ్థరం చేసుకోవడం మినహా, ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ నాయ కులు కృషి చేయాలన్న భావనకు ఆయన ఆమడ దూరంలో ఉన్నారని ఆ ప్రసంగం తెలియజేస్తోంది. దివంగత ప్రధాని వాజ్‌పేయి సూచించిన మా ర్గంలో ప్రతికార్యకర్తా నడవాలని, ‘అజేయ్‌భారత్.. అటల్ బీజేపీ’ నినాదం తో ముందుకు పోనున్నామని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఎదిరించే రాజ కీయ పక్షమే లేదని, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ-షా ద్వయం మాటల్లో ఆత్మ విశ్వాసం కంటే అహంకారమే ప్రధానంగా ధ్వనిస్తోంది. 2019లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల వ్యూహం కోసం జరిగిన బీజేపీ జాతీయ బైఠక్ ఆద్యంతం మోదీ- షా ద్వయం చుట్టూతానే పరిభ్రమించింది. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు లేకుండానే నిర్వీర్యంగా ఉన్న ప్రతిపక్షాల కూటమితో తలపడుతున్నామనే అతి విశ్వాసం ఆ సమావేశంలో ప్రతిబింబించింది. నరేంద్ర మోదీ కేంద్రం గా అధ్యక్ష తరహా ఎన్నికల ప్రచార పర్వానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. అసంఘటితంగా, భిన్న భావజాలాలతో పొంతనలేని ఐక్యతతో కూడిన ప్రతిపక్షానికి, మోదీ ప్రజాదరణకు మధ్య ప్రధాన పోటీ నడుస్తున్నట్లు ఆ పార్టీ భావిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ పాలనా విశేషాలను వివరిస్తూ, అజేయమైన భారత నిర్మాణానికి, దృఢమైన బీజేపీని ఎంచుకోవాలన్న నినాదంతో ఓటర్ల ముందుకు వెళ్లాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. 

2014లో ‘వికాస్’ వేదికపై అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం ద్వారా దేశ సమాఖ్య నిర్మాణంపై తన పట్టును మరింత బిగించింది. 20 రాష్ట్రాల అసెంబ్లీలో, పార్లమెంట్‌లోనూ ఎన్డీఏ మెజారిటీలో ఉండడంతో రా బోయే ఎన్నికల్లో మోదీ అభివృద్ధి మంత్రం మళ్లీ పనిచేస్తుందన్న ఆశాభా వం ఆ సమావేశంలో బలంగా వ్యక్తమైంది. మోదీ పాలనలో అడుగంటిన అభివృద్ధి, హక్కుల హననం, విద్వేషకాండతో సమాజంలో నెలకొన్న అభ ద్రత కారణంగా ప్రజాదరణ రోజురోజుకు పడిపోతున్న వాస్తవాన్ని కప్పి పెట్టి ఆయనను తిరుగులేని నేతగా ప్రజల ముందుంచడానికి బీజేపీ ప్రయ త్నాలు మొదలుపెట్టింది. ఆయిల్ ధరలు భరించలేనంతగా పెరగడం, ఎన్న డూ లేనంతగా రూపాయి విలువ క్షీణించడం (డాలర్‌తో రూపాయి మార కం విలువ 72.23కు చేరుకోవడం), వ్యవసాయ సంక్షోభం తీవ్రతరం కావ డం (ఆరెస్సెస్ అనుబంధ సంఘం ‘భారతీయ కిసాన్ సంఘ్’ సైతం మోదీ ని విమర్శించింది), ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, పెద్దనోట్ల రద్దు, జీఎ స్టీ, ద్రవ్యరేట్ల సవరణలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, నేపాల్ సహా దౌత్య సంబంధాలు సంక్షోభంలో కూరుకుపోవడం, యూనివర్సిటీలు, వి ద్యా సంస్థల కాషాయీకరణపై నిరసనోద్యమాలు, అర్బన్ నక్సల్స్, దేశద్రో హులు పేరుతో మేధావులను, హక్కుల కార్యకర్తలపై దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో పారదర్శకత లోపించి, అనిల్ అంబానీ కంపెనీ ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొన్నట్లు విమర్శలు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరుల రూ.13వేల కోట్ల బ్యాంక్ స్కాం, అంతకుముందు విజయ్ మాల్యా, లలిత్ మోదీ తదితర ఆ ర్థిక నేరస్తులను దేశానికి రప్పించి న్యాయ విచారణ చేపట్టడంలో పక్షపాత ధోరణి, నల్ల కుబేరుల భరతం పడతామని ఎన్నికల జుమ్లాలు, సుప్రీం కో ర్టు తదితర న్యాయ వ్యవస్థలను తమకు అనుగుణంగా తీర్పులు ఇచ్చే వి ధంగా తెరవెనుక చర్యలు వెలుగులోకి రావడం, సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు ‘ప్రజాస్వామ్యం ప్రమాదం’లో పడిందని మీడియా కాన్ఫరెన్స్‌లో వి మర్శించడం తదితర లొసుగులను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందించడంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం విఫలమైంది.
 
నరేంద్ర మోదీ నాలుగున్నరేళ్ళ పాలనా కాలంలో ప్రజల ఆశలూ ఆవిర య్యాయి. ఏ ఒక్క రంగంలోనూ ఆశించిన మార్పు కనిపించడంలేదు. పారి శ్రామిక ఉత్పత్తి స్తంభించింది. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరు కుపోయింది. లక్షలాది అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి మార్గాలు అడు గంటాయి. సేవా రంగంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం మాంద్యంలో కూరుకుపోయింది. వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేసి మోదీ 50 పైగా విదేశీ పర్యటనలు చేసినా, అంతర్జాతీయ సంబంధాల్లో ఎలాంటి గణ నీయమైన ప్రగతిని సాధించలేదు. భౌగోళిక రాజకీయాల్లో చైనాతో పోటీ పడేందుకు అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయిల్‌తో ఆర్థిక, రక్షణ రంగా ల్లో బలమైన బంధాలను ఏర్పరచుకోవడంతో భారత్‌కు అదనంగా లాభిం చలేదు సరిగదా, దశాబ్దాలుగా పాటిస్తున్న ‘అలీన విధానానికి’ దూరం కావ డంతో అంతర్జాతీయంగా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. మోదీ విదేశాంగ విధానం చైనాకు లాభించింది. పర్యవసానంగా అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాదానికి భారత్ టార్గెట్ అవడంతో దేశ అంతరంగిక భద్రతకు ప్రమా దం ఏర్పడింది. ‘వ్యాపం’ నుంచి ‘రాఫెల్’ దాకా కుంభకోణాల్లో కాంగ్రెస్ ను బీజేపీ అధిగమించింది. అమిత్‌షా నుంచి గాలి జనార్ధన్‌రెడ్డి, సుష్మా స్వరాజ్ నుంచి పంకజ్ ముండే వరకు బీజేపీలో అవినీతి మకిలి అంటని నేతలున్నారా? బిర్లా సహారా డైరీలో సాక్షాత్తు ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే ప్రజలను మరోసారి ఎన్నికల జుమ్లాతో మ భ్యపెట్టేందుకు అటల్‌జీ పేరును బీజేపీ ముందుకు తీసుకొస్తోంది. మోది- షా ద్వయం అటల్‌జీ పట్ల ఇన్నాళ్లూ వ్యవహరించిన తీరు ప్రజలకు తెలియ దన్నట్లు వ్యవహరిస్తోంది. మోది ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, నిరంకుశ, ఆశ్రిత పక్షపాత విధానాల వల్ల ఏర్పడిన ప్రజావ్యతిరేకతను సంఘటితం చేసి అధికారంలోకి వచ్చే శక్తి సామర్థ్యాలు ప్రతిపక్షాలకు లేకపోవచ్చు. రోజు రోజుకూ దిగనాసిల్లుతున్న ప్రజల జీవన ప్రమాణాల పునాదిగా మోదీ ప్ర భుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ని ఏ మేరకు అజేయంగా నిలుపుతుందో సందేహమే!బీజేపీని ఛీ కొడుతున్నారు

Updated By ManamFri, 04/06/2018 - 12:26

అవిశ్వాసంపై చర్చ జరగకుండా..సభ వాయిదా వేసి పారిపోతారా?   
ఎంపీలే ఢిల్లీలో మన సైనికులు
రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ కావాలి
టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం

imageఅమరావతి: దేశంలో ‘విభజించి- పాలించు’ తరహాలో బీజేపీ పాలన కొనసాగిస్తోందని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీలా మొండిగా వ్యవహరించిన కాంగ్రెస్, రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రాల్లో విపక్షాల మధ్య చీలికలు తెచ్చి చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నారని, దేశం మొత్తం ఛీ కొట్టే రోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారు. మన ఎంపీల పోరాటాన్ని 5 కోట్లమంది ప్రజలు అభినందిస్తున్నారు. మన పోరాటంలో చిత్తశుద్ధి ఉంది. లక్ష్య సిద్ధి కోసం అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇది నా విధి, నా కర్తవ్యం, నా బాధ్యత అని ప్రతి ఒకరు భావించాలి. రాజ్యసభలో ఎంపీలు మెరుపు ధర్నాతో జాతీయస్థాయిలో ప్రకంపనలు సృష్టించారు. టీడీపీ ఎంపీల పోరాటం రాష్ట్రంలో పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది’’ అని చంద్రబాబు అన్నారు.

వాయిదా వేసుకుని పారిపోతారా..?
‘‘పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఒక స్ఫూర్తితో అమలు చేయాలనడం తప్పా..? పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నేరమా..? ఇన్నిరోజులు సభ వాయిదా వేసుకుని పారిపోతారా..?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ నిరంకుశ పోకడలపై మండిపడ్డారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడితే రాష్ట్రపతితో భేటీ కావాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వివరించాలని, నాలుగేళ్లుగా జరిగిన నష్టాన్ని తెలియజేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చాక 13 జిల్లాల్లో ఎింపీలు పర్యటనలు జరపాలని, బహిరంగ సభల ద్వారా చేసిన పోరాటంపై ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచించారు.  

వైసీపీ గైర్హాజరు మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం
మానవహారానికి వైసీపీ గైర్హాజరు కావడం.. బీజేపీతో ఆ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనటానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. ఐదుగురు లోక్ సభ సభ్యులచే రాజీనామా చేయించిన వైసీపీ, ఇద్దరు రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించదా? అని ప్రశ్నించారు. లోక్ సభ సభ్యులకో న్యాయం, రాజ్యసభ సభ్యులకో న్యాయమా..? అని నిలదీశారు. ఇప్పటిైకెనా వైసీపీ నాటకాలతో రాష్ట్రానికి నష్టం చేయకుండా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ పక్షాన ఉంటారా..? లేక ఏపీ ప్రజల పక్షాన ఉంటారో వైసీపీ తేల్చుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీ పక్షాన ఉండి చరిత్రహీనులుగా మారతారా..? పోరాడి తెలుగుజాతి గౌరవం నిలబెడతారా..? తేల్చుకోవాలన్నారు. ఎంపీలు రాజీనామా చేయడమంటే పోరాటం నుంచి పారిపోవడమేనని, కేంద్రంపై జరుగుతున్న పోరాటంలో ఎంపీలే మన సైనికులని చంద్రబాబు గుర్తుచేశారు.

Related News