Akun Sabharwal

వాహనదారులకు శుభవార్త

Updated By ManamTue, 08/28/2018 - 05:31
 • ఇంధనం కనిపించేవిధంగా పెట్రోల్ బంకు యజమానులకు,
  అధికారులకు గ్లాస్ పరికరాలు వినియోగం    

imageహైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ఇది శుభవార్తే. ఇకనుంచి ఇందనం కనిపించెవిదంగా పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు గ్లాస్ పరికరాలు వినియోగించనున్నారు. తనిఖీలప్పుడు.. పారదర్శకత జవాబుదారీపై తూకంలో 5 లీటర్ల జార్‌తో నాణ్యత పరీక్షలు చూపాలని తెలంగాణ తూనికలు కోలతలు శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్  స్పష్టంచేశారు. నాణ్యతలో పారదర్శకతే లక్ష ్యంగా..ఇందన తూకానికి. .ప్రత్యేకంగా రూపొందించిన 5 లీటర్ల గ్లాస్ జార్‌ను త్వరలో తెలంగాణలో వినియోగంలోకి రానుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ కొలతల్లో నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకంగా ఉండేలా తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. తనిఖీల సమయంలో వినియోగదారులకు, పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు స్పష్టంగా కనిపించే విధంగా గ్లాస్‌తో చేసిన పరికరాన్ని అందుబాటులోకి తెస్తోంది.

తనిఖీలో పారదర్శకతను, జవాబు దారీతనాన్ని పెంపొందించేందుకు, తూకం, నాణ్యతలను తనిఖీ చేయడానికి గ్లాస్తో తయారు చేసిన 5 లీటర్ల జార్ను ప్రవేశపెడుతోంది. నాణ్యత, తూకం పరీక్షలు చేసేందుకు ప్రస్తుతం రాగితో చేసిన 5 లీటర్ల జార్ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ జార్లో టెంపరేచర్, హ్యాండ్లింగ్ల వల్ల తనిఖీల సమయంలో వేరియేషన్ (సరైన తూకం) కొన్ని సందర్భాల్లో తేడా వస్తోంది. కొత్తగా గ్లాస్‌తో చేసిన ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ పెట్రోలియం గ్లాస్ జార్‌తో వంద శాతం తూకంతో ఏ మాత్రం తేడా ఆస్కారం ఉండదు. ఈ గ్లాస్ జార్ నాణ్యమైన యుఎస్పి టైప్ క్లాస్-ఎతో తయారు చేబడింది. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడడంతో పాటు సరైన తూకాన్ని సూచిస్తుంది.

 అలాగే ఈ జార్లో ఎలాంటి మాన్యుపులేషన్ చేయడానికి అవకాశం ఉండదు. గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలతో సోమవారం పౌరసరఫరాల భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ నూతన పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ నూతన యంత్రాలను ఆయా పెట్రోల్ బంక్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని కంట్రోలర్ సూచించారు. అయితే, వీటికి తూనికల కొలతల శాఖ అధికారుల నుంచి కచ్చితంగా ధృవీకరణ పత్రం పొందవలసి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజివ్ అమరం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, హెచ్‌పీసీఎల్ డిజిఎం (రిటేల్) రాజేశ్, బీపీసీఎల్ మేనేజర్ టి. శ్రావణ్ పాల్గొన్నారు. రేషన్ డీలర్లకు బకాయిల చెల్లింపు 

Updated By ManamSun, 08/26/2018 - 01:20
 • కమిషన్‌ను రూ. 20 నుండి రూ. 70కు పెంచిన సర్కార్

 • బకాయిల చెక్కులను అందచేసిన పౌర సరఫరాల శాఖ 

imageహైదరాబాద్ : తెలంగాణలో రేషన్ డీలర్లకు ఇటివల పెంచిన కమిషన్‌ను.. పాత బకాయిలను చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారికి ఈ చెక్కులను 15 ప్రభుత్వ పనిదినాల్లో డీలర్లకు అందజేయాలని సివిల్ సఫ్లై శాఖ నిర్ణయించింది. గతంలో ఉన్న డీలర్ల కమిషన్‌ను క్వింటాల్‌కు రూ. 20 నుండి రూ. 70కు పెంచింది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2015 అక్టోబర్ 1 నుండి రాష్ట్రంలో అమల్లోకి వచ్చినప్పటి నుండి 2018 ఆగస్టు 31 తేదీ వరకు ఉన్న బకాయిలను చెల్లించాలని ఉత్త్వర్వులు జారీచేసింది. పాత బకాయిలను త్వరితగతిన రేషన్ డీలర్లకు చెల్లించాలన్న అంశంపై శనివారం నాడు పౌరసరఫరాల శాఖ భవన్‌లో ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్ని జిల్లాల పౌరసరఫరాల అధికారులు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్లతో సమీక్షించారు. రాష్ట్రంలో 17,029 రేషన్ డీలర్లు ఉన్నారని, జిల్లాల వారీగా డీలర్ల జాబితాను సేకరించి, ఏయే డీలర్‌కు ఎంత బకాయిలు చెల్లించాలనే ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి జిల్లాలకు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో పాత బకాయిలను రేషన్ డీలర్లకు చెక్కుల ద్వారా అందించాలని అన్నారు. ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1026 రేషన్ షాపులు, అలాగే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీల్లో 1626 రేషన్ షాపులు, క్రమబద్ధీకరించిన 227 రేషన్ షాపులు, మొత్తం 2879 రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్లను సంప్రదించి గైడ్లైన్స్ ప్రకారం షాపుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఆహార భద్రతా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారికి కార్డులను జారీచేయాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, కరీంనగర్, వికారాబాద్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. థియేటర్లలో అధిక ధరలకు కళ్ళెం

Updated By ManamMon, 07/30/2018 - 04:26
 • ఆగస్టు 1 నుండి కొత్త నిబంధనలు

 • ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష

 • తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరిక

imageహైదరాబాద్:  ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా హాళ్ళు, మల్టీప్లెక్స్ ధియేటర్లలో మంచినీళ్ళు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలను కేవలం ఎంఆర్‌పి ధర ప్రకారం అమ్మవలసి ఉంటుంది. దీనికి విరుధ్ధంగా ధరలు పెంచి అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని తూనికలు కొలతల శాఖ కంట్రొలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. తినుబండారాలు,పానీయాలకు సంబంధించి ధర,పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో ఖచ్చితంగా నమోదుచేయాలని ఆయన స్పష్టం చేసారు. గత కొంతకాలంగా ప్రేక్షకులనుండి అధిక ధరల గురించి లీగల్ మోట్రోలజీ శాఖకు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో  వీటికి అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

దీనిపై ఇప్పటికే థియేటర్ యజమానులకు అవగాహన కల్పించింది. ఆగస్టు 1 నుండి  కొత్త నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని సమావేశంలో అధికారులను కంట్రోలర్ ఆదేశించారు. ఈ మేరకు గాం దీనగర్‌లోని తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్‌లు, ఇన్‌స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు 1 నుండి స్టిక్కర్ బదులు ప్యాకెట్లపై ఎంఆర్‌పి, పరిమాణం, బరువు ఖచ్చితంగా ముద్రించి ఉండాలని అకున్ హెచ్చరించారు. ధరలో తేడాలుంటే ఎప్పటికప్పుడు మార్పులు,చేర్పులు చేయాలని, ప్యాకేజ్డి రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి వివరాలు, కస్టమర్ కేర్ వివరాలు ముద్రించి ఉండాలని ఆయన తెలిపారు.

ఈ నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తామని తరువాత 4, 5 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తామని అకున్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదుచేసి రూ 25000, రెండోసారి రూ 50000, మూడోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు, 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.రైతు సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

Updated By ManamFri, 07/27/2018 - 22:40
 • విత్తన విక్రయాల్లో అవినీతిపై కఠిన చర్యలు

 • తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ ఆకున్ సబర్వాల్

akunహైదరాబాద్: రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఆకున్ సబర్వాల్ అన్నారు. తూనికల, కొలతల శాఖ నిబంధనలపై విత్తన ఉత్పత్తిదారులకు  తెలంగాణ సీడ్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆకున్ సబర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత, ప్రమాణాలు కలిగిన విత్తనాలను సరైన తూకంలో రైతులకు అందించడం ద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించినట్టు అవుతుందన్నారు. విత్తనాల నాణ్యతా, తూకంలో ఏమాత్రం రాజీ పడొద్దని విత్తన కంపెనీ యాజమాన్యాలకు కంట్రోలర్ విజ్ఞప్తి చేశారు.

విత్తనాల విక్రయంలో అక్రమాలకు పాల్పడుతూ తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో తూనికల కొలతల శాఖ మే నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిందన్నారు. ఈ తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.  విత్తన కంపెనీల విజ్ఞప్తి మేరకు తూనికల కొలతల శాఖ నిబంధనలు పాటించడానికి వారికి కొంత సమయం ఇచ్చామని చెప్పారు.  విత్తన ఉత్పత్తిదారులు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

రైతులకు విక్రయించే విత్తనాల విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని విత్తనాల వ్యాపారులకు సూచించారు. రైతులకు విక్రయించే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీడ్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్. జగదీశ్వర్, నిరంజన్, మల్లారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.అవినితి, అక్రమాలపై ఉక్కుపాదం

Updated By ManamFri, 06/15/2018 - 01:39
 • వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం.. సమచార సలహా, సహాయ కేంద్రం ప్రారంభం

 • ఫిర్యాదుల స్వీకరణకు కొత్త టోల్ ఫ్రీ నంబర్.. ఫేస్‌బుక్, ట్విటర్ హ్యాండిల్స్ ప్రారంభం

 • తెల్లకాగితంపై రాసిచ్చినా ఫిర్యాదు స్వీకరిస్తాం.. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్  

AKUNహైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాల నివారణకు రాష్ట్ర పౌర సరఫరాలు,  తూనికలు కొలతలు, వినియోగదారుల సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. సరుకులు నాణ్యత, తూనికలు కొలతల్లో మోసాలుపై వినియోగదారులు నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సమాచార సలహా, సహాయ కేంద్రాన్ని తూనికలు కొలతలు, వినియోగదారుల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ గురువారం ప్రారంభించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే టోల్‌ఫ్రీ నెంబర్ ఉండగా, ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విటర్ హ్యాండిల్‌ను గురువారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమచార సలహా, సహాయ కేంద్రం వినియోగదారులతో సంభాషణకు, చర్చించడానికి చట్టబద్ధేతర వినియోగాదరుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వినియోగదారుల వివాదం పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో సమస్య రాసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇది పూర్తిగా ఉచితం. న్యాయవాదుల ఫీజులు, ఏ ఖర్చులుండవన్నారు. సక్రమంగా ఉన్న అన్ని ఫిర్యాదులను తాము పరిశీలించిన తర్వాత... ప్రతివాదుల సంజాయిషికి మూడు వారాల కాలపరిమితితో నోటిసులు జారీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో.. ప్రతి శనివారం ఇప్పటికే కౌన్సిలింగ్  నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి సమాధానాన్ని బట్టి..ఇరుపక్షాలను ఒక నిర్ణీత తేదీన కేంద్రానికి పిలిపించి వాది, ప్రతివాదులను నేరుగా వారివారి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారని చెప్పారు. పరిష్కారం కాని కేసులను మూడు కౌన్సెలింగ్‌ల తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరంలో చట్టబద్ధంగా పరిష్కరించుకోవడానికి సూచించబడతాయన్నారు. గత నెల రోజుల్లో తూనికల కొలతల శాఖ మల్టిఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, విత్తన కంపెనీలు, ఎరువుల కంపెనీలు వివిధ వ్యాపార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు జరిపామన్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న 600 షాపులు, మాల్స్, స్టోర్స్‌లపై కేసులు నమోదు చేసి రూ. 12 కోట్లకు పైగా వస్తువులను సీజ్ చేసినట్లు ఆకున్ సబర్వాల్ వెల్లడించారు. వినియోగదారుల ఫిర్యాదులపై వినియోగదారుల సమచార సలహా, సహాయ కేంద్రం, తూనికల కొలతల శాఖలు ఎప్పటికప్పుడూ కలిసి పనిచేస్తాయని తెలిపారు.

టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభం..
వినియోగాదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1800 425 00333 టోల్‌ఫ్రీ నంబర్‌ను అకున్ సబర్వాల్ ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో కన్జ్యూమర్ ఇన్ఫమర్‌వెుషన్ రిడ్రెస్సెల్ సెంటర్, ట్విటర్‌లో తెలంగాణ కన్జూమర్ ఇన్ఫో అండ్ రిడ్రెసల్ సెంటర్‌లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. అంతేకాక  కన్జూమర్ అడ్వైస్.ఇన్ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని కమిషనర్ సబర్వాల్ సూచించారు. 

వినియోగదారుల ఫోరం ద్వారా 2 లక్షల పరిహారం
హైదరాబాద్, మణికొండకు చెందిన లక్ష్మికాంత్ భార్య రాజ్యలక్ష్మి మెడ్ క్వెస్ట్ స్కానింగ్ సెంటర్‌లో తిఫ్ఫా టెస్ట్ చేయించుకున్నారు. ఐదు నెలలు గర్భస్థ శిశువు వెన్నులో సమస్య ఉన్నా అక్కడి నిర్వాహకులు గుర్తించలేదు. రాజ్యలక్ష్మి ఆడపిల్లను ప్రసవించగా, శిశువుకు వెన్నులో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో బిడ్డను తీసుకొని లక్ష్మికాంత్ వైద్యం కోసం హైదరాబాద్‌లోని పలు హాస్పిటల్స్ తిరిగారు. స్కానింగ్ సమయంలో నిర్లక్ష్యం వల్ల చిన్నారికి శస్త్ర చికిత్స అవసరమైందని, ఇందుకుగాను రూ. 2 లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయుంచుకున్నారు. చిన్నారికి మరికొంత కాలం వైద్యం చేయుంచుకోవాలని డాక్టర్లు చెప్పారు.

రైతుకు ప్రతి పైసా చెల్లించాం
ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వందశాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రతి పైసా ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాలో నేరుగా జమ చేశామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రబీలో 3313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుండి 35.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5601.97 కోట్లుండగా...ఈ నిధులను ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల సంస్థ అన్ని జిల్లాలకు విడుదల చేసింది. దీనికి సంబందించిన రూ.349 కోట్లను తెలంగాణలోని ఆయా జిల్లాలకు విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. దీంతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వంద శాతం నిధుల విడుదల పూర్తయ్యినట్లు చెప్పారు. రూ. 349 కోట్లు కూడా బ్యాంకులు పనిదినాల్లో ఒకటి, రెండు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. పండుగను దృష్టిలో పెట్టుకొని రైతులకు చెల్లింపులతో పాటు హమాలీ, రవాణా, గన్నీ సంచులకు సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రతి పైసా కూడా చెల్లించావున్నారు. ఎక్కడా కూడా దళారులకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి కనీస మద్ధతు ధర చెల్లింపులను జమ చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. తెలంగాణలో ఎ పౌరసరఫరాల సంస్థ దగ్గర కూడా నిధుల సమస్య లేదన్నారు. డ్రగ్స్ కేసు: ముగ్గురిపై ఛార్జ్‌షీట్

Updated By ManamSat, 04/07/2018 - 08:29

Drugs హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో దర్యాప్తు సంస్థ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. అందులో ముగ్గురు సినీ ప్రముఖులపై అభియోగాలను నమోదు చేసింది ఎక్సెజ్ సిట్. ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు డ్రగ్స్ వాడుతున్నట్లు సిట్ తన నివేదికలో తెలిపింది. 

ఇక ఈ విషయంపై మాట్లాడిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్.. డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులపై ఛార్జ్‌షీట్ వేశామని, ఇంకా మరికొందరి ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉందని అన్నారు. నివేదిక వచ్చిన తరువాత మరికొందరిపై కూడా ఛార్జ్‌షీట్ వేస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. అయితే ఆ ముగ్గురి పేర్లు మాత్రం వెల్లడించలేదు.

Related News