YS Rajashekar reddy

వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు

Updated By ManamTue, 11/13/2018 - 14:50
Yanamala ramakrishnudu

రాజమండ్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలో అందరూ క్రిమినల్సేనంటూ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ..‘వైఎస్ జగన్‌ను ప్రజలే కాపాడుకోవాలని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ చెప్పడం హాస్యాస్పదం.

రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కుటుంబాన్ని ఎందుకు కాపాడాలి?. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారు. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెరగకుండా చేసింది జగనే. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ...జగన్‌ కానీ, పవన్ కల్యాణ్ గానీ ఒక్కమాట అనడం లేదు. ఈ ముగ్గురి కలయికకు ఇదే నిదర్శనం?’ అని అన్నారు.కాంగ్రెస్‌కు షాక్.. జనసేనలోకి మాజీ మంత్రి

Updated By ManamFri, 11/09/2018 - 19:24

Pasupulati Balaraju, Congress, Rahul Gandhi, Ys Rajashekar Reddy, Roshaiah, Resign letterవిశాఖ: కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ప్రస్తుతం బాలరాజు.. విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించే అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాలరాజు పనిచేశారు. మండల స్థాయి నేతగా తన 25వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీ తరపున ఎన్నో సేవలు చేశారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన బాలరాజు...జనసేన పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, బాలరాజు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కారణాలు తెలియలేదు. నీ కన్నుల్లో కొలిమై రగిలే..

Updated By ManamSun, 09/02/2018 - 10:14
  • వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ‘యాత్ర’ సాంగ్ లిరిక్స్ విడుదల..

A tribute to DYSR on his death anniversary, First single from Yatra

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘యాత్ర’  చిత్రంలోని పూర్తి పాట లిరిక్స్‌ను ఆ చిత్ర యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా... ఆయనపై రూపొందుతున్న యాత్ర బయోపిక్...పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.  ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ ...వేలాదిమంది వెంటరాగా మహానేత పాదయాత్ర చేస్తున్న దృశ్యాలు ఈ పాటలో కనిపిస్తోంది. 

లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్‌ఆర్ పాత్ర పోషిస్తుండగా, మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఈ బయోపిక్‌‌ను విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ను నిర్మిస్తున్నారు.  ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.వైఎస్‌గా మమ్ముట్టి ఫస్ట్ లుక్..

Updated By ManamSat, 04/07/2018 - 14:35
YS Rajashekar reddy, YSR, First look release, Yatra movie, YSR Biopic, Mammootty

దర్శకుడు మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌‌‌కు సంబంధించి ఫస్ట్ లుక్‌ విడుదల అయింది. రీల్ లైఫ్ వైఎస్సార్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నెల 9 నుంచి మొదలుకానుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’.. అన్న సందేశంతో థీమ్‌ లోగోను వదిలారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు సంబంధించిన విషయాలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 

Related News