YSR Biopic

ఆయనలా మరెవ్వరూ చేయలేరు

Updated By ManamThu, 11/01/2018 - 00:49

imageదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘యాత్ర’. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మిస్తున్న చిత్రాన్ని మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మహి మమ్ముట్టికి కృతజ్ఞతలు తెలియుజేస్తూ ఓ లెటర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘390 సినిమాలు.. 3 జాతీయ అవార్డులు, 60 మంది కొత్త దర్శకులతో పనిచేసిన అనుభవం. వీటన్నింటే మమ్ముట్టిగారు అద్భుతైమెన వ్యక్తి. గొప్ప మార్గదర్శకుడు. ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.

మన అతిథిని గౌరవించడం మన సంప్రదాయం. యాత్ర స్క్రిప్ట్‌ను తెలుగు విన్న గొప్ప నటుడు. ప్రతి పదానికి అర్థం తెలుసుకుని.. తన భాషలో రాసుకుని సెట్స్‌లో అద్భుతంగా పలికారు. చక్కగా డబ్బింగ్ ను చెప్పారు. మన భాషను సంప్రదాయాన్ని ప్రేమిస్తారు. నా గుండెపై చేయి వేసుకుని చెబుతున్నా రాజశేఖర్‌రెడ్డిగారిలా ఆయన పాత్రలో జీవించినట్లు మరే నటుడూ చేయులే డు. అద్భుతైమెన వ్యక్తి యాత్రలో నటించినందుకు ఎప్పుడూ ఆయునకు రుణపడి ఉంటాను’’ అన్నారు మహి.వి.రాఘవ్. ప్రస్తుతం ‘యాత్ర’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 21న వై.ఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. వై.ఎస్.జగన్ పాత్ర లేదా ...?

Updated By ManamTue, 10/09/2018 - 07:30

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో పోచంపల్లిలో జరుగుతుంది. పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. వై.ఎస్.ఆర్ పాత్రధారి మమ్ముట్టి, సబిత ఇంద్రారెడ్డి పాత్రధారి సుహాసిని కొంత మంది వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

image


అలాగే ఓ పాటలో బ్యాగ్రౌండ్  స్కోర్‌తో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వై.ఎస్.ఆర్ తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. ఇంతకు ముందు వై.ఎస్.జగన్ పాత్రలో సూర్య లేదా కార్తి నటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యాత్ర చిత్రంలో వై.ఎస్.జగన్ పాత్ర ఉండదట. కృష్ణ కుమార్ సంగీతం, సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది. మహి వి.రాఘవ్ దర్శకుడు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలు. నీ కన్నుల్లో కొలిమై రగిలే..

Updated By ManamSun, 09/02/2018 - 10:14
  • వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ‘యాత్ర’ సాంగ్ లిరిక్స్ విడుదల..

A tribute to DYSR on his death anniversary, First single from Yatra

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘యాత్ర’  చిత్రంలోని పూర్తి పాట లిరిక్స్‌ను ఆ చిత్ర యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా... ఆయనపై రూపొందుతున్న యాత్ర బయోపిక్...పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.  ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ ...వేలాదిమంది వెంటరాగా మహానేత పాదయాత్ర చేస్తున్న దృశ్యాలు ఈ పాటలో కనిపిస్తోంది. 

లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్‌ఆర్ పాత్ర పోషిస్తుండగా, మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఈ బయోపిక్‌‌ను విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ను నిర్మిస్తున్నారు.  ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.స‌బితా ఇంద్రారెడ్డిగా సుహాసిని!

Updated By ManamSat, 06/16/2018 - 12:14
  • హోం మినిష్టర్ పాత్ర‌లో సుహాసిని

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. హోం మినిష్ట‌ర్‌గా  సబితా ఇంద్రారెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స‌బితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ను 'యాత్ర' పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ స్టార్‌ మమ్ముట్టి ఇందులో వైఎస్ఆర్‌గా కనిపిస్తారు.

Suhasini

ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తారని వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఈ సినిమాలో కొన్ని పాత్రలకు సంబంధించి పలానా నటులు నటిస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ పాత్రలో సూర్య లేదా కార్తి, వైఎస్ భారతిగా కీర్తి సురేశ్‌, షర్మిల పాత్రలో భూమిక, సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఇప్పుడు సుహాసిని పేరు వీటికి తోడైంది. మరి దీనిపై యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.వైఎస్‌గా మమ్ముట్టి ఫస్ట్ లుక్..

Updated By ManamSat, 04/07/2018 - 14:35
YS Rajashekar reddy, YSR, First look release, Yatra movie, YSR Biopic, Mammootty

దర్శకుడు మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌‌‌కు సంబంధించి ఫస్ట్ లుక్‌ విడుదల అయింది. రీల్ లైఫ్ వైఎస్సార్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నెల 9 నుంచి మొదలుకానుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’.. అన్న సందేశంతో థీమ్‌ లోగోను వదిలారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు సంబంధించిన విషయాలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 

Related News