sudheer babu

కొడుకో.. కూతురో పుట్టినట్లు అనిపిస్తుంది - సుధీర్‌బాబు

Updated By ManamWed, 09/19/2018 - 20:01
nannu dochukundhuvate

సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసి నన్నుదోచుకుందువటే అనే టైటిల్ పెట్టాడంటే.  డైరెక్టర్ స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘సమ్మోహనం’ సినిమాలో సుధీర్ పెర్‌పార్మెన్స్‌కు ఫ్యాన్ అయ్యాను. అజనీష్ ట్యూన్ సెన్స్ బావుంది. సురేశ్ ఫోటోగ్రఫీ కాంటెంపరరీగా ఉంది. నభా నటేశ్ చాలా ఎక్స్‌ప్రెసివ్ హీరోయిన్.

    సుధీర్ ప్యాషన్‌తోనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే ప్యాషన్ తనను ఇంకా ముందుకు తీసుకెళుతుంది’’ అన్నారు. ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘నేను చేసిన పదిహేను నిమిషాల షార్ట్‌ఫిలిం చూసి నచ్చడంతో సుధీర్‌బాబుగారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. నభా నటేశ్ ఎనర్జిటిక్ గర్ల్. మంచి పెర్ఫామర్. అందరూ చక్కగా సపోర్ట్ చేశారు’’ అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘మా ప్రొడక్షన్‌లో తొలి సినిమా. ఆర్.నాయుడుగారు కథ చెప్పినప్పుడు హీరో సుధీర్‌తో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌కి కూడా కథ బాగా నచ్చేసింది. నభా నటేశ్ చాలా మంచి నటి. హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం అంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. బాగాఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది’’ అన్నారు. 
 అమెరికా వెళ్లే ప్రతోడి మీద అమ్మాయిలకు ఇష్టం ఉండదు

Updated By ManamTue, 09/11/2018 - 11:53

Nannu Dochukunduvate‘సమ్మోహనం’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు.. త్వరలో ‘నన్ను దోచుకుందువటే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కామెడీ, యాక్షన్ మిళితమై వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. కాగా ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నబా నటేషి నటించగా.. నాజర్, షణ్ముక, వర్షిణి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ నిర్మించగా.. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ప్రారంభం

Updated By ManamSat, 08/18/2018 - 02:19

imageసుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వి.వి.వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ హాజరయ్యారు. సుధీర్‌బాబు, మెహరీన్‌లపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టారు. పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. పులి వాసు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేష్ వికె, పోసాని, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాని రిజ్వాన్  ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.వినాయక చవితికి...

Updated By ManamThu, 07/26/2018 - 20:54

Nannu-Dochukunduvateసుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రం ‘నన్నుదోచుకుందవటే’. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. అందరినీ భయపెట్టే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్‌గా సుధీర్‌బాబు నటించగా..  అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ నటించింది. ఒక్క పాట మినహా సినిమా పూర్తయింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అన్నికార్యక్రమాలు పూర్తిచేసి వినాయచవితి పర్వదినాన సెప్టెంబర్ 13న విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరై జేషన్స్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఒక్క సాంగ్ మినహా ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేశాం. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగు తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం’ అన్నారు. సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సినిమాని అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.  అని అన్నారు.‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamMon, 07/16/2018 - 11:46

sUDHEER BABU సుధీర్ బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా ఆర్‌.ఎస్ నాయుడు తెరకెక్కించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకోగా.. ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ చిత్రం నాజర్, తులసీ, హర్ష, వేణు తదితరులు నటించారు. సుధీర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సుధీర్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీశ్ సంగీతం అందించాడు.ఆకట్టుకుంటున్న ‘నన్ను దోచుకుందువటే’ టీజర్ 

Updated By ManamSat, 07/14/2018 - 11:24

ND సుధీర్ బాబు హీరోగా ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నబా నటేశ్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతుంది. ఇప్పటికే పోస్టర్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు కంపెనీ మేనేజర్‌గా, నభా నటేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనుంది. సుధీర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి అజనీశ్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.‘నన్ను దోచుకుందువటే’ టీజర్‌ ఎప్పుడంటే..!

Updated By ManamWed, 07/11/2018 - 13:01
Sudheer Babu

‘సమ్మోహనం’తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందువటే అనే చిత్రంలో నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా.. త్వరలో టీజర్‌ను విడుదల చేయనున్నారు. జూలై 14న ఈ చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో సుధీర్ బాబు సరసన నభా నటేశ్ పరిచయం అవుతండగా.. నాజర్, తులసి, వేణు, రవి వర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుధీర్ బాబునే నిర్మిస్తండగా ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీష్ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.కొంచెం లేటుగా చూశా.. సినిమా నచ్చింది: రాజమౌళి

Updated By ManamFri, 06/29/2018 - 13:18

Rajamouli, sammohanam గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్‌పై కసరత్తులు చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలో సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రాన్ని చూసి, మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు.

కొంచెం ఆలస్యంగా సమ్మోనం చూశారు. అదితీ రావు నటన చాలా బావుంది. సుధీర్ బాబు బాగా నటించారు. సీనియర్ యాక్టర్ నరేశ్ నవ్వించారు. టీం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ ఆయన కామెంట్ పెట్టారు. కాగా గత ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

 ‘నన్నుదోచుకుందువటే’ ఫస్ట్ లుక్

Updated By ManamFri, 06/29/2018 - 12:08

Nannu dochukunduvate‘స‌మ్మెహ‌నం’తో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్‌లో హీరోగా చేస్తున్నాడు. ఆర్‌.ఎస్.నాయుడు అనే కొత్త వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నాడు సుధీర్. ఈ చిత్రానికి ‘నన్ను దోచుకుందువ‌టే’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తాజాగా ఫస్ట్‌లుక్ విడుదలైంది. హీరో, హీరోయిన్‌లను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన ఫస్ట్‌లుక్ అందిరినీ ఆకట్టుకుంటోంది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నభ నతేశ్ నటిస్తుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్త‌యింది. త్వరలోనే మిగ‌తా వివ‌రాలను చెబుతామని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపాడు. ఇక ఈ చిత్రంలో నాజర్, తులసి, రవి వర్మ, జీవా, వర్షిణి సౌందర్ రాజన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తుండగా.. అజనీష్ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.స‌మ్మోహ‌నమే...

Updated By ManamFri, 06/15/2018 - 12:50

బ్యాన‌ర్‌: శ్రీదేవి మూవీస్‌
న‌టీన‌టులు:  సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, , త‌నికెళ్ల భ‌ర‌ణి,  నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
మ్యూజిక్‌:  వివేక్ సాగ‌ర్‌
కెమ‌రా: పి.జి.విందా
నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణప్రసాద్‌
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ

వైవిధ్యమైన క‌థల‌తో సినిమాలు చేస్తూ ఎక్కడా అస‌భ్యత‌, అశ్లీల‌త‌కు తావు లేకుండా.. విడ‌మ‌రిచి విష‌యాల‌ను చెప్పే దర్శకుల్లో మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ఒక‌రు. ఆయ‌న దర్శక‌త్వంలో వ‌చ్చిన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ స‌మ్మోహ‌నం. సుధీర్‌బాబు, అదితిరావు న‌టించిన ఈ చిత్రం కాన్సెప్ట్ ముందుగానే రివీల్ చేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి హీరో.. స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌లోని హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌.. ఎలా పుట్టింది? ఎందుకు విడిపోయారు? ఎలా కలుసుకున్నార‌నేదే క‌థ‌?  కానీ ఈ అంశాల‌కు నేటి సినిమా ప‌రిస్థితుల‌ను మ్యాచ్ చేస్తూ.. సినిమాపై జనాల్లో చాలా మందికి ఉన్న అభిప్రాయం త‌ప్పు.. అనే భావ‌న విశ్లేషిస్తూ చేసిన స‌మ్మోహ‌నం ప్రేక్షకుల‌ను మెప్పించిందా?  లేదో తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో తెలుసుకుందాం..

Sammohanam movie review

క‌థ‌:
చిల్డ్రన్ ఇల్లస్టేట‌ర్ అయిన విజ‌య్ కుమార్‌(సుధీర్ బాబు)కి సినిమా వాళ్లంటే పెద్దగా ఇష్టముండ‌దు. వారికి క‌ళంటే గౌర‌వం ఉండ‌ద‌ని.. వారి చేసేవ‌న్నీ న‌ట‌నేన‌ని అభిప్రాయంలో ఉంటాడు. అయితే విజ‌య్ తండ్రి శ‌ర్వా(సీనియర్ న‌రేశ్‌)  ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు యాక్టర్ కావాల‌నుకుని ప‌రిస్థితుల ప్రభావంతో న‌టుడు కాలేక‌పోతాడు. ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన త‌ర్వాత సినిమాల్లో రాణించాల‌ని అనుకుంటాడు. అందు కోసం అవ‌కాశాల‌ను వెతుక్కుంటూ ఉంటాడు. త‌న‌కు ఓ సినిమాలో చిన న‌టుడిగా వేషం ఇస్తానన‌డంతో త‌న ఇంటినే సినిమా కోసం వాడుకోమ‌ని అంటాడు. ముందు విజ‌య్‌కి అది న‌చ్చక‌పోయినా, తండ్రి కోసం ఊరుకుంటాడు.

ఆ  సినిమాలో హీరోయిన్ స‌మీరా రాథోడ్‌(అదితిరావు హైద‌రి) చాలా ఫేమ‌స్‌. విజ‌య్‌తో స‌మీరాకు షూటింగ్ స‌మ‌యంలో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డ‌తారు. స‌మీర కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌న ప్రేమ‌ను చెప్పదు..స‌రిక‌దా! విజ‌య్ ఐల‌వ్‌యు చెబితే త‌న‌కు ఎలాంటి అభిప్రాయం లేద‌ని చెప్పేస్తుంది. దాంతో విజ‌య్ బాధ‌ప‌డ‌తాడు. ఇద్దరి మ‌ధ్య దూరం పెరుగుతుంది. చివ‌ర‌కు ఇద్దరూ ఎలా క‌లుసుకున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
శివ‌లెంక కృష్ణప్రసాద్ నిర్మాత‌గా మోహ‌న్‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో సినిమా అన‌గానే అంద‌రికీ `జెంటిల్‌మ‌న్‌` గుర్తుకొస్తుంది. నాని ద్విపాత్రాభిన‌యం చేసిన ఆ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్‌ని అందుకుంది. ఆ పాజిటివిటీతో ప్రారంభ‌మైన చిత్రం `స‌మ్మోహ‌నం`. సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రీ కాంబినేష‌న్ అన‌గానే కొత్త‌గా అనిపించింది. దానికి తోడు హైద‌రాబాదీ అమ్మాయి అదితీరావు తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఫ‌స్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఎక్కడా ఒక్క సెక‌ను కూడా వేస్ట్ కాకుండా క‌థ‌లో ద‌ర్శకుడు చొప్పించిన విధానం బావుంది. టైటిల్స్ కార్డ్స్ ప‌డ‌టం నుంచి ఆఖ‌రున త‌నికెళ్ల భ‌ర‌ణి చ‌దివే `తార‌లు దిగివ‌చ్చిన వేళ‌` క‌థ వ‌ర‌కు అంతా క‌థ‌లో భాగంగా చెప్పడం ఆక‌ట్టుకుంది. సుధీర్‌బాబు మేకోవ‌ర్ అయ్యారు. గ‌త చిత్రాల క‌న్నా ఇందులో హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నారు. అదితిరావు హైద‌రీ త‌న పాత్ర అవ‌స‌రార్థం మేర‌కు చ‌క్కగా న‌టించారు.

సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కాదంబ‌రి కిర‌ణ్‌... ఒక‌రేంటి సినిమాలో పాత్రల‌న్నీ త‌మ ప‌రిధి మేర‌కు క‌నువిందు చేశాయి. లొకేష‌న్లు, ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్‌, కాస్ట్యూమ్స్ బావున్నాయి. తెలుగు సినిమాల్లో తెలుగు న‌టీన‌టులు క‌రువైపోయార‌నే విష‌యాన్ని మాట‌ల్లో చ‌క్క‌గా చూపించారు. హ‌రితేజ చివ‌ర్లో చెప్పే డైలాగులు సానుకూలంగా స్పందించేలా ఉంటాయి. పాత్రల మ‌న‌స్తత్వాల‌ను కూడా పోట్రెయిట్ చేయ‌గ‌లిగారు ద‌ర్శకుడు. స‌ర‌దాగా సాగిపోయే సినిమాలో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ పంటికింద రాయిలా త‌గులుతుంది. ఇగో కార‌ణంగా రిలేష‌న్‌షిప్ బ్రేక‌ప్ కావ‌డం అనేది రొటీన్‌గా అనిపిస్తుంది.

అది మిన‌హా తెలుగుకు సంబంధించిన డైలాగుల‌న్నీ బావున్నాయి. వెలుగుకి నీడ ఉంటుంద‌న్నట్టు.. తెలుగు గురించి మాట్లాడిన ఈ స్క్రిప్ట్ లో ఇంగ్లిష్ డైలాగులు బోలెడ‌న్ని ఉండ‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. సీనియ‌ర్ న‌రేశ్ ఫ్రస్ట్రేష‌న్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబ‌ర్స్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశం సినిమాకు హైలైట్ అవుతుంది. క్లాస్ ప్రేక్షకుల‌కు న‌చ్చే ఈ సినిమాలో మాస్ డైర‌క్టర్ హ‌రీశ్ శంక‌ర్ కూడా క‌నిపించారు. ద‌ర్శకులు త‌రుణ్ భాస్కర్‌, అవ‌స‌రాల శ్రీనివాస్, నిర్మాత శివ‌లెంక కృష్ణప్రసాద్‌,  ఆయ‌న కుమార్తె శివ‌లెంక శ్రీవిద్య ను కూడా ఈ చిత్రంలోని ఫ్రేముల్లో చూడొచ్చు

బాట‌మ్ లైన్‌: `స‌మ్మోహ‌నం` ప‌రిచే ప్రేమ‌క‌థ‌
రేటింగ్‌: 2.75/5

Related News